ఇప్పుడు ప్రపంచమంతా ఒకవైపు ఆసక్తిగా చూస్తోంది… అదేమిటో తెలుసా..? పంజ్ షీర్..! కాశ్మీర్ లోయలాగే ఇది ఒక లోయ… లక్ష, లక్షన్నర మంది కూడా జనాభా ఉండదు… ఒక్కొక్క ఆవాసంలో పదీపదిహేను వేలు… గరిష్టంగా 40 వేలు… ఇప్పుడు ఈ లోయ వైపు అందరి ఆసక్తీ ఎందుకు కాన్సంట్రేట్ అయ్యిందంటే… అప్ఘన్ నుంచి ప్రస్తుతం తాలిబన్లకు భయపడి వేలాది మంది ప్రాణాలకు తెగించి పారిపోతున్నారు కదా… ఎంబసీలన్నీ ఖాళీ అయిపోతున్నాయి కదా… చివరకు అప్ఘన్ జవాన్లు కూడా […]
అఖండ అప్ఘన్..! తాలిబన్లు ఫిక్సయితే చైనాకు, పాకిస్థాన్‌కు ‘‘కాలడం’’ ఖాయం…!!
ప్రాణాలకు తెగించి లక్షలాది మంది ప్రజలు పారిపోతున్నారు, దేశాల ఎంబసీలు మూసేస్తున్నారు, ఆడవాళ్లు గజగజ వణికిపోతున్నారు… అప్పుడే ఆడవాళ్లపై తాలిబనిజం వార్తలు బయటికొస్తున్నాయి… ఒక చీకటియుగంలోని అప్ఘన్ వేగంగా నడుస్తోంది… అదంతా వోకే… అమెరికాకు ఓ చేదుమరక… బోలెడుమంది సైనికుల మరణం, బోలెడు డబ్బు నిరుపయోగం… ఇదీ సరే… పాకిస్థాన్ అర్జెంటుగా తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించడానికి రెడీ… చైనా తాలిబన్లతో దోస్తీకి రెడీ… రష్యా డబుల్ రెడీ… సో, ఇండియాకు ఇప్పుడు ఓ కొత్త బెడద… కానీ […]
తెలుగు సీఎంల ప్లేస్ ఎక్కడ..? మోడీ గ్రాఫ్ పాతాళానికి..! యోగీకి పాపులారిటీ..!
రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, దళితబంధు… ఇవేకాదు, నా దగ్గర ఇంకా మస్తు స్కీమ్స్ ఉన్నయ్.., దేశమే కాదు, ప్రపంచమూ అబ్బురపడాలి, అనుసరించాలి, అగ్గి పుట్టాలె, గత్తెర లేవాలె… అని కేసీయార్ ఏదేదో మస్తు గట్టిగా ఘోషిస్తున్నాడు ఏదో మీటింగులో..! 25 ఏళ్ల క్రితమే దళితజ్యోతులు వెలిగించాడట… జనం నవ్వుతారనే సోయి లేదనేది వేరే సంగతి… తనకు చట్టసభల్లో తిరుగులేని మెజారిటీ ఉంది… రాజకీయంగా బలోపేతంగా కనిపిస్తున్నాడు… ప్రతిపక్షం బలహీనంగా ఉంది… సాధనసంపత్తిలో తిరుగులేదు… కానీ ఒకప్పటి పాపులారిటీ […]
నల్లమందు పంట పండింది..! ఆ మత్తు డబ్బుతోనే తాలిబన్లు గెలిచారు..!
ఓపియం… నల్లమందు… ఆ పువ్వు అప్ఘన్ జాతీయ పుష్పం… ఓపియం… జాతీయ పంట… వీలైతే అధికారిక సేద్యంగా ప్రకటన… ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అప్థనిస్థాన్… ప్రభుత్వ వ్యవసాయ విధానం ప్రకటన… ఓపియం నూతన వంగడాలకు ప్రోత్సాహం… అధిక దిగుబడుల మీద దృష్టి… సస్యరక్షణకు కొత్త పథకాలు… కొత్త బీమా పథకాలు… ప్రత్యేకంగా ఓ మంత్రిత్వ శాఖ… అధిక గిట్టుబాటు ధరలకు ప్రత్యేక పథకాలు… ఓపియం వైపు మళ్లే రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు… రైతుబంధు, రైతుబీమా, తదితర పథకాలకు […]
అఫ్ఘన్ మహిళ వెన్నులో చలి..! తాలిబన్ విపత్తులో ఫస్ట్ బాధితురాలు తనే..!!
యుద్ధమే కాదు… ఏ విపత్తు వచ్చినా ముందుగా బలయ్యేది స్త్రీలు, పిల్లలు… ప్రకృతి విపత్తు కావచ్చు, మనిషి సృష్టించిన విపత్తు కావచ్చు… ఆకలి, అత్యాచారం, పీడన, మరణం, వలస, భయం, కన్నీళ్లు, కడుపుకోత… స్త్రీకే ఎక్కువ కష్టం… ఇప్పుడు అప్ఘన్ మహిళ గడగడా వణికిపోతోంది… మళ్లీ మేం చీకటియుగంలోకి ప్రయాణించాల్సిందేనా..? ఇదీ భయం… ఇదీ వణుకు… తాలిబన్ల పాలన వచ్చేసినట్టే… అంటే అఫ్ఘన్‌ను ఆ పాతరాతి యుగంలోకి నడిపించబోతున్నట్టే… ఆల్ రెడీ అఫ్ఘన్ మహిళలకు కష్టాలు ప్రారంభమైన […]
నాలుగేళ్లలో 8472 ఎన్కౌంటర్లు..! ఇండియన్ రోడ్రిగో యోగీ ఆదిత్యనాథ్..!!
ఏదైనా ఒక పోలీస్ ఎన్కౌంటర్ జరిగితే… సాధారణంగా రచ్చ రచ్చ అవుతుంది… వార్తలు, హక్కుల సంఘాలు, యాక్టివిస్టులు, డిబేట్లు, విచారణ డిమాండ్లు, బాధిత కుటుంబాల కన్నీళ్లు, కోపాలు, శాపాలు… అది రియల్ ఎన్కౌంటరైనా, ఫేక్ ఎన్కౌంటరైనా చర్చ ఉంటుంది… ప్రతి ఎన్కౌంటర్ చుట్టూ బోలెడన్ని క్రైమ్ కోణాలే కాదు, ఎమోషనల్, హ్యూమన్ అంశాలూ చుట్టుముట్టి ఉంటయ్… కానీ ఒక రాష్ట్రంలో పది కాదు, వంద కాదు, వెయ్యి కాదు… నాలుగేళ్లలో ఏకంగా 8472 ఎన్కౌంటర్లు… అసలు ఆ […]
తలవంచిన ట్విట్టర్… కాదు, ట్విట్టర్ మెడలు వంచిన మోడీ…
ట్విట్టర్ తలవంచింది… కాదు, కేంద్ర ప్రభుత్వమే దాని తలవంచింది… స్థూలంగా చూస్తే కనిపించేది ఇదే… అంతటి పెద్ద సోషల్ మీడియా సంస్థ, ఇక దశలో ‘మా కంపెనీ రూల్సే తప్ప మీ రూల్స్ మేం వినబోం’ అని అమెరికన్ కార్పొరేట్ మార్క్ బలుపు ప్రదర్శించిన సంస్థ… ఇప్పుడు హఠాత్తుగా తమ ఇండియా విభాగపు హెడ్ మనీష్ మహేశ్వరి పోస్టు ఊడబీకింది… ఇక చాల్లే ఉద్దరించింది అంటూ అమెరికాలో ఏదో ఓ రెవిన్యూ స్ట్రాటజీ అనే నాన్-ఫోకల్ పోస్టులోకి […]
సోషల్ కాలుష్యంలో పార్టీలు, మీడియా గిరగిర… గిలగిల… స్వయంకృతాపరాధాలే…
దిశ… మా పేరు వాడుకుంటూ, ఫేక్ పోస్టుల్లో మా లోగో వాడుతూ మమ్మల్ని బదనాం చేస్తున్నారు… మా జనాదరణను దెబ్బతీసే కుట్ర…. మేం న్యూట్రల్… మేం సూపర్… మేం ప్యూర్… ప్యూరర్, ప్యూరెస్ట్ తెలుసా… ఇది ఒక ఫస్ట్ పేజీ బ్యానర్ వార్త… వెలుగు… మా ట్రాన్స్పోర్ట్ వెహికిల్‌లో ఎవరో కుట్టుమిషన్లు గట్రా రవాణా చేసుకుంటుంటే, హుజూరాబాద్ ఓటర్ల కోసమేనని టీన్యూస్ బదనాం చేస్తోంది,.. కుట్ర… మా జనాదరణను దెబ్బతీసే కుట్ర… ఇది మరో ఫస్ట్ పేజీ […]
పులి వారసుడే…! కానీ ప్రాణమంతా బల్లులు, పాములు, చేపలు పీతలు, సాలీడులు…
అధికారంలో ఉన్న నాయకుల పిల్లలు తప్పనిసరిగా రాజకీయాల్లోకి రావాలా..? రావాలి…! లేకపోతే ‘‘పరివారం’’ ఊరుకోదు… లాగుతూనే ఉంటుంది… ఆయా పిల్లల వ్యక్తిగత అభిరుచులు ఏమైనా సరే, వాళ్లకు ఎదిగే ఇంట్రస్టు ఉన్న రంగాలు ఏవైనా సరే, వేరే ఫీల్డ్స్‌లో వాళ్లు మంచి వర్క్ చేస్తున్నా సరే… పాలిటిక్స్‌లోకి లాక్కొచ్చేస్తూనే ఉంటారు చుట్టూ ఉన్న జనం… కొన్నిసార్లు ఆయా పార్టీల అనివార్యతలు లాక్కొస్తాయి… బోలెడు ఉదాహరణలు… రాజీవ్‌గాంధీకి రాజకీయాలంటే పడవు… హాయిగా విమానాలు నడుపుకుంటూ ఉండేవాడు… రావల్సి వచ్చింది […]
ఎందుకేడ్చినట్టు..? కొరడా లేదా..? ఈ దేశ ఉపరాష్ట్రపతికీ బేలతనమేనా..?!
అసాధారణం ఏమీ కాదు… కానీ ఆశ్చర్యమేసింది…! రాజ్యసభలో సభ్యులు చైర్మన్ కుర్చీకి కాస్త దిగువన ఉండే టేబుళ్లపైకి ఎక్కి గొడవ చేసింది నిజం… అయితే అది అసాధారణమేమీ కాదు… ఉభయసభల్లో సభ్యుల బాధ్యతారహిత ప్రవర్తన కొత్తేమీ కాదు… ఆ లెక్కన బీజేపీ కూడా తక్కువేమీ కాదు… సభాస్థంభన పాపంలో అదీ తక్కువేమీ కాదు… అయితే రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కంటతడి పెట్టుకోవడమే ఆశ్చర్యంగా ఉంది… అసలు తన సుదీర్ఘమైన పార్లమెంటరీ జీవితంలో ఎన్ని చూడలేదు ఇలాంటివి..? […]
హమ్మయ్య.., ఇండియాకు నిజమైన స్వాతంత్య్రం వచ్చేసిందోచ్…
‘‘ఏ ఆజాదీ ఝూట్ హై’… దేశానికి స్వాతంత్య్రం వచ్చాక అప్పటి కమ్యూనిస్టు పార్టీ స్పందన ఇది… ఈ విముక్తి అబద్ధం, ఇది అసలు స్వాతంత్య్రమే కాదు అని 75 సంవత్సరాలుగా చెబుతూనే ఉన్నారు కమ్యూనిస్టులు… విడిపోయినా, సీపీఎం ఆ ధోరణికే కట్టుబడి ఉంది… అందుకే జాతీయ జెండా కూడా ఎగురవేయదు పార్టీ… పంద్రాగస్టు రోజున కూడా జాతీయ జెండాను పట్టించుకోదు… దేశమంతా ఒక విధిగా ఆరోజున జాతీయ పతాకాన్ని ఎగరేయడమో, సెల్యూట్ చేయడమో చూస్తుంటాం కదా… ఆ […]
‘‘అంగప్రవేశం’’ జరిగితేనే అత్యాచారమా..? కేరళ హైకోర్టులో ఇంట్రస్టింగ్ కేసు…!
ఇన్ సెన్సిటివ్ అయిపోతున్నామా..? నిజంగా చర్చించాల్సినవి, ఆందోళన పడాల్సినవి వదిలేసి… పక్క దోవల్లో పడి, కీలకాంశాల నుంచి తప్పించుకుని చాటుచాటుగా వెళ్లిపోతున్నామా..? మొన్నటి ఓ వార్త చదివితే అలాగే అనిపించింది… సొసైటీకి పెద్ద జాడ్యం- పిల్లలపై అత్యాచారాలు… మన దిక్కుమాలిన సినిమాల పుణ్యమాని… స్కూల్ ఏజ్ నుంచే కామాన్ని ఎక్కిస్తున్నామ్… ‘ఆ పని’ కోసం దేనికైనా తెగించాలనే ‘కుతి’ని దట్టిస్తున్నామ్… అది ఆడపిల్లల పాలిట నరకం అవుతోంది… కానీ దోషులను మనం శిక్షించగలుగుతున్నామా..? ఉన్న చట్టాలకే కొత్త […]
ఇది పంచుడు పథకం కాదు… అనాథలకు ఒక తల్లిగా… ఒక తండ్రిగా అండ…
రాజధర్మం అంటే…? కులానికి, ప్రాంతానికీ, వర్గానికీ అతీతంగా ప్రజల్ని ఆదుకోవడం… ఆదరించడం…! కానీ మనం ఎలా తయారయ్యాం..? వోటు బ్యాంకు కోసం రాజధర్మం కాదు, రాజకీయధర్మం మాత్రమే పాటిస్తున్నాం… రాజకీయం కోణంలో మాత్రమే సంక్షేమ పథకాలు, రాజకీయ లబ్ధి కోసం మాత్రమే పరిపాలన నిర్ణయాలు, స్వలాభం కోసమే అడుగులు… పైగా దాన్ని ఘనతగా వందిమాగధులతో కీర్తింపజేసుకుంటాం… పాలకుడికి మానవీయ కోణం ఉండాలి, అది కూడా మరిచిపోతున్న తీరు మరీ దారుణం… కరోనా కారణంగా వేల కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి… […]
నాడు మనవాడు చెవి కొరికేశాడు… నేడు మనవాడి భుజంపై పళ్లు దింపేశాడు…
ఒలింపిక్స్ అనగానే… అదొక అంతర్జాతీయ వేడుక, అంతా నాగరికంగానే జరుగుతుంది అనుకుంటే అది మన భ్రమ… ప్రతి ఆటా మరీ మడత నలగని ఫైట్లేమీ కాదు… ఒళ్లు హూనమయ్యేవీ బోలెడు… కానీ ఇది మరో టైపు… అనాగరికం అనే పదం సరిపోదు, ఇంకేదో వెతకాలి… పేరుకు మనం క్రీడాస్పూర్తి, తొక్కాతోలూ అని మాట్లాడుతూ ఉంటాం… ఒక్కసారి ఈ ఫోటో చూస్తే మనకు అర్థమవుతుంది కొందరు క్రీడాకారులు ఎంత కచ్చగా వ్యవహరిస్తారో… ఇది చూస్తే ప్రతి క్రీడాభిమాని మనసు […]
అచ్చం తెలుగు హీరో ఫైట్..! చివరి క్షణాల్లో ప్రత్యర్థిని ఊపిరి కూడా పీల్చనివ్వడు..!!
తరతరాలుగా మన తెలుగు సినిమాల్లో హీరో ఫైట్ ఎలా ఉంటుంది..? ముందుగా విలన్ మన హీరోను ఎగిరెగిరి తంతాడు… హీరో ఎక్కడికో వెళ్లి పడతాడు… ముక్కు నుంచో, మూతి నుంచో రెండోమూడో రక్తపు చుక్కలు కారతాయి… వాటిని ఖచ్చితంగా వేళ్లకు అంటించుకుని, హీరో తదేకంగా ఓసారి చూస్తాడు… నరాలు పొంగుతాయి, ముక్కుపుటాలు ఉబ్బుతాయి, కళ్లల్లో ఒకింత ఎర్రజీర మెరుస్తుంది… విలన్ మీద పడి ఉతికేస్తాడు… విలన్ బొక్కబోర్లా పడి మట్టికరుస్తాడు……….. ఇండియాకు మరో ఒలింపిక్ పతకాన్ని ఖాయం […]
దీన్ని నిజంగా క్రీడాస్పూర్తి అంటారా..? జాయింట్ గోల్డ్ మెడల్ ఓ చిక్కుప్రశ్నే…!!
ఏది నెగెటివ్…? ఏది పాజిటివ్..? ఒక కథనం ముందుగా చెప్పుకుందాం… ప్రపంచమంతా అద్భుతమైన స్పూర్తివంతమైన ఒలింపిక్ సీన్ అని కీర్తిస్తున్న వార్త ఇది… అసలు చిక్కు ప్రశ్న ఏమిటో తరువాత చెప్పుకుందాం… ఒలింపిక్స్‌లోనే కాదు, ఎక్కడైనా సరే గెలిచినవాడికి స్వర్ణం, ఓడినవాడికి రజతం… అంతే కదా… మరి పసిడి పతకాన్ని ఇద్దరూ కలిసి పంచుకుంటే..? అబ్బే, అదెప్పుడూ జరగలేదు అంటారా..? అప్పుడెప్పుడో గత శతాబ్దిలో 1912లో జరిగింది… మళ్లీ మొన్న జరిగింది… అది హైజంప్ ఈవెంట్… ఫైనల్స్… […]
200 మందిని ‘‘పడేసిన’’ సైబర్ డేరాబాబా..!! నిజానికి అసలు తప్పు ఎవరిది..?
ముందుగా ఒక వార్త చదవండి… సంక్షిప్తంగానే… పొద్దుటరు, గీతాశ్రమం వీథికి చెందిన చెన్నుపల్లి ప్రసన్నకుమార్ అలియాస్ ప్రశాంత్ రెడ్డి, అలియాస్ టోని… బీటెక్ ఫస్టియరే డ్రాపవుట్… చిన్న వయస్సు నుంచే చైన్ చోరీలు మరిగాడు… ఇళ్లకు కన్నాలు వేసి దొంగతనాలు చేసేవాడు… పొద్దుటూరు టూటౌన్, త్రిటౌన్, చాపాడు ఠాణాల పరిధుల్లో పలు కేసులు… జైలుకు కూడా వెళ్లొచ్చాడు… రౌడీ షీట్ కూడా ఓ ఠాణాలో నమోదై ఉంది… 23 ఏళ్లు కూడా నిండలేదు ఇంకా… ఫేస్బుక్, ఇన్‌స్టా, […]
సిద్ధూ సిక్సర్ల ఎఫెక్టేమో… పంజాబ్ సీఎం దిమాక్ ఏదో తేడా కొడుతోంది…
పంజాబ్ సీఎం దిమాక్లోని చటాక్ కూడా తగ్గిపోయినట్టుంది చూడబోతే..! నిజానికి పంజాబ్ ప్రజలు ఆటలు, సైన్యం విషయాల్లో బ్రాడ్‌గా వ్యవహరిస్తారని పేరు… కానీ అమరీందర్ సింగ్ వ్యవహారశైలిలో బాగా తేడా కొడుతోంది… నవజోత్ సింగ్ సిద్దూ కొడుతున్న సిక్సర్లు అమరీందర్‌ను బాగానే డిస్టర్బ్ చేస్తున్నట్టున్నయ్… విషయం ఏమిటంటే..? భారతీయ పురుషుల హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది… గ్రేట్… 49 ఏళ్ల తరువాత మళ్లీ మనం ఆనందించే ఓ విశేషం ఇది… సెమీస్ దాటడమే […]
మీరాబాయ్ హిందువే కాదట..! మరెవరు..? అసలు ఏమిటి శనమాహిజం..?!
ఒలింపిక్స్ మాత్రమే కాదు… ఎవరైనా ఏదైనా ఘనత సాధిస్తే చాలు… మన దేశంలో ప్రధానంగా వాళ్ల కులం ఏమిటో సెర్చ్ చేస్తారు… అదొక తుత్తి… తమ కులం వాళ్లయితే సోషల్ మీడియాలో డప్పులు కొట్టేస్తారు… సింధు కులం మీద నాలుగేళ్ల కిందటే భారీ చర్చలు, సెర్చులు జరిగాయి కాబట్టి ఈసారి ఆమెకు ఆ బెడద లేదు… కానీ ఒలింపిక్స్ రజత పతక విజేత, మణిపూర్‌కు చెందిన మీరాబాయ్ సైఖోమ్ చాను కులం, మతం మీద అకస్మాత్తుగా ట్విట్టర్లో […]
అన్నమే పరమౌషధం..! ఇకపై మార్కెట్లో పోషకాలు దట్టించిన బియ్యమే..!!
15 నుంచి 49 ఏళ్ల వయస్సు… అంటే తల్లులు కాగలిగే వయస్సు… మన దేశంలో ఈ వయస్సున్న మహిళల్లో సగం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు… తక్కువ హీమోగ్లోబిన్ వారిని పీడిస్తోంది… మూడోవంతు పిల్లల్లో సరైన ఎదుగుదల లేదు… కారణం, పౌష్టికాహారలోపం… కేంద్ర ప్రభుత్వం ఈ దురవస్థ నుంచి పిల్లల్ని, స్త్రీలను ఎంతోకొంత గట్టెక్కించడానికి ఓ కీలక నిర్ణయం తీసుకోబోతోంది… సబ్సిడీతో పంపిణీ చేసే రేషన్ బియ్యంతోపాటు హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు ఇచ్చే బియ్యంలో కూడా కొన్ని పోషకాల్ని […]
- « Previous Page
- 1
- …
- 119
- 120
- 121
- 122
- 123
- …
- 146
- Next Page »