Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అనామకంగా ఆ భక్తిమాధుర్యం… అది అపురూప స్వరసంగమం…

April 30, 2026 by M S R

.

ఫేస్‌బుక్‌లో రచయిత పులగం చిన్నారాయణ పోస్టు… చదువుతుంటే అందులో కొన్ని ఆసక్తికరమైన అంశాలు కొన్ని కనిపించాయి… ఈ పోస్టు ఏమిటీ అంటే… జంధ్యాల అన్నమయ్య మీద ఓ సినిమా తీద్దామని అనుకున్నాడు అని… దాని కోసం జరిగిన కసరత్తు ఏమిటీ అని… నిజంగా జంధ్యాల అన్నమయ్య తీస్తే బాగుండేదేమో… రాఘవేంద్రరావు బాపతు మీసాల, మసాలా అన్నమయ్యలాగా గాకుండా… బాగుండేదేమో…

జంధ్యాల ఆనంద భైరవి తీసిన విజయోత్సాహంలో మబ్బుల్లో తిరుగుతున్నాడు అప్పట్లో… అదే ఊపులో అన్నమయ్య సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నాడు తను… అంతకుముందు ఒకరిద్దరు ‘అన్నమయ్య’ సినిమా తీయాలని తలపోశారు కానీ, కార్యరూపం ధరించలేదు… జంధ్యాలతో ‘ఆనంద భైరవి’ తీసిన డి. సీతా పద్మరాజు, బిఏవి శాండిల్య అన్నమయ్య ప్రాజెక్టుకు మొగ్గుచూపారు.,.

Ads

శాండిల్య మేనేజింగ్ ట్రస్టీగా ‘అన్నమాచార్య ట్రస్ట్’ స్థాపన జరిగిపోయింది… ఈ ట్రస్టు ద్వారా నిధులు సేకరించి సినిమా తీయాలి… ఇక్కడ మనం చెప్పుకుంటున్న మరో అంశం… సినిమా నిర్మాణంతోపాటు అన్నమయ్య కీర్తనలను నాలుగు కేసెట్లుగా విడుదల చేయాలి…

జంధ్యాలకు రమేష్ నాయుడు అంటే ఇష్టం… ఇలాంటి ప్రాజెక్టులకి ఆయన స్వర సమర్ధుడు, సర్వ సమర్ధుడు ఆయనే… రమేష్ నాయుడు కూడా నేను రెడీ అన్నాడు ఇష్టంగా… సో, అన్నమయ్య స్వరపరచిన కీర్తనల్లోంచి మేలైనవి ఎంచారు… ఇందుకు ఆత్రేయ కూడా సాయం పట్టారు…

అందులో ఒక్క ‘హరి అవతార మితడన్నది’ మాత్రం తాళ్లపాక తిరుమలాచార్యునిది… ఒకటో అరో తప్ప అన్నీ కొత్త వరసలే కట్టాడు రమేష్ నాయుడు… ఆశాభోస్లే బొంబాయి నుంచి మద్రాసుకి రప్పించారు… రమేష్ నాయుడు అంటే ఆమెకు అభిమానం… ఆయన ఆమెతో హిందీలో కూడా పాటలు పాడించాడు, ఆ రోజుల నుంచీ  ఇద్దరి మధ్యన మంచి అనుబంధం… ‘అన్నమయ్య’ కోసం ఐదు పాటలు పాడారు ఆశాభోస్లే…

ఈ పోస్టులో నచ్చిన పాయింట్ ఇదే… ఆమెతో అన్నమయ్య కీర్తలను పాడించడం..! ప్రసిద్ధ సినీ సంగీత పరిశోధకులు విఏకె రంగారావు ఎగురుకుంటూ ఏవీఎం రికార్డింగ్ స్టూడియోకి వెళ్లారు. ‘నటనల భ్రమయకు’, ‘సత్యభామ సరసపు నగవు’ పాటల్ని ఆమె లైవ్ లో పాడుతుంటే విని… చెవుల్లో అమృతం కురిసినట్టుగా పులకించిపోయారాయన…

కేజే ఏసుదాస్ 5 పాటలు, వాణి జయరాం 3 పాటలు, ఎస్పీ బాలసుబ్రమణ్యం 10 పాటలు, పి. సుశీల 6 పాటలు ఆలపించారు… మిగతా రెండు డజన్ల పాటలను మంగళంపల్లి బాలమురళీకృష్ణ, పూర్ణచందర్, సరళారాణి, వేదవతి ప్రభాకర్, నాగూర్ బాబు,, వింజమూరి కృష్ణమూర్తి పాడారు… ఆహా ప్రసిద్ధ స్వరసంగమం…

మద్రాసులోని హోటల్ సవేరాలో ఇందుకు సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టారుట… అక్కడొక స్కీం కూడా ప్రకటించారు. ఆంధ్రా బ్యాంకులో 350 రూపాయలు కట్టిన వారికి ఈ నాలుగు క్యాసెట్లు ఇస్తారు… దాంతోపాటు అందమైన పెట్టెలో అన్నమయ్య విగ్రహం, వెంకటేశ్వరుని బొమ్మ అనుగ్రహం, ముదిగొండ శివప్రసాద్ రాసిన అన్నమయ్య కథతో పాటు కొన్ని పాటల అందాల వివరణ గల ఒక చిన్న పుస్తకం…

సినిమా పేరు ‘హరికీర్తనాచార్య అన్నమాచార్య’… బ్యానర్ పేరు ‘శ్రీ చరణ చిత్రాలయం’… కథ విషయంలో శోభారాజు సహకరం తీసుకున్నారంటారు… ఆమెకూ ఆ కథకూ ఏమిటో లంకె అర్థం కాదు… అన్నమయ్య పాత్రకు సరైన నటుడి ఎంపిక జంధ్యాలకు పెద్ద టాస్క్… తెలుగు కుర్రాడు అయితే బెటరని అనుకున్నాడు… అన్నమయ్య కుర్రతనం నుంచి కైవల్యం దాకా పలు వయస్సుల్లో చిత్రించాలి, అంటే 20 నుంచి 90 ఏళ్ల మధ్య వయస్సున్న నటులు కావాలని చూశాడు… 300 మందిని పరీక్షించినా తనలో సంతృప్తి లేదు…

అన్నమయ్య అనగానే ఆ లుక్‌లో నిర్మలత్వం కనిపించాలి… ఎవరూ నచ్చడం లేదు. ఎవరూ ఆనడం లేదు. చివరకు ఏదో రాజీపడి మరాఠీ నటుడు సచిన్ ని తీసుకున్నాడు… వెంకటేశ్వర స్వామిగా అరుణ్ గోవిల్ ఓకే. ‘ రామాయణ్ ‘ టీవీ సీరియల్ లో రాముడిగా ఆయన ఫేమస్ కదా. అన్నమయ్య గురువుగా జెవి సోమయాజులు కూడా సిద్ధం… కానీ కాలం కరుణించలేదు. జంధ్యాల కల నెరవేరలేదు. ఆడియో క్యాసెట్లు బయటకు వచ్చాయి కానీ, సినిమా మాత్రం ముందుకి కదల్లేదు…



ఆ పాటల విషయానికొస్తే… Raaga.com ప్లాట్‌ఫామ్‌లో కొన్ని వినిపిస్తున్నాయి… Leo వీడియోలు కూడా యూట్యూబులో కొన్ని కనిపిస్తున్నాయి… ఓ క్రమపద్దతిలో లేకుండా, ప్రచారం లేకుండా అనామకంగా ఉండిపోయాయి… ఏవో తోచిన వీడియోలతో పెట్టేశారు… ఆశా భోస్లే, బాలమురళీకృష్ణ, జేసుదాసు, ఎస్పీ బాలు వంటి సుప్రసిద్ధ గళాలు నింపిన మధురభక్తి విలువ మనవాళ్లకు తెలియడం లేదు…

ఉదాహరణకు సత్యభామ సరసపు నగవు అని ఆశా పాడిన పాటకు యూట్యూబ్‌లో నాలుగేళ్లలో వచ్చిన వ్యూస్ ఎన్నో తెలుసా..? 697 మాత్రమే… ramesh naidu annamayya keerthanalu in telugu అని సెర్చితే కొన్ని బ్లాగుల్లో కూడా ఈ పాటలున్నాయి… ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్లు వాడుకున్నారు… కానీ ప్రాచుర్యం లేదు…

  • ఎస్వీబీసీ వీటి రైట్స్ తీసుకుని, తమ భక్తి ఆడియో ప్రపంచంలో చేర్చితే, మంచి వీడియోలను కూడా జతచేర్చితే… విరివిగా వాడుకుంటే వెంకన్న భక్తులకు కర్ణపేయమే కదా… కానీ ఎస్వీబీసీకీ అలాంటి మంచి పనులకూ శృతి కుదరదు కదా, అదీ విషాదం..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తుమ్మిడిహట్టిపై రేవంత్‌రెడ్డి తెలివైన ‘ఎత్తు’గడ… బీజేపీని లాగాడు…
  • రాజీవ్ హంతకుడు ఇప్పుడు లాయర్ వృత్తిలోకి..! మళ్లీ ఓ చిక్కుముడి..!!
  • అంబానీ ఐపీఎల్ జట్టుకు ఇక సెలవు… కొత్త ఆటగాళ్లే శరణ్యం…
  • అనామకంగా ఆ భక్తిమాధుర్యం… అది అపురూప స్వరసంగమం…
  • 250 + 250 + టార్గెట్స్..? నో ప్రాబ్లం… సరదాగా కొట్టేద్దాం… ఇదేం ఆటరా బాబోయ్…
  • ఎగ్జిట్ పోల్స్ చెప్పే చేదు నిజాలు… ‘అన్‌వాంటెడ్’ కేరక్టర్ల భవిష్యత్తు..?!
  • మరపురాని కొన్ని ‘ఎన్‌కౌంటర్లు… ఓ జర్నలిస్టు జ్ఞాపకాలు…
  • కృష్ణుడిని చంపి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేస్తుంది ఆమె…
  • జాగ్రత్తగా, తాపీగా చదవండి… మమతా బెనర్జీ అనే ‘ద్రోహి’ గురించి…
  • “లండన్ బాబు & ది హనీ బీ… ఆర్జీవీ ఓ షార్ట్ ఫిలిమ్ తీస్తే…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions