కోట్ల మంది అమితాబ్ బచ్చన్‌ను ఆరాధిస్తారు… తనకు చిన్న సమస్య వచ్చినా అందరూ తల్లడిల్లిపోతారు… తన క్రేజ్ అలాంటిది… అయినా సరే… తను తప్పు చేస్తే ఏకిపారయడానికి కూడా తన ఫ్యాన్స్ రెడీ… ముక్కచీవాట్లు పెడతారు… తాము ఆరాధించే మనిషి తప్పు చేయకూడదు… అంతే… అవును, అదే జరిగింది… తన ట్విట్టర్ ఫాలోయర్లు, ఫేస్బుక్ ఫాలోయర్ల సంఖ్య తెలుసు కదా… ఆ రేంజ్‌కు చేరుకోవడం ఏ సినిమా నటుడికీ ఇండియాలో ఇక చేతకాదు… అయితే తను ఈమధ్య […]
ఇళయరాజా..! ఓ పంచాయితీ గోక్కున్నాడు… మాటమర్యాద పోయాయ్…
ఇళయరాజా… ఈయన జగమెరిగిన సంగీత దర్శకుడు… స్వరకర్త… అయితేనేం..? లౌకిక, వ్యవహారిక అంశాల్లో ఆ పేరుప్రఖ్యాతులేమీ ఉపయోగపడవు కదా… ఎల్వీ ప్రసాద్ ఉన్నప్పుడు మద్రాసులోని తన స్టూడియోలోని ఓ గదిని ఇళయరాజాకు కేటాయించాడు, వాడుకో బ్రదర్ అన్నాడు… రూం నంబర్ వన్… దాన్ని ఇళయారాజా రికార్డింగ్ థియేటర్ అని పిలిచేవారు… మూడున్నర దశాబ్దాల క్రితం నాటి మాట ఇది… అప్పట్లో ఈయన ఫుల్ బిజీ… స్టూడియో బిజీ… బోలెడు సినిమాలు… రికార్డింగులు, సిట్టింగులు… ఈయన అవసరం వాళ్లకుంది… […]
ఫాస్ట్ ఫుడ్… బహుశా గప్‌చుప్ బండ్లు కూడా తప్పక ఉండేవేమో…
వేల ఏళ్లుగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లున్నాయి! ఇంట్లో అప్పటికప్పుడు వండుకుని తిన్నది వేడి వేడి అన్నం- పచ్చడి మెతుకులయినా ఆరోగ్యం, క్షేమం, ఆనందం. రోడ్డు మీద తిన్నది అధ్వాన్నం అన్నది లోకంలో ఒక సాధారణ అభిప్రాయం. నిజానికి అధ్వ అంటే దారి. అన్నం అంటే ఆహారం. రెండు పదాలు కలిస్తే తినకూడని, పనికిమాలిన అధ్వాన్నం అయ్యింది. ఎప్పుడో పాతరాతి యుగంలో రాచ్చిప్పల్లో అప్పుడే చెకుముకి రాళ్లతో మంట కనుక్కుని వండుకున్న రోజుల్లో అధ్వాన్నం అంటే తినకూడనిది. ఇప్పుడు […]
LRS… ఇప్పటికీ ఓ బ్యూరోక్రాట్ తరహాలోనే కేసీయార్ ఆలోచనలు…
ఒక రాజకీయ నాయకుడు వేరు… అందులోనూ ప్రజల ఉద్యమ ఆకాంక్షల నుంచి ఎదిగి, ప్రభుత్వంలోకి వచ్చిన నాయకుడు వేరు.., అదేసమయంలో ఒక బ్యూరోక్రాట్ వేరు… కేసీయార్ ఉద్యమాల నుంచి వచ్చిన నాయకుడే కానీ తను ఇప్పుడు అలా లేడు… బ్యూరోక్రాట్ల నడుమ బందీ..! ఎక్కువ శాతం బ్యూరోక్రాట్లు జనహితానికి దూరంగానే నిర్ణయాలు, ప్రణాళికలు రచిస్తుంటారు… వాళ్లకు పోయేదేమీ లేదు కదా… క్వార్టర్లు, అడ్డగోలు జీతాలు, అట్టహాసాలు, ఆడంబరాలు, అధికారాలు, కమీషన్లు గట్రా… కానీ నాయకుడు వాళ్లకు భిన్నంగా […]
మయూరి సుధ ఎపిసోడ్..! అంతటి బడబడ ఆలీ కూడా స్టక్ అయిపోయాడు…
ఈటీవీలో వచ్చే ‘ఆలీతో సరదాగా’ ప్రోగ్రాం చాలామంది చూస్తారు… అప్పుడప్పుడూ కొన్ని నాసిరకం కేరక్టర్లతో పిచ్చాపాటీ చేస్తాడు గానీ ఎక్కువసార్లు పాత తారల్ని మళ్లీ మన ముందుకు తీసుకొస్తాడు… పాత ముచ్చట్లన్నీ కలబోస్తాడు… ఇప్పటితరానికి పెద్ద ఆసక్తి ఉండకపోవచ్చుగాక, నలభై దాటిన సినిమా ప్రేక్షకులకు ఇంట్రస్టింగే… ప్రతి షోలో అతిథిని ఎలాగోలా ఏడిపించి, ఆ ప్రోమో కట్ చేయించే ఓ పిచ్చి స్టయిల్ ఉంది గానీ… మిగతా సంభాషణ కాస్త సరదాగానే ఉంటుంది… స్పాంటేనిటీ కూడా ఎక్కువే […]
యూటర్న్ బాషా..! బీపీ పెరిగిందంటే చాలు… కొత్త పార్టీగీర్టీ ఉల్టాపల్టా….
ఏయ్… ఎవడ్రా అదీ… మా వకీల్ సాబ్ గురించి మళ్లీ మాట్లాడుతున్నారు…? ఆయ్ఁ……… ఆ రజినీకాంత్ అంటే 70 దాటాడు… అసలు కమల్‌హాసనే 66 దాకా వచ్చాడు… వాళ్లకూ మా యాభయ్యేళ్ల పవన్ దేవుడితో పోలిక పెడుతున్నారు..? తాటతీస్తాం… ఈ నానీలు, డాడీలు, జగన్లూ జాన్తానై… ఆఫ్టరాల్ మా నాగబాబు అన్న, మా నాదెండ్ల మనోహర్ దోస్త్ చాలు… మా పార్టీని గెలుపు తీరాలకు తీసుకుపోవడానికి… సరే, సరే… ఈ మాటలేమిలే గానీ… రజినీకాంత్ అనబడే ఓ […]
మన ఖర్మ కాకపోతే… బజారు రౌడీలకు పోస్టల్ స్టాంపులేమిట్రా..?
మన వీధి రౌడీల స్టాంపులు ఎప్పుడొస్తాయో? ———————— వాల్మీకి రామాయణం సుందరకాండ. అశోకవనం. ఇంకా తెలవారదేమి? ఈ చీకటి విడిపోదేమి? అని చెట్టు కొమ్మకు తలవాల్చి పడుకుని, పడుకోనట్లు దిగులుగా ఉన్న సీతమ్మ. ఈలోపు తాగిన మత్తులో, ఊగుతూ మందీ మార్బలంతో రావణాసురుడు సీతమ్మ వైపు వస్తున్నాడు. మధ్యలో గొంతు పిడచకట్టుకుపోతే ఇబ్బంది అని బంగారు పాత్రల్లో మద్యం పట్టుకున్న అమ్మాయిలు రావణుడి చుట్టూ ఉన్నారు. రోజూ కనీసం తెల్లవారినతరువాత వచ్చి ఏదో వాగేవాడు. ఈరోజేమిటి పొద్దున్నే […]
ఫోటో చూస్తేనే పెళ్లివిందు ఆరగించినట్టుంది… ఇదేమిటో తెలుసా..?
ఒకటే కులం… ఒకే ప్రాంతం… వేర్వేరు కుటుంబాలు… వేర్వేరు రాజకీయ రంగులు రుద్దుకుంటారు… తెల్లారిలేస్తే కత్తులు, కారాలు నూరుకుంటారు… రాజకీయ విభేదాలేమీ ఉండవ్… ఉన్నదంతా కుటుంబకక్షలే… అవి దిగువన కార్యకర్తల వరకూ విస్తరిస్తాయి… నిప్పురవ్వ పడితే చాలు నరుక్కోవడమే… ఎన్ని పుస్తెలు రాలిపడినా, ఎందరు తల్లుల కడుపులు కోసుకుపోయినా ఆ విద్వేషాలు అలాగే కొనసాగుతూ ఉంటయ్… బొచ్చెడు ఉదాహరణలు… సరే, ఇక్కడ సీన్ కట్ చేయండి… ఆ ఇద్దరూ ప్రత్యర్థులు… పొలిటికల్ గోదాలో దిగారంటే తిట్టేసుకుంటారు… సవాళ్లు […]
అంబానీని మించిన ఐశ్వర్యవంతుడు… ధనం, ఆస్తుల లెక్కల్లో కాదు సుమా…
తెల్లారిలేస్తే ముఖేష్ అంబానీ సంపద ఇంత పెరిగింది, అంత తగ్గింది అని మీడియా లెక్కలు… ప్రపంచ ధనికుల్లో తన నంబర్ పెరిగిందా, తగ్గిందా అని ప్రత్యేక వ్యాసాలు… మాట్లాడితే ఆదానీలు, అంబానీల ముచ్చట్లే… కానీ ఒకప్పుడు అంబానీ ఏమిటి..? పొనీ, ఇప్పుడు తన తమ్ముడి స్థితి ఏమిటి..? అవన్నీ ఎందుకులే గానీ… ఒక్కసారి ఎవ్వరైనా టాటాలతో పోల్చారా..? కొన్ని విలువలతో… ఈ దేశ పారిశ్రామిక ప్రగతి చిత్రాన్ని రచించింది, రచిస్తున్నది టాటా గ్రూపు… విలువలు, విరాళాలు, ప్రమాణాలు… […]
కేసీయార్ సారూ… తెలంగాణ రాష్ట్రమొచ్చినా ఈ సీట్ల నష్టం తప్పదా..?
తెలుగు ప్రజల్లో ప్రాంతీయ చిచ్చు పెట్టినవి ఏమిటి..? ఉద్యోగాలు, అడ్మిషన్లు… ఎవరు స్థానికుడు, ఎవరు స్థానికేతరుడు అనే పంచాయితీలే… జై ఆంధ్రను, జై తెలంగాణను రగిలించాయి… మలి దశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది కూడా హైదరాబాద్ ఫ్రీజోన్ అనే తగాదాతోనే…! చివరకు విడిపోయాం… ఎవరి బతుకు వాళ్లదే… కాదు, విభజన తగాదాలు సాగుతూనే ఉంటయ్… ఉన్నయ్… పోతిరెడ్డిపాడు పొక్కను ఇంకా తవ్వీ తవ్వీ, నీళ్లను జగన్ ఎత్తుకెళ్తానంటున్నాడు… నిధులు మాయమైపోయి రెండున్నర లక్షల కోట్ల అప్పు చేతికొచ్చింది… […]
పైత్యపు వేడుకలు..! ప్రి-వెడ్ షూట్లలో పీక్స్… నయం, ఇక్కడే ఆపేశారు…
ఏవగింపు… వెగటు… జలదరింపు… ఈ పదాలకు మించి ఇంకా ఏమైనా ఉంటే గుర్తుకుతెచ్చుకొండి… మన పెళ్లి వేడుకల్ని ఎటు తీసుకుపోతున్నామో తలుచుకుని సిగ్గుపడదాం అందరమూ… ప్రివెడ్ షూట్లు మరీ నీచమైన ధోరణుల వైపు వెళ్తున్నాయి… ఉదాహరణగా బోలెడు ఫోటోలు… అసలు ఈ తలతిక్క పైత్యాలకన్నా రిజిష్టర్ మ్యారేజీలు, స్టేజ్ మ్యారేజులు, సింపుల్‌గా గుళ్లల్లో పెళ్లిళ్లు చాలా చాలాా బెటర్ కదా… ఈ ఫోటో చూడండి ఓసారి… ఇది ప్రి వెడ్ షూటట… ఆదిమమానవుల కాన్సెప్టు అనుకుంటా… ఇంకాస్త […]
ఓ చెత్తా సినిమా… బీ గ్రేడ్ నేలక్లాసు సినిమా… దర్శకుడి టేస్టులాగే…
ఒక బయోపిక్… అదీ ఓ అడల్ట్ స్టార్ స్టోరీ… దాన్ని సినిమాగా తీయాలంటే ఎంత వర్క్ జరగాలి, స్క్రీన్ ప్లే, కథ, టేకింగ్, డైలాగ్స్,… ఎంత స్టడీ జరగాలి..? అదేమీ లేకుండా సినిమా చుట్టేస్తే ఎలా ఉంటుంది…? కచ్చితంగా షకీలా మార్క్ బీ గ్రేడ్ సినిమాాలాగే ఉంటుంది… అవును, అదే జరిగింది… షకీలా బయోపిక్ సినిమా చూస్తే అదే అనిపిస్తుంది… ఆమె జీవితం మీద కాదు, ఆమె జీవితాన్ని ప్రేక్షకులకు చెప్పే ఈ సినిమా మీద జాలి […]
సారు కొనడు… అంతే… ఎలాగైనా, ఎక్కడైనా అమ్ముకొండి… ఇలా కూడా…!!
మీ ఇష్టమొచ్చిన చోట పంట అమ్ముకొండి… నేనయితే కొనను, ఇప్పటికే చేతులు కాలినయ్… అసలు పంటలు కొనడం ప్రభుత్వం పనే కాదు… ఊళ్లల్లో కొనుగోలు కేంద్రాల్ని మూసేయండి………. ఇదే కదా, కేసీయార్ నిర్ణయం… అదే కదా చెప్పింది… సరే, వ్యాపారులు సరైన ధరకు కొనరు, అసలు కొన్నిసార్లు ఏ ధరకూ కొనరు… మరోవైపు మిత్తీలు, ఖర్చులు తరుముతుంటాయి… మరి రైతు ఏం చేయాలి..? హహహ… దానికి మార్గం సారు గారి సొంత పత్రిక నమస్తే తెలంగాణ రాసేసింది […]
కేసీయార్‌కు క్రెడిట్స్ ఇవ్వరు సరే… కానీ మంచి మార్పును గుర్తించాలి కదా…
కేసీయార్ ఏదో గొప్ప సాధించాడు అని రాయడానికి మనసొప్పకపోతే పోనీ… కానీ నిజాన్ని రాయాలి కదా…! ఆనందపడే ఓ సామాజిక మార్పును తెలియజెప్పాలి కదా..! కేసముద్రంలో ఒక కుటుంబం ఆడపిల్లను కన్న తమ కోడలికి అపూర్వంగా స్వాగతం పలికిన వార్తను దాదాపు అన్ని పత్రికలూ వేశాయి… (అందులోని విశేషాన్ని గుర్తించలేని ఓ పెద్ద దరిద్రం తప్ప)… అది దేనికి సూచిక..? తెలంగాణ సమాజం ఆడపిల్లను మహాలక్ష్మిగానే భావిస్తోంది… ఆడపిల్ల అని తెలుసుకుని అబార్షన్లు చేయడాలు, పుట్టగానే చంపేయడాలు […]
నేను భారతీయుడినే..! మరి నేను వాడే వస్తువులేమిటంటే…?
రానున్న 2021 కొత్త సంవత్సరంలో పూర్తిగా స్వదేశీ వస్తువులనే వాడుతామని మనకు మనం సంకల్పించుకుని, విదేశీ వస్తువులను బహిష్కరించాలని మన ప్రధాని మన్ కీ బాత్. ఈ వార్తను ఎలా అన్వయించుకోవాలో? ఎలా అర్థం చేసుకోవాలో? తెలియక తికమకపడుతున్నాను. కడప జిల్లా తాళ్ళపాక పక్కన పల్లెలో పుట్టి, అనంతపురం జిల్లా లేపాక్షిలో పెరిగి- ప్రభుత్వ ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో; ఎస్ కె యు, ఉస్మానియా, తెలుగు యూనివర్సిటీల్లో చదువుకున్న నేను పూర్తిగా స్వదేశీనే. భారతదేశం, […]
ఉల్టాపల్టా..! కేసీయార్ చేసిన తప్పేమిటి… పీఛే ముడ్ దేనికి…
మనసుంటే మల్లి… లేకపోతే ఎల్లి…. కేసీయార్ చాలాసార్లు చేసేది ఇదే… ఉదాహరణకు నియంత్రిత సాగు… పంటల కొనుగోళ్లు… తను తాజాగా తీసుకున్న నిర్ణయం ఏమిటి..? ఇకపై నియంత్రిత సాగు ఉండదు, మీ ఇష్టం వచ్చిన పంట వేసుకొండి… ప్రభుత్వం పంటలు కొనదు… 7500 కోట్లు లాస్ అయ్యింది ప్రభుత్వం… మీ ఇష్టం వచ్చినచోట మీ ఇష్టమొచ్చిన ధరకు అమ్ముకొండి… ఇదీ ఆ నిర్ణయం… అంటే గ్రామ స్థాయి వరకూ అద్భుతమైన నెట్వర్క్ అని ప్రచారం చేసుకున్న రైతు […]
దత్తపుత్రిక ప్రత్యూషకు కేసీయార్ పెట్టిన పెళ్లికట్నం ఏమిటో తెలుసా..?
