‘‘కేరళ సి.ఎం. మామూలోడు కాదు…. ఏం చేశారో తెలుసా…? కమ్యూనిస్టు భావజాలం నీది.. చాలా కష్టం. నువ్వు బతకలేవురా అంటూ కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలను అంటుంటారు. కానీ కమ్యూనిస్టులు ఎలాంటి వారో అందరికీ తెలుసు. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేయడంలో వారిది కీలక పాత్ర. ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కమ్యూనిస్టు ముఖ్యమంత్రులే ఉన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని పరిష్కరించడంలో వీరికి అందె వేసిన చేయి. అందులో కేరళ సిఎం పినరయి […]
చంటోడిని భుజాన వేసుకుని అడవిబాట పట్టిన ఈ మహిళ ఏమైపోయింది..?!
ఒక డిస్టర్బింగ్ ఫోటో ఇది… ఆ అడవిలో ఎవరామె చంటి బిడ్డను ఎత్తుకుని వెళ్తోంది..? ఎవరి కోసం..? ఏ అన్వేషణ కోసం..? ఇదే కదా మీ ప్రశ్న… ఆమె పేరు అర్పిత… చత్తీస్‌గఢ్, బీజాపూర్ అడవుల్లో తన భర్తను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తోంది… ఆమె భర్త అజయ్ రోషన్ ఓ ప్రభుత్వ శాఖలో సబ్ ఇంజనీర్… బీజాపూర్ జిల్లా, మాంకెలి ఏరియాలో ఘడ్ గోర్నా రోడ్ సర్వే కోసం తన అటెండర్‌తో కలిసి వెళ్లినప్పుడు నక్సలైట్లు కిడ్నాప్ […]
ఓహో.., అది బీజేపీ నిర్ణయం కాబట్టి గుడ్డిగా వ్యతిరేకించాలా..?!
అధికారంలో ఉన్నవాడు ఏం చేసినా అనుమానించాలి, ఖండించాలి, వ్యతిరేకించాలి, ఆడిపోసుకోవాలి, అడ్డుకోవాలి….. ఈ దిక్కుమాలిన రాజకీయమే ఈ దేశానికి ప్రధాన శాపం… చిన్న డిస్‌క్లెయిమర్ ఏమిటంటే… బీజేపీ ఏమీ శుద్ధపూస కాదు…!! ప్రతి అంశాన్ని బీజేపీ కోణంలోనే చూసి, మోడీ వ్యతిరేక కోణంలో మాత్రమే ఆలోచించి, ఆర్ఎస్ఎస్ నిర్ణయంగానే ముద్రవేసి, హిందుత్వ-మనువాద ధోరణి అని తేల్చేసి, ప్రజావ్యతిరేకం అని తీర్పు చెప్పేయాలా..? నవీన్ పట్నాయక్ వంటి ఒకరిద్దరు న్యూట్రల్ రాజనీతిజ్ఞులు మినహా ప్రతి సీఎం అలాగే ఉన్నాడు, […]
చిప్పకూడు..! ఓ కోర్టు భలే ఆర్డరేసింది… బాగుంది… కానీ..?
ఒరేయ్, నీ అవినీతి బయటికి తీసి, జైలులో చిప్పకూడు తినిపిస్తానురా..? అని భీకరంగా హెచ్చరిస్తుంటాడు ఓ పార్టీ నాయకుడు మరో నాయకుడిని… ఛిఛీ, చిప్పకూడు తినివచ్చినవాడు కూడా నీతులు చెబుతున్నాడు, ఇంతకు నీచం ఏముంది అని ప్రెస్మీట్లో సొల్లు కక్కుతూ, ఆయాసపడుతూ ఉంటాడు మరో నాయకుడు మరోచోట… నిజంగా చిప్పకూడు, అనగా సినిమాల్లో చూపించినట్టుగా, వీళ్లు సొట్టలు బడిన ఓ రాతెండి బొచ్చె పట్టుకుని, ఖైదీల వరుసల్లో నిలబడతారా..? మన భ్రమ..! పిండి కొద్దీ రొట్టె… అసలు […]
అశ్శరభ శరభ… ఓంకార్ మాయాద్వీప మంత్రదండం విరిగిపోయింది…
మొన్నొకసారి కాసేపు… నిజంగా కాసేపే మాయాద్వీపం అనబడే ఓ రియాలిటీ షోను చూడటం తటస్థించెను… ఒకింత ఠారెత్తినట్టు అనిపించెను… ఆ దిక్కుమాలిన పిచ్చి సీరియళ్లే నయం కదా, ఆ దర్శకుల సాముగరిడీలు చూస్తూ కామెడీగా పడీ పడీ నవ్వుకోవచ్చు అని కూడా అనిపించెను… అసలు ఆ మాయాద్వీపంలో వేరే దెయ్యాలు, భూతాల సెట్లు దేనికి..? ఆ బవిరిగడ్డంతో ఓంకారన్నయ్యే ఓ పెద్ద మాయల ఫకీరులాగా ఉన్నాడు కదా అని నవ్వొచ్చెను… ప్రాణభీతితో వెంటనే చానెల్ మార్చేసి, ఈసారి […]
హిందూ భక్తుల సొమ్మే అప్పనంగా దొరికిందా..? ఓ ఇంట్రస్టింగ్ కేసు…!!
ఎన్నాళ్లుగానో ఉన్న చర్చే… చర్చిలు, మసీదులు, గురుద్వారలు, జైన గుళ్లు, ఇతర తెగల ప్రార్థనాలయాల మీద లేని ప్రభుత్వ పెత్తనం హిందూ గుళ్లు, సంస్థల మీద ఎందుకు..? గుళ్లకు ధర్మకర్తలుగా రాజకీయ నాయకులు, నామినేటెడ్ అనుచరులు దేనికి..? ఏ గుళ్లో ఏ పూజ ఎలా చేయాలో కూడా కోర్టులు ఎందుకు నిర్దేశించాలి..? ఆచారాలు, ఆగమాల మీద వాటికున్న పరిజ్ఞానం ఎంత..? అవి అకస్మాత్తుగా పీఠాలుగా ఎందుకు వ్యవహరించాలి… ఇది మరో చర్చ… సరే, ఇవెప్పుడూ ఉండేవే… పోనీ, […]
అసలే మాస్ ప్రభాస్, ఆపై పూజాహెగ్డే… ఈ హైక్లాస్ భావకవిత్వం నప్పుతుందా..?!
ఎవరో వీరెవరో… కలవని ఇరు ప్రేమికులా..? విడిపోని యాత్రికులా..? వీరి దారొకటే… మరి దిక్కులే వేరులే… ఊపిరొక్కటేలే… ఒక శ్వాసలా, నిశ్వాసలా… ఆటాడే విధే ఇదా ఇదా, కలవడం ఎలా..? కలా..? రాసే ఉందా..? ఈ రాతలే, దోబూచులే…… ప్రభాస్, పూజా హెగ్డే నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాలోని ఓ పాట ఇది… ఇప్పటిదాకా మీరు చదివింది పాటలోని మొదటి భాగం… ఇరుప్రేమికులు అంటాడు, కలవరు అంటాడు, విడిపోని యాత్రికులు అంటాడు… మళ్లీ వెంటనే దారొకటే, కానీ దిక్కులు […]
వావ్… ఇంత అగ్గిమండినట్టు బహుశా అమిత్‌షాకు కూడా తెలిసి ఉండదు…
కొన్ని వార్తలు భలే ఆశ్చర్యపరుస్తయ్… నవ్వు కూడా తెప్పిస్తయ్… ఆంధ్రజ్యోతిలో ఓ ఫస్ట్ పేజీ వార్త… ఏపీ బీజేపీ నేతలపై అమిత్ షా ఫైర్… ‘‘ఆయ్, ఏమనుకుంటున్నారు మీరంతా..? అమరావతి రైతులకు ఊరూరా జనం పూలు జల్లి స్వాగతాలు చెబుతుంటే మీరేం చేశారు..? ఎందుకు మద్దతు ప్రకటించలేదు..? టీడీపీ భలే వాడుకుంది… ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు, అసలు ఆంధ్రజ్యోతి మీద బ్యాన్ పెట్టడం ఏమిటి, నాన్సెన్స్, అది జనం మెచ్చిన మీడియా, ఎవరిని అడిగి బ్యాన్ పెట్టారు..? […]
#istandwithsuriya …. జైభీమ్ వివాదంలో హీరో సూర్యకు నెటిజనం భారీ మద్దతు…
నిజానికి ఇదొక నాటకం… ప్రతివాడూ ఏ సినిమాలో ఏముందో వెతకడం, ఓ పాయింట్ పట్టేసుకోవడం, గెలకడం, మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఎమోషన్స్ రెచ్చగొట్టడం… మరీ అర్థంపర్థం లేని విషయాలనూ వివాదంలోకి లాగడం, ఓ లీగల్ నోటీస్ పంపించడం, తరువాత సంప్రదింపులు, బేరాలు గట్రా… అవి పెద్దగా పనిచేయడం లేదని ఈమధ్య కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారు… ఆ సినిమా బాధ్యుడి మీద దాడి చేస్తే లక్ష, ఒక్కో దెబ్బకు వెయ్యి రూపాయలు… ఇలా రేట్లు, టారిఫ్ ప్రకటిస్తున్నారు… సోషల్ […]
హమ్మయ్య… కార్తీకదీపానికి త్వరలో శుభం కార్డు… రేటింగ్స్ ట్రెండ్ ఏంటో తెలుసా..?!
స్టార్ హీరోల కొత్త సినిమాల ప్రీమియర్ షోలను మించిపోయి… కొన్ని నెలలుగా తెలుగిళ్లల్లో దుమ్మురేపిన కార్తీకదీపం కథ కంచికి చేరబోతున్నట్టే…! స్టార్ మాటీవీ వాడి రేటింగ్ సాధనసంపత్తిని బట్టి చూస్తే ఏ సీరియల్‌నైనా దింపేయగలడు, ఎత్తుకోగలడు… తనే ఇప్పుడు లైట్ తీసుకుంటున్నాడు… సో, కథ ముగింపుకు రాబోతున్నదని అర్థం చేసుకోవాలి… కొద్దివారాల రేటింగ్ ట్రెండ్స్ చూసినా… వేరే సీరియళ్ల రేటింగ్స్ పెరుగుతున్న తీరు చూసినా స్పష్టంగా అర్థమవుతోంది అదే… నిజానికి ఈ సీరియల్ ఈ స్థాయిలో హిట్ […]
RRR… సీఎం జగన్ తెలిసితెలిసీ ఆ తప్పెందుకు చేస్తాడు..?
అబ్బెబ్బె… నో, నో… మేం అస్సలు కోర్టుకు పోవడం లేదు… పోయే ఉద్దేశమే లేదు… కాకపోతే మా సినిమాకు జరగబోయే నష్టంపై సీఎంను కలుస్తాం, పరిష్కారం చూపమని అడుగుతాం……… ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య ట్విట్టర్లో అధికారికంగానే పోస్ట్ చేశాడు ఇలా..! ఇండస్ట్రీలో మామూలు వ్యక్తిని కదిలించినా సరే… ‘‘అవును కదండీ, టికెట్ల ధరలు తగ్గిస్తే నిర్మాతలకు నష్టం కాదా..? లవ్ స్టోరీ సినిమాయే చూడండి, తెలంగాణలో మంచి వసూళ్లు, ఏపీలో నష్టాలు… దానయ్య అడిగేది సబబే కదండీ’’ […]
ఈ అఖండ బాలయ్య పంచ్ డైలాగ్ జగన్ పైనేనా..?
బోయపాటి…. మితిమీరిన హీరోయిజాన్ని చూపిస్తాడు… బాలయ్య… అచ్చం బోయపాటికి తగిన హీరో… ఇప్పటికీ అదే టెంపర్, అదే స్టయిల్… సినిమాల్లో ఎవడెన్ని ప్రయోగాలైనా చేసుకోనీ, తన సినిమాలు మాత్రం సూపర్ హీరోయిజంతో దద్దరిల్లాల్సిందే… బ్లడ్డు, బ్రీడు టైపు పంచ్ డైలాగులు పడాల్సిందే… అవీ ఎంజాయ్ చేసేవాళ్లు ఉంటారు, అది వేరే కథ… అయితే పొలిటికల్ పంచులు వేయడం బోయపాటి, బాలయ్య కాంబినేషన్లో తొలిసారి కావచ్చు బహుశా… రాబోయే అఖండ అనే సినిమా ట్రెయిలర్ రిలీజ్ అయ్యిందిగా… అందులో […]
అమ్మో… అమ్మే…! టాప్ రేటెడ్ తెలుగు డైలాగుల్లో బహుశా ఇదే నంబర్‌వన్..!
