కొన్ని మౌనంగా ఉండలేం… ఉండకూడదు… కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది అని ఊరుకోలేం… ఇంకెవడో మనల్ని ఎండగట్టేముందు మనమే ఆత్మవిమర్శ చేసుకోవడం బెటర్… ఇక్కడ పేర్లు రాయకుండా ఒక టీవీ చానెల్, ఒక రిపోర్టర్ అని ఏమీ తప్పించుకోవడం లేదు… టీవీ9 చిల్లర రిపోర్టింగ్ తీరు గురించే చెబుతున్నా… రేటింగ్స్‌లో ఎన్టీవీ ఫస్ట్ ప్లేసుకు వెళ్లి, అప్పటిదాకా ఆ ప్లేసును ఎంజాయ్ చేసిన టీవీ9 రెండో స్థానానికి జారిపోయినా… తప్పులు దిద్దుకుందామనే సోయి లేదు… ఉన్నత స్థానాల్లో […]
వారణాసికి పోటెత్తుతున్న భక్తులు… ఒకే ఏడాదిలో 7.35 కోట్ల మంది రాక…
స్ట్రెయిట్‌గా ఓ విషయం… హిందువులు తమ జన్మలో ఒక్కసారైనా వెళ్లాలని భావించే వారణాసికి గతంలో సగటున 30 నుంచి 40 లక్షల మంది భక్తులు వచ్చేవాళ్లు… సరిగ్గా ఒక ఏడాదిలో ఈ సంఖ్య ఎంతకు పెరిగిందో తెలుసా..? 7.35 కోట్లకు పెరిగింది..! గతంలో 14 నుంచి 15 కోట్ల మేరకు మాత్రమే విరాళాలు వచ్చేవి… ఈ ఏడాది 100 కోట్లు దాటింది… ఎందుకింత తేడా..? కాశీ విశ్వనాథుడి గుడి ఏరియాను 2700 చదరపు అడుగుల నుంచి ఏకంగా […]
జబర్దస్త్ షోలకు రేటింగ్స్ దెబ్బ… జనం వాటిని చూడటమే మానేస్తున్నారు…
నిజానికి ఈటీవీ రేటింగ్స్‌ను నిలబెడుతున్నవి ఇన్నాళ్లూ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలు… బూతుల షోలుగా ఎంత ప్రసిద్ధి పొందినా సరే, జనం చూస్తూనే ఉన్నారు… ఈటీవీ వాటిని అలాగే కొనసాగిస్తూనే ఉంది… ఆ షోలోకి కమెడియన్లు, జడ్జిలు వస్తుంటారు, పోతుంటారు… కానీ బేసిక్‌గా దాని ఫార్మాట్ మారదు… కాకపోతే ఒకప్పుడు స్కిట్‌ను స్కిట్‌గా ప్రదర్శించేవాళ్లు… ఇప్పుడు బాడీ షేమింగులు, ర్యాగింగ్ డైలాగులు ఎట్సెట్రా జోకులుగా చలామణీ అవుతున్నాయి… ఈ షోలు ఎంత నాసిరకంగా మారిపోతున్నా సరే… వేరే […]
పారసిటమాల్ గోళీలకు కూడా కటకట… యాంటీబయాటిక్స్ మందులకూ కొరత…
పార్ధసారధి పోట్లూరి….. యూరోప్ దేశాలలో యాంటీ బయటిక్స్ మందుల కొరత ! యూరోపు దేశాలలో ముఖ్యమయిన మందులు అయిన అమోక్సిసిలిన్ [amoxicillin] మరియు పారాసిట్మాల్ లాంటి నిత్యావసర ఔషధాలకి కొరత ఏర్పడింది. బ్రిటన్ మరియు ఫ్రాన్స్ దేశాలలో ప్రధానంగా అన్ని మందుల షాపులలో ఆమోక్సిసిలిన్ తో పాటు పారాసీట్మాల్ మందులకి తీవ్ర కొరత ఏర్పడింది. అయితే ఈ కొరత మిగతా యూరోపు దేశాలలో కూడా తీవ్రంగానే ఉంది కానీ ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలలో మిగతా యూరోపు దేశాలకంటే […]
ఫాఫం ఈటీవీ… బిగ్ స్టార్ రవితేజను పట్టుకొచ్చినా టీవీ రేటింగ్స్ తన్నేశాయి…
బార్క్ రేటింగ్స్ చూస్తుంటే షాక్ అనిపించింది… ఈటీవీ వాళ్లు ఢీ ఫినాలేకు రవితేజకు రప్పించారు… బోలెడు ఖర్చు పెట్టారు… హైపర్ ఆదితో రవితేజను ఇంద్రుడు చంద్రుడు అని ఓ రేంజులో పొగిడించారు… ఒక దశలో హైపర్ ఆది పొగడ్తలకు రవితేజే ఉక్కిరి బిక్కిరయ్యాడు,.. ఆ స్థాయిలో భజన సాగింది… నిజానికి అది భజన కాదు, మరో పదం ఏదైనా వెతకండి… నిజానికి ఈటీవీ బలమే రియాలిటీ షోలు… అందులో చాలా ఏళ్లుగా నడుస్తున్నది ఢీ అనే డాన్స్ […]
KCR శిబిరంలోకి రవిప్రకాష్..? BRS అవసరాల కోసం కొత్త జాతీయ చానెళ్లు..!!
మీడియా అంటే… అచ్చం రాజకీయాల తరహాలోనే..! ఎవరు ఎప్పుడు ఎవరితో అటాచ్ అయిపోతారో, ఎవరు విడిపోతారో ఎవరూ చెప్పలేరు… పక్కా డైనమిక్… ఈరోజు ఉన్న విధేయతలు, ప్రత్యర్థిత్వాలు రేప్పొద్దున ఉండకపోవచ్చు… కేసీయార్ అలా ఎంతమందిని కౌగిలించుకోలేదు..? అలా తాజాగా రవిప్రకాష్‌ను కూడా అలుముకున్నాడనేది తాజా వార్త… రవిప్రకాష్ అంటే టీవీ9.., టీవీ9 అంటే మైహోం రామేశ్వరరావు… విత్ మేఘా కృష్ణారెడ్డి… కొంతకాలంగా ఇద్దరూ కేసీయార్‌తో కటీఫ్ చెప్పుకుని, బీజేపీ ఫోల్డ్‌లో ఉన్నారని పొలిటికల్ సర్కిళ్లలో ప్రచారం… ఆఫ్టరాల్ […]
నాటి టీ కమ్మటి పరిమళం జాడేది..? గ్లాసులో చిక్కటి టీ పోస్తుంటేనే నోరూరు..!
చాయ్… చివరకు కాలగతిలో ఇదీ తన సహజ రుచిని కోల్పోయింది… రంగు వెలిసిపోతోంది… చిక్కదనం ఏనాడో పలచబడింది… కమ్మని సువాసన ముక్కుపుటాలను అదరగొట్టడం లేదు… ఎందుకో తెలియదు… పండుతున్న తేయాకులోనే ఆ నాణ్యత కొరవడిందా…? టీపొడి ప్రాసెస్ చేయడంలో ఆధునిక విధానాలు వచ్చి చెడగొట్టాయా..? . నిజానికి మార్కెట్లో టీ పౌడర్ రేట్లు మండిపోతుంటయ్… కానీ ఒకనాటి ఆ నాణ్యత, ఆ శ్రేష్టత మాత్రం కనిపించడం లేదు… ఒకనాడు బయట టీ తాగితే ఓ హుషారు… సీస […]
ఢిల్లీలో కేసీయార్ రైతుసంక్షేమ బావుటా…ఆ మోడల్ డొల్లతనంపై ఓ సర్వే రిపోర్టు…
రైతు పేరిట జాతీయ రాజకీయాల్లో దూసుకుపోదామని కేసీయార్ చెబుతున్నాడు… రైతుసంక్షేమంలో తెలంగాణ నమూనాను దేశవ్యాప్తంగా ప్రచారం చేసి, ప్రజలకు ఆదర్శంగా చూపిస్తామనీ అంటున్నాడు… బీఆర్ఎస్ ఢిల్లీ ఆఫీసు ఓపెన్ కాగానే ఫస్ట్ కిసాన్ సెల్‌నే ప్రకటించాడు… రైతుబంధు, రైతుభీమా, రైతుకు సాగుసాయం, ఉచితకరెంటు, 24 గంటల కరెంటు వంటి పథకాలను తెలంగాణ నమూనాలో చూపిస్తున్నాడు… ఐతే ఇదేరోజు రైతు స్వరాజ్యవేదిక తెలంగాణలో రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఓ సర్వే రిపోర్టు ద్వారా వెల్లడించింది… కేసీయార్ […]
జర్మనీలో రష్యా చిచ్చు..? అక్కడ పాత రాచరిక వ్యవస్థ మళ్లీ కావాలట…!!
పార్ధసారధి పోట్లూరి ………. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యూరోపులో అశాంతిని రెచ్చగొడుతున్నాడా ? జర్మనీ లో ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర ? డిసెంబర్ 7, 2022 …. జర్మనీ లోని ప్రభుత్వాన్ని కూలదోసి అధికారం చేజిక్కించుకోవాలి అనే వ్యూహంతో ఉన్న 25 మంది రైట్ వింగ్ యాక్టివిస్ట్ లని అరెస్ట్ చేశారు జర్మనీ పోలీసులు ఈ నెల 7వ తారీఖున! రైట్ వింగ్ యాక్టివిస్ట్ గ్రూపు ని ప్యాట్రియాటిక్ యూనియన్ [Patriotic Union ] [జర్మన్ […]
ఆమెకు ఇచ్చిన పెళ్లికానుక గాఢమైన సైనైడ్ ద్రావకం… ఇలాంటి పెళ్లి ఇంకోటి లేదు…
ఓ నియంత ఆఖరి రోజులు….. By… గొల్లపూడి మారుతీరావు… (మొన్న గొల్లపూడి వర్ధంతి… ఇలా స్మరించుకుందాం…) యూదుల కారణంగా మానవజాతి సర్వనాశనమౌతోందని, కొన్ని కోట్ల యూదుల దారుణమయిన చావుకి హిట్లర్ కారణమయ్యాడు. హిట్లర్ మీద 1222 పేజీల అద్భుతమైన జీవిత చరిత్రను రాసిన జాన్ టోలెండ్ పుస్తకంలో ఆఖరి రెండు వాక్యాలు. ”ఈ భూమి మీద నుంచి ఆరు మిలియన్ల యూదుల్ని నాశనం చెయ్యడం ప్రపంచానికి తాను చేసిన ఉపకారంగా హిట్లర్ భావించాడు. కాని తత్కారణంగా యూదులకి […]
కమల్ హాసన్..! రజినీకాంత్ సరే, నీకూ కన్నడత్వంతో లింకేమిటోయ్…!!
కమల్ హాసన్… జగమెరిగిన నటుడు… తన సిద్దాంతాలు, విశ్వాసాలు, వ్యాఖ్యలు, వ్యక్తిగత జీవితం గట్రా మనకు నచ్చినా నచ్చకపోయినా మంచి నటుడు… ఒకప్పటి ప్రయోగాలు మానేసినా సరే, తను చేసినన్ని ప్రయోగాలు, సాహసాలు ఏ ఇండియన్ నటుడికీ చేతకావు, కాలేదు, కావు కూడా… అయితే… తన మాటలు అప్పుడప్పుడూ చిత్రంగా, ఎవడ్రా వీడు అనేట్టుగా ఉంటయ్… అందులో ఒకటి తాజాగా… చాన్నాళ్ల తరువాత, తప్పనిసరై, రజినీకాంత్ కూడా స్పందించాడు కాబట్టి తనూ స్పందిస్తూ… కాంతారను ప్రశంసించాడు… ఆ […]
స్టాలిన్ భార్య చేసిన తప్పేముంది..? తమిళనాడు బీజేపీ బేకార్ సోషల్ రచ్చ…
తిరుమలలో వీవీఐపీ వస్తే వాడే దేవుడు… అసలు శ్రీవారిని కాసేపు వదిలేస్తారు… వీవీఐసీ ఆర్జిత సేవల్లో తరిస్తారు పూజారులు, దళారులు… జయలలిత సహా తమిళనాడులో నాయకులు దేవుళ్లు… వాళ్లు దూరం నుంచి అలా వెళ్తుంటే ఇక్కడ సాష్టాంగపడి దండాలు పెడతారు… ఫ్యాన్స్‌కు హీరోలు దేవుళ్లు… వాళ్లకోసం బతుకుల్నే నాశనం చేసుకుంటారు… ఇలా దేవుళ్లంటే విగ్రహాలే కాదు, మనుషులే దేవుళ్లు… స్వార్థమే ఆధ్యాత్మికత… అంతటా ఇదే కథ… ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే… తమిళనాడులో తాజాగా ఓ వివాదం… ముఖ్యమంత్రి […]
తవాంగ్ సెక్టార్లో ఏం జరిగింది..? చైనాకు తెలిసిందే దురాక్రమణ రీతి…!!
అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో భారత, చైనా సైనికుల ఘర్షణ పేరుతో ఓ వీడియో బాగా వైరల్ అయిపోయింది… అది అదేనోకాదో గానీ… గల్వాన్ లోయలో ఘర్షణ, ప్రాణనష్టాల తరువాత మళ్లీ కలకలాన్ని సృష్టిస్తున్నది ఈ సంఘటన… అసలు చైనా దురాక్రమణ పద్ధతులు ఎలా ఉంటాయి..? ఏమిటి దాని వ్యూహం..? మిత్రుడు పార్ధసారధి పోట్లూరి వ్యాసం ఎప్పటిలాగే… సవివరంగా… భారత్ చైనాల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది ! గత రెండేళ్ల నుండి అనుకుంటున్నదే మూడు రోజుల క్రితం జరిగింది […]
రేవంత్ హిందీ భాషను మొదట ‘హేళన చేసింది’ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడరే…
ముందుగా ఓ చిన్న డిస్‌క్లెయిమర్…. నిర్మల సీతారామన్ మోడీ కేబినెట్లో నెంబర్ వన్ వేస్ట్,.. వేస్టున్నర… పైగా ఆర్థికశాఖ ఇవ్వడం మోడీ ఆలోచనారాహిత్యం… ఆమె అడుగులు మోడీ ప్రభుత్వ విధానాలకు అనుగుణమే అయినా, ఎక్కడా మంచి ప్రసంగం, మంచి వ్యాఖ్య, మంచి డెసిషన్, మంచి సమర్థన ఉండవు… బీజేపికి పెద్ద మైనస్… దేశప్రజలకు మైనసున్నర… నిన్న ఆమె రేవంత్ భాషను ఉద్దేశించి అవహేళనగా మాట్లాడిందనీ, ఆమెకు ఎంత అహంకారం అనీ విమర్శలు నిన్నటి నుంచీ జోరుగా వస్తున్నయ్… […]
టాప్ ఫైవ్‌లో ఎవరు ఉంటారు..? వారం మధ్యలోనే తరిమేసేది ఎవరిని..?
హమ్మయ్య… బిగ్‌బాస్ షో ముగింపుకొస్తోంది… కోర్టు ప్రత్యక్ష విచారణ దాకా పోకుండానే దానంతటదే గడువు ముగిసి, హౌజుకు తాళం పడబోతున్నది టెంపరరీగా… భ్రష్టుపట్టించబడిన ఈ సీజన్ ముగిసిపోతుందంటే చివరకు బిగ్‌బాస్ షో అభిమానులు కూడా ఆనందపడుతున్నారు… అంత చెత్త చెత్త చేశారు… కారణాల జోలికి వెళ్లాలంటే మళ్లీ పేడకుప్ప తవ్వాలి… అదో కంపు… చివరి వారంలోకి ఆరుగురు కంటెస్టెంట్లు ప్రవేశించారు… కానీ ఫైనలిస్టులు అయిదుగురే కావాలి కదా… కాబట్టి బుధవారమో, గురువారమో మరొకర్ని తరిమేస్తారట హౌజు నుంచి… […]
రాజకీయాల్లేవు… బడా స్టార్ల తప్పుడు లెక్కలు, పన్ను ఎగవేత మీదే దృష్టి…
ఎక్కడో ప్రారంభించి ఎక్కడికో వెళ్లిపోయింది మైత్రి మూవీస్… సినిమా నిర్మాణం అంటేనే అనేక తప్పుడు లెక్కల దందా… జీరో అమౌంట్లు, ఆన్ రికార్డ్ పేమెంట్స్‌తో పాటు నానా బాగోతాలు… ఐటీ, జీఎస్టీ అధికారులే కాదు, చాలామంది ఉన్నతాధికారులకు ఏవేవో ఎరలు వేయాలి, పనులు సాధించుకోవాలి… అలాంటిది వీళ్లపై జీఎస్టీ, ఐటీ కలిసి దాడులు చేయడం ఏమిటి..? దీని వెనుక మర్మమేమైనా ఉందా..? అసలే ఇప్పుడు జరిగే దాడులన్నీ పొలిటికల్లీ మోటివేటెడ్ కదా… ఈ సందేహాలు రావడం సహజం… […]
అయోధ్య కట్టడమే కాదు… అంగకార్ వాట్ గుడి పునరుద్ధరణ కూడా… వివరాలివీ…
ఎవరో నోటికొచ్చింది కూసిన మాటలు కావు… విదేశాంగశాఖ మంత్రి ప్రతి మాటనూ ఆచితూచి వదులుతాడు… చైనాకు ఝలక్ అయినా సరే, పాకిస్థాన్‌కు హెచ్చరిక అయినా సరే… అంతెందుకు, అమెరికాకు కూడా వాతలు పెడుతున్నాడు ఈమధ్య… తను ఒక మాట అన్నాడంటే అది మన విదేశాంగ నీతికి సంబంధించి ఫైనల్… దటీజ్ జైశంకర్… నిన్న ఎక్కడో మాట్లాడుతూ ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని వెల్లడించాడు… రాజకీయ సొల్లు వార్తల్లో తడిసి ముద్దయి, పునీతమయ్యే మన మెయిన్ స్ట్రీమ్‌కు పెద్దగా పట్టలేదు… […]
బేశరం దీపిక పడుకోన్… అగ్లీ మూమెంట్స్, డర్టీ డ్రెస్సింగులతో ఓ రోత పాట…
ఈ సంవత్సరం మొదట్లో… గెహరాయియా అని ఓ సినిమా… అందులో దీపిక పడుకోన్ కథానాయిక… ఆమె సెంట్రిక్‌గానే కథ… సహనటుడు సిద్ధాంత్‌తో ఇంటిమేట్ సీన్లలో రెచ్చిపోయిన తీరు చూసి ఆమె అభిమానులే నిర్ఘాంతపోయారు… నిజానికి కథకు కూడా అంత ఎక్స్పోజింగ్, ఆ ఇనార్గానిక్ కెమిస్ట్రీ రోతగా అనిపించింది… దానికి అసలే బూతు దర్శకుడు కరణ్ జోహార్ … థియేటర్లలో వీలుగాక అమెజాన్‌లో రిలీజ్ చేశాడు… ఓ పది శాతం బాడీని కవర్ చేసే రెండు పేలికలు… మిగతాదంతా బరిబాతలే… […]
కాంతార సీక్వెల్‌కు ఈయన పర్మిషన్ దేనికి..? అదీ దేవుడు చెప్పడమేంటి..?!
కన్నడ మీడియాలో కనిపించిన ఓ వార్త… ఆసక్తికరంగా అనిపించింది… ఆశ్చర్యం కూడా కలిగింది… తుళు ప్రాంత కల్చర్‌లో భూతకోల గురించి పదే పదే చెప్పుకుంటున్నాం కదా… కాంతారలో కనిపించిన గ్రామీణ నర్తనార్చన అదే… అందులో పంజుర్లి, గుళిగ దేవుళ్ల గురించి కూడా తెలుసుకున్నాం… ఇలా దేవుళ్లు ఆవహించే నాట్యకారులను దైవ నర్తకులు అంటుంటారు… కాంతార సీక్వెల్ తీయడానికి ఆ దేవుళ్ల అనుమతి కోరుతూ, ఆశీస్సులు కోరుతూ మంగుళూరు శివారులోని కద్రి మంజునాథేశ్వర గుడిలో జరిగిన ఓ భూతకోల […]
తడ్కా… ప్రకాష్‌రాజ్ వండిన ఆ పాత వంటకమే… ఉలవచారు బిర్యానీ..!!
Sunitha Ratnakaram…… ప్రకాష్ రాజ్ ఈ సినిమాని తెలుగూ, తమిళమూ, కన్నడ భాషల్లో 2014 లో తీసాడు, 2011 మలయాళం సినిమా ‘సాల్ట్ ఎన్ పెప్పర్’ ఆధారంగా… కన్నడంలో తప్ప అన్నిచోట్లా బానే తన్నేసిందట. అయినా 2016 లో హిందీలో మొదలెట్టాడు. రకరకాల కష్టాలు దాటుకుని ఇప్పుడు ఈ 2022లో ‘జీ5’ ద్వారా ఎట్టకేలకు విడుదలైంది. ఇవేమీ తెలీకుండానే నానా పాటేకర్ కనపడుతున్నాడని చూడటం మొదలుపెట్టా ఓ రెండు మూడు వారాల ముందు… కాసేపటికి శ్రేయా కనిపించి […]
- « Previous Page
- 1
- …
- 264
- 265
- 266
- 267
- 268
- …
- 458
- Next Page »