నిజంగా ప్రత్యూషది ఓ కథే… ఆమె కథ ముందు పదీపన్నెండు టీవీ సీరియళ్లు, తెలుగు సినిమాలు కూడా సరిపోవు… ఆమె పాత విషాదం గురించి ఇక్కడ చెప్పుకోవడం వద్దు గానీ… ఒక ప్రభుత్వ శాఖ మొత్తం ఆమెను సొంత బిడ్డలా పరిగణించడం… చదివించి, కొలువు ఇప్పించి, పెళ్లి చేస్తుండటం… సాక్షాత్తూ ముఖ్యమంత్రి సతీమణి వెళ్లి, పెళ్లికూతురిని చేసి, ఆశీర్వదించడం… అవును, ఓ కలలాంటి, ఓ కథలాంటి వార్త… ఈ ఫోటో బాగా నచ్చేసింది… ముఖ్యమంత్రి సతీమణి ప్రత్యూషకు […]
ఢీఅంటేఢీ… జీటీవీ అదరగొట్టిన స్లాటులో… మాటీవీ ఓంకార్ ఫ్లాప్ షో…
స్టార్ మాటీవీ… దీని క్రియేటివ్ ఒకప్పుడు ఫేమస్… కానీ ఇప్పుడు వట్టిపోయినట్టుంది… క్రియేటివ్తనం కాస్తా జీతెలుగు వైపు ప్రవహించినట్టుంది… పైగా మాటీవీతో జీటీవీ ఢీఅంటేఢీ అంటోంది… ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి జరిగిన ఓ పోటీలో మాటీవీ చేతులెత్తేసింది… చతికిలపడింది… జీటీవీ జనాన్ని బాగా ఎంటర్టెయిన్ చేసింది… అఫ్కోర్స్, మాటీవీకి చేతనైన రేటింగ్స్ మాయలో మళ్లీ అదే పైచేయి సాధించినట్టు వచ్చే బార్క్ ర్యాంకింగులో కనిపించవచ్చుగాక… కానీ ఈ నాలుగైదు గంటల పోటీలో జీటీవీ గెలిచింది […]
ఫాఫం హిందూ..! ఈమె ఎదుట చేయిచాచి, చివరకు తనే బజారునపడింది…
దిహిందూ దగ్గర ఏ ఆన్సరూ లేకుండా చేసిందీమె… అంతటి ప్రఖ్యాత పత్రికకు దిక్కతోచని స్థితి… తన రిపోర్టర్‌ను సమర్థించుకోలేదు, అలాగని ఈమెపై కక్షనూ ప్రదర్శించలేదు… లెంపలేసుకుంటుందా..? కిక్కుమనకుండా మూసుకుంటుందా..? ఇంట్రస్టింగు… విషయం ఏమిటంటే..? మాన్సాస్ ట్రస్టు కొత్త బాస్ సంచయిత గజపతిరాజు తెలుసు కదా… కొన్ని వేల కోట్ల సామ్రాజ్యానికి ధర్మకర్త ఆమె ఇప్పుడు… సోకాల్డ్, చంద్రబాబు, అశోకగజపతిరాజుల చట్రం నుంచి తమ తండ్రుల, తాతల బాపతు ట్రస్టును బయటికి లాగి… ఎవరేం మాట్లాడినా, బెదిరించినా, వణకకుండా, […]
అసలే చలి… మందు వద్దంటావురా చీప్ లిక్కర్ మొహమోడా..?
కుక్క పని కుక్క చేయాలి… గాడిద పని గాడిద చేయాలి… ఇక్కడ కుక్క ఎవరు, గాడిద ఎవరు అనేది కాదు సమస్య… తమది కాని పని చేయడమే అసలు ఇష్యూ…….. ఈ మాట గట్టిగా అన్నామనుకొండి, సోషల్ మీడియాలో వెంటనే ఉల్టా దాడి మొదలవుతుంది… కుక్కకు పనిచేతకానప్పుడు గాడిద ఆ పనిచేస్తే తప్పేమిటట అంటారు… కోకిల రాగం శృతి తప్పుతోందని గమనించినా సరే, కాకి ఆ పాట అందుకోకూడదు కదా… సేమ్, ఈ వార్త చదివితే అదే […]
- « Previous Page
- 1
- …
- 482
- 483
- 484
- 485
- 486
- …
- 490
- Next Page »