జెనిబెన్ ఠాకూర్… గుజరాత్‌లోనే కాదు, ఇండి కూటమిలో కూడా ఈ పేరు ఇప్పుడు బడా పాపులర్ పేరు… అసలు ఎవరీమె… జెయింట్ కిల్లర్… గుజరాత్లో కాంగ్రెస్ గెలుచుకున్న ఏకైక సీటులో విజేత ఈమే… 2014లో 2019లో కాంగ్రెస్ ఒక్క సీటూ గెలుచుకోలేదు రాష్ట్రంలో… కానీ ఈసారి జెనిబెన్ గెలిచింది… 49 ఏళ్ల మహిళ గెలవడం ఒక్కటే కాదు విశేషం… సొంతంగా ఖర్చు పెట్టడానికి డబ్బు లేదు, కాంగ్రెస్ ఏమీ ఇవ్వలేదు, ఇచ్చే పరిస్థితిలో కూడా లేదు… దాంతో […]
ప్రపంచంలోకెల్లా ఉత్తమ పోస్ట్ మ్యాన్… మన నీలగిరి పోస్ట్ శివన్ …
(రమణ కొంటికర్ల…)……… నీలగిరి పర్వతశ్రేణుల్లో.. దట్టమైన అడవుల్లో.. ఓ పోస్ట్ మ్యాన్ 30 ఏళ్ల ప్రయాణం! ఉద్యోగస్తులెందరో రిటైరవుతుంటారు.. వాళ్లకు తోచిన రీతిలో పదవీ విరమణ వేడుకలు చేసుకుంటారు.. ఆరోజుకైపోతుంది. కానీ, పదవీ విరమణ తర్వాత కూడా సమాజానికి గుర్తుండేవారు.. ఆయా సందర్భాల్లో యాజ్జేసుకునేవారు మాత్రం కొందరే. అలాంటి వారిలో తమిళనాడుకు చెందిన డి. శివన్ ఒకరు. ఎందుకంటే, ఉద్యోగ జీవితం ప్రారంభించి… 2020, మార్చ్ 7న పదవీ విరమణ వరకూ అలుపెరుగకుండా నడిచిన ఓ బహుదూరపు […]
తన జర్నీకి పొసగదనే భావనతో… రాష్ట్రపతి పదవే వద్దనుకుంది…
భారతదేశ అత్యున్నత పదవైన రాష్ట్రపతి పీఠం వరిస్తే ఎవ్వరు మాత్రం కాదంటారు..? స్థితప్రజ్ఞులనుకున్నవారు సైతం.. ఆ అవకాశం వస్తే వదులుకోలేకపోయినవారే. కానీ, ఓ శాస్త్రీయ నృత్య కళాకారిణికి అలాంటి అవకాశం వస్తే.. వదులుకుందన్న విషయం మనలో ఎందరికి తెలుసు..? ఆ పేరే.. రుక్మిణీదేవీ అరుండేల్. రండి కలియుగ రుక్మిణీ కథేంటో ఓసారి తెలుసుకుందాం. 1904, ఫిబ్రవరి 29- 1986 ఫిబ్రవరి 24 ఏ ఫోటో చూసినా.. ఆమె నాట్య భంగిమల్లో ఓ తన్మయత్వంలోనే కనిపిస్తారు. ఫోటోగ్రాఫర్స్ ఎంతగా […]
సుదూర ప్రయాణం… అరుదైన రక్తదానం… అక్షరాలా ప్రాణదానం…
ప్రాణం విలువ తెలిసినవాడు ప్రాణం కాపాడతాడు.. ప్రాణం విలువ తెలియనివాడు చెలగాటమాడుతాడు. మనిషంటే లెక్కలేనివాడు సాటి మనిషేమైపోయినా పట్టించుకోడు.. మనిషి విలువ తెలిసినవాడు సాటి మనిషిగా చేయూతనందిస్తాడు. ఇప్పుడీ కొటేషన్స్ ఎందుకంటే… ఓ మహిళ ప్రాణాన్ని కాపాడేందుకు 400 కిలోమీటర్లు ప్రయాణించాడు ఓ వ్యక్తి.! అందుకు!! అంతకుముందు మనమో బ్లడ్ గ్రూప్ గురించి చెప్పుకోవాలి. అదే హెచ్ హెచ్ బ్లడ్ గ్రూప్. దాన్నే బొంబాయి బ్లడ్ గ్రూప్ అని కూడా అంటారు. ఇదొక అరుదైన రక్త నమూనా. […]
అందుకే అది పక్షిరాజు… వేటకు తననే ఆయుధంగా ఇలా మార్చుకుంటుంది…
Jagan Rao….. జీవితంలో క్రింద పడితే పక్షి రాజు గద్ద జీవితం నిజంగా ఒక పాఠం. బాగా బతికి చెడితే గద్ద జీవితమే ఒక భగవద్గీత. బద్దకం ఉంటే గద్ద జీవితమే ఒక బైబిల్. నేను ఒంటరి, నేను ఏమీ చేయలేను అనుకుంటే గద్ద జీవితమే ఒక ఖురాన్. నా రాత ఇంతే మారదు, నా కర్మ ఇంతే నేను ఏమీ చేయలేను అనుకుంటే మాత్రం గద్ద జీవితం చదవాల్సిన ఒక గ్రంధం నీరు నింగి నేల […]
ఓ అరుదైన డాక్టర్‌ను పరిచయం చేస్తాను… కడుపు నిండిపోతుంది…
మీకు మరో ఇన్స్పయిరింగ్ పర్సనాలిటీని పరిచయం చేస్తాను… సోషల్ మీడియాలో, తద్వారా సొసైటీలో పాజిటివిటీ స్ప్రెడ్ చేసే పోస్టులు అవసరం కాబట్టి… ఇలాంటి వ్యక్తుల గురించి ప్రపంచానికి తెలియాలి కాబట్టి… పరిచయం అంటే… జస్ట్, క్లుప్తంగా ఆయనెవరో చెప్పేస్తాను… కానీ ఆయన సొంత ఇన్‌స్టా, ఫేస్బుక్, యూట్యూబు ఖాతాలను సందర్శించి తను స్వయంగా చేసిన వీడియోలు, పెట్టిన పోస్టులు, అనేక వైద్యపరమైన అంశాలపై తన అభిప్రాయాలు, సూచనల్ని…. ప్రత్యేకించి పిల్లలతో ఉన్న తన వీడియోలు చూడాలి… కడుపు […]
Inspiring Post… చాలా పాతది, వైరల్… మళ్లీ గుర్తొచ్చింది తాజాగా…
నిజానికి ఈ పోస్టు పైపైన చదివితే… ఏముందీ ఇందులో అనిపిస్తుంది… కాసేపటికి బుర్రలో అది తిరగడం మొదలవుతుంది… స్వచ్ఛమైన, అరుదైన సంపద అంటే ఏమిటో అర్థమవుతూ ఉంటుంది… అదెక్కడ, ఎలా ఉంటుందో కనిపిస్తూ ఉంటుంది… బహుశా ఈ పోస్టు కొన్ని వేల పోస్టులుగా మారి, వైరలై, లక్షల లైకులతో ఇప్పటికే చదవబడి ఉంది… మళ్లీ మిత్రుడు Padmakar Daggumati వాల్ మీద కనిపించింది… “పాదాలకి మొక్కాలని అనిపించే మంచి” పేరిట… అవును, మళ్లీ ఓసారి కొత్త పాఠకులకు చెప్పాలనిపించింది… […]
Great Inspiring… ఓ టాయిలెట్ క్లీనర్ 10 గిన్నీస్ రికార్డులు.. మురికి పిల్లల కోసం…
స్లమ్ డ్లాగ్ మిలియనీర్… మారియా కాన్సీకోవా! రోల్స్ రాయిస్ కారులో సూట్ బూటు వేసుకుని దిగినంత మాత్రాన హీరోలైపోరు. కురచ దుస్తులు ధరించి అందాల విందు ప్రదర్శించేవారంతా హీరోయిన్సూ కారు. చలించేలా ఇన్స్పైర్ చేసిన ఓ కథకు నాయకత్వం వహిస్తే.. కథానాయకులు, కథానాయకలవుతారు. అలాంటి ఓ కథానాయకే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న మారియా కాన్సీకావో. జస్ట్ టాయిలెట్ క్లీనర్… ఎవరెస్ట్ ను మించిన ఎదిగిన కథ ఇది. అచ్చ తెలుగు భాషలో మనం పిల్చుకునే పాకీ పని […]
