గుడ్… రష్మిక మంధాన రెండుమూడు రోజుల నుంచీ ఉడికిపోతున్న సంగతి తెలుసు కదా… తనను ట్రోలర్స్ ఆడుకుంటున్నారు… ‘‘ఛిఛీ, ఈ ట్రోలర్లు, నెటిజెన్స్ నన్ను నా కెరీర్ మొదటి నుంచీ వదలడం లేదు, విషం చిమ్ముతున్నారు అకారణంగా… ఎందుకో మరి..? నాకు సంబంధం లేని వివాదాల్లోకి లాగుతున్నారు… నేను అనని మాటల్ని అన్నట్టు రాసేస్తున్నారు… చివరకు నేనేదో కాంటెక్స్ట్లో చెబితే వాటికీ వక్రబాష్యాలు చెబుతూ దాడి చేస్తున్నారు… పట్టించుకోలేదు, మంచి విమర్శ అయితే సరే, నాకూ మంచిదే, […]
డౌన్ టు ఎర్త్… ప్రథమ పౌరురాలు అయితేనేం నిఖార్సయిన భక్తురాలు…
కొన్ని వార్తలు చదువుతుంటే… పాఠకులతో షేర్ చేసుకుంటే హృద్యంగా ఉంటాయి… మన ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్లు చూపించే ‘అతి వేషాలు’, ప్రత్యేకించి వాళ్లు పొందే ప్రొటోకాల్ మర్యాదలు… చివరకు దేవుళ్ల దగ్గరకు వెళ్లినప్పుడు సైతం తామే ఉన్నతులమనే పిచ్చి ధోరణులు వాళ్ల పట్ల ద్వేషాన్ని తప్ప అభిమానాన్ని పెంచవు, పెంచలేవు… మన తిరుమలకు ఏ వీవీఐపీ వచ్చినా సరే, పత్రికల్లో వార్తలు, ఫోటోలు… మహాద్వారం గుండా ప్రవేశాలు, ప్రత్యేక ఆశీర్వాదాలు, ప్రత్యేక వసతులు, ప్రధానార్చకులు సహా అందరి […]
డామిట్… పాత్రికేయం సిగ్గుపడే ఒకే వార్త ఆ రెండు పత్రికల్లో ఒకేతరహాలో…
ఇంత దుర్మార్గమైన ఫోటో వార్తను ఈమధ్యకాలంలో చూళ్లేదు… జగన్ వ్యతిరేక క్యాంపెయిన్‌లో, చంద్రబాబుకు పనికొచ్చే ప్రచారాల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి అన్నిరకాల ప్రమాణాల్ని, బట్టలనూ విడిచేసుకుని బజారులో నర్తిస్తాయనేది అందరికీ తెలిసిందే… ఈ విషయంలో రామోజీరావు ఓ లక్ష డాక్టరేట్లు, రాధాకృష్ణకు లక్షన్నర డాక్టరేట్లను ఇచ్చేయొచ్చు… కనీసం వేమన యూనివర్శిటీ డాక్టరేట్లయినా సరే… అవును, అవును… ఆ వేమన యూనివర్శిటీ గురించే చెప్పుకునేది… పొద్దునే రెండు పత్రికల్లోనూ ఒకే తరహా వార్త వచ్చింది ఆ యూనివర్శిటీ మాద… ఫోటోల్ని, […]
రష్మిక బాగా హర్టయింది… ఓరి దేవుడా, దానికీ కాంతార సినిమాయే కారణం…
చాలా బాధపడిపోయింది రష్మిక మంథన… ఇన్‌స్టాలో అంత పెద్ద నోట్ పెట్టి, మరీ మథనపడిపోతుందని ఎవరూ అనుకోలేదు… నా లైఫ్, నా కెరీర్ పాడుగాను, ఫస్ట్ నుంచీ ఇంతే, నెటిజన్లు ఎవరూ సహించరు, దారుణమైన ట్రోలింగుతో ద్వేషాన్నే చూపిస్తున్నారు అన్నట్టుగా రాసుకొచ్చింది తన నోట్లో… ఆమెకు అకస్మాత్తుగా ఈ ట్రోలర్స్ మీద ఇంత కోపం ఎందుకొచ్చింది..? దీనికీ కాంతార సినిమాయే కారణం… నిజం… అందరికీ తెలుసు కదా… కాంతార దర్శకుడు రిషబ్ శెట్టి, రాజ్.బి.శెట్టి, రక్షిత్‌శెట్టి తదితరులు […]
ఎక్కువ పెళ్లిళ్లు ఎందుకు పెటాకులవుతున్నయ్…? ఎవరికీ పట్టదేం..?!
Amarnath Vasireddy….. పెళ్లిళ్లు ఎందుకు పెటాకులవుతున్నాయి ? మనస్పర్థలు .. బ్రేక్ అప్ .. డివోర్స్ .. ఇటీవల బాగా వినిపిస్తోన్న మాటలు !గతం తో పోలిస్తే విడిపోయే దంపతుల సంఖ్య బాగా పెరిగిందనేది నిర్వివాదాంశం ! ఎందుకిలా ? గతం లో పెళ్లిళ్లు నిలబడ్డాయంటే … కాపురాలు సాగాయంటే… అది మహిళల త్యాగాల పునాదుల పైనే అని ఒక అభిప్రాయముంది . సరైన అభిప్రాయమేనా ? స్వీపెంగ్ కన్‌క్లూజన్ అనొచ్చు . కానీ నిజం లేక […]
ఓ మెచ్యూర్డ్ ఇంటర్వ్యూ… ఫైటర్ సమంతకు, ఆ సుమకు అభినందనలు…
ఎస్… నిజమే… యూట్యూబ్ చానెళ్ల ఇంటర్వ్యూలు ఓ పెద్ద దరిద్రం… అవి పర్సులో యాలకులు బాపతు చెత్తా ప్రచారాలకు బెటర్… ఎవడికీ భాష రాదు.., ఏదో థంబ్ నెయిల్, ఏదో కంటెంటు… జర్నలిజం బేసిక్స్ తెలియవు, స్టాండర్డ్స్ ఉండవు… అన్నింటికీ మించి సంస్కారం, హుందాతనం వంటి పదాలు తెలుగులో ఉన్నాయనేదే వాళ్లకు తెలియదు… అఫ్కోర్స్ అవన్నీ పాటిస్తే వ్యూస్ ఉండవు, రెవిన్యూ ఉండదు… ఈ దుర్గంధం నడుమ సీనియర్ యాంకర్ సుమ యశోద హీరోయిన్ సమంతతో చేసిన […]
600 కోట్లతో ‘‘ముంచేసినట్టే’’… గ్రాఫిక్స్ కాదు, చేయాల్సింది కంటెంటు రిపేర్లు…!
అందరూ ఆదిపురుష్ సినిమా ఆరు నెలలు వాయిదా పడింది… మరో 100 కోట్లు బొక్క అని రాసేస్తున్నారు… సినిమాకు గ్రాఫిక్ రిపేర్లు చేయించాలని చెబుతున్నారు… కానీ నిజానికి చెప్పాల్సింది అది కాదు… గ్రాఫిక్స్ కాదు, అసలు కంటెంటుకే రిపేర్లు అవసరం… ఇప్పుడున్న స్థితిలో ఆదిపురుష్ గనుక రిలీజ్ చేస్తే దర్శకుడు ఓం రౌత్‌ను ఎక్కడైనా కట్టేసి కొడతారేమో… అసలు ఇలాంటి పిచ్చోడిని పట్టుకుని టీ-సీరీస్ వాళ్లు 500 కోట్ల బడ్జెట్ పెట్టడం ఏమిటి..? ప్రభాస్ గుడ్డిగా, అసలు […]
హైపర్ ఆది ఔట్… సుడిగాలి సుధీర్ ఇన్… అదీ రష్మికి జంట యాంకర్‌గా…
హైపర్ ఆది లేకుండా… తన ర్యాగింగు డైలాగులు లేకుండా… ఈటీవీలో ఒక కామెడీ ఎపిసోడ్ వస్తే బాగుండు, చూస్తే బాగుండు అనిపించిందా ఎప్పుడైనా…? పోనీ, మళ్లీ ఈటీవీ ప్రోగ్రాంలో సుడిగాలి సుధీర్ యాంకరింగ్ చేస్తే చూడాలని ఉందా..? అదీ తన జాన్ జిగ్రీ రష్మితో కలిసి జంటగా…! జరిగింది… రాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలో హైపర్ ఆది కనిపించడం లేదు… సుధీర్, రష్మి కలిసి యాంకరింగ్ చేస్తున్నారు… వాళ్ల డాన్స్ బిట్ కూడా ఉంటే సూపర్ […]
“కాంతారా … ఓ ముంతకల్లు రివ్యూ… తలంతా దిమ్ముగా అయిపోయింది…
“కాంతారా … ఓ ముంతకల్లు” ……. డాక్టర్ మనోహర్ కోటకొండ……. ———————————– తలంతా దిమ్ముగా అయిపోయింది రెండు గంటలసేపు ఎవరితో ఏమీ మాట్లాడకుండా అలా ఒంటరిగా ఉండిపోయా. రాత్రి రెండవ ఆట కావడంతో ఆ నిశి ఒంటరితనాన్ని కాపాడింది. ఏం చూసానో ఏం గ్రహించానో ఏం అనుభవించానో గ్రహింపుకు రాని సందిగ్ధం. తెలియని స్తబ్దత. ఒక్క విషయం మాత్రం అర్థమైంది . నా లోపల నాకు నేనే ఓ ఓ ఓ ఓఁ.. అంటూ ఒక కిలారింపులు […]
ఎర్ర జెండాలు దేనికి… గులాబీ జెండాలే పాతేస్తే సరి… వర్ణస్వభావం మారలేదా ఇంకా..?!
ఫస్ట్ పేజీలో… పెద్ద ఫోటో… దానికి రైటప్… ముందు నమ్మాలనిపించలేదు… ఇది పంపిన మిత్రుడినే లింక్ పంపించు గురూ అన్నాను… అరె, నిజమే… నా డౌట్లు దేనికీ అంటే… అసలే మనది రైతు అబ్బుర ప్రభుత్వం… అసలు రైతుకు సమస్య అంటేనే మన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తల్లడిల్లిపోతారు… అలాంటిది ఈ ఫోటో వార్త ఏదో తేడా అనిపించింది… నమ్మాలనిపించలేదు… మన సర్కారుకు అసలు వ్యవసాయం చేయని, పడావు భూములు, రాళ్లుగుట్టల భూముల పెద్ద పెద్ద దొరలు […]
ఇందుకేనా షోయబ్‌తో సానియా దూరం..! ఆమె పోస్టులేం చెబుతున్నాయి..?
క్రాస్ బోర్డర్ రొమాన్స్… లవ్… షాదీ… అందులోనూ హైప్రొఫైల్ క్రికెటర్ ప్లస్ టెన్నిస్ స్టార్… ఓ మంచి సినిమాకు కావల్సినంత కంటెంటు కదా మన సానియా మీర్జా, పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ కథ… పాపం శమించుగాక… ఆ పెళ్లే అంత స్పెషల్ కదా, నాలుగు రోజులు వాళ్లు కలిసే ఉండాలి అనుకుంటూనే ఉన్నాం కదా… ఆ ఇద్దరు సెలబ్రిటీలు, అదీ ప్రత్యర్థి దేశాలకు చెందిన ప్రఖ్యాత క్రీడాకారుల పెళ్లి సక్సెస్ కావాలనే కోరుకున్నాం కదా… కానీ […]
కార్తీకదీపాలు వెలిగిస్తున్నారా..? ఇది ఓసారి మనసుపెట్టి చదవండి…!
ఎవరో అడిగారు… కార్తీక పౌర్ణమికీ సోమవారానికీ… కార్తీక పౌర్ణమికీ చంద్రదర్శనానికీ… కార్తీక పౌర్ణమికీ తులసిపూజకూ… కార్తీక పౌర్ణమికీ గురుపౌర్ణమికీ… సంబంధం ఏమిటి..? పవిత్రత ఏమిటి..? సార్థకత ఏమిటి..? నిష్కర్షగా నిజం చెప్పాలంటే… పౌర్ణమికీ గురువుకూ సంబంధం లేదు… కార్తీక పౌర్ణమికీ గురుపౌర్ణమికీ సంబంధం లేదు… గురుపౌర్ణమి అనేదే లేదు… అన్నింటికీ మించి… గురువారం అనగానే సాయిబాబా గుళ్లలో విపరీతంగా క్యూలు కనిపిస్తాయి… అసలు సాయిబాబాకు గురువారానికీ సంబంధం ఏమిటి..? తను గురువెలా అయ్యాడు..? ఎప్పుడయ్యాడు..? ఎవరికి ఏం […]
ఏరోజున కార్తీక పౌర్ణమి..? రేపటి గ్రహణం ప్రభావం…? మీ ప్రశ్నలకు జవాబులు ఇదుగో..!
చాలామందిలో ఓ సందేహం బలంగానే ఉంది… కార్తీక పౌర్ణమి పండుగను సోమవారం జరుపుకోవాలా..? మంగళవారం జరుపుకోవాలా..? పురోహితులు అందరూ ఒకేరీతిలో చెప్పరు… మంగళవారం జరుపుకోవాలంటే చంద్రగ్రహణం పడుతోంది… మరెలా..? ‘ముచ్చట’ కొందరితో మాట్లాడి షేర్ చేస్తున్న వివరాలు ఇవి… కానీ ఒక్కటి మాత్రం నిజం… చంద్రగ్రహణం పాడ్యమి రోజున సంభవిస్తుంది… గ్రహణం సమయానికి పౌర్ణమి ఘడియలు వెళ్లిపోతాయి… కానీ కొన్ని సంక్లిష్టతలున్నయ్… ఏడో తారీఖు.., అనగా సోమవారం సాయంత్రం 4.16 గంటల నుంచి పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది… […]
ఈ కన్నడ బ్యాచ్ ముదుర్లు కాదు… దేశముదుర్లు… రాజదీప్కూ చుక్కలు…
‘హడ్డీ మార్ గుడ్డి దెబ్బ’… గూగుల్ చేయకండి, అర్థం దొరకదు… తెలంగాణలో పలుచోట్ల ‘ఫ్లూక్ బీటింగ్’కు లోకల్ వ్యక్తీకరణ అది… అవునూ… కేజీఎఫ్, కేజీఎఫ్-2, కాంతార, చార్లి777, గరుడగమన వృషభవాహన, విజయాలు, వేల కోట్ల వసూళ్లు కేవలం అదృష్టమేనా..? ఇక మా అంతటి తోపులు లేరని రిషబ్, యశ్, రక్షిత్ గొప్పలు చెప్పుకుంటున్నారా..? ఏతులు కొడుతున్నారా..? ఈ డౌట్ చాలామందిలో ఉంది… ఎందుకంటే సక్సెస్ బాటలో ఉన్నప్పుడు నోరు ఏదైనా పలికిస్తుంది… కానీ ఇది అపోహ మాత్రమే… […]
పాతాళ పాత్రికేయంలో ఈ హెడింగే పదివేలు… ఆంధ్రజ్యోతికి అభినందనలు…
‘‘తెలుగుదేశం సూపర్‌హిట్’’ అనేది ఎన్టీయార్ తొలిసారి అధికారం పొందిన ఎన్నికల ఫలితాలకు ఈనాడు పెట్టిన హెడింగ్… సినిమా నేపథ్యమున్నవాడు కదా, ఈ సినిమా కూడా హిట్టయ్యిందనే అర్థం… కాంగ్రెస్‌వాళ్లు అప్పట్లో ఆడిపోసుకునేవాళ్లు సినిమావాడికి సీఎం కుర్చీ కావాలట అని… ఏయ్, సినిమావాడే ఏం చేశాడో చూశారా అనే అర్థం… నిజానికి ఎన్టీయార్‌కు అప్పటికి ప్రజలు, సమస్యలు, రాజకీయాలు తెలియవు, తెలుగుదేశాన్ని కూడా ఓ సినిమాలాగే చూశాడు… ఆ మార్మిక అర్థం కూడా ఆ హెడింగులో ఉంది… అది […]
ట్విట్టర్ రహస్యాలు ఒక్కొక్కటే బయటపడి పోతున్నయ్… మస్క్ మామూలోడు కాదు…
పార్ధసారధి పోట్లూరి ……………. రోజులు గడిచేకొద్దీ ట్విట్టర్ లోని రహస్యాలు బయటపడుతున్నాయి ! బాబిలోన్ బీ [Bobylon Bee] అనే పేరుతో ఒక అకౌంటు ఉంది ట్విట్టర్ లో. ఈ అకౌంటు ఒక గ్రూపుకి సంబంధించినది, అంటే కన్సర్వేటివ్ వ్యక్తుల సమూహం [సంప్రదాయవాదుల సమూహం ]. ఈ బాబిలోన్ గ్రూప్ కి సంబంధించి తరుచూ ట్వీట్లు డిలీట్ అవుతుండేవి లేదా ఈ సమూహం చేసే ట్వీట్లు వాళ్ళ ప్రమేయం లేకుండా ఎడిట్ అయిపోయి మళ్ళీ ట్వీట్ అవుతుండేవి… […]
గీతు… సొసైటీలో చాలామందికి ఓ ప్రతీక ఆమె… ఈ ఎలిమినేషన్ కాస్త డిఫరెంట్…
గీతు రాయల్… గలాటా గీతు… పేరు ఏదైనా కావచ్చుగాక… ఒక్కసారి ఆలోచిస్తే సమాజంలో సగటు మనిషి ధోరణికి ఆమె ఓ సూచిక… ‘‘ఈ ప్రపంచంలో ఎవరూ మంచివాళ్లు ఉండరు అనుకునేదాన్ని సార్… కానీ లోకంలో మంచివాళ్లు కూడా ఉంటారని ఇక్కడికి వచ్చాక తెలిసొచ్చింది…’’ ఇదీ ఆమె బిగ్‌బాస్ హౌజు నుంచి నిష్క్రమిస్తున్నప్పుడు ఏడుస్తూ చెప్పిన మాట… ఫాఫం, హౌజులో అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు… ఉప్పునిప్పు తరహాలో ఆమెతో కొట్లాడిన వాళ్లు సైతం బాధపడ్డారు… ఒక కోణంలో చూస్తే… […]
50 ఏళ్ల క్రితం… ఆస్ట్రేలియాకు వెళ్లి ‘‘పులియబెట్టే విద్య’’ను చదివింది…
బెంగుళూరులో పుట్టింది… గుజరాతీ తల్లిదండ్రులు… మధ్యతరగతి కుటుంబం… ఆమెకు డాక్టర్ కావాలని కోరిక… 1970… ఇరవయ్యేళ్ల వయస్సు… మెరిట్ ఉంది… డైనమిజం ఉంది… కానీ ఎందుకోగానీ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా పాస్ కాలేకపోయింది… విధి లేక డిగ్రీలో జువాలజీ సబ్జెక్టు తీసుకుని చదవసాగింది… విదేశాల్లో స్కాలర్షిప్స్ ఇచ్చి వైద్యం బోధించే యూనివర్శిటీలకు అప్లయ్ చేసేది… ఉపయోగం లేదు… ఆమె పేరు కిరణ్ మజుందార్… తండ్రి రసేంద్ర మజుందార్ ప్రముఖ బీర్ల కంపెనీ యునైటెడ్ బ్రూవరీస్లో హెడ్ […]
అమ్మ కడుపు కూడా ప్రదర్శన సరుకేనా…? ఇక్కడా ఆ హాట్దనమేనా..?!
ఆధునికత అంటే… అడ్డగోలుగా ఉండటమా..? బిపాసా బసు తాజా ఫోటోలు చూస్తే ఈ డౌటే వస్తుంది… ఒకప్పటి హాట్ హీరోయిన్ కదా, చివరకు బిడ్డ పెరుగుతున్న కడుపును కూడా హాట్ సరుకును చేసింది… కొందరు ఆహా ఓహో అని మెచ్చుకోవచ్చుగాక… కానీ దిగజారుడుతనమే… పలు దశల్లో అమ్మతనాన్ని కూడా ప్రదర్శనకు పెట్టడమే… బేబీ బంప్ ఫోటోలు ఈమధ్య ట్రెండ్… మరీ సెలబ్రిటీలు అయితే అదొక తప్పనిసరి తంతులా… వదిలేస్తే ఏదో పాపం చేసినట్టుగా భావిస్తున్నారు… అదీ కడుపు […]
ఆదిని తిట్టేంత సీనుందా పూర్ణకు… కొత్త యాంకర్ సౌమ్యకు అప్పుడే ర్యాగింగు…
బబర్దస్త్ షోకు వెళ్లిపోయిన అనసూయ ప్లేసులో సౌమ్య అనే కొత్త యాంకర్‌ను తెచ్చి పెట్టారు… గుడ్… తను గతంలో టీవీలో న్యూస్ ప్రజెంటర్… కాకపోతే తెలుగు రాదు సరిగ్గా… పర్లేదు, రష్మికి ఇన్నేళ్లయినా తెలుగు సరిగ్గా రాదు… చల్తా… ఐనా చేయగలిగితే ఉంటుంది, లేకపోతే వెళ్లిపోతుంది… హైపర్ ఆది రాగింగ్‌కు తట్టుకుంటే నిలబడుతుంది… లేకపోతే పారిపోతుంది… ఆది అంటే అసలు చెప్పాలనుకున్న విషయం వేరే గుర్తొచ్చింది… మొన్నటి నుంచీ ఈటీవీ ఢీ షో ప్రోమో వేసి చావగొడుతున్నారు… […]
- « Previous Page
- 1
- …
- 321
- 322
- 323
- 324
- 325
- …
- 493
- Next Page »