Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వినేశ్ ఫోగట్ కాదు… ఇదుగో వీళ్లు దేశం పరువును పారిస్ వీథుల్లో ఈడ్చేశారు…

August 8, 2024 by M S R

వినేష్ ఫొగట్ వల్ల కాదు.. ఇదిగో ఇప్పుడు పోయింది ఇండియా పరువు!

ఒలింపిక్స్‌లో అధిక బరువు కారణంగా డిస్‌క్వాలిఫై అయ్యి అంతర్జాతీయ వేదికపై భారత పరువు తీసిందని కొంత మంది వాదిస్తుండగా.. అదేమీ లేదు. ఆమె దేశ్ కి బేటీ.. నిజమైన బంగారం. మన మహిళల సత్తా ఏమిటో నిరూపించిన ధీర వనిత అంటూ మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు. దేశం ఇప్పుడు వినేష్ విషయంలో రెండుగా విడిపోయి వాదోపవాదాలు చేసుకుంటోంది. కానీ అదే సమయంలో నిజంగానే దేశం పరువు ప్యారీస్ వీధుల్లోకి ఈడ్చిపారేశారు.

వినేష్ ఫొగట్ వాస్తవానికి తలపడాల్సిన 53 కేజీల ఫ్రీ స్టైల్ విభాగం నుంచి అంతిమ్ పంగల్ అనే క్రీడాకారిణి ఒలింపిక్స్‌కు సెలెక్ట్ అయ్యింది. తొలి రౌండ్‌లో 0-10 తేడాతో కేవలం 101 సెకెన్లలో టర్కీకి చెందిన జైనెప్‌ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఆ బౌట్ ముగిసిన తర్వాత అంతిమ్.. ఒలింపిక్ విలేజ్‌కు వెళ్లకుండా నేరుగా హోటల్ రూమ్‌కి వెళ్లింది.

Ads

అక్కడ ఉన్న అంతిమ్ తన‌ సోదరి నిషాకు అక్రిడిటేషన్ కార్డు ఇచ్చి.. స్పోర్ట్స్ విలేజ్‌లో ఉన్న తన వస్తువులు తీసుకొని రమ్మని పంపింది. నిషా స్పోర్ట్స్ విలేజ్‌లోకి అంతిమ్‌లాగా వెళ్లడానికి ప్రయత్నించగా.. అక్కడి భద్రతా సిబ్బంది గుర్తించి పోలీసులకు అప్పగించారు.

మరోవైపు అంతిమ్ సపోర్టింగ్ స్టాఫ్ ( ఆమె కోచ్‌లు భగత్ సింగ్, వికాస్) విపరీతంగా తాగి క్యాబ్‌లో ప్రయాణించారు. దిగిన తర్వాత డబ్బులు ఇవ్వడానికి నిరాకరించి డ్రైవర్‌తో గొడవపడ్డారు. దీంతో డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

ఒకవైపు అంతిమ్ తన సోదరిని తనలా‌ స్పోర్ట్స్ విలేజ్‌లోకి పంపించడం, మరోవైపు అంతిమ్ సపోర్టింగ్ స్టాఫ్ పోలీసు కేసులో ఇరుక్కోవడంతో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌ను ఇరుకున‌పెట్టింది. ఐఓసీ, ఫ్రాన్స్ పోలీసులు పై నలుగురిని కూడా ఇండియాకు ‘డీపోర్ట్’ చేయాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని ఐఓఏకు చెప్పారు. చివరకు నలుగురి వీసాలు క్యాన్సిల్ చేసి ఇండియాకు డీపోర్ట్ చేశారు.

వినేష్ ఫొగట్ తలపడాల్సిన కేటగిరీలోకి అంతిమ్ రావడమే కాకుండా.. 101 సెకెన్ల వ్యవధిలో ఓడిపోవడం.. తర్వాత జరిగిన పరిణామాలతో ఇండియా పరువును తీసేశారు…. భాయ్‌జాన్ [ John Kora ]

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘రైతు డిస్కం’పై అడ్డూఅదుపు లేని అబద్ధాలు- బీఆర్ఎస్ తప్పుడు బాష్యాలు…
  • ‘నేను ఓడిపోతే నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తా’… తండ్రులెప్పుడూ మారలేదు..!!
  • సీఎం విజయ్… కోర్టు చెప్పింది, వీఐపీ- టారిఫ్ కల్చర్ మార్చగలవా..?
  • ‘వార్’పై ట్రంప్ మార్క్ మరో ప్రకటన..! చరిత్రాత్మక ఒప్పందమా? ఇదీ ఫేకేనా..?!
  • వైభవ్ సూర్యవంశీలో పరివర్తన..! ఈలోపే పాపం *నిష్క్రమణ…!
  • ఆసియా రాజకీయాల్లో భారీ మార్పులు…
  • జగములేలినవాని సగము నివ్వెరబోయె, సగము మిగిలినవాని మొగము నగవైపోయె…
  • Vaibhav Suryavanshi is illegal … Do you know why…
  • అందరూ కక్షకట్టారు, వివక్ష ప్రదర్శించారు… ఆ గ్రేట్‌నెస్ చంపలేకపోయారు…
  • ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో “సక్సెషన్ ఎరా” ప్రారంభమైందా?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions