.
Pardha Saradhi Upadrasta …. అమెరికాలో గౌతమ్ అదానీ కేసుల ముగింపు — చట్టం, రాజకీయాలు, పెట్టుబడులు కలిసి ఎలా పని చేస్తాయో చూపించిన గ్లోబల్ ఉదాహరణ
గౌతమ్ అదానీపై ఉన్న క్రిమినల్ మోసం ఆరోపణలను ఉపసంహరించుకోవడానికి అమెరికా న్యాయ శాఖ సిద్ధమవుతోంది.
SEC సివిల్ కేసు $18 మిలియన్లకు (గౌతమ్‌కు $6 మిలియన్లు, మేనల్లుడికి $12 మిలియన్లు) పరిష్కరించబడింది. ఎలాంటి తప్పు ఒప్పుకోలేదు. అదానీ $10 బిలియన్ల అమెరికా పెట్టుబడిని వాగ్దానం చేశారు .
Ads
ఇంధనం, మౌలిక సదుపాయాలు & డేటా సెంటర్లలో ఈ పెట్టుబడిని $30 బిలియన్లకు మూడు రెట్లు పెంచేందుకు చర్చలు జరుగుతున్నాయి.
ఇది కేవలం “ఒక కేసు” కథ కాదు.
- చట్టపరమైన వ్యూహం
రాజకీయ మార్పులు
భారీ పెట్టుబడులు
అంతర్జాతీయ ఆర్థిక ప్రయోజనాలు
మార్కెట్ స్థిరత్వం
ఇవన్నీ కలిసి ఎలా పనిచేస్తాయో చూపించిన ఒక గ్లోబల్ కార్పొరేట్ ఉదాహరణగా మారింది.
అసలు కేసు ఏమిటి?
2024 చివర్లో అమెరికా DOJ (Department of Justice) , SEC (Securities and Exchange Commission) అదానీ గ్రూప్‌పై తీవ్ర ఆరోపణలు చేశాయి.
ప్రధాన ఆరోపణలు:
🔹 భారతదేశంలోని భారీ సోలార్ ప్రాజెక్ట్ కాంట్రాక్టుల కోసం ప్రభుత్వ అధికారులకు కోట్ల డాలర్ల లంచాలు ఇచ్చారనే అభియోగం
🔹 ఆ విషయాలను దాచిపెట్టి అమెరికా పెట్టుబడిదారుల నుండి బాండ్ల ద్వారా భారీగా డబ్బులు సమీకరించారనే ఆరోపణ
అంటే ఇది కేవలం “లంచాల కేసు” కాదు, “అమెరికా పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించారా?” అనే కోణంలో కూడా విచారణ సాగింది
ఇప్పుడు కేసులు ఎలా సాఫ్ట్ అవుతున్నాయి?
చాలామందికి ఇది ఆశ్చర్యంగా అనిపిస్తోంది. “ఇంత పెద్ద ఆరోపణలు అయితే ఇప్పుడు జరిమానాలు, ఒప్పందాలతో ముగుస్తున్నాయా?”
అవును. అమెరికా కార్పొరేట్ చట్టాల్లో ఇది చాలా సాధారణ విషయం.
ప్రత్యేకంగా పెద్ద కంపెనీలు, అంతర్జాతీయ బిజినెస్‌లు, బ్యాంకింగ్ & స్టాక్ మార్కెట్ కేసులు, విదేశీ అవినీతి ఆరోపణలు వీటిలో చాలాసార్లు పూర్తి క్రిమినల్ ట్రయల్స్ జరగవు.
ఎందుకు?
ఎందుకంటే:
ట్రయల్స్ సంవత్సరాల పాటు సాగుతాయి
మార్కెట్లపై ప్రభావం పడుతుంది
కంపెనీలకు భారీ నష్టం జరుగుతుంది
ప్రభుత్వాలు కూడా ఆర్థిక ప్రయోజనాలను ఆలోచిస్తాయి
అందుకే అమెరికాలో ఎక్కువగా: Civil Settlement , Deferred Prosecution Agreement (DPA), భారీ జరిమానాలు, కంప్లయెన్స్ ఒప్పందాలు వీరి ద్వారా కార్పొరేట్ కేసులను క్లోజ్ చేయటానికి ఉపయోగిస్తారు.
Settlement అంటే ఏమిటి?
అమెరికాలో చాలాసార్లు ఇలా జరుగుతుంది: “మీరు తప్పు చేశామని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ జరిమానా చెల్లించండి… కొన్ని షరతులు పాటించండి… కేసు ముగిద్దాం.”
దీనిని: “Without admitting or denying wrongdoing” అని అంటారు.
అంటే: “మేము తప్పు చేశాం” అని ఒప్పుకోరు, “మేము పూర్తిగా నిర్దోషులమే” అని కూడా తేలదు, కానీ కేసు మాత్రం ముగుస్తుంది
అదానీ టీమ్ వాడిన ముఖ్యమైన లీగల్ వ్యూహం
అమెరికా కోర్టులో ప్రధాన వాదన: “ఈ వ్యవహారం అమెరికా వెలుపల జరిగింది. అమెరికా చట్టాల పరిధి ఎంతవరకు వర్తిస్తుంది?” దీనిని Jurisdiction Challenge అంటారు. ఇలాంటి అంతర్జాతీయ కేసుల్లో ఇది చాలా కీలకమైన రక్షణ వ్యూహం. ఈ లావాదేవీలు అమెరికా బయట జరిగినప్పుడు అమెరికా చట్టాలు వీటికి వర్తించవు అనేది పెద్ద వాదన.
ఇందులో ట్రంప్ ఫ్యాక్టర్ ఉందా?
ఇది ఇప్పుడు పెద్ద చర్చ. బైడెన్ హయాంలో: Foreign Corrupt Practices Act (FCPA) కింద విదేశీ అవినీతి కేసులపై కఠిన వైఖరి కనిపించింది.
కానీ ట్రంప్ విధానం:🇺🇸 “America First”అంటే: అమెరికాకు పెట్టుబడులు రావాలి, ఉద్యోగాలు రావాలి, పరిశ్రమలు పెరగాలి అనే దానిపై ఎక్కువ ఫోకస్.
ఈ నేపథ్యంలో అదానీ అమెరికాలో భారీ పెట్టుబడుల ప్రతిపాదన ఇవ్వడం కీలకంగా మారింది.
ఎంత పెట్టుబడి?
మొదట: $10 Billion అని ప్రకటించిన చర్చలు తర్వాత: $30 Billionవరకు పెరిగే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.
భారత కరెన్సీలో:₹2.5 లక్షల కోట్లకు పైగా. అంటే మీరు మా మీద కేసులు ఎత్తేస్తే మీ దేశములో మేము ఇంకా పెట్టుబడులు పెడతాము. ఇది అమెరికా చట్టాలకు లోబడే జరుగుతున్న ప్రక్రియ.
ఈ డబ్బు ఎక్కడ పెట్టబోతున్నారు?
⚡ టెక్సాస్ → సోలార్ & విండ్ ఎనర్జీ
⚡ కాలిఫోర్నియా → గ్రీన్ ఎనర్జీ సప్లై చైన్స్
⚡ న్యూయార్క్ & న్యూజెర్సీ → పోర్ట్స్ & లాజిస్టిక్స్
⚡ వర్జీనియా & ఓహియో → AI డేటా సెంటర్లు
ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 15,000 ఉద్యోగాలు సృష్టయ్యే అవకాశం ఉందని అంచనా.
ఇందులో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరు?
రాబర్ట్ గియుఫ్రా జూనియర్, అమెరికాలో అత్యంత ప్రభావవంతమైన కార్పొరేట్ లాయర్లలో ఒకరు. ప్రత్యేకత ఏమిటంటే: ట్రంప్‌కు అత్యంత సన్నిహిత లీగల్ అడ్వైజర్‌గా కూడా ఆయనకు పేరు ఉంది.
వాషింగ్టన్‌లో DOJ అధికారులకు పెద్ద ప్రెజెంటేషన్ ఇచ్చి అదానీ తరపున బలమైన వాదనలు వినిపించినట్లు సమాచారం.
ఇది నిజంగా సాధారణ ప్రక్రియేనా?
అవును. ఇలాంటి సెటిల్మెంట్లు గతంలో కూడా ఎన్నో జరిగాయి.
HSBC Bank (2012)
ఈ బ్యాంక్‌పై: డ్రగ్ కార్టెల్స్‌కు మనీలాండరింగ్ సహాయం చేశారనే ఆరోపణలు వచ్చాయి. తరువాత $1.9 Billion జరిమానా వేసి , ముందు ముందు ఇలాంటి పొరపాట్లు మళ్ళీ చేయము అని కంప్లయెన్స్ ఒప్పందం చేసుకొని కేసు సెటిల్మెంట్ చేసుకున్నారు.
“ప్రపంచంలోనే పెద్ద బ్యాంకుల్లో ఒకదాన్ని కూల్చేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడొచ్చు” అనే ఆలోచన కూడా ఉంది. అందుకే సెటిల్మెంట్ ప్రక్రియ వైపు అమెరికా ప్రభుత్వం మళ్ళింది.
Siemens Case
ప్రపంచవ్యాప్తంగా లంచాల ఆరోపణలు వచ్చాయి, తరువాత భారీ జరిమానాలు
, DOJ & SEC సెటిల్మెంట్, అంతర్గత సంస్కరణల హామీ తొ సెటిల్ చేశారు కానీ కంపెనీని పూర్తిగా నిషేధించలేదు.
Goldman Sachs — 1MDB Case
మలేషియా 1MDB అవినీతి కేసులో భారీ ఆరోపణలు వచ్చాయి. అమెరికా లో భారీ సెటిల్మెంట్, భారీ జరిమానాలు, కొంతమంది వ్యక్తులపై చర్యలు కానీ సంస్థను పూర్తిగా కూల్చలేదు.
Volkswagen Emissions Scandal
డీజిల్ కార్ల ఎమిషన్ టెస్టుల్లో మోసం బయటపడింది. కానీ బిలియన్ డాలర్ల సెటిల్మెంట్లు, వినియోగదారులకు పరిహారం, కంపెనీపై పర్యవేక్షణ కానీ సంస్థ కొనసాగింది.
Boeing కేసు
737 Max ప్రమాదాల తర్వాత: Deferred Prosecution Agreement, జరిమానాలు, భద్రతా మార్పుల ఒప్పందం చేసుకున్నారు. ఇది కూడా “సిస్టమ్‌ను కూల్చకుండా నియంత్రించడం” అనే అమెరికా విధానానికి ఉదాహరణ.
“Too Big To Fail” అనే కాన్సెప్ట్
అమెరికాలో ఒక ముఖ్యమైన ఆర్థిక సిద్ధాంతం ఉంది “Too Big To Fail” అంటే కొన్ని కంపెనీలు అంత పెద్దవిగా ఉంటాయి కాబట్టి వాటిని పూర్తిగా కూల్చేస్తే: మార్కెట్లు దెబ్బతింటాయి, బ్యాంకింగ్ వ్యవస్థ ప్రభావితం అవుతుంది, ఉద్యోగాలు పోతాయి, అంతర్జాతీయ ఆర్థిక సంబంధాలు దెబ్బతింటాయి
అందుకే చాలాసార్లు “Punish the company… but don’t destroy the system.” అనే విధానం అనుసరిస్తారు.
అయితే విమర్శలు కూడా ఉన్నాయి
చాలామంది విమర్శకులు ఇలా అంటారు: “సాధారణ వ్యక్తికి జైలు… పెద్ద కంపెనీకి సెటిల్మెంట్?” “డబ్బు ఉన్నవారికి వేరే న్యాయం?” “Corporate influence ఎక్కువైందా?” అనే ప్రశ్నలు అమెరికాలో కూడా తరచుగా వస్తుంటాయి.
చివరగా…
గౌతమ్ అదానీ వ్యవహారం మనకు ఒక గ్లోబల్ రియాలిటీ చూపిస్తోంది:
ఈరోజు ప్రపంచంలో పెద్ద కార్పొరేట్ కేసులు కేవలం కోర్టుల్లో మాత్రమే గెలవబడవు…
అవి లీగల్ టీమ్స్, రాజకీయ సంబంధాలు, పెట్టుబడుల శక్తి, అంతర్జాతీయ వ్యూహం, ఆర్థిక ప్రయోజనాలు ఇవన్నీ కలిసి నిర్ణయిస్తాయి.
ఇది కేవలం అదానీ కథ కాదు, ఆధునిక గ్లోబల్ కార్పొరేట్ ప్రపంచం ఎలా పనిచేస్తుందో చూపించే ఒక పెద్ద ఉదాహరణ.
మీ దేశములో జరగని , ఎక్కడో జరిగిన లావాదేవీలకు మీకు సంబంధమే లేదు, పెట్టుబడులు, ఉద్యోగ కల్పన ద్వారా సెటిల్ చేసుకుందాం, తద్వారా అమెరికాకు ఒక దేశంగా, అమెరికా స్టాక్ హోల్డర్ లకు కూడా ఉపయోగం,
ఇది ఒక సింపుల్ వ్యాపార ప్రతిపాదన, అమెరికా చట్టాలు, న్యాయ ప్రక్రియ పరిధిలోనే జరుగుతున్న ప్రక్రియ. అమెరికా చట్టాల ప్రకారం ఇది తప్పు కాదు. — ఉపద్రష్ట పార్ధసారధి
సో, తప్పుకు శిక్ష ఏమిటీ అంటే… పెట్టుబడులు పెట్టు, ఉద్యోగాలు కల్పించు… ఆ పెట్టుబడే నీకు జరిమానా…
#Adani #GautamAdani #CorporateLaw #DOJ #SEC #Trump #USPolitics #GlobalEconomy #StockMarket #CorporateWorld #Geopolitics #India #RenewableEnergy #AI #PardhaTalks
Share this Article