Muchata.com Telugu Latest News

Muchata.com Provided Telugu Latest News, Political News , Political News, Breaking News in Telugu LIVE ముచ్చట

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వచ్చాడయ్యో స్వామీ..! ఆయన ఉద్యమిస్తానంటే జగన్ సర్కారులో దడ…

December 30, 2020 by M S R

chalasani1

తెలంగాణ ఉద్యమం జరుగుతున్నన్ని రోజులూ… ఓ శాలువా కప్పుకున్న పెద్దమనిషి అన్ని టీవీలలో భీకరంగా వాదించేవాడు… బొచ్చెడు గణాంకాల్ని ఏకరువు పెట్టేవాడు… సరే, సత్యవాణి దగ్గర్నుంచి గజల్ సీను, లగడపాటి, అశోక్‌బాబు దాకా బోలెడుమంది… ఈ చలసాని శ్రీనివాస్ కూడా అలాంటి వారిలో ఒకరులే అనుకునేవాళ్లు తెలంగాణ ఉద్యమకారులు… కొన్ని సంస్థలు, సంఘాలు ఉంటయ్… వాటి పుట్టుక ఎప్పుడో, వాటి నిర్మాణం ఏమిటో, ఏం ఉద్యమాలు నిర్మించారో, ఊరూరా ఏం చైతన్యాన్ని రగిలించారో, ఆయా కమిటీల్లో ఎవరెవరున్నారో […]

ఈ కృత్రిమ సూర్యుడు… ప్రపంచగతినే సమూలంగా మార్చేయబోతున్నాడు…

December 30, 2020 by M S R

new sun

టెక్నాలజీ వేగంగా విస్తరిస్తోంది… కరోనా వంటి ప్రాణాంతక వైరసులు ఉప ఉత్పత్తుల్లాగా ప్రపంచం మీద విరుచుకుపడుతున్నా సరే… ఆ దుష్ట చైనీయుడు ప్రపంచానికే ఓ శాపంగా మారినా సరే… టెక్నాలజీ ఆగదు… మనిషి రోజురోజుకూ కొత్తది కనిపెడుతూనే ఉంటాడు… అదే మనిషి ప్రగతికి బాటలు వేస్తోంది… దాన్నెవడూ ఆపలేడు… అయితే ప్రకృతి ఇవన్నీ బ్యాలెన్స్ చేసేలా రోజురోజుకూ కొత్త విపత్తుల్ని ప్రయోగిస్తూనే ఉంటుంది… అది వేరే సంగతి… ఆమధ్య మనం ఓ వార్త చదివాం… మన దిక్కుమాలిన […]

ఈటల సమక్షంలోనే… కేసీయార్ సంధించాల్సిన కొన్ని ప్రశ్నలివి…

December 30, 2020 by M S R

medical seats

బ్యూరోక్రాట్ల పాలనలో చిక్కిన తెలంగాణ..! చాలా పెద్ద మాట నిజానికి… కానీ జరుగుతున్నది అదే… నిర్ణయాలు తీసుకునేది కేసీయార్ లేదా ఉన్నతాధికారులు… అంతే… రాజకీయంగా నష్టం వాాటిల్లితేనే కేసీయార్ ఏదో ఓ దశలో కడిగేసుకుంటాడు… అనేక విషయాల్లో ఆయన యూటర్న్‌కు అదే కారణం… ఆ దిద్దుబాటను కూడా ఆయన అధికారగణం సరిగ్గా చేయనివ్వరు… ఆ తీరూ గమనించాం… తెలంగాణ ప్రయోజనాల కోసం ఉద్యమించిన అనేక నోళ్లు కూడా కిక్కుమనవు… ఒకటి ఆశ్చర్యం అనిపించేది ఏమిటంటే… తెలంగాణ పిల్లలకు […]

రజినీకాంత్..! కొబ్బరికాయ కొట్టకముందే గుమ్మడికాయ కొట్టేశాడు దేనికి..?

December 30, 2020 by M S R

rajnikanth

రజినీకాంత్ రాజకీయ వైరాగ్యం మీద రకరకాల విశ్లేషణలు వస్తూనే ఉంటయ్… జోకులు పేలుతూనే ఉంటయ్… కోట్ల మంది అభిమానులు నిరాశపడొచ్చు… ఈలోపు హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ మీద ఊహాగానాలు నడుస్తూ ఉంటయ్… కమల్‌హాసన్ ఫ్యాన్స్ లోలోపల ఆనందించవచ్చు… కానీ అనేక ఏళ్లుగా ఒకడుగు ముందుకు, పది అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతున్న రజినీకాంత్ ‘‘రోబో’’ సినిమాలో చిట్టి తనంతటతానే డిస్‌మెంటల్ అయిపోయినట్టుగా…. ఓ భారీ సినిమాకు కొబ్బరికాయ కొట్టకముందే గుమ్మడికాయ ఎందుకు కొట్టాడు..?  ( కార్టూనిస్ట్ […]

ఇళయరాజా..! ఓ పంచాయితీ గోక్కున్నాడు… మాటమర్యాద పోయాయ్…

December 30, 2020 by M S R

ilayaraja

ఇళయరాజా… ఈయన జగమెరిగిన సంగీత దర్శకుడు… స్వరకర్త… అయితేనేం..? లౌకిక, వ్యవహారిక అంశాల్లో ఆ పేరుప్రఖ్యాతులేమీ ఉపయోగపడవు కదా… ఎల్వీ ప్రసాద్ ఉన్నప్పుడు మద్రాసులోని తన స్టూడియోలోని ఓ గదిని ఇళయరాజాకు కేటాయించాడు, వాడుకో బ్రదర్ అన్నాడు… రూం నంబర్ వన్… దాన్ని ఇళయారాజా రికార్డింగ్ థియేటర్ అని పిలిచేవారు… మూడున్నర దశాబ్దాల క్రితం నాటి మాట ఇది… అప్పట్లో ఈయన ఫుల్ బిజీ… స్టూడియో బిజీ… బోలెడు సినిమాలు… రికార్డింగులు, సిట్టింగులు… ఈయన అవసరం వాళ్లకుంది… […]

యూటర్న్ బాషా..! బీపీ పెరిగిందంటే చాలు… కొత్త పార్టీగీర్టీ ఉల్టాపల్టా….

December 29, 2020 by M S R

rajnikanth1

ఏయ్… ఎవడ్రా అదీ… మా వకీల్ సాబ్ గురించి మళ్లీ మాట్లాడుతున్నారు…? ఆయ్ఁ……… ఆ రజినీకాంత్ అంటే 70 దాటాడు… అసలు కమల్‌హాసనే 66 దాకా వచ్చాడు… వాళ్లకూ మా యాభయ్యేళ్ల పవన్ దేవుడితో పోలిక పెడుతున్నారు..? తాటతీస్తాం… ఈ నానీలు, డాడీలు, జగన్‌లూ జాన్తానై… ఆఫ్టరాల్ మా నాగబాబు అన్న, మా నాదెండ్ల మనోహర్ దోస్త్ చాలు… మా పార్టీని గెలుపు తీరాలకు తీసుకుపోవడానికి… సరే, సరే… ఈ మాటలేమిలే గానీ… రజినీకాంత్ అనబడే ఓ […]

కేసీయార్ సారూ… తెలంగాణ రాష్ట్రమొచ్చినా ఈ సీట్ల నష్టం తప్పదా..?

December 28, 2020 by M S R

medical seats

తెలుగు ప్రజల్లో ప్రాంతీయ చిచ్చు పెట్టినవి ఏమిటి..? ఉద్యోగాలు, అడ్మిషన్లు… ఎవరు స్థానికుడు, ఎవరు స్థానికేతరుడు అనే పంచాయితీలే… జై ఆంధ్రను, జై తెలంగాణను రగిలించాయి… మలి దశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది కూడా హైదరాబాద్ ఫ్రీజోన్ అనే తగాదాతోనే…! చివరకు విడిపోయాం… ఎవరి బతుకు వాళ్లదే… కాదు, విభజన తగాదాలు సాగుతూనే ఉంటయ్… ఉన్నయ్… పోతిరెడ్డిపాడు పొక్కను ఇంకా తవ్వీ తవ్వీ, నీళ్లను జగన్ ఎత్తుకెళ్తానంటున్నాడు… నిధులు మాయమైపోయి రెండున్నర లక్షల కోట్ల అప్పు చేతికొచ్చింది… […]

సారు కొనడు… అంతే… ఎలాగైనా, ఎక్కడైనా అమ్ముకొండి… ఇలా కూడా…!!

December 28, 2020 by M S R

telangana farmer

మీ ఇష్టమొచ్చిన చోట పంట అమ్ముకొండి… నేనయితే కొనను, ఇప్పటికే చేతులు కాలినయ్… అసలు పంటలు కొనడం ప్రభుత్వం పనే కాదు… ఊళ్లల్లో కొనుగోలు కేంద్రాల్ని మూసేయండి………. ఇదే కదా, కేసీయార్ నిర్ణయం… అదే కదా చెప్పింది… సరే, వ్యాపారులు సరైన ధరకు కొనరు, అసలు కొన్నిసార్లు ఏ ధరకూ కొనరు… మరోవైపు మిత్తీలు, ఖర్చులు తరుముతుంటాయి… మరి రైతు ఏం చేయాలి..? హహహ… దానికి మార్గం సారు గారి సొంత పత్రిక నమస్తే తెలంగాణ రాసేసింది […]

కేసీయార్‌కు క్రెడిట్స్ ఇవ్వరు సరే… కానీ మంచి మార్పును గుర్తించాలి కదా…

December 28, 2020 by M S R

male female ratio

కేసీయార్ ఏదో గొప్ప సాధించాడు అని రాయడానికి మనసొప్పకపోతే పోనీ… కానీ నిజాన్ని రాయాలి కదా…! ఆనందపడే ఓ సామాజిక మార్పును తెలియజెప్పాలి కదా..! కేసముద్రంలో ఒక కుటుంబం ఆడపిల్లను కన్న తమ కోడలికి అపూర్వంగా స్వాగతం పలికిన వార్తను దాదాపు అన్ని పత్రికలూ వేశాయి… (అందులోని విశేషాన్ని గుర్తించలేని ఓ పెద్ద దరిద్రం తప్ప)… అది దేనికి సూచిక..? తెలంగాణ సమాజం ఆడపిల్లను మహాలక్ష్మిగానే భావిస్తోంది… ఆడపిల్ల అని తెలుసుకుని అబార్షన్లు చేయడాలు, పుట్టగానే చంపేయడాలు […]

ఉల్టాపల్టా..! కేసీయార్ చేసిన తప్పేమిటి… పీఛే ముడ్ దేనికి…

December 28, 2020 by M S R

telangana farmer

మనసుంటే మల్లి… లేకపోతే ఎల్లి…. కేసీయార్ చాలాసార్లు చేసేది ఇదే… ఉదాహరణకు నియంత్రిత సాగు… పంటల కొనుగోళ్లు… తను తాజాగా తీసుకున్న నిర్ణయం ఏమిటి..? ఇకపై నియంత్రిత సాగు ఉండదు, మీ ఇష్టం వచ్చిన పంట వేసుకొండి… ప్రభుత్వం పంటలు కొనదు… 7500 కోట్లు లాస్ అయ్యింది ప్రభుత్వం… మీ ఇష్టం వచ్చినచోట మీ ఇష్టమొచ్చిన ధరకు అమ్ముకొండి… ఇదీ ఆ నిర్ణయం… అంటే గ్రామ స్థాయి వరకూ అద్భుతమైన నెట్‌వర్క్ అని ప్రచారం చేసుకున్న రైతు […]

ఫాఫం హిందూ..! ఈమె ఎదుట చేయిచాచి, చివరకు తనే బజారునపడింది…

December 27, 2020 by M S R

దిహిందూ దగ్గర ఏ ఆన్సరూ లేకుండా చేసిందీమె… అంతటి ప్రఖ్యాత పత్రికకు దిక్కతోచని స్థితి… తన రిపోర్టర్‌ను సమర్థించుకోలేదు, అలాగని ఈమెపై కక్షనూ ప్రదర్శించలేదు… లెంపలేసుకుంటుందా..? కిక్కుమనకుండా మూసుకుంటుందా..? ఇంట్రస్టింగు… విషయం ఏమిటంటే..? మాన్సాస్ ట్రస్టు కొత్త బాస్ సంచయిత గజపతిరాజు తెలుసు కదా… కొన్ని వేల కోట్ల సామ్రాజ్యానికి ధర్మకర్త ఆమె ఇప్పుడు… సోకాల్డ్, చంద్రబాబు, అశోకగజపతిరాజుల చట్రం నుంచి తమ తండ్రుల, తాతల బాపతు ట్రస్టును బయటికి లాగి… ఎవరేం మాట్లాడినా, బెదిరించినా, వణకకుండా, […]

