.
ముందుగా ఒక పోస్టు చదవండి… ఇది Srivatsa Gadiyaram పోస్టు … ‘‘నేను కోరుకోవడం లేదు. జ్యోతిష్యం తెలియదు. కానీ, ఈ సంవత్సరం ఆగస్టు, నవంబర్ మధ్య కాలంలో తీవ్రమైన ఉగ్రవాద ఘటనలు సంభవిస్తాయి. మోదీ దిగిపోవాలని దేశమంతా వినాశనం సృష్టిస్తారు.
అ తర్వాత తొందరలోనే పాకిస్తాన్ ముక్కలవుతుంది. అమెరికాలో కూడా మూడో, నాలుగో రాష్ట్రాలు విడిపోతాయి. చైనా కూడా మూడు ఏళ్లలో ముక్కలవుతుంది. నేను శపించడం లేదు. కలగనడం లేదు. ఇది అచ్చమైన భూ రాజకీయాల విశ్లేషణ.
Ads
నమ్మొద్దు. గమనించండి. జాగ్రత్తగా వుండండి. నామాట: కొందరు జ్యోతిష్యులు, ఇంకొందరు విశ్లేషకులు చెప్పిన అంచనాల ప్రకారం ఈ సంవత్సరం చివరి త్రైమాసికంలో దేశంలో తీవ్ర ఉగ్రవాద ఘటనలు జరగడానికి, భారత్ – పాక్ మధ్య ఘర్షణ జరగడానికి అవకాశం ఉంది.
2027లో భారత ప్రధాని మార్పు జరుగుతుందని, మోదీ స్థానంలో యోగి ప్రధాని అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. 2028 నుండి 2034 వరకు ప్రపంచంలో అనేక తీవ్ర మార్పులు, సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు…
….. ఇదీ పోస్టు… నాకు జ్యోతిష్యం తెలియదంటూనే ఈ జోస్యాలు ఏమిటి, ఎవరు చెప్పారు వంటి వివరాలేమీ లేవు కానీ… బొద్దింకలు మోదీ మెడలు వొంచాయనే మెజారిటీ ప్రజలు, బీజేపీ కార్యకర్తలు సహా నమ్ముతున్నారు… ఢిల్లీని ముట్టడించిన ఖలిస్థానీ శక్తులకు వెరచి వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన రోజులతో పోలిస్తే ఇది మరీ ఆందోళనలకు దాసోహం అయినట్టుగా భావిస్తున్నారు…
పేరుకు పైకి ఏం చెప్పుకున్నా సరే, ఎన్డీయే ప్రభుత్వం అంత బలంగా ఏమీ లేదనీ, సరైన సవాళ్లు ఎదురైతే దాన్ని ఇరుకునపెట్టడం దెబ్బతీయడం అంత కష్టమేమీ కాదనే భావన ప్రబలింది… ఐతే కాంగ్రెస్ సహా ఏ ఇతర పార్టీలకూ బీజేపీని ఎదుర్కోవడం చేతగాక, సీజేపీ బ్యానర్ ముందు మోకరిల్లారనే భావన పెరగడమే బీజేపీకి కొంత రిలీఫ్…
ఐతే నిజంగానే మోదీ తన పదవీకాలాన్ని పూర్తి చేయకుండానే అర్థంతరంగా పదవి వదిలేస్తాడా..? ఇప్పుడున్న స్థితిలో అది కష్టం… ప్రతిపక్ష పార్టీలు కకావికలై, ఎన్డీయే ఏకంగా టూథర్డ్ మెజారిటీ వైపు వెళ్తోంది… ఇప్పుడది ఏ చంద్రబాబు మీదో, ఏ నితిశ్ మీదో ఆధారపడే దురవస్థలో కూడా లేదు…
కాకపోతే యాంటీ నేషన్, యాంటీ హిందూ, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మొన్న ఒక్కటైనట్టుగానే మరేదో ఇష్యూ మీద చెలరేగిపోతే, విధ్వంసానికి, దేశవ్యాప్త హింసకు (సీఏఏ విషయంలో చూశాం కదా) పాల్పడితే నిజంగా మోదీ టాకిల్ చేయగలడా అనే ప్రశ్న మాత్రం ఓ భూతంలా బీజేపీ ఎదుట నిలబడుతోంది…
యూపీ ఎన్నికలకు ముందు పెట్టుకుని ఇప్పట్లో యోగిని కదిలించలేరు… ఒకవేళ మోదీ కాబోయే రాష్ట్రపతి అనుకుంటే, మరి ప్రధాని ఎవరు..? అమిత్ షా..? ఇద్దరూ గుజరాతీలేనా? సామాజిక, ప్రాంతీయ సమతూకం అంగీకరించదు… అసలే ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్‌కూ మోదీ కూటమికీ పడటం లేదు…
పాకిస్థాన్ ముక్కలవుతుంది అని చాన్నాళ్లుగా అనుకుంటున్నదే… బెలూచ్, పీఓకే అల్లర్లను అణచలేకపోతే ఇది నిజం కావచ్చు కూడా… అమెరికా నుంచి మూడో నాలుగో రాష్ట్రాలు విడిపోతాయనేదీ డౌటే, ట్రంప్ బతికి ఉన్నన్నాళ్లు దాన్ని అడ్డుకుంటాడు, అలాగే చైనా మూడేళ్లలో ముక్కలవుతుందనే జోస్యమూ డౌటే…
అసలే భూటాన్‌లాగా థైవాన్‌నూ మింగేయడానికి కదులుతోంది ఆ అనకొండ… ఏ ప్రావిన్సులోనూ ఏ ఆందోళన లేదు… అమెరికా కూటమిని ఎదుర్కోగల దేశం ప్రస్తుతానికి చైనా ఒకటే… సరే, రకరకాల జోస్యాలు మళ్లీ తెరపై రావడానికి కారణం మాత్రం బొద్దింకలు మీసాలు మెలేయడమే…
అంకిత్ త్యాగి అని మరో జ్యోతిష్కుడు, ఈవెంట్స్ ప్రెడిక్టర్… తన సక్సెస్ రేటు ఎంతో తెలియదు గానీ, చాలామంది నమ్ముతారు… రాష్ట్రపతిగా మహిళ, ధన్‌ఖడ్ రాజీనామా, సీఎం కుర్చీకి నితిశ్ వీడ్కోలు, ప్రశాంత్ కిషోర్ జీరో సీట్లు వంటివి చాలా ముందే చెప్పానని అంటున్నాడు… బొద్దింకలు గెలుస్తాయని మన వేణుస్వామీ చెప్పాడు… నిజమైంది…
ఆస్ట్రో శర్మిష్ట వంటి బీజేపీ మద్దతుదారులు మాత్రం జ్యోతిష్యాన్ని, తమ వ్యక్తిగత రాగద్వేషాలను మిళితం చేసి, అబ్బే, మోదీకి ఇప్పట్లో ఢోకా లేదు అంటున్నారు… సరే, జ్యోతిష్యం కేవలం దాన్ని నమ్మేవారికి మాత్రమే… కొట్టిపారేసేవాళ్లు బోలెడు మంది…
మేం తోపులం అని చెప్పుకునేవాళ్లు కూడా ఏదైనా జరిగితే చూశారా, మేం ముందే చెప్పాం అని క్లెయిమ్ చేసుకుంటారు, జరగకపోతే సైలెన్స్… బట్ ఒకటి మాత్రం నిజం… అన్ని కళ్లూ మోదీ మీదే ఉన్నాయి… ఈయన పూర్తికాలం పదవిలో ఉంటాడా అని..!!
Share this Article