Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ పేద ‘సరస్వతి’ పెద్ద చదువుల కథనంలో ‘రియల్ హీరో’ ఆమె భర్త…

July 18, 2023 by M S R

saraswathi

ఇది ఈనాడులో వచ్చిన న్యూస్ స్టోరీ అని ఫేస్‌బుక్‌లో తెగ వైరల్ అయిపోయింది ఈరోజు… నిజంగానే ఓ స్పూర్తిదాయక కథనం… నిజానికి జనానికి ఇవే ప్రస్తుతావసరం… ఓ పేదరాలు సమస్యల్ని, జీవన దుస్థితిగతుల్ని అధిగమించి ఓ చదువుల సరస్వతిగా అవతరించిన వైనం ఇప్పుడు అకారణ ఫ్రస్ట్రేషన్‌లో పడి కొట్టుకుపోతున్న యువతరానికి అవసరం… ముందుగా ఈ కథనం చదవండి… (ఈనాడు సౌజన్యంతో…) అది అనంతపురం జిల్లా శింగనమల మండలం నాగులగుడ్డం అనే ఓ మారుమూల పల్లె. ఆ ఊరి […]

తిరిగే తుమ్మెదకే తేనె దొరుకుతుంది… ఓ దేశదిమ్మరి కథ ఇది…

July 11, 2023 by M S R

The scholar gypsy

తిరిగే తుమ్మెదకే తేనె దొరుకుతుంది… It is a cart if it travels, else it is but timber… The scholar gypsy M.Adinarayana ——————————————————– ఈ దేశం గర్వించదగ్గ పెయింటర్ ఎం.ఎఫ్.హుస్సేన్, చెప్పుల్లేకుండా తిరిగేవాడు. ‘‘ఆయనివి ప్రపంచ ప్రఖ్యాత పాదాలు’’ అని ఆర్టిస్టు మోహన్ ఒక వ్యాసంలో రాశాడు. ఆ మాట ఆదినారాయణ గారికీ వర్తిస్తుంది. ఈ దేశ దిమ్మరికి ప్రయాణమే ప్రాణ వాయువు. సంచారమే ఎంతో బాగున్నది…. దీనంత ఆనందమేడున్నది… అని […]

ఇద్దరు మహిళా ఐపీఎస్‌లు… రెండు వేర్వేరు కథలు… యోగి తలదించుకునేవే…

June 29, 2023 by M S R

anukriti

బహుశా మీరట్ పోలీస్ కమిషనర్ అనుకుంటా… పేరు సెల్వకుమారి… తన ఇంట్లో పెంపుడు కుక్క (జర్మన్ షెపర్డ్)… పేరు ఎకో… అది ఎక్కడో తప్పిపోయింది… ఉగ్రవాదులు, నేరాలు, చోరీలు, అత్యాచారాలు, దోపిడీలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటయ్… కానీ పోలీస్ కమిషనర్ కుక్కపిల్ల తప్పిపోవడం ఎంత దారుణం… కదా… దాంతో సెల్వకుమారి చెప్పకుండానే సకల పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగింది… ఆపరేషన్ షెపర్డ్… మొత్తం సిటీని జల్లెడ పట్టారు… సిటీలో అలాంటి పెంపుడు కుక్కలు ఉన్నవే 19… మన […]

కఠినమైన హెచ్ఐవీ ఎయిడ్స్ కోరలు పీకిన కాకినాడ ప్రజావైద్యుడు..!!

June 15, 2023 by M S R

aids doctor

*ప్రతిభ, అవగాహన లేకుంటే అనుభవం అనేది అక్కరకు రాని మాట* ఒక విషయాన్ని అర్థం చేసుకుని, ఎదురయ్యే సమస్యలకు అన్వయించి… పరిష్కరించడాన్ని ప్రతిభ – వివేకం అంటారు. బట్టీయం పట్టి, ఎక్కువ మార్కులతో ముందు వరసన నిలవడం అనేది వివేకానికి కొలమానం కాదు. అలాగే, ఎదురయ్యే పరిస్థితులకు అన్వయించగల శక్తి లేనివారికి ఎంత అనుభవం ఉన్నా… దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. విద్యార్థులుగా చాలా ఎక్కువ మార్కులతో గొప్ప ప్రతిభావంతులుగా చలామణి అయిన వారిలో కొందరు, జీవితంలో […]

ఎవరీ అశ్విన్ వైష్ణవ్… ఏమిటి నేపథ్యం… మోడీకే కాదు, ఒడిశా సీఎంకూ ఇష్టుడే…

June 6, 2023 by M S R

బాగా చదువుకున్నవాళ్లు రాజకీయ పదవుల్లో రాణించాలని ఏమీ లేదు… కానీ రాజకీయ పదవుల్లోకి బాగా చదువుకున్నవాళ్లు రావాలి… పారడాక్స్ ఏమీ కాదు… నిజమే… ఇప్పుడు ఈ చర్చ ఎందుకు నడుస్తున్నదంటే..? బాలాసోర్ రైలు ప్రమాదం తరువాత మంత్రి అశ్విన్ వైష్ణవ్ తూతూమంత్రం పర్యటనలకు వెళ్లి, శుష్క బాష్పాలు రాల్చి వెళ్లిపోలేదు… రెండురోజులుగా అక్కడే ఉన్నాడు… సహాయకచర్యల్ని, పునరుద్ధరణ పనుల్ని పర్యవేక్షిస్తున్నాడు… ఆ ఫోటోలు పత్రికల్లో కనిపిస్తున్నాయి… వృద్ధులకు, జర్నలిస్టులకు రాయితీల్ని కత్తిరించేసిన తన పనితీరు మీద ఆల్‌రెడీ […]

బాహనగబజార్…. చేతులెత్తి మొక్కుదాం ఈ ఊరికి… ఈ ప్రజలకు…

June 6, 2023 by M S R

train

పట్టాలు తప్పని మానవత్వం ————————- రైలు ప్రమాద వేళ… బాలాసోర్ పెద్ద మనసు ———————————- ఒరిస్సాలో జరిగిన రైలు ప్రమాదం మానవ తప్పిదమా? రైల్వే సిగ్నలింగ్ సిబ్బంది నిర్లక్ష్యమా? ఇవేవీ కాక కుట్రా? అన్న చర్చ జరుగుతోంది. రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కారణం ఏదయినా పోయిన ఒక్క ప్రాణం కూడా తిరిగిరాదు. ఇటీవలి దశాబ్దాల్లో కనీ వినీ ఎరుగని ఘోరమయిన ప్రమాదం. జరగకుండా ఉండాల్సింది. జరిగింది. ప్రమాదం తీవ్రతకు పట్టాలు నామరూపాల్లేకుండా పోయినట్లు…పోయినవారిలో దాదాపు 150 ప్రాణాలు […]

ఆ చీర ఇచ్చిన ‘మాత’కే కాదు… ఆ మీడియా ప్రతినిధి తన్లాటకూ హేట్సాఫ్…

May 24, 2023 by M S R

sari

అన్నం తిన్నాక మూతి తుడిచిన చీర బాధతో వచ్చిన కన్నీళ్లు తుడిచిన చీర పసిపాపకు ఊయలైన చీర పంటలకు రక్షణయిన చీర సంస్కృతిని చాటే చీర సంప్రదాయానికి నిలువుటద్దమైన చీర పంచ ప్రాణాలను కాపాడింది అయిదుగురికి జీవితాన్నిచ్చింది….. అని మిత్రుడు Basava Punnaiah Bodige  వాల్ మీద చదివాను… బాగనిపించింది… చీరె గురించి చెెప్పాలంటే ఎంతో… ఎంతెంతో… నిజంగా ఒక మహిళ తన చీరను ఇచ్చి, అయిదు రోజుల క్రితం వరద నీటిలో మునిగిన కారు నుంచి అయిదుగురిని […]

బతికింది 62 ఏళ్లు… రాసింది 1,230 కథలు… అంతేనా..? 800 నవలలు రాశారు…

April 13, 2023 by M S R

anuradha

Sai Vamshi ……… 1200 కథలు.. 800 నవలల మహావృక్షం …. 79 ఏళ్ల తెలుగు రచయిత కాలువ మల్లయ్య గారు ఇప్పటికి 900 కథలు రాశారంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక రచయిత తన జీవిత కాలంలో వంద కథల మైలురాయిని తాకటం ఓ విజయం. 300 కథలు దాటిన వారు కొందరే. ఉబుసుపోక రాయడం కాదు, నికార్సయిన రచనా శైలినే మనసా వాచా నమ్మి ముందుకు పోవడం ఒక నిజాయితీ, ఒక నిబద్ధత. తమిళ రచయిత్రి […]

చీరెకట్టుతో… ఒంటరిగా… బైక్‌పై… ఆరు ఖండాల్లో జర్నీ… రియల్ అడ్వెంచర్…

April 10, 2023 by M S R

ramabhai

కెమెరాలకు ఇలా ఫోజు ఇస్తుంటే భలే ఉంది… నా బైక్, నవ్వారి చీరెలో దాని పక్కన నేను… చుట్టూ పెద్ద గుంపు… వాళ్లు ‘భారత్ కే బేటీ’ అంటుంటే నిజంగానే అలా ఫీలయ్యాను… అసలు ఇదంతా 2022 ఇండిపెండెన్స్ డే నాడు నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంతో స్టార్టయింది… గ్రామీణ వృత్తికళాకారులకు ప్రోత్సాహం, మహిళా సాధికారత మీద మాట్లాడాడు ఆయన… తన మాటలు నాకు కనెక్టయ్యాయి… ఓ సాహసయాత్ర చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన తళుక్కుమంది… చేయగలనా..? […]

ఈ ఫోటోకు పులిట్జర్ ప్రయిజ్ వచ్చింది… ఈ సంఘటన ఏమిటో తెలుసా..?!

March 16, 2023 by M S R

pulitzer

మృత్యువు ముద్దు (Kiss of Death) అని ఏదో ఇంగ్లిష్ పోస్టులో కనిపించింది… కానీ మనం మృత్యుపరిష్వంగం లేదా మృత్యుస్పర్శ అందాం… ఇంకా ఆయుష్షు ఉంటే సుడిగుండంలో పడినా నిక్షేపంగా బయటపడతాడని కదా పెద్దలు చెప్పేది… నాకు ఈ కథ విన్నాక అదే వినిపించింది… నొసటి మీద ఆయుష్షు రాసి పెట్టి ఉంటే, యముడి పాశం కూడా పొగలు రేగుతూ వచ్చినా సరే, చివరకు వాపస్ వెళ్లిపోతుంది… నిజం… భూమ్మీద నూకలు బాకీ ఉండాలి… 1968… రోకో […]

మాటిమాటికీ ఏడుపొచ్చేది… అప్పటికి నాకు పెళ్లంటే ఏం తెలుసు గనుక…

March 5, 2023 by M S R

advocate

పద్నాలుగేళ్ల వయస్సులోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది… నిజాయితీగా చెబుతున్నాను… అప్పటికి పెళ్లి అంటే ఏమిటో కూడా తెలియదు నాకు… మాటిమాటికీ ఏడుపొచ్చేది పెళ్లయ్యాక… ఎందుకంటే..? అమ్మానాన్నతో దూరంగా ఉండాల్సి రావడం… చిన్న పిల్లగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకునే ప్రతి ఒక్కరికీ ఇది సహజమే కదా… నా భర్తతో కూడా చనువుగా, ఎక్కువగా మాట్లాడకపోయేదాన్ని… ఇంట్లో పని ఎక్కువగా చేస్తూ ఉండేదాన్ని… అందులో నన్ను నేను బిజీగా ఉంచుకునేదాన్ని… నా భర్తకు అర్థమైనట్టుంది ఎవరికైనా చదువు ఎంత ముఖ్యమో… […]

శాములూ… నీ కాళ్లు మొక్కినా తప్పులేదు… మొగుడంటే నువ్వే భాయ్…

February 8, 2023 by M S R

husband

ఖాకీల కారుణ్యం !! *** భార్య శవాన్ని మోసుకెళ్తున్న అభాగ్యుడికి సాయం *** పోలీసులంటే కాఠిన్యం అనే అందరూ అనుకునేది.. కొన్ని కరకు ఖాకీ దుస్తుల వెనుక చల్లని మనసుంటుందని నిరూపితమైన ఘటన ఇది. . నిరుపేదలు దేశంలో చచ్చిన తరువాత కూడా వారికి కాటికి చేరడం కూడా కష్టమే అనే మరో జీవన సత్యాన్ని సైతం ఆవిష్కృతమైన సంఘటన ఇది. మార్గమధ్యంలోనే భార్య కన్నుమూస్తే ఆమె శవాన్ని 130 కిలోమీటర్లు మోసుకుని వెళ్లేందుకు సిద్ధమైన ఓ […]

నీళ్ళు లేని ఎడారిలో… కన్నీళ్లయినా తాగి బతకాలి…

February 2, 2023 by M S R

suicide

Be Patient: పత్రికల్లో ఆత్మహత్యల వార్తలు లేని రోజంటూ ఉందా..? ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. చదువు భారం పెరిగి, ఆశించిన మార్కులు రాక ఒక విద్యార్థి; బదిలీ దూరం భార్యాభర్తల మధ్య బహుదూరమై ఒకరు; పొలం అప్పు తీర్చలేక ఒకరు; కొడుకు బుద్ధి మాంద్యాన్ని భరించలేక ఒకరు; మాజీ ప్రియుడి వేధింపులు భరించలేక ఒకరు… ఇంకా ఎందరో పోయారు. జీవితం అంటే గెలుపు; జీవితమంటే సుఖం; జీవితమంటే శిఖరారోహణం…అని మన నరనరాన ఎక్కించుకున్నాం. జీవితమంటే ఎడతెగని ప్రయాణం. […]

  • « Previous Page
  • 1
  • …
  • 7
  • 8
  • 9

Advertisement

Search On Site

Latest Articles

  • నర్తిస్తూ 574 మెట్లు… ఓ యువ భరతనాట్య కళాకారిణి అరుదైన ఫీట్…
  • తెరపై అత్తవో, అమ్మవో గానీ… నిజజీవితంలో మాత్రం ప్రగతి స్పూర్తివి..!!
  • ఫోర్త్ సిటీ అంటే యాంటీ సెంటిమెంట్… అందుకే అది ఫ్యూచర్ సిటీ…
  • ఇచ్చుటలో ఉన్న హాయి… అలనాటి నటి అచ్చంగా *కాంచన’మే…!
  • రేవంత్‌ ఫ్యూచర్ సిటీ గ్యారంటీగా గ్రాండ్ సక్సెస్… ఎందుకు, ఎలా..? ఇదుగో…!!
  • రష్యాతో మరింత దృఢబంధం… చెన్నై టు వ్లాడివొస్టోక్ సముద్ర మార్గం…
  • ఒకే సినిమా… ఏకంగా ఆరుగురు శాస్త్రీయ నృత్య దర్శకులు… కళాత్మకం…
  • మీ దుంపతెగ… ఓ ప్రేమ జంటను అన్యాయంగా విడదీశారు కదరా…
  • పాపం లోకేష్… ఇండిగో ఇష్యూలో తన ఇజ్జత్ తీసిన సొంత టీమ్…
  • మలమార్పిడి… మలసంజీవని… మలనిధి… వాయిఖ్ అనకుండా చదవండి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions