Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అసలే ఎన్టీయార్… దాసరి సరేసరి… అప్పట్లో ఓ ఎర్ర కమర్షియల్ కళాఖండం…

August 29, 2024 by M S R

ntr

నటరత్న-దర్శకరత్న కాంబినేషన్లో 1976 లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ఈ మనుషులంతా ఒక్కటే . ఎర్ర కమర్షియల్ సినిమా . కమర్షియల్ ఎర్ర సినిమా . స్వాతంత్య్రం రాకముందు సంస్థానాధీశులు , జమీందార్లు , వాళ్ళ తాబేదార్లు , నౌకర్లు చేసే అఘాయిత్యాలతో ప్రారంభమవుతుంది సినిమా . మొదట్లో కాస్త మంగమ్మ శపధం సినిమా ఛాయలు కనిపిస్తాయి . కానీ , ఈ సినిమాలో మంగమ్మకు శపధం చేసే అవకాశం ఇవ్వకుండా పెద్ద హీరో మంచోడు […]

పెప్సీ, కోక్ కలిసి వ్యాపారం చేస్తున్నాయా..? కూల్ మార్కెటింగ్ టెక్నిక్..!

August 29, 2024 by M S R

coke

ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే కోలా డ్రింక్స్ కోక్, పెప్సీ. కొన్ని దశాబ్దాలుగా ఈ రెండు కంపెనీల మధ్య ఆధిపత్య పోరు కొనసాగింది.‌ ఒకానొక సమయంలో రెండింటి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం. ఒకరిపై ఒకరు యాడ్స్ రూపంలో విమర్శలు చేసుకునేవి. క్రీడలు బాగా పాపులర్ అయ్యాక కూడా పోటా పోటీగా స్టేడియం హక్కులను కొని తమ డ్రింక్స్‌ను ప్రేక్షకులకు నిర్బంధంగా అంటగట్టాయి. అయితే ఈ రెండు కంపెనీల పోటీ కారణంగా పరస్పరం‌ నష్టపోతున్నట్లు గ్రహించాయి. […]

ఆ డాల్డా మన ఆరోగ్యాన్ని కబళిస్తూ… ఇంకా మన మిఠాయిల్లోనే ఉంది…!!

August 28, 2024 by M S R

dalda

మామూలుగానైతే దీపావళి, కార్తీక పౌర్ణమి నడుమ పేనీలు తినేది… పేనీలు అంటే చాలామంది తెలంగాణవాసులకే తెలియదు… సన్నగా, అత్యంత సన్నగా, పొరలుపొరలుగా చేసిన ఒకరకం స్వీట్… చక్కెర పొడి, వేడి పాలు పోసుకుని తినేయడమే… వంటామంటా ఏమీ ఉండదు… నార్తరన్ డిష్ కదా, తెలంగాణలోని కొన్ని కులాల కుటుంబాలకే పరిమితం… రాజస్థాన్ స్వీట్ హౌజులో కనిపిస్తే రేటు అడిగాను… రెండు రంగుల్లో కనిపించాయి… ముదురు గోధుమ రంగు అయితే నెయ్యితో చేసినవి అట… పావుకిలో 120 రూపాయలు […]

… కనుక అధ్యక్షా… ఫుల్ బాటిల్‌నే మన అధికార చిహ్నం చేయడం మర్యాద…

August 28, 2024 by M S R

bottle

చుక్కలకే చుక్కలు చూపిస్తున్న తెలుగు రాష్ట్రాలు 1. చట్టం, నేరం, శిక్ష, జరిమానా ఒక ట్రాక్ మీద వెళుతూ ఉంటాయి. 2. అలవాట్లు, సరదాలు, వ్యసనాలు పక్కనే మరో ట్రాక్ మీద వెళుతూ ఉంటాయి. 3. న్యాయం, ధర్మం, నైతికత, ఆదర్శాలు వీటికి దూరంగా ఎక్కడో దేవతావస్త్రం లాంటి కనిపించని ట్రాక్ మీద, కనిపించని ప్రయాణం చేస్తుంటాయి. ఏ ట్రాక్ మీద వెళ్లేవి ఆ ట్రాక్ మీదే వెళ్లాలి. లేకపోతే పెను ప్రమాదాలు జరుగుతాయి. ఏది నేరం? […]