ఈ పోలింగ్ ఆఫీసర్ గుర్తుంది కదా… ఆ ట్రెండీ లుక్కుల వెనుక ఓ ట్రాజెడీ స్టోరీ…
కొడుక్కి పాలిస్తూ… కళ్లల్లో నీళ్లు తుడచుకుంటూ… రెండేళ్లు అసలు నేను గది దాటి బయటికి రాలేదు….. ఈ మాటలు అన్నది ఎవరో కాదు… రీనా ద్వివేది… ఫోటో చూడగానే ఆమె ఎవరో గుర్తుపట్టే ఉంటారు కదా… పోలింగ్ సామగ్రి తీసుకెళ్తున్న ఆమె ఫోటో దేశవ్యాప్తంగా వైరల్ రెండు సందర్భాల్లో… ఒకసారి 2019 జనరల్ ఎలక్షన్స్‌లో… మరోసారి 2022 అసెంబ్లీ ఎన్నికల్లో… ఆమె మీద ఎన్ని చెణుకులు, జోకులు, మీమ్స్, వ్యాఖ్యలు, హాట్ పోస్టులు… మొదటి ఎర్ర చీరెలో […]
8 నెలలు… 3800 కిలోమీటర్ల ఓ సాహసి ఒంటరి పాదయాత్ర… కానీ దేనికి..?!
సాటి మహిళల సమస్యలే ఎజెండా! కన్యాకుమారి టూ కశ్మీర్… ఓ నారీ జర్నీ!! WOMB.. WOMEN OF MY BILLION. అమెజాన్ ప్రైమ్ లో డాక్యుమెంటరీగా తెరకెక్కిన ఈ కథనం ఇప్పుడో చర్చ. లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆడియన్స్ అవార్డ్ గెల్చుకుని.. ఆగస్టులో జరుగబోయే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ లోనూ ప్రదర్శించేందుకు సిద్ధమవుతోంది. ఎందుకు WOMB గురించి మరి చర్చ అంటే… సృష్టి బక్షి కన్యాకుమారి నుంచి కశ్మీర్ జర్నీ గురించి […]
భారతీయ కార్టూనిస్టు ధైర్యానికి అంతర్జాతీయ గుర్తింపు
Sai Vamshi…. … భారతీయ కార్టూనిస్టు రచిత తనేజాకు 2024 సంవత్సరానికి గాను ‘Kofi Annan Courage in Cartooning Award’ అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయురాలు రచిత. ఆమెతోపాటు హాంగ్‌కాంగ్‌కు చెందిన కార్టూనిస్టు జున్జీకీ ఈ అవార్డు ఇచ్చారు. ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ పేరిట 2012 నుంచి జెనీవాలోని ‘Freedom Cartoonists Foundation’ రెండేళ్లకోసారి ఈ అవార్డులు అందిస్తోంది. పురస్కారం కింద రు.13.82 లక్షలను అవార్డు గ్రహీతలకు సమానంగా […]
అరవైలో ఇరవై వచ్చిందీ… ఈమెకు వయస్సు జస్ట్ ఓ నంబర్ మాత్రమే…
అందానికి అందం ఈ పుత్తడి బామ్మ ‘కన్నెతనం వన్నె మాసి… ప్రౌఢత్వం పారిపోయి… మధ్యవయసు తొంగిచూసిన ముసలి రూపు ముంచుకురాదా!’ అన్న మార్చి రాయలేమో! అందాల పోటీలంటే…తళుకు బెళుకులు, వయ్యారి భామలు అనుకుంటాం. ఆ ప్రపంచంలో మనకేం పని అనుకోడమూ సహజమే. మరి “అరవయ్యేళ్లు!”- ఈ మాట వింటేనే పెద్దవాళ్ళయిపోయామంటూ నిట్టూరుస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు చాలామంది అనారోగ్య సమస్యలతో, పిల్లలు, మనవళ్ల పనులతో గడిపేస్తూ ఉంటారు. అసలీ ఇల్లు, పిల్లలు, భర్త … వీరి పనుల […]
ఒక ఫోటో జర్నలిస్టు… ఎడారిని జయించి అడవిని సాధించాడు…
ఫోటో జర్నలిస్ట్ పర్యావరణవేత్తయ్యాడు! ఎడారిని జయించి అడవిని సాధించాడు!! డీఫారెస్టేషన్.. ఇప్పుడిది పెద్ద సమస్య. ఏదో నాల్గు మొక్కలు నాటితే తిరిగి పర్యావరణ సమతుల్యతను పొందేది కాని భవిష్యత్ ఉత్పాతం. అర్బనైజేషన్ మూలమా అని పల్లెలు పోయి పట్టణాలు అవతరిస్తూ.. ఊళ్లకూళ్లు మట్టి కనిపించని కాంక్రీట్ జంగల్స్ గా మారుతున్న రోజులు. ఎక్కడికక్క వివిధ మానవ అవసరాల కొరకు, విలాసాల పేరిట కొండలు, గుట్టలు, చెట్లు.. తద్వారా ఎన్నో ప్రాణులు.. ఇలా మొత్తంగా జీవవైవిధ్యానికే ప్రమాదం ముంచుకొస్తున్న […]
ప్రభుత్వం పురమాయించిందని పద్యం రాయలేను నేను…
Taadi Prakash….. ప్రేరణ జన్ముడు కుమార్ కూనపరాజు ————————-2018 సెప్టెంబర్ 8……హైదరాబాద్, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12ఆర్టిస్ట్ మోహన్ లేని ఆ ఆఫీస్ హడావుడిగా ఉంది.అతి తేలికైన పద్ధతిలో లియో టాల్ స్టాయ్ శిల్పం అక్కడ తయారవుతోంది.చెక్కముక్కల ఫ్రేమ్ కి ఒక ముతక గుడ్డని బిగించి, ఒక పద్ధతిలో అమర్చి ఆ మహారచయిత రూపు తెస్తున్నాడు కారంకి శ్రీరామ్. నలుగురైదుగురు మిత్రులం ఆసక్తిగా చూస్తున్నాం.టాల్ స్టాయ్ గంభీరంగా కూర్చుని ఉండే మాస్కో శిల్పం నమూనా అది.మేకులు కొట్టీ, […]
ఇదీ భారతీయ హృదయ స్పందన… పాకిస్థానీ అమ్మాయికి ప్రాణదానం…
MY COUNTRY IS THE WORLD, AND MY RELIGION IS TO DO GOOD… BY THOMAS PAINE. నా దేశమే ప్రపంచం, మంచి చేయడమే నా మతం.. ప్రఖ్యాత ఫ్రెంచ్ విప్లవకారుడు, రచయిత థామస్ పైన్ చెప్పిన మాటలు.. ఓ పాకిస్థానీ విషయంలో భారత్ స్పందించిన తీరుతో అక్షరసత్యాలయ్యాయి. భారతీయ హృదయ స్పందన.. మరో పాకిస్థానీకి హృదయాన్నిచ్చి.. జీవితాన్నందించిన కథ ఇది. అందుకు చెన్నై ఎంజీఎం హెల్త్‌కేర్ మల్టీ స్పెషాల్టీ హాస్పిటల్ వేదికైంది. ఉచితంగా […]
రెండుసార్లు సివిల్స్ కొట్టి… జస్ట్, అలా వదిలేశాడు… అన్నింట్లోనూ మాస్టర్..!
ఒక వ్యక్తి ఏదైనా ఓరంగంలో చిత్తశుద్ధితో పనిచేస్తూ పోతే.. కింగ్ కావచ్చునేమో! కానీ, ఒకే వ్యక్తి తానేరంగాన్నెంచుకుంటే అందులో.. రింగ్ తిప్పొచ్చా..? అలా చక్రం తిప్పాడు కాబట్టే ఆయన గురించి ఈ ముచ్చట. ఏకంగా 20 డిగ్రీలు… రెండుసార్లు యూపీఎస్సీలో ఉత్తీర్ణుడు.. ఐఏఎస్ సాధించినోడు.. అంతే సులభంగా దాన్ని జుజుబీ అన్నట్టుగా వదిలేసినోడు.. ఎవరతను..? శ్రీకాంత్ జిచ్ కర్. చదువు పట్ల ఏ మాత్రం ఆసక్తి కనబర్చేవారికైనా… ఈయన స్టోరీ వింటే జస్ట్ గూస్ బంప్సే! ఓ […]
గగనపు అంచుల్లోకి ఎగురుతాం… సముద్రపు లోతుల్లోకి దూకుతాం…
ఫైర్ ఫైటర్స్, డీప్ సీ డైవర్స్ గా మహిళలు … నెత్తి మీద నీటి బిందెలతో మైళ్ళ దూరం నడచి వెళ్లే మహిళల శక్తి సామర్ధ్యాలు మనకి పట్టవు… రోడ్డు పక్కన బండరాళ్లను అవలీలగా పగలగొట్టి రోళ్ళుగా మలచి చవకగా అమ్మే ఆడవారు ఆనరు… సన్నని తాడుపైన పాదాలతో బాలన్స్ చేసుకుంటూ కర్ర చేత్తో పట్టుకుని నడిచే అమ్మాయిని చూసి ఆనందించడమే తప్ప ఆమె సాహసం గుర్తించరు. ఎంత చదువుకుని ఉన్నత హోదాలో ఉన్నా వివక్ష తప్పదనే […]
మనసున్నోడు… సాఫ్ట్వేర్ వదిలాడు… సొసైటీ కోసం కదిలాడు…
ఒక దృశ్యం ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను కలిచివేసింది… ఒక ఉత్పాతం తన ఉద్యోగాన్నే వదిలేసేలా చేసింది… వ్యవసాయాన్ని నమ్మిన వేలాది మంది గ్రామాల నుంచి ఇతర పట్టణాలకు వలస బాట పట్టడం అతడి దృక్పథాన్నే మార్చేసింది. అందుకు కారణమైంది 2018 నవంబర్ లో తమిళనాడులో వచ్చిన గజ తుపానైతే… అత్యధిక వేతనంతో దుబాయ్ లో సాఫ్ట్ వేర్ డెవలపర్ ఉద్యోగాన్ని వదులుకున్న ఆ వ్యక్తే నిమల్ రాఘవన్. తమిళనాడు తంజావురు జిల్లా నదియంలో జన్మించిన […]
జ్ఞానం మరీ ఎక్కువైతే…? ఈ కథలోని వశిష్ట నారాయణ్ అవుతారు..!!
మనిషికి జ్ఞానం ఎక్కువైనా ప్రమాదమే… మన బుర్ర హరాయించుకోలేదు… కొలాప్స్ అయిపోయి, మనిషి పిచ్చోడైపోతాడు… నిజం… ఇక్కడ లక్ష పుస్తకాలు చదివిన, 80 వేల పుస్తకాలు చదివిన, కంప్యూటర్ నేనే కనిపెట్టిన, సెల్ ఫోన్ నా సృష్టే అని సొల్లే జ్ఞానుల గురించి కాదు… నిజంగానే అపరిమిత జ్ఞానాన్ని పొందిన వారి గురించి… బీహార్… బసంతపూర్ జిల్లా… ఎవరికీ తెలియని ఓ మారుమూల పల్లె… 1942లో పుట్టాడు… తండ్రి ఓ పోలీస్ కానిస్టేబుల్… పేరు వశిష్ట నారాయణ్… […]
సమాజమే అడ్డుపడి… ఆ మరణశిక్ష నుంచి అతన్ని తప్పించింది…
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న.. మదర్ థెరీస్సా చెప్పిన ఈ ప్రోవర్బ్ ఎంత పాప్యులరో తెలిసిందే. అయితే, ఒక వ్యక్తి.. ఒక కుటుంబం ఒంటరైనప్పుడు థెరీస్సా మాటల స్పిరిట్ తో కనుక సమాజం పనిచేస్తే… మన కంటికి కనిపించని దైవత్వాన్ని మించిన మానవత్వాన్ని ఆవిష్కరించొచ్చు. కనిపించని దైవత్వం కన్నా.. కనిపించే మానవత్వమే మిన్న అనిపించొచ్చు. అదిగో అలా చేశారు కనుకే.. ఆ కేరళ సమాజపు స్టోరీ ఓసారి చెప్పుకోవాలి. అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను.. మృగజాతికెవ్వడు […]
- « Previous Page
- 1
- 2
- 3
- 4
- …
- 12
- Next Page »