ఎయిర్ ఇండియా తిరిగి టాటాల చేతుల్లోకి చేరనుందనే వార్త నిన్నంతా వైరల్..! సోషల్ మీడియా అత్యంత పాజిటివ్‌గా రియాక్టయింది… ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మడాన్ని, మోడీ ప్రభుత్వ పోకడల్ని నిత్యమూ నిరసించేవాళ్లు కూడా ఎయిర్ ఇండియా అమ్మకాన్ని వ్యతిరేకిస్తున్నారేమో గానీ అది టాటాల చేతుల్లోకి వెళ్లే అవకాశాల్ని మాత్రం విమర్శించడం లేదు… అంటే వాళ్ల ఉద్దేశంలో… వెళ్తే గిళ్తే ఎయిర్ ఇండియా టాటాల చేతుల్లోకి వెళ్లడం గుడ్డిలో మెల్ల అన్నమాట..! నిజానికి ఇప్పుడు దేశంలో ఆదానీ, అంబానీలదే […]
సమ నివాళి..! గాంధీనే కాదు, ఈసారి శాస్త్రినీ స్మరించుకుంటున్నాం…!!
75 సంవత్సరాల ఆజాదీ… ఈ సందర్భంగా కేంద్రం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరిట ఏడాది పొడవునా కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది… ఎప్పటిలాగే అక్టోబరు రెండో తేదీ వచ్చింది… ఈ తేదీ అనగానే స్ఫురించేది మహాత్మాగాంధీ జయంతి… దేశమంతా ఆయన్ని స్మరిస్తూ బోలెడన్ని అధికారిక కార్యక్రమాలు సాగడం పరిపాటే… తప్పేముంది, జాతిపితగా మనం కీర్తించే ఓ ఘననాయకుడిని ఏటా ఆయన జయంతి రోజున స్మరించడంకన్నామంచి నివాళి ఏముంటుంది..? అయితే పాపం, మరో మంచి నాయకుడు కూడా ఇదేరోజున పుట్టాడు… వేరే […]
తెలుగు బూతునేతలూ… ఈ దిగ్గీరాజా అనుభవాన్ని ఓసారి చదవండి…
ఈరోజు ఈ వార్త చాలామందికి నచ్చింది… ఎందుకు నచ్చిందో చెప్పుకునేముందు… ఆ వార్తేమిటో సంక్షిప్తంగా చెప్పుకుందాం… ఆమధ్య, నాలుగేళ్ల క్రితం మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ నేత నర్మద పరిక్రమ యాత్ర చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఓచోట ఆ బృందం చిక్కుబడిపోయింది… గుజరాత్లో ప్రవేశించాక ఓచోట (బహుశా భరూచ్ ఏరియా కావచ్చు) దట్టమైన అడవి, పర్వతాలు, చీకటి, ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి… హఠాత్తుగా ఓ అటవీ శాఖ అధికారి ప్రత్యక్షమయ్యాడు, దారి చూపించాడు, గైడ్ […]
ఫాఫం రమ్యకృష్ణ… ఫాఫం ఐశ్యర్యా రాజేష్… కటకటా, ఇదేంటి కట్టా దేవదేవా..?!
సాయిధరమ్ తేజ హీరోగా నటించిన, కట్టా దేవ దర్శకత్వం వహించిన రిపబ్లిక్ సినిమా గురించి స్ట్రెయిట్‌గా చెప్పుకుందాం నాలుగు మాటలు… అంతకుమించి కూడా అవసరం లేదు… నో డౌట్… దర్శకుడికి సిస్టం మీద అసంతృప్తి ఉంది… ఇది మారాల్సిందే అనే కన్సర్న్ ఉంది… ఆవేశం ఉంది… సినిమా అనే దృశ్యమాధ్యమం ద్వారా సీరియస్ ఇష్యూస్ డిస్కస్ చేయాలనే సంకల్పం ఉంది… కొత్తగా ఏమైనా చెప్పాలనే తపన ఉంది… కానీ అది సరిపోదు, సినిమాకు అది మాత్రమే సరిపోదు… […]
జూనియర్, తమన్నా బాటలో నాగార్జున… ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్, సూపర్ ఫ్లాప్…
జెమిని టీవీ… మాస్టర్ చెఫ్… 18.9.2021… శనివారం… 8.30 నుంచి 9.30 సమయం… రేటింగ్స్ కేవలం ఒకటిన్నర… నిజమే… జస్ట్, ఒకటిన్నర మాత్రమే జెమిని టీవీ… ఎవరు మీలో కోటీశ్వరులు… సోమవారం… 20.9.2021… 8.30 నుంచి 9.30 సమయం… రేటింగ్స్ 2.83… అవున్నిజమే, జస్ట్, 2.83 మాత్రమే… మాటీవీ… బిగ్‌బాస్5… ఆదివారం… నాగార్జున వీకెండ్ షో… ఎలిమినేషన్లు, స్పెషల్ గేమ్స్… 9 నుంచి 10.30 సమయం… 19.9.2021… సాధించిన రేటింగ్స్ కేవలం 5.80 మాత్రమే… జీటీవీ… ఆదివారం… […]
ఈ సైకో రేపిస్ట్ ఎన్ని హత్యాచారాలు చేస్తేనేం… ఇంకా బతికే ఉన్నాడు…
సైకో రేపిస్టు రాజుగాడు ఆత్మహతం అయిపోయి రోజులు గడుస్తున్నయ్… అయిపోయింది, మరో రాజుగాడు దొరికేదాకా మీడియా మాట్లాడదు… సత్వర న్యాయం లాభనష్టాలేమిటో ఎవరూ చర్చించరు… ఈ సత్వర న్యాయాలకు దారితీస్తున్న న్యాయవ్యవస్థ వైఫల్యాల మీద కూడా ఎవరూ ఏమీ మాట్లాడరు… అన్నట్టు ఈ సత్వరన్యాయం, న్యాయవ్యవస్థ వైఫల్యం అంటే ఓ వార్త గుర్తొస్తోంది… చెప్పుకోవాలి… ప్రముఖంగా అచ్చేయాల్సిన ఆ వార్తను కొన్ని పత్రికలు, టీవీలు అసలు వార్తగానే చూడలేదు, పట్టించుకోలేదు… ఇంతకీ ఆ వార్త ఏమిటంటే…? ఉమేశ్‌రెడ్డి… […]
భేష్ ఈనాడు… హరాకిరీ బాటలో వేగంగా అడుగులు… లావా పొంగుతోంది…!!
హవ్వ…!! ఇది ఫస్ట్ పేజీ వార్తా..? అదీ ఎక్కడో స్పెయిన్‌లో ఓ అగ్నిపర్వతం పగిలిపోతే..!! అగ్నిపర్వతం పేలిపోతే లావా ఉప్పొంగదా..? అది దాని సహజ లక్షణం కదా…. మరీ ఈనాడు వాడేమిటి..? లావా ప్రవహించడమే ఓ విశేషంగా రాస్తాడేమిటి..? తెలంగాణ ప్రాంతంలో వేరే వార్తలే లేవా..? హైలైట్ చేయాల్సిన కథనాలే లేవా..? ఏమోలెండి, ఈమధ్య ఏమీ రాయలేని దురవస్థలో కొట్టుకుంటున్నాడులే… అర్థం చేసుకుందాం… గీత దాటితే కేసీయార్ కొరడా తీసుకుని చెమ్డాలెక్కదీస్తాడనే భయం… ఇన్నేళ్ల నంబర్ వన్ […]
చైనాకు కరెంటు షాక్..! కరోనా భస్మాసురుడికి పాపఫలితాలు ప్రారంభమైనట్టేనా..?!
పార్ధసారధి పోట్లూరి ……….. చైనాలో భారీ స్థాయిలో విద్యుత్ కొరత ! విద్యుత్ కొరత వల్ల భారీ స్థాయిలో బ్లాక్ అవుట్స్ మరియు పరిశ్రమల మూసివేత జరుగుతున్నది. క్రిస్మస్ దగ్గర పడుతుండడంతో పశ్చిమ దేశాలతో పాటు యూరోపు నుండి కూడా భారీగా ఆర్డర్లు రావడంతో ఉత్పత్తిని పెంచే ప్రయత్నంలో ఉండగా, అనుకోని విధంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల మరింత ఒత్తిడిని ఎదుర్కుంటున్నది చైనా. అనుకున్న సమయానికి డెలివరీలు చేయలేకపోవచ్చు చైనా. ఈ సారి పశ్చిమ దేశాలతో […]
ఆ రోగానికి ఎలాగూ చికిత్స లేదు… నొప్పి లేకపోతే బాగుండు… భరించేస్తాం…!!
కొన్నేళ్ల క్రితం… నలుగురు వ్యాపారుల నడుమ ఓ సంభాషణ…. వాడు ఆ ఏసీటీవో గాడు, దొంగ లం-కొ… వాడు అడిగింది ఇచ్చినా సరే, ఇంకా కొర్రీలు పెడతాడు, డబ్బు గుంజుతాడు, ఏవేవో డిమాండ్లు చేస్తాడు, ఐనా పని సరిగ్గా చేసిపెట్టడు… అన్నాడు ఒకడు….. అవునవును, వాడికన్నా వాడి బాస్ ఆ డీసీటీవో చాలా బెటర్, మంచోడు, ఇచ్చింది తీసుకుంటాడు, తీసుకున్న డబ్బుకు న్యాయం చేస్తాడు, వెంటనే పనిచేసి పెడతాడు, మర్యాదస్తుడు అని మెచ్చుకున్నాడు మరొకడు…… ఇక్కడ అవినీతి […]
అసలు ఎవరు ఆ పంజాబీ మహిళ..? పూనం కౌరేనా..? ఇంతకీ ఎవరీమె…?!
గురువు గారూ, ఇంతకీ ఈ వివాదంలో బకరీగా చూడబడుతున్న ఈ పంజాబీ మహిళ ఎవరు అనడిగాడు ఓ మిత్రుడు..? మనకేమో తెలియదు… చార్మి కాకపోవచ్చు, ఆమె మన అకున్ సభర్వాల్ సాక్షిగా ప్యూర్ చార్మి జగన్నాథ్… తమన్నా భాటియా కూడా కాకపోవచ్చు, ఫాఫం, పవన్ క్యాంపుకి కాస్త దూరదూరంగానే ఉంటోంది… సోనం బజ్వాకు అంత సీన్ లేదు…. మన భానుశ్రీ..? అబ్బే, మరీ టీవీలకే సరిపోవడం లేదు… ఎహె, పూనం కౌర్ కావచ్చు… అవును, అప్పుడప్పుడూ పవన్ […]
‘ట్రిపుల్ ఎక్స్’ సంస్కార రాజకీయాలు..! రొచ్చు, బురద రేంజ్ కూడా దాటేశారు..!!
‘‘… సర్వమంగళం పాడింది’’ అన్నట్టు రాజకీయంగా పూర్తిగా దివాలా తీసిన పవన్ కల్యాణ్‌ను మళ్లీ తెరపై కనబడేలా చేస్తున్నది వైసీపీ మాత్రమే, ఆ పార్టీకి ప్రతిపక్షాన్ని కౌంటర్ చేయడంలో కూడా ఓ దిశ లేదు, ఓ దశ లేదు ……… ఈ విశ్లేషణ చాలామందికి రుచించలేదు మొన్న… నో, నో… రిపబ్లిక్ మూవీ ప్రిరిలీజ్ ఫంక్షన్లో పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు రాష్ట్ర మంత్రులు మస్తు కౌంటర్ ఇచ్చారు అని అభిప్రాయపడ్డారు… కానీ ఇప్పటికే ఒకటే నిజం… […]
బాబ్బాబూ, పెట్రోల్ ప్లీజ్… ఇంధనరవాణా లేక బ్రిటన్ లబలబ..!!
పార్ధసారధి పోట్లూరి……. ఒకప్పుడు రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం ! ఇప్పుడు ? పెట్రోల్ కోసం కాట్ల కుక్కలలాగా కొట్టుకుంటున్నారు గాస్ స్టేషన్ల దగ్గర. గత వారం రోజులుగా బ్రిటన్ లో పెట్రోల్ కోసం ప్రజలు పెట్రోల్ పంపుల దగ్గర కిలోమీటర్ల కొద్ది వేచి ఉంటున్నారు. పెట్రోల్ కొరత ఏర్పడింది అని మొదట్లో పుకార్లు వ్యాపించడమే మొదటి కారణం అయితే జనాలు పుకార్లని బాగానే నమ్మేసి అందరూ ఒకేసారి పెట్రోల్ కోసం క్యూ కట్టడంతో చాలా వరకు పెట్రోల్ […]
వాడు మగాడ్రా బుజ్జీ..! ఈ డైలాగ్ గుర్తుంది కదా… ఈ కథకూ ఆ హెడ్డింగే బెటరేమో…!!
రెండేళ్ల క్రితం కావచ్చు… ఓ సినిమా వచ్చింది… డాన్స్ లైక్ దాని పేరు… One Boy and Three Girls, A Funny Cute Love Story అని ప్రచారం కూడా చేసుకున్నారు… ఒరేయ్, ఇదేం క్రియేటివిటీరా బాబూ, అన్నిరకాల ప్రేమ పైత్యాలు అయిపోయాయి, ఇప్పుడిక ముగ్గురు ఆడాళ్లకూ ఒక మగాడికీ నడుమ ఈ ప్రేమ ఏమిట్రోయ్ అని తిట్టేవాళ్లు తిట్టారు… అసలు క్రియేటివిటీ అంటే ఇదే అని మెచ్చుకుని చప్పట్లు కొట్టినవాళ్లు కూడా ఉన్నారు… సమాజం […]
అయోమయంలో తెలంగాణ రైతు…! ప్రభుత్వ అడ్డదిడ్డ పాలసీలే అసలు రీజన్…!!
కొన్ని అంతే… తెలంగాణ ఉద్యమం ఓ సమర్థ, నిస్వార్థ, ప్రగతిశీల నాయకత్వాన్ని అందించలేకపోయిందనీ…. అంతకుముందే భ్రష్టుపట్టిన నేతల్నే తిరిగి కుర్చీలు ఎక్కించిందనీ ఏడవలేం… కనీసం సరైన వ్యవసాయ విధానాలతో రైతులకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సరైన అండగా నిలబడలేని ప్రభుత్వాన్ని అందించిందనీ ఏడవలేం… బయట జరిగే ప్రచారాలు వేరు, జరుగుతున్న నష్టాలు వేరు… ఉదాహరణకు… ఆత్మహత్యలకు రైతుబీమాయే సరైన పరిష్కారం అనే అపరిణత ఆలోచన విధానం నేడు మనం ఎదుర్కునే ఓ విషాదం… సాగు చేసినా, చేయకపోయినా […]
పథ్యం కూడు..! ఆర్కే కెరీర్లోనే అత్యంత నిస్సారమైన చప్పిడి ఇంటర్వ్యూ..!!
వైఎస్ షర్మిలను కుటుంబసన్నిహితులు షమ్మీ అని పిలుస్తారు..! ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేసిన ఆ ఇంటర్వ్యూ మొత్తం చూడబడ్డాక తెలిసిన కొత్త విషయం ఇదొక్కటే..!! అంతకుమించి ఆమె కొత్తగా ఏమీ చెప్పలేదు, ఒక్కటంటే ఒక్క కొత్తవిషయాన్ని ఆర్కే ఆమె నోటితో చెప్పించలేకపోయాడు… బహుశా అత్యంత భారీ ప్రచారంతో విడుదలై అట్టర్ ఫ్లాపయిన ఆర్కే సినిమా ఇదేనేమో… ఒక ఇంటర్వ్యూకు, అదేలెండి, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూకు విస్తృత ప్రచారం జరిగింది… చాలారోజులుగా ఈ ఇంటర్వ్యూలు ఆగిపోయి, మళ్లీ […]
ఎలిమినేషన్ జాబితాలో సగం మంది… బిగ్‌బాస్‌లో ఈసారి మెంటల్ టీమ్…
మొన్నటి ప్రియ-రవి-లహరి వివాదంలో బాధితురాలు ఎవరు..? లహరి..! మరి నిందితుడు ఎవరు..? రవి..! మధ్యలో మంటపెట్టింది ఎవరు..? ప్రియ..! మరి అంతటి నాగార్జునుడే వీడియోలు చూపి, ఏయ్, రవీ, నీ వ్యాఖ్యలు తప్పు, ఇష్టమొచ్చినట్టు మాట్లాడి, పైగా మాట్లాడలేదని బుకాయిస్తావా..? వాటీజ్ దిస్..? అని కస్సుమన్నాడు కదా… లహరి కూడా ఆ వీడియో చూసి, ప్రియ తప్పేమీ లేదని కౌగిలించుకుని సారీ కూడా చెప్పింది కదా… మరి ఇక్కడ శిక్షింపబడాల్సింది ఎవరు..? రవి…! పిచ్చి కూతలు కూసింది […]
బాబు గారూ బీకేర్‌ఫుల్… మీ దారిలో భద్రత ‘జెడ్ మైనస్’ అనిపిస్తోంది…
బాబు గారూ… ఎందుకైనా మంచిది, కాస్త ఆ తాడేపల్లి ఇంట్లో నివాసం కొన్నాళ్లు మానెయ్… ఆ కేశినేని కాకపోతే మరొకరు, మీకు ఆశ్రయం కల్పించే ఇల్లే దొరకదా..? ఆతిథ్యం ఇచ్చే కార్యకర్తే దొరకడా..? మీకోసం ప్రాణాలిచ్చేవాళ్లు బోలెడు మంది… పైగా అదసలే విజయవాడ… మన అమరావతికి అనుబంధ నగరం… పైన అమ్మవారు, కింద కమ్మవారు అనే సూత్రం ఆధారంగా చెప్పడం లేదు గానీ బెజవాడలో పచ్చదనం ఎక్కువే సుమీ… ఐనా అప్పుడప్పుడూ మీరు తాడేపల్లికి చుట్టపుచూపుగా వెళ్లి […]
ఔనా… నిజమేనా… బ్రాహ్మణుల్ని జగన్ బీసీ జాబితాలో కలిపేస్తున్నట్టేనా…
హేమిటో… ఈ స్వాముల ఆ అలౌకిక శక్తి జ్ఞానాలేమో గానీ… బొత్తిగా ప్రాపంచిక జ్ఞానం నుంచి మరీ దూరమైపోతున్నారు… రాజకీయాలు, రాజకీయ అధికారం మీద, తద్వారా సమకూరే పెత్తన శక్తుల మీద మమకారం, ఆపేక్ష, ఆసక్తి, ప్రేమ ఉండవచ్చుగాక… కానీ ఆ దిశగా అడుగులు, ఆలోచనలు, మాటలు, వ్యాఖ్యలు కూడా సరిగ్గా ఉండాలి కదా… మంత్రోచ్ఛారణ సరిగ్గా లేకపోతే ఎంత నష్టదాయకమో, బేసిక్స్ తెలియకుండా రాజకీయ వ్యాఖ్యలు చేయడం కూడా అంతే అనర్థదాయకం… విశాఖ శ్రీ శారదా […]
పవన్ కల్యాణ్ కోరుకున్నదే జరిగింది..! వైసీపీకే ఓ స్ట్రాటజీ లేకుండాపోయింది..!!
పవన్ కల్యాణ్ పిచ్చోడేమీ కాదు… జనం అన్ని ఎన్నికల్లోనూ ఘోరంగా తిరస్కరించి ఉండవచ్చుగాక… ఎంచక్కా మళ్లీ సినిమాలు చేసుకుంటూ ఉండవచ్చుగాక… కానీ తను నిర్మించుకున్న పొలిటికల్ ప్లాట్‌ఫాం మనుగడ కాపాడుకోవాలి కదా… ఎప్పుడో ఓసారి, ఏదో ఓ సందర్భం, ఏదో ఓ అంశాన్ని పట్టుకుని ప్రచారతెర మీదకు రావడం… నేను రాజకీయాల్లోనే ఉన్నానహో అని చాటుకోవడం… అది ఆయన అవసరం… నాదెండ్ల మనోహర్ తప్ప ఇంకెవరూ ఉన్నట్టు లేదు… ఆ గెలిచిన ఏకైక ఎమ్మెల్యే సహా అందరూ […]
రెడ్డిబంధు..! కేసీయార్ మదినిండా రెడ్లపై మత్తడి దూకుతున్న ప్రేమ..!
అందరూ ఆడిపోసుకుంటారు గానీ… నిజానికి జగన్ ప్రభుత్వం కాదు, రెడ్లకు మస్తు పదవుల్ని ఇచ్చి, అమితంగా ప్రేమిస్తున్నది కేసీయార్…! పవన్ కల్యాణ్ కూడా తిట్టిపోస్తాడు గానీ, సరిగ్గా లెక్కతీస్తే బహుశా జగన్‌కన్నా అనేక రెట్లు కేసీయారే రెడ్లను ప్రేమిస్తున్నట్టున్నాడు… ప్చ్, పాపం, కేసీయార్‌ను సరిగ్గా అర్థం చేసుకోలేక… ‘‘రెడ్లను తొక్కుతున్నాడు, సరైన ప్రాధాన్యం ఇవ్వడు, అంతా వెలమరాజ్యం అయిపోయింది, కాంగ్రెస్ అంటేనే రెడ్ల పార్టీ కాబట్టి, రెడ్లను తొక్కితే కాంగ్రెస్ పని మటాష్ అనుకుంటున్నాడు, అసలు తెలంగాణలో […]
- « Previous Page
- 1
- …
- 357
- 358
- 359
- 360
- 361
- …
- 439
- Next Page »