అది అసలే అపోలో..! అందుకే డౌటు… ఎన్నికలవేళ ఏమిటీ మిస్టరీ…?

December 26, 2020 by M S R

రజినీకాంత్ ఆరోగ్యానికి ఏమీ ఢోకా లేదు… సంతోషం… మొన్ననే కరోనా నెగటివ్ రిజల్ట్ వచ్చింది… మరీ సంతోషం… కానీ ఇంతలోనే బీపీ ఒడిదొడుకులు ఏమిటి..? అసలు ఏం జరుగుతోంది..? ఆఫ్టరాల్ బీపీ ఫ్లక్చువేషన్స్‌కి తనను ఐసోలేట్ చేసి, ఎవరూ చూడనివ్వకుండా చేయాలా..? సరే, కరోనా సిట్యుయేషన్ కాబట్టి, అవాయిడ్ చేస్తున్నారు సరే… కానీ అది అసలే అపోలో… దాని క్రెడిబులిటీ ఏమిటో జయలలిత కేసులో చూశాం… రోజుల తరబడీ సాగిన డ్రామాలు చూశాం… అన్ ఫెయిర్, అన్ […]

తరం మారుతోంది… మార్పు వస్తోంది… ఇవిగో పొలిటికల్ యువస్వరాలు…

December 25, 2020 by M S R

సాధారణంగా లెఫ్ట్ పార్టీలు అనగానే వయోవృద్ధుల సారథ్యం… ఎన్నేళ్లొచ్చినా పార్టీ పదవుల్ని వదలరు… పాతదనం తొలగిపోతూ కొత్తరక్తం ప్రవహించడం అరుదు… లెఫ్ట్ పతనావస్థ కారణాల్లో ఇదీ ఒకటి… కొత్తతరం కూడా వాటిల్లో చేరడానికి ముందుకురావడం లేదు… దానికీ బోలెడు కారణాలు… కానీ మార్పు అనివార్యమని గ్రహిస్తున్నయ్ ఈ పార్టీలు కూడా..! నమ్మశక్యం కాని గుణాత్మక నిర్ణయాల వైపు కేరళ సీపీఎం మొగ్గుతున్న తీరే దీనికి ఉదాహరణ… తిరువనంతపురం మేయర్‌గా ఇరవై ఒక్క సంవత్సరాల ఓ విద్యార్థి ఆర్య […]

కేసీయార్ సారూ… మీ జగన్ తమ్ముడు ఏదో చెబుతున్నాడు ఇలా…

December 25, 2020 by M S R

పోతిరెడ్డిపాడు పొక్క వెడల్పు చేయడం మీద గతంలో నానా యాగీ చేసిన టీఆర్ఎస్ కిక్కుమనడం లేదు ఇప్పుడు…! అది జగన్‌తో దోస్తీయా, మరింకేదో కారణమా తెలియదు గానీ… ఈ అంశం టీఆర్ఎస్‌కు దక్షిణ తెలంగాణలో మైనస్ కాబోతోంది… ఇది కేసీయార్‌కు తెలియదని ఎవరూ భావించడం లేదు… కానీ ఎందుకు ఉపేక్షిస్తున్నాడో ఎవరికీ అర్థం కాదు… జగన్‌తో ఉన్న హార్ధిక, ఆర్థిక ప్రయోజనాలకు తెలంగాణ మనోభావాల్ని కూడా పణంగా పెడతాడా అనేది నమ్మలేం కానీ… ఏదో ఎక్కడో భీకరంగా […]

ఆ చైనావాడు అంతే… ఇండియన్ అంటే చాలు… సతాయించడమే…

December 25, 2020 by M S R

వాడు అంతే… ఆ చైనావాడు అంతే… ఇండియా అంటేనే ఓరకమైన కసి… చివరకు వాణిజ్య వ్యవహారాల్లోనూ, చిన్న చిన్న అంశాల్లోనూ అది చూపిస్తూ ఉంటాడు… వ్యాపారం చేసుకునేవాడు ఏం చేయగలడు..? భరించాలి… అంతేకదా… విషయం ఏమిటంటే..? మన దేశానికి చెందిన రెండు కార్గో నౌకలు చైనా పోర్టుల్లో నెలల తరబడీ నిలిచిపోయిన ఓ ఉదాహరణ… అన్ లోడ్ చేయనివ్వరు… సిబ్బందిని అనుమతించరు… వీళ్లేమో వెనక్కి పోతే లాస్… అందుకని రేపు అనుమతిస్తారేమో, ఎల్లుండి అనుమతిస్తారేమో చూద్దాం అన్నట్టుగా […]

నెంబర్ వన్… లేదా నంబర్ టూ… ఇదే బీజేపీ తాజా రాజకీయ దిశ…

December 25, 2020 by M S R

అయితే ప్రభుత్వంలో… లేదంటే ప్రధాన ప్రతిపక్షంలో…! ఇదే బీజేపీ నయా పాలసీ… ఇతర పార్టీలను కూడా ఆ దిశలోనే నెట్టేయబోతోంది అది… ఉదాహరణ… తెలంగాణ..! తదుపరి దశలో ఏపీ… మెల్లిగా తెలుగుదేశాన్ని తొక్కేయడం… సేమ్, ఒడిశా, బెంగాల్… అధికారంలోకి వస్తారా రారా అనేది వేరే సంగతి… బలమైన ఉనికి దానికి ముఖ్యం… ఎటొచ్చీ ఆల్‌రెడీ రెండు బలమైన పక్షాలున్నచోట అది చొరబడలేకపోతోంది… ఉదాహరణ… తమిళనాడు, కేరళ…! ఈ దిశలో అది ఫస్ట్ కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తుంది… సమాంతరంగా […]

అది కేరళ..! ఎర్రటి నియంతృత్వ అధికారాన్ని ప్రశ్నిస్తే నెత్తుటేర్లే…!

December 24, 2020 by M S R

Chada Sastry………… ఇటీవల ఒక జర్నలిస్ట్ మరణం కేరళ రాష్ట్రాన్ని కుదిపింది. ఎందుకంటే ధైర్యం, జర్నలిస్టు నీతి గలిగిన, అనేక ప్రముఖ మీడియా హౌసెస్ లో పనిచేసిన ఒక జర్నలిస్టు…. SV ప్రదీప్ అనే అతను డిసెంబర్ 15 ఒక లారీ ఆక్సిడెంట్ హిట్ & రన్ కేసులో చంపబడ్డాడు అని ఆరోపణలు వస్తున్నాయి… ప్రముఖ రాజకీయ పార్టీల నాయకులతో మరియు కెపి యోహాన్తో తన పాత్రికేయ నిబద్ధతతో ఢీ కొన్న జర్నలిస్టు ప్రదీప్. ఈ ప్రదీప్ […]

‘‘నచ్చావే నైజాం పోరీ’’ అని వెంటపడితే… ఇక సచ్చారే…! తాటతీస్తారు…

December 23, 2020 by M S R

నిజానికి ఆలోచన మంచిదే… అభినందనీయం… టీనేజీలోనే బాలికలకు ఆత్మరక్షణకు ఉపయోగపడే మార్షల్ ఆర్ట్స్ ప్రభుత్వం తరఫున నేర్పించడం అనేది మంచి సంకల్పం… ఎలాగూ భట్టీయం, మార్కులు, ర్యాంకులు, ఫీజులు, దోపిడీ తప్ప ఇంకేమీ పట్టని ప్రైవేటు స్కూళ్లు ఇలాంటివేమీ చేయలేవు… వాటికిి పాఠ్యపుస్తకాలు తప్ప ఇంకేమీ కనిపించవు… మన దిక్కుమాలిన సినిమాలు, మన చెత్తా హీరోల కథలు, మన టీవీ సీరియళ్ల పైత్యం పుణ్యమాని ప్రతి పోరడూ చిన్న వయస్సు నుంచే రోమియాలుగా మారి, అదే హీరోయిజంగా… […]

ఈనాడు పెద్దలు ఈ అన్నమే తిని… రక్తంలో సుగర్ కంట్రోల్ చేసుకుంటున్నారా..?

December 23, 2020 by M S R

కొన్నిసార్లు ప్రభుత్వ నిర్ణయాలు, వాటి వేషాలకంటే… వాటికి డప్పుకొట్టే వార్తలు, వాటిని పబ్లిష్ చేసే పత్రికలు, వాటి ఓనర్ల మీద జాలి ఎక్కువగా కలుగుతుంది… ఈనాడు వంటి మెగా పత్రికలు సైతం తాము ఏం రాస్తున్నామో, పాఠకులకు ఏం చెబుతున్నామో కూడా వదిలేసి, పాలకుల సొంత పత్రికలను మించి బాకాలు ఊదుతున్న తీరు జాలి గొలిపేలా ఉంటుంది… పాఠకులకు ద్రోహం చేస్తున్నామనే చింత కూడా రామోజీరావు వంటి మహా మెగా సూపర్ ప్రఖ్యాత ప్రసిద్ధ ప్రముఖ పాత్రికేయుడికి […]

చంద్రబాబే కుట్రదారుడు..! జగన్ ప్రభుత్వ తాజా అఫిడవిట్ చెప్పేది ఇదే…

December 23, 2020 by M S R

అమరావతి భూకుంభకోణం లేదా ఇన్‌సైడర్ ట్రేడింగ్…. ఎక్కడ రాజధాని రాబోతున్నదో ముందే లీక్ చేసి, తన వారితో అడ్డగోలు తక్కువ రేట్లకు కొనుగోలు చేయించాడనేది చంద్రబాబు మీద జగన్ ప్రభుత్వం ఆరోపణ… హైదరాబాద్ హైటెక్ సిటీ విషయంలో ఏం జరిగిందో పక్కన పెడితే… అమరావతి రాజధాని అనేది ఓ పెద్ద ల్యాండ్ స్కామ్ అనేది జగన్ విమర్శ… మరి దాన్ని ఎస్టాబ్లిష్ చేశాడా..? ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నాడు అనేది కూడా కాసేపు పక్కన పెడదాం… తాజాగా […]

  • « Previous Page
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • Next Page »

Search On Site

Advertisement

Latest Articles

  • సరికొత్త డ్రామా కంపెనీ… ఈటీవీ షో అంటేనే కామెడీ అయిపోయింది…
  • విజ్జెక్క ఆ సీటుకు ఎలా ఆప్ట్..? ఈ ప్రచారం తెరమీదికి తెస్తున్నదెవరు..?
  • ఓహ్… షర్మిల తిరుగుబాటు వెనుక ఇంత భారీ వ్యూహం దాగుందా..?!
  • తెలంగాణ సీఎం కుర్చీ అంత ఈజీయా..? జగన్-షర్మిల వార్… పార్ట్-2…
  • జగన్- షర్మిల డిష్యూం డిష్యూం..! వైఎస్ కుటుంబంలో చీలిక..! పార్ట్-1…
  • రోజాతో ఢీకి ఓంకార్ సై..! వర్షిణికి భలే చాన్స్..! అసలేం జరుగుతున్నదంటే..?!
  • కాకి బంగారం..! అల్లరిపాలైన నరేష్..! బావురుమన్న బాలయ్య టైటిల్..!!
  • లక్-కీ..! దగ్గుబాటి సురేషుడు లక్కీయేనా..? తొక్క మీద కాలేశాడా కొంపదీసి..!
  • పర్ సపోజ్, ఆమె వేరే పెళ్లిచేసుకుంటే… మాజీ భర్త వీర్యంపై హక్కులేమవుతయ్..?
  • తటస్థ నాగేశ్వరా… బీజేపీని తిట్టాలంటే భద్రాచలం రాముడు కావాలా ఏం..?

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now