.
( పార్థసారథి పొట్లూరి ) …….. BLA అన్నంత పనీ చేసింది! బాలూచ్ లిబరేషన్ ఆర్మీ 240 మంది పాకిస్తాన్ ఆర్మీకి చెందిన సైనికులని కాల్చి చంపింది! మొదట 100 మంది తమ వద్ద బందీలుగా ఉన్నారని ప్రకటించిన BLA ఈ రోజు 240 మంది పాకిస్తాన్ ఆర్మీ కి చెందిన వాళ్ళని కాల్చి చంపామని ప్రకటించింది!
పాకిస్తాన్ ని బట్టలు ఊడదీసి కొట్టింది BLA! ఈ మాట ఎందుకు అనాల్సి వస్తున్నది అంటే పాకిస్తాన్ సైన్యం చెప్పే అబద్ధాలని ప్రపంచం ముందు అద్దంలో చూపించింది BLA!
Ads
BLA ఫైటర్లు పాకిస్తాన్ సైనికులని ఇంటరాగేట్ చేస్తున్న దృశ్యాలని వీడియో తీసి వైరల్ చేసింది BLA! నాకైతే కబీర్ బేడీ దర్శకత్వం వహించిన కాబూల్ express సినిమా క్లైమాక్స్ గుర్తుకు వచ్చింది!
అబద్ధాల మీద బ్రతికే పాకిస్థాన్ అనే షాడో దేశం చివరి దశ కనిపిస్తున్నది. నీడ ఉంటుంది కానీ దానికి భౌతిక రూపం ఉండదు! పాకిస్థాన్ కూడా అంతే!
ISI, యాంటి టెర్రర్ సైనికులు క్వేట్టా దేనికోసం వెళ్లినట్లు? బాలూచ్ లిబరేషన్ ఆర్మీని తుదముట్టించాలని ప్లాన్ కోసమే కదా? వీళ్ళకి రక్షణగా రెగ్యులర్ ఆర్మీ సైనికులని పంపింది! నిన్న అందరినీ చంపేసింది BLA! కనీసం తమ అధికారులని తమ దేశంలోనే రక్షించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయింది ISI!
2020 వరకూ ISI తన ఫండింగ్ తో సోషల్ మీడియాలో ప్రపంచంలో ఉన్న గూఢచార సంస్థలలో ISI అనేది మోస్సాద్, CIA ల తరువాతి స్థానం అని ప్రచారం చేసుకునేది! టాప్ 10 లో భారత RAW ఉండేది కాదు! మరిప్పుడేమిటి ఇలా అయిపొయింది?
ఎందుకంటే గత 10 ఏళ్లుగా భారత్ లో కాంగ్రెస్ అధికారంలో లేదు కాబట్టి ఇటు నుండి ఫండింగ్ ఆగిపోయింది! మరో వైపు అమెరికా నుండి ఫండింగ్ ఆగిపోయింది! ISI కోసం పాకిస్తాన్ లో పనిచేసేవాళ్ళు లేరు, ఉంటే మన దేశంలోనే ఉండి ఉంటారు!
పాకిస్థాన్ అబద్ధం చెప్తున్నది అని అన్ని దేశాల ఇంటెలిజెన్స్ సంస్థలు పసిగట్టేసాయి. YES! ఒక బలమైన శక్తి BLA వెనుక ఉండి నడిపిస్తున్నది ఇప్పుడు! తాలిబాన్ సహకారం ఉంది, ఉంటుంది ఇక మీదట కూడా!
CIA ఆపరేషన్ అనడానికి రెండు ఆధారాలు కనపడుతున్నాయి… ఒకటి మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులని మీమీద మాకెలాంటి ద్వేషం లేదు కాబట్టి మీరు స్వేచ్ఛగా వెళ్లిపోవచ్చు అని BLA వదిలేయడం అనేదే మొదటి ఆధారం!
ఇక రెండవ ఆధారం బాలూచిస్తాన్ లో చైనా ఎలాంటి ప్రాజెక్ట్ లు చేపట్టకూడదు అంటూ ఈ రోజు ప్రకటనలో తీవ్రంగా హేచ్చరించింది BLA! నిన్నటి రోజున అన్నది ఈ రోజు నిజమైంది!
40 వేలమంది బాలూచిస్తాన్ పౌరులని చంపింది పాకిస్తాన్ సైన్యం ఇప్పటివరకు! ఇక బాలూచ్ మహిళల మీద అత్యాచారం చేసి చంపిన వాటికి లెక్క లేదు! చిన్న పిల్లలని క్రూరంగా కాల్చి చంపింది కన్న తల్లుల ముందే!
మరో వైపు ఖైబర్ ఫక్తున్క్వా లో వారానికి రెండు దాడులు జరుగుతున్నాయి కానీ పాక్ సైన్యం అటువైపు వెళ్లడం లేదు! బలూచిస్తాన్ BLA మీద దాడి చేయడం కోసం పాక్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ లు కలిసి 36 గంటలు పోరాడి 16 మంది BLA ఫైటర్స్ ని చంపి వెనక్కి వెళ్లిపోయాయి కానీ బందీలని విడిపించే ప్రయత్నం చేయలేదు!
మూడు ప్రత్యేక రైళ్ళని కూడా సంఘటనా స్థలానికి తరలించింది సైన్యం. ఇంత చేసి BLA వదిలేసిన ప్రయాణీకులని వెనక్కి తీసుకెళ్లి ఆపరేషన్ విజయవంతం అయిందని చెప్పుకుంది!
అంటే CIA, తాలిబాన్ల సపోర్ట్ ఉంది అని ISI కి తెలిసే తమ బందీలని విడిపించుకునే ప్రయత్నం చేయలేదన్న మాట! వారం క్రితమే అమెరికా అధ్యక్షుడు తమ సైన్యం కాబూల్ లో వదిలిపెట్టిన ఆయుధాలని తిరిగి తమకి ఇచ్చేయాలని డిమాండ్ చేసినప్పుడే ఏదో జరగబోతున్నది అని అర్ధమయింది కానీ అది BLA రూపంలో అని ఎవరూ అనుకోలేదు!
జాఫర్ ఎక్సప్రెస్ హైజాక్ కి ముందు ఒక్క ఖైబర్ ఫక్తున్క్వా లోకి హెలికాప్టార్ గన్ షిప్స్ లేకుండా పాకిస్థాన్ సైన్యం వెళ్ళేది కాదు ఎందుకంటే క్లోజ్ ఎయిర్ సపోర్ట్ లేకుండా వెళితే ఎవరూ ప్రాణాలతో వెనక్కి రాలేరు. ఇప్పుడు బలూచిస్తాన్ లో అదే పరిస్థితి నెలకొన్నది!
BLA మరో ప్రకటన కూడా చేసింది.. బాలూచిస్తాన్ లోనే కాదు పెషావర్, లార్ లలోకి వచ్చి దాడులు చేస్తాము అని! అట్టోబాబాద్ లో బిన్ లాడెన్ ని దాచిపెట్టి 11 ఏళ్ళు CIA ని ముప్పుతిప్పలు పెట్టిన ISI కి, పాకిస్తాన్ సైన్యానికి ఇప్పుడు BLA రూపంలో బుద్ధి చెప్పాలని చూస్తున్నట్లుగా కనిపిస్తున్నది అమెరికా!
చైనా ఇప్పటికే గ్వాదర్ పోర్టుకి తమ సైనికులని కాపలాగా పెట్టుకున్నది! ఇప్పుడు మరింత భద్రత పెంచుతుందా లేక గ్వాదర్ పోర్టుని ఖాళీ చేసి వెళ్ళిపోతుందా అనేది త్వరలోనే తెలుస్తుంది! గెరిల్లా తరహా దాడులని ఎదుర్కోవడంలో పాకిస్తాన్ ఆర్మీకి ఉన్న అనుభవం PLA కి లేదు! BLA కనుక ఒక తీవ్రమైన దాడి చేస్తే చాలు చైనా వెనక్కి వెళ్ళిపోతుంది! అనుభవం ఉన్న పాకిస్తాన్ ఆర్మీకి సాధ్యం కానిది చైనా సైన్యానికి ఎలా సాధ్యం అవుతుంది?
So! డ్రాగన్ ఎలిఫెంట్లు స్నేహపూర్వక నృత్యం చేయాలి అటూ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఇ సన్నాయి నొక్కులు నొక్కడం వెనుక ఉన్న అర్ధం ఇదే!
PoK కనుక భారత్ అధీనంలోకి వస్తే భారత్ తో ఒప్పందం చేసుకొని తన CPEC ని కాపాడుకోవాలి అని చైనా ఆశ! CPEC ప్రాజెక్ట్ ఉద్దేశ్యం చైనా నుండి సరుకుల రవాణా… PoK ద్వారా గ్వదర్ పోర్టుకి చేర్చి, అక్కడి నుండి అరేబియా సముద్రం ద్వారా మధ్య ప్రాచ్యం, యూరోపుకి రవాణా చేయాలని. అదే గ్వాదర్ పోర్టు పొతే? CPEC అనేది వృధా అయిపోతుంది!
రెండు వైపులా చైనా కి చెక్ పెట్టినట్లుగా అవుతుంది! చైనాకి తెలిసిపోయింది PoK విషయంలో ఏదో జరగబోతున్నది అని! తన ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ ప్రాంతాన్ని చచ్చినట్లుగా ఒదులుకుని భారత్ నుండి అనుమతి తీసుకొని గ్వదర్ పోర్టుకి వెళ్ళాలి!
PoK మనకెందుకు అనే వాళ్లకి విషయం అర్ధమైంది అనుకుంటా! PoK లోని గిల్గిట్ బాల్టిస్తాన్ నుండి ఆఫ్ఘనిస్తాన్ కి దారి ఉంది! దానిని అభివృద్ధి చేస్తే మధ్య ఆసియా దేశాలకి మన ఎగుమతులు సులభంగా జరుగుతాయి!
PoK భౌగోళిక స్వరూపం, అక్కడి సంస్కృతి ఎలా ఉంటుందో, అలాగే భారత్ కి వచ్చే కష్టనష్టాలు ఏమిటో తెలుకునే సమయం వచ్చింది కాబట్టి వాటిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!
Share this Article