నిజానికి ఈ పెళ్లిని చట్టం ఒప్పుకోకపోవచ్చుగాక… కానీ సమాజం హర్షిస్తుంది..! ఓ మాంచి సినిమా కథ… ఛఛ, కాదు కాదు… అంతకుమించి..! ఎందుకంటే ఈ కథలో నిఖార్సయిన ఓ అక్క ప్రేమ ఉంది, కాబోయే భార్య కోరికను తీర్చిన భర్త ఉన్నాడు, హర్షించి ఆశీస్సులు జల్లిన సమాజం ఉంది… సహజంగానే ఎప్పుడూ సొసైటీకి విరుద్ధంగానే వెళ్లే పోలీసులున్నారు, అధికారులున్నారు… అఫ్ కోర్స్, వాళ్లెప్పుడూ అంతే కదా… అదేమంటే చట్టాలు, తొక్కాతోలు… ఈ ఒక్క విషయంలోనే పెద్ద కర్తవ్యనిర్వహణ […]
ఇజ్రాయిల్ అంటే అంతే..! నో కాంప్రమైజ్..! ఈ థ్రిల్లర్ ఓసారి చదవండి..!
ముందుగా వాట్సప్ గ్రూపుల్లో బాగా సంచరిస్తున్న ఒక పోస్టులోని ఒక భాగాన్ని తీసుకుందాం… అది ఇజ్రాయిల్‌కు అనుకూలంగా బీజేపీ సోషల్ బ్యాచ్ పుష్ చేస్తున్న పోస్ట్… బాగానే వైరల్ అవుతోంది… అయితే ఆ మొత్తం పోస్టు గాకుండా… అందులో ఒక స్టోరీని తీసుకుందాం… ఇజ్రాయిల్ ధోరణి స్థూలంగా ఎలా ఉంటుందో ఈ కథ మనకు చెబుతుంది… ఈ కథ పేరు ‘ఆపరేషన్ థండర్ బోల్ట్’… అయితే ఈ వైరల్ కథలో లేని కొన్ని ఫినిషింగ్ టచెస్ ఏమిటో […]
తన ఇంటినే కరోనా కేర్ సెంటర్ చేశాడు… మంచి పని హోం మంత్రి గారూ…
తమ తమ అధికార హోదాల్ని అడ్డం పెట్టుకుని కోట్లకుకోట్లు కుమ్మేసిన పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల్లో ఎందరు ఈ మహావిపత్తువేళ ప్రజలకు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు..? ఒక్కసారి ఆలోచించండి… వేలు, లక్షల కోట్ల సంపాదన మరిగినా నిజంగా సమాజం మొత్తం కకావికలం అవుతున్న ఈ సంక్షోభకాలంలో ఒక్కరైనా ముందుకొచ్చిన మంచి ఉదాహరణ చెప్పండి… ఆఫ్టరాల్ సినిమా తారల్ని కాసేపు వదిలేద్దాం… మంత్రులు, ఎంపీలు, పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లు..? ఠక్కున ఒక్క పేరు కూడా గుర్తుకురావడం […]
ఊరుకునేది లేదు..! జగన్ ప్రభుత్వం నుంచి ఇదీ సంకేతాల స్పష్టత..!
సీఎం మీద వ్యాఖ్యలు చేస్తున్నందుకు… బెయిల్ రద్దు పిటిషిన్లు వేసినందుకు… ఎంత కోపమొస్తే మాత్రం అలా ఒక ఎంపీ మీద రాజద్రోహం కేసు పెట్టేసి, కస్టడీలో పడేసి కొట్టేస్తారా..? హేమిటి..? పోలీసులు కాదా..? ఎవరో ఆగంతకులు వచ్చి పోలీస్ కస్టడీలో ఉన్న ఓ ఎంపీని కొట్టిపోతారా..? ఇదేం అరాచకం..? రేప్పొద్దున ఎవరు ఏం మాట్లాడినా ఇదే గతి అని చెబుతున్నారా ఏం..? రెండు మీడియా చానెళ్లనూ ఇరికించి, ఇకపై ఎవడు ప్రభుత్వం మీద విమర్శలు చేసినా మర్యాద […]
రెమ్‌డెసివర్, టోస్లీజుమాబ్ డ్రగ్స్‌కు తోడు ఇప్పుడిక ఈ మందుకూ బ్లాక్ దందా..!!
………….. Ganga Reddy A……….. వీలైనంత మందికి ఆ injections సంబంధించిన details ఇచ్చాను. కానీ అందరికీ ఆన్సర్స్ ఇవ్వలేకపోతున్నాను. వచ్చిన మెసేజెస్ బట్టి , కాల్స్ బట్టి బ్లాక్ ఫంగస్ బాధితుల సంఖ్య పెరుగుతుందని అర్థం అవుతుంది. వారందరు అటూ ఇటూ ఇంజెక్షన్స్ కోసం పరుగెడుతున్నారని అర్థం అవుతుంది . బాధితులని , వారి బంధువులని చూస్తే బాధ పడటం తప్ప, ఏమి చేయలేని పరిస్థితి . మాటలు లేవు . బ్లాక్ ఫంగస్ వచ్చిన […]
ఇజ్రాయిల్‌ను కాపాడేది ‘ఐరన్ డోమ్’… మరి ఇండియా పొజిషన్ ఏమిటి..?
పాలస్తీనా నుంచి హమాస్ ఉగ్రవాదులు రాకెట్లతో భీకరంగా ఇజ్రాయిల్‌పై దాడి సాగిస్తున్నారు… వందల రాకెట్లు… వాటిని మధ్యలో అడ్డగించి పేల్చేస్తున్నది ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థ… ఆ వ్యవస్థ పేరు ఐరన్ డోమ్… అంటే తెలుగులో ఉక్కు ఛత్రం… ఆ రాకెట్ల వర్షం నుంచి కాపాడేది… నిజంగానే 90 శాతం సక్సెస్ రేటుతో కాపాడుతోంది… మరి మన పరిస్థితి ఏమిటి..? ఇటు చైనా అనే ఓ బడా బాహుబలి… ఇటు పాకిస్థాన్ అనబడే ఓ చోటా బాహుబలి… అణ్వస్త్రాలు […]
చదువుతుంటేనే కడుపు తరుక్కుపోయే ఈనాడు వార్త..! ఐనా ఎవరికి పట్టిందిలే..!!
శవాలకు కూడా వైద్యం చేసి… ఆస్తులన్నీ అమ్మించి… అప్పులపాలు చేసి… మనిషి సర్వభ్రష్టుడిని చేసే కార్పొరేట్ హాస్పిటళ్ల దందా అందరికీ తెలుసు… కానీ ప్రజావైద్యం సరిగ్గా లేక, వేరే దిక్కులేక… జనం తమ బతుకుల్ని తాకట్టు పెట్టాల్సిన దురవస్థ…. ఐనా మన ప్రభువులు వెనకేసుకుని వస్తారు… ప్రజలపై వాళ్లకున్న అమితమైన ప్రేమ అది… కీలకస్థానాల్లో ఉన్నవాళ్లు ప్రెస్మీట్లు పెట్టి, బిస్కెట్లు తింటూ… అంతా బాగానే ఉంది… అని పలుకుతుంటే, ఆ ప్రవచనాలు టీవీల్లో విని, పత్రికల్లో చదివిన […]
నిజమేనబ్బా..! సినిమాయే కదా, ఎవరైనా తీసేయొచ్చు… ఈ సినిమాలాగే…
బడా బడా నిర్మాత బాబులు, దర్శక బాబులు, హీరో బాబులు, బ్రోకర్ బాబులు, డిస్ట్రిబ్యూషన్ బాబులు, బయ్యర్ బాబులు…. బాబులందరూ కలిసి కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినిమాను రోగగ్రస్తం చేశారు… అత్యంత పవర్ఫుల్ క్రియేటివ్ కమ్యూనికేషన్ సినిమా… జనానికి చైతన్యాన్ని, జ్ఞానాన్ని మాత్రమే కాదు, అపరిమితమైన వినోదాన్ని కూడా పంచగల మాధ్యమం… ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో కొత్త కెరటాలు వస్తున్నయ్… బూజును, పాచిని ఎంతోకొంత కడిగేస్తున్నయ్… ఆ దిశలో ఎవరు కదిలినా చప్పట్లు కొట్టాలనిపిస్తుంది… అలాగని ప్రతి ప్రయోగాన్ని […]
జగన్ పుట్టలో వేలు- కెలికి కేసు పాలు..! తెగేదాకా లాగిన ‘ట్రిపుల్ ఆర్’..!!
