హమ్మయ్య… కర్నాటక బరిలో దిగడానికి ధైర్యం చేయలేకపోయినా సరే… బీఆర్ఎస్ ఓ జాతీయ పార్టీ… కానీ గతంలో ఒకటీరెండు మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేల సమయంలో అసలు కేసీయార్ పేరే వినిపించేది కాదు, కనీసం జాబితాలో తనను ఓ ప్రధాని అభ్యర్థిగానే కాదు, కనీసం ఓ జాతీయ నాయకుడిగా కూడా గుర్తించలేదు… థాంక్స్ టు టైమ్స్ నవ్… ఈ చానెల్ సర్వేలో కేసీయార్ పేరును కూడా ‘సర్వే చేయబడే పేర్ల’ జాబితాలోకి తీసుకున్నారు… పోతే పోనీ… […]
బలగం నిండా మూఢనమ్మకాలు సరే… మరి విరూపాక్ష మాటేంటి..? క్షుద్ర కథ కాదా..?!
ఎవ్వడూ ఏమీ మాట్లాడడు ఇప్పుడు… బలగం సినిమాలో పిట్ట ముట్టుడు అంశం మీద చాలామంది నోళ్లు పారేసుకున్నారు… ఆ సినిమా మూఢనమ్మకాల్ని ప్రోత్సహిస్తోందని తెగ కన్నీళ్లు కార్చేశారు… మరి ఇప్పుడు విరూపాక్ష మాటేమిటి..? మొత్తం క్షుద్ర శక్తులు, పూజలు, మంత్రాలు ఎట్సెట్రా… బలగం సినిమాను చీల్చి చెండాడిన కలాలు ఇప్పుడు విరూపాక్షుడిని ఏమంటాయో చూడాల్సి ఉంది… బలగం సినిమాకు ఒక న్యాయం, విరూపాక్షకు మరో న్యాయం ఉండకూడదు కదా… బలగం తెలంగాణ పల్లెకు చెందిన ఓ మట్టివాసన […]
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకూ దొరకని ఆ వార్త… వార్త డెయిలీ జర్నలిస్టుకు ఎలా తెలిసింది..?
Murali Buddha………. పీఎం, సీఎంల మీటింగ్ లో ఏం మాట్లాడుకున్నారో రాధాకృష్ణకు ఎలా తెలుస్తుంది..? జగన్ , నరేంద్ర మోడీల్లో ఎవరో ఒకరు ఆయన సోర్స్ కావచ్చు, ఆ సంగతి నాకు తెలియదు … కానీ ఆయన రిపోర్టర్ గా తిరిగేప్పుడు … ఆయనకు తెలియంది, ఓ సామాన్య జర్నలిస్ట్ కు తెలిసింది ఓ వార్త… ఓ జ్ఞాపకం ఉంది చెబుతాను… ఓ జ్ఞాపకం- కొన్ని గంటల పాటు ముఖ్యమంత్రి వద్ద… పొలిట్ బ్యూరో సభ్యులు, బాబు సన్నిహిత […]
పాత ఫ్లాపుల రీమేక్‌లో… సో సో కేరక్టర్ చేసి… పరువు పోగొట్టుకున్న వెంకటేశ్…
మొత్తం సౌత్ ఇండియా సినిమాను హిందీలోకి డబ్ చేసుకో… హిందీ ప్రేక్షకులు కూడా సంతోషంగా చూస్తారు… అది సౌత్ ఇండియా మూవీగానే చూస్తారు… కేజీఎఫ్, విక్రమ్, కాంతార, చార్లి, ఆర్ఆర్ఆర్, కార్తికేయ ఎట్సెట్రా సినిమాలు అన్నమాట… అదేసమయంలో ఈ ట్రెండ్‌ను తప్పుగా అర్థం చేసుకుని, సౌత్ ఇండియా మసాలాలు గుప్పిస్తే తప్ప హిందీ సినిమాను చూడరు అనుకుని, వాతలు పెట్టుకుంటే మాత్రం ఇటు సౌతూ సహించదు, అటు నార్తూ భరించదు… ఎస్, సల్మానుడి కొత్త సినిమా అందుకే […]
నేపథ్య సంగీతం నిలబెట్టింది విరూపాక్షుడిని… మిగతా అంశాలన్నీ సో సో…
మెగా క్యాంపులో సాయి ధరమ్ తేజ కాస్త డిఫరెంట్… మిగతా మెగా హీరోలకు భిన్నంగా ఉంటాడు… యాక్సిడెంట్ కారణంగా కొన్నాళ్లు వెనకబడిపోయాడు… విరూపాక్ష సినిమాలో కూడా డల్‌గా కనిపిస్తాడు ఎందుకో… గతంలో కూడా తను జాతీయవాద దృక్పథం కలిగిన హీరో పాత్రలు పోషించాడు… నటనలో మేటి అని చెప్పలేం గానీ, ఇంకా డెవలప్ కావాలి గానీ… మరీ విసుగు ప్రదర్శించేంత నాసిరకం నటుడు మాత్రం కాదు… అయితే ఒకటీరెండు అంశాల్లో ఈ విరూపాక్షుడిని మెచ్చుకోవచ్చు… మెగా హీరోలు […]
పొగడరా మన తల్లి భూమి భారతిని… చైనాపై గెలిచిన సంతానలక్ష్మి…!!
We are Top: నిన్నటి నుండి గాల్లో తేలినట్లుంది. ఆనందంతో ఉక్కిరి బిక్కిరిగా ఉంది. ఉబ్బి తబ్బిబ్బులుగా ఉంది. ఒకటే పులకింత. తుళ్లింత. మొన్ననే చైనా సరిహద్దు హిమాలయం కొండల దాకా వెళ్లి వచ్చాను. అప్పుడే ఈ వార్త తెలిసి ఉంటే…కనీసం హిమాలయం కొండ కాకపోయినా…గుట్ట అయినా ఎక్కి బిగ్గరగా అరచి ఉండే వాడిని. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల పద్దులో ఇన్ని శతాబ్దాలుగా అప్రతిహతంగా మొదటి స్థానంలో ఉన్న చైనాను కిందికి లాగి…భారత్ మొదటి స్థానంలోకి వచ్చింది. ఐక్యరాజ్యసమితి […]
‘నమస్తే ఈనాడు’… ఆ మూడో సింహం ఎటు పారిపోయింది మహాశయా…
కష్టకాలంలో రామోజీరావుకు కేసీయార్ చల్లని చూపు కావాలి… కేసీయార్‌కు కూడా అంతే… ఓ పెద్ద పత్రిక, టీవీ చానెళ్ల మద్దతు కావాలి… తన సొంత మీడియా ఉన్నా సరే, సొంత పార్టీ వాళ్లే పట్టించుకోరు దాన్ని… మార్గదర్శి చిట్స్‌పై జగన్ ఉరుముతున్నాడు… అంతు చూస్తానంటున్నాడు… ఇంకోవైపు సుప్రీంలో మార్గదర్శి ఫైనాన్స్ భూతం అలాగే జడలు విప్పుకుని ఉంది… జగన్ ప్రభుత్వం అందులోనూ ఇంప్లిడయింది… తనకు ప్రబల ప్రత్యర్థిగా మారిన ఈనాడుకు ఝలక్ ఇవ్వడానికి ఒక్క రోజైనా సరే […]
story behind the story… ప్రతి వార్తాకథనం వెనుక కూడా ఓ కథ ఉండును…
Murali Buddha………. ఒక వార్త రెండు పిట్టలు- ఓ జ్ఞాపకం … తెలుగు యువత అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్, వరల్డ్ బ్యాంకుకు బదులు ఉన్నత విద్యా మండలి నుంచి ఋణం తీసుకోవాలి అనుకుంటున్న ప్రభుత్వం … Ysr సీఎంగా ఉన్నప్పుడు ఈ రెండు వార్తలు ఆంధ్ర ప్రభ మొదటి పేజీలో చూడగానే తోటి రిపోర్టర్లు , ప్రభుత్వం , రాజకీయపక్షాలు బుర్ర గోక్కోవడం మొదలు పెట్టారు … ఉన్నత విద్యా మండలి కార్యదర్శిగా ysr బంధువు ఉండేవారు […]
‘‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి..’’ అధాటున ఎంత మాట అనేశావ్ బ్రదర్…
ఒక వ్యాపార ప్రకటన ఎలా ఉండకూడదు అని చెప్పడానికి పక్కా ఉదాహరణ ఇది… ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి మార్కెటింగ్ ఉద్యోగి చదివి తీరాల్సిన ఓ ఉదాహరణ… ప్రత్యేకించి పత్రికల్లో, టీవీల్లో ప్రకటనలు ఇచ్చేవారు, తీసుకునేవారు పరిగణనలోకి తీసుకుని, గుర్తుంచుకోవాల్సిన ప్రకటన ఇది… చదివేవారికి, చూసేవారికి చాయిస్ ఎలాగూ ఉండదు కాబట్టి, వాళ్ల ఖర్మ… వ్యాపార ప్రకటన అని ఎందుకు అంటున్నానూ అంతే… పత్రిక వాడికి ఇది వ్యాపారమే కాబట్టి…! ఆ వ్యాపారం మీదే పత్రిక మనుగడ […]
జగన్ చెడ్డవాడు… ఇది చెప్పడానికి ఆంధ్రజ్యోతి ఏ అవకాశాన్నీ వదలదు…
అసలు ఇది వాార్త అవుతుందా..? ఇందులో ప్రజల కోణం ఏముంది..? ఆంధ్రజ్యోతికి ఏమైంది..? మరీ మాస్ట్ హెడ్ పక్కన బొంబాట్ చేసింది..? ఫేస్బుక్ కమ్యూనిటీ స్టాండర్ట్స్ వంటి డొల్లేనా ఆంధ్రజ్యోతి ప్రొఫెషనల్ ప్రమాణాలు..? ప్రస్తుతానికి నెట్లో ఈ చర్చ బాగానే నడుస్తోంది… ఈ చర్చకు కారణం ఒక వార్త… హైదరాబాద్, తెలంగాణ ఎడిషన్లలో ఏదో మొక్కుబడిగా వేశారు, ఎందుకంటే తెలంగాణలో ఆ వార్త ద్వారా వారు కోరుకున్న ఫాయిదా ఏమీ లేదు… కానీ ఏపీలో ఆ వార్త […]
గుండు కుభేరుడు కూడా చెప్పేశాడు… అక్షయ తృతీయమే అద్వితీయమట…
Lakshmi & Kubera: అక్షయ తృతీయరోజు విష్ణువును, ప్రత్యేకించి లక్ష్మీ దేవిని పూజిస్తే అక్షయమయిన సిరిసంపదలు వచ్చి మన నట్టింట్లో పడతాయని ఒక నమ్మకం. మంచిదే. లలితా నున్నటి గుండాయన డబ్బులెవరికీ ఊరికే రావు అని అంటాడు కానీ– అక్షయ తృతీయ రోజు పూజ చేస్తే కనకధార కురుస్తుందంటే కాదనాల్సిన పనిలేదు. అక్షయ తృతీయ రోజు ఏ దేవుడిని పూజించినా తరగని సంపద వస్తుందనేది ఇంకొంచెం బ్రాడర్ భక్తి సూత్రంగా ప్రచారంలో పెట్టారు. ఇదీ మంచిదే. అక్షయ తృతీయ వైశిష్ట్యం […]
ఇది ‘జాలి’వుడ్… రోగగ్రస్త శకుంతల శోకాలు … అక్కడ ‘జాలీ’వుడ్ ఫోజులు…
పొద్దున్నే మిత్రులు ప్రభాకర్ జైనీ పోస్టు కనిపించింది… ‘‘నిన్న మొన్నటి వరకు ‘#శాకుంతలం’ సినిమా ప్రమోషన్లలో, ‘నాకు రోగమొచ్చింది, ఎక్కువ మాట్లాడలేను, దయచేసి నా సినిమాను చూడండి’ అంటూ దీనంగా, రోగగ్రస్త లుక్ కోసం మేకప్ వేసుకుని కళ్ళద్దాలు పెట్టుకుని, కన్నీళ్ళు పెట్టుకున్న, సమంత నిన్న హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘CITADEL’ కోసం అమెరికాలో అడుగుపెట్టి, అందమైన ఫోజులు ఇచ్చి, తెలుగు ప్రేక్షకులను వెర్రివాళ్ళను చేసింది…’’ నిజంగానే ఒక ప్రశ్న… సమంత సానుభూతిని గెయిన్ చేయడానికి ప్రయత్నించిందా..? ఈ […]
దేవిశ్రీ… పర్లేదు, తగ్గిపోతుంది… పైత్యానికి ఆయుర్వేదంలో మందులున్నాయి…
కొట్టరా డప్పు కొట్టు… వన్ టూ త్రీ… అని మధ్య మధ్యలో అరుస్తూ…. చేతవెన్న ముద్ద చెంగల్వపూదండ… ఉప్పుకప్పురంబు నొక్కపోలికనుండు… వంటి పద్యాలు నాలుగు కలిపి కొట్టండి… ఏమో, ఆ పాట సూపర్ హిట్ కావచ్చు… చెప్పలేం… 82.50 కోట్లు ఖర్చు చేస్తే దానికీ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ వచ్చే ఆస్కారం కూడా ఉంది… జోక్ అనిపిస్తోందా మీకు..? కాదండీ బాబూ… సల్మాన్ ఖానుడు హిందీలో ఓ సినిమా తీస్తున్నాడు కదా… కిసీకాభాయ్ కిసీకాజాన్… వెంకీ […]
61 మంది మాఫియా డాన్ల పేర్లతో… యోగి సర్కార్ తాజా హిట్ లిస్ట్…
ఈమధ్య యూపీలో అతిక్ అనే నొటోరియస్ గ్యాంగ్‌స్టర్ పొలిటిషియన్, తన బ్రదర్ ముగ్గురు యువకుల కాల్పుల్లో మృతిచెందాడు తెలుసు కదా… అంతకుముందు అతిక్ కొడుకు అసద్ ఎన్‌కౌంటరయ్యాడు… దాదాపు 11 వేల ఎన్కౌంటర్లతో ప్రకంపనలు సృష్టిస్తున్న యోగి ప్రభుత్వం ఇప్పటిదాకా కేవలం ‘కొమ్మ నరుకుడు’ చర్యలకే పరిమితమైంది… అంతగా యూపీలో మాఫియా, గ్యాంగ్స్టర్స్, పొలిటిషియన్స్ మిళితమైన అరాచకం పాతుకుపోయి ఉంది… ఇప్పుడిక వేళ్లు నరికే పని మొదలుకాబోతోంది… హక్కుల సంఘాల మొత్తుకోళ్లు, సుప్రీంలో పిల్స్ గట్రా నడుస్తున్నయ్… […]
తెలుగు టీవీ సీరియళ్లలో కన్నడ తారలదే హవా…! ఎందుకలా..?
హైదరాబాద్- బెంగుళూరు నడుమ ఎక్కువగా విమాన ప్రయాణాలు చేసేవాళ్లకు తెలుసు… ఎప్పుడూ ఎవరో ఒక సీరియల్ టీవీ నటి బిజినెస్ క్లాసు కుర్చీలో కనిపిస్తుంది… మరీ శని, సోమవారాల్లో ఎక్కువగా… ఎందుకు..? టీవీ సీరియళ్లలో నటించడానికి బెంగుళూరు- హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేస్తుంటారు చాలామంది… నిజం… ఈరోజు ఏ చానెల్లో ఏ సీరియల్ చూసినా సరే, ప్రధాన పాత్రలన్నీ కన్నడ తారలే… ప్రధాన పాత్రలే కాదు, ఓ మోస్తరు పాత్రల్లోనూ వాళ్లే… మన తెలుగువాళ్లు లేరా..? […]
ఎవరు ఆంధ్ర..? ఎవరు తెలంగాణ..? అంతా మన భ్రమ… లీడర్ల మాయ…!
Murali Buddha…….. ఆంధ్రాలో చక్రం తిప్పుతున్న తెలంగాణ నేతలు … నీది మరీ అత్యాశోయ్ … ఆంధ్రాలో తెలంగాణ నేతలు చక్రం తిప్పడమా ? ఎంత మాట..? అత్యాశకు కూడా ఓ హద్దు ఉండాలి కదా … పూర్తి ఆధారాలతోనే చెబుతున్నాను బ్రో … ప్రముఖ తెలంగాణవాదులు అందరూ ఇప్పుడు ఆంధ్రాలోనే చక్రం తిప్పుతున్నారు … 1 హైదరాబాద్ లో నేను తిరిగినన్ని గల్లీలు ఎవరూ తిరగలేదు. నేనే పక్కా హైదరాబాదీని అని కిరణ్ కుమార్ రెడ్డి […]
‘ప్రతి మనిషికీ ఆకలి వుంటుంది, ఏ ఒక్కరి ఆకలీ మరొకరి ఆకలిలా వుండదు’
Vijayakumar Koduri……….. ఏ ఒక్కరి ఆకలీ మరొకరి ఆకలిలా వుండదు… ‘ప్రతి మనిషికీ ఆకలి వుంటుంది, ఏ ఒక్కరి ఆకలీ మరొకరి ఆకలిలా వుండదు’ తన దగ్గర పని కోసం వచ్చిన కొత్త పిల్ల ‘ఓయ్’ తో అంటాడు థాయ్ ల్యాండ్ మహానగరం బ్యాంకాక్ లోని ఐదు నక్షత్రాల కిచెన్ ‘హంగర్’ చీఫ్ షెఫ్ ‘పాల్’. ‘ఒక మనిషి తినే తిండిని బట్టి సమాజంలో ఆ మనిషి స్థాయి ఏమిటో చెప్పొచ్చు’ అని నమ్మే మనిషి ఈ […]
పోరగాళ్లతో ఎక్స్కర్షన్… నలుగురు సముద్రం దగ్గర మిస్సింగ్… ఇగ చూడు నా పరేషాన్…
పాఠశాల విద్యను మించిన మధురమైన కాలం మరోటిలేదు. తెలిసీ తెలియని వయసు, చిల్లర చేస్టలు, సార్ల భయం.. అన్నిటి కలబోత.. సాధారణంగా బడుల్లో excursion నిర్వహిస్తుంటారు. ప్రతి పిల్లవాడు వెళ్ళాలనుకుంటాడు. ప్రతివాడు నూటొక్క కలలు కంటుంటాడు. నిర్వహించే సార్లకు ప్రాణాంతకం. ప్రతి పిల్లవాడు తిరిగి ఇంటికి చేరేంత వరకు వీళ్ళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటారు. పిల్లలు ఇంట్లో చేసిన అప్పాలు తెచ్చుకుంటారు. కొన్ని కొందరికి పడవు. కడుపులో గడబిడ అయితే కొద్దిసేపు ఓర్చుకొని, మరీ తట్టుకోలేని సమయంలో […]
శాకుంతలం ఎందుకు బాలేదు..? గుణశేఖర్ కూడా చదవాల్సిన పర్ఫెక్ట్ రివ్యూ..!!
Priyadarshini Krishna……….. రాద్దాం రాద్దాం అనుకుంటూనే పనులతో తీరికలేక టైం గడిచిపోయింది…. ఇప్పటికైనా రాద్దామావద్దా అని అనుకుంటుండగా కొందరు మిత్రుల సలహా మేరకు రాయడం మొదలెట్టాను…. ఇంతకీ దేని గురించి అనేది మీకు ఈపాటికే అర్థమైయుంటుంది…. మనలో చాలామందికి ఈ కథ ఇదివరకే తెలుసు సాహిత్యాభిరుచులున్న వారికి మహాకవి కాళిదాసు రాసినది ఇంకా గుర్తుండే వుంటుంది…. ఇతిహాసాలు గానీ పురాణాలు గానీ చరిత్ర గాని తెరకెక్కించాలంటే పూర్తి రిసర్చ్ అవసరం…. లేకుంటే ప్రేక్షకుల మనోభావాలు దెబ్బతినే అవకాశాలు […]
అప్పట్లో… ఒకానొక కాలంలో… రామోజీరావుకు శిక్ష విధించిన ఆయనెవరో తెలుసా..?!
ఏమాటకామాట… ఒక్క నిజాన్ని అంగీకరించాలి… ఏపీ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా సరే మార్గదర్శి మీద జనంలో కోపం, అసహనం ఏమీ రావడం లేదు… రామోజీరావు మీద ప్రజల్లో ఉన్న విశ్వాసం అది… ఆ క్రెడిబులిటీ గట్టిగా ఉంది కాబట్టే… గతంలో మార్గదర్శి ఫైనాన్స్ మీద వైఎస్ పన్నాగాలను కూడా చూశారు కాబట్టే జగన్ చిట్‌ఫండ్స్ మీద పడితే… అదంతా రాజకీయమే అని నమ్ముతున్నారు అందరూ… వై ఓన్లీ మార్గదర్శి..? ఈ ప్రశ్నకు జగన్ ప్రభుత్వం వద్ద ఫెయిర్, […]
- « Previous Page
- 1
- …
- 246
- 247
- 248
- 249
- 250
- …
- 483
- Next Page »