మంచి సంకల్పం… మంచి తోడ్పాటు… స్నేహితుడి దాతృత్వానికి కొనసాగింపు… భేష్ విశాల్..! మొన్న హఠాత్తుగా మరణించిన తన స్నేహితుడు, కన్నడహీరో అప్పు పునీత్ రాజకుమార్ ఆశయాల్ని కొనసాగిస్తాననీ, పునీత్ చదివిస్తున్న 1800 మంది పిల్లల బాధ్యత, ఖర్చు ఓ సంవత్సరంపాటు తను భరిస్తాననీ విశాల్ ప్రకటించాడు… తన ఎనిమీ సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్లో చెప్పాడు… గుడ్, అభినందనలు విశాల్… ఏదో ఓ ఎమోషన్లో చెబుతారులే అని విశాల్ మీద సందేహపడనక్కర్లేదు… ప్రజలకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు స్వయంగా […]
తండ్రి కిడ్నాప్‌కూ పునీత్ మైనింగుకూ లింకేంటి..?! ఓ సీనియర్ జర్నలిస్టు స్వగతం..!
పునీత్ రాజకుమార్… అలియాస్ లోహిత్ రాజకుమార్… తెలుగు సమాజం కూడా తన హఠాన్మరణం పట్ల సంతాపాన్ని ప్రకటిస్తోంది… ఓ పాపులర్ హీరో తన దాతృత్వంలో జనం మనసు గెలుచుకుని, చిన్న వయస్సులోనే వెళ్లిపోయిన తనకు అన్ని ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియల్ని ప్రకటించింది కర్నాటక ప్రభుత్వం… కంఠీరవ స్టేడియంలో అభిమానుల సందర్శనకు, అంతిమ నివాళికీ ఏర్పాట్లు చేసింది… పునీత్‌కు సరైన అంతిమ గౌరవం..! చాలామంది తనతో ఉన్న అనుబంధాన్ని, పాత అనుభవాల్ని పంచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు… నిజానికి మలయాళ, […]
ఆ కేన్సర్ స్పెషలిస్టు… రిటైరయ్యాక సిద్ధవైద్యంలోకి..! ఎందుకు, ఎవరు..?!
ఒక వార్త, ఒక ఫోటో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది… సంక్షిప్తంగా సదరు వార్త ఏం చెబుతున్నదంటే… ‘‘ఈ ఫోటోలో పెద్దాయన్ని గమనించండి, వేదాలు చదివిన పండితుడిలా, వృద్ధ బ్రాహ్మడిలా కనిపిస్తున్నాడు కదా… ఆయన ఓ పేరుమోసిన డాక్టర్, కేన్సర్ కేసుల్ని ట్రీట్ చేసే అంకాలజిస్టు… కేరళలోనే మొట్టమొదటి అంకాలజిస్టు… కొట్టాయం మెడికల్ కాలేజీలో అంకాలజీ ప్రొఫెసర్, తరువాత ఆ డిపార్ట్మెంట్ హెడ్, కొట్టాయం మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా కూడా పనిచేశాడు… రిటైరైన తరువాత ఫ్లయింగ్ […]
సునీల్ చెత్రి..! భేష్ హీరో… నీకు ముచ్చట కాంప్లిమెంట్స్… Our Hyderabadi…!
మన హైదరాబాదీయే… ఏదైనా ఘనత సాధించినప్పుడు కనిపించాలి కదా…! మెయిన్ స్ట్రీమ్‌లో ఓ చిన్న వార్తో రావాలి కదా… తుచ్ఛమైన రాజకీయ నాయకుల బూతులకు, ఒకడి మీద ఒకడు చేసుకునే దాడులకు ఇచ్చే ప్రయారిటీ మిగతావాటికి ఎందుకు దక్కదు..? మన ఖర్మ అంటారా..? సరే..! సునీల్ చెత్రి… ఇదీ తన పేరు… సికింద్రాబాదులో పుట్టాడు… ఫుట్ బాల్ ప్లేయర్… ప్రస్తుతం తన ప్లేసు ఏమిటో తెలుసా..? అంతర్జాతీయ గోల్స్ సాధించిన క్రీడాకారుల జాబితాలో సెకండ్ జాయింట్ నేమ్… […]
ఆదానీలు, అంబానీలు కాగలరేమో కానీ… ఒక రతన్ టాటా కావడం చాలా కష్టం…!!
Jagannadh Goud………………… రతన్ టాటా – మనమంతా జరుపుకోవాల్సిన ఒక ఉత్సవం..! టాటా వాళ్ళే ఇండియాలో మొదటి ఎయిర్ లైన్స్ ప్రారంభించారు. ఆ తర్వాత అది ఎయిర్ ఇండియా అయ్యి ప్రభుత్వ చేతుల్లోకి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ అది టాటా వాళ్ళ చేతుల్లోకి వచ్చిన సందర్భంలో రతన్ టాటా గారి గురించి నా అభిప్రాయం. టాటా గ్రూపు వ్యవస్థాపకుడు జంషెట్ టాటా. జంషెట్ టాటా కొడుకు రతన్ జంషెట్ టాటా. రతన్ జంషెట్ టాటాకి పిల్లలు లేకపోతే […]
ఈ కడక్ చాయ్ వెనుక ఓ స్పూర్తి కథ ఉంది… ఓ వ్యక్తి విజయగాథ ఉంది…
*హైదరాబాద్ అంటే…’నీలోఫర్ కేఫ్’ ! (Cafe Nilopher) చాయ్ (Tea ) కూడా….!! హైదరాబాద్, లక్డీకాపూల్ సమీపంలోని రెడ్ హిల్స్ ” నీలోఫర్ కేఫ్ “లో చాయ్ తాగటం ఓ ప్రివిలేజ్. అసలు చాయ్ కు….హైదరాబాదుకు ఓ అవినాభావ సంబంధం వుంది. ఓ కప్పు చాయ్ తాగాలన్న కోరిక ప్రతీ… హైదరాబాదీకి వుంటుంది. అలాగే… నీలోఫర్ కేఫ్ చాయ్ రుచి ప్రతీ….. హైదరాబాదీ హృదయానికి తెలుసు.(ఏక్ ప్యాలా చాయ్ కి తమన్నా… సార్ హైదరాబాదీ కి రగ్ […]
ఇదుగో ఇలాంటివే… ఇంకా మన జీవితంలోని పాజిటివిటీని బతికించేవి…
తల్లిదండ్రులు భార్య తనయులాప్తులు బావమఱదులన్నలు మేనమామగారు, ఘనముగా బంధువుల్ కలిగినప్పటికైన దానుదర్లగ వెంటదగిలిరారు, యమునిదూతలు ప్రాణమపహరించుక పోగ మమతతో బోరాడి మాన్పలేరు, బలగమందఱు దుఃఖపడుట మాత్రమెకాని, యించుకయాయుష్యమీయలేరు, చుట్టములమీది భ్రమదీసి చూరజెక్కి, సంతతము మిమ్ము నమ్ముట సార్ధకంబు ……… అన్న శేషప్ప పద్యంలోని ఈ మాటలు వింటుంటే… దుబాయ్ ఆసుపత్రిలో 9 నెలల పాటు గడిపి ఇక పనైపోయిందనుకున్న ఆ పేషంట్ పాలిట వాళ్లే సాక్షాత్తూ ఆ భూషణ వికాసుడైన నారసింహుడయ్యారనిపించే కథ ఇది! కట్ల గంగారెడ్డీది […]
గుడ్ టీచర్ అంటే..? తరగతి గదిలో మాయమైన ఓ రిస్ట్ వాచీ కథ…!
అనుకోకుండా ఓ ముసలాయన్ని ఓ యువకుడు పలకరించి కాళ్లు మొక్కాడు… ‘సర్, నన్ను గుర్తుపట్టారా..?‘ ఆయన గుర్తుపట్టలేదు అన్నాడు… ‘సర్, నేను మీ స్టూడెంట్ను…’ ‘ఓహ్, నిజమా..? సంతోషం, నాకు గుర్తులేదు, ఏం చేస్తున్నావ్ బాబూ ఇప్పుడు..?’ ‘నేను టీచర్ అయ్యాను మాస్టారూ…’ ‘గుడ్, వెరీ గుడ్, నాలాగే టీచర్ అయ్యావన్నమాట..?’ ‘అవును సర్, నిజానికి టీచర్ కావడానికి మీరే స్పూర్తి’ ‘అదేంటి..?’ ‘బహుశా మీకు గుర్తుండదు, నేను చెబుతా వినండి…’ —— ‘‘ఓసారి నా దోస్త్ […]
Duggu Duggu Bullet Song… ఈ వీడియో చూసి మాట్లాడండి ఓసారి..!!
ఇది ఏ హాస్పిటలో, ఎక్కడో తెలియదు… కానీ తెలిస్తే ఆ నర్స్ ఎవరో గానీ ఓసారి దండం పెట్టుకోవచ్చు… ఒక పాపులర్ పాటను, తెలుగువాడి గుండెల్ని కదిలించి, హృదయాంతరాల్లో కదలికను తీసుకొస్తున్న డుగ్గు డుగ్గు బుల్లెట్ బండి పాటను ఈ నర్స్ ఎలా వాడిందో ఓసారి దిగువన వీడియో లింక్ చూడండి… ఇన్ని రోజులూ ఆఫ్టరాల్ ఓ ప్రైవేటు సాంగ్ అని తీసిపారేసేవాళ్లు, దాన్ని కొక్కిరిస్తూ పోస్టులు పెట్టి తమ పర్వర్షన్ ప్రదర్శిస్తున్నవాళ్లు తప్పకుండా చూడాలి… పక్షవాతంతో […]
మళ్లీ మెచ్చితిమి స్టాలిన్..! ఈ మెచ్యూరిటీ లెవల్ ఇలాగే ఉండుగాక..!
మన నేతలు ఇక్కడ జాతిప్రజలు అత్యంత గర్వపడేలా… అద్భుత పరిణత వ్యక్తిత్వాలతో గాండూ, సాలే, గూట్లే, సన్నాసీ, ఎదవ, చవట అని రకరకాలుగా తిట్టుకుంటూ ఉంటారు… ఈమధ్య ఏపీ నేతల ‘జోష్’ తగ్గిపోయింది ఎందుకో… మళ్లీ కొడాలి పూనుకోవాల్సిందే… ఇక మాకేం తక్కువ అంటూ తెలంగాణ నేతలు అందుకున్నారు ఆ ఘన సాంస్కృతిక పోకడను..! ఏపీ నేతలే విస్తుపోయే రేంజులో రెచ్చిపోతున్నారు… మన రాష్ట్రాల్లో విపక్ష నేతలపై కేసులు పెట్టేస్తుంటారు… ప్రతిపక్షానికి పేరొచ్చే పాత ప్రజా పథకాలను […]
నీరజ్ చోప్రా…! ఈ ‘బంగారు బల్లెం’పై బోలెడు ఇంట్రస్టింగ్ సంగతులు..!!
నీరజ్ చోప్రా… ఇప్పుడు ఈ పేరు దేశమంతా మారుమోగిపోతున్నది కదా… మరి ఒక్క ఒలింపిక్ స్వర్ణపతకం కోసం ఎంతో కరువులో ఉన్నాం కదా ఏళ్లుగా..?! ఆ ఆకలి తీర్చాడు… అవునూ, ఆకలి అంటే గుర్తొచ్చింది… నీరజ్ మొదట్లో వెజిటేరియనే… జావెలిన్ ప్రాక్టీస్ చేస్తున్న తొలిరోజుల్లో కూడా చపాతీలు, కాయగూరలు… అంతే… కానీ స్టామినా కావాలంటే నాన్ వెజ్ తప్పదు, యూరప్ వంటి దేశాలు వెళ్తే మరీ తప్పదు అని ఎవరో చెబితే చికెన్ తినడం స్టార్ట్ చేశాడు… […]
మొన్నటిదాకా కరోనా గుప్పిట్లో… ఇప్పుడు తొలి ఒలింపిక్ పతకం ముంగిట్లో…
కొన్ని విశేషాలు చదువుతుంటే ఆశ్చర్యమేస్తుంది… అదితి అశోక్… ఒలింపిక్స్‌లో మరో భారతీయ యువకెరటం… గోల్ఫ్‌లో మొట్టమొదటి ఒలింపిక్స్ పతకాన్ని సాధించే భారతీయ మహిళ కాబోతున్నదనే ఆశ నెలకొంది ఇప్పుడు… నిజానికి ఆమె వరల్డ్ ర్యాంకింగ్ ఎంతో తెలుసా..? 200 స్థానం… ఒలింపిక్స్ ర్యాకింగ్ చూసుకున్నా తక్కువే… 45… అంతేకాదు, డబుల్ వీసా కోసం ఆమె పాస్‌పోర్టు చాలారోజులు కాన్సులేట్‌లో ఇరుక్కుపోయింది… మే నుంచి జూన్ నడుమ కరోనాతో బాధపడింది… కీలకమైన ప్రాక్టీస్ లోపించింది… అసలు ఈసారి ఒలింపిక్స్‌కు […]
భేష్ మీరాబాయ్ చాను..! ఇప్పుడు నచ్చేశావ్ మరింతగా…!
ఎంతైనా ఎదుగు, అంతే ఒదుగు అంటారు పెద్దలు… అలాగే మూలాలు మరిచిపోకపోవడం, సాయపడిన వారిని మరిచిపోకపోవడం కూడా పెద్దలు చెప్పే చద్దన్నం వంటి నీతిమాట… ఈ విషయంలో మన మణిపురి రజతం మీరాబాయ్ చాను నిజంగా మణిపూస… ఈ వార్త చదువుతూ ఉంటేనే ఆనందమేసింది.., విషయం ఏమిటంటే..? ఈమె సొంతూరు Nongpok Kakching… ఇది ఇంఫాల్‌కు 20-25 కిలోమీటర్లు ఉంటుంది… స్పోర్ట్స్ అకాడమీలో చానుకు ట్రెయినింగ్, అది ఉన్నదేమో ఇంఫాల్‌లో… ఈమె ఉండేది సొంతూళ్లో… రోజూ పొద్దున్నే […]
ఈసారికి సారీ నాన్నా.., వచ్చేసారి నీ ఫోటో దగ్గర బంగారు పతకం పెడతాను చూడు..!!
‘‘నాన్నే నాకు స్పూర్తి… తను ఎంత కష్టజీవో నాకు బాగా తెలుసు… ఓ చిన్న రైతు… తన భూమే తన సర్వస్వం…. ఎప్పుడు చూసినా పొలంలో ఏదో పనిచేస్తుండేవాడు… నాకు మంచి చదువు చెప్పించాలనేది నాన్న కోరిక… ‘ఒరే నాన్నా, మన భూమి, మన శ్రమే మన గుర్తింపు… డబ్బు అంత త్వరగా ఏమీ రాదు, మనలాంటోళ్లకు కాయకష్టం, పంటపొలం లేకపోతే డబ్బేది..?’ ఇలాంటి ముచ్చట్లే చెప్పేవాడు… ఊళ్లోకి ఏ కొత్త కారు వచ్చినా ఆసక్తిగా చూస్తుండేవాడు… […]
న్యూయార్స్ టైమ్స్కూ కనిపించినయ్ భువనేశ్వర్ వందశాతం టీకాలు..!
నో డౌట్… కాశ్మీర్, లడఖ్, హిమచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్… రాష్ట్రం ఏదైతేనేం… ఎత్తయిన కొండలు ఎక్కుతూ… ప్రవాహాలు దాటుతూ… ఆరోగ్య సిబ్బంది కరోనా వేక్సిన్లను గ్రామాల దాకా తీసుకుపోతున్నారు… ప్రజల్ని కన్విన్స్ చేస్తున్నారు… ఫస్ట్, సెకండ్ డోసులు కలిపి 48 కోట్ల దాకా వేశారు ఇప్పటికే… కానీ ఇంతా చేస్తే ఇప్పటికి 10 కోట్ల మందికి మాత్రమే రెండేసి టీకాలు పడ్డయ్… మన ప్రభుత్వ వేక్సిన్ పాలసీ ఫెయిల్యూర్ బలంగానే ఉంది, కానీ ఈమధ్యే గాడిన […]
మన తాజా ఒలింపిక్స్ హాకీ విజయాల వెనుక ఓ గట్టి తెలుగు బుర్ర…!!
మన మహిళల హాకీ జట్టు సెమీస్‌లో అడుగుపెట్టింది… ఎవరూ ఊహించని ముందంజ… ఎన్నో దశాబ్దాల తరువాత దక్కిన మంచి విజయం… సాహో మన రాణి రాంపాల్ టీం….. పురుషుల హాకీ జట్టు తక్కువేమీ కాదు… అదీ దశాబ్దాల తరువాత, 49 ఏళ్ల తరువాత సెమీస్‌లోకి ప్రవేశించింది… అరె, పతకాలు వస్తాయా రావా జానేదేవ్… క్రికెట్ జట్టు గురించి కాదు, దేశం ఈరోజు మన జాతీయ క్రీడ గురించి ఆలోచిస్తోంది… సంబరపడుతోంది… కమాన్, చక్ దే ఇండియా అంటూ […]
A Real Teacher..! మాటల్లేవ్… ఇలాంటి గురువుల్ని ఇక చూడలేం..!!
………… By….. Bharadwaja Rangavajhala………….. డెబ్బై ఐదు ప్రాంతాల్లో … బెజవాడ మాచవరం మారుతీనగరం ప్రాంతాల్లో పొద్దున్నే రోడ్ల మీద ఎర్ర నిక్కరు తెల్లచొక్కాల పిల్లలు బారులు తీరి ఎస్ఆర్ఆర్ కాలేజ్ పక్కన ఉండే మలేరియా ఆఫీసు వీధిలోకి వెళ్లడం అనే సీన్ ప్రతి ఉదయం దర్శనమిచ్చేది. ఆ సందు ప్రారంభం నుంచీ ఎడమ వైపు రెండో బిల్డింగులో ప్రతిభానికేతన్ అనే స్కూలు ఉండేది. ఆ కాలంలో అంత సక్సస్ ఫుల్ గా నడచిన ప్రైవేటు స్కూలు […]
‘‘విరిగిపోతే పడేసిన ఓ హాకీ స్టిక్ దొరికింది… నా ఆట ఇక మొదలైంది…’’
‘‘కరెంటు పోతే ఎప్పుడొస్తుందో తెలియదు… దోమల మోత… అసలు ఈ జీవితం నుంచే పారిపోవాలనేంత చిరాకు… సరిగ్గా తిండి దొరకదు… మంచి బట్టల్లేవు… చినకు పడితే చాలు, మా రెండు గదుల ఇల్లు చెరువైపోతూ ఉంటుంది… పాపం, నాన్న కూడా ఏం చేయగలడు..? బండి లాగేవాడు రోజూ డెబ్బయ్, ఎనభై సంపాదిస్తే అదే ఎక్కువ కదా… అక్కడికీ అమ్మ కొన్ని ఇండ్లల్లో పనులు చేస్తూ వేణ్నీళ్లకు చన్నీళ్లు తోడుగా ఉంటోంది… మాకు దగ్గరలోనే ఓ హాకీ అకాడమీ […]
పరిచయమైన పదేళ్లూ గిల్లికజ్జాలే… ఓ ఆర్చరీ జంట సినిమా టైపు ప్రేమకథ…
ఓ సినిమా కథలాంటి కథే… స్ట్రెయిట్‌గా కథలోకి వెళ్లిపోదాం… ఆమె… పేరు దీపిక కుమారి… జార్ఖండ్, రాంచీలో పుట్టింది… తండ్రి ఆటోరిక్షా నడుపుకుంటాడు… తల్లి ఓ నర్స్… బొటాబొటీ సంసారం… అప్పుడప్పుడూ పస్తులు… చిన్న ఇల్లు… సినిమాలు, టీవీ మహాభారత్‌లో చూసి, తోటి పిల్లలతో కలిసి వెదురుతో బాణాలు తయారు చేసుకుని ఆడుకునేవాళ్లు… తన కజిన్ విద్యాకుమారి అప్పటికే ఆర్చర్… పలు పోటీల్లో పతకాలు సాధించేది… జార్ఖండ్ సీఎం అర్జున్ ముండా భార్య మీరా ముండా తన […]
మన మణిపూస చాను… ట్రక్కు డ్రైవర్ల వివరాలను ఎందుకు సేకరిస్తోంది..?!
అసలు ఫేక్ పోస్టులు క్రియేట్ చేసేవాళ్లు.., మార్ఫ్డ్ ఫోటోల్ని ప్రచారంలోకి తెచ్చేవాళ్లు.., డాక్టర్డ్ వీడియోలను సోషల్ సర్క్యులేషన్లోకి తెచ్చేవాళ్లకన్నా…. వాటిని నిజమని నమ్మేసి, కాస్త కామన్ సెన్స్‌తో పరిశీలించి చూద్దామనే సోయి కూడా లేకుండా, ఎడాపెడా కామెంట్లు పెట్టేసి… అందరితో వాగ్వాదాలకు దిగేవాళ్లను చూస్తేనే చిర్రెత్తేది… సోషల్ మీడియా అంటే ఎక్కువశాతం ఫేక్ ఖాతాలు, ఫేక్ ఫోటోలు, ఫేక్ వీడియోలు, ఫేక్ కంటెంటు, ఫేక్ గాళ్లు… ప్రతి ఫోటో, ప్రతి వీడియో అనుమానాస్పదంగా చూడాల్సిందే… ఈసారి ఒలింపిక్స్‌లో […]
- « Previous Page
- 1
- …
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- Next Page »