అడిగిన వారందరికీ వోట్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించామని రాష్ట్ర ఎన్నికల అధికారులు గొప్పగా చెప్పారు… ఉత్తదే… చాలామంది దరఖాస్తు చేసుకున్నా రాలేదంటున్నారు ఫీల్డులో…! సరే, ఈసారే కొత్తగా ఈ సౌకర్యాన్ని తీసుకొచ్చారు కాబట్టి కొన్ని పొరపాట్లు, తడబాట్లు ఉండి ఉండవచ్చు… అర్థం చేసుకోవచ్చు… కానీ పోస్టల్ బ్యాలెట్లయితే ఎప్పటి నుంచో ఉన్నదే కదా… అదీ ఒడిదొడుకులకు గురైందని చెబుతున్నారు… సరే, దాన్నీ పక్కన పెడితే గతంలో పోలింగ్ స్లిప్స్‌ను ఆయా ప్రధాన పార్టీల అభ్యర్థుల కార్యకర్తలు […]
రైతుబంధుపై రాజకీయాలు… కేసీయార్ ప్లాన్ సక్సెస్… కాంగ్రెస్ తెల్లమొహం…
రైతుబంధు… సరిగ్గా బీఆర్ఎస్ ఆశించిన ఫలితం నెరవేరింది… తను వేసిన ప్లాన్ పారింది… కేంద్ర ఎన్నికల సంఘం తప్పులో రెండుసార్లు కాలేసింది… ఇజ్జత్ పోయింది… బీఆర్ఎస్ పెద్దల మొహాల్లో చిరునవ్వులు మొలిచాయి… రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు వేయడం అనేది కేసీయార్ పొలిటికల్ లబ్ధి ఆలోచన… నిజంగా రైతుల కోసమే అయితే పదెకరాలు దాటిన వాళ్లకు అంది ఉండకూడదు, నిజంగా వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే అందాలి… అది ఉపయుక్తం… కానీ బలిసిన రైతులకూ డబ్బులు వేయసాగారు… […]
మీరేమైనా అనుకొండి… జర్నలిస్టును అని చెప్పుకోవడానికి సిగ్గనిపిస్తోంది…
Ashok Vemulapalli…….. “ధర్డ్ డిగ్రీ” (“నా”నీ” గుెండెల్లో మంటలు) వందమంది ధోషులు తప్పించుకున్నా..పర్వాలేదు గానీ ఒక్క నిర్ధోషికి మాత్రం శిక్ష పడకూడదు.. చాలామంది న్యాయవాదుల నోటి నుంచి వచ్చే మాట ఇది.. చాలా సినిమాల్లో ఈ మాట వింటూ ఉంటాం.. ఇది నిజమేనా..ఇది నిజంగా భారత న్యాయశాస్త్రంలో ఉందో లేదో నాకు తెలీదు..కానీ వైజాగ్ హార్బర్ లో బోట్లు తగలబడిన కేసులో లోకల్ బాయ్ నానీ విషయంలో జరిగింది ఏంటి.. వాదోపవాదాలు ముగిసి న్యాయమూర్తి వేసే శిక్ష […]
‘అన్నా.., మోడీ మీటింగుకు మేమూ వస్తాం, మనిషికి ఎంతిస్తారు..?’
మొదట నమ్మబుద్ధి కాలేదు… కామారెడ్డి నియోజకవర్గం… రేవంత్, కేసీయార్ పోటీచేస్తున్న స్థానం… హోరాహోరీ సాగుతోంది పోటీ… అంతేకాదు, లోకల్ బీజేపీ లీడర్ వెంకట రమణారెడ్డి వాళ్లకు దీటైన పోటీ ఇస్తున్నాడు… దాంతో అందరి దృష్టీ దీనిపై పడింది… బీజేపికి ఆశలున్న సీట్లలో ఇదీ ఒకటి… అందుకే మోడీ భాయ్ రాక… రేవంత్ కోసం ఒక మండల ఇన్చార్జిగా పనిచేస్తున్న ఓ పెద్దమనిషి చెప్పిందే… మొన్న కేటీయార్ మీటింగు జరిగింది… మామూలుగా ఏ పార్టీ మీటింగైనా సరే ఎంతో […]
బర్రెలక్కపై ఈ బురద దాడి దేనికి..? ఎందుకీ ఉలిక్కిపాట్లు, వ్యక్తిత్వంపై గాట్లు..?
అనుకుంటున్నదే… ఊహిస్తున్నదే… బర్రెలక్క ఎప్పుడైతే బాగా పాపులర్ అయిపోయిందో… రాష్ట్ర సగటు నిరుద్యోగ నిరసనకు ఓ ఐకాన్ ఎప్పుడు అయిపోయిందో… అప్పుడే ఆమె వ్యక్తిత్వాన్ని దిగజార్చే కుట్రలు స్టార్టవుతాయని అనుకున్నదే… వాళ్లతోవీళ్లతో కాదు, ఏకంగా ఆమె తండ్రినే వెదికి పట్టుకుని నానా తిట్లూ తిట్టించాారు ఆమెను… కొన్ని మాట్లాడుకోవాలి… ఆమె, ఆమె తల్లి ఆమె తండ్రితో కలిసి ఉండరు… తన మాటల తీరు చూస్తుంటేనే తనెలాంటి వాడో అర్థమవుతూనే ఉంది… వాళ్లు విడిగా బతుకుతుంటే వాళ్ల మానాన […]
తెలంగాణ ఏర్పడ్డాక… తలసరి గృహ విద్యుత్తు వినియోగంలో బాగా డౌన్ ఫాల్…
ప్రచారం: రాష్ట్ర ఏర్పాటు తరువాత ఎనిమిదేళ్లలో తెలంగాణ తలసరి ఆదాయం రూ 95,361/- నుండి రూ 2.80 లక్షలకు పెరిగింది. ప్రజలు సుఖశాంతులతో ఉన్నారనడానికి ఇంకేం ఆధారం కావాలి? వాస్తవం: ప్రజల జీవన ప్రమాణాలకు నిజమైన కొలబద్ద గృహ విద్యుత్ వినియోగం. ఈ వృద్ది రేటు రాష్ట్ర ఏర్పాటు తరువాత 110% నుండి 69%కి పడిపోయింది. అభివృద్ది ఫలాలు కేవలం పిడికెడు వ్యక్తులకే పరిమితమై, సామాన్య తెలంగాణ ప్రజల బతుకులు మరింత దిగజారడాన్ని ఇది సూచిస్తుంది. ప్రజల […]
ఆమెని బర్రెలక్క అని పిలవడంలో నాకేమీ నామోషీ లేదు…
బర్రెలక్క నిర్ణయం.. చాన్నాళ్లు చెప్పుకొనే సంగతి! ఇవాళ దేశమంతా చెప్పుకొంటున్న ఎమ్మెల్యే అభ్యర్థిని బర్రెలక్క (శిరీష) గారిది మా రాష్ట్రం. ఆమె మా ఉమ్మడి పాలమూరు జిల్లా మనిషి. ఈ మాట అనుకోవడానికి గర్వంగా ఉంది. పాతికేళ్లు దాటిన ఓ విద్యావంతురాలైన స్త్రీ స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే ఎన్నికల్లో నిలవడమనే విషయం తల్చుకుంటేనే చాలా చాలా బాగుంది. ఆమెని ‘బర్రెలక్క’ అని పిలవడంలో నాకేమీ నామోషీ లేదు. ఆ పేరులో ఒక నిరసన ఉంది. బహుజన, శ్రామిక […]
గజ్వెల్‌లోనూ బర్రెలక్క వంటి ఇంకో అభ్యర్థి… కాకపోతే ఈయన వ్యథ అనంతం…
Kandukuri Ramesh Babu ……. విను తెలంగాణ – గజ్వేల్ : ఇది ఒక నిర్వాసితుడి గెలుపు నియోజకవర్గం… గజ్వేల్ అంటే మన ‘జాతి పిత’ నియోజకవర్గం. అంతేకాదు, ఇంకా పోరాడుతున్న మల్లన్న సాగర్ నిర్వాసితుల పునరావాస కేంద్రం కూడా. అక్కడ “భయపడకండి” అంటూ మూడు పయ్యల గుర్తు మీద పోరాడుతున్న ఈ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క లా పాప్యులర్ కాకపోవచ్చు. సామాజిక మాధ్యమాల్లో అతడు పోటీ వైరల్ కాకపోవచ్చు. అతడిని కలవడానికి మీరు వెళ్ళే ప్రయతం […]
అందరూ అట్నుంచి నరుక్కొస్తున్నారు… భలే తెలంగాణ పాలిటిక్స్…
అట్నుంచి నరుక్కొస్తున్నారు… ఎట్నుంచి…? కర్నాటక నుంచి…! రెండు ప్రధాన పార్టీలూ అంతే… కర్నాటకలో కాంగ్రెస్ పలు గ్యారంటీ స్కీముల హామీలను ఇచ్చి, జనం వోట్లు వేయించుకుని, అధికారంలోకి వచ్చింది… దాదాపు అవే స్కీములను తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రయోగిస్తోంది… మొదట్లో జనంలోకి వెళ్లాయి ఆ స్కీముల హామీలు… చివరకు కేసీయార్ సైతం తన మేనిఫెస్టోకు కాంగ్రెస్ మేనిఫెస్టోనే ఆధారంగా చేసుకున్నాడు… ఆ కాంగ్రెస్ హామీల్నే కాస్త అటూఇటూ సర్దాడు… పైగా 200 యూనిట్ల ఫ్రీ పవర్, మహిళలకు […]
ఆస్తుల్లేవ్… అప్పుల్లేవ్… చేతిలో 6500… ఆ నాలుగు బర్రెలు కూడా లేవ్…
సార్, బర్రెలక్క అఫిడవిట్ విశేషాలు ఏమిటి అనడిగాడు ఓ మిత్రుడు… కొల్లాపూర్ స్థానంలో ఇతర ప్రధాన పార్టీల అభ్యర్థుల వివరాల్ని ఏడేసి వేల మంది డౌన్ లోడ్ చేసుకోగా, బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష వివరాల్ని 30 వేల మంది దాటి డౌన్ లోడ్ చేసుకున్నారు… మొత్తానికి ఈ అమ్మాయి ఓ సెన్సేషనే… మన రాష్ట్రమే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భలే చర్చ జరుగుతోంది… ఆ అఫిడవిట్ వివరాల్లోకి వెళ్తే… పేరు కర్నె శిరీష… తల్లి […]
హేమిటో… ఊరందరిదీ ఓ దారి అయితే ఎర్ర ఉలిపికట్టెది మరో దారి…
లెఫ్ట్ అంటే… విడిచిపెట్టబడిన, విడిచిపెట్టదగిన… లేదా ఎడమ వాటం… అనగా రైట్‌కు పూర్తిగా విరుద్ధం… అంటే అపసవ్యం… ఇవన్నీ ఎందుకు అనుకోవాలీ అంటే… ఈ దేశంలో లెఫ్ట్ పార్టీల ధోరణి గురించి..! ప్రపంచంలో కమ్యూనిజం సిద్ధాంతాలకు కాలం చెల్లింది… మన లెఫ్ట పార్టీలకు మన దేశానికి పనికొచ్చే సిద్ధాంతాలు అక్కర్లేదు… రష్యాలో ఏం జరిగిందో చూశాం… కమ్యూనిజం ఫెయిలైంది.,. సీపీఎం ఓ స్వర్గంగా చూసే చైనా… దైవస్వరంగా భావించే అక్కడి కమ్యూనిజం కూడా సగం పెట్టుబడిదారీ విధానాలతో […]
కేసీయార్ ఎన్నికల ప్రసంగాల్లో ఆ పాత పంచ్ ఎందుకు లోపించింది..?
నిజమే… ఇంట్రస్టింగ్ ప్రశ్నే… రెండు టరమ్స్ ముఖ్యమంత్రిగా చేసి, తెలంగాణ సాధించాడనే మంచి ఖ్యాతి, ఇమేజీ కూడా ఓన్ చేసుకున్న నాయకుడు తనను మూడో టరమ్ ముఖ్యమంత్రిని చేయమని అడిగే ప్రచారంలో… పదేళ్లలో తనేం చేశాడో చెప్పకుండా, పాజిటివ్ వోటు కోసం గాకుడా, పూర్తిగా నెగెటివ్ ధోరణిలో ఎందుకు వెళ్తున్నాడు..? అదీ ఎప్పుడో చూసిన ఇందిరమ్మ రాజ్యాన్ని తోకమట్ట రాజ్యమని ఎందుకు నిందిస్తున్నాడు..? పేదల్ని కాల్చిచంపుడు, ఆకలికేకలు తప్ప ఇందిరమ్మ రాజ్యంలో ఏముందని వెక్కిరిస్తున్నాడు దేనికి..? అప్పట్లో […]
‘అభివృద్ధి’లో అప్పుడూ తెలంగాణ పదో స్థానమే… ఇప్పుడూ అదే పదో స్థానమే…
తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP) వృద్దిలో దేశంలోనే తెలంగాణ నంబర్-1: ఇది మరో బూటకపు ప్రచారం… తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ కొన్నాళ్లలోనే అద్భుతమైన ప్రగతి సాధించిందనీ, ప్రగతి సూచికలలో దేశంలోని అన్ని రాష్ట్రాలలో మనమే ముందంజలో ఉన్నామనే ప్రచారంలో నిజమెంత? ప్రధానంగా స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP-Gross State Domestic Product), రాష్ట్రాల తలసరి ఆదాయం (Per Capita Income), తలసరి విద్యుత్ వినియోగం ( Per Capita Electricity Consumption), విద్యుత్ స్థాపిత […]
కాలేరు కథ చాలా పెద్దది… వివరంగా చెబితే సహజంగానే సిగ్గుపోతది…
Kandukuri Ramesh Babu…….. విను తెలంగాణ- ‘కాలేరు’ కథ పెద్దది… కానీ….. ఓపెన్ కాస్ట్ క్వారీలను “బొందల గడ్డలు” అని పేర్కొనడం కెసిఆర్ గారి నుంచే పుట్టింది. 2010లో ఉద్యమం ఉప్పెనగ మారుతున్న సమయంలో సింగరేణి కార్మికులకు భరోసానిస్తూ “కుర్చీ వేసుకుని ఓపెన్ కాస్ట్ గనులను మూసేయిస్తాను” అన్న కెసిఆర్ గారు ఆ పని చేయకపోగా లాభాల్లో ఉన్న భూపాలపల్లి వంటి భూగర్భ గనులను కూడా”బొందల గడ్డలు” చేశారని విలవిలలాడుతూ కార్మికులు చెప్పడం బాధకు గురి చేసింది. […]
పవన్ కల్యాణ్ సారు గారు తెలంగాణకు అప్పట్లో మద్దతునిచ్చాడట…!!
పవర్ స్టార్ సారు గారికి హఠాత్తుగా తన పార్టీ తెలంగాణలో కూడా పోటీచేస్తోందనీ, 8 స్థానాల్లో అభ్యర్థులున్నారనీ గుర్తొచ్చినట్టుంది… షూటింగు నడుమ గ్యాప్ కూడా చూసుకుని, తాపీగా తెలంగాణ ప్రచారబరిలోకి దూకాడు… ఫాఫం, బీజేపీ… తెలంగాణలో పార్టీ వేస్తున్న అయోమయపు అడుగుల్లో పవన్ కల్యాణ్‌తో పొత్తు కూడా ఒకటి… తెలంగాణ ప్రజలు చైతన్యశీలురు, పోరాటవీరులు ఇంకా ఏవేవో అంటుంటారు కానీ… అమాయకులు… ఆంధ్రా లీడర్ల దృష్టిలో గొర్రెలు, ఏది చెప్పినా నమ్మేస్తారు… పవన్ కల్యాణ్ అభిప్రాయం కూడా […]
దుబాయ్ బతుకులు… వీళ్లంతా మన తెలంగాణ బిడ్డలే కేసీయార్ సార్…
Kandukuri Ramesh Babu …….. విను తెలంగాణ – ఇది గల్ఫ్ ‘బలగం’ : ఆ ముగ్గురి వల్లే ఐదుగురి అవతరణ… నిన్న కోరుట్లలో గల్ఫ్ జేఎసి ఆధ్వ్యరంలో జరిగిన బైక్ ర్యాలీ అనంతరం వందలాది కుటుంబ సభ్యులతో పెద్ద ఎత్తున సమావేశం జరిగింది. అందులో ఐదుగురి అభ్యర్థుల్లో నలుగురు మాట్లాడారు. వారి మాటల్లో ఆవేశం, కసి కాకుండా స్థిరత్వం కనిపించింది. రాజకీయంగా నిశితం అవుతున్న బృందంగానే కాదు, అదొక బలగంగా మారుతున్న వైనం కానవచ్చింది. వార్తా […]
Sorry Dev.. Love You Kapil… నాటి నుంచీ బాధితుడివే… ఈ రోజు దాకా…
Priyadarshini Krishna…….. చరిత్రను చింపేయలేరు, విజేత పేరు చెరిపేయలేరు… కాస్త లేటుగా ఐనా కొంత లేటెస్టుగా రాస్తున్నా…… Cricket World Cup కలని సాకారం చేసి గెలుపు రుచిని ప్రతి భారతీయ పౌరునికి చూపించిన వీరుడు కపిల్ దేవ్…. ఇది ఎవరూ కాదనలేని నిజం… రెండ్రోజుల నుండి మీడియా (సోషల్ మీడియా కూడా) లో ఈ 2023 world cup final match కి కపిల్& టీం ని పిలవకపోవడం పైన కనపడుతున్న వాదం చాలా బయాస్డ్ గా […]
బర్రెలక్క @ శిరీష… దాడులు, బెదిరింపులకు గురయ్యే రేంజ్‌కు ఎదిగిపోయిందా..?!
దారుణం… కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన బర్రెలక్క @ శిరీష తమ్ముడిపై దాడి చేసిన దుండగులు… గత కొద్దిరోజులుగా చందాలు వేసి మరి ప్రచారం చేయిస్తున్న నిరుద్యోగులు… సోషల్ మీడియా నుంచి కూడా బర్రెలక్కకు భారీగా లభిస్తున్న మద్దతు… కొల్లాపూర్ ఇండిపెండెంట్ అభ్యర్థి శిరీష తమ్ముళ్లపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి … బర్రెలక్కకు బెదిరింపులు… వెంటనే శిరీషకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి అని డిమాండ్……. ఇదీ తాజాగా వాట్సప్‌లో కనిపించిన వార్త… నిజమే, ఆమెకు సోషల్ […]
ఆమె ఆసీస్ తలెత్తుకునే కోడలు… ఆయన హుందా ఇండియా కెప్టెన్…
ట్రావిస్ హెడ్… ఈ ఆస్ట్రేలియా బ్యాటర్ భార్య జెసికాను ట్రోల్ చేస్తున్నారు… ఆమె ఏం పాపం చేసింది..? ఏమీ లేదు… ఈ బ్యాటర్ హెడ్ మొన్నటి వరల్డ్ కప్ ఫైనల్స్‌లో అద్భుతంగా ఆడి ఆస్ట్రేలియాను విజేతగా చేశాడు కదా… తనకు భార్య కావడమే ఆమె తప్పు అన్నట్టుగా సోషల్ మీడియా ట్రోలర్లు విరుచుకుపడుతున్నారు… ఎస్, సోషల్ మీడియా అంటేనే ‘ఉన్మాదపు ట్రోలింగ్’ అన్నట్టుగా మారింది కదా పరిస్థితి… సోషల్ మీడియాలో 60, 70 శాతం ఫేక్ గాళ్లు, […]
ఒక మ్యాచ్… వంద పాఠాలు… జో జీతా వోహి సికిందర్…
Pressure- Failure: 1 . ఒక పద్యం:- “అక్కరకు రాని చుట్టము, మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున దా నెక్కిన బారని గుర్రము గ్రక్కున విడవంగవలయు గదరా సుమతీ!” అవసరానికి ఉపయోగపడని చుట్టాన్ని; మొక్కితే వరమివ్వని దేవుడిని; యుద్ధభూమిలో పరుగెత్తని గుర్రాన్ని వెంటనే వదిలించుకోవాలన్నాడు సుమతీ శతకకారుడు. 2 . ఒక సామెత:- “Fortune favours the brave” ధైర్యవంతుడికే అదృష్టం అనుకూలిస్తుంది అని ఇంగ్లీషులో పాపులర్ ప్రావెర్బ్. 3 . ఒక వాడుక మాట:- “జో జీతా వోహి […]