Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గుడిలో పెళ్లిళ్లపై నిషేధం… పురాతత్వ శాఖ బుర్రలు అంటే అంతే…

November 23, 2024 by M S R

.

ఆంధ్రప్రదేశ్ ‘భధ్రాద్రి’గా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఓ అభ్యంతరకర ఆదేశాలకు ‘తెర’ లేచింది. దేశంలోని ప్రతి హిందూ ఆలయంలో శుభకార్యాలు, వివాహ వేడుకలు, దీపోత్సవాలు జరగటం ఆనవాయితీ.

అయితే ఒంటిమిట్ట కోదండ రామాలయంలో అవన్నీ ‘బంద్’ కావడం పట్ల భక్తులు ఆగ్రహంతో ఉన్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పించుకోవాలి. లేదంటే ఆ ఆలయ ప్రాశస్త్యాం కోల్పోయే ప్రమాదం ఉంది.

Ads

అసలేం జరిగిందంటే..?
‘ఆంధ్రుల భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట కోదండ రామాలయంలో వివాహాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వొద్దు. పెళ్లిలు జరగనీయకుండా ఆపేయాలి’ అని భారత పురాతత్త్వ- సర్వేక్షణ శాఖ అధికారులు మౌఖిక ఆంక్షలు విధించారు. ఈ మేరకు తితిదే పరిపాలన యంత్రాంగానికి చరవాణిలో ఆదేశించారు.

తాజాగా తీసుకున్న నిర్ణయంతో భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో వివాహాలు చేసుకునేందుకు అమ్మాయి, అబ్బాయి, తల్లిదండ్రుల ఆధార్‌ పత్రాలు, శుభలేఖ అందించాలి. వివాహ కట్టడి రుసుం రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం గత పదేళ్లుగా అమలులో ఉంది.

ఆలయంలో పనిచేస్తున్న భజంత్రీల సిబ్బంది, అర్చకుల ద్వారా వివాహ క్రతువును నిర్వహిస్తారు. వారికి కొంతమేర నగదు ఇస్తున్నారు. ఆలయంలో వేదిక, షామియనాలు, పందిళ్లు, విద్యుద్దీకరణ, వివాహ వేడుక నిర్వహణకు బల్లలు, అతిథులు కూర్చోవడానికి కుర్చీలు వేయరు… అల్పాహరం, తేనీరు, భోజనం వసతి ఉండదు. రామలింగేశ్వరస్వామి ముంగిట్లో, సీతారాముల ఎదుర్కోలు మండపాల చెంత చలువరాళ్లపై సాధారణంగా వివాహాలు చేసుకోవాల్సి ఉంటుంది.

గత కొన్నేళ్లుగా ఇదే సంప్రదాయం..
ఇన్నాళ్లు ఎవరి నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. ఆలయ వేళల్లో ఉదయం 5 నుంచి సాయంత్రం 8.45 గంటల వరకు లగ్నం చూసుకుని వివాహాలు చేసుకునేవారు. ఒక పెళ్లి క్రతువు 30 నుంచి 40 నిమిషాల్లో ముగుస్తుంది. ఎవరికీ ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా జాగ్రత్తలు తీసుకునేవారు.

తాజాగా పురావస్తుశాఖ అధికారులు ఇకపై వివాహాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వరాదని తితిదే పాలనాధికారులకు చరవాణిలో మౌఖిక ఆదేశాలిచ్చారు. ఇదే ఇప్పుడు భక్తులను విస్మయానికి గురిచేస్తోంది. కార్తిక మాసంలో మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇక్కడ జగదభిరాముడి సన్నిధిలో పెళ్లి చేసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతుంటారు.

ముందస్తుగా వివాహ కట్టడి రుసుం చెల్లించాలని వస్తున్న వారికి తాత్కాలికంగా అనుమతి ఇవ్వడం లేదు. గత కొన్నేళ్లుగా ఎలాంటి ఆంక్షలు పెట్టుకుండా పెళ్లిళ్లు చేసుకోవడానికి అభ్యంతరాలు పెట్టకుండా ఇప్పుడెందుకు ఆక్షేపిస్తున్నారని సర్వత్రా చర్చ జరుగుతోంది. భారతీయ సనాతన సంప్రదాయం అనుసరించి శ్రీరామచంద్రమూర్తిపై భక్తిభావం, ఆధ్యాత్మిక చింతనతో ఇక్కడ పెళ్లిలు చేసుకుకోకుండా ఆంక్షలు విధించడం విచిత్రంగా ఉందని భక్తులు ఆక్రోశిస్తున్నారు.

దీపోత్సవానికి అనుమతి నిరాకరణ
డిసెంబరు 15న తితిదే ఆధ్వర్యంలో నిర్వహించనున్న దీపోత్సవం కార్యక్రమానికి భారత పురాతత్త్వ, సర్వేక్షణ శాఖ అధికారులు అనుమతి ఇవ్వలేదు. ధర్మ ప్రచార యాత్రలో భాగంగా పవిత్ర కార్తిక మాసంలో ఈ నెల 15న పౌర్ణమి సందర్భంగా లక్ష దీపోత్సవానికి అనుమతి ఇవ్వాలని ఈనెల 4న సీకేదిన్నె మండలం పెద్దముసల్‌రెడ్డిపల్లికి చెందిన బాలాజీ ఛారిటబుల్‌ ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు ఏటూరు రామచంద్రారెడ్డి తితిదే అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

దీనిపై తితిదే ఉన్నత స్థాయిలో పరిశీలించి, ప్రైవేటు వ్యక్తులు నిర్వహించే కార్యక్రమానికి అనుమతి ఇవ్వరాదని కొర్రీలు వేశారు. పైగా తితిదే పర్యవేక్షణలో డిసెంబరు 15న నిర్వహిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఇక్కడి అధికారులు పురావస్తుశాఖకు ప్రతిపాదనలు పంపించారు. ఇప్పుడు దానికి కూడా అనుమతి లభించలేదు.

డిసెంబరు 15న చేపట్టే కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలని పురావస్తు శాఖ నుంచి మౌఖిక ఉత్తర్వులు అందాయని, ఈ నేపథ్యంలో దీపోత్సవం క్రతువును నిర్వహించే పరిస్థితి లేదని డిప్యూటీ ఈవో నటేష్‌బాబు తెలిపారు. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు…. (ఈ కథనం మీడియా టుడే ఈ-పేపర్ నుంచి తీసుకోబడింది… ధన్యవాదాలు ఆనంచిన్ని వెంకటేశ్వరరావు )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హనుమంతు జగన్నాయకుల దొర… తెలుగు పోలీసుల్లో ఓ చరిత్ర…
  • నో…! మెగా క్యాంపుకీ బన్నీకి నడుమ గ్యాప్ అలాగే ఉందన్నమాట..!!
  • విధిలేదు… సొంత భర్త ప్రాణాలే తీసేసింది… ఈమె కథ ఇప్పుడెందుకంటే..?
  • కొత్త సెన్సార్ రూల్స్..! నిర్మాతల గుండెల్లో కొత్త గుబులు..!!
  • చేతుల విరిచి కట్టి, గడ్డిమోపులు చుట్టూ పేర్చి… కాలబెట్టారు…
  • శుష్క రాజకీయ మూసీ వ్యూహాలకు… అసలు నిజాల వెల్లడితో సీఎం అడ్డుకట్ట…
  • శృంగేరీ పీఠం ఉత్తరాధికారి నకిలీ శంకరాచార్యుడా..? ఏంటీ రచ్చ..?!
  • శివధర్‌రెడ్డి దగ్గర తుపాకీ లేదా..? దాంట్లో బుల్లెట్లు లేవా మాజీ కామ్రేడ్ దేవ్‌జీ..?
  • ఎంజీఆర్‌పై ఉచ్చ భాష… మన తెలుగుతనంలోనే ఏదో తేడా ఉన్నట్టుంది…
  • శెట్టి గ్యాంగ్… ఎనిమిదేళ్లు దాటినా రష్మికపై అదే కక్ష… అదే వేధింపులు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions