నెత్తుటిలో ఆ నందమూరి ఆనవాళ్లున్నా సరే… అసలు కల్యాణరాం కెరీర్ ఒక అడుగు ముందుకు, పదడుగులు వెనక్కి అన్నట్టు ఉంటుంది… లక్కీగా మొన్న బింబిసార క్లిక్కయి మళ్లీ తెర మీద నాలుగు రోజుల ఆయుష్షు దొరికింది… దాన్ని అలాగే కొనసాగించాలంటే, ఆ టెంపో సాగాలంటే మరింత మంచి కథ అవసరం… మైత్రీ మూవీస్ వాళ్లు దొరికారు, డబ్బుకు ఢోకా లేదు… కాకపోతే టేస్టే మళ్లీ గాడితప్పినట్టుంది… ఓ సాంగ్ రిలీజ్ చేశారు… ఎక ఎక అంటూ మొదలవుతుంది… […]
ఎంతసేపూ ఆడ దేహాలు, మొహాలే… నెట్ సుధీర్‌లకు మగ మొహాలు పట్టవెందుకో..!!
పింక్ శారీలో జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్యను చూస్తే తట్టుకోలేం భయ్యా… నాభి అందాలతో అనసూయ అదుర్స్ స్వామీ… శ్రీముఖి క్లీవేజీతో మతిపోతోంది బాసూ… విష్ణుప్రియ ఎదపొంగులతో ఇక వేడి సెగలే… కొత్త లుక్కులో రష్మి పిచ్చెక్కిస్తోంది చూశారా… జాకెట్ మరిచి దడపుట్టిస్తున్న శ్రీలీల……. ఇలాంటి థంబ్ నెయిల్స్ కోకొల్లలు… యూట్యూబ్ చానెళ్లే కాదు, తెలుగులో మేం తోపులం అని చెప్పుకునే సైట్లు సైతం ఇదే బాట… ఇక సినిమా హీరోయిన్ల విషయంలోనైతే చెప్పనక్కర్లేని హెడింగులు, వర్ణనలు… […]
ఆకాశంలో పథక ప్రచారం… ఆచరణలో డొల్లతనం… ఆంధ్రజ్యోతి కాగ్ పాత్ర…
కొన్ని రాజకీయ వార్తలకు సంబంధించి… ఉద్దేశపూర్వకమైన యాంటీ జగన్ స్టోరీలకు సంబంధించి… ఆంధ్రజ్యోతి పాత్రికేయం పరమ చికాకు యవ్వారం..! కానీ అవి వదిలేస్తే చాలాసార్లు తనను మెచ్చుకునే పరిస్థితిని క్రియేట్ చేస్తాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ… ఏపీ పాత్రికేయం ఓ భ్రష్టుపట్టిన తంతు… కానీ తెలంగాణ విషయానికొస్తే రాయాల్సింది బోలెడు… కానీ… ప్రతి పత్రిక నమస్తే తెలంగాణను మించి కేసీయార్‌ను, తన పథకాల్ని కీర్తిస్తూ, ఆ సేవలోనే పునీతమై తరిస్తోంది… చివరకు నిష్పాక్షికంగా ఉండాల్సిన, ఉండతగిన సాక్షి కూడా […]
నరుకుడు… థియేటరంతా నెత్తుటి వాసన… దెబ్బకు దడుపుజ్వరం పట్టేసింది…
సినిమాలకు నేను వ్యతిరేకం కాదు. థియేటర్లకు వెళ్లి సినిమా చూడ్డం మాత్రం ఇష్టముండదు. మల్టిప్లెక్స్ లు వచ్చాక…థియేటర్ కు వెళుతుంటే…మనమేదో నేరం చేసి విచారణ ఎదుర్కొంటున్న దోషుల్లా అపరాధభావం వెంటాడుతూ ఉంటుంది నాకు. బయట 20 రూపాయల వాటర్ బాటిల్ మల్టిప్లెక్స్ లో 80 రూపాయలు ఎందుకవుతుందో? బయట 10 రూపాయల పాప్ కార్న్ మల్టిప్లెక్స్ లో 120 ఎందుకవుతుందో కూడా నేను పెద్దగా పట్టించుకోను. ఆ లోకోత్తర సినిమాలకు తొలివారం రెండు, మూడింతలు రేట్లు పెరగడం మీద కూడా నాకు పట్టింపు […]
అతని పేరే మాయారామ్…! చిదంబరంతో కలిసి ‘సెక్యూరిటీ థ్రెడ్’ చించేశాడు..!!
పార్ధసారధి పోట్లూరి …….. చిదంబరం మరియు అతని అనుచర అధికారులు భారతీయ నోట్ల విషయం లో చేసిన స్కామ్ ! UPA ప్రభుత్వం తాను అధికారంలో ఉన్నంత కాలం ప్రతి లావాదేవీలో తనకి ఎంత లాభం ఉంటుంది అనే దాని మీదనే బాగా శ్రద్ద పెట్టింది ! విషయం : భారత దేశపు కరెన్సీ నోట్ల తయారీలో వాడే ‘సెక్యూరిటీ త్రెడ్ ‘ విషయంలో UPA ప్రభుత్వం ఎలాంటి మోసానికి పాల్పడ్డదో తెలియచేసే అంశం ఇది. భారత […]
తప్పుడు ప్రకటనలకు కొత్త ముకుతాడు… సెలబ్రిటీలూ బాధ్యత వహించాల్సిందే…
మొన్న మనం ఓ సంగతి ముచ్చటించుకున్నాం… కూల్ డ్రింక్‌లో అడ్డగోలుగా కెఫీన్ ఉంటుంది… అది నిజానికి పిల్లలకు, గర్భిణులకు మంచిది కాదు… మోతాదు పెరిగితే, ఎవరికీ మంచిది కాదు… కానీ పెద్ద పెద్ద స్టార్స్ కూల్ డ్రింక్ తాగుతున్నట్టుగా పెద్ద ప్రకటన ఇచ్చి, దిగువన ఎక్కడో కనీకనిపించని రీతిలో చిన్న డిస్‌క్లెయిమర్ ఇస్తారు… ఎక్కువ కెఫీన్ మంచిది కాదు అని..! ఇలాంటివి వినియోగదారులను తప్పుదోవ ప్రకటించే ప్రకటనలు బోలెడు… ఏటా వేల కోట్ల దందా… ఉదాహరణకు పాన్ […]
కాంతార రిషబ్ శెట్టికి పంజుర్లి అనూహ్య దీవెనలు… ఆనందంలో హొంబలె టీం…
కాంతార సినిమా సక్సెస్‌లో, వసూళ్లలో ఎంత రికార్డు సాధించిందో చూశాం… ఓ మారుమూల కర్నాటక పల్లెల్లోని ఓ ఆదివాసీ నర్తన, ఆధ్యాత్మిక కళను, పరిమళాన్ని పరిచయం చేసుకున్నాం… సినిమా కథ, అందులో డ్రామా, కృత్రిమత్వం ఎట్సెట్రా కాసేపు వదిలేస్తే హీర్ కమ్ దర్శకుడు రిషబ్ శెట్టి అనితర సాధ్యంగా క్లైమాక్స్ పండించాడు… అదీ చూశాం, విస్తుపోయాం… అదంతా వదిలేస్తే నిజజీవితంలో కాంతార తాలూకు కొన్ని అనుభవాలు కూడా విస్తుపోయేట్టుగానే ఉంటున్నయ్… సినిమా క్లైమాక్స్ షూటింగ్ సమయంలో ఆ […]
అందరూ వినండహో… కాంగ్రెస్‌లోనే మెగాస్టారుడు… గిడుగు మీదొట్టు…
chiranjeevi is still in congress
బీబీసీ చెత్త పాత్రికేయం..! పాత పెంటను తవ్విపోస్తోంది ఎందుకో..!!