……. రచన :: ఇమాం షఫీ…… రాజాధిరాజా.. నరసాపురం కాజా… అసలే అక్కడ కుర్చీలో ఉన్నది పుట్టలో ఎవరన్నా వేలెడితే కుట్టకుండా వదిలిపెట్టని నాయకుడు. కొందరి విషయంలో వేలెట్టేద్దాకా కూడా ఆగట్లేదు. అందుకే వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఇప్పటిదాకా రాజుగారికి ఎన్నో లైఫ్లైన్లు ఇచ్చింది పార్టీ అధినాయకత్వం. అయినా ఆయన అన్ని లైన్లూ దాటేసరికి ఇక లాభం లేదనుకుని బర్త్‌డే రోజు ముహూర్తం పెట్టేసుకుంది. మోదీ రెండోసారి అధికారంలోకొచ్చాక దేశద్రోహం కేసులు […]
కోవిషీల్డ్ డోస్ గ్యాప్‌పై సోషల్ సెటైర్ల వర్షం… అసలు మోడీకి ఏమైంది..?!
జనవరి … కోవిషీల్డ్ టీకా రెండు డోసుల నడుమ నాలుగు వారాల గ్యాప్ అవసరం, ఉత్పత్తి కంపెనీ సీరం ప్రకటన ఫిబ్రవరి … రెండు టీకా డోసుల నడుమ నాలుగు నుంచి ఆరు వారాల గ్యాప్ బెటర్ అని ఓ అనామక స్టడీ విడుదల మార్చి … రెండు టీకా డోసుల నడుమ ఆరు నుంచి ఎనిమిది వారాల గ్యాప్ బెటర్ అని మరో అనామక స్టడీ విడుదల మే … రెండు టీకా డోసుల నడుమ […]
ఓ ట్వీట్‌తో తప్పుదోవ పట్టించి… హమాస్ మీద ఇజ్రాయిల్ భీకరదాడి…
యుద్ధం అంటే వ్యూహాలు… అపారమైన ఆయుధసంపత్తి మాత్రమే కాదు, వాటిని తెలివిగా వాడే ఎత్తుగడలు ముఖ్యం… పాలస్తీనాలో హమాస్ ఉగ్రవాదులకూ, ఇజ్రాయిలీ సైన్యానికీ నడుమ నిత్యమూ యుద్ధమే… హమాస్ ఆయుధసంపత్తిలో గానీ, తెగబడి పోరాడే సైనికుల సంఖ్యలో గానీ, ఏళ్ల తరబడీ పోరు సలపగల సామర్థ్యంలో గానీ ఇజ్రాయిల్ దళాలకు ఏమీ తీసిపోదు… 36 గంటల్లో 1500 రాకెట్లను ప్రయోగించిందీ అంటే దాని కెపాసిటీ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవాల్సిందే… రెండు వర్గాల మధ్య ఇప్పుడు భీకరమైన […]
కర్ణన్..! ఒక ధిక్కారపతాక..! తెలుగులో ఇలాంటి మూవీస్ ఎందుకు తీయరు..?!
మహాభారతంలో కర్ణుడు .. క్షత్రియుడా …? శూద్రుడా ? కవచ కుండలాతో కుంతీదేవికి సూర్యుని మహిమతో పుట్టినవాడిని శూద్రుడని ఎలా అంటారు .. పెళ్లికాకుండానే పుట్టాడని అతడిని వదిలేస్తుంది కుంతీమాత.. అలా వదిలేసిన వాడిని శూద్ర కులస్తులు పెంచుకుంటారు .. అయితే ఇక్కడ కర్ణన్ సినిమాలో హీరో క్షత్రియ మాతకు పుట్టిన శూద్రుడు కాదు .. కర్ణుడి మాదిరి కవచ కుండలాలు లేవు … కానీ అతడు అణగారిన వర్గంలో అణిచివేతకు గురైన కులంలో పుట్టినవాడే .. […]
పువ్వులనడుగు… నవ్వులనడుగు… రివ్వున ఎగిరే గువ్వలనడుగు… ఇతనేమిటో…
……… By….. Bharadwaja Rangavajhala……. ఒక వేణువు వినిపించెనూ…. ఘంటసాల తర్వాత తొలినాళ్లలో జూనియర్ అయినా రామకృష్ణ, ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం జండా ఎగరేశారు. మరో గాయకుడికి అవకాశం రావడం కష్టంగా మారిన సందర్భం అది. అలాంటి సమయంలో అప్పుడే కొత్తగా వచ్చిన మురళీమోహన్, ప్రసాద్ బాబు లతో పాటు చిరంజీవి లాంటి కొత్త హీరోలకు పాటలు పాడడానికి ఓ గాయకుడు అవసరమయ్యాడు. ఆ లోటును భర్తీ చేసిన వాడు జి.ఆనంద్. గాయకుడుగా ప్రవేశించి సంగీత దర్శకత్వమూ […]
బాలయ్య అంటే ఆ బాలయ్యే కాదు… ఈ బాలయ్యదీ ఓ సక్సెస్ స్టోరీయే..!
….. By…… Bharadwaja Rangavajhala………………. అమృతా ఫిలింస్….. నటులు నిర్మాతలు కావడం క్వైట్ కామన్. తాము అనుకున్న పాత్రలు చేయడం కోసం కొందరు నిర్మాతలుగా మారితే…తాననుకున్న కథలతో చిత్రాలు తీయడానికి నిర్మాణ రంగంలోకి దూకేశారు ఇంకొందరు. నటుడు మన్నవ బాలయ్య సెకండ్ కేటగిరీలోకి వస్తారు. ఇంజనీరింగ్ చదివి సినిమాల్లోకి వచ్చిన బాలయ్య… ఉన్నట్టుండి నిర్మాతగా మారారు. బాలయ్య రాసిన కథలు కొన్ని పత్రికల్లో అచ్చయ్యాయి కూడా. దీంతో తన కథలతోనే స్వంత చిత్ర నిర్మాణం ప్రారంభించాడు. సక్సస్ […]
కరోనాపై నిలదీయడం మానేసి… సెంట్రల్ విస్టా టార్గెట్… విపక్షం @ గందరగోళం…
తెలంగాణలో కేసీయార్ బలం ఏమిటి..? ఓ దశ, ఓ దిశ లేని… కార్యాచరణ సరిగ్గా లేని… దూకుడుగా కేసీయార్‌ను ఢీకొట్టలేని ప్రతిపక్షాలు..! అవును, బలహీన ప్రతిపక్షమే కేసీయార్ బలం… సేమ్, మోడీ… ఎన్ని వైఫల్యాలున్నా… అసలు జనం పట్ల కొన్ని కీలకాంశాల్లో ప్రేమ చూపించలేకపోతున్నా సరే… ఎందుకు బలంగా కనిపిస్తున్నాడు..? ప్రతిపక్షాలే…! మోడీ మంచి పాలకుడు కాకపోవచ్చుగాక, కానీ వెరీ సక్సెస్ఫుల్ పొలిటిషియన్… రాజకీయాల్లో తాను సాధించిన గెలుపు సాధారణమైంది కాదు… అయితే ప్రతిపక్షాలు ఎంత దయనీయంగా […]
చదవాల్సిన కథ..! ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన ఓ దళిత శరణార్థి కథ..!!
సరిగ్గా రాస్తే నాలుగైదు పెద్ద పుస్తకాలు అవుతుంది ఈ బెంగాలీ కొత్త ఎమ్మెల్యే బతుకు కథ… ఎక్కడ మొదలైంది, ఏ మలుపులు తిరిగింది, ఇప్పుడు ఎక్కడికొచ్చింది…. చదువుతుంటేనే ఓ అబ్బురం… మనం పదే పదే చెప్పుకున్నట్టు జీవితాన్ని మించిన కల్పన, డ్రామా ఇంకేముంటయ్..? ఎస్, డెస్టినీ మనిషిని ఎటు తీసుకుపోతుందో ఊహించలేం, ఊహిస్తే మనుషులం ఎలా అవుతామ్…? ఈయన పేరు మనోరంజన్ బ్యాపారి… ప్రస్తుతం టీఎంసీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు… అదీ బీజేపీ బలమైన స్థానం నుంచి… […]
ఓ ఊరికథ మాత్రమే కాదు… ఎన్నెన్నో బతుకుకథల్ని ‘తెర‘చి చూపినవాడు…
ఓ ఊరి కథ అంటూ మన ఊరికొచ్చి అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పనోరమా విభాగంలో తెలుగు సినిమాకు పట్టం కట్టించిన దర్శకుడు మృణాల్ సేన్. 25వ జాతీయ చలన చిత్రోత్సవంలో ఉత్తమ జాతీయ చలన చిత్ర పురస్కారానికి ఎంపికైన సినిమా ఆ బెంగాలీ దర్శకుడి మెగాఫోన్ తో రూపుదిద్దుకున్న ఓ ఊరికథ. మరి భారత్ గర్వించదగ్గ పేరెన్నికగన్న దర్శకుల్లో ఒకరైన సేన్ పుట్టినరోజున ఆయన సంస్మరణే ఈ యాది. రెగ్యులర్ అండ్ రొటీన్ ప్యాటర్న్ సినిమాను ఆఫ్ […]
నాయట్టు…! ఓ చిన్న లైన్… బిగిసడలని కథనం… భలే తీశావ్ బ్రదరూ…!!
……… by……. Ashok Vemulapalli………. NAYATTU………. కొన్నిసినిమాలు చూశాక ఆ మూడ్ నుంచి చాలా రోజుల వరకూ బయటకు రాలేము.. ఆ సినిమాల ముగింపు కూడా ప్రేక్షకులకే తేల్చుకోండని వదిలేస్తాడు డైరెక్టర్.. వ్యవస్థలో ఉండే లోపాలు, కుట్రలు, కుతంత్రాలు, ఈర్ష్యాధ్వేషాలు అన్నీ కొన్ని సందర్భాల్లో మనిషి మీద రిఫ్లెక్ట్ అవుతాయి.. బయటి శతృవులు చేసే దాడి ముందే తెలిస్తే మనం కూడా ఆయుధాలతో సిద్దంగా ఉండి ఎదుర్కోవచ్చు.. కానీ ఇంట్లోనే శతృవులు ఉంటే ఎప్పుడు, ఎలా దాడి […]
అరె, గిదేం సినిమార భయ్..? గిట్ల తీసి పాడుచేసిన్రు… ఇంకా ఏకాలంలో ఉన్నర్ర భయ్..?!
మనం వేస్టనవసరంగా తెలుగు సినిమాల్ని, తమిళ సినిమాల్ని.., మన క్షుద్ర హీరోల పిచ్చి చేష్టల్ని, సూపర్ మ్యాన్ ఫైట్లని, తలతిక్క గెంతుల్ని, దిక్కుమాలిన కథల్ని, తోలుబొమ్మల హీరోయిన్లను, చెత్తచెత్త పాటల్ని చూసేస్తూ… తెగతిట్టేసుకుంటున్నాం, జుట్లు పీకేసుకుంటున్నాం… వీళ్లెప్పుడు మారతారో కదా అని తెగకన్నీళ్లు కార్చేస్తున్నాం గానీ…….. ది గ్రేట్ సల్మాన్ ఖాన్ నటించినట్టనిపించేసిన, ది గ్రేటర్ ప్రభుదేవా దర్శకత్వించిన, ది గ్రేటెస్ట్ జీగ్రూపు విడుదలించిన రాధే అనే సినిమా చూస్తే మన బాధ ఇట్టే మాయమైపోతుంది… మన […]
గెటప్ శ్రీనుకు ఏమైంది..? కనిపించడం లేదెందుకు..? సుడిగాలి సుధీర్‌తో గొడవేంటి..?
అబ్బబ్బ… ఎంతసేపూ లాక్ డౌన్, వేక్సిన్లు, రెమ్డెసివర్లు, ఆక్సిజన్, శ్మశానాలు, రాజకీయాల గొడవేనా..? కాస్త పక్కకెళ్దాం… దిగువ ఓ ఫోటో ఉంది చూడండి… ఇది సుడిగాలి సుధీర్ జబర్దస్త్ టీం… అందులోనే గెటప్ సీను, ఆటో రాంప్రసాద్, సన్నీ ఉంటారు… పేరుకు సుధీర్ టీం లీడర్… కానీ ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను ఈక్వల్… సన్నీ కాస్త వీక్… రాంప్రసాద్ స్క్రిప్టులు రాసేస్తాడు… గెటప్ శ్రీను ఓ కొత్త గెటప్ ట్రై చేస్తాడు, జీవించేస్తాడు… సుధీర్ సంగతి […]
- « Previous Page
- 1
- …
- 393
- 394
- 395
- 396
- 397
- …
- 447
- Next Page »