ఫేస్బుక్లో ఓ మిత్రురాలు ఉవాచ… ఎవరి మరణాన్ని సెలబ్రేట్ చేసుకోవద్దు, అనర్హుల మరణానికి నివాళీ అక్కర్లేదు..! యుద్ధాల్లో మినహా… మనకు నచ్చినా నచ్చకపోయినా ఎవరైనా మరణించినప్పుడు సంతాపం ప్రకటించడం, మరీ నచ్చని వ్యక్తి అయితే నిశ్శబ్దంగా ఉండటం..! కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుగుజనం ధోరణి విస్తుగొలుపుతోంది… ఎవరైనా సెలబ్రిటీ మరణిస్తే తన కులాన్ని బట్టి, తన రాజకీయ భావజాలాన్ని బట్టి, వ్యక్తిత్వాలు అంచనా వేయబడుతున్నయ్, వృత్తిలో ప్రతిభకు కొత్త కొలతలు వేయబడుతున్నయ్… కటువైన విమర్శలు పోస్టవుతున్నయ్… […]
మీ దుంపతెగ… ఈ కక్కుర్తి యాడ్స్ ఏంటిరా..? కథలోనే మిక్సింగా..?!
జీతెలుగులో ప్రైమ్ టైమ్‌లో వచ్చే ఓ చెత్తా సీరియల్… అందులోని చెత్తతనం గురించి కాదు ఇక్కడ మనం చెప్పుకునేది… అదొక అంతులేని దరిద్రం… ఒక సీన్ చెప్పుకుందాం… ఒక ఎపిసోడ్ ముగిసిపోతున్నవేళ… అందులో విశాల్ అని ఓ నల్కా హీరో ఉంటాడు తెలుసు కదా, తను భార్య త్రినయని కళ్లు మూసి మెట్ల మీదుగా కిందకు తీసుకొస్తాడు… నీకో సర్ప్రైజ్ అంటాడు… ఎదురుగా రకరకాల చపాతీలు… అయ్యగారూ అని తెగ హాశ్చర్యపడిపోయి, దాదాపు మూర్ఛపోతుంది హీరోయిన్… అప్పుడు […]
అంతటి బాలు ఆ రెండు పాటల జోలికి ఎందుకో వెళ్లకపోయేవాడు..!!
బాలసుబ్రహ్మణ్యం గొప్ప పాటగాడు… సకల ప్రపంచమూ ముక్తకంఠంతో అంగీకరించింది… నీరాజనాలు పట్టింది… కానీ ఒక సందేహం మాత్రం సజీవంగా ఉండిపోయింది… ఆయన కొన్ని వందల (వేలు కూడా కావచ్చు బహుశా) కచేరీలు చేశాడు… చిన్న గాయకుల నుంచి పెద్ద పెద్ద గాయకుల దాకా అందరి పాటలూ పాడాడు… కొన్నిసార్లు ఆ గాయకులకన్నా బాగా పాడాడు… తప్పులొచ్చిన చోట వినమ్రంగా, హుందాగా ప్రేక్షకులకు చెప్పాడు… కానీ ఏ కచేరీలోనూ తను మంజునాథ సినిమాలోని మహాప్రాణదీపం పాటను, జగదేకవీరుడి కథ […]
యోగి..! తను మారడు, మారే సవాలే లేదు… ఏమైనా రానీ, ఉక్కుపాదమే…
యూపీటెట్… ఉపాధ్యాయుల నియామకం కోసం ఉద్దేశించిన అర్హత పరీక్ష… దాదాపు 20 లక్షల మంది అభ్యర్థులు… పేపర్ లీకైంది… ఏం చేయాలి..? వేరే ప్రభుత్వం అయితే ఏదో ఎంక్వయిరీ అంటుంది, సీఐడీకి అప్పగిస్తుంది, అదెప్పుడూ తేలదు… ఈలోపు పార్టీలు ఒకరినొకరు బదనాం చేసుకుంటయ్… అసలే యూపీలో అరాచకానికి మారుపేరుగా ఉండే అఖిలేష్ పార్టీ, మధ్యలో దూరి పూర్వవైభవం కోసం నానా కష్టాలూ పడుతున్న ప్రియాంక వాద్రా… విమర్శలు స్టార్ట్… బురద జల్లుకోవడం స్టార్ట్… కానీ అక్కడున్నది యోగీ […]
ఎక్కడి హిందూ పఠాన్… ఎక్కడి తమిళ్… ఒక్కటయ్యారు, విధి విడదీసింది…
…… By…… Nancharaiah Merugumala…….. వినోద్ దువా హిందూ పఠానట– ఆయన భార్య ‘‘చిన్న’’ తమిళ స్త్రీ….. ప్రణయ్ రాయ్ పేరు వినగానే హిందీ జర్నలిస్టు దువా గుర్తుకొస్తాడు… దాదాపు 37 ఏళ్ల క్రితం అంటే 1984 డిసెంబర్లో దూరదర్శన్‌లో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు– విశ్లేషణల ప్రత్యక్ష ప్రసారాలు మొదలయ్యాయి. అప్పటికి 21–28 ఏళ్ల మధ్య వయసున్న మా తరానికి ఇంగ్లిష్‌లో మాట్లాడే ఎన్నికల విశ్లేషకుడు (సెఫాలజిస్ట్) ప్రణయ్ రాయ్, ఆయన మాటలు హిందీలోకి అనువదించే జర్నలిస్టు […]
… అంతర్యామి అలసితి సొలసితి, ఇంతట నీ శరణిదే జొచ్చితిని…
డాలర్ శేషాద్రి పేరు వినగానే వెంటనే ఓ సినిమా డైలాగ్ గుర్తొస్తూ ఉంటుంది… ‘‘సిటీకి ఎంతోమంది కమిషనర్లు వస్తుంటారు, పోతుంటారు, చంటిగాడు ఎప్పుడూ ఇక్కడే ఉంటాడు… లోకల్…’’ నిజంగా కూడా అంతే కదా… ఈవోలు, డిప్యూటీలు, చైర్మన్లు, ముఖ్యమంత్రులు వస్తుంటారు, పోతుంటారు… కానీ తిరుమల గుడికి సంబంధించి శేషాద్రి ఓ చంటిగాడు టైపు… ఎప్పుడో లోయర్ గ్రేడ్ గుమస్తాగా మొదలై, ఏకంగా బొక్కసం ఇన్చార్జిగా ఎదిగేదాకా ఓ ప్రస్థానం… అప్పుడెప్పుడో రిటైరైనా సరే, నిన్న కన్నుమూసేవరకూ గుడిలో […]
ఢీ నుంచి సుధీర్, రష్మి ఔట్..? ఓహో, మొత్తానికే పొగబెడుతున్నారా…!!
ఢీ పదమూడో సీజన్ అయిపోయింది… ఫినాలేకు అల్లు అర్జున్ వచ్చినట్టుగా కూడా ప్రోమో విడుదలైంది… ఐకన్ స్టార్ అంటూ బన్నీకి అపూర్వ స్వాగతం, అట్టహాసం గట్రా మోతమోగిపోతోంది… బుధవారం రాత్రితో ఆ సీజన్‌కు ముగింపు… వెంటనే పద్నాలుగో సీజన్ స్టార్ట్ చేయడమే… ఢీ ఎప్పుడూ ఆగదు… మార్పులు, చేర్పులు కూడా ఉండవు… అదే డాన్స్ ఫార్మాట్లో, అవే సర్కస్ ఫీట్లతో అలా అలా కొనసాగుతూ ఉంటుంది… ఐతే ఈసారి ట్విస్ట్ ఏమిటంటే..? రాబోయే సీజన్లో సుధీర్, రష్మి […]
సరిపడా బట్టల్లేవ్… పాత బట్టలు ఉంటే ధర్మం చేయండి బాబయ్యా…
ఫాఫం, అనసూయకు బట్టల్లేవు, ఎవరైనా పాత బట్టలు ఉంటే పంపించగలరు ప్లీజ్… రేయ్, మల్లెమాలా… ప్యాంటు వేసుకొచ్చేలోపే స్కిట్ స్టార్ట్ చేస్తారా..? అరగంట ఆగలేరా..? వచ్చేసారి బికినీతో వచ్చెయమ్మా, ఈటీవీ వాడి టీఆర్పీలు మస్త్ మస్త్ పెరిగిపోతయ్… ఆమె ప్యాంట్ మరిచిపోయి వస్తే ఎవరూ గుర్తుచేయరా, అలాగే స్కిట్ షూట్ చేస్తరా..? పాపం, ఆమెను ఏమీ అనకండ్రా, ప్రొడక్షన్ వాళ్లు ఏం ఇస్తే అదే వేసుకుంటుంది… అర్జున్‌రెడ్డి సినిమాను కంట్రవర్సీ చేయడం తెలుసు గానీ, ఈ డ్రెస్ […]
అక్కడా గుజరాతీలే బ్రదర్… షాపు తెరవాలి, జెండా పాతాలి, అంతే…
ప్రపంచంలో మీరు ఏ మూలకైనా వెళ్లండి… దట్టమైన అటవీ దేశాలు, నిస్సారమైన ఎడారి దేశాలు, ఎండపొడ తగలని ధ్రువప్రాంతాలు, కఠిన పర్వత ప్రాతాలు… ఎక్కడికి వెళ్లినా సరే, ఓ మోస్తరు జనావాసం కనిపిస్తే చాలు… అక్కడ మీకు ఓ పంజాబీ దాబా, ఓ గుజరాతీ షాప్ కనిపిస్తయ్… నవ్వకండి… అతిశయోక్తిలా అనిపించినా అందులో ఓ వాస్తవం ఉంది… వాళ్లు ఎక్కడికైనా వెళ్తారు, జెండా పాతుతారు, సొంత ఐడెంటిటీ కాపాడుకుంటారు, కష్టపడతారు, స్వదేశం విడిచి ఇంకెక్కడికో వెళ్తున్నామనే ఫీల్ […]
లష్కర్ రామయ్య కథ చదివాం కదా… ఈ హమాగుచి కథ కూడా చదవండి…
నిన్న రామయ్య అనే మాజీ లష్కర్ అన్నమయ్య ప్రాజెక్టు కింద ఉండే కొన్ని ఊళ్ల ప్రజల్ని సమయానికి ఎలా అలర్ట్ చేసి, వాళ్ల ప్రాణాల్ని కాపాడాడో ఓ స్టోరీ చదివాం కదా… అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము దాకా తెలిసినవాళ్లందరికీ ఆయన ఫోన్లు చేసి, అప్రమత్తం చేయడం వల్ల ఆ ప్రాజెక్టు తెగి, ఊళ్లను ముంచెత్తినా సరే, చాలా ప్రాణనష్టం తప్పింది… హఠాత్తుగా ఓ కథ గుర్తొచ్చింది… ఏ క్లాసో గుర్తులేదు, కానీ చిన్నప్పుడు ఒక నాన్-డిటెయిల్లోని ఇంగ్లిష్ […]
బిగ్ ఫ్రాడ్..! నాగార్జున కూడా ఇజ్జత్ పోగొట్టుకున్నాడు… అంతా ఫిక్సింగే…
బిగ్ ఫ్రాడ్..! నాగార్జున కూడా ఇజ్జత్ పోగొట్టుకున్నాడు… అంతా ఫిక్సింగే……. ఇది నెటిజనం నుంచి బలంగా వినవస్తున్న విమర్శ… అంతెందుకు..? బిగ్‌బాస్ ఓటింగులో ఎవరికెన్ని వోట్లు పడ్డాయో ప్రకటించాలంటూ తెలంగాణ జాగృతి అన్నపూర్ణ స్టూడియోస్ ఎదుట ఆందోళన… రవికి అన్యాయం జరిగిందని విమర్శ… నిజానికి ఈ బైఠాయింపులు, ఆందోళనల్ని మనం సమర్థించనక్కర్లేదు… ఆ ఫిక్సింగ్ డ్రామా గేమ్ కోసం జాగృతి మరీ దిగజారాల్సిన అవసరం అంతకన్నా లేదు… ఇందులో తెలంగాణ, నాన్-తెలంగాణ అనే కోణం అస్సలు లేదు… […]
భేష్ రామయ్యా… చప్పట్లు కొడదాం… కానీ విపత్తు సన్నద్ధత మాటేమిటి..?!
పొద్దున్నే అభినందించడం మరిచిపోయా… వందల మందిని ఓ విపత్తు నుంచి కాపాడిన మాజీ లష్కర్ రామయ్య… తన వార్తకు తగిన ప్రయారిటీ ఇచ్చిన ఆంధ్రజ్యోతి… వార్త రాసిన రిపోర్టర్‌కు అభినందనలు… మీకు ధర్మాడి సత్యం అనే పేరు గుర్తుందా..? పెద్ద పెద్ద ఇంజనీర్లు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చేతులెత్తేసిన చోట, గోదావరి అడుగు నుంచి ఓ లాంచిని నొగలు పట్టి, మెడలు పట్టి, ఒడుపుగా గట్టు మీదకు లాక్కొచ్చి పడేసిన సత్యం… తనకు తెలిసిన సంప్రదాయిక టెక్నిక్స్, అనుభవం, […]
ఈ జిల్లాలో అస్సలు పేద అనేవాడు ఒక్కడూ లేడట తెలుసా…!!
నిన్న ఒక ప్రాంతాన్ని ప్రత్యేకంగా గుర్తించడం మరిచిపోయింది, ప్రశంసించడం విస్మరించింది మన మీడియా… ఆ జిల్లా పేరు కన్నూరు… కేరళ… నిన్న నీతి ఆయోగ్ విడుదల చేసిన పావర్టీ ఇండెక్స్‌లో ఆ జిల్లా ప్రత్యేకత ఏమిటో తెలుసా..? జీరో పావర్టీ… నిజం… ఆ జిల్లాలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవాళ్లెవరూ లేరు… నీతి ఆయోగ్ తీసుకున్న ప్రమాణాల మేరకు..! ఈ ప్రమాణాలు కరెక్టేనా అనే చర్చలోకి వెళ్దాం కానీ, వాళ్లు ఎంచుకున్న ఆ ప్రమాణాల మేరకైనా సరే, ఈ […]
కవితకు రామోజీ ప్రత్యేక శుభాకాంక్షలు… ఏమైనా భావి సంకేతాలా సారూ..?!
ఒకటి గుర్తుంది… బోలెడు భాషల్లో ఈటీవీ చానెళ్లు స్టార్ట్ చేసే సందర్భం… చంద్రబాబు వచ్చాడు… చాలామంది పెద్దలు వచ్చారు… జస్ట్, రామోజీరావు అలా స్విచ్చులేవో నొక్కాడు… ప్రారంభోత్సవం జరిగిపోయింది… ప్రేమతో వచ్చాడు కదాని చంద్రబాబుతో మర్యాదకు, మొహమాటానికి కూడా ఒక్క చానెల్ స్విచ్చునూ నొక్కనివ్వలేదు… వందల మంది ఆహుతుల్లో చంద్రబాబు కూడా ఒకరు… అంతే… ఎవరొచ్చినా సరే, ఫిలిమ్ సిటీకి వెళ్లి, రామోజీతో భేటీ వేసి, చర్చించడం ఓ పెద్ద ప్రివిలేజ్ ఒకప్పుడు… అంతెందుకు..? మోడీ ప్రథమ […]
భలే తెలివైన ఇంటర్వ్యూ… ఎంతైనా ‘చతురుడైన సినిమా వ్యాపారి’ కదా…
దగ్గుబాటి సురేష్… రామానాయుడి కొడుకు… నిర్మాత, ఫైనాన్షియర్, వ్యాపారి, స్టూడియోల ఓనర్, థియేటర్ల సిండికేట్ మెంబర్… తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ పెద్ద తలకాయ… చాలా తెలివైన ఇంటర్వ్యూ ఇచ్చాడు… చతురుడైన ప్యూర్ వ్యాపారి… కర్ర విరగొద్దు, పాము చావాలి… సూటిగా మనసులో ఉన్నది చెప్పొద్దు, కాగల కార్యం జరిగిపోవాలి… ఏపీ ప్రభుత్వ నిర్ణయాలతో ఇండస్ట్రీకి నష్టం అని సూటిగా చెప్పడు, ప్రభుత్వంతో ఏదో మిస్ కమ్యూనికేషన్ ఉందంటాడు… అసలు కమ్యూనికేషన్ లేకపోవడం ఏమిటి..? మిస్ కమ్యూనికేషన్ […]
ముందస్తు ఎన్నికలకు జగన్ సై… ఆర్కే కూడా చెబుతున్నాడుగా…
తిరుపతి నుంచి విశాఖ వరకు ఒక రైలును ప్రారంభించి అందులోనే రాజధాని ఉంటుందని ప్రకటిస్తే ఏ గొడవా ఉండదు. ఎవరికి వారు తమ ఊరికే రాజధాని వచ్చిందని మురిసిపోవచ్చు. ఇందుకు పెద్దగా ఖర్చు కూడా అవదు. రాష్ట్రం ఆర్థికాభివృద్ధి సాధిస్తే ప్రజలు కూడా అభివృద్ధి చెందుతారు. అదే జరిగితే ప్రజలు తనకు ఓటు బ్యాంకుగా ఉండబోరు. అధికారం కూడా దూరమవుతుంది. తన కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందాలంటే అధికారం ఉండాలి. అందుకోసం ప్రజల మద్దతు కావాలి. కనుక […]
ఆపండ్రోయ్… ఫార్మా దందాకు ఇప్పుడు ఒమిక్రాన్ దొరికింది… అంతే…
Amarnath Vasireddy…….. ఉత్తుత్తి గాలివాన ! ఫ్లూ .. అంటే సాధారణ జలుబు . మీకు ఎన్ని సార్లు జలుబు చేసింది ? ఇదేంటి పిచ్చి ప్రశ్న అనుకొంటున్నారు కదా ? జలుబు ను ఎవడు పట్టించుకొంటారు ? ఎందుకు లెక్క పెడుతారు .. ఇది కదా మీ ఆలోచన . ఆగండి. తెల్లోళ్ళ దేశాలు వున్నాయి కదా . అదే అమెరికా, యూరోపు .. ఇక్కడ ఫ్లూ కు వాక్సిన్ వుంది . సంవత్సరానికి రెండుసార్లు […]
అయ్యా, అయ్యా… అదే థమన్… అదే అనంత శ్రీరాం… మళ్లీ ‘‘దింపేశారు’’
మీకు ఈమధ్య వచ్చిన ఏదో సినిమాలోని దిగు దిగు దిగు నాగ అనే దిక్కుమాలిన పాట గుర్తుందా..? కాపీ మాస్టర్ అనే విమర్శలున్న థమనుడు ప్లస్ ఈమధ్య తనకేమైందో తెలియని అనంత శ్రీరాముడి కాంబినేషన్ అది… బూతును దిగేశారు… రాబోయే అఖండ అనే జైబాలయ్య సినిమాలో కూడా ఓ పాట ఉందండోయ్… నిన్న ప్రిరిలీజ్ ఫంక్షన్లో దీన్ని కూడా ఆవిష్కరించినట్టున్నారు… ఈ పాటలో బూతులేమీ లేవు కానీ, మనుషుల్ని, సంగీత ప్రియుల్ని, సినిమా ప్రేమికుల్ని… ప్రత్యేకించి బాలయ్య […]
ఫాఫం… యాంకర్ రవి ఔట్..? నిజమా, అబద్దమా… అంతా ఫిక్సింగ్ యవ్వారమా..?!
నిజమా… నిజమేనా..? యాంకర్ రవి బిగ్‌బాస్ హౌజ్ నుంచి వెళ్లిపోయాడా..? అదేమిటి..? ఫైనలిస్టుల్లో ఒకడు అనుకున్నాం కదా అంటారా..? ఆశ్చర్యపోతారా..? ఏమో… బిగ్‌బాస్ హౌజ్ నుంచి లీకయ్యే సమాచారం చెబుతున్నది మాత్రం అదే… ఎహె, రవి ఎవిక్ట్ కావడం ఏమిటి..? పోలింగ్ ట్రెండ్స్ చూస్తేనేమో… ప్రియాంక, సిరి, కాజల్ లీస్ట్ వోట్లతో ఉన్నారు, రవి ఎలా బయటికి వెళ్లిపోతాడు అంటారా…? ఊరుకొండి సార్, వందల కోట్ల దందా, బెట్టింగులు జరిగే క్రికెట్ మ్యాచులే ఫిక్స్ కాగా లేనిది […]
వియా..! ఈ సీజన్ బిగ్‌బాస్ విజేత..! తొలిసారిగా కాస్త కనెక్టయిన ఎపిసోడ్…
ఎంత చెత్త టీవీ ప్రోగ్రాం అయినా సరే… ఎప్పుడైతే అందులో కాస్త ఫ్యామిలీ ఎమోషన్ యాడ్ అవుతుందో జనానికి కనెక్ట్ అవుతుంది… బిగ్‌బాస్ కూడా అంతే… ఇప్పుడొచ్చే సినిమాలు, టీవీ సీరియళ్లు, ఇతర రియాలిటీ షోలు, బూతు జబర్దస్త్ షోలతో పోలిస్తే బిగ్‌బాస్ పెద్ద అనాసక్తమేమీ కాదు… అఫ్ కోర్స్, ఈ సీజన్ బిగ్‌బాస్ తెలుగు అనేది ఓ చెత్త… అందులో డౌట్ లేదు… మొదటి నుంచీ విసిగించేస్తున్నారు, అసలు కంటెస్టెంట్ల ఎంపికే సరిగ్గా లేదు… బిగ్‌బాస్ […]
- « Previous Page
- 1
- …
- 355
- 356
- 357
- 358
- 359
- …
- 449
- Next Page »