.
రీల్స్, షార్ట్స్ స్థాయి దాటేసి… షార్ట్ ఫిలిమ్స్ దాటిపోయి… తెలంగాణ ఫోక్ సాంగ్స్ పాపులర్ తెలుగు సినిమా పాటల్ని మించి కోట్ల వ్యూస్ సాధిస్తున్న తీరు, పాపులర్ అవుతున్న ధోరణి చూస్తున్నాం కదా… యూట్యూబ్ కావచ్చు, ఇతర సోషల్ మీడియా వేదికల మీద కావచ్చు, చాలామంది క్రియేటర్లు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు…
సరే, హిట్టా ఫ్లాపా అనేది పక్కన పెట్టండి… కానీ తమలోని క్రియేటివిటీని ప్రదర్శించుకోవడానికి చాలా వేదికలు దొరికాయి ఇప్పుడు… అఫ్‌కోర్స్ రెవిన్యూ కూడా వస్తోంది… కొత్త పాటలు రాయిస్తున్నారు, డాన్సులు షూట్ చేయిస్తున్నారు, ఏ సినిమా పాటలకూ తీసిపోవు…
Ads
అనుకోకుండా ఓ వీడియో కనిపించింది… సరదాగా బాగుంది… ‘బాబులకే బాబు’ అనే టైటిల్… కాస్త మరీ స్టార్ హీరోల పట్ల మూర్ఖాభిమానాన్ని పెంచేదిలా అనిపించినా.., అదీ సరదాగానే చిత్రీకరించారు… మహేశ్ బాబు వర్సెస్ పవన్ కల్యాణ్… రెండు గ్రూపులుగా మారి… (ఇద్దరు లవర్స్ గ్రూపులు?) వాదించుకోవడమే కాన్సెప్టు…
ఒకరు పవన్ కల్యాణ్ ప్లస్సులు చెబుతుంటే, మరొకరు మహేశ్ బాబు ప్లస్సులు చెబుతుంటారు… (పవన్ కల్యాణ్ సినిమాల నుంచి బాగా డీవియేట్ అయ్యాక ఈ ఇద్దరి మధ్య పోటీ అనేది కాస్త ఆడ్‌గా ఉంది… సరే, ఏ ఇద్దరు స్టార్ హీరోల నడుమ ఈ వాగ్వివాదాన్ని కాన్సెప్టుగా తీసుకున్నా ఇలాంటి ఏదో పుట్టుకొస్తుంది లెండి…)
నవ్వొచ్చింది ఎక్కడంటే… మావాడు డిప్యూటీ సీఎం అని ఆ పిల్ల అంటుంది… వెంటనే తను పోటీగా కుర్చీలో కూర్చుని మావాడు గనుక దిగితే సీఎం అవుతాడు అని మహేశ్ బాబును ఉద్దేశించి అంటాడు… ఎహె, మావాడు తలుచుకుంటే దేశానికే పీఎం అవుతాడు అని ఆ పిల్ల పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి చెబుతుంది… నిజమే కదా…
ఫ్యాన్స్ మాటలు అలాగే ఉంటాయి… దాన్నే పాటలో పెట్టారు… అవునూ, ఇలాంటి పాటలు, అభిమానాలే హీరోల రాజకీయ ప్రవేశాలకు, ఆకాంక్షలకు, ప్రయాసలకు కారణం అవుతాయా..? ఏమో..!!
Share this Article