చదువుతుంటేనే మెదడు మొద్దుబారినట్టుగా… ఓ సజ్జనుడి లైంగికదాడి కేసు కథ…

August 28, 2024 by M S R

Sajjan jindal

తండ్రి ఓ మర్చంట్ నేవీ ఆఫీసర్… తల్లి ఆర్బీఐలో మేనేజర్… తను డాక్టరీ చదివింది… తాత పేరుమోసిన సామాజిక కార్యకర్త… తల్లి బదిలీతో ముంబైకి మకాం మార్చారు… చదివింది డాక్టరీ అయినా మోడల్‌గా, నటిగానే ఇంట్రస్టు… మలయాళం, కన్నడం, పంజాబీ, హిందీ భాషల్లో నటించింది… ఓ తెలుగు సినిమాలో కూడా ఆఫర్ వచ్చింది, తరువాత ఏమైందో తెలియదు… 2021లో ఓ హోటల్‌లో జిందాల్ స్టీల్స్ సీఎండీ సజ్జన్ జిందాల్ తన మీద లైంగిక దాడి చేసినట్టు 2023లో […]

ఇక మగ పురుగులే ఉండవట… అంతా ప్రమీలా రాజ్యమే… మగాధిపత్యానికి స్వస్తి…

August 28, 2024 by M S R

y

ఇక మగవాడే పుట్టడు… వాడి పని అయిపోయింది… ఇన్నేళ్ల ఆధిపత్యం, పెత్తనం, వివక్ష, హింస అన్నీ ఖతమ్… ఇక మొత్తం ప్రమీలా రాజ్యమే… అంతా ఆడాళ్లే… మగ పురుగు కనిపించదు… పుట్టదు… మంచిగైంది,.. ఇన్నేళ్ల అణిచివేతకు అంతకంతా అనుభవించబోతున్నది మగజాతి… అచ్చం… ఇలాగే ఓ ఆర్టికల్ కనిపించింది… ఎవరబ్బా, ఈ వీర, ధీర, శూర, క్రూర ఫెమినిస్టు అని చూడటంకన్నా… అసలు ఆమె ఏ ఆధారంతో చెబుతున్నదీ అని పరిశీలిస్తే… రీసెంటుగా కొన్ని ఇంగ్లిష్ మ్యాగజైన్లలో ప్రచురితమైన […]

హైడ్రా రంగనాథ్ చదవాల్సిన ఓ పాత రేడియో నాటిక… కూల్చివేతలే కాదు..!!

August 27, 2024 by M S R

well

తమ చెరువులను ఆక్రమించారని అనేక ఆరోపణలు వస్తున్న క్రమంలో ఓ ముప్ఫై ఏండ్ల కింద రేడియోలో వచ్చిన నాటిక యాదికి వచ్చింది. నేను చిన్నప్పటి నుంచి రేడియో శ్రోతను… అది అలా వుంచితే .. ఆ నాటిక సారాంశం ఏమంటే… ఒక వూళ్ళో ఒక రైతు బావి తవ్వడం కోసం బ్యాంకు లోను కావాలని వెళ్ళాడు. ఇప్పుడున్న చాలామంది అధికారుల మాదిరిగా నాకేంటి అని పేచీ పెట్టారు.. ఇప్పటిలా సోషల్ మీడియా సహా మరేవీ లేవు కదా […]

ఏదో అడగబోయి… నారా రోహిత్‌తో ఏదో చెప్పించబోయి… చివరకు తామే నివ్వెరబోయి…

August 27, 2024 by M S R

nara rohith

ప్రతినిధి-2 సినిమా హిట్టయింది కదా… ప్రతినిధి-3 ఏమైనా తీసే ఆలోచన ఉందా..? అనడిగాడు జర్నలిస్టుడు… ఎక్కడ హిట్టయిందండీ బాబూ.. నాకూ తెలియదు..? అని నవ్వుతూ జవాబు ఇచ్చాడు నారా రోహితుడు… అదేమిటండీ, చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది కదాని ఇంకేదో చెప్పబోయాడు జర్నలిస్టుడు… అదొకటి వచ్చీపోయిందని తెలుసో లేదో తెలియదు గానీ, మీరన్నిసార్లు అడుగుతుంటే ఓహో నిజంగానే ఆ సినిమా వచ్చిందనిపిస్తుంది అని నవ్వుతూనే బదులిచ్చాడు రోహితుడు… అందరూ ఫక్కున నవ్వారు అక్కడే… ఈ వీడియో బిట్ […]

కథలో ఆదర్శం మరీ ఎక్కువైపోయి… ప్రేక్షకులు ఫోఫోవోయ్ అనేశారు…

August 27, 2024 by M S R

anr

దానే దానే పర్ లిఖా హై ఖానే వాలే కా నామ్ . మన పెద్దలు చెపుతుంటారు . డ్రమ్ము నూనెలో మునిగినా డ్రమ్ము నూనె ఒంటికి పట్టదు . ఒంటికి ఎంతయితే పట్టుతుందో అంతే పట్టుతుంది . ఈ సినిమా నిర్మాత యం యస్ గోపీనాథ్ విషయంలో అక్షరాలా నిజం అనిపిస్తుంది . సినిమాలో కధ బాగుంటుంది . ANR , శారద వంటి తారాగణం . పాటలు బాగుంటాయి . సినిమా మాత్రం కమర్షియల్ […]

జైళ్లోనే భేటీ… ఏదో పెద్ద స్కెచ్ వేస్తున్నట్టున్నారు… హీరో దర్శన్, గ్యాంగ్‌స్టర్ విల్సన్…

August 26, 2024 by M S R

darshan

చూస్తున్నాం కదా… డబ్బులుంటే చాలు, బయట ఉన్నట్టుగానే జైళ్లలో కూడా సకల విలాసాలకు కొదువ ఉండదు… తీహార్ దగ్గర నుంచి అంతటా అదే స్థితి… అన్నీ దొరుకుతాయి… జైళ్ల సిబ్బందే ఎంచక్కా సహకరిస్తారు… పెరోల్స్ మీద బయటికి రావచ్చు, లేదా జైలులోనే ఉండి తమ యాక్టివిటీ కొనసాగించవచ్చు… మరి బెంగుళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్ ఏమైనా మినహాయింపా..? అదీ అంతే… దర్శన్ తెలుసు కదా.., తన సహజీవని పవిత్ర గౌడకు అసభ్య మెయిళ్లు, మెసేజులు పెట్టి […]

అప్పట్లో సైకిల్ నేర్చుకోవడం ఓ పెద్ద టాస్క్… ఆ రోజుల్లోకి మనల్ని ఎత్తుకుపోయే మూవీ…

August 26, 2024 by M S R

cycle

కొన్ని సినిమాలు ఓటీటీలో కనిపిస్తాయి… డబ్ చేయబడి ఉంటాయి… డబ్ చేయకపోయినా పర్లేదు, మనల్ని చిన్నతనంలోకి అనగా వెనుకటి రోజుల్లోకి అమాంతం ఎత్తుకుపోతాయి… నాస్తాల్జిక్… వాటితో మనం కనెక్టవుతాయి… పెద్ద తారాగణం, భారీ ఖర్చు, అట్టహాసాలు, ఫైట్లు, పాటలు, ఐటమ్ సాంగ్స్, రొమాన్స్  గట్రా ఏమీ ఉండవు… ఐనా మనల్ని మనదైన మన పాత ప్రపంచంలోకి తీసుకుపోతాయి… కురంగు పెడల్ అనే సినిమా కూడా అంతే… తమిళం నుంచి తెలుగుకు డబ్బయింది… 1980 ప్రాంతాల్లో పూర్తిగా గ్రామీణ […]

అందుకే చెప్పేది… కవర్ పేజీ చూసి పుస్తకాన్ని అంచనా వేయొద్దు అని..!!

August 26, 2024 by M S R

living

ఆరోజు అనుకోకుండా కలిశాడు తను… నా పాత క్లాస్‌మేట్… దాదాపు ముప్ఫయ్ సంవత్సరాలు అయ్యిందేమో మేం ఒకరికొకరం చూసుకుని… ఆ హోటల్ లాబీలో తనను చూడగానే మొదట సంబరం అనిపించింది… పాత మిత్రుడిని చూసినందుకు… అదేసమయంలో వాడిని చూసి జాలేసింది… మామూలు సాదాసీదా బట్టల్లో ఉన్నాడు… నా ఆడంబరపు అప్పియరెన్స్‌తో పోల్చుకుంటే వాడి మీద జాలేసింది అందుకే… నన్ను చూసి, నా పలకరింపు విని బాగా ఆనందపడ్డాడు… ఇద్దరమూ ఫోన్ నంబర్లు మార్చుకున్నాం… నా నంబర్ తీసుకుంటున్నందుకు […]

హైడ్రా దూకుడుకు జనస్వాగతం… భయంతో ప్రత్యర్థి పార్టీల్లోనే హాహాకారాలు…

August 26, 2024 by M S R

nagarjuna

హైడ్రా… ఇప్పుడిదే సంచలనం… మా నగరాల్లోనూ హైడ్రా కావాలని కోరికలు… హైడ్రాకు మద్దతుగా ర్యాలీలు… పొగుడుతూ మీడియాలో ప్రశంసలు… సోషల్ మీడియాలో కూడా అభినందనలు… రుణమాఫీ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి రేవంత్ రెడ్డి ఎత్తుగడ అని బీఆర్ఎస్ నేతలు ఎంత గొంతు చించుకున్నా జనంలోకి పోలేదు… దాంతో స్వరం మార్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కుట్ర అనే రాగం ఎత్తుకున్నారు హరీష్ రావు, కేటీఆర్… హైడ్రా కత్తిని మెడ మీద పెట్టి కాంగ్రెస్‌లోకి లాగే ప్రయత్నం […]

మారువేషాల్లేవ్, పైగా మరణిస్తాడు… ఎంత ‘మగాడైనా’ సరే, ప్రేక్షకులకు నచ్చలేదు…

August 26, 2024 by M S R

ntr

హిందీలో సూపర్ హిట్టయిన సినిమా దీవార్ ఆధారంగా 1976 లో ఈ మగాడు సినిమా వచ్చింది . NTR అంతటి టాప్ హీరో నటించినా హిందీ సినిమాలాగా మన తెలుగు సినిమా పేలలేదు . బహుశా NTR పాత్ర విజయ్ చనిపోవటం తెలుగు ప్రేక్షకులకు నచ్చలేదేమో ! NTR కాబట్టి ముగింపు మార్చుకుని ఉండవలసింది . NTR-యస్ డి లాల్ కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో కాస్త నీరసంగా ఆడిన సినిమా ఇదేనేమో ! ఈ సినిమా గురించి […]

ఇండియన్ జర్నలిస్టులతో మాట్లాడితే చాలు… పాకిస్థాన్ దేశద్రోహులేనట…

August 26, 2024 by M S R

karan thapar

పాకిస్థాన్ ఆర్మీ చెప్పినట్టుగా వ్యవహరించే అక్కడి అధికార గణం పీటీఐ ప్రతినిధి రవూఫ్ హసన్‌ను అరెస్టు చేసింది… ఏవేవో నేరారోపణలు చేసింది… పీటీఐ అంటే మన దేశంలో ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా… అంటే జాతీయ వార్తా సంస్థ, మీడియా సంస్థలకు వార్తల్ని సేకరించి ఇస్తుంటుంది… కానీ పాకిస్థాన్‌లో పీటీఐ అంటే ఇమ్రాన్ ఖాన్ పార్టీ… పాకిస్థాన్ తెహ్రీక్-ఇన్సాఫ్… ఆ పార్టీకి రవూఫ్ స్పోక్స్ పర్సన్… తనను అరెస్టు చేయడానికి అధికారగణం ఆరోపించిన కారణాల్లో ముఖ్యమైంది… తను […]

అంతటి నాసాకే అంతుచిక్కని సునీతా విలియమ్స్ స్పేస్ రిటర్న్ జర్నీ…

August 26, 2024 by M S R

astronat

ఇండియన్ మూలాలున్న అమెరికన్ అస్ట్రోనాట్ సునీతా విలియమ్స్, మరో అమెరికన్ వ్యోమగామి బుచ్ విల్మోర్‌లను తిరిగి భూమ్మీదకు తీసుకొచ్చేందుకు.. బోయింగ్ స్టార్ లైనర్ కంటే, ఎలోన్ మాస్క్ స్పేస్ ఎక్సే బెటర్ అంటోంది నాసా! ఎందుకు…? ఎలోన్ మాస్క్ స్పేస్ ఎక్స్ ను ఎంచుకోవాలనుకోవడం వెనుక కారణాలతో పాటు.. ప్రపంచదేశాల్లోనూ ఇప్పుడు వ్యోమగాములైన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ తిరిగి మళ్లీ భూమ్మీదకు చేరుకోగలరా అన్నవి ప్రధాన ప్రశ్నలుగా మారాయి. దానికి మరో ఆర్నెళ్ల సమయం పడుతుందని […]

రాహుల్ గాంధీకి స్క్రిప్టు రాసిచ్చే వాళ్లలోనే ఏదో తేడా కొడుతోంది..!!

August 25, 2024 by M S R

raaga

ఈ మాట అనడానికి మనం బీజేపీ సానుభూతిపరులమే కానక్కర్లేదు… మామూలుగా పరిశీలించినా సరే ఇట్టే అర్థమైపోతుంది… రాహుల్ గాంధీ సమాజాన్ని చూసే కోణంలోనే ఏదో భారీ తేడా ఉందని..! మిస్ ఇండియా విజేతల జాబితా చూశాను, దళిత-గిరిజన-ఓబీసీ- మైనారిటీలు లేనే లేరు అని ఎక్కడో వ్యాఖ్యానించినట్టుగా ఓ వార్త వచ్చింది… దీనిపై నెటిజనం విరుచుకుపడుతున్నారు… సహజమే… అంటే మిస్ ఇండియా పోటీల్లో కూడా రిజర్వేషన్లు పెట్టమంటావా అని కొందరు ప్రశ్నిస్తున్నారు… బీజేపీ, బీజేవైఎం తదితర ప్రత్యర్థి విభాగాలు […]

ఆ పాత బిగ్‌బాస్ అల్లర్లు రిపీటయితే… ఈసారి అన్నపూర్ణ స్టూడియోస్‌పైనే యాక్షన్..!!

August 25, 2024 by M S R

biggboss

ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, ఇతర తలనొప్పులతో బహుశా నాగార్జున బిగ్‌బాస్ హోస్టింగ్ ఆలస్యం అవుతుందేమో… ఏమో, చెప్పలేం… అదీ ప్రధాన ఆదాయవనరు కాబట్టి (స్టూడియో లీజ్, హోస్టింగ్ ఫీజ్) వెంటనే రెడీ అవుతాడేమో కూడా… నిజానికి ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక, ఒప్పందాలు పూర్తయి ఉండాలి… ఐతే గతంలోలాగా వివరాలు లీక్ గాకుండా జాగ్రత్తపడుతున్నారు… ఈసారి ఎవరెవరు అనే ఆసక్తి, థ్రిల్ లాంచింగ్ నాటికి అలాగే ఉండేందుకేమో… ఈలోపు యూట్యూబర్లు, సైట్లు అన్నీ కలిసి దాదాపు రెండొందల మందిని […]

రాను రాను తెలుగు ఇండియన్ ఐ‘డల్’… ఇదోతరహా శ్రీదేవి డ్రామా కంపెనీ…

August 25, 2024 by M S R

polishetty

కేశవరామ్… ఆస్ట్రేలియా నుంచి వచ్చి మరీ తెలుగు ఇండియన్ ఐడల్ సాంగ్స్ కంపిటీషన్ షోలో పాల్గొంటున్నాడు… మొదట్లో ఇరగదీశాడు… ఈసారి నువ్వే ఎలిమినేట్ అయ్యేదంటూ ఎవరు హింట్ ఇచ్చారో గానీ ఈసారి తన రాగం శృతితప్పింది… నీరసంగా సాగాయి రెండు పాటలూ… పాడుతున్నప్పుడే అనిపించింది, జడ్జిలు నెగెటివ్ రెస్పాన్స్ ఇస్తున్నప్పుడే అనిపించింది ఈసారి పడిపోయే వికెట్ అదేనని… అలాగే ఆ వికెటే పడిపోయింది… చిత్రమేమిటంటే… జడ్జెస్ చాలెంజ్ థీమ్ ఈసారి, అంటే పూర్తి కంట్రాస్టు ఉండే రెండు […]

క్లాసిక్ మూవీ… పద్యాలు, పాటలు, నృత్యాలు… మాస్ జనానికి ఎక్కలేక చతికిల..!!

August 25, 2024 by M S R

anr

It’s a classic … అక్కినేని నటించిన సినిమాలలో ఈ సినిమా ఒక దృశ్యకావ్యం , కళాఖండం … మహాకవి కాళిదాసు , భక్త తుకారాం , భక్త జయదేవ సినిమాల్లాగానే 1976 లో వచ్చిన ఈ మహాకవి క్షేత్రయ్య కూడా ఓ రసానుభూతి … 1974 చివర్లో అమెరికాలో గుండె ఆపరేషన్ తర్వాత 1975 లో ఆయన సినిమాలు ఏవీ విడుదల కాలేదు … 1976 లో వచ్చిన మూడు సినిమాలలో ఒకటి ఈ సినిమా […]

  • « Previous Page
  • 1
  • …
  • 201
  • 202
  • 203
  • 204
  • 205
  • …
  • 386
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • సంజన గల్రానీ..! నాగార్జుననూ, బిగ్‌బాస్‌నూ కలిపి ఈడ్చికొట్టింది..!!
  • …. అందుకే రేవంత్ రెడ్డి ఓ డిఫరెంట్ లీడర్… ఎందుకు, ఎలా అంటే…
  • పాద‘రస గాత్రులు’… స్వరభాస్వరులు మాత్రమే రక్తి కట్టించగల ఐటమ్ సాంగ్స్…
  • నాగదుర్గ… పేరుగల్ల పెద్దిరెడ్డి… మరో కొత్త వీడియో వైరల్… బాగుంది…
  • సర్పంచ్..! సొంత ఖర్చులు, అప్పులు… ఐనా ఆ పదవి విలువే వేరు…
  • చిరంజీవి నటచరిత్రలో కలికితురాయి… జనం మాత్రం మెచ్చలేదు…
  • Born Hungry…! తన ‘చెత్తకుండీ’ మూలాలకై ఓ స్టార్ చెఫ్ అన్వేషణ..!!
  • స్వార్థం కాదు… అజ్ఞానంతోనే సైబర్ క్రైమ్ బాధితులుగా మారేది…
  • వస్తున్నారు గ్రహాంతర జీవులు… అదుగో, వస్తున్నది వాళ్ల వ్యోమ నౌకేనా…
  • అసలు ఈ కుసంస్కారిని ఫంక్షన్లకు ఎందుకు పిలుస్తున్నారు..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions