Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శ్రీశైలం పవర్ జనరేషన్‌పై బీఆర్ఎస్ క్యాంపు క్షుద్ర వాదన !!

August 7, 2026 by M S R

.

తెలంగాణలో చీమ చిటుక్కుమన్నా సరే… అదుగో, రేవంత్ కుట్ర, చంద్రబాబుకు గురుదక్షిణ అని ఓ రొటీన్ హాస్యాస్పద పాట ఎత్తుకుంటాడు కదా హరీష్ రావు… తమ స్పీకర్ నమస్తే తెలంగాణ కూడా అదే రాగం అందుకుంటుంది కదా…

ఎస్, నిన్న శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వస్తోంది… (ప్చ్, కాంగ్రెసోళ్లు ఆరోపిస్తున్నట్టు తెలంగాణలో వర్షాలు పడకుండా కరువు ప్రబలాలని క్షుద్రపూజలు చేశాడో లేదో తెలియదు నాకు, కానీ రెండు తెలుగు రాష్ట్రాలకు గుండెకాయ వంటి శ్రీశైలం నిండుతోంది… ఎల్లంపల్లి నుంచి, దేవాదుల నుంచి నీళ్లు ఎత్తిపోసే పంపులు నిర్విరామంగా నడుస్తున్నాయి…

Ads

ఉత్తర తెలంగాణలో వర్షాలు బాగానే పడుతున్నాయి… ఇప్పటివరకైతే మరీ భయానకంగా ఏమీలేదు ఎల్‌నినో సిట్యుయేషన్… ఈ ఆగస్టులో రెండు తుఫాన్లు తగలకపోతే మాత్రం ఇబ్బందే… సరే, ఆలమట్టి, నారాయణపూర్ నిండిపోయాయి, తుంగభద్ర నిండుతోంది… శ్రీశైలం నిండితే పెద్ద ఊరట… ప్రత్యేకించి తాగునీటికి…

అదే రాస్తూ… ఇక చంద్రబాబు ఆ నీటిని ఎత్తుకుపోవడానికి ప్లాన్స్ రెడీ చేస్తాడు అనుకున్నాను… వెంటనే చంద్రబాబు కృష్ణా బోర్డుకు ఓ లేఖ రాసేశాడు… అదింకా నిండనేలేదు, నా వాటా ఏమిటి అని పాట ఎత్తుకున్నాడు…

శ్రీశైలంలో ఇంకా పవర్ జనరేషన్ స్టార్ట్ చేయడం లేదేమిటి అని హరీష్ రావు, తన మీడియా గాయిగత్తర మొదలెడతారు ఇక… పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రాకు కృష్ణా జలాలు తరలించడానికే, గురుదక్షిణ కోసమే అని ఆ పాత పాచిపోయిన ఫార్ములా డైలాగ్ కొడతాడని అనుకున్నాను… తెల్లారే నమస్తే తెలంగాణలో ఓ లాజిక్ రాహిత్య కథనం…

(అసలు తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లజేసే పోతిరెడ్డిపాడు పొక్క వెడల్పు, రాయలసీమ లిఫ్టు కేసీయార్ నిర్లక్ష్యం పుణ్యమే… జగన్ మెప్పు కోసం…)

ఇలాంటి క్షుద్ర కథనాల్లో నమస్తే తెలంగాణ మన అంచనాల్ని ఎప్పుడూ నిరాశపరచదు… అనుకున్నట్టే రాశాడు…

నమస్తే

సేమ్, అదే రాశాడు… 854 అడుగులకు నీటిమట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తరలిస్తారు, సో ఆ లెవల్ కోసం పవర్ జనరేషన్ స్టార్ట్ చేయడం లేదంటూ అలవాటైన రీతిలో ఓ వక్రబాష్యం కుమ్మేశాడు…

నిజం ఏమిటంటే..? ఎగువ నుంచి వచ్చే వరదను అంచనా వేసుకుంటూ పవర్ జనరేట్ చేస్తారు… సో, 2 లక్షల క్యూసెక్కుల చొప్పున మరో అయిదారు రోజులు వరద వచ్చే అవకాశాన్ని గమనించి, ఈరోజు పవర్ జనరేషన్ స్టార్ట్ చేశారు… అదీ అసలు సంగతి…

అన్నింటికీ మించి… పవర్ ఇంకా ఏరకంగానైనా ఉత్పత్తి చేసుకోవచ్చు… కానీ నీళ్లను జనరేట్ చేయలేం… వస్తున్న నీటినే పొదుపుగా, జాగ్రత్తగా వాడుకోవాలి, పైగా ఆంధ్రాబాబు ఎత్తుకుపోకుండా చూసుకోవాలి… అసలే మీటర్లు కూడా పనిచేయకుండా చేశారు…

నిజానికి పవర్ జనరేట్ చేసినా, రివర్ స్ట్రీమ్‌లోకే నీటిని వదిలేయాలి, ఆ నీరంతా నాగార్జునసాగర్‌కే వెళ్లేది… అంటే, ఆంధ్రావైపే… కృష్ణా డెల్టాకు ఎలాగూ పట్టిసీమ వంటి లిఫ్టులతో గోదావరి నీటిని తరలిస్తారు… సాగర్‌లోకి నీళ్ల కోసమే ఆంధ్రా చూపులు…

వాస్తవాలు ఇలా ఉంటే… ఎంతసేపూ… రేవంత్, చంద్రబాబు, గురుదక్షిణ అంటూ నవ్వు పుట్టించే విమర్శలు, కథనాలతో తమనుతామే పలుచన చేసుకోవడం బీఆర్ఎస్ క్యాంపుకి బాగా అలవాటైపోయింది..!!

రేపటి వార్త... బీఆర్ఎస్ ఆందోళనలకు భయపడి రేవంత్ రెడ్డి శ్రీశైలంలో పవర్ జనరేషన్ స్టార్ట్ చేశాడు..!!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శ్రీశైలం పవర్ జనరేషన్‌పై బీఆర్ఎస్ క్యాంపు క్షుద్ర వాదన !!
  • Algorithmocracy – అల్గారిథం రాజ్యం ! రిథమ్ తప్పిన బానిస మనిషి !
  • అమ్మ ప్రేమ ! మనుషుల్లోలాగే ఉద్వేగాలు – దుఃఖం – వ్యక్తీకరణ !!
  • శకునాలు చెప్పిన తెహల్కా బల్లి కుడితి తొట్టెలో పడింది !!
  • ఇక గుడ్డివాళ్లే ఉండరు ! ఎలన్‌మస్క్ కంపెనీ అద్భుత ఆవిష్కరణ !!
  • నాకెంత? నీకెంత? – కేటీఆర్ చెప్పే లొట్టపీసు కేసులో చాలా పెద్ద కథ !!
  • ఐనవాళ్లు ఉన్నా… అనాథ ప్రేతాలే !! ముసలితనమే ఓ ‘ఒంటరిశాపం’…!!
  • విస్మయ ! సూపర్ స్టార్ కూతురు ! హీరోయిన్‌గా మూవీల్లోకి ఎంట్రీ !!
  • కొరియన్ కనకరాజూ… కథ మరీ కామెడీ అయిపోయిందోయ్…
  • అరుపులు – కేకలు – నెత్తురు – బీజీఎం మోత – బీభత్సమైన హింస !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions