Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Agadha ! రాజు గారూ… మరోసారి సారీ..! తమరు నిర్మాతగానే బెటర్ !!

August 14, 2026 by M S R

.

ఎంఎస్ రాజు… గతంలో కొన్ని హిట్ సినిమాల నిర్మాత… కొన్నేళ్ల విరామం తరువాత ఒకటీరెండు వెగటు, చేదు సినిమాలు తీశాడు, తనపైన సదభిప్రాయాన్ని కోల్పోయాడు… ఇప్పుడు ఓ హారర్, థ్రిల్లర్ సినిమాతో వచ్చాడు దర్శకుడిగా… మరీ అంత తీసికట్టు ఏమీ కాదు గానీ… మెప్పించలేకపోయాడు..!!

అసలు అది కాదు చెప్పాల్సింది… సినిమాలోని మహిళా పాత్రల గురించి… చిన్నాచితకా పాత్రలు చేసు కామాక్షి భాస్కర్లకు ఈ సినిమాలో మహాదేవి పేరిట ఓ లీడ్ రోల్ దక్కింది… తన ఆహార్యం, తన నటనతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది… సినిమాను తనే మోసింది ప్రధానంగా… మరొకరు ఉల్కా గుప్తా… మహిమ రోల్‌లో మెరిసింది… వనిత విజయకుమార్ సో, సో, కానీ జోవికా విజయకుమార్ తనను తాను బలంగా ప్రజెంట్ చేసుకుంది…

Ads

ప్రధానంగా సినిమా గురించి చెప్పాలంటే… మంత్రాలు, మాయలు – దుష్టశక్తులు, దైవశక్తుల నడుమ పోరు… కథ మొత్తం దీని చుట్టే… కాకపోతే ఈమధ్య హారర్ అనగానే కామెడీ మిక్స్ చేసి అటూఇటూ గాకుండా చేస్తున్నారు కదా, ఇందులో ఆ పోకడ లేదు, పూర్తిగా కథ మీదే కాన్సంట్రేషన్… కానీ ఎంఎస్‌రాజు నిర్మాతగానే సూటబుల్… దర్శకుడిగా కాదు అనిపిస్తుంది సినిమా ట్రీట్‌మెంట్ చూస్తే…


అగధ

చిన్నప్పటి నుంచే దుష్టశక్తులు, శాపగ్రస్త ఆత్మల బారిన పడినవారిని నయం చేసే శక్తి మహాదేవి (కామాక్షి భాస్కర్ల)కు ఉంటుంది. అలాంటి మహాదేవి కుటుంబంలో వరుసగా అనుమానాస్పద మరణాలు చోటుచేసుకుంటే ఏం జరుగుతుంది? ఆ మరణాల వెనుక ఎవరు ఉన్నారు? తన కుటుంబాన్ని ఓ భయంకరమైన శాపం నుంచి మహాదేవి కాపాడగలిగిందా? ఈ ప్రశ్నల చుట్టూనే ‘అగధ’ కథ నడుస్తుంది.

కాన్సెప్ట్ ఆసక్తికరమే… చనిపోయిన ఆత్మలు మనుషుల మధ్యే కనిపించడం, వాటిని ఓ ప్రత్యేక శక్తి కలిగిన వ్యక్తి చూడగలగడం, వాటిని మంచి కోసం కానీ చెడు కోసం కానీ ప్రభావితం చేయగలగడం అనే ఆలోచన కొత్తగా అనిపిస్తుంది… గతంలోకి వెళ్లే అంశాన్ని కూడా కథలో ముడిపెట్టడం ఆసక్తికరమైన ప్రయత్నమే…

సినిమా మొదట్లోనే దర్శకుడు ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించగలిగినా,  అక్కడి నుంచే అసలు సమస్య మొదలవుతుంది. కథా ప్రపంచాన్ని, దాని పురాణ నేపథ్యాన్ని, శక్తుల స్వభావాన్ని వివరించడానికే చాలా సమయం తీసుకున్నాడు. దీంతో ఫస్టాఫ్‌లో సినిమా చూస్తున్న అనుభూతి కంటే, ఎవరో కూర్చుని కథను వివరంగా చెబుతున్న అనుభూతి ఎక్కువగా కలుగుతుంది.

