MY COUNTRY IS THE WORLD, AND MY RELIGION IS TO DO GOOD… BY THOMAS PAINE. నా దేశమే ప్రపంచం, మంచి చేయడమే నా మతం.. ప్రఖ్యాత ఫ్రెంచ్ విప్లవకారుడు, రచయిత థామస్ పైన్ చెప్పిన మాటలు.. ఓ పాకిస్థానీ విషయంలో భారత్ స్పందించిన తీరుతో అక్షరసత్యాలయ్యాయి. భారతీయ హృదయ స్పందన.. మరో పాకిస్థానీకి హృదయాన్నిచ్చి.. జీవితాన్నందించిన కథ ఇది. అందుకు చెన్నై ఎంజీఎం హెల్త్‌కేర్ మల్టీ స్పెషాల్టీ హాస్పిటల్ వేదికైంది. ఉచితంగా […]
రెండుసార్లు సివిల్స్ కొట్టి… జస్ట్, అలా వదిలేశాడు… అన్నింట్లోనూ మాస్టర్..!
ఒక వ్యక్తి ఏదైనా ఓరంగంలో చిత్తశుద్ధితో పనిచేస్తూ పోతే.. కింగ్ కావచ్చునేమో! కానీ, ఒకే వ్యక్తి తానేరంగాన్నెంచుకుంటే అందులో.. రింగ్ తిప్పొచ్చా..? అలా చక్రం తిప్పాడు కాబట్టే ఆయన గురించి ఈ ముచ్చట. ఏకంగా 20 డిగ్రీలు… రెండుసార్లు యూపీఎస్సీలో ఉత్తీర్ణుడు.. ఐఏఎస్ సాధించినోడు.. అంతే సులభంగా దాన్ని జుజుబీ అన్నట్టుగా వదిలేసినోడు.. ఎవరతను..? శ్రీకాంత్ జిచ్ కర్. చదువు పట్ల ఏ మాత్రం ఆసక్తి కనబర్చేవారికైనా… ఈయన స్టోరీ వింటే జస్ట్ గూస్ బంప్సే! ఓ […]
గగనపు అంచుల్లోకి ఎగురుతాం… సముద్రపు లోతుల్లోకి దూకుతాం…
ఫైర్ ఫైటర్స్, డీప్ సీ డైవర్స్ గా మహిళలు … నెత్తి మీద నీటి బిందెలతో మైళ్ళ దూరం నడచి వెళ్లే మహిళల శక్తి సామర్ధ్యాలు మనకి పట్టవు… రోడ్డు పక్కన బండరాళ్లను అవలీలగా పగలగొట్టి రోళ్ళుగా మలచి చవకగా అమ్మే ఆడవారు ఆనరు… సన్నని తాడుపైన పాదాలతో బాలన్స్ చేసుకుంటూ కర్ర చేత్తో పట్టుకుని నడిచే అమ్మాయిని చూసి ఆనందించడమే తప్ప ఆమె సాహసం గుర్తించరు. ఎంత చదువుకుని ఉన్నత హోదాలో ఉన్నా వివక్ష తప్పదనే […]
మనసున్నోడు… సాఫ్ట్వేర్ వదిలాడు… సొసైటీ కోసం కదిలాడు…
ఒక దృశ్యం ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను కలిచివేసింది… ఒక ఉత్పాతం తన ఉద్యోగాన్నే వదిలేసేలా చేసింది… వ్యవసాయాన్ని నమ్మిన వేలాది మంది గ్రామాల నుంచి ఇతర పట్టణాలకు వలస బాట పట్టడం అతడి దృక్పథాన్నే మార్చేసింది. అందుకు కారణమైంది 2018 నవంబర్ లో తమిళనాడులో వచ్చిన గజ తుపానైతే… అత్యధిక వేతనంతో దుబాయ్ లో సాఫ్ట్ వేర్ డెవలపర్ ఉద్యోగాన్ని వదులుకున్న ఆ వ్యక్తే నిమల్ రాఘవన్. తమిళనాడు తంజావురు జిల్లా నదియంలో జన్మించిన […]
జ్ఞానం మరీ ఎక్కువైతే…? ఈ కథలోని వశిష్ట నారాయణ్ అవుతారు..!!
మనిషికి జ్ఞానం ఎక్కువైనా ప్రమాదమే… మన బుర్ర హరాయించుకోలేదు… కొలాప్స్ అయిపోయి, మనిషి పిచ్చోడైపోతాడు… నిజం… ఇక్కడ లక్ష పుస్తకాలు చదివిన, 80 వేల పుస్తకాలు చదివిన, కంప్యూటర్ నేనే కనిపెట్టిన, సెల్ ఫోన్ నా సృష్టే అని సొల్లే జ్ఞానుల గురించి కాదు… నిజంగానే అపరిమిత జ్ఞానాన్ని పొందిన వారి గురించి… బీహార్… బసంతపూర్ జిల్లా… ఎవరికీ తెలియని ఓ మారుమూల పల్లె… 1942లో పుట్టాడు… తండ్రి ఓ పోలీస్ కానిస్టేబుల్… పేరు వశిష్ట నారాయణ్… […]
సమాజమే అడ్డుపడి… ఆ మరణశిక్ష నుంచి అతన్ని తప్పించింది…
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న.. మదర్ థెరీస్సా చెప్పిన ఈ ప్రోవర్బ్ ఎంత పాప్యులరో తెలిసిందే. అయితే, ఒక వ్యక్తి.. ఒక కుటుంబం ఒంటరైనప్పుడు థెరీస్సా మాటల స్పిరిట్ తో కనుక సమాజం పనిచేస్తే… మన కంటికి కనిపించని దైవత్వాన్ని మించిన మానవత్వాన్ని ఆవిష్కరించొచ్చు. కనిపించని దైవత్వం కన్నా.. కనిపించే మానవత్వమే మిన్న అనిపించొచ్చు. అదిగో అలా చేశారు కనుకే.. ఆ కేరళ సమాజపు స్టోరీ ఓసారి చెప్పుకోవాలి. అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను.. మృగజాతికెవ్వడు […]
ఆ రహీమ్ సాబ్ మన హైదరాబాదీయే… బాలీవుడ్ బయోపిక్కు రియల్ హీరో…
(రమణ కొంటికర్ల) ……… 1964లో రహీమ్ సాబ్ ఏ చిట్కాలైతే చెప్పాడో… ఇప్పుడు ఫుట్ బాల్ కు కేరాఫ్ లా మారిన బ్రెజిల్ లో అవే నేర్పిస్తున్నారు. ఈ మాటన్నది.. 1964లో ఇండియన్ ఫుట్ బాల్ కోచ్ గా పనిచేసిన ఆల్బర్ట్ ఫెర్నాండో. అందుకే రహీమ్ సాబ్ ను ఫుట్ బాల్ ప్రవక్తగా కొల్చేవారట. ఇప్పుడెందుకీ రహీమ్ సాబ్ ముచ్చట అంటే.. ఈ ఏప్రిల్ 10వ తేదీన విడుదల కాబోతున్న అజయ్ దేవగణ్ మైదాన్ స్టోరీ.. రహీమ్ […]
ఓ గృహిణి… రోజూ రెండు ఇడ్లీలు… అస్సలు మెచ్చుకోని ఓ ధర్మ భిక్షువు కథ…
Prabhakar Jaini….. రెండు ఇడ్లీలు… ఒక మహిళ ప్రతిరోజు తన ఇంటి పిట్టగోడపై ఆకులో రెండు ఇడ్లీలు పెడుతూ వచ్చేది, ఆకలితో ఉన్నవాళ్లు ఎవరైనా తింటారు అని… ఆ దారివెంట వెళ్ళే ఒక ముసలాయన ఆ ఇడ్లీలు తీసుకోవడం ఏదో చిన్నగా గొణుక్కుంటూ వెళ్లడం జరిగేది, ఒకరోజు వేదవతి గోడ పక్కనే నిలబడి అతను ఏమి అంటున్నాడో వినాలని అనుకున్నది, అతను చెప్తున్న మాటలు… నువ్వు చేసిన పాపం నీ దగ్గరే ఉంటుంది నువ్వు చేసే పుణ్యం […]
అక్షయపాత్ర..! అరుదైన ఓ ఘనతకు అక్షరాలా ఐరాస అభినందనలు…
అక్షయపాత్ర… మహాభారతంలో ద్రౌపది తన దగ్గరున్న అక్షయపాత్రతో ఎంతమంది అన్నార్తులు వచ్చినా సరే, భోజనాలు సమకూరుస్తుంది… ఓసారి కుయుక్తితో దుర్వాసుడు భోజనాలవేళ దాటాక, తన శిష్యగణంతో వచ్చి భోజనాలకై ఒత్తిడి తెస్తాడు… అప్పుడు కృష్ణుడు సమయానికి అరుదెంచి, అక్షయపాత్రలో మిగిలిన ఓ మెతుకు తిని, సాధుగణం ఏమీ తినకుండానే పొట్టలు పగిలిపోతూ వాపస్ వెళ్లిపోయేలా చేస్తాడు… ఇది పురాణ కథ… సరే, వర్తమానానికి వద్దాం… ఇంటికి నలుగురు అతిథులు వస్తున్నారు, భోజనాలు చేసి వెళ్తారు అంటేనే గృహిణికి […]
సారే జహాసే అచ్చా… అంతరిక్షం నుంచి ఈ మాట విని అప్పుడే 40 ఏళ్లు…
గుర్తుందా..? సరిగ్గా 40 ఏళ్ల క్రితం… భారతీయ వ్యోమగామి రాకేశ్ శర్మ రష్యన్ వ్యోమనౌక సూయజ్‌లో అంతరిక్షానికి ఎగిసిన రోజు… ఏ ప్రధాని అయినా ఇలాంటివి ఓన్ చేసుకోవడానికే ప్రయత్నిస్తాడు కదా… చంద్రయాన్ విషయంలో మోడీలాగా..! అప్పటి ప్రధాని ఇందిర కూడా అంతరిక్షంలో ఉన్న రాకేశ్ శర్మతో మాట్లాడటాన్ని కోట్లాది టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయించింది… అంతరిక్షం నుంచి మన దేశం ఎలా కనిపిస్తోంది అనే ఇందిర ప్రశ్నకు ‘సారే జహాసే అచ్చా’ అని స్పందించాడు రాకేశ్ […]
జిల్లా కలెక్టర్ దాకా ఎదిగిన ఓ పేపర్ బాయ్… ఓ స్పూర్తిదాయక ప్రస్థానం…
మీరు ఏదో సమస్య మీద జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి పత్రం అందించి, సమస్య పరిష్కారం కోసం మొరపెట్టుకోవాలని వెళ్లారు… అక్కడ జిల్లా కలెక్టర్‌ను ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది మీకు… కాసేపటికి వెలిగింది… తను రోజూ పొద్దున్నే తమ ఇంటికి డెయిలీ పేపర్ వేసేవాడు కదా… ఎహే, పేపర్ బాయ్ కుర్చీలో ఉన్నది ఏమిటి..? మీలో అయోమయం… సందిగ్ధం… ఆ కలెక్టరే అన్నాడు, మీ సందేహం నిజమే, నేను మీ ఇంటికి పేపర్ వేసేవాడిని నవ్వుతూ… ఏదో సినిమా […]
ఏడుగురు ఖాకీ బిడ్డల కథ… లింగ వివక్ష అసలే లేని ఓ తండ్రి పెంపకం కథ…
కేరళ, ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశమంతా ఓ రోగం ప్రబలి ఉండేది కదా… ఆడపిల్ల అని తెలిస్తే కడుపులోనే చంపేయడం, కొన్నిచోట్ల పుట్టగానే చంపేయడం, కాదంటే ఆ తల్లిని వదిలేయడం, ఇంట్లో నుంచి గెంటేయడం, విధి లేక పెంచుతున్నా వివక్ష చూపించడం ఎట్సెట్రా… కొన్ని కులాల్లో, కొన్ని జాతుల్లో, కొన్ని ప్రాంతాల్లో స్త్రీపురుష నిష్పత్తి దారుణంగా పడిపోవడం కూడా తెలిసిందే కదా… అలాంటిది బీహార్‌లో ఒక తండ్రి తన ఏడుగురు బిడ్డల్ని జాగ్రత్తగా పెంచి, విద్యాబుద్ధులు నేర్పించిన […]
ఐఐటీ నుంచి, ఐఐఎం మీదుగా… క్రమేపీ ఓ సరికొత్త ఆధ్యాత్మిక పంథాలోకి…
creation of new humanity througu intelligent spirtuality… ఓ ఐఐటీయన్, ఓ బిజినెస్ మెనేజ్మెంట్ స్టూడెంట్ మాంక్ గా మారి చెబుతున్న కథ! జీవితానికీ… జీవితంలో ఎదుగుదలకూ ఓ సాచ్యురేషన్ పాయింట్ ఉంటుంది. ఎదుగుతున్నకొద్దీ ఇంకేదో అందుకోవాలన్న ఆసక్తి కొందరికుంటుంది. పీక్ లెవల్ కు చేరాక కూడా ఎదిగేందుకు ఇంకెంతో మిగిలి ఉన్నా.. ఎదుగుదలకు ఆకాశమే హద్దనే అవగాహన కల్గి ఉన్నా.. కొందరిలో ఓ సాచ్యురేషన్ పాయింట్ వారిని పూర్తి కాంట్రాడిక్టరీగా.. అప్పటివరకూ వారి జీవితం […]
సంస్కర్త, లడక్ ఉద్యమకారుడు వాంగ్ చుక్.. ఓ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్!
ఓ వ్యక్తి బయోపిక్ తీయడం వేరు… ఆ క్యారెక్టర్ స్ఫూర్తితో సామాజిక సందేశాన్నిచ్చే సినిమా తీయడం వేరు. రెండో కోవలోకి చెందిందే రాజు హిరానీ తీసిన త్రీ ఈడియట్స్. అంతగా రాజు హిరానీని ఇన్స్పైర్ చేసిన పాత్ర సోనమ్ వాంగ్ చుక్. అదే త్రీ ఈడియట్స్ లో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రైన రాంచోడ్ దాస్ శమల్ దాస్ చాంచడ్. ఈ సినిమా దర్శకుడు రాజు హిరానీ అయితే.. నిర్మించింది మరో టేస్టీ డైరెక్టర్ విధూ వినోద్ […]
నెలకు 100 ఎడ్యుకేషన్ లోన్… కట్ చేస్తే… మిసైల్ వుమన్ ఆఫ్ ఇండియా…
మనం నారీశక్తి అని అప్పుప్పుడూ కొందరి గురించి చెప్పుకుంటూ ఉంటాం కదా… ఈమె గురించి ఓసారి చదవాలి… ఈమె పేరు టెస్సీ థామస్… కేరళ, అలప్పుజలోని ఓ మలబార్ క్యాథలిక్ కుటుంబంలో పుట్టింది… నలుగురు అక్కచెల్లెళ్లు, ఒక సోదరుడు… పెరట్లో పారే బ్యాక్ వాటర్స్… ప్రకృతి ఒడిలో పెరిగింది… ఆరుగురు పిల్లలైనా సరే, అందరికీ మంచి చదువు చెప్పించాలని తల్లి ప్రయత్నం… మదర్ థెరిస్సా పేరు ధ్వనించేలా టెస్సీ అని పెట్టుకుంది ఈ బిడ్డకు… చిన్నప్పటి నుంచే […]
టెన్త్‌తో ఆగి… ఆపైన అడ్డా కూలీ దశ నుంచి… సింగరేణి సీఎండీ కుర్చీ దాకా…
అడవిరాముడు సినిమా ఆరోజుల్లో 500 రోజులు ఆడింది .. అది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గ్రామం .. ఒక అభిమాని ఒక పాట కోసం 500 రోజులు ఆ సినిమా చూసాడు .. ఆ పాటకున్న పవర్ అలాంటిది .. ఆ పాట వింటే ఇప్పటికి ఉత్సహమే కలుగుతుంది .. పని చేయాలనే కసి పెరుగుతుంది మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మా… పట్టుదలే వుంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు. […]
ప్యూర్ గోల్డ్ ఈ మనిషి… బడా శ్రీమంతుడు… ఆర్థికంగానే కాదు… హార్దికంగా..!
ఈరోజు పత్రికల్లో నచ్చిన వార్త ఇది… ఈనాడులో ఓ సింగిల్ కాలమ్ వార్త… మిగతావాళ్లకు ఆనినట్టు లేదు… ముందుగా వార్త చదవండి… దుబాయ్‌లో ఉండే బంగారం వ్యాపారి ఫిరోజ్ మర్చెంట్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు… సుమారు 2.5 కోట్లు చెల్లించి అరబ్ ఎమిరేట్స్ వ్యాప్తంగా జైళ్లలో ఉన్న 900 మంది ఖైదీలకు విముక్తి ప్రసాదించాడు… వయస్సు 66 ఏళ్లు… రకరకాల కారణాలతో జైలుపాలై జరిమానాలు, అప్పులు గట్రా కట్టలేని వాళ్ల తరఫున తనే చెల్లించి, […]
ఆ షో ఎంత హిట్టంటే… ప్రతి వారం 60 వేల ఉత్తరాలు వరదలా వచ్చిపడేవి…
అమిన్ సయానీ రేడియో కట్టేశాడు…. – మహమ్మద్ ఖదీర్‌బాబు 1952. దృపద్ ఘరానాలో సంగీతం నేర్చుకున్న రాజకీయవేత్త బి.వి.కేస్కర్ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అయ్యాడు. ఆయనకు హిందూస్తానీ సంగీతం ‘ఇతర’ ఘరానాల వల్ల సంకరం చెందుతున్నదని గట్టి అనుమానం. ముస్లిం, బ్రిటిష్ పాలన కాలంలో హిందూస్తానీ సంగీతం భారతీయ ఆధ్యాత్మికతకు ఎడంగా జరిగిందని విశ్వాసం. ఇక సినిమా పాటలైతే సంకర భాషతో భారతీయ సంస్కృతిని మట్టిలో కలుపుతున్నాయని కారం మిరియం. మంత్రి పదవి సంస్కరణకు ఉపయోగపడింది. […]
2 రోజుల బాలింత… ఒడిలో ఆ పసిగుడ్డుతోనే 250 కిలోమీటర్ల ప్రయాణం…
Padmakar Daggumati…. ఒక గొప్ప విజయగాథ. టీనేజ్ అమ్మాయికి నల్లకోటు వేసినట్టు ఉన్న ఈ అమాయకపు అమ్మాయిని చూడండి. శ్రీపతి.. చెన్నై నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువన్నామలై దగ్గరి జువ్వాది పర్వతశ్రేణుల మధ్య గిరిజన గూడెం వాళ్ళది. తండ్రి కాళిదాస్ , తల్లి మల్లిగ కొండప్రాంతంలో పోడు వ్యవసాయం చేసేవాళ్ళు.. శ్రీపతికి చెల్లెలు తమ్ముడు ఉన్నారు. పిల్లల చదువు కోసం ఆ కుటుంబం దగ్గరలోని అత్నవర్ పల్లెకు వలస వచ్చింది. ఇక్కడా పోడు వ్యవసాయం. […]
లెక్కల మాస్టారు 500 ఇచ్చాడు… 30 ఏళ్లకు శిష్యుడు వాపస్ ఎంతిచ్చాడో తెలుసా..?
ఎప్పుడో తనకు లెక్కల పాఠాలు చెప్పిన ఓ మాస్టారికి ఓ శిష్యుడు తరువాత కాలంలో 30 లక్షల రూపాయల విలువ చేసే షేర్లను ఇచ్చాడని ఒక పోస్ట్ ఎవరో షేర్ చేశారు… వావ్… కోట్లకుకోట్లు కొల్లగొడుతున్నా లేదా సంపాదిస్తున్నా సరే పిల్లికి బిచ్చం వేయని మహానుభావుల నడుమ బతుకుతున్నాం కదా, ఎడమ ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలని ఈ కాలంలో ఆ గొప్పాయన ఎవరబ్బా అని కాస్త వెతికితే… నిజంగానే ఓ మంచి మనిషి వివరాలు […]
- « Previous Page
- 1
- 2
- 3
- 4
- 5
- …
- 13
- Next Page »