ఆర్థిక వ్యవస్థ దివాలా తీసి, అంతర్జాతీయ మార్కెట్లో బిచ్చమెత్తుకుంటున్నా సరే… పాత విద్వేషాలు, విషాలు, యుద్దాలు మానేద్దాం బ్రదర్ అని సాక్షాత్తూ ఆ దేశ ప్రధానే ఇండియాను దేబిరిస్తున్నా సరే… ఆ దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్న కొందరు మారరు… వాళ్ల తత్వాలు మారవు.,. తాజా బీబీసీ వివాదం అంతే… ఒక ఎజెండా ప్రకారం ఇండియాపై, హిందుత్వపై సాగే ఓ బ్యాడ్ ప్రాపగాండా… బీబీసీ… కొత్తగా చెప్పుకునేదేమీ లేదు… ఇండియా మీద, ప్రత్యేకించి హిందుత్వ మీద రేయింబవళ్లూ వ్యతిరేకతే… […]
‘‘బాధపడకండి… మళ్లీ వస్తా..’’ దీప @ ప్రేమి @ వంటలక్కకు ఘన వీడ్కోలు…
కార్తీకదీపం… ఎవరొప్పుకున్నా, ఒప్పుకోకపోయినా సరే… ఇండియన్ టీవీ సీరియళ్ల హిస్టరీలో నెంబర్ వన్… ఆ రేంజ్ టీఆర్పీలు బహుశా ఇక ఏ సీరియల్ సాధించదేమో… (టీవీ రామాయణం, టీవీ మహాభారతం గాకుండా…) ప్రత్యేకించి ప్రాంతీయ భాష సీరియళ్లలో ఆ స్థాయి సక్సెస్ ఓ రికార్డు… సూపర్, బంపర్ హిట్ సినిమాల ప్రీమియర్ల ప్రసారం టీఆర్పీలకన్నా కార్తీకదీపం రేటింగ్స్ ఎక్కువ… దానికి ప్రధాన కారణం ప్రేమి విశ్వనాథ్… దీప అలియాస్ ప్రేమి విశ్వనాథ్ అలియాస్ వంటలక్క పాత్రలో అనితర […]
మన టీవీలను బతికిస్తున్న టాప్ టెన్ ప్రొడక్ట్స్ ఏమిటో తెలుసా..? ఆశ్చర్యం..!
ఓ ఇంట్రస్టింగ్ విషయం ఏమిటో తెలుసా..? మనం టీవీలు చూస్తున్నాం… సంవత్సర చందాలు కడుతున్నాం… రకరకాల ప్యాకేజీలు, రేట్లతో డబ్బు చెల్లిస్తున్నాం… కానీ అవి టీవీ చానెళ్లకు ఉత్త జుజుబీ… పత్రికల కవర్ ప్రైస్లాగా… అసలు రెవిన్యూ యాడ్స్ ద్వారా వస్తుంది… అసలు పెద్ద కంపెనీల యాడ్స్ లేకపోతే ఒక్క టీవీ చానెల్ కూడా నడవదు… అయితే ఏ కంపెనీలు, ప్రధానంగా ఏ ఉత్పత్తులు టీవీ ప్రకటనల్ని శాసిస్తున్నయ్… మన డబ్బు ప్రధానంగా ఏయే ఉత్పత్తుల ద్వారా […]
ఓ చిన్న ప్రశ్న… పెద్ద చర్చ… అమలా పాల్‌ను గుడిలోకి అనుమతిస్తే తప్పేమిటి..?!
హిందూ బంధుగణానికి ఓ ప్రశ్న… సినిమా నటి అమలా పాల్‌ను ఓ గుడిలోకి రానివ్వకపోవడం కరెక్టేనా..? కేరళలోని తిరువైరానిక్కుళం మహదేవ ఆలయాన్ని సందర్శించడానికి వెళ్లగా… అక్కడి అర్చకులు, ఆలయ కమిటీ, సిబ్బంది అడ్డుకున్నారు… అన్యమతస్తులకు ప్రవేశం లేదని తేల్చి చెప్పారు… మహాదేవ ఆలయంలోకి హిందువులకు మాత్రమే ప్రవేశం ఉందని తేల్చి చెప్పారు… ఆలయం ఎదురుగా ఉన్న అమ్మవారిని దర్శించుకోవచ్చని సూచించారు… విధి లేక ఆమె అలాగే చేసింది… ఇదీ వార్త… ప్రశ్న ఏమిటంటే..? ఆమె ప్రవేశాన్ని ఆలయ ఆచారాలు, […]
ఫాఫం సుమక్క… మొనాటనీ వచ్చేసింది… కొత్త కిచిడీ షో అప్పుడే ఢమాల్…
మనం చాన్నాళ్లుగా చెప్పుకుంటున్నదే… సుమ ప్రోగ్రామ్స్ టీవీల్లో మొనాటనీ వచ్చేశాయనీ, బోర్ కొడుతున్నాయనీ, తన రూట్ మార్చుకోకపోతే యాంకర్‌గా, హోస్ట్‌గా తన పాపులారిటీని కోల్పోక తప్పదనీ…! కానీ సుమ తన బలహీనత ఏమిటో తను గుర్తించడం లేదు… నో డౌట్, ఆమె స్పాంటేనిటీ, వాగ్ధాటిలో తనను కొట్టేవారు లేరు… కానీ ఒకే తరహా ఫార్మాట్లో, ఒకే తరహా విసుర్లతో సాటే తన ప్రోగ్రామ్స్‌ను ప్రేక్షకులు పెద్దగా ఇష్టపడటం లేదిప్పుడు… దీనికి నిదర్శనం ఏమిటో తెలుసా..? మస్తు హైప్ […]
పవన కల్యాణం అనుష్టుప్ నారసింహం… అబ్బో, అదొక వ్యా‘కారణ యాత్ర…
Yatra Names: హిందూపురం ఎస్.డి.జి ఎస్ కాలేజీ తెలుగు అధ్యాపకుడు కర్రా వేంకట సుబ్రహ్మణ్యం సార్ అంటే మా నాన్నకు అపారమయిన గౌరవం. మా నాన్న అవధానాల్లో నిషిద్ధాక్షరి పృచ్ఛకుడుగా చాలావరకు కర్రా సారే ఉండేవారు. కర్రా సార్ దగ్గర అయిదేళ్లపాటు తెలుగు, సంస్కృత వ్యాకరణం నేర్చుకున్నానని మొదట్లో అనుకునేవాడిని. తరువాత కేవలం విన్నానని అర్థమయ్యింది. వ్యాకరణ పాఠం అయ్యాక కొంతకాలం ఛందస్సు కూడా చెప్పారు. గురు, లఘువుల గణాలు పెన్సిల్ తో గీతలు గీసుకుని, యతి ప్రాసలు […]
ఈ ఉద్దండుగలతో కలిసి కేసీయార్ యాంటీ-మోడీ జాతీయ పోరాటం..?!
ఖమ్మంలో జరిగిన సభలకు తాతల్లాంటి సభల్ని కూడా కేసీయార్ మంచినీళ్లు తాగినంత ఈజీగా ఆర్గనైజ్ చేయగలడు… కానీ ఖమ్మం సభలో ఓ జోష్ కనిపించలేదు… సాధారణంగా కేసీయార్ సభలంటే వాటిల్లో తెలంగాణతనం బాపతు ఓ ఎమోషన్, ఉత్తేజం అంతర్లీనంగా కనిపిస్తూ ఉండేది… ఇప్పుడది లోపించింది… అసలు వీళ్లు ఈ మీటింగ్ ఎందుకు పెట్టారనేదే తెలంగాణ జనానికి పెద్ద ప్రశ్న… దానికి జవాబు సున్నా… వివరంగా చెప్పాలంటే..? త్వరలో మా జాతీయ విధానం ఏమిటో ప్రకటిస్తాం అని కేసీయార్ […]
చివరకు సర్వపిండి అని రాసినా మైలపడిపోతారా ఎడిటర్ మహాశయా…
సీపీఎం… తెలుగునాట దాని బతుకంతా తెలంగాణ వ్యతిరేకతే… తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్నప్పుడు సైతం తన సమైక్యాంధ్ర పోకడను దాచుకోలేదు… ఏవో పిచ్చి సూత్రాన్ని బయటకు ప్రదర్శిస్తూ యాంటీ తెలంగాణ ధోరణిని స్పష్టంగానే కనబరిచింది… సరే, సోనియా పుణ్యమాని తెలంగాణను ఎవరూ ఆపలేదు… ఎర్రజెండాకు ఆపే సీన్ కూడా లేదు… తెలంగాణ ఏర్పడగానే సీపీఎం ఉమ్మడి ఆస్తులు చకచకా పంచేసుకున్నారు… ఇకనైనా అది యాంటీ తెలంగాణ పోకడను మార్చుకుంటుందని అనుకున్నారు అందరూ… కానీ ప్చ్… అది మారదు… […]
వందే భారత్… ఈ రైలు క్రియేటర్నూ నంబి నారాయణన్లాగే వేధించారు…
Chada Sastry…. వాల్ మీద కనిపించిన ఈ పోస్టు ఇంట్రస్టింగుగా ఉంది… అంతకుమించి… వందే భారత్ రైలును ఆపడానికి ఎలాంటి కుట్రలు జరిగాయో కూడా పోస్టు చెబుతోంది… మన రైల్వేస్‌లో కూడా ఒక ఇస్రో నంబి నారాయణన్ ఉన్నాడు… వేధించబడ్డాడు… ఓసారి డిటెయిల్డ్గా చదవండి… అది 2016వ సంవత్సరం. సాధారణంగా, పదవీ విరమణ సమయంలో, చివరి 2 సం.లలో తనకు అనువైన ప్రాంతంలో తేలికైన బాధ్యత గల పోస్టింగ్ పొంది, ప్రశాంతంగా రిటైర్ అవ్వడానికి లేదా చివరి […]
లలిత, సరళ పదాలు పొదిగిన ఓ తేటగీతం… అది మల్లికా శాకుంతలం…
ఏవో పిచ్చి పదాలు… అర్థం లేనివి, అర్థం కానివి… ట్యూన్లో ఏది ఒదిగితే అవి… కూర్చడం, పేర్చడం, అదే సాహిత్యమని దబాయించడం… మ్యూజిక్ కంపోజర్లు కూడా ఏదో ట్యూన్ ఇచ్చామా, శెనిగెలు బుక్కి చేతులు కడుక్కున్నామా… గాయకులూ అలాగే తయారయ్యారు… అన్నీ అనికాదు, చాలా తెలుగు సినిమా రీసెంటు పాటల గతి ఇలాగే ఉంది… గతి అంటే ఇక్కడ నెగెటివ్ దుర్గతి కాదు, పయనం… శాకుంతలంలో మల్లికా మల్లికా పాట అంత గొప్పగా ఏమీ లేదు కానీ… […]
నాటి ఈటీవీ ఇంటర్వ్యూ ఒకటి ఎన్టీయార్ జీవితాన్నే మార్చేసింది.. !!
Murali Buddha……… ఎన్టీఆర్ వర్ధంతి రోజున ఆయన్ని అంతులేని భక్తితో స్మరించుకొంటోంది ఈటివి– ఈటివిలో ఎన్టీఆర్ సినిమాలు వేస్తూ, నిమిషానికి ఓసారి భక్తితో స్మరించుకొంటోంది అని ప్రకటన… ఎన్టీఆర్‌ను గద్దె దించడంలో కీలక పాత్ర వహించి … గద్దె దించేంత వరకు నిద్రపోని ఈనాడులో భక్తితో స్మరించుకుంటున్నాం అనే ప్రకటన చూశాక …. జీవితంలో ఏదైనా సాధ్యమే అనిపిస్తోంది … అప్పట్లో ఈటివిలో ఆంధ్రావని వార్తలు వచ్చేవి… ఈ రోజు వార్తలు మరుసటి రోజు సింగ పూర్ […]
భక్ష్యం… భోజ్యం… లేహ్యం… పానీయం… మాతా అన్నపూర్ణేశ్వరి…
Alludu – Aaharam: కాశీలో వ్యాసుడికి వరుసగా కొన్ని రోజులపాటు భిక్ష- అన్నం దొరకదు. వారం గడిచినా మింగడానికి ఒక్క మెతుకయినా భిక్షాపాత్రలో పడలేదు. అన్నపూర్ణకు నిలయమయిన కాశీలో అన్నమే పుట్టలేదన్న అసహనంతో కాశీని శపించబోతాడు. ఈలోపు పండు ముసలి ముత్తయిదువు వాకిట్లోకి వచ్చి నాయనా! గంగలో మునిగి… భోజనానికి రండి అని ఆహ్వానిస్తుంది. అమ్మా! నాతోపాటు లెక్కలేనంతమంది నా శిష్యులు కూడా ఆకలితో అలమటిస్తున్నారు… అంటే… దానికేమి భాగ్యం వందలమంది ఒకేసారి రండి…మీరు స్నానం చేసి […]
- « Previous Page
- 1
- …
- 328
- 329
- 330
- 331
- 332
- …
- 409
- Next Page »