మాటలు ఎక్కువ.. ఉత్కంఠ తక్కువ. థ్రిల్ రావాల్సిన చోట కూడా కథ నెమ్మదిగానే సాగుతుంది. ఇంటర్వెల్ సమయానికి కాస్త ఊపు వచ్చినా, ఆ సన్నివేశాల్లోనూ అనుకున్నంత షాక్ విలువ కనిపించదు…

ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌లో కథనం కొంత మెరుగ్గా ఉంటుంది… ‘అగధ’ పాత్రను బిల్డప్ చేసిన తర్వాత పరిచయం చేసే విధానం బాగుంది. ప్రత్యేక శక్తిని కథలోని సంఘటనలతో ముడిపెట్టిన ఆలోచన కూడా ఆసక్తికరమే. కానీ దాన్ని మరింత ఉత్కంఠభరితంగా తెరకెక్కించే అవకాశం ఉంది. కానీ తర్వాత వచ్చే యాక్షన్ ఎపిసోడ్ మాత్రం చాలా పాత తరహా ఫార్ములాలోకి వెళ్లిపోతుంది. ఏం జరగబోతోందో ముందే ఊహించగలిగేలా ఉంటుంది. ఆ తర్వాత వచ్చే క్లైమాక్స్ మాత్రం పర్వాలేదనిపిస్తుంది.

హాలీవుడ్ సినిమాల ప్రభావం కొన్ని చోట్ల స్పష్టంగా కనిపించినా, దాన్ని మన స్థానిక నేపథ్యానికి అనుగుణంగా మలచే ప్రయత్నం చేశారు. అయితే కొన్ని సన్నివేశాలు వివాదానికి దారితీసే అవకాశం కూడా ఉంది. శ్రవణ్ రెడ్డి పాత్ర మాత్రం పెద్దగా కొత్తదనం చూపించదు. డ్రమాటిక్ సన్నివేశాల్లో తన నటన కాస్త ఓవర్ అనిపిస్తుంది. పాత్రలో రెండు కోణాలు ఉన్నా, అందులోని సున్నితమైన కోణాన్ని దర్శకుడు పెద్దగా ఎక్స్‌ప్లోర్ చేయలేదు.

భానుచందర్ వంటి సీనియర్ నటుడిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు. టెక్నికల్‌గా కూడా పాత ఛాయలే… చివరగా… ‘అగధ’లో కాన్సెప్ట్ ఉంది.. కంటెంట్ ఉంది.. కానీ దానికి తగ్గ థ్రిల్ లేదు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆసక్తికరమైన ఆట – ఆటగాడు కూడా రెడీ – సిద్ధంగా లేని పిచ్…
  • ఆ లేఖలో బ్లాస్టింగ్ అంశాలు అన్నారు కదా- పేలవంగా తేలిపోయింది!
  • ఒక బీసీ మహిళ ఔట్… బదులుగా ముగ్గురు బీసీ మహిళలకు పోస్టులు
  • డియర్ యానిమల్ వంగా ! ఒక్క రోమమూ నిక్కబొడుచుకుంటే ఒట్టు !!
  • యుద్ధరంగంలో ఇక ఈ వీరప్పన్ మార్క్ మీసాలు తిప్పబడవు !
  • సెన్సేషనల్ హిట్ ! కానీ ఈ కథలో తెలుగు స్టార్ హీరో ఇమడగలడా !
  • బిగ్‌బాస్ ట్రోఫీ – జస్ట్, ఇంట్లో పెట్టుకునే ఓ షో పీస్‌ మాత్రమే…
  • ఇంద్ర, బ్రహ్మ, విష్ణు, శివాదులందరూ యమలోకానికి వెళ్లారు..!
  • మెలితిరిగిన మీసాల తెలుగు ముఖ్యమంత్రి… ఓ సరదా కథనం…
  • జితేంద్ర మిశ్రా ! ‘ఆపరేషన్ సిందూర్’ లీడర్‌‌కు ఇక ‘ఆపరేషన్ అయోధ్య’…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions