విష్ణు విశాల్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏముంది..? నిజానికి ఏమీ లేదు… తను పూర్తిగా తమిళనటుడు… ఆమధ్య రానాతో కలిసి అరణ్యలో కనిపించాడు… చాలామంది తమిళ హీరోల్ని తెలుగు ప్రేక్షకులు తమ సొంత హీరోల్లాగే అభిమానిస్తారు, ఆదరిస్తారు… కానీ ఈ విష్ణు పెద్దగా తెలుగు ప్రేక్షకులతో కనెక్టయిన హీరో ఏమీ కాదు… అంతెందుకు, తమిళంలోనే 2009 నుంచీ కష్టపడుతుంటే ఇప్పటికి స్కోర్ 16 మాత్రమే… అందులో నాలుగు తను సొంతంగా డబ్బులు పెట్టి తీసుకున్న సినిమాలే… రాక్షసన్ […]
భామాకలాపం..! ఈమె ఓటీటీ వంటలక్క… ప్రియమణి సరదాగా లాగించేసింది..!!
అదేదో ఢీ అనే డాన్స్ షోలో చూపించినట్టు… ఏదో హైపర్ ఆది అలా చెప్పగానే, అలాగే బావా అని పిలిచి గట్టిగా ఓ హగ్గు ఇచ్చేస్తుంది పాపం అనుకోకండి… మరీ అంత అమాయక కేరక్టర్ ఏమీ కాదు ప్రియమణి బయట… ఫీల్డులో స్ట్రగుల్ అయ్యీ అయ్యీ రాటుదేలి, కూలిపోయిన కెరీర్ గోడను ఎలాగోలా తిరిగి పేర్చుకుంటోంది… భామాకలాపం అనే ఓటీటీ సినిమా (ఆహా) చూస్తున్నంతసేపూ ఆమె మాత్రమే కనిపిస్తుంది… ప్లజెంట్‌గా ఉంది ఆమె… ఎహె, అందం చందం […]
ఖిలాడి..! రవితేజకు చివరి ప్రమాదహెచ్చరిక… ఐనా మారతాడనే ఆశే దండుగ..!!
నిజానికి 54 ఏళ్లు అనేది పెద్ద వయస్సు ఏమీ కాదు… డెబ్భయి దాటిన హీరోలే నడుముకు బద్దలు కట్టుకుని, వంగిపోకుండా, హీరోయిన్ల పిరుదులపై దరువులేస్తూ గెంతులేయడానికి ఆయాసపడుతున్నారు… పెద్ద పెద్ద గన్నులు పట్టుకుని రౌడీలను వందలుగా, మందలుగా నరికిపారేస్తున్నారు… ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు… వందల కోట్లను తెరపైకి వెదజల్లుతూనే ఉన్నారు… హుమ్… ఒకప్పుడు ఎన్టీయార్, ఏఎన్నార్, శోభన్, కృష్ణ, కృష్ణంరాజు తదితరులు ముసలోళ్లయినా ఇంకా ఈ యూత్ వేషాలేమిటీ అని చీదరగా చిరంజీవి వైపు, రాజశేఖర్ వైపు, […]
ఐనా ఈడీ దాడులతో ఏమవుతుంది..? బేఫికర్… కేసీయార్ జోలికి మోడీ రాడు…!!
మోడీ మీద టీఆర్ఎస్ వాళ్లు సభాహక్కుల నోటీసు ఇచ్చారట, ఏమైతుంది సార్..? కేసీయార్ పై బీజేపోళ్లు అసెంబ్లీలో అలాంటి నోటీసే ఇస్తారట, ఏమవుతుంది సార్..? టీఆర్ఎస్ పెద్దల చుట్టూ ఈడీ వలలు పన్నుతోందట, నిజమేనా సార్..? …. నిన్నటి నుంచీ ఒకటే చర్చలు… బట్, ఎవరికీ ఏమీ కాదు.,. ఎవరికీ ఫికర్ అక్కర్లేదు… తెరపై కనిపించేదే సత్యం కాదు, రాజకీయాల ప్రణాళికలు అంటేనే ఓ స్పష్టాస్పష్ట భ్రమ… అది సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగు, పోస్టుల హైప్ […]
చిరంజీవికి పెద్దపీట నచ్చలేదా..? కొందరికి ఇష్యూ సెటిల్ కావడమే ఇష్టం లేదా..?!
జగన్ ప్రభుత్వం థియేటర్ల టికెట్ల ధరలు తగ్గిస్తూ ఆమధ్య ఓ నిర్ణయం తీసుకుంది… బెనిఫిట్ షోలు, అదనపు షోలు వేస్తే, వసూళ్లు చేస్తే తాటతీస్తాను అని చెప్పింది… ఈ నిర్ణయం వెనుక జగన్ అహాన్ని ప్రదర్శిస్తున్నాడనీ, పవన్ కల్యాణ్ మీద కోపంతో ఇండస్ట్రీని తొక్కుతున్నాడనీ, తన ముఖ్యమంత్రిత్వాన్ని గుర్తించని-గౌరవించని ఇండస్ట్రీని కాళ్ల దగ్గర మోకరిల్లేలా చేసుకుంటున్నాడనీ, ఇండస్ట్రీలో ప్రధానంగా కమ్మ పెత్తనం కాబట్టి తన కమ్మ ద్వేషాన్ని ఇండస్ట్రీ మీద కూడా ప్రయోగిస్తున్నాడనీ బోలెడు కథనాలు, ప్రచారాలు […]
అయ్యాకొడుకులు ఏక్‌సేఏక్… ఎటొచ్చీ ఆ కేరక్టరైజేషనే మహాన్ వీక్…
గరికపాటి పుష్ప సినిమాపై కోపం తగ్గినా సరే, మహాన్ అనబడే తాజా చిత్రాన్ని కూడా చూడకుండా తమాయించుకోవడం బెటర్… పుష్పలో ఆఫ్టరాల్ అక్షరమ్ముక్క రాని ఓ కూలీ పెద్ద స్మగ్లర్‌గా ఎదుగుతాడు… అంతే, కానీ ఈ మహాన్ ఇది మరోరకం అరాచకం… రెండు లీడ్ రోల్స్, ఒకటేమో తండ్రి విక్రమ్ పోషిస్తే, మరొకటి తన సొంత కొడుకు ధ్రువ్ పోషించాడు… ఒక వయస్సు మళ్లిన తండ్రి కేరక్టరేమో లెక్చరర్ నుంచి, గాంధేయవాదం నుంచి ఏకంగా దారితప్పి మద్యం […]
‘మహాన్’ తెలివి..! మూవీలో హీరోయిన్ మొత్తం సీన్లన్నీ కత్తిరించి పారేశారు..!!
‘‘ఎందువల్లనైనా’’ దర్శకుడికి సరే కోపం వస్తే… హీరోకు కోపమొస్తే… పోనీ, హీరో కొడుక్కి కోపమొస్తే… నిర్మాతకే నచ్చకపోతే… ఏం జరుగుతుంది..? చెప్పినట్టు వినని హీరోయిన్‌కు కత్తెర పడుతుంది… సీన్స్ పడిపోతయ్… పేమెంట్స్ చిక్కుల్లో పడతయ్… మౌత్ పబ్లిసిటీతో తొక్కేస్తారు… కొత్త చాన్సులు రానివ్వరు… అసలు ఇండస్ట్రీ అంటేనే అది కదా… మరీ కోపమొస్తే మొత్తం ఆమెను సినిమాలో కనిపించకుండా, ఆమె సీన్లన్నీ తీసిపారేస్తారు… అవును మరి, ఎంత పేరున్న హీరోయిన్ అయినా సరే..!! మహాన్ అనే ఓ […]
ఇక చాల్లే, ఫోఫోవమ్మా… అంతటి వంటలక్కను ఇట్టే తిరస్కరిస్తున్న ప్రేక్షకజనం…
ఫాఫం వంటలక్క… ఆమెకు నీరాజనాలు పట్టిన జనాలే ఇప్పుడు ఇక చాల్లే, ఫోఫోవమ్మా అనేస్తున్నారు… కార్తీకదీపం సీరియల్ స్థితిగతులు మరింత దిగజారినయ్… నిజానికి ఈ సీరియల్ రోజురోజుకూ రేటింగ్‌పరంగా ఎలా పతనమవుతుందో ‘ముచ్చట’ చెబుతూనే ఉందిగా… ఈ వారం బార్క్ రేటింగ్స్ చూస్తే… అసలే ఆ ఏడుపు సీరియల్ నటులకు మరింత ఏడుపొచ్చేలా ఉన్నయ్… ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల రేటింగ్స్‌ను దాటి, అబ్బో, మాటీవీ వాడి రేటింగ్ మేనేజ్మెంట్కు తిరుగులేదు, కథానాయిక ప్రేమీ విశ్వనాథ్‌కు ఎదురులేదు […]
పచ్చిపులుసు అంటేనే పచ్చిదనం… దాన్నలా పెంటదనం చేయకండి…
నో పొయ్యి, నో పోపు, నో నూనె, నో కాయగూర, నో మసాలా, నో టైమ్ టేకింగ్… ఫాస్ట్‌గా ఉండాలి, నాలుకకు రుచి తగలాలి… ఇవి చెప్పేవాడే చెఫ్ అంటే… దిక్కుమాలిన వంటలు ఎన్ని ఉంటేనేం యూట్యూబులో..?! 20, 30 దినుసులు, బోలెడంత టైమ్, ప్రయాస అవసరమయ్యే వంటలు ఎవడైనా చెబుతాడు… ఎన్నో ఏళ్లుగా మన పెద్దల కడుపులు నింపిన పాత వంటల్ని పరిచయం చేసి, చిట్కాలు చెప్పి, చేసి చూపించేవాడే నిజమైన యూట్యూబ్ చెఫ్… హలో […]
పెళ్లిసంబంధాల్లో జాతక లెక్కలపై ఓ పండితుడు భలే తేల్చేశాడు..!
జ్యోతిష్కుల బండారం జ్యోతిష్కులకే ఎరుక… చెప్పాలి, వాళ్లే చెప్పాలి, జ్యోతిష్యంలో అడుగుపెట్టే వైరసులను వాళ్లే బయటపెట్టాలి… పెడుతున్నారు కూడా కొందరు..! ఉదాహరణకు పెళ్లిళ్లలో చూడబడే వివాహపొంతన..! పూర్వకాలం నుంచి కూడా పెళ్లిళ్లు అంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడమన్నారు తప్ప, ఆయా వంశాలకున్న పేరును పరిగణనలోకి తీసుకోమన్నారు తప్ప, వివాహపొంతనలో పాయింట్లు, అనగా గుణాల ఆధారంగా మాత్రమే నడుచుకొమ్మని ఎవరూ చెప్పలేదు… కొన్నేళ్ల క్రితం వరకు కూడా… ఈ పాయింట్లు, గుణాల లెక్కలేవీ […]
నగరం వదిలేశాడు… సొంతూరు చేరాడు… ఆ పల్లెకు మళ్లీ జీవకళ తీసుకొచ్చాడు…
కరోనా దేశాన్ని అతలాకుతలం చేసిన తొలి వేవ్‌లో… లక్షల మంది నగరాలు, పట్టణాల నుంచి సొంతూళ్లకు తరలిపోయారు… చావో బతుకో ఇక అక్కడే అనుకున్నారు… ఏదో ఓ పని చేసుకుని బతకొచ్చులే అన్నారు… బస్సులు, రైళ్లు లేకపోతే కిలోమీటర్ల కొద్దీ నడుస్తూ ఊళ్లకు వెళ్లిపోయారు… తరువాత ఏమైంది..? పల్లెలు మళ్లీ జనంతో కళకళలాడాయా..? లేదు… పల్లెల్లో పనుల్లేవు, ప్రభుత్వానికి పట్టింపులేదు, ఉపాధి పథకాల్లేవు… దాంతో కాస్త కరోనా భయం తొలగేకొద్దీ మళ్లీ నగరాలు, పట్టణాల బాటపట్టారు… ఇప్పుడు […]
ఎదురుతన్నిన పాకీ ఎదవ డ్రామా..! 11 గ్లోబల్ ఫరమ్స్ గుడ్డిగా చిక్కుకున్నయ్ వలలో..!!
………. By…. పార్ధసారధి పోట్లూరి …….. కాశ్మీర్ డే అంటూ పాకిస్థాన్ ఆడిన ఎదవ డ్రామా ఎదురు తన్నింది… కొన్ని అంతర్జాతీయ సంస్థల పాకిస్థానీ ఫ్రాంచైజీల పేర్లతో ట్విట్టర్, ఫేస్బుక్ సోషల్ మీడియా వేదికల ద్వారా ఇండియాతో గేమ్ ప్లే చేయడానికి ట్రై చేసింది పాకిస్థాన్… ఇండియాలోని నెటిజన్లను రెచ్చగొట్టి, వాటి వ్యాపారాన్ని, పాపులారిటీని దెబ్బకొట్టి, ఇండియా రాకుండా పరిస్థితుల్ని క్రియేట్ చేయాలని చూసింది పాకిస్థాన్… ఎందుకు..? తన మిత్రదేశం చైనా కోసం… చైనా నుంచి ఆల్రెడీ […]
సుధీర్‌కు అర్జెంటుగా ఓ రష్మి కావలెను..! ఇషా చావ్లా వచ్చేస్తున్నట్టేనా..?!
ఒక సుడిగాలి సుధీర్, ఒక రష్మి జంట అంటే… వాళ్ల కెమిస్ట్రీ బాగుంటుంది, వాళ్ల నడుమ ఏ ప్రేమబంధమూ లేదని తెలిసినా, వాళ్లే పదే పదే చెప్పినా సరే, టీవీ ప్రేక్షకులకు వాళ్లను చూస్తుంటే ఓ సరదా… కానీ వాళ్ల జంట హిట్టయిందని ఇక బోలెడు జంటల్ని ప్రచారం కోసం, పాపులారిటీ కోసం, రేటింగ్స్ కోసం కలిపేసి, విడగొట్టి టీవీ చానెళ్లు నానా డ్రామాలూ ప్లే చేస్తున్నయ్… వార్నీ, వచ్చే వాలంటైన్స్ డే ప్రోమోలు చూస్తుంటే ఆ […]
అప్పట్లో వెంకయ్య… ఇప్పుడు మోడీ… ఫాఫం తెలంగాణ బీజేపీ అభిమాని..!!
‘‘సిగ్గుపడేలా రాష్ట్ర విభజన’’ …. ఇదీ శ్రీమాన్ డిల్లీ పాదుషా మోడీ గారు ఉవాచ…. నిజానికి ఇందులో ఓ వ్యూహం, ఓ దశ, ఓ దిశ ఉన్నాయా..? ఏమీ లేవు… ఒకవైపు పంజాబ్‌లో ఖలిస్థానీ శక్తులు ప్రాణం పోసుకుంటున్నయ్… మరోవైపు కేరళ ఎస్డీపీఐ, జమాతే ప్రమాదకరంగా మారుతూ కర్నాటకలో హిజాబ్ నిప్పు రగిలిస్తున్నయ్… ఇంకోవైపు బీజేపీ మాత్రం వ్యూహరాహిత్యంతో కొట్టుకుంటోంది… తెలంగాణ ఏర్పాటు మీద మోడీ చేసిన వ్యాఖ్యల సారాంశం అదే… మోడీ వ్యాఖ్య మొదటిసారి ఏమీ […]
‘దాసరి చిరంజీవి’..! తెలుగు ఇండస్ట్రీ మొత్తానికి ‘పెద్దమనిషి’… కానీ..?!
తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చిరంజీవే సర్వస్వం అని జగన్ ప్రభుత్వం గుర్తిస్తోందా..? మొత్తం ఇండస్ట్రీకి ఆయనే ప్రతినిధి అని భావిస్తోందా..? చిరంజీవి మరో దాసరి అనే సర్టిఫికెట్, అక్రెడిటేసన్ జారీచేస్తోందా..? ఇక ఫిలిమ్ చాంబర్ ఆఫ్ కామర్స్, నిర్మాతల మండలి, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వంటి సంఘాల ఉనికికి, మనుగడకు అర్థమే లేదా..? లేక వాటి మీద కూడా కమ్మ ప్రభావమే ప్రధానంగా ఉందనే భావనతో జగన్ ప్రభుత్వం వాటిని పక్కకు తోసేసి చిరంజీవిని పైకి ఎత్తుతోందా..? […]
సోల్జర్, యాక్టర్, పొలిటిషియన్, ఒలింపియన్… బతుకంతా ఓ దిశ లేని పరుగే…
చాలామంది సినిమా ఇండస్ట్రీ వాళ్లకు భీముడి పాత్ర అంటే… భారీ ఆకారం ఉండాలి… అంతే… ఓ సుమో తరహాలో లేదా ఓ మల్లయోధుడి తరహాలో ఆకారం ఉండి, గద పట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ ఉంటే చాలు… నిజానికి భీముడి పాత్ర మహాభారతంలో చాలా విశిష్టమైనది… అసలు తన కథే మహాభారతం అన్నట్టుగా చెప్పొచ్చు… అందుకే ఆమధ్య ఎవరో కేరళ బడా నిర్మాత భీముడి కోణంలోనే మహాభారతాన్ని 500 కోట్లతో నిర్మించాలని అనుకున్నాడు… ఇండస్ట్రీలో భీముడి పాత్ర […]
కడుపులా..? చెత్త కుండీలా..? వంటల వీడియోలతో బహుపరాక్..!!
మొన్న ఒక ఫుడ్ వీడియో… పుదీనా, మెంతి ఆకు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లికాడలు ప్లస్ ధనియాల పొడి, జిలకర పొడి, మసాలా ప్లస్ ఆవాలు, వెల్లుల్లి, ఉల్లి, జిలకర, మెంతులు, మినపపప్పు, శెనగపప్పు, అల్లం, పసుపు, ఇంగువ, కారం, ఎండుమిర్చి ప్లస్ నూనె, చిక్కదనం కోసం వరిపిండి లేదా సోయా… తీరా చూస్తే వంకాయ, ఆలూ, టమాట కరీ… ఇన్నిరకాల (దాదాపు 25) దినుసులు వేశాక అసలు ఒరిజినల్ వంట ఏముంది..? మనం ఏం తింటున్నామో మనకే […]
పాక్‌కు వాచిపోయింది… ఆర్మీ పోస్టులపై బలూచ్ దాడిలో 170 మంది మృతి..!?
………. By…. పార్ధసారధి పోట్లూరి ….. బలూచ్ లిబరేషన్ ఆర్మీ [BLA] పాకిస్థాన్ మిలటరీ కాంప్ మీద దాడి చేసి 170 మంది పాక్ సైనికులని చంపేశారు ! 02-02-2022, బుధవారం రోజున బలూచిస్థాన్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన పోరాట యోధులు బలూచిస్థాన్ లో ఉన్న నోష్కి [Noshki ] మిలటరీ కాంప్ మీద దాడి చేశారు. పాకిస్థాన్ ఫ్రాంటియర్ కార్ప్స్ [Pakistan’s Frontier Corps (FC) ] కి చెందిన […]
ఏడుస్తున్న పాట కాదు… ఏడిపించే పాట… ఓసారి తప్పక వినాల్సిన పాట…
కొద్దిరోజులుగా ఓ విషాదగీతం సోషల్ మీడియాలో కనిపిస్తోంది… గుండెల్ని మెలిపెట్టే పాట… నిజానికి చుట్టూ మనం రోజూ చూస్తున్న జీవితసత్యాలే… అల్లారుముద్దుగా పిల్లల్ని తల్లిదండ్రులు పెంచుకుంటారు, అప్పోసొప్పో చేసి చదివిస్తారు, పెళ్లిళ్లు చేస్తారు, ఎగిరిపోయిన బిడ్డలు ఈ ముసలి పక్షుల్ని పట్టించుకోవు… రాలిపోతే ఓ చివరిచూపు, కట్టె మీద పెట్టి కట్టెను కాల్చేయడం… ఓ ఫోటో గోడ మీదకు ఎక్కుతుంది… ఎన్ని కథలో వింటున్నాం, చూస్తున్నాం… ఎవరు ఈయన పాడింది..? ఇంతగా విషాదాన్ని పలికించిన రచన ఎవరిది..? […]
ఊదినా… ఉమ్మినా… షారూక్ నివాళి తీరులో ద్వేషప్రకటన ఏముందని..?!
ఓ పిల్లాడికి దడుపు జ్వరం… తల్లి వాడిని భుజాన వేసుకుని దగ్గరలోని మసీదుకు వెళ్లింది… అక్కడ ఓ మతపెద్ద అరచేతుల్ని గాలిలోకి చాపి, ఏదో పఠించి… మూడుసార్లు ఉఫ్ ఉఫ్ ఉఫ్ అంటూ పిల్లాడి మీద ఊదాడు… దీనివల్ల పిల్లాడిని పీడించే సాతాను, నెగెటివ్ ఫోర్స్ తొలగిపోతాయనేది ఒక నమ్మకం…… చాలాచోట్ల చిన్నప్పటి నుంచీ మనం గమనిస్తున్నదే… స్వస్థత కోసం దేవుడికి ప్రార్థన ఇది… లతా మంగేష్కర్ అంత్యక్రియలకు ముందు షారూక్ ఖాన్ ఆమెకు నివాళి అర్పించడానికి […]
- « Previous Page
- 1
- …
- 354
- 355
- 356
- 357
- 358
- …
- 466
- Next Page »