.
Pardha Saradhi Potluri …… 2029 లో పాకిస్తాన్ ని నాలుగు ముక్కలుగా విభజించాలని డీప్ స్టేట్ ప్రణాళిక అని వికీ లీక్స్ పత్రాలు బయటపెట్టి నాలుగేళ్లు అవుతున్నది! జూలియస్ అసాంజే బయటపెట్టిన రహస్యాలలో పాకిస్థాన్ కంటే ఇతర విషయాలు ఎక్కువ ప్రాముఖ్యత కలిగినవి ఉండడంతో ఈ వార్త అప్పట్లో పెద్దగా వైరల్ అవలేదు!
జాగ్రత్తగా గమనించండి!
సిరియాలో తిరుగుబాటు జరిగి, అధికార మార్పిడి రక్తపాతం లేకుండా జరిగింది అనుకొని మూడు నెలలు కాలేదు, కానీ ఇప్పుడు షియా – సున్నీ ఘర్షణలు మొదలయ్యి వందల్లో షియాలని సున్నీలు చంపేస్తున్నారు!
Ads
దీనర్ధం సిరియాని కూడా మూడు ముక్కలు చేసి ఒక ముక్క ఇజ్రాయేల్, రెండో ముక్క సున్నీలు, మూడో ముక్క షియాలకి పంచుతుంది అమెరికా! గాజాని కూడా అమెరికా స్వాధీనం చేసుకొని తరువాత ఇజ్రాయేల్ కి అప్పచెప్తుంది!
ముందు బలూచిస్తాన్!
ఈ రోజు బలూచిస్తాన్ రాజధాని క్వేట్టా నుండి పెషావర్ కి వెళుతున్న జాఫర్ ఎక్సప్రెస్ ని BLA తీవ్రవాదులు హైజాక్ చేశారు! రైలులో సైనికులతో పాటు 400 వందల మంది ప్రయాణీకులు ఉన్నారు!
ప్రముఖ పాకిస్థాన్ దిన పత్రిక Dawn కధనం ప్రకారం:
క్వేట్టా నుండి పెషావర్ వెళుతున్న జాఫర్ ఎక్సప్రెస్ బోలన్ జిల్లాలోని పెహ్రో కునారి మరియు గాదలర్ మధ్య 8 వ నంబర్ టన్నెల్ దగ్గర బలూచ్ లిబరేషన్ ఆర్మీ ( BLA ) తీవ్రవాదులు జాఫర్ ఎక్సప్రెస్ ఇంజిన్ మీద చివరలో ఉండే గార్డ్ బోగీ మీదకి కాల్పులు జరిపి రైలుని ఆపేశారు. BLA కాల్పులలో లోకో పైలట్ ఒకరు మరణించినట్లు తెలుస్తున్నది.
జాఫర్ EXPRESS కొద్ది నిముషాలలో 8 వ నంబర్ టన్నెల్ లోకి ప్రవేశిస్తుంది, కానీ టన్నెల్ లోకి వెళ్లకముందే ట్రైన్ ని ఆపేశారు!
పెహ్రో కునారి గాదలర్ ప్రాంతం పర్వతాలతో నిండి ఉంటుంది అందుకే సొరంగాలు ఎక్కువగా ఉంటాయి రైలు మార్గంలో! తీవ్రవాదులు దాడి చేసి తప్పించుకోవడానికి అనువుగా ఉంటుంది అనే జాఫర్ ఎక్స్‌ప్రెస్ లో సైనికులని కాపలాగా ఉంచుతారు!
తదుపరి వార్త అందే సమయానికి తీవ్రవాదులకి రైలులో ఉన్న సైనికుల మధ్య కాల్పులు జరుగుతున్నట్లు తెలుస్తున్నది! బలూచిస్తాన్ లో ఎమర్జెన్సీ విధించి మరిన్ని భద్రతా దళాలని తరలించడానికి రెండు ప్రత్యేక రైళ్ళని పంపించింది ప్రభుత్వం!
మరో వైపు మమ్మల్ని ఆపడానికి సైన్యాన్ని పంపిస్తే రైల్లో ఉన్న ప్రయాణీకులని చంపేస్తామని హేచ్చరించింది BLA! 2024 నవంబర్ లో క్వేట్టా రైల్వే స్టేషన్ లో ఆత్మాహుతి దాడి జరిగి 60 మంది చనిపోయారు. రెండు నెలలు క్వేట్టా నుండి పెషావర్ కి రైలు సర్వీసులు రద్దు చేశారు! ఇటీవలే మళ్ళీ సర్వీసు పునరుద్దరించారు!
Karma Returns!
ఒకే విధమైన వస్త్రధారణ ఉన్న కారణంగా హిందూ పురుషులని గుర్తించడానికి సున్తీ జరిగిందా లేదా అని పరీక్ష చేసి చంపేవారు!
ఇప్పుడు?
బలూచి భాష వస్తే వదిలేస్తారు, ఉర్దూ మాట్లాడితే చంపేస్తున్నారు బాలూచ్ ఉగ్రవాదులు! ఈ రోజు రైలులో ఉన్న ప్రయాణీకులని కూడా అదే విధంగా చంపే అవకాశం ఉంది. పాకిస్థాన్ లోని పంజాబీలు అంటే బలూచ్ లకి అస్సలు పడదు!
So! 2029 లోపు ముందు PoK భారత్ లో కలిసిపోవచ్చు! తరువాత ఖైబర్ ఫక్తున్క్వా ఆఫ్ఘనిస్తాన్ లో కలిసిపోతుంది! బలూచ్ విడిపోవడం మాత్రం 2029 లో జరగవచ్చు!
బలూచిస్తాన్ లో ఉన్న గ్వాదర్ పోర్టు చైనా చేతిలో ఉండడం అమెరికాకి ఇష్టం ఉండదు! చేసిన అప్పులకి పాకిస్థాన్ తిరిగి ఇవ్వమని అడగలేదు! బలూచిస్తాన్ లో అపారమైన ఖనిజ సంపద ఉంది! అమెరికా ఎలా వదులుకుంటుంది? ఆట ఎవరు ఆడిస్తున్నారో అర్థమవుతోందిగా…
Share this Article