బహుశా మనం ఒకే కోణం నుంచి ఆలోచిస్తున్నామేమో… కేసీయార్ ఢిల్లీ పర్యటనను ఎవరూ దేకలేదు, ఫ్లాప్ అనే చిత్రీకరణ కరెక్టు కాదేమో… కుమారస్వామి, అఖిలేష్ తప్ప ఇంకెవడూ రాలేదు, కేసీయార్‌ను అలుముకోలేదు అనే విశ్లేషణ కూడా సరికాదేమో… ఎందుకంటే… కుమారస్వామి, అఖిలేష్ కేసీయార్ ద్వారా డబ్బులు తిన్న ప్రాణాలు కాబట్టి కాస్త కృతజ్ఞతగా వచ్చారేమో… కానీ మిగతా పార్టీలకు ఆ అవసరం ఏముంది..? రాకేష్ టికాయత్ ఎలాగూ డబ్బులను బట్టి వ్యవహరించే కేరక్టరే… హైదరాబాద్‌లో తిట్టిపోయి, ఢిల్లీలో […]
టాప్-10లో ఒకే ఒక హిందీ సినిమా… మిగతాదంతా సౌత్ డామినేషనే…
సంవత్సరం ముగింపుకొచ్చింది… అన్నింటికీ అతీతమైన అవతార్ సినిమాను వదిలేసి, ఇండియన్ సినిమాల్లో ఏవి ఈ సంవత్సరం టాప్-10 అంటూ ఐఎండీబీ ఓ లిస్టు రిలీజు చేసింది… సక్సెస్, వసూళ్ల ఆధారంగా ఆ జాబితాను ప్రిపేర్ చేసినట్టుగా ఉంది… వీటిలో ఒకేఒక హిందీ సినిమా… అదీ ‘ది కశ్మీరీ ఫైల్స్’… ఇక మిగతావన్నీ సౌత్ సినిమాలే… కంటెంటు, ప్రజంటేషన్, ఖర్చు, మార్కెటింగ్, ప్రమోషన్… ఏ కోణం తీసుకున్నా సౌత్ సినిమా బాలీవుడ్‌ను స్పష్టంగా డామినేట్ చేస్తోంది… మొన్న రిలీజైన […]
కాంతార సీజన్ ఒడిశింది… ఇప్పుడిక అదిరిపోయే కంబాలా సీజన్ షురూ…
కాంతార సీజన్ ముగిసింది… అక్కడక్కడ థియేటర్లలో మార్నింగ్ షోలు మాత్రమే పడుతున్నయ్… ఇప్పుడు కంబాలా సీజన్ స్టార్టయింది… తమిళనాడులోని జల్లికట్టులాగా కర్నాటకలో రైతులు ఈ కంబాలా పోటీల్ని కాపాడుకుంటున్నారు… కేరళలో సంప్రదాయికంగా వల్లం కలి అని పిలిచే స్నేక్ బోట్ పోటీలను కూడా వాళ్లు కల్చర్‌లో భాగంగా పదిలంగా రక్షించుకుంటున్నారు… మరి తెలుగు రాష్ట్రాలు అనగానే గుర్తొచ్చేది ఏముంది..? సరే, ఇక ఆ చర్చలోకి వెళ్తే ఇప్పట్లో బయటికి రాలేం… కానీ కంబాలా గురించి కాస్త చెప్పుకోవాలి… […]
అగరుపొగలా, అత్తరులా… ఊహూఁ… ఆ శోభన తాంబూలంలోనే ఏదో వెలితి…
జయసుధ వందల పాత్రలు పోషించింది… అందులో డ్రైవర్ రాముడు వంటి పాఁయ్ పాఁయ్ పాత్రలు ఉన్నయ్, మేఘసందేశం వంటి ఉదాత్త పాత్రలూ ఉన్నయ్… ఈరోజు ఆమె జన్మదినం… ఆమె కెరీర్ ఒకసారి స్థూలంగా అవలోకిస్తే చటుక్కున స్ఫురించేది మేఘసందేశం… ఆకులో ఆకునై అనే పాట సరే, కానీ సిగలో అవి విరులో పాట మరింత బాగుంటుంది… జయసుధ వంటి నటవిదుషీమణి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే… పోనీ, ఆ పాట గురించే చెప్పుకుందాం… ఆమె బర్త్‌డే సందర్భంగా… […]
శ్రీసత్యతో విరహం ఒక్కరోజేరా బాబూ… రేవంత్ హగ్గుల అతి ప్రేమ ఓ రోత…
ఇన్నిరోజులూ ఎంటర్ టెయిన్ చేయండ్రా, పర్ఫామ్ చేయండ్రా అంటే ఎవడికీ సరిగ్గా చేతకాలేదు… తీరా ఒకటీ రెండు రోజుల్లో ఆట ముగిసిపోతుంది అనగా తెగ ఓవరాక్షన్ చేస్తున్నారు… ప్రత్యేకించి రేవంత్… మిడ్ వీక్ ఎవిక్షన్ అని ఓ దిక్కుమాలిన నిర్ణయంతో శ్రీసత్యను బయటికి పంపించేశాడు బిగ్‌బాస్… ఆమె సరదాగా, నవ్వుతూ వెళ్లిపోయింది… ఆమెకు తెలుసు, ఇక్కడి దాకా రావడమే ఆమెకు గెలుపుతో సమానం… ఐనా తక్కువేమైంది… టాప్-6లో ఉంది… ఒకటీరెండు రోజుల తేడా మిగతావాళ్లతో పోలిస్తే… అంతే… […]
ప్రయోగశాలే అమ్మకడుపు… పిండం నుంచి పండంటి బిడ్డ దాకా ‘నయా దందా’…
చిరంజీవి కోడలు, రాంచరణ్ భార్య ఉపాసన పెళ్లయిన చాలాకాలానికి తల్లి కాబోతోంది… గుడ్… అయితే ఆ వార్తలతోపాటు మరో చిన్న వార్త ఆకర్షించింది… ఆమె సరోగసీ ద్వారా బిడ్డను కనబోతోంది అని..! అంత పెద్ద అపోలో హాస్పిటల్స్‌కు యువరాణి, మెగా రాజ్యపు మహారాణి అందరు మహిళల్లాగే కడుపు మోయడం, పురుటి నొప్పులు పడటం ఏమిటసలు అన్నట్టుగా సాగింది ఆ వార్త… అది చట్టవిరుద్ధమేమీ కాదు… మొన్నమొన్ననే కదా నయనతార కవలల్ని కన్నది ఇలాగే… మనకు తెలియని కేసులు […]
ఐననూ థియేటర్‌కు పోవలె… అవతార్-2 చూడవలె… విజువల్ వండర్…
సినిమా అనే ఓ దృశ్య మాధ్యమానికి సంబంధించి అవతార్ ఓ చరిత్ర… దాదాపు 7 వేల కోట్ల అత్యంత భారీ ఖర్చు, 16 వేల కోట్ల రెవిన్యూ టార్గెట్, ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి దేశంలోనూ రిలీజ్, దాదాపు 60 వేల థియేటర్లు, 140 భాషలు… అసలు ఇవి కాదు వార్తలు… జేమ్స్ కామెరూన్ ఓ ఇంద్రజాలికుడు… అనితర సాధ్యమైన ఓ ఫిక్షన్‌ను కలగంటాడు… దాన్ని తెరపై ఆవిష్కరిస్తాడు… ప్రతి సీన్‌కూ అత్యంత ప్రయాస… ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న […]
ఎవరెంత తిట్టిపోసినా సరే… రెండో ప్లేసుకు జారిపోయినా సరే… టీవీ9 మారదు…
కొన్ని మౌనంగా ఉండలేం… ఉండకూడదు… కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది అని ఊరుకోలేం… ఇంకెవడో మనల్ని ఎండగట్టేముందు మనమే ఆత్మవిమర్శ చేసుకోవడం బెటర్… ఇక్కడ పేర్లు రాయకుండా ఒక టీవీ చానెల్, ఒక రిపోర్టర్ అని ఏమీ తప్పించుకోవడం లేదు… టీవీ9 చిల్లర రిపోర్టింగ్ తీరు గురించే చెబుతున్నా… రేటింగ్స్‌లో ఎన్టీవీ ఫస్ట్ ప్లేసుకు వెళ్లి, అప్పటిదాకా ఆ ప్లేసును ఎంజాయ్ చేసిన టీవీ9 రెండో స్థానానికి జారిపోయినా… తప్పులు దిద్దుకుందామనే సోయి లేదు… ఉన్నత స్థానాల్లో […]
వారణాసికి పోటెత్తుతున్న భక్తులు… ఒకే ఏడాదిలో 7.35 కోట్ల మంది రాక…
స్ట్రెయిట్‌గా ఓ విషయం… హిందువులు తమ జన్మలో ఒక్కసారైనా వెళ్లాలని భావించే వారణాసికి గతంలో సగటున 30 నుంచి 40 లక్షల మంది భక్తులు వచ్చేవాళ్లు… సరిగ్గా ఒక ఏడాదిలో ఈ సంఖ్య ఎంతకు పెరిగిందో తెలుసా..? 7.35 కోట్లకు పెరిగింది..! గతంలో 14 నుంచి 15 కోట్ల మేరకు మాత్రమే విరాళాలు వచ్చేవి… ఈ ఏడాది 100 కోట్లు దాటింది… ఎందుకింత తేడా..? కాశీ విశ్వనాథుడి గుడి ఏరియాను 2700 చదరపు అడుగుల నుంచి ఏకంగా […]
జబర్దస్త్ షోలకు రేటింగ్స్ దెబ్బ… జనం వాటిని చూడటమే మానేస్తున్నారు…
నిజానికి ఈటీవీ రేటింగ్స్‌ను నిలబెడుతున్నవి ఇన్నాళ్లూ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలు… బూతుల షోలుగా ఎంత ప్రసిద్ధి పొందినా సరే, జనం చూస్తూనే ఉన్నారు… ఈటీవీ వాటిని అలాగే కొనసాగిస్తూనే ఉంది… ఆ షోలోకి కమెడియన్లు, జడ్జిలు వస్తుంటారు, పోతుంటారు… కానీ బేసిక్‌గా దాని ఫార్మాట్ మారదు… కాకపోతే ఒకప్పుడు స్కిట్‌ను స్కిట్‌గా ప్రదర్శించేవాళ్లు… ఇప్పుడు బాడీ షేమింగులు, ర్యాగింగ్ డైలాగులు ఎట్సెట్రా జోకులుగా చలామణీ అవుతున్నాయి… ఈ షోలు ఎంత నాసిరకంగా మారిపోతున్నా సరే… వేరే […]
పారసిటమాల్ గోళీలకు కూడా కటకట… యాంటీబయాటిక్స్ మందులకూ కొరత…
పార్ధసారధి పోట్లూరి….. యూరోప్ దేశాలలో యాంటీ బయటిక్స్ మందుల కొరత ! యూరోపు దేశాలలో ముఖ్యమయిన మందులు అయిన అమోక్సిసిలిన్ [amoxicillin] మరియు పారాసిట్మాల్ లాంటి నిత్యావసర ఔషధాలకి కొరత ఏర్పడింది. బ్రిటన్ మరియు ఫ్రాన్స్ దేశాలలో ప్రధానంగా అన్ని మందుల షాపులలో ఆమోక్సిసిలిన్ తో పాటు పారాసీట్మాల్ మందులకి తీవ్ర కొరత ఏర్పడింది. అయితే ఈ కొరత మిగతా యూరోపు దేశాలలో కూడా తీవ్రంగానే ఉంది కానీ ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలలో మిగతా యూరోపు దేశాలకంటే […]
ఫాఫం ఈటీవీ… బిగ్ స్టార్ రవితేజను పట్టుకొచ్చినా టీవీ రేటింగ్స్ తన్నేశాయి…
బార్క్ రేటింగ్స్ చూస్తుంటే షాక్ అనిపించింది… ఈటీవీ వాళ్లు ఢీ ఫినాలేకు రవితేజకు రప్పించారు… బోలెడు ఖర్చు పెట్టారు… హైపర్ ఆదితో రవితేజను ఇంద్రుడు చంద్రుడు అని ఓ రేంజులో పొగిడించారు… ఒక దశలో హైపర్ ఆది పొగడ్తలకు రవితేజే ఉక్కిరి బిక్కిరయ్యాడు,.. ఆ స్థాయిలో భజన సాగింది… నిజానికి అది భజన కాదు, మరో పదం ఏదైనా వెతకండి… నిజానికి ఈటీవీ బలమే రియాలిటీ షోలు… అందులో చాలా ఏళ్లుగా నడుస్తున్నది ఢీ అనే డాన్స్ […]
KCR శిబిరంలోకి రవిప్రకాష్..? BRS అవసరాల కోసం కొత్త జాతీయ చానెళ్లు..!!
మీడియా అంటే… అచ్చం రాజకీయాల తరహాలోనే..! ఎవరు ఎప్పుడు ఎవరితో అటాచ్ అయిపోతారో, ఎవరు విడిపోతారో ఎవరూ చెప్పలేరు… పక్కా డైనమిక్… ఈరోజు ఉన్న విధేయతలు, ప్రత్యర్థిత్వాలు రేప్పొద్దున ఉండకపోవచ్చు… కేసీయార్ అలా ఎంతమందిని కౌగిలించుకోలేదు..? అలా తాజాగా రవిప్రకాష్‌ను కూడా అలుముకున్నాడనేది తాజా వార్త… రవిప్రకాష్ అంటే టీవీ9.., టీవీ9 అంటే మైహోం రామేశ్వరరావు… విత్ మేఘా కృష్ణారెడ్డి… కొంతకాలంగా ఇద్దరూ కేసీయార్‌తో కటీఫ్ చెప్పుకుని, బీజేపీ ఫోల్డ్‌లో ఉన్నారని పొలిటికల్ సర్కిళ్లలో ప్రచారం… ఆఫ్టరాల్ […]
నాటి టీ కమ్మటి పరిమళం జాడేది..? గ్లాసులో చిక్కటి టీ పోస్తుంటేనే నోరూరు..!
చాయ్… చివరకు కాలగతిలో ఇదీ తన సహజ రుచిని కోల్పోయింది… రంగు వెలిసిపోతోంది… చిక్కదనం ఏనాడో పలచబడింది… కమ్మని సువాసన ముక్కుపుటాలను అదరగొట్టడం లేదు… ఎందుకో తెలియదు… పండుతున్న తేయాకులోనే ఆ నాణ్యత కొరవడిందా…? టీపొడి ప్రాసెస్ చేయడంలో ఆధునిక విధానాలు వచ్చి చెడగొట్టాయా..? . నిజానికి మార్కెట్లో టీ పౌడర్ రేట్లు మండిపోతుంటయ్… కానీ ఒకనాటి ఆ నాణ్యత, ఆ శ్రేష్టత మాత్రం కనిపించడం లేదు… ఒకనాడు బయట టీ తాగితే ఓ హుషారు… సీస […]
ఢిల్లీలో కేసీయార్ రైతుసంక్షేమ బావుటా…ఆ మోడల్ డొల్లతనంపై ఓ సర్వే రిపోర్టు…
రైతు పేరిట జాతీయ రాజకీయాల్లో దూసుకుపోదామని కేసీయార్ చెబుతున్నాడు… రైతుసంక్షేమంలో తెలంగాణ నమూనాను దేశవ్యాప్తంగా ప్రచారం చేసి, ప్రజలకు ఆదర్శంగా చూపిస్తామనీ అంటున్నాడు… బీఆర్ఎస్ ఢిల్లీ ఆఫీసు ఓపెన్ కాగానే ఫస్ట్ కిసాన్ సెల్‌నే ప్రకటించాడు… రైతుబంధు, రైతుభీమా, రైతుకు సాగుసాయం, ఉచితకరెంటు, 24 గంటల కరెంటు వంటి పథకాలను తెలంగాణ నమూనాలో చూపిస్తున్నాడు… ఐతే ఇదేరోజు రైతు స్వరాజ్యవేదిక తెలంగాణలో రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఓ సర్వే రిపోర్టు ద్వారా వెల్లడించింది… కేసీయార్ […]
జర్మనీలో రష్యా చిచ్చు..? అక్కడ పాత రాచరిక వ్యవస్థ మళ్లీ కావాలట…!!
పార్ధసారధి పోట్లూరి ………. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యూరోపులో అశాంతిని రెచ్చగొడుతున్నాడా ? జర్మనీ లో ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర ? డిసెంబర్ 7, 2022 …. జర్మనీ లోని ప్రభుత్వాన్ని కూలదోసి అధికారం చేజిక్కించుకోవాలి అనే వ్యూహంతో ఉన్న 25 మంది రైట్ వింగ్ యాక్టివిస్ట్ లని అరెస్ట్ చేశారు జర్మనీ పోలీసులు ఈ నెల 7వ తారీఖున! రైట్ వింగ్ యాక్టివిస్ట్ గ్రూపు ని ప్యాట్రియాటిక్ యూనియన్ [Patriotic Union ] [జర్మన్ […]
ఆమెకు ఇచ్చిన పెళ్లికానుక గాఢమైన సైనైడ్ ద్రావకం… ఇలాంటి పెళ్లి ఇంకోటి లేదు…
ఓ నియంత ఆఖరి రోజులు….. By… గొల్లపూడి మారుతీరావు… (మొన్న గొల్లపూడి వర్ధంతి… ఇలా స్మరించుకుందాం…) యూదుల కారణంగా మానవజాతి సర్వనాశనమౌతోందని, కొన్ని కోట్ల యూదుల దారుణమయిన చావుకి హిట్లర్ కారణమయ్యాడు. హిట్లర్ మీద 1222 పేజీల అద్భుతమైన జీవిత చరిత్రను రాసిన జాన్ టోలెండ్ పుస్తకంలో ఆఖరి రెండు వాక్యాలు. ”ఈ భూమి మీద నుంచి ఆరు మిలియన్ల యూదుల్ని నాశనం చెయ్యడం ప్రపంచానికి తాను చేసిన ఉపకారంగా హిట్లర్ భావించాడు. కాని తత్కారణంగా యూదులకి […]
కమల్ హాసన్..! రజినీకాంత్ సరే, నీకూ కన్నడత్వంతో లింకేమిటోయ్…!!
కమల్ హాసన్… జగమెరిగిన నటుడు… తన సిద్దాంతాలు, విశ్వాసాలు, వ్యాఖ్యలు, వ్యక్తిగత జీవితం గట్రా మనకు నచ్చినా నచ్చకపోయినా మంచి నటుడు… ఒకప్పటి ప్రయోగాలు మానేసినా సరే, తను చేసినన్ని ప్రయోగాలు, సాహసాలు ఏ ఇండియన్ నటుడికీ చేతకావు, కాలేదు, కావు కూడా… అయితే… తన మాటలు అప్పుడప్పుడూ చిత్రంగా, ఎవడ్రా వీడు అనేట్టుగా ఉంటయ్… అందులో ఒకటి తాజాగా… చాన్నాళ్ల తరువాత, తప్పనిసరై, రజినీకాంత్ కూడా స్పందించాడు కాబట్టి తనూ స్పందిస్తూ… కాంతారను ప్రశంసించాడు… ఆ […]
స్టాలిన్ భార్య చేసిన తప్పేముంది..? తమిళనాడు బీజేపీ బేకార్ సోషల్ రచ్చ…
తిరుమలలో వీవీఐపీ వస్తే వాడే దేవుడు… అసలు శ్రీవారిని కాసేపు వదిలేస్తారు… వీవీఐసీ ఆర్జిత సేవల్లో తరిస్తారు పూజారులు, దళారులు… జయలలిత సహా తమిళనాడులో నాయకులు దేవుళ్లు… వాళ్లు దూరం నుంచి అలా వెళ్తుంటే ఇక్కడ సాష్టాంగపడి దండాలు పెడతారు… ఫ్యాన్స్‌కు హీరోలు దేవుళ్లు… వాళ్లకోసం బతుకుల్నే నాశనం చేసుకుంటారు… ఇలా దేవుళ్లంటే విగ్రహాలే కాదు, మనుషులే దేవుళ్లు… స్వార్థమే ఆధ్యాత్మికత… అంతటా ఇదే కథ… ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే… తమిళనాడులో తాజాగా ఓ వివాదం… ముఖ్యమంత్రి […]
తవాంగ్ సెక్టార్లో ఏం జరిగింది..? చైనాకు తెలిసిందే దురాక్రమణ రీతి…!!
అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో భారత, చైనా సైనికుల ఘర్షణ పేరుతో ఓ వీడియో బాగా వైరల్ అయిపోయింది… అది అదేనోకాదో గానీ… గల్వాన్ లోయలో ఘర్షణ, ప్రాణనష్టాల తరువాత మళ్లీ కలకలాన్ని సృష్టిస్తున్నది ఈ సంఘటన… అసలు చైనా దురాక్రమణ పద్ధతులు ఎలా ఉంటాయి..? ఏమిటి దాని వ్యూహం..? మిత్రుడు పార్ధసారధి పోట్లూరి వ్యాసం ఎప్పటిలాగే… సవివరంగా… భారత్ చైనాల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది ! గత రెండేళ్ల నుండి అనుకుంటున్నదే మూడు రోజుల క్రితం జరిగింది […]
- « Previous Page
- 1
- …
- 340
- 341
- 342
- 343
- 344
- …
- 409
- Next Page »