అనేకానేక వివాదాలు, లీకుల తలనొప్పులు, సుదీర్ఘ కాలయాపన తరువాత ఎట్టకేలకు టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించింది… అనేక మంది నిరుద్యోగుల కల గ్రూప్- వన్… మరి ఈ పరీక్షపత్రం ఎలా ఉంది..? కాషాయ బ్యాచ్ ఆల్రెడీ దీన్ని తిట్టిపోసింది… కృత్రిమ సెక్యులర్ ప్రశ్నపత్రం అంటూ ఆడిపోసుకుంది… నిజానికి ఈ పరీక్షపత్రం ఎలా ఉంది..? నిజంగా నాణ్యమైన పరీక్షపత్రమేనా..? అభ్యర్థుల తెలివితేటల్ని నిగ్గుతేల్చే సత్తా ఉన్నదేనా..? సోషల్ మీడియాలో మిత్రుడు Sampath Rao Pulluri …. రాసిన […]
అపాయింట్మెంట్ సరే… అత్యంత ఉన్నత వ్యక్తి అనగానెవ్వరు అలనాటి ఓ దర్శకా..?
ఒకప్పటి దర్శకుడు నర్సింగరావుకు మస్తు కోపమొచ్చింది… ఎవరి మీద..? కేటీయార్ మీద..! ఎందుకు..? ఈయన 40 రోజుల నుంచి కలవాల్సి ఉందని అపాయింట్మెంట్ కావాాలన్నడట… ఆయన ఇస్తలేడట…! సో వాట్..? ఆయన యాక్టింగ్ సీఎం, అధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, నెత్తి మీద బొచ్చెడు పనులు, టైమ్ ఇవ్వలేకపోయాడేమో…! వాట్… సొసైటీలోని అత్యంత ఉన్నత వ్యక్తులకే టైమ్ ఇవ్వడా…? అవునండీ, ఇవ్వడు, ఇవ్వలేడు, ఇంతకీ అత్యంత ఉన్నత వ్యక్తులు అనగానెవ్వరు..? ఎవరు అలా సర్టిఫికెట్ ఇచ్చారు..? ఎవరో […]
అంగళ్ల రతనాలు అమ్మినారట ఇచట… మరెందుకిలా ఎండిపోయాం…
Drought-Diamonds: “కండలేక ఎండిపోయి బెండు వారినా సరే! తిండిలేక, తుండులేక, పండవారినా సరే! నిండు మనసు, నిజాయితీ, పండు వయసు, పట్టుదలా, దండిచేయి, ధర్మదీక్ష పండించును గుండెలలో… రండు రండు! చేతు లెత్తి దండము తల్లీ యని, కై దండల దండలతో, నీ రెండ నిలిచి కొలుచి పొండు ఇంత మంచి పెన్నతల్లి ఎందు కెండి పోయెనో? ఇంతమంది కన్న తల్లి ఎందు కిట్లు మారెనో? వంతలతో, చింతలతో కంతలువడి పోయెనో! సంతుకోస మేడ్చి ఏడ్చి, గొంతు […]
గవర్నరమ్మ గర్భసంస్కార బోధలు… బీఆర్ఎస్, నమస్తే విరుచుకుపడలేదు, నయమే…
ఒక వార్త… పీటీఐ న్యూస్ ఏజెన్సీ నుంచి జనరేటయిన వార్త కావచ్చు బహుశా… హిందుస్థాన్ టైమ్స్‌లో కనిపించింది… తెలుగు పత్రికల్లో ప్రముఖంగా ఎక్కడా కనిపించలేదు… విషయం ఏమిటంటే… ‘‘గవర్నర్ తమిళిసై స్వయానా గైనకాలజిస్టు, గర్భ సంబంధ వైద్యంలో స్పెషలిస్టు… ఒక ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ప్రారంభించిన గర్భసంస్కార కార్యక్రమంలో ఆమె ఆదివారం మాట్లాడుతూ గర్భిణులు సుందరకాండ పారాయణం చేయాలనీ, రామాయణం వంటి పురాణగ్రంథాల పఠనం సాగించాలనీ, తద్వారా మానసిక, దైహిక బలవంతులైన శిశువులు జన్మిస్తారనీ చెప్పారు… సదరు […]
రాడ్లతో విలేకరుల ముఠాలు సరే… పొలాల్లో జేసీబీల చీకటి దందా ఏమిటట..!
రైతులను బెదిరించి వసూళ్లు… 13 మంది విలేకరులపై కేసు… అసలు నిజాలేమిటో తెలియవు గానీ అనపర్తి పోలీసులు భిక్కవోలు పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలోనే చెప్పిన వివరాల ప్రకారం… ‘‘పొలాలు బాగుచేసుకుంటున్న రైతుల్ని బెదిరించి, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న 13 మంది పాత్రికేయులపై కేసు నమోదు చేశాం… పగలు ఎండ తీవ్రత, వేడి గాలుల కారణంగా రాత్రి సమయంలో పొలాల్లోని ఎత్తుపల్లాలు సరిచేసుకుంటున్న రైతులను డబ్బు ఇవ్వాలని ఈ 13 మంది డిమాండ్ చేశారు, దౌర్జన్యం చేశారు… దాంతో […]
దోశ టేస్టా..? పోహా టేస్టా..? ఇడ్లీ, వడలు బెటరా..? రోటీలు, పావ్ బజ్జీ బెటరా..?
ఎప్పుడూ పాలిటిక్స్, క్రికెట్, సినిమాలు, టీవీలు, ఓటీటీ, సెలబ్రిటీలు… ఇవేనా..? టూరిజం, ఫుడ్, డ్రెస్సింగ్, ఫ్యాషన్స్ ఎట్సెట్రా కూడా సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చకు, సంవాదాలకు కారణమవుతుంటాయి… పెద్దగా ట్రోలింగ్ ఉండవు ఆ ట్వీట్లపై, పోస్టులపై… సరదాగా వాదాలుంటయ్… సోషల్ ట్రోలింగ్ పిచ్చోళ్లకు ఇందులో ఎలా జొరబడాలో తెలియక సైలెంటుగా ఉండిపోతారు… ఇలాంటి ఫన్నీ డిబేట్లకు, ఇంట్రస్టింగు చర్చలకు ఒక ఉదాహరణ… గబ్బర్‌సింగ్ అనే ఒక ట్విట్టరుడు కడక్ జిలేబీ, పోహా (అటుకులు, పోపేసిన చుడువా టైప్) […]
ఇప్పుడు ట్రెండు అరుణాచలం… గిరిప్రదక్షిణ చేయాల్సిందే… తండోపతండాలు…
Neelayapalem Vijay Kumar……… అవునూ … మా చిత్తూరు పక్కనుండే “అరుణాచలం” లో కొత్త దేవుడేమైనా వెలిసాడా ? Do you know what is the new fad in Andhra right now? తిరువన్నామలై “అరుణాచలం” గుడికి పోవడం …! వీలైతే పౌర్ణమి నాడు పోవడం …! అప్పుడెప్పుడో శబరిమలైలో దేవుడు ‘జ్యోతి’ ని కనిపింప చేస్తాడు అని లక్షల కొద్దీ పరిగెత్తే వాళ్ళు గుర్తుందా … ఇప్పుడు ‘అరుణాచలం’లో పౌర్ణమి నాడు గిరి […]
లావణ్య త్రిపాఠి… వరుణ్తేజతో నిశ్చితార్థం అనగానే ఓ పాత సంగతి గుర్తొచ్చింది…
Nancharaiah Merugumala లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా బ్రాహ్మణ పొగడ్తలపై ‘కొణిదెల వారి కాబోయే కోడలు’ లావణ్య త్రిపాఠీ అభ్యంతరం! కులంతోనే బ్రామ్మలు గొప్పోళ్లు కాలేరనేది ఆమె వాదన ……………………………………………………………….. మెగాస్టార్ కొణిదెల చిరంజీవి పెద్దతమ్ముడు నాగేంద్రబాబు కోడలు కాబోతున్న నటి లావణ్యా త్రిపాఠీ కుటుంబ, సామాజిక నేపథ్యం ఆసక్తికరంగానేగాక గొప్పగానూ కనిపిస్తోంది. తెలుగు హీరో వరుణ్ తేజ్ తో లావణ్యకు నిశ్చితార్ధమైన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ అయోధ్య (ఫైజాబాద్) కాన్యకుబ్జ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన […]
ఎడిటర్లందు పుణ్యఎడిటర్లు వేరయా… ఆ ఎడిటర్‌కు మాత్రం ఎవరూ సాటిరారు…
Murali Buddha……… ఎడిటర్లలో మహానుభావులూ ఉంటారు … ఆయనతో కూర్చొని మాట్లాడే అవకాశం కోసం రాజీనామా చేసిన జర్నలిస్ట్ … జర్నలిస్ట్ జ్ఞాపకాలు – —————————————— ఎడిటర్లు అందరూ శాడిస్టులేనా ? మంచివాళ్ళు లేరా ? అంటే ఎందుకు లేరు? లోకంలో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు ఉన్నట్టే ఎడిటర్స్ లోకంలో మంచివాళ్ళూ ఉన్నారు . శాడిస్టులూ ఉన్నారు. . ప్రముఖ కవి , జర్నలిస్ట్ ప్రసేన్ ఆంధ్రభూమిలో ఉన్నప్పుడు ఎడిటర్ శాస్త్రి ఛాంబర్ కు వెళ్లి రాజీనామా లేఖ […]
డిటెక్టివ్ ప్రొడ్యూసర్… కొమ్మూరి కథతో చిరంజీవితోనూ ఓ సినిమా…
Bharadwaja Rangavajhala…….. యాక్షన్ సినిమాల వెంకట్రావ్…. టాలీవుడ్ చరిత్రలో యాక్షన్ మూవీస్ ప్రొడక్షన్ హౌస్ గా రవిచిత్ర పిలిమ్స్ కు ఓ స్పెషల్ ఐడెంటిఫికేషన్ ఉంది. ఇమేజ్ ఉంది. ఫిలిం జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంబించిన వై. వెంకట్రావ్ నిర్మాతగా మారి ఎన్.టి.ఆర్, కృష్ణలతో పవర్ ఫుల్ మూవీస్ తీశారు. ఈ వైవిరావ్ అనే కుర్రాడిది రాజమండ్రండి … ఇతను అప్పటి ప్రముఖ నిర్మాత ఎస్.భావనారాయణగారికి బామ్మర్ది కూడానండి … విఠలాచార్య తరహా జానపద చిత్రాలు టాలీవుడ్ […]
అబ్బురం… ఆ పిల్లలు ఆ భీకరమైన అడవిలో బతికే ఉన్నారు… దొరికారు…
నెలరోజుల క్రితం… ముచ్చట కూడా ప్రచురించిన ఓ కథనం ఇది… ముందుగా ఇది చదవండి… తరువాత కథ కూడా చెప్పుకుందాం… ఇంట్రస్టింగ్ స్టోరీ… హ్యూమన్ ఇంట్రస్టింగ్ స్టోరీ… అసాధారణం అని చెప్పలేను కానీ అరుదైన వార్తలు… పదండి వార్తలోకి… ప్రపంచంలోకెల్లా అత్యంత దట్టమైనవి అమెజాన్ అడవులు… భీకరమైనవి కూడా… రోజూ వర్షం, పొడవైన దృఢమైన చెట్లు, విషసర్పాలు, క్రూరజంతువులు… ప్రతి అడుగూ ప్రాణాంతకమే… రనేక్ మకుటయ్ 11 నెలలు, 4 ఏళ్లు, 9 ఏళ్ల వయస్సున్న కుమారులు, […]
శాడిస్టు ఎడిటర్లు, జర్నలిస్టులు బెంబేలు… ఒకాయన కర్మఫలం చివరిదినాల్లో అనుభవించాడు…
Murali Buddha……… ఎడిటర్ మరణిస్తే …. విధ్వంసకునికి నివాళా ? అని జర్నలిస్ట్ లు బుక్ వేశారు .. మన ఎడిటర్ దేవుడు అని తప్పించుకున్నా … జర్నలిస్ట్ జ్ఞాపకాలు – —————————————– రాజకీయ నాయకుడు , సంపన్నుడు , పారిశ్రామిక వేత్త , రచయితలు మరణిస్తే పెద్ద ఎత్తున నివాళి , అవకాశం ఉన్న వాళ్ళు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వ్యాసాలు రాస్తూ ప్రచురించడం కామన్ . ఇలాంటి స్మృతి సాహిత్యం బోలెడు […]
Unstoppable… బాలయ్యా, ఈ పవర్ఫుల్ టైటిల్ ఎందుకు వదిలేశావ్…
డైమండ్ రత్నబాబు… ఈయన మూవీ దర్శకుడు… గతంలో మోహన్‌బాబుతో సన్నాఫ్ ఇండియా తీసిన మొనగాడు… మబ్బుల్లో తిరిగే మోహన్‌బాబును కాలర్ పట్టుకుని నేల మీదకు తీసుకొచ్చిన సినిమా… ఓహో, సినిమా ఇలా కూడా తీస్తారా అని అందరూ హాహాశ్చర్యపోయిన సినిమా… అఫ్కోర్స్, అది వాళ్ల సొంత సినిమా… ఏ దర్శకుడిని పెట్టుకుంటేనేం… అనుకుని తెలుగు ప్రేక్షకుడు నిట్టూర్చాడు… అయిపోయింది… ఎహె కాదు, అయిపోయింది కాదు, రత్నబాబు ఎంత లక్కీ అంటే మరో సినిమా దొరికింది… సారీ, ఓ […]
మస్తు దమ్ముంది సరే ఆంధ్రజ్యోతీ… జాతీయ నాలుగో ప్లేసుకు ఆధారమేమిటి..?
ఆంధ్రజ్యోతి పత్రికలో ఫస్ట్ పేజీలో ఓ న్యూస్ బిట్ కనిపించింది… ఆశ్చర్యపరిచింది… సాక్షి ప్రతి అంశాన్నీ చంద్రబాబుకు ముడిపెట్టిన ధోరణిలోనే… ఆంధ్రజ్యోతి తన గొప్పతనానికి కూడా జగన్‌ను తిట్టేసింది… జగన్ ఎంత తొక్కాలని ప్రయత్నించినా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నామని చెప్పుకుంది… ఎందుకొచ్చిన ఈ పిచ్చి ప్రచారవార్తలు డియర్ రాధాకృష్ణ సర్…? ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త సారాంశం ఏమిటయ్యా అంటే… ఏబీఎన్ ప్రసారాలకు జగన్ అడుగడుగునా అడ్డుపడుతున్నాడు… ఐనాసరే జనం ఆదరిస్తున్నారు… జగన్ ధోరణిని చీదరించుకుంటున్నారు… ప్రస్తుతం ఏబీఎన్ రేంజ్ […]
డొల్ల వాదన… శుష్క ప్రచారం… జియ్యర్‌పై దాడి వెనుక మర్మమేంటో…!!
ఆంధ్రజ్యోతి మరీ ఇలా దిగజారిపోయిందేమిటి హఠాత్తుగా… రెండు స్టోరీలు చూశాక అనిపించింది ఇదే… చినజియ్యర్ మేనల్లుడు విష్ణు లీలలు అని ఆంధ్రజ్యోతిలో బొంబాట్ చేశారు ఒక స్టోరీ… ఏబీఎన్‌లో అదే స్టోరీ… తరువాత ఎవరో మహిళను హతమార్చిన పూజారినీ ఈ జియ్యర్ మేనల్లుడినీ కలిపేసి ‘స్వాముల’పై ఏబీఎన్‌లో ఓ డిబేట్… ఈ జియ్యర్ స్టోరీ పక్కా ప్లాంటెడ్ అనిపిస్తోంది… ఆంధ్రజ్యోతి పరిశోధన అని గొప్పగా రాసుకున్నారు గానీ మరీ నాసిరకం స్టోరీ… ఎవరో పనిగట్టుకుని, ఏదో మార్మిక […]
Sugar India… ప్రతి ఇద్దరిలో ఒకరికి హైబీపీ… ముగ్గురిలో ఒకరికి సుగర్ లక్షణాలు…
ఎవరో ఏదో సర్వే చేస్తారు… గుడ్డిగా మీడియా వాళ్లు రాసేస్తారు… కనీసం ఏజెన్సీ కాపీల్లో (న్యూస్ ఏజెన్సీలు అందరికీ పంపే కంటెంట్) ఏముందో, నిజానిజాలు ఏమిటో, తప్పులు ఏమిటో, మనవాళ్లకు ఏది అవసరమో కూడా ఆలోచించకుండా తెలుగు మీడియా గుడ్డిగా జనంలోకి తీసుకెళ్తుంది… దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ ఈరోజు పత్రికల్లో సుగర్ వ్యాధితీవ్రత మీద కథనం… నిజం… దేశంలో సుగర్, బీపీ, ఒబెసిటీ, హైకొలెస్ట్రాల్ వంటి వ్యాధుల తీవ్రత బాగా పెరుగుతోంది… ఎయిమ్స్, ఐసీఎంఆర్, మద్రాస్ కౌన్సిల్ […]
యాంటీ మోడీ కూటమి సాధ్యం కాదట… కలిసి మందగా ఎదుర్కుంటారట…
నిజంగానే మంచి ఆలోచన… ఓ బలమైన ప్రతిపక్షం అవతరిస్తే తప్ప అధికారపక్షం నేల మీదకు దిగిరాదు… 450 సీట్లలో బీజేపీకి పోటీగా ఎవరో ఒకరే బీజేపీయేతర అభ్యర్థి ఉండాలి, మిగతా ప్రతిపక్షాలన్నీ ఈ సూత్రానికి మద్దతునిచ్చి, మరో అభ్యర్థిని పోటీగా పెట్టకూడదు… స్థూలంగా చూస్తే సూపర్ ప్లాన్ ఇది… కానీ..? అప్పట్లో ఇందిరాగాంధీని నేలమీదకు దించిన జనతా ప్రయోగం గుర్తొచ్చింది… ఆ వెంటనే అది చీలికలు పేలికలుగా చినిగిపోయిన తీరూ గుర్తొచ్చింది… పగలబడి నవ్విన ఇందిర నవ్వు […]
బేకార్ లుక్కు… బేవార్స్ కథ… సిద్ధార్థ్‌కు మరిచిపోలేని ఫ్లాప్ ఇది…
అప్పుడప్పుడూ తన తిక్క వ్యాఖ్యలు కొన్ని పత్రికల్లో కనిపిస్తుంటాయి… తన రాజకీయ అవగాహన మీద జాలి కలుగుతుంది… అలాగే బోలెడు మంది సహతారలతో అఫయిర్లు పెట్టుకోవడం, వదిలేయడం వార్తలు కూడా కనిపిస్తుంటాయి… తనలాంటి భావజాలమే కలిగిన ప్రకాష్‌రాజ్, కమల్‌హాసన్ అఫయిర్లు, పెళ్లిళ్ల సంఖ్య గుర్తొస్తుంది… అలాగని మిగతా హీరోలు శుద్ధపూసలని కాదు… కానీ హీరో సిద్ధార్థ్‌కు ఉన్న పేరు అలాంటిది… ఇప్పుడు అదితి హైదరితో ప్రేమాయణం సాగుతోంది… ఆమె కథ తన గత హీరోయిన్లలాగా ముగిసిపోకూడదని ఆశిద్దాం… […]
అప్పట్లో వారపత్రికకు పిచ్చి క్రేజు తీసుకొచ్చిన ఎడిటర్ సికరాజు… కానీ తరువాత..?
Murali Buddha……….. స్టార్ రైటర్స్ ను సృష్టించిన మెగా ఎడిటర్ సికరాజు… వార పత్రికకు అభిమాన సంఘాలు …. చనిపోతే సింగిల్ కాలం వార్తా వద్దన్న శాస్త్రి … జర్నలిస్ట్ జ్ఞాపకాలు -.. _________…. ____________________ ఈ తరం వాళ్ళు నమ్మక పోవచ్చు కానీ ఒక కాలంలో ఆంధ్రభూమి రచయితలు అంటే సినిమా తారలను మించిన క్రేజీ ఉండేది . రచయితలు జిల్లాల్లో పర్యటిస్తే సినిమా వాళ్ళను చూసినట్టు గుంపులుగా జనం ఎగబడేవారు . పత్రికకు అభిమాన […]
ఈ ఒక్క విషయంలో మాత్రం… తెగ నచ్చేశావమ్మా నిర్మలమ్మా…
ఈరోజు తెగనచ్చేసిన వార్త… మెయిన్ స్ట్రీమ్‌లో ఇలాంటివి కనిపించవు… ఇలాంటివి సోషల్ మీడియా, వెబ్సైట్లలో మాత్రమే కనిపిస్తాయి… శుభకార్యమైనా, అశుభకార్యమైనా సరే, సెలబ్రిటీల ఇళ్లల్లో ఏది జరిగినా మీడియాకు పండుగ… పాపం శమించుగాక… వచ్చీపోయే సెలబ్రిటీల ఫోటోలు, వీడియోలు, బైట్స్‌తో రోజులతరబడీ ప్రత్యక్ష ప్రసారం ఇవ్వగలవు చానెళ్లు… పత్రికలు ప్రత్యేక సంచికలు, కథనాలకు పూనుకోగలవు… కానీ అట్టహాసాలు లేకుండా… అనవసర షో లేకుండా… నిరాడంబరంగా సెలబ్రిటీల ఇళ్లల్లో జరిగే శుభ, అశుభ కార్యక్రమాల్ని మాత్రం పొగడవు… ఇలా […]
- « Previous Page
- 1
- …
- 197
- 198
- 199
- 200
- 201
- …
- 448
- Next Page »