పురుషాధిక్యత…! స్త్రీపై వివక్ష…! కాలం ఎంతో వేగంగా మారుతోంది, ఆడ-మగ నడుమ తేడాలు చెరిగిపోతున్నయ్, అంతరాలు లేని ఆధునిక సమాజంలోకి ప్రవేశించేశాం అని మనం అనుకుంటున్నాం… కానీ అదేమీ లేదు… మనం ఇంకా పాత రోజుల్లోనే ఉన్నాం… పోనీ, మార్పులో వేగం లేదు అనుకుందాం… ఓ తాజా సర్వే కూడా అదే చెబుతోంది… వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ఓ సంస్థ ప్యూ రీసెర్చ్ సెంటర్ ఈ సర్వే నివేదికను రిలీజ్ చేసింది… హవ్ ఇండియన్స్ వ్యూ జెండర్ […]
భేష్ తమిళ త్యాగరాజన్..! అభివృద్ధి అంటే ఏమిటో సరిగ్గా చెప్పావ్…!
ఇండియాటుడే నిర్వహించిన state of states సదస్సు… మోడరేటర్ తమిళనాడు ఆర్థికమంత్రి పళనివేల్ త్యాగరాజన్‌ను ఉద్దేశించి ఓ ప్రశ్న వేశాడు… కొన్నేళ్లుగా మీ ర్యాంకింగ్ పడిపోయింది, మీ జీడీపీ తగ్గిపోయింది, మీ తలసరి ఆదాయం దెబ్బతిన్నది, ఎందుకిలా..? గుజరాత్ అభివృద్ధి చూడండి, దూసుకుపోతోంది… ఇదీ ప్రశ్న… క్షణంలో వందోవంతు కూడా తడబడలేదు తమిళనాడు ఆర్థికమంత్రి… పేరు పీటీఆర్ పళనివేల్ త్యాగరాజన్… ‘‘జీడీపీ లెక్కలు, తలసరి ఆదాయం లెక్కలు మాత్రమే అభివృద్ధి సూచికలు కాదు… తమిళనాడులో 15 వయస్సులోపు […]
గల్లా నుంచి గాలి దాకా… తెరమెరుపు కోసం తహతహ… హీరో అయిపోవాలంతే…
గల్లా నుంచి గాలి దాకా… సినీ కుటుంబమే కానక్కర్లేదు… ఆ వారసత్వమే అక్కర్లేదు… ధన కుటుంబం అయితే చాలు… ఇండస్ట్రీ చుట్టూ చేరుతుంది… జేజేలు కొడుతుంది… వెండితెరపై మరో హీరో ఉద్భవిస్తాడు… డబ్బులు, డబ్బులు… హీరోకు నచ్చిన హీరోయిన్లు, విలన్లు, డైరెక్టర్లు అందరూ వచ్చేస్తారు… నటన, డిక్షన్ మన్నూమశానం ఎవడికి కావాలి..? నాలుగు ఫైట్లు పడ్డాయా… మంచి సాంగులు పడ్డాయా… చాలు, తెరపై హీరోయిజం వర్ధిల్లాలి… ఆకర్షణ… పాపులారిటీ, అమ్మాయిలు, సౌఖ్యాలు, విలాసాలు… వాట్ నాట్… హీరో […]
ఝండ్..! చూడాల్సిన మూవీ… ఎందుకు..? అది చెప్పేదే ఈ రియల్ రివ్యూ…!
….. By…. Chaithanya Pingali ………… ఎక్కడ మొదలు పెట్టాలో తెలీట్లేదు. భాషలో, expression లో unlearning చాలా కావాలి dalit film maker తీసిన సినిమాల గురించి కాని, దళిత్ ఫిల్మ్ గురించి కాని రాయాలి అంటే. but cant resist…. pan indian movie అనేది ఈ కరోనా వచ్చిన నాటి నుండి నానుతోంది కదా అన్ని చోట్లా. అసలు pan indian movie అంటే ఏంటి? pan అంటే అర్థం presence across […]
ప్రవచనం ఓ గొప్ప కళ… అందులో దిట్ట మల్లాది… 60 ఏళ్లపాటు ఓ తపస్సు…
Rajan Ptsk………… ప్రథమం ఆవలింతంచ – ద్వితీయం కళ్లు ముయ్యడం – తృతీయం త్రుళ్ళిపడటం – చతుర్థం చెంపదెబ్బచ – పంచమం పారిపోవడం – ఇదీ ఒకప్పటి పురాణ ప్రవచన లక్షణమట. ఈ మాటలు అప్పటి ప్రవచనాల తీరుపై ఎవరో సంధించిన వ్యంగ్యాస్త్రం. కానీ నిజానికి పురాణంలాగే పురాణ ప్రవచనకారులకు కూడా పంచలక్షణాలుండాలేమో అనిపిస్తుంది. అవి.. ఒకటి.. రామాయణ భారత పురాణాదుల మీద, వేదవేదాంగాల మీద, సంపూర్ణమైన సాధికారత కలిగినవారై ఉండాలి. రెండు.. పురాణసాహిత్యంలో పైకి అసంబద్ధంగా […]
నా భార్య మెంటల్, ట్రీట్మెంట్ వద్దట, ఇది క్రూరత్వం, విడాకులు ఇప్పించండి…
ఈమధ్య కోర్టుల్లో వచ్చే పలు తీర్పులు భిన్న చర్చలకు తావిస్తున్నయ్… అలాంటిదే ఈ కేసు కూడా… కేరళ… ఓ భర్త ఫ్యామిలీ కోర్టుకు వెళ్లాడు… నా భార్య మానసిక రుగ్మతతో బాధపడుతోంది, చికిత్స చేయించుకొమ్మంటే ఒప్పుకోవడం లేదు, సో, మాకు విడాకులు ఇచ్చేయండి అనేది కేసు… నాకు ఎలాంటి రోగమూ లేదు, నా పిల్లల్ని చూసుకుంటున్నాను, నర్సుగా కొలువు చేస్తున్నాను, ఇరుగూపొరుగూ సహా అందరితో బాగానే ఉంటున్నాను, నాకెందుకు చికిత్స, నాకు మానసిక రుగ్మత ఉన్నట్టుగా ప్రచారం […]
మీటర్లకు ఆద్యుడే తను… బాబోయ్, ఉరితాళ్లు అని శోకాలు పెడుతున్నాడు…
మిగతా వార్తల్ని వదిలేయండి కాసేపు… వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడితే అవి ఉరితాళ్లు అవుతాయట… చంద్రబాబు చెబుతున్నాడు… దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఈ విషయం చెప్పినా సరే, అది వేరు… చంద్రబాబు చెబితే అంతకుమించిన దరిద్రం మరొకటి లేదు… నిజం… కేంద్రంలో చక్రాలు తిప్పానని, సంస్కరణలకు ఆద్యుడిననీ, ఆధునిక భారత్‌కు ఆదిపురుషుడిననీ ఏవేవో చెప్పుకుంటాడు కదా… ఇప్పుడేం చెబుతున్నాడు..? రైతులకు ఉరితాళ్లు, గతంలో వ్యవసాయ విద్యుత్తుపై రైతుల్ని ఆదుకున్నది తనేననీ చెబుతున్నాడు… ఒక రాజకీయ నాయకుడికి […]
No Time To Die..? No… Time To Die..! చివరకు చంపేశారు కదరా..!!
బాండ్… జేమ్స్ బాండ్… 25 సినిమాలు… అసలు బాండ్ అంటే ఎలా ఉండాలి..? సిగ్నేచర్ ట్యూన్‌తో గూస్ బంప్స్ మొదలైతే ఎండ్ వరకూ ఎక్కడా థ్రిల్ ఆగొద్దు… మధుబాబు నవలల్లో షాడో పాత్రలాగా… తెలుగు సినిమాల్లో మడత నలగని హీరోలాగా… పేలుళ్లు, కాల్పులు… సముద్ర అంతర్భాగం నుంచి అంతరిక్షం దాకా… ఎడారుల నుంచి మంచుమైదానాల దాకా… బాండ్ అడుగుపెడితే ఆపరేషన్ సక్సెస్ కావల్సిందే… సినిమా చివరలో తను కన్నుగొట్టి, అదో తరహా చిరునవ్వుతో ప్రేక్షకుడికి బైబై చెప్పాల్సిందే… […]
వెండితెరపై ఓ టీవీ సీరియల్..! బోలెడు ఆడ పాత్రలూ, మీకు జోహార్లు..!
తెర నిండుగా ఉంటుంది… బోలెడు పాత్రలు ఫోటోషూట్ కోసం నిలబడ్డట్టుగా వరుసగా నిలబడతారు… పెద్ద ఆసక్తికరంగా ఉండదు కథ… ఏవో నాలుగు సీన్లు… చాలాసార్లు కృతకంగా……. ఏమిటి, టీవీ సీరియళ్ల గురించి చెబుతున్నారా అని అడక్కండి… నేను అచ్చం ఆ టీవీ సీరియల్ వంటి ఓ సినిమా గురించే చెబుతున్నాను… సర్లే, టీవీల్లో వచ్చినప్పుడో, ఓటీటీల్లో ఇచ్చినప్పుడో చూసేస్తాం లెండి అని మూసేయకండి… అరె, వాళ్లు థియేటర్లలో రిలీజ్ చేశారు… చెప్పుకోకపోతే ఎట్లా..? సరే, చెప్పు, చెప్పు…. […]
హీరోలకు అసలు ఫ్యామిలీలు ఉంటే కదా… బామ్మ, మామ్మ పాత్రలు కనబడేది…
Bharadwaja Rangavajhala……………. తెలుగు సినిమా ఆడియన్సుకు హాయ్ … అయ్యా నా పేరు నిర్మల … నన్ను నిర్మలమ్మ అంటారు ఇక్కడ సినిమా ఆడియన్సు. సారీ అనేవాళ్లు … ఆడియన్సే కాదండీ … సినిమా హీరోలూ అందరూ కూడా … మీ మెగాస్టార్ చిరంజీవికి అదే ఇప్పుడు ఆచార్యగా వస్తున్నాడు కదా … ఆయనకి కూడా బామ్మగా నటించాను. ఆయనకేంటి ఆయనతో గొడవ పడతా ఉంటాడు చూడండీ … మోహన్ బాబు, ఆయనకీ బామ్మగా వేశా … […]
అంతరిక్షంలోకి వెళ్లాడు… తిరిగి వచ్చేసరికి దేశమే ముక్కలుచెక్కలు…
పార్ధసారధి పోట్లూరి……… రష్యా తన సూయజ్ అంతరిక్ష నౌక లేదా రాకెట్ మీద ఉన్న అమెరికా, జపాన్, బ్రిటన్ దేశాల జెండాలని చెరిపేసి, రష్యా జెండాతో పాటు భారత దేశ జెండాని మాత్రం అలానే ఉంచేసింది! ఈ కథేమిటంటే…? రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసిన సంఘటనలో అమెరికా, బ్రిటన్, జపాన్ లు రష్యా మీద ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే కదా ! బదులుగా రష్యా ఆయా దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాల విమానాలు […]
ఇదే నిజమైతే… మోడీది తెలివైన ఎత్తుగడ… బీజేపీకి బహుముఖ లాభం…
రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ఇంకా కాంగ్రెస్ గూటిలోనే ఉన్న గులాం నబీ ఆజాద్‌ను నిలబెట్టబోతోంది… ఇదీ వార్త..! ఒకవేళ ఈ వార్త నిజమే అయితే మాత్రం బీజేపీది రాజకీయంగా తెలివైన అడుగు అవుతుంది… కాకపోతే ఈ వార్త ఆంధ్రజ్యోతిలో రావడంతో ఎవరూ పెద్దగా నమ్మడం లేదు గానీ… ఒకవేళ మోడీ మనస్సులో ఈ ఆలోచన ఉండటం వాస్తవమైతే అది బహుముఖంగా బీజేపీకి మేలు… అప్పట్లో ఎన్డీఏ కలాంను రాష్ట్రపతిని చేసిన తీరుతో పూర్తిగా పోల్చలేమేమో గానీ, ఇప్పటి […]
అనూహ్యం… రష్యన్ సబ్మెరైన్లు నిశ్శబ్దంగా సముద్రతలంపైకి తేలాయి…
తూర్పు పాకిస్థాన్, అనగా ఇప్పటి బంగ్లాదేశ్ నుంచి లక్షల మంది శరణార్థులు ఇండియాలోకి వస్తున్నారు… పాకిస్థానీ సైన్యం అరాచకాలు భరించలేక రోజురోజుకూ వలసలు పెరుగుతూనే ఉన్నయ్… బంగ్లాదేశ్‌ను విముక్తం చేద్దామంటే పాకిస్థాన్‌కు అమెరికా, బ్రిటన్‌లతోపాటు చైనా కూడా సాయం చేస్తుందేమో… ఆస్ట్రేలియా కూడా జతకలుస్తుందేమో.,.. కానీ ప్రధాని కుర్చీ మీద ఉన్నది ఇందిర కదా… మనకు బలమైన మద్దతు కావాలి… అంతకుముందే రష్యాతో స్నేహానికి సంబంధించి నెహ్రూ వేసిన పునాదులున్నయ్… దాంతో 1971… ఇండియా, రష్యాల నడుమ […]
ఓహ్… నాగబాబు తెలివైన అడుగు… మంచు విష్ణు ఇదేమని అడగలేడు…
ఫేస్బుక్లో ఓ మిత్రుడి వాల్ మీద ఓ ఫోటో చూస్తే ఆశ్చర్యమేసింది… నిజంగానే ఇంట్రస్టింగ్… విషయమేమిటంటే… ఈమధ్య మంచు విష్ణు తన పర్సనల్ హెయిర్ స్టయిలిస్ట్ నాగ శ్రీను మీద పోలీస్ కేసు పెట్టాడు… 5 లక్షల విలువ చేసే హెయిర్ స్టయిల్ పరికరాలు, సామగ్రిని శ్రీను చోరీ చేశాడనేది అభియోగం… విష్ణుకు పర్సనల్ హెయిర్ స్టయిలిస్ట్, 5 లక్షలకు ఎందుకు కక్కుర్తి పడతాడు అనే డౌట్ వచ్చింది అందరికీ… శ్రీను తనే ఓ వీడియో రిలీజ్ […]
హైపర్ ఆది, ప్రదీప్… దిసీజ్ టూమచ్… తోటి ఆర్టిస్టును అవమానించడమే ఇది…
కొన్ని వార్తలు… యూట్యూబ్ చానెళ్లు ప్లస్ కొన్ని పెద్ద టీవీల న్యూస్ సైట్లలో కూడా… హైపర్ ఆదికి ఏమైంది..? ఢీ షోను విడిచిపెట్టాడా..? ఆది లేకుండానే ఢీ షో… శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోనూ ఆది లేడు… ఈటీవీకి బైబై చెబుతున్నట్టేనా..? ఇలా థంబ్ నెయిల్స్ పెట్టి వార్తలు కుమ్మేశారు… నిజానికి టీవీ షోలకు సంబంధించి హైపర్ ఆది పాపులారిటీ బీభత్సంగానే ఉంటుంది… ప్రదీప్, సుడిగాలి సుధీర్‌కు దీటుగా ఆది నిలబడతాడు… అయితే తను తోటి హోస్టులు, […]
శ్రీవల్లి పాటకు ఓ కొత్త ఆకర్షణ… ఉషా ఉతుప్ గొంతులో ‘పుష్పించింది’…
ఒక విషయంలో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ను మెచ్చుకోవచ్చు… పుష్ప సినిమాలోని పాటలకు గాయకుల ఎంపిక తీరు… ఏదో డబ్ చేస్తున్నాం కదా, ఎవరైతే ఏమిటిలే అనుకోకుండా ఏ పాటకు ఎవరి గొంతు సూటవుతుందో కాస్త శ్రద్ధతో దృష్టి పెట్టి, ఎంపిక చేసి పాడించాడు… ఉదాహరణకు… ఊ అంటావా, ఊఊ అంటావా పాట ఇంద్రావతి గొంతులో అద్భుతంగా పలికింది… ఆమె వాయిస్ కల్చర్, ఆ పాట తీరు, ఆమె పాడిన తీరు, ఆ ట్యూన్ అన్నీ భలే సింకయ్యాయి… […]
హే సినామికా ఎంత పనిచేస్తివే… పాత చింతకాయ పచ్చడిని వడ్డించావే…
మమ్ముట్టికి 68 ఏళ్లు… మలయాళంలో మెగాస్టార్… మోహన్‌లాల్‌తో పోలిస్తే కొన్నాళ్లుగా వెనకబడ్డట్టు అనిపించినా సరే, ఈరోజుకూ మంచి పాత్ర దొరికితే కుమ్మేస్తాడు… తన కొడుకు దుల్కర్ కూడా అంతే… మంచి మెరిట్ ఉంది… ఏ పాత్ర ఇచ్చినా దంచేస్తాడు… పాటలు పాడతాడు… కానీ పదేళ్లవుతున్నాసరే ‘‘ఇదీ నా సినిమా’’ అని కాలరెగరేసి చెప్పుకోదగినంత హిట్ లేదు… మలయాళం, తమిళం, తెలుగు, హిందీ… ప్రతి భాషలోనూ ఇంతే… హే సినామిక అనే తాజా సినిమా చూస్తే, దుల్కర్ మీద […]
ప్రీతికి వోకే..! గౌతమ్ స్థానంలోకి విజయసాయి..? రాజ్యసభకు వైవీ..?
నిజమో, అబద్ధమో… కల్పనో, గాలివంటకమో… ఏదయితేనేం… మాంచి మసాలా వంటకంగా మార్చి, బాగా గార్నిష్ చేసి వడ్డించగలదు ఆంధ్రజ్యోతి… ప్రత్యేకించి రాజకీయవార్తలు..! ఈరోజు ఫస్ట్ పేజీలో వచ్చిన వార్త ఏపీ పొలిటికల్ సర్కిళ్లలో ఒకింత చర్చ జరిగేదే… ఏమిటంటే..? ‘‘ఆదానీ భార్య ప్రీతికి జగన్ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వబోతున్నాడని… విజయసాయికి మరోసారి చాన్స్ ఇస్తాడని… రేసులో ఆలీ ఉన్నాడని… రేసులో బొత్స, సజ్జల, వైవీ కూడా ఉన్నారని… కానీ..? జగన్ ఆలోచనల్ని అందుకోవడం ఆ పార్టీ పెద్దలకే […]
మనికె మగె హితే… ఊ అంటావా… కచ్చా బదాం… ఇప్పుడు సింగర్ పార్వతి…
ఇవ్వాళ తెలుగు నెట్‌ను షేక్ చేస్తున్న గొంతు పార్వతి… కచ్చాబదాం పాటకన్నా తెలుగు ప్రేక్షకులు పార్వతి గొంతుకు నీరాజనం పడుతున్నారు… అందరూ, ప్రతి విషయంలోనూ యూట్యూబ్ చానెళ్లను ఆడిపోసుకుంటారు గానీ… ఈ కోకిలకు అద్భుతమైన ప్రాచుర్యం కల్పిస్తున్నారు… ఆమె గురించి ఏ వీడియో పెట్టినా సరే వైరల్ అయిపోతోంది… జీతెలుగు సరిగమప ప్రోగ్రాం కోసం ఎంపికైన ఆమె పాటకు పరవశించిన జడ్జిలు ఏం కావాలో కోరుకోవాలని అడగడం, ఆమె తన కోసం గాకుండా ఊరికోసం బస్సు వేయించాలని […]
పుతిన్ తక్కువోడు కాదు… పిల్ల పుట్టకముందే కుళ్ల కుట్టేశాడు…
పుతిన్ తక్కువోడు కాదుగా… చాలా ముందస్తు ప్రణాళికలు ఉంటయ్… ఎంత అంటే… పర్ సపోజ్, ఉక్రెయిన్ మీద దండయాత్ర పుసుక్కున నాలుగైదు రోజుల్లో ముగిసిపోయి, ఎటు చూసినా శిథిలాలు, విధ్వంసపు ఆనవాళ్లు కనిపిస్తూ ఉంటయ్ కదా… ప్రజలంతా గుండెలు పగిలి శోకాలు పెడుతుంటారు కదా… బతుకు జీవుడా అనుకుంటూ లక్షల మంది వలస వెళ్లిపోయినా సరే, ఇంకొందరు ఎటూ పారిపోలేక దేశంలో చిక్కుబడిపోతారు కదా… మరి అప్పటికప్పుడు వాళ్లను పాలించి, ఉద్దరించడానికి ఎవరిని నియమించాలి..? ఇదంతా పుతిన్ […]
- « Previous Page
- 1
- …
- 329
- 330
- 331
- 332
- 333
- …
- 448
- Next Page »