….. By……. Bharadwaja Rangavajhala………… అమ్మో అమ్మే …! మాయాబజార్ సినిమాలో శశిరేఖ రూపంతో శయ్యాగృహంలో పడుకుంటాడు ఘటోత్కచుడు. కాస్త అస్తవ్యస్తంగా బోర్లా పడుకుని ఉంటాడు. ఇంతలో … చెలికత్తెలు వచ్చి నిద్రలేపే ప్రయత్నం చేస్తారు. శశిరేఖ రూపంలోకి మారిన తొలిరోజే కావడంతో ఘటోత్కచుడికి చప్పున తను ఎక్కడున్నదీ స్ఫురించదు. తన గొంతుతో స్పందించే ప్రయత్నం చేస్తాడు. కళ్లు తెరిపిడి పడ్డ తర్వాత కాస్త ఈ లోకంలోకి వచ్చి … నెమ్మదిస్తాడు. అయినా పూర్తిగా నిద్ర వదలదు […]
గుడ్… పునీత్‌కు ఈటీవీ నివాళి… చెత్తా హీరోల బర్త్డేలే కాదు, రియల్ హీరోల స్మరణ…
అంతకుముందు ఈటీవీలో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో అచ్చం కొన్ని జాతరల్లోని రికార్డింగ్ డాన్సులు, బూతు షోలా అనిపించేది… వెకిలి, వెగటు… అఫ్కోర్స్, రెచ్చిపోదాం బ్రదర్ అలాగే ఉంది… అరె, ఏందిర భయ్, ఈటీవీ డైరెక్టర్లు నితిన్, భరత్‌లను నాగబాబు ఎత్తుకుపోయాక ఇక ఈటీవీకి ఎవరూ దొరకలేదా..? ఏదో జాతర నిర్వాహకుల్ని తెచ్చిపెట్టుకున్నారా అనిపించేది… కానీ సుధీర్‌ను యాంకర్‌గా చేసి, కొన్ని మార్పులు చేశారు… కామెడీతో పాటు మ్యూజిక్, మ్యాజిక్, డాన్సులే కాదు… రకరకాల […]
ఆహా… ఇక శ్రీముఖి వండుతుంది..! ఈ షోలలో బేసిక్ తప్పులేమిటంటే..?!
ఆహా ఓటీటీలో శ్రీముఖి హోస్టుగా చెఫ్ మంత్ర అని ఓ కొత్త ప్రోగ్రాం రాబోతోంది… ఏముంది లెండి, సింపుల్‌గా చెప్పాలంటే ఇంకో వంటలక్క… ఆ పోస్టర్ చూడగానే ఓసారి నవ్వొచ్చింది… ‘‘ఒరేయ్ బాబూ, యాంకర్ల మొహాలు చూసి, జడ్జిలను చూసి ప్రేక్షకులు వంటల ప్రోగ్రాములను చూడరుర భయ్, వంటలు సగటు ప్రేక్షకుడికి కనెక్ట్ కావాలి, వంటల పోటీ తీరు ఆకట్టుకునేలా ఉండాలి… అంతేతప్ప, తమన్నాను పెడితే ప్రోగ్రాం క్లిక్ కాదు, ఆమె ఫ్లాప్ అయ్యిందని అనసూయను పెట్టగానే […]
ఈటీవీ జబర్దస్త్, ఢీ షోలలో హైపర్ ఆది కంటిన్యూ అవుతాడా..?!
తమ టీం పట్ల మల్లెమాల శ్యాంప్రసాదరెడ్డి ఫుల్ ఫైర్ అవుతున్నాడు… దీన్ని ఎలా చల్లబరచాలో తనకే అర్థం కావడం లేదట… ఏమిటి..? హైపర్ ఆది మంచు విష్ణును టార్గెట్ చేస్తూ ఓ పండుగ స్పెషల్ షోలో చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు, తరువాత ఉత్పన్నమవుతున్న తల్నొప్పి… హైపర్ ఆది మీద మంచు ఫ్యామిలీ ఫ్యాన్స్ ఫుల్లు గరం మీద ఉన్నారనేది కరెక్టు… అది ఇప్పుడప్పుడే చల్లారదనేదీ నిజం… ఇప్పటికే దాడికి ప్రయత్నించారా, దాని మీద ఆది స్పందన ఏమిటో […]
హళ్లికిహళ్లి… సున్నకుసున్నా… అప్పుల పులి మీద జగన్ స్వారీ…
‘‘ఆరు నెలలయ్యాయి… 60 వేల కోట్ల ఆదాయం వచ్చింది, 40 వేల కోట్ల అప్పులు తెచ్చారు, అంటే లక్ష కోట్లు… అందులో సగం జనానికి పంచిపెట్టారు… ఉద్యోగుల జీతాలకు, పాత అప్పుల కిస్తులు, మిత్తీలకు మిగతా సొమ్ము ఖర్చయిపోయింది… హళ్లికిహళ్లి సున్నకుసున్నా… మరో ఆరు నెలల్లో మరో 40 వేల కోట్ల అప్పులు తేవాలి, లేకపోతే బండి నడవడం కష్టం… ఈ నొగలు ఎప్పుడు విరిగిపోయి కూలబడుతుందో తెలియదు…’’ ఏపీ ఆర్థిక వ్యవస్థపై సగటు మనిషికి కూడా […]
జెస్సీ ఔట్..! అసలే డల్లు, ఆపై అనారోగ్యం… సన్నీ కథ ముందుంది…
నిజానికి జస్వంత్ అలియాస్ జెస్సీ ఇన్నిరోజులు బిగ్‌బాస్ హౌజులో ఉండటమే విశేషం… తను డల్ ప్లేయర్… అందులోనూ ఓసారి కాలికి గాయం, తరువాత అనారోగ్యం… ఎప్పుడూ ఏ టాస్కులోనూ పెద్దగా ఇంప్రెసివ్ లేడు… మొదట్లో వోకే గానీ, కాంపిటీషన్ చాలా టైట్ అయ్యేకొద్దీ జెస్సీ వంటి ప్లేయర్లు నిలబడలేరు… వోటింగులో కూడా పెద్దగా నిలబడరు… దీనికితోడు బిగ్‌బాస్ ఈమధ్య తనను ఏవో సందేహాలతో సీక్రెట్ రూం పేరిట క్వారంటైన్ చేశాడు… ఏమైందో ఏమిటో, డాక్టర్లు ఏం చెప్పారో […]
జబర్దస్త్ వదిలేస్తానని సుడిగాలి సుధీర్ ఝలక్..! తలపట్టుకున్న మల్లెమాల, ఈటీవీ..!!
ఈటీవీకి భారీగా రేటింగ్స్ తెచ్చిపెట్టే ప్రోగ్రాములకు నిర్మాతలు మల్లెమాల ఎంటర్టెయిన్మెంట్స్… ఈటీవీ, ఈ సంస్థకూ నడుమ మంచి సంబంధాలున్నయ్, చాలా ఏళ్లుగా అవి కొనసాగుతున్నయ్… ఈటీవీకి ఏం కావాలో మల్లెమాలకు తెలుసు, మల్లెమాలకు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో ఈటీవీకి తెలుసు… మల్లెమాల టీవీ వ్యవహారాల్ని శ్యాంప్రసాదరెడ్డి పెద్దగా వ్యక్తిగతంగా రోజూ పట్టించుకోకపోయినా సరే, ఇష్యూస్ వచ్చినప్పుడు తనే కలగజేసుకోవాలి… రోజువారీ వ్యవహారాలు ఎవరు చూస్తారో తెలియదు… ఇప్పుడు వార్త ఏమిటంటే..? ఈటీవీకి మంచి రేటింగ్స్ తీసుకొచ్చేందుకు కీలకమైన […]
చంద్రబోసూ… నీపాటకన్నా నీ వివరణ మహా ‘చెడ్డనాటు’గా ఉందబ్బా…!!
సహజమే… ఏ పాటల రచయితకైనా తను రాసిన పాటంటే సొంత బిడ్డ… తనకే ముద్దు… సమర్థించుకుంటాడు… కోవాలి… అయితే అది అన్నిసార్లూ కాదు… కొన్నిసార్లు నోరు మూసుకోవాలి… అదే ఉత్తమం… ఈ విషయం దిగుదిగుదిగునాగ అని ఓ బూతు పాట కుమ్మేసిన అనంత శ్రీరాంకు తెలుసు, ఏంది పిల్లగా, ఓ భక్తి పాటను, ఇలా ఓ బూతుపాటను చేసేశావ్ అని ఫేస్బుక్లో జనం బూతులు తిడితే ఇక సైలెంట్ అయిపోయాడు… తనకు తెలుసు, తన ఆత్మకు తాను […]
- « Previous Page
- 1
- …
- 358
- 359
- 360
- 361
- 362
- …
- 449
- Next Page »