ఎడ్లకు కావాలొక సెలవు! ———————- శివుడు ఎంత పాతవాడో చెప్పలేక అన్నీ తెలిసిన వేదాలే చేతులెత్తేశాయి. అలాగే ఆయన వాహనమయిన బసవడు ఎంత పాతవాడో చెప్పడం కూడా చాలా కష్టం. ఆధ్యాత్మిక ప్రస్తావనల్లో ఆవు/ఎద్దు ధర్మదేవతకు ప్రతిరూపం. ధర్మం నాలుగుకాళ్లతో సవ్యంగా నడవడం అన్నమాట ఇందులోనుండే పుట్టింది. కొత్త ఇల్లు కట్టుకుని ఒక శుభ ముహూర్తాన తెల్లవారకముందే మనం ఇంట్లోకి శాస్త్రోక్తంగా అడుగుపెట్టడానికంటే ముందు ఆవు అడుగు పెట్టాలి. ఆవుతోక పట్టుకుని వెనుక మనం వెళ్లాలి. ఆవు […]
హెలో కేసీయార్ సార్… డ్రమ్ సీడర్ల తాతలున్నారు మీ చుట్టుపక్కలే…
గుడ్… కేసీయార్ ఓ ఆంధ్రా రైతుకు ఫోన్ చేశాడు… ఆదర్శరైతు ఆయన… ఓ రెండురోజులు మా ఫారమ్ హౌస్కొచ్చి, మా వ్యవసాయం చూసి, మీ అనుభవాన్ని మాతో షేర్ చేసుకొండి, కారు పంపిస్తా, భోజనం పెడతా అన్నాడు… వెరీ గుడ్… శనివారం ఫోన్ చేస్తే, ఈనాడులో వార్త వచ్చేవరకు కేసీయార్ బజానా బ్యాచ్ నిద్రపోయిందేమో… ఈనాడులో వార్త వచ్చాక మిగతా పత్రికలు కూడా తాపీగా… మరుసటిరోజున ఆ వార్త రాసుకుని బాగా సంబరపడిపోయాయి… ఈయన ఫోన్ చేసి […]
పిల్ల కొంచెం- పాట ఘనం..! ఉత్తరాది సంగీతాన్నీ దున్నేస్తోంది..!
ఆర్యానంద బాబు… వయస్సు పన్నెండేళ్లు… కేరళలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో ఏడో, ఎనిమిదో చదువుతోంది… హిందీ ఒక్క ముక్క కూడా రాదు… తల్లి పేరు ఇందు… మ్యూజిక్ ఎగ్జామినర్, మ్యూజిక్ టీచర్… తండ్రి పేరు రాజేష్ బాబు… అల్ హరామే స్కూల్లో మ్యూజికల్ ట్రెయినర్… ఊరి పేరు వెల్లిమదుకున్ను….. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… ఈ అమ్మాయి గొంతు జీ5 ఓటీటీలో… యూట్యూబులో మారుమోగిపోతోంది కాబట్టి… మంచి హిందీ సింగర్స్, మెంటార్స్ కూడా ఆ […]
బిగ్బాస్ బిగ్ బ్లండర్… చప్పట్ల హోరులో చర్చకు రాకుండాపోయింది.,.
చప్పట్లు, హంగామాల నడుమ బిగ్బాస్ అమలు చేసిన దరిద్రం ఒకటి పెద్దగా చర్చకు రావడం లేదు… నిజానికి బిగ్బాస్ టీం అంత భారీ ఖర్చు నడుమ తన చిల్లరతనాన్ని ప్రదర్శించింది… తెలంగాణ భాషలో ‘‘కొంచెపువేషం’’… అది అర్థమయ్యేలా సరళంగా చెప్పుకుందాం… ఒక పోటీ పెట్టాం మనం… విజేతకు పది వేలు, సెకండ్ వచ్చినవాడికి అయిదు వేలు అని ప్రకటిస్తాం సాధారణంగా… థర్డ్ వచ్చినవాడికి ప్రోత్సాహకంగా వేయి రూపాయిలు కన్సొలేషన్ ఇస్తాం… సహజంగా కనిపించే ఆటతీరు ఇది… కానీ […]
అభి”జీత్ గయా”… ఆ మాటతో ఆ అమ్మ కూడా గెలిచింది…
గుర్తుందా ఓరోజు… అభిజిత్ అమ్మ లక్ష్మి తనను చూడటానికి హౌస్కు వచ్చింది… ఇక్కడ గొడవలన్నీ తాత్కాలికమే అమ్మా, మళ్లీ కలుస్తాం అని అవినాష్ ఏదో చెప్పబోతుంటే… కొట్టుకొండిరా, లేకపోతే ఆటలో మజా ఏముంటది..? అన్నదామె… గ్రేట్… ఆట స్పిరిట్ ఒక్క ముక్కలో చెప్పేసింది… ఆడుకొండి, కొట్టుకొండి, మజా పంచుకొండి… ఆ నిమిషంలో ఆమె బిగ్బాస్ ప్రేక్షకుల మనస్సుల్ని గెలుచుకుంది… ఈరోజు ఆమె మళ్లీ ఆకట్టుకుంది అందరినీ… వేదిక మీద తన కొడుకు ట్రోఫీతో నిలబడాలని ఆమెలోని అమ్మ […]
కథ వేరే ఉంటది అన్నాడు… సేమ్, కథనే మార్చేశాడు..!
From… షేక్ కరీం fB wall…. బిగ్ బాస్ కథను మార్చేసిన సయ్యద్ సోహెల్ విజేత కాకపోయినా హృదయాలను గెలిచాడు. టీవీ చూస్తున్న వారు ఉద్వేగానికి గురయ్యేలా చేశాడు. చివరికి బిగ్ బాస్, నాగార్జునను సైతం షాక్ కు గురి చేశాడు. స్నేహితులకు అతను ఇచ్చే ప్రాధాన్యం గురించి నలుగురూ నమూనాగా చెప్పుకునేలా చేశాడు. వేదిక మీద ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్ లు సహా నాగార్జున సైతం అతని నిర్ణయాన్ని అభినందించకుండా ఉండలేకపోయారు. నాగార్జున ఏకంగా […]
ఆట ఎక్కడ ఆపాలో తెలిసినవాడు అసలైన విజేత… వాడి పేరు సొహెల్…
ఒక యువకుడు… తను బిగ్బాస్ హౌస్లోకి రాలేదు… ఏమీ ఆడలేదు… తన పేరే ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు… కానీ ఒక్కసారిగా బిగ్బాస్ ఫినాలే చూస్తున్న ప్రేక్షకుల మనస్సులు గెలుచుకున్నాడు… పేరు బహుశా సాబిర్… సొహెల్ తమ్ముడు… నిజంగా ఇన్నాళ్ల షోలో రియల్ విన్నర్ తనే అనిపించింది చివరకు… ఎందుకంటే…? భయ్యా, నువ్వు 25 లక్షలు తీసుకుని, ఆట నుంచి తప్పుకునే పక్షంలో… అందులో 10 లక్షలు అనాథలకు ఖర్చుపెట్టాలి అన్నాడు… అక్కడే లక్షల మంది ప్రేక్షకుల మనసుల్ని […]
ఏమిటి లోకం, పలుగాకుల లోకం… సీతను గీత దాటించిన ఆత్రేయ సహా…
యాంటీ- సెంటిమెంట్… ఈ మాట ఎందుకంటున్నానంటే…? మనసుకవి, మన సుకవి అని పేరుపొందిన ఓ సెంటిమెంట్ రచయిత మీద ఓ చిన్న అసంతృప్తిని వ్యక్తపరచడం అంటే మాటలా..? యాంటీ- సెంటిమెంటే కదా…! ఏయ్, ఏమిటా ధైర్యం..? ఆచార్య ఆత్రేయ… అందులోనూ బాలచందర్ రాయించుకున్న ఓ పాటలోని కొన్ని వాక్యాల మీద యాంటీ- సెంటిమెంట్ రాతలా అని తిట్టేవాళ్లు కూడా ఉండొచ్చు… కానీ ఓ పాట వింటుంటే పదే పదే ఓ చరణం దగ్గర స్ట్రక్ అయిపోతోంది ఆలోచన… […]
ఫాఫం అనసూయ… జబర్దస్త్ టీం ఘోరంగా పరాభవించేసింది తన తొడల్ని…
కాళ్లు … సరే, సరే… మన ట్రెండీ తెరభాషలో చెప్పాలంటే తొడలు… వాటిని చూసి అంతటి సీతారామ శాస్త్రి… నీ కాళ్లకు పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు అని… పూజా హెగ్డే తొడలు చూసి… పదాలు పాదాల మీద కార్చేసుకున్నాడు… చివరకు సామజవరగమనా అనే పదానికి అర్థం కూడా మార్చేసి, ఆ కాళ్ళను హత్తుకున్నాడు తమకంతో… సారీ, గమకంతో… కథానాయిక తొడలకు ఉండే ఇంపార్టెన్స్ అదీ… థూదీనమ్మ అనకండి… సత్యభామ కాళ్లతో తన్నించుకున్న, అంతటి వేల […]
మొగుడు తొమ్మిదేళ్లు పెద్ద… పైగా టీబీ… నాలుగో పెళ్లాం… చదవాల్సిన లైఫ్…
ఉమ… ఏడెనిమిదేళ్లు ఉంటాయేమో… కోయంబత్తూరు… తండ్రి బాలకృష్ణన్, తల్లి తంకమణి… తండ్రి తన యుక్తవయస్సులో ఉన్నప్పుడు ఎంబీబీఎస్ ఒక సంవత్సరం చదివి, వదిలేసి, వద్దులే అని తండ్రి చెప్పగానే తిరిగి వచ్చేశాడు… ఓ డాక్టర్ దగ్గర కంపౌండర్గా కూడా చేరాడు… అప్పట్లో అల్లోపతిని ఎవరూ పట్టించుకునేవారు కాదు… సైకిల్ మీద డాక్టర్, కంపౌండర్ ఊరంతా తిరిగేవారు రోగుల కోసం… ఇది జరిగే పని కాదని ఏదో మిల్లులో చేరాడు… అక్కడ రిసెప్షనిస్టుగా చేరిన తంకమణిని పెళ్లిచేసుకున్నాడు… బిడ్డ […]
ఆర్కే అక్షరసాహసి… ఆఫ్టరాల్ సుప్రీంకోర్టు అంటాడేమో కొంపదీసి…
రాష్ట్రంలో పేరుమోసిన సంపాదకులున్నారు… నిజం నిష్ఠురంగానే ఉంటుంది… ఏ కలానికీ సూటిగా, పాఠకుడి బుర్రలోకి ఎక్కేలా రాయడం రాదు… నాలుగు పడికట్టు పదాల్నే వాడుతూ, భజిస్తూ, స్తుతిస్తూ… తామేదో మర్మగర్భంగా గొప్ప భావాల్ని చెబుతున్నట్టు బిల్డప్… వాళ్లతో పోలిస్తే రాధాకృష్ణ చాలా బెటర్… మనం నచ్చినా నచ్చకపోయినా తను అనుకున్నది మాత్రం సూటిగా, అర్థమయ్యేలా చెబుతాడు… ధైర్యంగా రాస్తాడు… జర్నలిస్టులు పెద్దగా వ్యాఖ్యానాలు చేయడానికి ఇష్టపడని న్యాయమూర్తులు, తీర్పులు, రాజకీయ ప్రభావాల గురించి కూడా రాస్తాడు… తన […]
తప్పుపట్టకండి… కథ తెలిస్తే… గుండె తడి పొంగి, కళ్లను దాటేస్తుంది…
కంటికి కనిపించేది అంతా నిజం కాదు… మనకు కనిపించిన సన్నివేశాన్ని, దృశ్యాన్ని బట్టి మనం ఏదేదో ఊహించేసుకుంటాం… కానీ సత్యం వేరే అయి ఉండవచ్చు… ఈ మాట మనకు పెద్దలు పదే పదే చెప్పినా సరే… మన రక్తంలో జీర్ణించుకుపోయిన తత్వాన్ని బట్టి ఇప్పటికీ మనం మారం… ఉదాహరణ చెప్పడానికి… చాలామంది ఇదుగో ఈ బొమ్మ చూపిస్తారు… ఫస్ట్, బొమ్మ చూడగానే మనకు కొన్ని నెగెటివ్ ఆలోచనలు కలుగుతాయి… ఛిఛీ అనిపించొచ్చుగాక… కానీ అసలు కథ తెలిస్తే […]
ఉప్పుజ్ఞానం అయిపోయింది… ఇక మిగిలింది సింగరేణి బొగ్గుజ్ఞానమే…
చాలా ఏళ్ల క్రితం… మనలో చాలామందికి అనుభవమే… చూశాం, చేశాం… ఇంటి వెనుక పెరట్లో ఓ గప్క… అంటే నీళ్లను వేడిచేసే బాయిలర్… ఓ బావి… నీళ్లు తోడుకోవడానికి ఓ బొక్కెన… పెరట్లోని వేపచెట్టు నుంచి ఓ పుల్లను విరిచి, పళ్లు తోముకుని… లేదంటే పొయ్యిలో ఉన్న కట్టెలు, వరిపొట్టు బూడిదను పళ్లకేసి రుద్ది… లేదంటే కాస్త సన్న ఉప్పుతో తోముకుని… ఒకటికి పదిసార్లు పుక్కిలించి… ఇక స్నానం చేయడమే…. మరి తరువాత..? దంతమంజన్లు వచ్చాయి… కోల్గేట్ […]
అభిజితే విజేత… చిరంజీవే అతిథి… వోట్ల వేటలో కొత్త రికార్డులు…
అరెరె, ఆ బక్కపిల్ల అరియానా ఏకంగా అభిజిత్ను దాటేసిందట వోట్ల వేటలో… ఫస్ట్ ప్లేసట… తొలిసారిగా ఓ అనామకప్పిల్ల బిగ్బాస్ విజేత కాబోతున్నదట…. ఇలా కొందరి ప్రచారాలు…. అబ్బో… సొహెల్ భలే దూసుకుపోతున్నాడే… సింగరేణి బిడ్డకు వస్తున్న వోట్లతో అభిజిత్, అరియానా పత్తాకు లేకుండా కిందకు జారిపోతున్నారు… సొహెల్ కాబోయే బిగ్బాస్ విజేత అట… ఇలా మరికొందరి ప్రచారాలు…. సోషల్ మీడియా లేనిదే బిగ్బాస్ లేదు… రకరకాల ఫేక్ ప్రచారాలు లేనిదే సోషల్ మీడియా లేదు.,. కాబట్టి […]
మనమింకా ఆ డర్టీ కథల్లోనే పొర్లుతున్నాం… కానీ తమిళ సినిమా..?
Gurram Seetaramulu………… నువ్వు పుట్టిన కులం నిషిద్దం అయినచోట , నువ్వు పెరిగిన ప్రాంతం పాప పంకిలం అయిన చోట, నువ్వెన్నుకున్న సహచరి అంతరం అయిన చోట. అసమ విలువల తూకంలో నీ లింగ బేధం అబేధ్యం అయిన చోట, గర్వం, గౌరవం, మదం, అహంకారం, అసహనం సర్వవ్యాప్తం అయిన చోట, పాపపు ( ప్రాయశ్చిత్త ) కథలకు చోటెక్కడ ? ఎక్కడ ఉన్నాయి ఈ మూలాలు ? ఒక కుటుంబం మానం, గౌరవం, మర్యాద, వీటిని […]
మమతక్క బండి అదుపు తప్పింది సరే… ఎర్రనేతలు కూడా జంపర్లేనా..?
మార్పు… మార్పు… సహజం… చంచలమైన రాజకీయాల్లో విధేయతల్లో మార్పులు కూడా సహజం… పెద్ద ఆశ్యర్యం ఏమీ లేదు… కాకపోతే గతంలో పూర్తి రైటిస్టు బీజేపీ నుంచి గానీ… లెఫ్టిస్టు పార్టీల నుంచి గానీ ఈ జంపింగులు కనిపించేవి కావు… మరీ అరుదు… రైటో, లెఫ్టో… ఏదో బుర్రలోకి ఎక్కితే ఇక జీవితాంతం ఆ అభిమానాన్ని పదిలంగా కాపాడుకునేవాళ్లు… మధ్యేవాద, అవకాశవాద, ఫ్యూడల్ పార్టీల నాయకులు ఎప్పుడూ గోడ మీదే కూర్చుని ఉండివాళ్లు… చాలామంది ఆయారాం, గయారాాం బాపతే… […]
అంబానీకి మనమడు పుడితే… ప్రధాని హాస్పిటల్ వెళ్లి ఆశీర్వదించాలా..?
ఓ వ్యక్తి ఓ ఫోటో పంపించాడు… ఇది నిజమేనా సారూ అనడిగాడు… ఫోటో చూడగానే నాకు విషయం ఏమిటో అర్థమైంది… కానీ నీకెక్కడిది ఈ ఫోటో అనడిగాను… బోలెడు వాట్సప్ గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతోంది… ఫోటోతోపాటు బోలెడు వ్యాఖ్యలున్నాయి… ‘‘ఒకవైపు లక్షలాది మంది రైతులు రాజధానిని ముట్టడించి, మా పొట్టగొట్టకు, ఆ అంబానీకి దోచిపెట్టకు అని మొరపెట్టుకుంటున్నారు… దేశమంతా సంఘీభావంగా నిరసనలు సాగుతున్నాయి… అవేమీ పట్టని మన మోడీ గారు తన ప్రియమిత్రుడైన అంబానీకి మనమడు పుడితే, […]
మావీ ప్రాణాలే… మా కన్నీళ్ళు కూడా ఉప్పగానే ఉంటాయి…
మా బతుకుదీపాలకు వారి ప్రాణదీపాలు అడ్డుపెట్టారు సినిమా కథల్లో పోలీసులు సూపర్ హీరోలన్నా అయి ఉంటారు. లేదా పరమ విలన్లయినా అయి ఉంటారు. మనుషులుగా మాత్రం ఉండరు. అది సినిమా కెమెరా దృష్టి దోషం. నిజజీవితంలో పోలీసు పోలీసుకావడం కంటే ముందు మనిషి. మామూలు మనిషి. మూగమనసులో ఆత్రేయ చెప్పినట్లు వారికీ-నలుగురిలా మనసుంది.అందరిలా ఆశలున్నాయి.మిగతావారిలా కలలుకనే కళ్లున్నాయి.డ్యూటీలయ్యాక ఇళ్ళకెళితే కుటుంబాలున్నాయి.కలతపడితే కన్నీళ్ళున్నాయి.పోలీసులు మాను మాకులు కారు. మనలాగే మనుషులు. కుటికోసమే కోటి విద్యలు. పోటీ పరీక్షలు రాసి […]
మబ్బే మసకేసిందిలే… వయస్సు పిలిస్తే అది అంతే మరి…
Gottimukkala Kamalakar……………… #ఉద్యోగపర్వం_తొలినాళ్ళలో………. నెలకో పది రూపాయల కంట్రిబ్యూషన్ మా సిబ్బంది అందరం సంక్షేమసంఘానికివ్వడం మా ఆఫీసులో ఆనవాయితీ. దాదాపు మూడొందల మంది ఉద్యోగులవడంతో అవో మూడు వేలు ఇతరత్రా ఇంకో రెండు వేలూ సంఘం ఖాతాలో పడతాయి. రిటైరైన వాళ్లకు దండలూ, శాలువాలూ, మెమెంటోలూ, ఫ్లెక్సీలూ, టీలూ, స్నాక్సూ అంటూ ఖర్చు పెట్టేవాళ్ళు..! రెండేళ్లకోసారి ఎలక్షన్లు. అందరూ అందరికీ స్నేహితులే ఐనా, ఆ ఎన్నికల సమయంలో ఫన్నీ శతృత్వం నడిచేది. అసెంబ్లీ సమావేశాల్లో అక్బరుద్దీన్ ఓవైసీ, కిషన్ […]
రామోజీరావు ఈ వార్తను చదివి ఉండకూడదనే కోరుకుందాం..!!
‘‘నిజమేనోయ్… ఈమధ్య ఈనాడు మరీ రంగురుచివాసనచిక్కదనం కోల్పోయిందనేది నిజమే… మటన్ బిర్యానీలా ఉండకపోయినా సరే, మరీ రాతలు ఇంకా దిగజారి చివరకు పాచిపోయిన బువ్వ కనిపిస్తున్నదోయ్…’’ అంటూ పొద్దున్నే ఓ ఈనాడు శ్రేయోభిలాషి తెగ ఆవేదన, ఆందోళన, ఆగ్రహం, అసహనం గట్రా చాలా ఫీలింగ్స్ వెలిబుచ్చాడు… ఏడిచేవాళ్లను ఆపకూడదు, మనసు నిమ్మళం అయిపోయేవరకూ ఏడవనిస్తే, మనసు ఖాళీ అయిపోయి, కూల్ అయిపోతారని ఈనాడులోనే ఎప్పుడో చదివినట్టు గుర్తు… అందుకే ఊరడించలేదు… కాసేపటికి ముక్కు ఎగబీల్చుకుంటూ… ఈ వార్త […]
- « Previous Page
- 1
- …
- 426
- 427
- 428
- 429
- 430
- …
- 440
- Next Page »