అభయ్… సిద్దిపేట పరువు తీసినవు కదరా భయ్… దిక్కుమాలిన ఆట ఆడినవ్, బిగ్‌బాస్ ను బొక్కా, మైండ్‌లెస్ అని బూతులు తిడుతవ్… నీ టీం వాళ్లు తన్నుకుంటుంటే నవ్వుకుంటూ పక్కన కూర్చుంటవ్… ఇప్పుడంటే ఇప్పుడు బయటికి పోతా అని డొల్ల సవాళ్లు విసురుతవ్… మళ్లీ ఇవన్నీ జోకులు, నచ్చకపోెతే మానేస్తా అని తిక్క కబుర్లు చెబుతవ్… తీరా నాగార్జున వచ్చి రెడ్ కార్డు చూపించి వెళ్లిపో అంటే ఎడ్డిమొహం వేస్తవ్… తలదించుకుంటవ్… బాబ్బాబు, ఇంకో చాన్స్ ఇవ్వు […]
అభిజ్ఞ..! ఇక్కడ జడ్జిలు ‘ముంచేస్తేనేం’..? ఆ జీ పాటల పోటీలో తేలింది..!!
అభిజ్ఞ… ఈ పేరు గుర్తుందా..? ఆమధ్య తెలుగు ఇండియన్ ఐడల్ ఆడిషన్స్ కోసం వచ్చింది… రిజెక్టయింది… మళ్లీ ఏ పైరవీతోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది… అహం దెబ్బతిన్న థమన్ రెండువారాలకే మళ్లీ ఇంటికి పంపించేశాడు… అందుకే ఇక తదుపరి సీజన్‌కు తను జడ్జిగా ఉండకపోవచ్చు… ఈ ఫినాలేకు కూడా చీఫ్ గెస్టు లేడు, ఏదో ముగించాం అంటే ముగించాం అన్నట్టుగా ముగించేశారు… అదే అభిజ్ఞ ఇప్పుడు జీసరిగమప కొత్త సీజన్లో పాటపాడుతూ కనిపించింది… 29 నుంచి […]
చచ్చినా… వదలని పని… యంత్రంలో యంత్రమై… చివరకు..?
దాదాపు తొంభై ఏళ్ల కిందట అంటే 1930లలో ప్రపంచవ్యాప్తంగా పెను ఆర్థిక సంక్షోభం సంభవించింది. అమెరికాలో మొదలైన ఈ సంక్షోభం భూగోళమంతా విస్తరించింది. ఆర్థిక శాస్త్రం ఈ సంక్షోభానికి “గ్రేట్ డిప్రెషన్” అని నామకరణం చేసింది. ఈ సంక్షోభానికి మూల కారణం అతి పారిశ్రామికీకరణ అని తేల్చాడు చార్లీ చాప్లిన్. గ్రేట్ డిప్రెషన్ ఇతివృత్తంగా మోడరన్ టైమ్స్ పేరుతో 1936లో చార్లీ చాప్లిన్ తీసిన సినిమా ఒక విషాదానికి కన్నీటి ప్రతిరూపం. ఈ సినిమాకు దర్శకుడు, నిర్మాత, […]
మిషన్ వన్ రూపీ…! ఏ సంకల్పం కోసం ఈ జోడీ దేశదిమ్మరులెందుకయ్యారు..?
ఎవ్వరిది వాళ్లు ఎంత సంపాదించామా.. ఎంత మంచి ఇల్లు కట్టామా… ఎన్ని ఇళ్లు కొనగలం… ఎన్ని భూములను సొంతం చేసుకోగలం… ఎన్ని ఆస్తులు కూడగట్టుకోగలమని యోచించే జమానా ఇది. కానీ, ఇలాంటి రోజుల్లో కూడా ఇతరులకు సేవ చేసేందుకు డబ్బు సంపాదించాలనేవాళ్లూ ఉన్నారంటే.. ఎక్కడో ఇంకా కొంత మంచి బతికున్నట్టే! కాస్త అతిశయోక్తిగా అనిపించినా స్ఫూర్తినిచ్చే నిజమైన ఈ మిషన్ వన్ రూపీ కథ మీరూ ఓసారి చదివేయండి! మీ వంతుగా జస్ట్ ఒక్క రూపాయి సాయం […]
శ్రీమాన్ మోడీ గారూ… కొవ్వు లడ్డూ అపచారంపై ఇప్పుడేం జేద్దామంటవ్ మరి..?!
మొదటిరోజు కళ్లు మూసుకుపోయిన ఈనాడుకు హఠాత్తుగా రెండోరోజు కళ్లు తెరుచుకున్నాయి… అయ్యో, ఈ లడ్డూ గొడవ మన చంద్రబాబుకు ఎక్కడ నష్టం తీసుకొస్తుందో అన్నట్టుగా… చివరకు చంద్రబాబే స్వయంగా చెప్పినా సరే… నో, నో, అనుకుని లడ్డూ అపచారం వార్తను పూర్తిగా అండర్ ప్లే చేసింది… హైదరాబాద్ ఎడిషన్‌లో అయితే ఎక్కడో స్పేస్ ఫిల్లింగ్ తరహాలో వేసింది… నిజానికి లడ్డూ వ్యవహారం కేవలం ఏపీకే సంబంధమా..? కోట్ల మంది శ్రీవారి భక్తులకు సంబంధించిన వార్త మీద ఇంత […]
దేవుడే చూసుకుంటాడు… బహుశా ఇలాంటి జాతి ప్రపంచంలో ఇదొక్కటేనేమో…
ప్రపంచంలో బహుశా ఏ జాతీ ఇలా ఉండదేమో… తమ మతం, తమ సంస్కృతి, తమ మనోభావాలు, తమ దేవుళ్లు, తమ పండుగలకు అపచారం జరిగినప్పుడు, అదీ తమ జాతి మనుషులే ద్రోహులైనప్పుడు కూడా… ఇంత నిర్లిప్తంగా, ఇంత నిర్వేదంగా… అంతకుమించి అపచారాన్ని ‘అత్యంత భారీ అతి తెలివి మేధస్సు’లతో సమర్థించుకునే దురవస్థ, దరిద్రం నిజంగానే ప్రపంచంలో మరే జాతిలోనూ ఉండి ఉండదు… తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు అనే వివాదం వంటిది నిజంగానే మరో మతంలో కనిపిస్తే […]
అంతటి ఎన్టీయార్‌నే నిస్సహాయుడిగా చూపిస్తే జనం మెచ్చుతారా..?!
అడవిరాముడు సినిమాకు ఎదురీది వంద రోజులు అడిన సినిమా 1977 లో వచ్చిన ఈ ఎదురీత సినిమా . హిందీలో , బెంగాలీలో ఒకేసారి విడుదల అయిన అమానుష్ సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . ఈ రెండింటిలోనూ ఉత్తమ కుమార్ , షర్మిలా టాగోర్ హీరో హీరోయిన్లు . 1978 లో తమిళంలో త్యాగం అనే టైటిల్ తో శివాజీ గణేశన్ , లక్ష్మిలతో వచ్చింది . అదే సంవత్సరంలో మళయాళంలో ఇత ఒరు […]
థమన్ ఇక నటుడు కూడా… కానీ, ఇండియన్ ఐడల్‌కు ఇకపై జడ్జిగా రాకపోవచ్చు..!!
థమన్ బహుశా తెలుగు ఇండియన్ ఐడల్ నాలుగో సీజన్‌కు రాకపోవచ్చు… ఏమో, కార్తీక్ కూడా అంతేనేమో… ఎందుకీ డౌట్ వచ్చిందీ అంటే, జవాబు వెంటనే చెప్పలేం… పేరుకు ఈసారి సీజన్ అత్యంత భారీ ఖర్చు అన్నారు… భారీ ఆడిషన్స్ అన్నారు… తీరా కొత్త మొహాలేమీ లేవు… చిన్నప్పటి నుంచీ చాలా పోటీల్లో పాల్గొంటున్నవాళ్లనే ఎంపిక చేశారు, కొత్త మొహాల్లేవు… రెండో సీజన్లో ఏదో ఉండీలేనట్టుగా ఉంటూ, తిక్క జడ్జిమెంట్లు వెలువరిస్తూ చిరాకు పుట్టించిన గీతా మాధురి ఈ […]
సిద్దిపేట పోరడు చేజేతులా చెడగొట్టుకుంటున్నాడు బిగ్‌బాస్ హౌజులో..!
కొన్ని సందర్భాల్లో అభయ్ నవీన్ లేవనెత్తే పాయింట్స్ చూస్తుంటే తను ఈసారి బిగ్‌బాస్ సీజన్లో భలే పోటీ ఇస్తాడు అనిపించింది… సిద్దిపేట పోరడు అనేసరికి కొద్దిగా ఇంకాస్త కొంచెం పాజిటివ్ వైబ్స్ పెరిగి ఉంటాయి నాలో కూడా..! తీరా చూడబోతే… తను ఆ మెంటల్ కేసు మణికంఠకన్నా నాసిరకం ఆటను చూపిస్తున్నాడు… పిచ్చి డైలాగ్స్ విసురుతున్నాడు బిగ్‌బాస్ మీద..! తను ఓ క్లాన్ చీఫ్ అయి ఉండీ, తన సభ్యులు తన ముందే టాస్కులో తన్నుకుంటుంటే, తను […]
ఛిఛీ… చివరకు సుమా, నీ షోలలో కూడా ఈ గలీజుతనం ఏమిటి..?
ఛిఛీ… చివరకు సుమా, నువ్వు కూడా అలాగే గలీజుగా తయారయ్యావేమిటి..? శీర్షిక హార్ష్‌గా ఉన్నట్టు అనిపిస్తోందా..? ఇన్నేళ్లు పవిత్రంగా, మడికట్టుకుని కొన్ని వేల షోలను, ఫిలిమ్ ఫంక్షన్లను అలవోకగా, సరదా సరదాగా నడిపించేసిన సుమలో ఏం గలీజుతనం కనిపించిందనేదే కదా మీ ప్రశ్న… ఈటీవీలో ఆమె ఓ దిక్కుమాలిన ప్రోగ్రాం చేస్తుంటుంది… గతంలో షోలు ఫ్లాపయ్యాక సుమ అడ్డా అనే పేరుతో ఈ కొత్త షో చేస్తోంది… గరిష్ఠ స్థాయిలో అది సినిమా ప్రమోషన్ల కోసమే… ఎవరో […]
దేవుడే శిక్షిస్తాడు సరే… కానీ తప్పుడు పని చేసిందెవరో తేలాలిగా… తప్పేముంది..?!
చంద్రబాబు శుద్దపూస అని ఎవరూ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు… ఇవ్వనివ్వడు… దేశముదురు రాజకీయ నాయకుడు… నిమిషాల్లో తన స్టాండ్ మార్చుకునే అత్యంత విశ్వాసరహిత చంచల స్వభావి… తన నోట తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు అనే మాట వచ్చాక, మొదటిరోజు తన డప్పు మీడియా కూడా పెద్దగా పట్టించుకోలేదు… సోషల్ మీడియా ఎప్పుడైతే రచ్చ చేస్తుందో అనివార్యంగా నేషనల్ మీడియా రంగంలోకి దిగింది… తప్పనిసరై ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎట్సెట్రా పత్రికలు, బాబు గారి టీవీలు, భజంత్రీలు […]
సతీ సావిత్రి మార్క్ కథకు ట్రెజర్ హంట్ మిక్స్… జనానికి నచ్చింది…
గిరిబాబుకి మంచి బ్రేకుని ఇచ్చింది 1977 లో వచ్చిన ఈ దేవతలారా దీవించండి సినిమా . Adventure , fantasy , sentiment , emotional movie . 1976 లో హిందీలో ఓ ఊపు ఊపిన సినిమా నాగిన్ ప్రేరణతో మన తెలుగు సినిమాను జయభేరి పిక్చర్స్ వారు తీసారు . కొమ్మినేని శేషగిరిరావు దర్శకత్వం వహించిన మొదటి సినిమా . ఈ సినిమాలో మురళీమోహన్ , గిరిబాబు భాగస్తులు . డైలాగులను జంధ్యాల వ్రాసారు […]
చేప నూనె, గొడ్డు మాంసం, పంది కొవ్వు… జగన్, నీ దగ్గర జవాబుందా..?!
ఎవ్వడేం రాస్తున్నాడో నాకు తెలియదు… ఏం కూస్తున్నాడో తెలియదు… ఏం సవాళ్లు విసురుతున్నారో తెలియదు… కానీ తిరుమల లడ్డూ కోసం ఉపయోగించే ఇంగ్రెడియెంట్స్ రాను రాను నాసిరకంగా మారుతున్నాయనీ, పెద్ద తలకాయలు అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతూ దాని నాణ్యతను, పవిత్రతను భ్రష్టుపట్టించారనేది నిజం… నాసిరకం కాదు, ఏకంగా జంతువుల కొవ్వును కలిపారని సాక్షాత్తూ చంద్రబాబు ఆరోపించాడు… ఏయ్, పిచ్చి రాజకీయాలు చేయకు అని భూమన, సుబ్బారెడ్డి సవాళ్లు విసిరారు… భూమన పిరియడ్ గతంలో, మొన్న తిరుమలను భ్రష్టుపట్టించిందనే […]
చెబితే నమ్మలేని పర్ఫెక్ట్ టెక్ వ్యూహం… అందుకే ఇజ్రాయిల్ అలా నిలబడగలిగింది…
హాలీవుడ్ సినిమాలు చూసి ఇవేవో సినిమాలలో మాత్రమే సాధ్యమవుతాయిలే అనుకోవడం సహజం! కానీ అవే నిజంగా జరిగి వాటిని నేను రిపోర్ట్ చేస్తూ విశ్లేషణ చేస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు! పుస్తకాలలో వ్రాసినట్లుగా నిజ జీవితంలో జరుగుతాయా? మన చుట్టూ నిత్యం జరిగే సంఘటనలని కొద్దిగా శ్రద్ధ పెట్టి గమనిస్తూ ఉంటే పుస్తకంలో రచయిత ఊహలు పూర్తిగా కాకపోయినా కొంతైనా వాస్తవం అనే అనిపిస్తాయి! కావాల్సిందల్లా కాస్తంత పరిశీలనాత్మక దృష్టి మరి కొంచెం సహనం! ******* ఇజ్రాయేల్ […]
కలం మరణిస్తే వార్త కాదు… ఓ గోల్డ్ మెడల్ జర్నలిస్టు అనాథ మరణం…
ఆమె యూనివర్సిటీ లో గోల్డ్ మెడల్ సాధించారు . ప్రభుత్వాలను శాసించే నంబర్ వన్ సంస్థలో జీవితాన్ని ప్రారంభించి .. దాదాపు నాలుగు దశాబ్దాలు అదే జీవితం . ఆమెది ఒంటరి జీవితం . హైదరాబాద్ మహానగరంలో ఒంటరిగా గదిలో ప్రాణాలు విడిచింది . తలుపు బద్దలు కొట్టి చూస్తే తప్ప ఆమె మరణం బయటి వారికి తెలియలేదు . అనాథ శవానికి పోలీసులు , మున్సిపాలిటీ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించారు . …. ఈ వార్త […]
రెండో వారానికే మొహం మొత్తింది… బిగ్‌బాస్ పూర్ రేటింగ్స్ నమోదు..!!
18.9 టీఆర్పీలు… ఈసారి బిగ్‌బాస్ 8 సీజన్ లాంచింగ్‌కు వచ్చిన ఈ టీఆర్పీలతో షో దుమ్మురేపింది… తుక్కురేగింది… అంటూ ఏవో పిచ్చి ప్రచారాలు చేసుకుంది కదా స్టార్ మాటీవీ… గత సీజన్ల లాంచింగ్ ఎపిసోడ్లతో పోలిస్తే హయ్యెస్ట్ అని ఏవో పిచ్చిలెక్కలు కూడా చెప్పుకుంది… నాగార్జున కూడా సంతోషంగా ఆ టీఆర్పీలను షేర్ చేసుకున్నాడు… భుజాలు చరుచుకున్నాడు… కానీ హైదరాబాద్ బార్క్ రేటింగ్ జస్ట్ 8.54 మాత్రమే… మిగతావి కలుపుకొన్నా మరీ 18.9 దాకా ఎలా వచ్చాయో […]
క్రిప్టో క్వీన్..! అంతటి FBI నే ముప్పుతిప్పలు పెడుతున్న డిజిటల్ కిలేడీ..!!
ఎఫ్‌బీఐని ముప్పుతిప్పలు పెడుతున్న మిస్సింగ్ క్రిప్టోక్వీన్! సినిమాను తలదన్నే స్టోరీ!! అమెరికన్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి.. ఓ మహిళ ఇప్పుడు నిద్ర లేని రాత్రులు మిగులుస్తోంది. ఎఫ్‌బీఐ అర్జంటుగా పట్టుకోవాల్సిన క్రిమినల్స్ జాబితాలో.. సుమారు 529 మంది కరడుగట్టిన నేరస్తులున్నారు. అందులో 11 మంది మహిాళా నేరస్తులుంటే… వారిలో ఎప్పుడెప్పుడు పట్టుకుంటామా అన్నట్టుగా ఓ కిలేడీ కోసం ముమ్మురమైన గాలింపు కొనసాగుతోంది. నంబర్ వన్ క్రిమినల్ గా ఇప్పుడు ప్రపంచమంతా మిస్సింగ్ క్రిప్టో క్వీన్ […]
అందగాడు కాదు, మంచి నటుడూ కాదు… కానీ…? (అక్కినేనిపై ఆత్రేయ)…
సెప్టెంబరు 20 అక్కినేని నాగేశ్వరరావు జయంతి. ఆ సందర్భంగా ఆత్రేయ అక్కినేని గురించి రాసిన వ్యాసం… అక్కినేని మీద ఆత్రేయ వ్యాసం… అడుగు మోపే స్ధలమిచ్చేసరికి అలా పెరిగిపోయాడు వామనుడు, నాగేశ్వరరావుకు అడుగు మోపే అవకాశం ఎవరిస్తే ఏం? ఎలా పెరిగాడు, ఏం సాధించాడు అనేదే కధానాయకుడి కధ. ఎలా పెరిగాడు? జీరో లాంటి వేషంతో ప్రవేశించి, హీరో దాకా పెరిగాడు. ఏం సాధించాడు? లక్షలు (వివరాలు ఇన్ కమ్ టాక్స్ వాళ్ళకూ, ఆయనకూ తెలుసూ) సంపాదించాడు. […]
జగన్‌ను వీడి జనసేనలోకి వెళ్తాడు సరే, బాలినేని అక్కడ ఇమడగలడా..?
2021 అక్టోబర్ రెండో వారంలో ఒక ఉదయం 7 గంటలప్పుడు.. ఒక యువ కాంగ్రెస్ నేతకు బాలినేని నుంచి 12 ఫోన్ కాల్స్ … మన పిల్లోడివి నువ్వు టీడీపీలోకి పోవద్దంటూ బుజ్జగింపుతో మొదలు పెట్టి బెదిరించే వరకు.. నేను ఫోన్ చేస్తే చాలు అతను ఆగిపోతాడు అనుకున్న బాలినేనికి అతను కూల్ గా ఇచ్చిన సమాధానం చిర్రెత్తించింది.. కోపంతో ఫోన్ కట్ చేయటం మళ్ళీ 5 నిముషాలకు ఫోన్ చేయటం.. మొత్తం పన్నెండుసార్లు కాల్ చేశారు.. […]
ఇప్పుడు బాహుబలి తీయాలంటే ఏళ్లు… నాటి బాహుబలికి జస్ట్ 47 రోజులే…
ఏమంటివి ఏమంటివి . జాతి నెపమున సూత సుతులకిందు నిలువర్హత లేదందువా ?! ఎంత మాట ఎంత మాట !? తెలుగునాట దద్దరిల్లిన డైలాగ్ . ఈరోజుకీ దద్దరిల్లుతున్న డైలాగ్ . ఈ డైలాగ్ గుర్తుకొస్తే వెంటనే గుర్తొచ్చే పేరు కొండవీటి వెంకటకవి . గుంటూరు జిల్లా వారు . సత్తెనపల్లి శరభయ్య హైస్కూల్లో , మాచెర్ల ప్రభుత్వ హైస్కూల్లో , ఆ తర్వాత పొన్నూరు సంస్కృత కళాశాలలో ప్రిన్సిపాలుగా చేసినవారు . ప్రిన్సిపాలుగా పనిచేస్తున్న సమయంలోనే […]
- « Previous Page
- 1
- …
- 136
- 137
- 138
- 139
- 140
- …
- 391
- Next Page »