Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చైనా జిన్‌పింగ్ దుర్నీతి… తన వాళ్లనూ వదలదు… వాళ్లు ఇక కనిపించరు…

January 5, 2021 by M S R

alibaba

(Jagannadh Goud…………)   పల్లెటూరి నుంచి ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగి, రెండు నెలులగా కనిపించకుండా పోయిన ఓ లెజెండ్ ప్రస్థానం..!…. చైనా నుంచి ప్రపంచానికి తెలిసిన మొట్టమొదటి బిలియనీర్ “జాక్ మా”… చరిత్రలో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీలోని లోపాలని మొట్టమొదట చైనాలో ఎండగట్టిన వ్యక్తి కూడా ఆలీబాబా గ్రూప్ “జాక్ మా” గారే…. చైనాలోని ఒక పల్లెటూళ్ళో చదువుకునే ఒక పిలగాడు రోజూ సైకిల్ తొక్కుకుంటూ దగ్గరలోని టౌన్ కి వెళ్ళి విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకి […]

‘రత్న’ టాటా..! 83 ఏళ్ల వయస్సులో పూణెకు ఒక్కడే డ్రైవ్ చేసుకుంటూ…

January 4, 2021 by M S R

(Jagannadh Goud…………) రతన్ టాటా గారు ఉండేది బొంబాయిలో.., వయస్సు 83 సంవత్సరాలు… 150 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ, పూణేలో ఉన్న ఒక ఉద్యోగిని కలవటానికి వెళ్ళారు… ఆ యువకుడు 2 సంవత్సరాల క్రితం టాటా సంస్థలో పనిచేశాడు… అతని ఆరోగ్యం బాగా లేకపోవడంతో తనను పరామర్శించడానికి వెళ్లాడు,.. ఫ్రెండ్స్ సర్కిల్ అనే అ అపార్ట్‌మెంట్స్ మధ్యతరగతి ఉండే మామూలు అపార్ట్‌మెంట్స్…  కోవిడ్ కాలం కాబట్టి అపార్ట్ మెంట్ సెల్లార్‌లోనే మాట్లాడి వెనక్కి వచ్చారు… రతన్ టాటా గారి […]

అంబానీని మించిన ఐశ్వర్యవంతుడు… ధనం, ఆస్తుల లెక్కల్లో కాదు సుమా…

December 29, 2020 by M S R

ratan tata

తెల్లారిలేస్తే ముఖేష్ అంబానీ సంపద ఇంత పెరిగింది, అంత తగ్గింది అని మీడియా లెక్కలు… ప్రపంచ ధనికుల్లో తన నంబర్ పెరిగిందా, తగ్గిందా అని ప్రత్యేక వ్యాసాలు… మాట్లాడితే ఆదానీలు, అంబానీల ముచ్చట్లే… కానీ ఒకప్పుడు అంబానీ ఏమిటి..? పొనీ, ఇప్పుడు తన తమ్ముడి స్థితి ఏమిటి..? అవన్నీ ఎందుకులే గానీ… ఒక్కసారి ఎవ్వరైనా టాటాలతో పోల్చారా..? కొన్ని విలువలతో… ఈ దేశ పారిశ్రామిక ప్రగతి చిత్రాన్ని రచించింది, రచిస్తున్నది టాటా గ్రూపు… విలువలు, విరాళాలు, ప్రమాణాలు… […]

మొగుడు తొమ్మిదేళ్లు పెద్ద… పైగా టీబీ… నాలుగో పెళ్లాం… చదవాల్సిన లైఫ్…

December 20, 2020 by M S R

ఉమ… ఏడెనిమిదేళ్లు ఉంటాయేమో… కోయంబత్తూరు… తండ్రి బాలకృష్ణన్, తల్లి తంకమణి… తండ్రి తన యుక్తవయస్సులో ఉన్నప్పుడు ఎంబీబీఎస్ ఒక సంవత్సరం చదివి, వదిలేసి, వద్దులే అని తండ్రి చెప్పగానే తిరిగి వచ్చేశాడు… ఓ డాక్టర్ దగ్గర కంపౌండర్‌గా కూడా చేరాడు… అప్పట్లో అల్లోపతిని ఎవరూ పట్టించుకునేవారు కాదు… సైకిల్ మీద డాక్టర్, కంపౌండర్ ఊరంతా తిరిగేవారు రోగుల కోసం… ఇది జరిగే పని కాదని ఏదో మిల్లులో చేరాడు… అక్కడ రిసెప్షనిస్టుగా చేరిన తంకమణిని పెళ్లిచేసుకున్నాడు… బిడ్డ […]

మన ‘ఫ్యూచర్’ మింగేస్తుందట అమెజాన్… అంబానీకే దిక్కుతోచని డేంజర్ గేమ్…!!

December 9, 2020 by M S R

article by……….. Jagannadh Goud రీటైల్ రాజా కిశోర్ బియానీ – “భారతదేశ భవిష్యత్తు”……. మరో ఈస్టిండియా కంపెనీ… అమెజాన్….  ఫ్యూచర్ గ్రూపు అనే సంస్థ స్థాపించిన వ్యక్తి కిశోర్ బియాని గారు. ఫ్యూచర్ గ్రూపు అంటే ఎక్కువ మందికి తెలియకపోవచ్చు కానీ బ్రాండ్ ఫ్యాక్టరీ, పాంటలూన్స్, బిగ్ బజార్, సెంట్రల్ ఇవి తెలుసు కాదా, వీటి అన్నింటినీ స్థాపించిన వ్యక్తి కిశోర్ బియానీ గారు. కిశోర్ బియానీ తల్లితండ్రులది సాంప్రదాయ బట్టల వ్యాపారం. ఒకచోట కొని […]

వేల కోట్ల ధనిక స్త్రీలు ఉండొచ్చుగాక..! అందరూ చూస్తున్నది ఈమె వైపే..!!

December 8, 2020 by M S R

రోష్ని నాడార్, కిరణ్ మజుందార్ షా, లీనా గాంధీ తివారి, నీలిమ మోటపర్తి, రాధ వెంబు, జయశ్రీ ఉల్లాల్, రేణు ముంజల్, మాలిక చిరయు, అనూ ఆగ, ఫల్గుణి నాయర్…. వీళ్లంతా ఎవరో తెలుసా..? మన దేశంలోని అత్యంత ధనికులైన మహిళల్లో టాప్ టెన్… ఈమధ్యే ఎవరో జాబితా రిలీజ్ చేశారు… వాళ్లు నిజంగా ప్రతిభావంతులేనా, ఐటీ లెక్కల కోసం పేర్లు రాయబడిన ఫ్యామిలీ డమ్మీలా అనేది పక్కన పెట్టండి… వేల కోట్ల ఆస్తులు వాళ్లవి… కానీ […]

భారీ ప్రైజు మనీ గెలవడం కాదు వార్త… అంతకు మించి… హేట్సాఫ్ సర్…

December 7, 2020 by M S R

ముందుగా ఒక వార్త చదువుదాం… చాలామంది పత్రికల్లో చదివే ఉండవచ్చుగాక… మరోసారి చెప్పుకుందాం… చెప్పుకోవాల్సి ఉంది… నభూతో అన్నట్టుగా వ్యవహరించిన ఈ పెద్దమనిషి గురించి చెప్పుకోవాల్సిందే ఒకసారి…  ఈయన పేరు రంజిత్ సిన్హ్ దిసాలే… తను ఒక టీచర్… మహారాష్ట్రలోని సోలాపూర్ తనది… మనకు దగ్గరివాడే… హైదరాబాద్‌కు జస్ట్ 300 కిలోమీటర్లు… తనకు ప్రిస్టేజియస్ అవార్డు దక్కింది… దాని పేరు గ్లోబల్ టీచర్ ప్రైజ్… ప్రపంచవ్యాప్తంగా టీచర్లు ఆస్కార్‌గా భావించే అవార్డు ఇది… సో, మన రంజిత్‌కు […]

అబ్బురం… గాలిలోకి ఎగిరితే చాలు… భూమి చిన్నదైపోతుంది…

November 22, 2020 by M S R

వాల్మీకి రామాయణం రాయడానికి ముందే అన్నదమ్ములయిన సంపాతి- జటాయువు పుట్టి ఉండాలి. సంపాతి- జటాయువు పెద్ద డేగ జాతి పక్షులు. వాటి వేగానికి సాటిరాగల పక్షులే ఆ కాలంలో ఉండేవి కావు. చిన్న పిల్లలు సరదాగా ఆడుకుంటూ ఆ చెట్టు దాకా పరుగెత్తి వెళ్లి మళ్లీ వేగంగా వెనక్కు రావాలి- ముందు ఎవరొస్తారో చూద్దామా? అన్నట్లు ఒకరోజు జటాయువు అన్న సంపాతితో సరదాగా పందెం వేసింది. సూర్యుడి దాకా వేగంగా వెళ్లి మళ్లీ భూమికి తిరిగి రావాలి- […]

గగనస్వప్నాల్లో ఎగిరీ ఎగిరీ… బీర్ల మాల్యాకు అమ్మేసుకున్నాడు…

November 19, 2020 by M S R

‘ఆకాశం నీ హద్దురా’…  ఈ సినిమా పేరు ఇప్పుడు మోగిపోతున్నది… సూర్య నటించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో హిట్టయింది… ఓ బయోపిక్ ఇది… కేవలం రూపాయి టికెట్టు ధరతో సామాన్యుల్ని కూడా విమానప్రయాణం చేయించడం అనే కాన్సెప్టు జనానికి బాగా కనెక్టయింది… విమానం అనేది ధనికుల విలాసమేనా..? సామాన్యుడి సౌకర్యం కాదా..? ఇదీ ప్రశ్న… అయితే సినిమాలో చూపించిందంతా నిజమేనా..? అది కెప్టెన్ గోపీనాథ్ బయోపిక్కేనా..? కాదు..! ఆయన స్వయంగా రాసుకున్న ‘సింప్లీ ఫ్లై’ బయోగ్రఫీ […]

  • « Previous Page
  • 1
  • …
  • 6
  • 7
  • 8

Advertisement

Search On Site

Latest Articles

  • నటుడిగా బ్రహ్మానందం ఇప్పుడు పరిపూర్ణుడు… ఐనాసరే జాతీయ అవార్డు రాదు…
  • అది వీర బొబ్బిలి మాత్రమే కాదు… వీణ బొబ్బిలి కూడా…
  • మోడీ వ్యాఖ్యలు తప్పే… శూర్పణఖ అందగత్తె, మనోహరమైన నవ్వు… బాధితురాలు…
  • తెలుగు టీవీ సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ బైబై చెబుతున్నట్టేనా..?
  • Indian Idol Telugu… హేమచంద్రకు శ్రీముఖి హైపిచ్ కేకలే ఆదర్శం…
  • రాహుల్‌పై అనర్హత వేటులో మోడీ ఆశించే అసలు టార్గెట్స్ పూర్తిగా వేరు..!!
  • మధిరోపాఖ్యానం… తయారీ నుంచి రుచి తగిలేదాకా… ఇదొక వైనాలజీ…
  • రాంభట్ల కృష్ణమూర్తి అంటే ఒక పెద్ద బెల్జియం అద్దం…
  • హేమిటో… మునుపు వెహికిల్స్‌కు డ్రైవర్లు విడిగా ఉండేవాళ్లట భయ్యా…
  • జగన్ భయ్యా… రాష్ట్ర పరిస్థితులన్నీ ఏమిటిలా ఎదురుతంతున్నాయ్…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions