. కేంద్ర ప్రభుత్వం తెలంగాణను ఈ దేశంలోని రాష్ట్రంగా గుర్తించడం లేదా..? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి అమర్యాదను, వివక్షను ప్రదర్శిస్తోందా..? ఇక్కడ ఉన్నది ఏమైనా విదేశీ ప్రభుత్వమా..? . ఈ చర్చ బ్యూరోక్రాట్లు, జర్నలిస్టు సర్కిళ్లలో జోరుగా సాగుతోంది… విషయం ఏమిటంటే..? గ్లోబల్ సమిట్ జరుగుతోంది కదా ఫ్యూచర్ సిటీలో… హాజరు కావాలని రేవంత్ రెడ్డి స్వయంగా ప్రధానిని కలిసి కోరాడు… కేంద్ర మంత్రుల్నీ ఆహ్వానించారు… సరే, ఖర్గే, సోనియా, రాహుల్‌లను కూడా ఇన్వైట్ […]
మమతా బెనర్జీ పార్టీ పునాదులకు పగుళ్లు… అచ్చంగా ‘SIR’ ఫలిస్తోందిలా…
. Pardha Saradhi Upadrasta…. బెంగాల్ వోటర్ లిస్ట్‌లో భారీ మోసం బయటపడింది! అధికారులు నిజంగా పని చేస్తే — ప్రజాస్వామ్యం సురక్షితం అవుతుంది అనేది మరోసారి నిరూపితమైంది. SIR ప్రక్రియ అంటే ఏమిటి? SIR — Special Summary Revision ఈ దశలో BLO (Booth Level Officer) లు ఇంటింటికి వెళ్లి, కొత్త ఓటర్ల ఎన్రోల్మెంట్ ఫాంలు ఇస్తారు కరెక్షన్లు / డిలిషన్లు తీసుకుంటారు ప్రజలు ఇచ్చిన ID proofs & అడ్రస్ డాక్యుమెంట్స్ […]
రేవంత్ ఫ్యూచర్ సిటీ గ్యారంటీగా గ్రాండ్ సక్సెస్… ఎందుకు, ఎలా..? ఇదుగో…!!
. రేపటి నుంచి ప్రారంభమయ్యే గ్లోబల్ సమిట్ ఎందుకు ఫ్యూచర్ సిటీలోనే జరుగుతోంది..? ఎందుకంటే, అదే హైదరాబాద్ ఫ్యూచర్ కాబట్టి…! అది అవసరం కాబట్టి, అది ఓ అవకాశం కాబట్టి…! ఖచ్చితంగా ఓ గ్రాండ్ సక్సెస్ఫుల్ కొత్త నగరం తప్పకుండా నిర్మితం అవుతుంది కాబట్టి..! కావాలి కాబట్టి..!! ఎందుకంటే… మహానగరాలకు అనుబంధంగా శాటిలైట్ నగరాలు అనేకం మన దేశంలోనే వృద్ధి చెందాయి… అవే సక్సెస్ స్టోరీలు ఈ ఫ్యూచర్ సిటీకి కూడా ఓ ప్రేరణ… దేశ రాజధాని […]
రష్యాతో మరింత దృఢబంధం… చెన్నై టు వ్లాడివొస్టోక్ సముద్ర మార్గం…
. స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్… చైనా మన భారత్ చుట్టూ ఓ ‘ముత్యాల వల’ను సముద్ర రవాణా పేరిట నిర్మిస్తూ ఉంటుంది… ప్రపంచాన్ని శాసించగల సముద్ర రవాణాను తన గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నం… మరోవైపు చైనా పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ)… ఇంకోవైపు బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్,, ఓల్డ్ సిల్క్ రోడ్ పునరుద్దరణ… మరి మనం ఏం చేస్తున్నాం..? తలొగ్గాల్సిందేనా… మన వ్యూహాలు మనకున్నాయి… మనకూ మన రష్యా ఉంది… పుతిన్ వచ్చిపోయాడుగా… ఓసారి ఇది […]
పాపం లోకేష్… ఇండిగో ఇష్యూలో తన ఇజ్జత్ తీసిన సొంత టీమ్…
. ముందుగా ఒక వార్త చూద్దాం… దేశమంతా ఇండిగో ప్రకంపనలు కలకలం క్రియేట్ చేస్తున్నాయి… ఇండిగో బలుపు ఏమిటో కూడా మనం ఇంతకుముందు ఓ కథనంలో చెప్పుకున్నాం…. ఫాఫం మోడీ ప్రభుత్వం… దీన్ని ఎవరు టాకిల్ చేయాలో, వైఫల్యం ఎవరిదో కూడా తెలియనంతగా జన వ్యతిరేకతలో కూరుకుపోయింది… అన్నింటికీ మించి పౌరవిమానయాన మంత్రి, టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు మీద జనంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది… మంత్రి అట్టర్ ఫ్లాప్… సరే, తన నుంచి దేశం, […]
గ్లోబల్ సమిట్ ఏమిటి..? ఎందుకు..? సరళంగా ఓ స్థూల చిత్రం ఇది..!!
. రేపు దాటితే… ఓ కొత్త అధ్యాయం… తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే గ్లోబల్ సమిట్… ఫ్యూచర్ సిటీలో జరిగే ఈ మెగా ఈవెంట్ పనుల్లోనే యంత్రాంగం మొత్తం తలమునకలై ఉంది… అనేకమంది విశిష్ట అతిథులు వస్తున్నారు… హంగామా, హడావుడి… 27 సెషన్లు … ప్రజెంటేషన్లు, చర్చలు, ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు… ఇది నిజంగానే ఓ గ్లోబల్ సదస్సు… అసలు ఏమిటి లక్ష్యాలు..? ఏం సాధిస్తారు..? అనే ప్రశ్నలు సగటు తెలంగాణవాసి మదిలో సహజంగానే తలెత్తుతుంది… ఓసారి […]
మోనోపలీ… పెడపోకడలు… ఇండిగో సంక్షోభంపై సమగ్ర చిత్రం ఇదీ…
. ఇండిగో తలబిరుసుతనం ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరిపించాలి… మాటలు కాదు, కేంద్ర విమానయాన మంత్రి తన మెరిట్‌ను చేతల్లో చూపించాలి… అన్నింటికీ మించి దేశీయ విమానయాన రంగంపై మోడీ ప్రభుత్వం ఇకనైనా చక్కదిద్దే ప్రయత్నం చేయాలి… లేకపోతే ప్రస్తుతాన్ని మించి తీవ్ర సంక్షోభం గ్యారంటీ… ఎస్… ఇండిగో ఉద్దేశపూర్వకంగానే చేస్తోంది… తన గుత్తాధిపత్య ప్రదర్శన ఇది… నేను లేకపోతే ఈ దేశ విమానయాన రంగమే కుప్ప అని చెబుతోంది… నువ్వు చెప్పావు, నేను చేయను, సో […]
అసలు ఏమిటి ఈ క్వాంటం సిటీ..! తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం ఏమిటీ..!!
. తెలంగాణ ప్రభుత్వం పదే పదే చెబుతున్న క్వాంటం సిటీ అంటే ఏమిటి..? మంత్రులు ఆ పదాన్ని చెబుతున్నారే గానీ… అదేమిటో, తెలంగాణకు వచ్చే ప్రయోజనమేమిటో క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు… సంకల్పం, లక్ష్యం ముఖ్యమే, అదేసమయంలో అదేమిటో జనానికీ తెలియాలి కదా… సరే, అదేమిటో చెప్పుకుందాం వీలైనంత సరళంగా… ఎలాగూ టెక్నికల్ అంశమే, కాస్త కఠినంగానే ఉంటుంది అర్థం చేసుకోవడం… క్వాంటం సిటీ అంటే హైదరాబాద్‌ను క్వాంటం టెక్నాలజీ కోసం ఒక ప్రపంచ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేయాలనేదే […]
రాహుల్ గాంధీని కలవాలని అసలు పుతిన్ అనుకుంటే కదా..!!
. Pardha Saradhi Potluri …. విదేశీ అతిధులు, విదేశీ ప్రధానులు, అధ్యక్షులు భారత దేశ పర్యటనకి వచ్చినప్పుడు వారికి ఇచ్చే ప్రత్యేక విందులో మన దేశ లోక్ సభ ప్రతిపక్ష నాయకుడిని ఆహ్వానించడం అనవాయితీ గా వస్తున్నది! అయితే సదరు అధ్యక్షులు, ప్రధాన మంత్రులు భారత్ లో తాము ఎవరిని కలవాలో, ఎవరిని కలవకూడదో అనే ఛాయిస్ కూడా ఉంటుంది! సదరు ప్రధాన మంత్రులు, అధ్యక్షులు తమకి ఇష్టం లేని వాళ్ళతో కలిసి విందులో పాల్గొనడానికి […]
ఆ ఇద్దరూ ఒకే కారులో… అప్పుడు చైనాలో… ఇప్పుడు ఢిల్లీలో… ఎందుకు..?!
. మామూలు ప్రొటోకాల్ నిబంధనల్ని ఉల్లంఘించి మోడీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి మరీ పుతిన్‌కు స్వాగతం పలికాడు, తనదైన శైలిలో ఆలింగనం చేసుకున్నాడు… అది వారిద్దరి మైత్రి సూచన మాత్రమే కాదు… ప్రస్తుతం జియోపాలిటిక్స్‌లో, అమెరికాను ఏమాత్రం నమ్మదగని పరిస్థితిలో… రష్యాతో స్నేహం ఇండియాకు ఎంత ప్రధానమో తెలియజెప్పే సూచిక… ఇది వారి మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం (Personal Rapport), రెండు దేశాల మధ్య ఉన్న బలమైన వ్యూహాత్మక బంధాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది… తరువాత ఎవరి కాన్వాయ్‌లో […]
‘‘ట్రంపు ఎజెండా వేరు… ఇండియా- రష్యా ఎవరికీ వ్యతిరేకం కాదు…’’
. Nàgaràju Munnuru …….. == భారత్ నిజమైన స్నేహితుడు రష్యా == భారత్ చిరకాల స్నేహితుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన సందర్భంగా ఇండియా టుడే ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పుతిన్ భారతదేశం గురించి, ప్రధాని మోదీ గురించి చెప్పిన విషయాలు భారతీయులందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటర్వ్యూలో పుతిన్ చెప్పిన విషయాలు యధాతథంగా… “అంతర్జాతీయ మార్కెట్లో భారత్ ఎదుగుదలను కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. భారత్ రష్యా […]
అందుకే అమెరికాను నమ్మకూడదు… పుతిన్ రాకను స్వాగతిద్దాం…
. Pardha Saradhi Potluri ……. అమెరికాతో స్నేహం అంటే ఇలానే ఉంటుంది! అమెరికా నుండి ఉక్రెయిన్ కి అందే ఆయుధ సహాయం జెర్మనీ ద్వారా జరుతుంది అని చెప్పి కొంతకాలం అమెరికా నుండి నేరుగా జెర్మనీకి ఆయుధాలు సరఫరా చేసింది. అమెరికా పెంటగాన్ నేరుగా జెర్మనీ డిఫెన్స్ డిపార్ట్మెంట్ తో కమ్యూనికేషన్ వ్యవస్థని నెలకొల్పింది! ఏదన్నా కావాలన్నా, వివరణ ఇవ్వాలన్నా జెర్మన్ సైనిక అధికారులు హాట్ లైన్ లో నేరుగా పెంటగాన్ తో సంప్రదింపులు జరిపేవారు! […]
తప్పులు కేసీయార్‌వి… తిప్పలు రేవంత్‌వి… కాళేశ్వరం అక్రమాల కథలు మరిన్ని
. అడ్డగోలుగా వేల కోట్ల కమీషన్ల కక్కుర్తితో లక్ష కోట్ల ప్రజాధనం కాజేసి, ప్రాజెక్టును పఢావు పెట్టింది ఒకరు…. తరువాత పీఠం ఎక్కి, దిక్కులేక ఆ భారం మోస్తూ, గెలిపించిన తెలంగాణ జనం రుణం తీర్చుకునేది మరొకరు… అవును, మీరు ఊహిస్తున్నది నిజమే… కాళేశ్వరం ప్రాజెక్టు కథే… వెనుక నుంచి ఎంత తంతున్నా, పదే పదే ఆ పాత సీఎం పాదాల మీద పాకిన కేంద్ర అధికార పార్టీ గురించి కాసేపు పక్కన పెడదాం… సీబీఐ విచారణకు […]
ఆ 19 దేశాల వారికి ఇక అమెరికాలోకి నో ఎంట్రీ…! ఏమేం చర్యలు అంటే..?!
. Pardha Saradhi Upadrasta … USA వలసదారులకు భారీ షాక్ – వందల వేల కుటుంబాలు గందరగోళంలో! అమెరికా ప్రభుత్వం 19 దేశాల నుండి వచ్చే ఇమ్మిగ్రేషన్ కేసులు, వీసా అప్లికేషన్లు, న్యాచురలైజేషన్ (సిటిజెన్షిప్) ప్రక్రియలను పూర్తిగా నిలిపివేసింది. దీంతో ఆ దేశాల ప్రజల్లో ఆందోళన పెరిగింది. నిలిపివేసిన దేశాలు అఫ్గానిస్తాన్, బర్మా, బురుండి, తుర్కమెనిస్తాన్, ఇరాన్, యెమెన్, సోమాలియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, చాద్, లిబియా, సూడాన్, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, సియెర్రా లియోన్, […]
పాపం టీబీజేపీ… కక్కలేక, మింగలేక… వంకర దారులు, వక్ర బాష్యాలు…
. మరీ ఎక్కువ గతంలోకి వద్దులే… కేసీయార్ అనబడిన ఓ భీకర, బీభత్స హిందువు పరిపాలన కాలంలోకి వెళ్దాం…. శుక్రమహర్దశ నడుస్తున్నప్పుడు కన్నూమిన్నూ కానరావు కదా… పైగా మజ్లిస్ ఆత్మతో పాలిస్తున్న దౌర్భాగ్య కాలమాయె… హిందూగాళ్లు, బొందుగాళ్లు అని హూంకరించిన దొరవారు ఏమన్నాడు తరువాత..? రామజన్మభూమి, రావణ జన్మభూమి, శూర్పణఖ జన్మభూమి అని కొక్కిరించాడు… తన విధేయ క్షుద్ర రాక్షసగణం అయోధ్య చందాలనూ అడ్డుకుంది… సోకాల్డ్ శుష్క మేధస్సులు కూడా భద్రాచలాన్ని, అయోధ్యను పోల్చాయి… అక్కడికి దొరవారు […]
క్యూర్… ప్యూర్… రేర్…! తెలంగాణ విజన్-2047 లో ఏమిటి ఈ పదాల అర్థం..!!
. Nàgaràju Munnuru ….. == తెలంగాణ ఇక క్యూర్, ప్యూర్, రేర్… == భారతదేశం స్వాతంత్రం సాధించి 100 ఏళ్ళు పూర్తయ్యే 2047 నాటికి దేశం 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమితో అభివృద్ధి చెందిన దేశంగా మారాలని కేంద్రంలోని మోదీ సర్కార్ “వికసిత్ భారత్ 2047” అనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రం 2037 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక […]
కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి… ఇదీ తెలంగాణపై కేంద్ర బీజేపీ వివక్ష లెక్క…
. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే… మొదలైంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి వివక్ష..! ప్రధానిని పెద్దన్న అంటూనే… పార్టీపరమైన పోరాటం వేరు, కేంద్రం- రాష్ట్రం సంబంధాల విషయంలో నిక్కచ్చిగా, పద్ధతిగా, తెలంగాణ వృద్ధికి అవసరమైనట్టుగా వ్యవహరిస్తానని రేవంత్ రెడ్డి మొదటి నుంచీ ఓ క్లారిటీని ప్రదర్శిస్తూనే ఉన్నాడు… కానీ… తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి, బీజేపీ వివక్షను చూపిస్తూనే ఉంది… ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎనిమిది మంది ఎంపీలు అక్షరాలా ప్రేక్షక పాత్రలు పోషిస్తున్నారు… […]
హెడ్ (వెయిట్) కోచ్, సెలక్టర్… ఇండియన్ జట్టుకు వీళ్లే అసలు సమస్య..!!
. దక్షిణాఫ్రికాతో రెండో వన్డేకు ముందు బీసీసీఐ ముఖ్యులు భారత జట్టు హెడ్ (వెయిట్) కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌లతో భేటీ వేస్తారట… వేసి, జట్టు సమస్యలు ఏమిటో విశ్లేషించి, మరేం చేద్దాం అని పరిష్కారా మార్గాలు అన్వేషిస్తారట… టెస్టుల్లో వైట్ వాష్ తరువాత కలిగిన జ్ఞానోదయమేనా ఇది..? దేశమంతా క్రికెట్ ప్రేమికులు నెట్లో బూతులు తిడుతున్న ఫలితమా ఇది..? అసలు సమస్యే గౌతమ్ గంభీర్ కదా, తనతో వేరే సమస్యల పరిష్కారాలు […]
సర్పంచ్..! సొంత ఖర్చులు, అప్పులు… ఐనా ఆ పదవి విలువే వేరు…
. ఎన్నికల ప్రక్రియల్లో ఎన్ని లోపాలైనా ఉండవచ్చుగాక… ప్రజాస్వామ్యంలో ఎన్నికలే చాలా కీలకం. ఆ ఎన్నికల్లో ఎన్నెన్ని కలలో, కళలో, కల్లలో తెలుసుకోవాలంటే తాజాగా తెలంగాణాలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల గోదాలోకి దిగాలి. అకడమిక్ గా స్థానిక పరిపాలనలో పంచాయతీ వ్యవస్థ ఎంత ప్రధానమో చెబితే రామాయణం కంటే పెద్దది. కానీ ఆచరణలో సర్పంచ్ పదవి దేవతావస్త్రం కథ. అధికారాలేవో ఉన్నట్లే ఉంటాయి. కానీ ఎమ్మెల్యే సూర్యప్రభ ముందు సర్పంచ్ వెలుగు వెలగలేక చీకటిగానే మూసుకుపోయి కారుచీకట్లో […]
స్వార్థం కాదు… అజ్ఞానంతోనే సైబర్ క్రైమ్ బాధితులుగా మారేది…
. Murali Buddha ….. నిన్న ఉదయం ఈటివిలో సతీ సుమతి సినిమా వస్తోంది . కాంతారావు , అంజలీ హీరో హీరోయిన్లు .. టివి ఆన్ చేయగానే ఓ సీన్ బాగా నచ్చింది … రేలంగి తన వద్ద మహిమ గల ఒక వజ్రం ఉందని , దానికి పూజలు చేసి కోరికలు కోరుకుంటే జరుగుతాయి అని వర్ణిస్తాడు .. అది విన్న సూర్యకాంతం అంత మహిమ గల వజ్రం నాకు అమ్మే బదులు నువ్వే ఇంట్లో […]
- 1
- 2
- 3
- …
- 116
- Next Page »


















