కాంతార కేసులో ఓ ట్విస్టు… వరాహరూపం పాట కేసు తెలుసు కదా… అది మా ప్రైవేటు ఆల్బం నుంచి కాపీ చేశారని మలయాళ మ్యూజిక్ కంపెనీ థైకుడం బ్రిడ్జి కాంతార నిర్మాతలపై కేసు వేసింది… అది ఆ పాట వాడకుండా స్టే విధించింది… కాంతార నిర్మాతలు హైకోర్టుకు వెళ్లినా సరే మొన్ననే కదా హైకోర్టు కొట్టేసింది… దాంతో విధిలేక మరో ప్రత్యామ్నాయ ట్యూన్లో అదే కంటెంటును ఓటీటీ వెర్షన్లో పెట్టారు… ఒరిజినల్ తొలగించారు… సదరు థైకుడం బ్రిడ్జి […]
న్యూటన్ సినిమా చూసినట్టే ఉంది డైరెట్రూ… ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం
సినిమా ప్రియులకు గుర్తుండే ఉంటుంది… అయిదేళ్ల క్రితం హిందీలో న్యూటన్ అనే సినిమా వచ్చింది… అప్పట్లో సూపర్ హిట్… 9, 10 కోట్ల ఖర్చుకు గాను 80 కోట్లు వసూలు చేసింది.,.. అప్పట్లో ఈ పాన్ ఇండియా కల్చర్ ఇంతగా ఇంకలేదు కదా… వదిలేశారు… కానీ దర్శకుడు ఏఆర్మోహన్ ఆ సినిమాలోని వోటింగ్ మెషిన్, టీచర్ ఎట్సెట్రా పార్ట్‌ను ఎత్తేసి, ఇక తనదైన కథను చుట్టూ అల్లుకున్నాడు… ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే పేరుతో తెలుగులో రిలీజైంది […]
వాటీజ్ దిస్ థమన్… మీరే పాడాలా..? మీరే రాయాలా..? మీరే ఎగరాలా..?
ప్రస్తుతం తెలుగులో టాప్ వన్, టూ మ్యూజిక్ కంపోజర్లు థమన్, డీఎస్పీ… సంగీతానికి తోడు ఇద్దరూ కొన్ని వేషాలు వేస్తుంటారు… ఇప్పుడు బలంగా పోటీపడబోయే రెండు సినిమాలకు వాళ్లే ప్రధానంగా తలపడబోతున్నారు… ఒకటి చిరంజీవి వాల్తేరు వీరయ్య… దానికి డీఎస్పీ కంపోజర్… రెండోది వీరసింహారెడ్డి… దానికి కంపోజర్ థమన్… మొన్న వాల్తేరు వీరయ్య సాంగ్ రిలీజ్ చేశాడు డీఎస్పీ… మెగాస్టార్ ఫ్యాన్స్‌కే అది పెద్దగా నచ్చలేదు… సాదాసీదా ట్యూన్ చిరంజీవికి ఎలా సూట్ అవుతుంది… అసలు చిరంజీవి […]
ఈ కొత్త ఆర్మీ చీఫ్… ఖతర్నాక్ ఇండియన్ ఎనిమీ… పాకిస్థాన్‌కు మరో అజిత్ ధోవల్…
పోస్టుల పేర్లు వేరు… చేసిన కొలువుల హోదాలు వేర్వేరు… వర్తమాన హోదాలు వేర్వేరు… కానీ పాకిస్థానీ కొత్త ఆర్మీ చీఫ్ సయ్యద్ ఆసిం మునీర్ ఆ దేశానికి ఓ అజిత్ ధోవల్… రెండు దేశాల సైనిక, రక్షణ విధానాలకు సంబంధించి వాళ్లిద్దరి గ్రిప్ తిరుగులేనిది… 29న పదవీ విరమణ చేయబోతున్న ఆర్మీ చీఫ్ బజ్వా ఒకందుకు కొంత సాఫ్ట్… ఆర్మీని రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడం వంటి విషయాల్లోనూ పెద్దగా కంట్రవర్సీల్లోకి పోలేదు… ఇండియా పట్ల విపరీతమైన […]
పెద్ద స్క్రీన్, త్రీడీలో చూడగలిగితే ‘తోడేలు’ గ్రాఫిక్స్ బాగుంటయ్…
మళ్లీ అక్కడికే వస్తున్నాం… గ్రాఫిక్స్ లేక ఇక ఇండియన్ సినిమా ఏదీ రాదా..? మరో అదనపు ప్రశ్న ఉండనే ఉంది… అసలు గ్రాఫిక్స్ పేరిట చూపించబడుతున్న వందల కోట్లు ఏమవుతున్నయ్..? ఎందుకంటే..? తెలుగులో తోడేలు సినిమా రిలీజైంది… ఇది వరుణ్ ధావన్ తీసిన భేడియా సినిమా… డబ్ చేశారు, తెలుగులో వదిలారు… తప్పేమీ లేదు, ఇప్పుడన్నీ పాన్ ఇండియా సినిమాలే కదా… నిజం చెప్పాలంటే ఇన్నేళ్లూ ఏదో సాదాసీదా పాత్రలతో టైంపాస్ కెరీర్ రన్ చేసిన వరుణ్ […]
ప్రభాస్ రైలు మళ్లీ పట్టాలెక్కింది… తనతో కనీసం 3 వేల కోట్ల భారీ జూదం…
ప్రభాస్ రైలు మళ్లీ పట్టాలెక్కింది… మారుతి దర్శకత్వం వహిస్తున్న సినిమా నిశ్శబ్దంగా, వేగంగా సాగిపోతుందట… తప్పదు… కాకపోతే రాజడీలక్స్ అని టెంపరరీగా టైటిల్ పెట్టుకున్న ఈ హారర్ కామెడీ సినిమాకు కూడా భారీ గ్రాఫిక్స్ అట… భారీ ఖర్చు అట… ప్రభాస్‌కు ఇంకా ఆదిపురుష్ దెబ్బ సరిపోయినట్టు లేదు… అది మరీ 600 కోట్ల దెబ్బ… మారుతితో సినిమా ఎప్పటి నుంచో అనుకుంటున్నదే… కానీ రాధేశ్యామ్ ఫ్లాప్ తరువాత, కృష్ణంరాజు మరణం, ప్రభాస్ అనారోగ్యం, కొన్నాళ్లు అసలు […]
తెలుగు తెరపై తొలి ‘సింహం’ ఎన్టీయారే… తరువాత పులులూ పుట్టుకొచ్చినయ్…
Bharadwaja Rangavajhala…………. టైటిళ్లలోకి సింహాలొచ్చిన వేళ … సింహాలకు జూలుండును అన్నాడు శ్రీశ్రీ … కానీ సింహాలకు సినిమాలుండును అని అనాల్సిన పరిస్థితి … తెలుగు సినిమా టైటిల్స్ లోకి పులులు సింహాలు వచ్చి చేరిన సందర్భం గురించి చిన్న పరిశోధన చేద్దామనిపించింది. నిజానికి ఈ టాపిక్కును నాకిచ్చిన వ్యక్తి వేణుగోపాల్. తెలుగు సినిమా అనే కాదు భారతదేశంలో చాలా భాషల్లో తొలి నాటి చిత్రాలు పౌరాణికాలే. అలాగే తెలుగులో కూడా తొలి చిత్రాలు అన్నీ పౌరాణికాలే. భక్త […]
బాలమురళి పాయె బాలు వచ్చె ఢాంఢాం… శంకరాభరణం చేజారిందిలా…
Bharadwaja Rangavajhala……… నాలుగు కాలాలపాటు అన్ని పరీక్షలకూ తట్టుకుని నిలబడగలిగేదే శాస్త్రీయ సంగీతం. అందులో కొంత లలిత సంగీతమూ ఉండవచ్చు. అది దశాబ్దకాలం జనం మనసుల్లో నిలవగలిగిందీ అంటే అదీ శాస్త్రీయ సంగీతమే. జనం మనసుల్లో నిలవనిది శాస్త్రీయ సంగీతమే అయినా దాన్ని అంగీకరించను. ఇవి బాలమురళి అభిప్రాయాలు. విశ్వనాథ్ తీసిన సినిమాల్లో సంగీత పరంగా శంకరాభరణం కన్నా శృతిలయలు తనకు నచ్చిన చిత్రమంటారు బాలమురళి. నటుడుగా భక్తప్రహ్లాదలో నారద పాత్ర ధరించారు. అది అందరికీ తెల్సిన విషయమే. […]
ఈసారి బిగ్‌బాస్‌లో ఇదొక్కటే కదిలించేది… కీర్తి కోసం వచ్చిన ఆదీ నచ్చావురా…
ఒక్కటి… ఒక్కరోజైనా సరే, ఈసారి బిగ్‌బాస్ సీజన్ ప్రేక్షకులకు నచ్చలేదు… టాస్కులు, ఎలిమినేషన్లు, సర్ప్రయిజులు, కంటెస్టెంట్ల ఎంపిక, గేమ్స్, శిక్షలు, సీక్రెట్ రూమ్స్, లేటరల్ ఎంట్రీలు, జోక్స్, డ్రామాలు, లవ్ ట్రాకులు… ఏ విషయమైనా సరే… ఈ సీజన్ బిగ్‌బాస్ చరిత్రలోనే పరమచెత్త… ఏ భాషలోని బిగ్‌బాస్ రేటింగ్స్ తీసుకున్నా సరే, ఈసారి బిగ్‌బాస్ సీజన్ సాధిస్తున్న దరిద్రపు బిచ్చపు రేటింగ్స్ ఇంకే భాషలోనూ లేనట్టున్నాయి… దాని గురించి పదే పదే చెప్పుకోవడం కూడా వేస్టే… ఒక్కటి […]
వరాహరూపం తొలగింపు… కొత్త పాటపై పెదవి విరుపు… ప్రాణం తీసేశారు…
మొన్న మనం ‘ముచ్చట’లో చెప్పుకున్నదే… 400 కోట్ల మార్క్ కోసం కాదు, కాంతార ఓటీటీ ప్రసారం ఆగిపోయింది… వరాహరూపం పాట కోసమే ఆగింది… అది సెటిల్ చేసేవరకు ప్రసారం చేయను అని అమెజాన్ వాడు భీష్మించాడు… డబ్బులు ఇవ్వలేదు… అదీ సంగతి… అదే నిజం… ఇప్పుడు ఆ పాటను తీసేశారు… అదే కంటెంటుతో ఏదో కొత్త పాట కంపోజ్ చేయించి పెట్టారు… అప్పుడు గానీ అమెజాన్ వాడు ప్రసారానికి సై అనలేదు… కాకపోతే ఈ కొత్తపాట మరీ […]
రష్మిక గాలి తీసేసిన రిషబ్… ఆమెలో రగులుతూనే ఉన్న ‘పెళ్లి రద్దు’ కోపం…
గ్లామర్ ప్రపంచంలో కలవడాలు, విడిపోవడాలు పెద్ద విశేషమేమీ కాదు… లివ్ ఇన్ రిలేషన్స్, పెళ్లిళ్లు, పెటాకులు, బ్రేకప్పులు నడుస్తూనే ఉంటయ్… నాలుగైదు పెళ్లిళ్లు చేసుకున్నవాళ్లు కూడా ఉన్నారు… అంతెందుకు, నీనా గుప్తా అయితే వెస్టిండీస్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్‌తో ఓ అమ్మాయిని కని, సింగిల్ మదర్‌గా ఉంటోంది… బోలెడు ఎక్స్ట్రీమ్ కేసులుంటయ్… సుస్మితాసేన్ తనకన్నా చాలా చిన్నవాడు రోహమన్తో కలిసి బతికింది, వదిలేసింది, మళ్లీ ఇప్పుడు పిలుస్తోంది… బ్రేకప్పుల తరువాత కూడా కనిపిస్తే పలకరించుకుంటారు, అవసరమైతే కలిసి […]
రా రా అంటే… అదొక అద్భుతమైన కాక్టెయిల్… ఓ డిఫరెంట్ కిక్కు…
Taadi Prakash…… రారా.. ఒక ఉత్తేజం…. నవంబర్ 24 , కడపలో రా.రా. శతజయంతి సభ జరుగుతున్న సందర్భంగా … ‘రాచమల్లు రామచంద్రారెడ్డి (రారా) గదాఘాతం నుంచి తప్పించుకున్నది బహుశా నేనొక్కడినే’ అన్నారొకసారి సాక్షాత్తూ పుట్టపర్తి నారాయణాచార్యులవారు. ఏ కొమ్ములు తిరిగిన విమర్శకుడికైనా ఇంతకంటే గొప్ప ప్రశంస ఏముంటుంది? సన్నిహిత మిత్రులైన కేతు విశ్వనాథరెడ్డి, వైసివి రెడ్డి, గజ్జెల మల్లారెడ్డి, సొదుం జయరామ్‌ల అవ్యాజ ప్రేమని పొందడం సరే, శ్రీశ్రీ, ఆరుద్ర, కొడవటిగంటి, జ్వాలాముఖి లాంటి సాహితీవేత్తల […]
సిధ్ శ్రీరాంకు గంగాధరుడి స్ట్రాంగ్ జవాబు… అనంత శ్రీరాముడు ఏమంటాడో…!?
ఉల్టె, కళ్టి, నిల్టా, మళ్ట… ఏమిటిదంతా అనుకుంటున్నారా..? తెలుగు పాటను, భాషను ఖూనీ చేస్తున్న సిధ్ శ్రీరాం అనే గాయకుడు, స్వరజ్ఞానం ఏమీ లేకపోయినా వెనకేసుకొచ్చే అనంత శ్రీరాంపైన సీనియర్ జర్నలిస్టు ధాత్రి మధు పెట్టిన వీడియో ఆమధ్య వైరల్ అయ్యింది తెలుసు కదా… అందులో విషయం ఏమిటంటే… అంటే బదులు అల్టే, ఉంటే బదులు ఉల్టే, కంటి బదులు కళ్టి, మంట బదులు మళ్ట అని ఉచ్చరిస్తాడు… కర్ణకఠోరం… ఇనుపగుగ్గిళ్లు… పాట హైపిచ్‌లో ఉన్నప్పుడు ఉంటే […]
పాకిస్థానీలందరూ ఉగ్రవాదులు కాదు.., ఇండియా మీద రగిలిపోతూ ఉండరు…
పాకిస్థాన్ అనగానే మనకు ఓ భయం… అక్కడ ఉగ్రవాదులు తుపాకులు ధరించి బజారుల్లో తిరుగుతారని… ప్రజలందరూ జేబుల్లో గ్రెనేడ్లు పోసుకుని సంచరిస్తుంటారని… మందుపాతర్లు మామూలేనని… భయం, బీభత్సం, క్రూరత్వం రాజ్యమేలుతుంటాయని…! నిజంగానే అది ఉగ్రవాద దేశం… ఉగ్రవాదులకు పుట్టిల్లు… ఎక్కడెక్కడి ఉగ్రవాదులకూ అది అడ్డా… అక్కడి రాజకీయాధికారం ఉగ్రవాదంతో ఆడుకుంటుంది… కానీ ప్రజలందరూ అదేనా..? కాదు… ఏ దేశంలోనైనా ప్రజల ప్రజలే… మనుషులే… ప్రభుత్వాలు వాళ్లను ప్రభావితం చేస్తుంటాయి గానీ ఎవరిలోనైనా పారేది అదే మనిషి నెత్తురు… […]
మళ్లీ ఆ శేషన్ దిగివచ్చినా… ఆ టెంపర్ చూపించలేడు… ఎందుకో తెలుసా..?
అప్పట్లో మన ఎన్నికల వ్యవస్థను పరుగులు పెట్టించి, ఎన్నికల నిర్వహణకు కొత్త దిశను నిర్దేశించిన TN శేషన్ మీద సుప్రీంకోర్టు కూడా నిన్న ఓ కేసు విచారణలో ప్రశంసలు కురిపించింది… అలా ‘జీహుజూర్’ అనకుండా ఉండే ‘నిజమైన స్వయంప్రతిపత్తి’ కలిగిన ప్రధాన ఎన్నికల అధికారుల్ని నియమించుకోలేమా అని కేంద్రాన్ని ప్రశ్నించింది… అవసరమైతే ప్రధాని మీద కూడా చర్యలు తీసుకునే వ్యవస్థ అవసరమనీ అభిప్రాయపడింది… తమకు ఇష్టమైన రిటైర్డ్ బ్యూరోక్రాట్లను ప్రభుత్వం నియమించుకోవడం గాకుండా, జుడిషియరీలోని కొలీజియం సిస్టం […]
బన్నీకేమో ఆల్‌టైమ్ హిట్ ట్యూన్స్… మెగాస్టార్‌కు ఈ సాదాసీదా ట్యూన్లా..?!
వాటీజ్ దిస్ డీఎస్పీ సాబ్..? బన్నీ కూడా మెగా ఫ్యామిలీయే… మెగాస్టార్ దాని బాస్… కానీ నువ్వే పుష్పకు ఆల్‌టైమ్ హిట్ ట్యూన్స్ ఇచ్చావు… దుమ్ము రేగ్గొట్టావు… దాక్కో దాక్కో మేక, ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా, శ్రీవల్లీ, సామీ సామీ, ఊ అంటావా ఊఊ ఉంటావా… ఒక్కొక్కటీ ఇరగదీశాయి… అసలు పుష్ప హిట్ కావడానికి పాటల ట్యూన్లు కూడా ఓ కారణమే… ఒక్కో భాషలో ఒక్కొక్కరితో పాడించావు… వెరసి పుష్ప పాన్ ఇండియా సూపర్ […]
పగతో ఓ ఆత్మ పునర్జన్మ… మళ్లీ మనిషి రూపంలో రాకడ… మీకు ఓ దండంరా భయ్…
అవును, టీవీ సీరియళ్ల గురించి కదా మనం అప్పుడప్పుడూ చెప్పుకుంటున్నది… ఏ సీరియల్ చూసినా ఏమున్నది గర్వకారణం… వేల అవలక్షణ భరితం… దుర్గంధపూరితం… కానీ అవి లేక టీవీలు లేవు, టీవీలు లేక వినోదం లేదు, వినోదం లేక జీవితం లేదు… ఇదంతా ఓ పిచ్చి సర్కిల్… వేల కోట్ల యాడ్స్ డబ్బు… మన జేబుల్లో నుంచి కాజేసేదే… అందుకని అప్పుడప్పుడూ మాట్లాడుకోవాలి… ఈ సీరియళ్లు జీడిపాకం బాపతు కదా… ఏళ్ల తరబడీ, వేల ఎపిసోడ్లు సాగుతూ […]
అర్ధరాత్రి నుంచే అమెజాన్‌లో కాంతార… వరాహరూపం పాట ఉంటుందా..?!
అన్ని రకాల ఊహాగానాలకు అమెజాన్ ప్రైమ్ వాడే తెరవేశాడు… ఈరోజు అర్ధరాత్రి నుంచే… అంటే 24వ తేదీ నుంచి ప్రైమ్‌లో మలయాళం, తమిళం, తెలుగు, కన్నడం భాషల్లో ఈ సినిమా ప్రసారం అవుతుంది… హిందీ మాత్రం ఎందుకో ఆపినట్టున్నారు… మొదట్లో నవంబరు 11 అన్నారు, తరువాత 18 అన్నారు… దాన్నీ వాయిదా వేశారు… 24, 28… కాదు, డిసెంబరు ఫస్ట్ వీక్… ఇలా రకరకాల ఊహాగానాలు… ఎందుకంటే..? కారణం ఎవరూ చెప్పరు… నిజానికి 400 కోట్ల వసూళ్ల […]
వ్యాపార కోణంలో అవతార్-2 సినిమా చరిత్రలోనే అత్యంత చెత్త ప్రాజెక్టు..!!
దిక్కుమాలిన ఆదిపురుష్ 600 కోట్ల గ్రాఫిక్స్కన్నా… జస్ట్, 15 కోట్లతో తీసే హనుమాన్ గ్రాఫిక్స్ ఎంత సూపర్‌గా ఉన్నాయో చెప్పుకున్నాం కదా… ఆ తప్పుడు లెక్కల దందా వెనుక మర్మమేమిటో, కుతంత్రాలు, మోసాల మాటేమిటో అర్థం కాదు… కానీ భారీ గ్రాఫిక్స్ సినిమా, వందల కోట్ల సినిమా అంటేనే ఓ స్కామ్ అనిపిస్తోంది… బాహుబలి, ఈగ దగ్గర నుంచీ అంతే… ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర, పొన్నియిన్ సెల్వన్… ఏది చూసినా వందల కోట్లు… కాంతార, హనుమాన్ అత్యంత కారు […]
మంగ్లి పోస్టుపై అంత గోప్యత దేనికి..? హేమిటో, అంతా బబ్రాజమానం భజ‘గోవిందం’…
ఎందుకుండాలి..? సింగర్ మంగ్లిని వెంకటేశ్వర భక్తి చానెల్ సలహాదారుగా నియమిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన పనేమీ లేదు… తెలిస్తే అభినందిస్తారు… కాకపోతే తనపై ఏ వివాదం తలెత్తినా నేను తెలంగాణతనాన్ని ఓన్ చేసుకున్నానంటుంది కదా, ఏపీ ప్రభుత్వ పదవి ఏమిటనే చిన్న షాక్ చాలామందిలో… నిజానికి ఆ ఆశ్చర్యమూ అక్కర్లేదు… పోస్టులు కట్టబెట్టడానికి జగన్‌కు ఏపీవాళ్లే కావాలని ఏమీ లేదు… వందల మంది సలహాదారులను ఆయన నియమిస్తూనే ఉంటాడు… అద్భుతమైన దాతృత్వం… అసలు ‘ఏపీ ప్రభుత్వ సలహాదారులు’ […]
- « Previous Page
- 1
- …
- 270
- 271
- 272
- 273
- 274
- …
- 458
- Next Page »