రాజకీయాల్లో అన్నీ బాగుంటేనే… కొడుకు, బిడ్డ, అల్లుడు, బావమరిది ఎట్సెట్రా కుటుంబగణమంతా సుహృద్భావంతో కలిసిమెలిసి సాగుతూ అన్నీ దండుకుంటారు… ఎక్కడ తేడా వచ్చినా సరే, ఇక తమ్ముడు లేదు, బిడ్డ లేదు, బంధుగణం లేదు… తన్నుకోవడమే… అంతపుర కుట్రలుంటయ్, వెన్నుపోట్లు ఉంటయ్, కూలదోయడాలు, బొందపెట్టడాలూ ఉంటయ్… కులపార్టీలు, కుటుంబపార్టీలు అయితే ఈ జాడ్యాలు మరీ ఎక్కువ… ప్రతి ఒక్కడూ తమ పార్టీల్లో తమ కుటుంబసభ్యుల నీడను చూసి కూడా భయపడాల్సిందే… మన దేశంలో పార్టీల యవ్వారాన్ని అర్థం […]
హబ్బా.., ఎంత మాటంటివి జగన్… మా గుండెలను గాయపరిచినవ్…
‘‘ఎంత మాటంటివి జగన్… నువ్వేనా, ఇంత మాట అన్నది… నా గుండెను ఛిద్రం చేస్తివి కదా… నువ్వూ మా రామ్‌తో ఈక్వల్, దేవుడిచ్చిన బిడ్డవు అంటిని కదా… అలాంటిది నువ్వేనా నన్ను గాయపరిచే మాటలంటున్నది… ఏందీ..? తెలంగాణలో మీ ప్రజలున్నారు కాబట్టి సంయమనం పాటిస్తున్నావా..? ఆంధ్రోళ్లంతా నా ప్రజలే అని నేను ముందే చెప్పలేదా..? ఎన్ని వేల మంది ఆంధ్రోళ్ల కాళ్లలో ముళ్లు విరిగితే నా పంటితో పీకేశాను, గుర్తులేదా జగన్..? అంటే, ఏమైనా తేడా వస్తే […]
చిరంజీవి కాంగ్రెస్‌లోనే ఉన్నాడుట..! సరే, ఆ క్లారిటీ ఇవ్వాల్సింది ఎవరు సార్..?!
ఏపీ కాంగ్రెస్ జారీ చేసిన ఓ పత్రిక ప్రకటన నిజంగా నవ్వొచ్చేలా ఉంది… పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఊమెన్ చాందీ మొన్న ఎక్కడో మాట్లాడుతూ ‘‘చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో లేడు’’ అని కుండబద్ధలు కొట్టేశాడు… నిజంగానే చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు గనుక.., తన కేంద్ర మంత్రి పదవి పోయాక, రాష్ట్రం రెండుగా విడిపోయాక, తన రాజ్యసభ సభ్యత్వం గడువు ముగిశాక ఎప్పుడూ ఏ పార్టీ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు గనుక… ప్రజలు కూడా ఊమెన్ చాందీ […]
చంద్రుడి నీడకు సూరీడి మద్దతు..! ఇంకేముంది..? రేవంత్ దశతిరిగినట్టే…!!
అనుముల రేవంత్‌రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడయ్యాక చాలామందికి ఓ నమ్మకం కుదిరింది… కేసీయార్‌కు అమ్ముడుబోకుండా దూకుడుగా పోయే ఓ వ్యక్తికి పార్టీ హైకమాండ్ అవకాశమిచ్చింది, జనంలో కాస్త పాపులారిటీ కూడా ఉంది… కాంగ్రెస్ కేడర్‌లో ధైర్యాన్ని పెంచింది పార్టీ… అందరినీ కలుపుకుని పోతాడా, తన దైవసమానుడు చంద్రబాబు మార్గదర్శకత్వంలోనే పనిచేస్తాడా వంటి సందేహాలు, ప్రశ్నలు గట్రా వదిలేస్తే… కేసీయార్ మాయాచట్రం నుంచి టీపీసీసీ విముక్తం పొందిందనే ఓ విశ్వాసం బయల్దేరింది… అరె, అసలు జాతీయ స్థాయిలోనే కాంగ్రెస్ […]
మాణిక్యానికి నోట్లిస్తే పార్టీ పగ్గాలొస్తయా..? అబ్బే, ఆరోపణలో పంచ్ లేదు పటేలా..!!
ఇదేమీ ఉక్కుక్రమశిక్షణ కలిగిన పార్టీ ఏమీ కాదు… వెరీమచ్ లిబరల్… ఓవర్ డెమోక్రటిక్… పార్టీలోని స్వేచ్ఛ పార్టీవాదులకే భయం కలిగిస్తూ ఉంటుంది అప్పుడప్పుడూ… అంత స్వేచ్చ అన్నమాట… వచ్చేవాళ్లు వస్తుంటారు, పోయేవాళ్లు పోతుంటారు… కాంగ్రెస్ పార్టీ అంటేనే ఓ రైల్వే ప్లాట్ఫారం… ఇదేమీ కుటుంబ పార్టీయో, వ్యక్తి కేంద్రిత పార్టీయో, సిద్ధాంతాలు, రాద్ధాంతాల పార్టీయో కాదు… ఎప్పటికెయ్యది ప్రస్తుతమో ఆ నినాదం పట్టుకుని వెళ్తూనే ఉంటుంది… తాము ఆశించిన పదవులు, పార్టీ హోదాలు, టికెట్లు గట్రా రాకపోయినా […]
బావ కోసం… తుపాకీ, తూటా, పోరాటం, త్యాగం… ఓ విప్లవాత్మక ప్రేమకథ…
ఓ ప్రేమ కథ… ప్రేమ కోసం, బావ కోసం పోరాటంలోకి దూకిన ఓ మహిళ కథ… నిజమైన ప్రేమ… ఏ సినిమా కథకూ తీసిపోని కథ… సాక్షిలో వచ్చిన ఓ స్టోరీ చదవగానే అనిపించింది అలా… కానీ వెన్వెంటనే తన్నుకొచ్చిన ఇంకొన్ని ప్రశ్నలు… తను ఎంతగానో ప్రేమించిన బావ కోసం, తన ప్రేమ కోసం ఓ మహిళ ‘‘నేనూ పోరాడతా, నా బావ వెంటనే ఉండి పోరాడతా, నాకు పిల్లలు కూడా వద్దు’’ అనగానే… శెభాష్, ఛలో […]
జీసస్‌తో జగన్‌కు డైరెక్ట్ కమ్యూనికేషన్..!! దేవరహస్యం బట్టబయలు..!!!
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు పడదు… కారణాలు అనేకం ఉండొచ్చు… కులం కావచ్చు, పార్టీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు… రాధాకృష్ణను మొదటి నుంచీ జగన్ అస్సలు పట్టించుకోని తీరు కూడా ఓ బలమైన కారణం కావచ్చు… పెద్ద పెద్ద లీడర్లే నా దగ్గరకు వస్తారు, కలుస్తారు, ఈ పోరడు మొదటి నుంచీ నన్ను దేకడు, ఇంత పొగరా అనే ఓరకమైన ఆభిజాత్యం కూడా కావచ్చు… కాకపోవచ్చు… కానీ జగన్ అంటే రాధాకృష్ణకు అస్సలు పడదు, […]
దూకుడు ప్లేయరే..! కానీ టీం మాటేమిటి..? అసంతృప్త సీనియర్ల బాటేమిటి..?!
నిజమే, కాంగ్రెస్ హైకమాండ్ తప్పు చేసింది… ఆరేడేళ్లుగా అనేకానేక ఉపఎన్నికల్ని, ఎన్నికల్ని కేసీయార్‌కు ధారబోసిన ఉత్తమకుమార్‌రెడ్డిని హుజూరాబాద్ ఉపఎన్నిక అయిపోయేవరకూ ఉంచాల్సింది… తెలంగాణ కాంగ్రెస్ మీద ఓ చివరి ఇటుక పేర్చిన సంపూర్ణ ఖ్యాతి దక్కేది… తను ఎన్నిసార్లు రాజీనామాలు చేశాడో, ఎంతకాలంగా ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ వచ్చారో కాంగ్రెస్‌కే తెలియదు… అసలు జాతీయ స్థాయిలోనే ఆ పార్టీకి ఓ దిక్కూదివాణం లేకుండా పోయింది… తెలంగాణ శాఖ ఎంత..? వాస్తవం చెప్పాలంటే తెలంగాణ కాంగ్రెస్‌ను చంపీ చంపీ, […]
Congress నేతలతో KCR ఆత్మీయభాషణ..! ఔనూ, ఏం మాట్లాడుకుని ఉంటారు..?
ఏమిటీ..? అసలేం జరుగుతోంది..? తన సొంత ఎమ్మెల్యేలు, మంత్రులకే సరిగ్గా టైం ఇవ్వడు కేసీయార్, విపక్ష నేతల్ని పురుగుల్లాగా చూస్తాడు, సన్నాసులు పదం దగ్గర్నుంచి నానా పరుష పదాలూ వాడేసి వెక్కిరిస్తాడు… తనంతట తనే పిలిచి మాట్లాడుతున్నాడు..? ఏమైంది తనకు..? ప్రగతి భవన్‌లోకి చాలామందికి ఎంట్రీ లభిస్తోంది, ఏమిటీ వైపరీత్యం..? మరియమ్మ కుటుంబానికి ఇతోధిక సాయం అంటున్నాడు, దళితులపై చేయిపడితే తాటతీస్తా అంటున్నాడు… క్యాహోరహా ఆజ్కల్..? అఖిలపక్ష భేటీ అంటున్నాడు, దళిత సంక్షేమ పథకాల సమీక్ష, అందరి […]
ఎర్ర పార్టీ ఐతేనేం..? ఈమె కూడా లీడరేగా..! ఆ భాషే తెలుసు ఆమెకు… చివరికి..?!
ఇన్సెన్సిటివ్… సమస్య సున్నితత్వం కూడా అర్థం చేసుకోకుండా పిచ్చి వ్యాఖ్యలు చేయడం, దురుసుగా వ్యవహరించడంలో ఎర్ర పార్టీ, గులాబీ పార్టీ, కాషాయ పార్టీ, పచ్చ పార్టీ అని భేదాలేమీ ఉండవ్… బేసిక్‌గా రాజకీయ నాయకులందరూ అలాంటోళ్లే… రాజకీయాల్లోకి వచ్చాక అలా తయారవుతారో లేక అలాంటోళ్లు మాత్రమే రాజకీయాల్లో నెగ్గుకొస్తారో తెలియదు గానీ… కొందరి వ్యవహార ధోరణి చివరకు ఆ పార్టీ పెద్దలను కూడా చిరాకుపట్టిస్తయ్, సమర్థించడానికి కూడా ఇబ్బందిని క్రియేట్ చేస్తయ్… ఎంసీ జోసెఫిన్ అని కేరళలో […]
నాన్న పేరు లేదు, పార్టీ రంగుల్లేవు, జాకెట్ యాడ్స్ లేవు… ఎన్న సామీ ఇటు..!!
ఎందుకు మెచ్చుకోకూడదు..? స్టాలిన్‌ను ఇన్నేళ్లూ కరుణానిధి కొడుకు అనే చట్రంలోనే చూశాం… తండ్రి చాటు కొడుకు… పాలనలో తన నిర్ణయాధికారం ఏమీ లేదు… డీఎంకే గత పాలన తీరూతెన్నూకు స్టాలిన్ జవాబుదారీ కాదు, ఓనరూ కాదు… ఇప్పటి ప్రభుత్వం తనది, ఇప్పటి గెలుపు తనది… సీట్ల పొత్తులు, అభ్యర్థుల ఎంపిక, ప్రచారం పూర్తిగా తన శ్రమ, తన ప్రయాస, తన బుర్ర… అందుకే ఇప్పుడు ఈ ప్రభుత్వ ప్రతి నిర్ణయానికీ స్టాలిన్ బాధ్యుడు… ఇప్పటివరకైతే ప్రతి అడుగూ […]
రాజనీతిజ్ఞతా..? అంటే ఏమిటి..? మన తెలంగాణ ఇప్పటికీ ఓ శాపగ్రస్త..!
ఒక గొప్ప అవకాశం… నెత్తుటిచుక్క చిందకుండా… ప్రజాస్వామిక, గాంధేయ పద్ధతుల్లో సాధించిన ఓ ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ… కేసీయార్ శుక్రమహర్దశో, కాలానుగ్రహమో… తనే దీన్ని సాధించాడనే పేరొచ్చింది… తన జీవితానికి ఇంకేం కావాలి..? ఉద్యమవేళ ఏం చేశాడో వదిలేస్తే, ఒక మహానేతగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే బంగారు అవకాశం… కానీ తన వంద తరాలు సుఖంగా కూర్చుని తన పరివారమే బతకాలనే ఓ దురాశ దేనికి…!? సర్లే, మనకెందుకు…? తన వ్యక్తిత్వంలోనే ఏదో తేడా… వక్రమార్గం పట్టిన […]
ఐననూ పోయిరావలె హస్తినకు..! కాశ్మీర్ పార్టీలు వద్దనలేవు- వద్దన్నా ఏదీ ఆగదు..!!
చాలామందికి అర్థం కానిదేమిటీ అంటే..? జమ్ము కాశ్మీర్లో నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించడం ఏమిటి..?! ఆ అవసరం ఏమొచ్చింది..? నిజానికి 2026 వరకు ఎక్కడా నియోజకవర్గాల్లో మార్పులు జరగకుండా ఎన్నికల సంఘం ఫ్రీజింగు పెట్టుకుంది కదా… మరి ఇక్కడ కథేమిటి..? మీడియాలో పెద్ద పెద్ద వ్యాసాలు వస్తున్నయ్… ప్రధానంగా జాతీయ మీడియాలో..! ఒక్కసారి కాస్త సరళంగా చెప్పుకుందాం మనం… ముందుగా నిన్న మోడీ సమక్షంలో జరిగిన అఖిల పక్షం కథేమిటో చూద్దాం… ఆర్టికల్ 370 ఎత్తిపారేసినప్పుడే కేంద్రం స్పష్టంగా చెప్పింది… […]
డెల్టా ప్లస్ సోకితే ఇక చావేనా..? ఏది నిజం? ఏది అబద్దం?
వాస్తవాలు – అపోహలు : వాసిరెడ్డి అమర్నాథ్ డెల్టా ప్లస్ ఇమ్యూన్ ఎస్కేప్ అని .. వాక్సిన్ వేసుకొన్న వారు , తోలి వేవ్ లో, రెండో వేవ్ లో కరోనా సోకిన వారు కూడా సేఫ్ కాదని దీని వల్ల మారణహోమం జరగనుందని విపరీతంగా ప్రచారం జరుగుతోంది . దీనికి సంబంధించి ఇప్పటిదాకా అందులోబాటులో ఉన్న సమాచారం .. ఇది మార్చ్ నెలలోనే ఇంగ్లాండ్ లో కనిపించింది . జూన్ నెల లో ఇంగ్లాండ్ లో […]
తదుపరి ప్రధాని ఎవరు..? ఓ ఆసక్తికరమైన సర్వే ఏం చెప్పిందంటే..?
ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ప్రజాస్వామ్యం మనది… పలు దేశాల్లో పలురకాల డెమోక్రసీలున్నయ్… కానీ మనది బహుళ పార్టీ వ్యవస్థ… అంటే ప్రజల ఎదుట పరిమిత ఆప్షన్స్ గాకుండా ఎక్కువ ఆప్షన్స్ ఉంటయ్… ఈ దేశపు అత్యున్నత ప్రధాని పీఠం ఎక్కాలనే కోరిక ఉన్న నాయకులు కోకొల్లలు… కెపాసిటీ అనేది మరిచిపొండి, కొన్నిసార్లు నంబర్లాటలో తగిలినా తగలొచ్చు లాటరీ… దేవెగౌడ, చంద్రశేఖర్, గుజ్రాల్… వీళ్లంతా ఆ గజమాల అనుకోకుండా మెడలో పడిన ప్రధానులే కదా… ఏదో ఓ రాష్ట్రంలో […]
ఫ్రంటు లేదు, ఏ కొత్త టెంటూ రాలేదు… ఊదు కాలదు, పీరు లేవదు…
ముందుగా చిన్న డౌట్… యాంటీ మోడీ, యాంటీ బీజేపీ కూటమి అవసరమేననీ… బలమైన విపక్షం లేకపోతే ప్రజాస్వామ్యానికి బలమెక్కడిది అనీ గుర్తుచేసుకుందాం… ప్రధాని కావాలని ఎన్నేళ్లుగానో కలలు మాత్రమే కనగలుగుతున్న శరద్ పవార్ ఇంట్లో కొందరు భేటీ వేశారు… మోడీ మీద కత్తులు ఎలా తిప్పాలో మంతనాలు చేశారు… ఇది నిర్వహించింది ఎవరు..? యశ్వంత్ సిన్హా…! ఆయన ఎవరు..? మోడీ వీరవ్యతిరేకుడు..! ఆయనకు ఎందుకు కోపం..? మోడీ పవర్లోకి రాగానే ఈయన్ని అద్వానీ తదితరులతోపాటు అమాంతం అటకమీద […]
హాస్పిటళ్లలో గుండెలు ఎందుకు హఠాత్తుగా ఆగిపోతున్నయ్..? ఇదేనా రీజన్..?!
…… By….. Vanaja C……. చిన్న పొరపాటు – పెద్దమూల్యం….. దాదాపు నయం అయిందనుకున్న రవీందర్ కార్డియాక్ అరెస్ట్ తో పోవటంతో ఏం జరిగి ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేస్తే అనుమానించిందే నిజం అయింది. ఆక్సిజన్ మీద ఉన్న రవీందర్ ఆ ఉదయం జావ కోసం మాస్క్ తీశాడు. జావ తాగటానికి 15 నిమిషాలు పట్టింది. అంతసేపూ మాస్క్ లేకుండా ఉన్నాడు. ఏదన్నా తినగానే శరీరానికి ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది. అసలు తినటానికయినా సరే అంత […]
రాహుల్ అంటే అంతే..! అప్పట్లో హిమంత్… ఇప్పుడు హేమంత్… పరాభవం…!!
హిమంత్ విశ్వశర్మ…తెలుసు కదా… అస్సోం ముఖ్యమంత్రి… ఒకప్పుడు కాంగ్రెసే… ఓసారి రాష్ట్ర పార్టీ వ్యవహారాలు చర్చించడానికి రాహుల్ నివాసానికి వెళ్తే… పెంపుడు కుక్కలకు బిస్కెట్లు విసురుతూ… హిమంత్ టీంను పట్టించుకోకుండా… అవమానకరంగా వ్యవహరించాడు… సీన్ కట్ చేస్తే… హిమంత్ ఇప్పుడు ముఖ్యమంత్రి… కాంగ్రెస్ దారుణమైన పరాజయం… ఇప్పట్లో కాంగ్రెస్ అక్కడ బాగుపడే సీన్ లేదు… ఓసారి జగన్‌ను ఢిల్లీకి పిలిచి సోనియా అవమానకరంగా మాట్లాడింది, ఏమైంది..? ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి… ఏపీలో కాంగ్రస్ పత్తాజాడా లేకుండా పోయింది… […]
స్టాలిన్ మరో తెలివైన నిర్ణయం… తమిళ ఖజానాకు కొత్తగా ప్రొఫెషనల్ డైరెక్షన్…
రాజకీయాల్లో… పరిపాలనలో… సమర్థ నిర్ణయాలు తీసుకోవడమే కాదు, తీసుకుంటున్నట్టు ప్రజలకు కనిపించడం కూడా ప్రధానమే..! అది ప్రభుత్వంపై ఓ విశ్వాసాన్ని పెంచుతుంది… ‘‘నేనే భారీ ప్రాజెక్టుల డిజైన్లు గీస్తా, కాంటూరు లెవల్స్ లెక్క తీస్తా, నేనే బిల్డింగుల ప్లాన్లు గీస్తా, నేనే బడ్జెట్ రాసిస్తా…’’ అనేంత పరమాద్భుత జ్ఞాన ముఖ్యమంత్రుల్ని కాసేపు పక్కన పెడితే… తాజాగా తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇంట్రస్టింగు… తమ ప్రభుత్వానికి, తమ రాష్ట్రానికి ఓ ఆర్థిక సలహా మండలిని వేశాడు సీఎం […]
ఫెరోజ్..! ఏ మతమైతేనేం..? ఎందుకు బజారుకు లాగుతోంది కాషాయశిబిరం..!?
మిత్రుడు BT Govinda Reddy… ఏమంటున్నాడో ముందుగా చదవండి… ‘‘ఇందిరా గాంధీ భర్త ఫెరోజ్ గాంధీని ఫెరోజ్ ఖాన్ అని ముస్లింగా చిత్రీకరిస్తూ ఈ మధ్య సోషల్ మీడియాలో తరచూ పోస్టింగులు కనిపిస్తున్నాయి. ఆ వారసత్వం వల్లే ఆయన కోడలు సోనియా, మనవడు రాహుల్ లు ముస్లింలకు అనుకూలంగా వ్యవహరిస్తారని అవగాహన లేని కొందరు (బహుశా ఆరెస్సెస్ భావజాలం కలిగిన వారై ఉంటారు) విష ప్రచారానికి పూనుకోవడం బాధ కలిగిస్తోంది. రాజకీయాల సంగతి ఎట్లా ఉన్నా, సిసలైన దేశ […]
- « Previous Page
- 1
- …
- 126
- 127
- 128
- 129
- 130
- …
- 149
- Next Page »