తమిళనాడు సీఎం స్టాలిన్‌కు ఎక్కడో కాలింది… ఠాట్, నా మంత్రి మీద ఈడీ కేసు పెడుతుందా, ఏమిటీ నాన్సెన్స్, అప్రజాస్వామికం, దారుణం, మోడీ నియంతృత్వం నశించాలి అని గొంతు చించుకున్నాడు… తన మంత్రి మీద ఈడీ కేసు పెడితే మొత్తం భారతదేశమే అల్లకల్లోలం అయిపోనట్టు మొత్తుకుంటున్నాడు… అంతేనా..? ఇతర అవినీతి సీఎంల్లాగే సీబీఐ తన రాష్ట్రానికి రావద్దని హుకుం జారీచేశాడు అధికారికంగానే… అసలు తనకు ఎందుకు మండుతోంది..? ఉంది, చాలా కథ ఉంది… సీబీఐ కేంద్ర దర్యాప్తు […]
ఐపీఎల్లో వేలుపెట్టాడు… అంత పెద్ద సామ్రాజ్యం కుప్పకూలింది… అరెస్టయ్యాడు…
Murali Buddha……… తనను తానే ఓడించుకున్న డీసీ రెడ్డి…. తెలంగాణ ఆత్మ ఆంధ్రభూమి… జర్నలిస్ట్ జ్ఞాపకాలు – ….. ప్రత్యర్థి పై విజయం సాధిస్తే వీరుడు . తనపై తానే విజయం సాధిస్తే మహావీరుడు . వీరుడు కావడం కన్నా మహావీరుడు కావడం చాలా కష్టం . అందుకే మహావీరుడు దేవుడిగా పూజలు అందుకుంటున్నాడు . మరి తనను తానే ఓడించుకున్న వారిని ఏమనాలి ? ఉదయమే టివిలో డిసి ప్రమోటర్లను అరెస్ట్ చేసిన ఈడీ అనే […]
మళ్లీ బీజేపీ నెత్తిన టీడీపీ..? అమిత్‌షా అడుగులన్నీ చెప్పే ముచ్చట ఇదేనా..?!
ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళిని, ఆంధ్రజ్యోతి ఓనర్ రాధాకృష్ణను కేంద్ర హోం మంత్రి, బీజేపీ హైకమాండ్ సారథి అమిత్ షా మహాజన సంపర్క్ కార్యక్రమంలో భాగంగా కలవబోతున్నాడు… పైకి చూస్తే అందులో పెద్ద విశేషం అనిపించదు … కానీ బీజేపీ కేంద్ర ముఖ్యుడు ఎటు కదిలినా, ఏ అడుగు వేసినా దాని వెనుక ఏదో మర్మం ఉంటుంది… అది రాజకీయ సంబంధమే అయి ఉంటుంది… సరే, రాజమౌళి తండ్రి ఆల్రెడీ బీజేపీతోనే ఉన్నాడు, రాజ్యసభ కూడా కొట్టాడు… సో, […]
టీవీ9లో కీలక వికెట్లు టపటపా… కళ్లప్పగించి చూస్తున్న మేనేజ్మెంట్…
ఎన్టీవీ, టీవీ9 తెలుగు ప్రధాన చానెళ్లు బజారుకెక్కి మరీ డిష్యూం డిష్యూం అని మైకులు పట్టుకుని కొట్టుకుంటున్న తీరు చూశాం, చదివాం, వింటున్నాం… స్థూలంగా చెప్పాలంటే రెండు టీవీల యాజమాన్యాలు దాదాపు సేమ్… అయినా ఎందుకు తన్నుకుంటున్నయ్… అదో మిస్టరీ… సరే, ఎన్టీవీని పడగొట్టి, టీవీ9 తిరిగి తన పాత నంబర్ వన్ స్థానానికి చేరాక, ఏదో సాధించినట్టు, గిన్నీస్ రికార్డు ఏదో సంపాదించినట్టు దాదాపు 2 కోట్లతో రెండు రాష్ట్రాలవ్యాప్తంగా హోర్డింగులు, బిల్ బోర్డులతో ప్రచారం […]
ప్చ్… TSPSC గ్రూపు వన్ ప్రశ్నాపత్రంలో నాణ్యత లేదు… కమిషన్ ఫెయిల్డ్…
అనేకానేక వివాదాలు, లీకుల తలనొప్పులు, సుదీర్ఘ కాలయాపన తరువాత ఎట్టకేలకు టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించింది… అనేక మంది నిరుద్యోగుల కల గ్రూప్- వన్… మరి ఈ పరీక్షపత్రం ఎలా ఉంది..? కాషాయ బ్యాచ్ ఆల్రెడీ దీన్ని తిట్టిపోసింది… కృత్రిమ సెక్యులర్ ప్రశ్నపత్రం అంటూ ఆడిపోసుకుంది… నిజానికి ఈ పరీక్షపత్రం ఎలా ఉంది..? నిజంగా నాణ్యమైన పరీక్షపత్రమేనా..? అభ్యర్థుల తెలివితేటల్ని నిగ్గుతేల్చే సత్తా ఉన్నదేనా..? సోషల్ మీడియాలో మిత్రుడు Sampath Rao Pulluri …. రాసిన […]
మస్తు దమ్ముంది సరే ఆంధ్రజ్యోతీ… జాతీయ నాలుగో ప్లేసుకు ఆధారమేమిటి..?
ఆంధ్రజ్యోతి పత్రికలో ఫస్ట్ పేజీలో ఓ న్యూస్ బిట్ కనిపించింది… ఆశ్చర్యపరిచింది… సాక్షి ప్రతి అంశాన్నీ చంద్రబాబుకు ముడిపెట్టిన ధోరణిలోనే… ఆంధ్రజ్యోతి తన గొప్పతనానికి కూడా జగన్‌ను తిట్టేసింది… జగన్ ఎంత తొక్కాలని ప్రయత్నించినా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నామని చెప్పుకుంది… ఎందుకొచ్చిన ఈ పిచ్చి ప్రచారవార్తలు డియర్ రాధాకృష్ణ సర్…? ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త సారాంశం ఏమిటయ్యా అంటే… ఏబీఎన్ ప్రసారాలకు జగన్ అడుగడుగునా అడ్డుపడుతున్నాడు… ఐనాసరే జనం ఆదరిస్తున్నారు… జగన్ ధోరణిని చీదరించుకుంటున్నారు… ప్రస్తుతం ఏబీఎన్ రేంజ్ […]
డొల్ల వాదన… శుష్క ప్రచారం… జియ్యర్‌పై దాడి వెనుక మర్మమేంటో…!!
ఆంధ్రజ్యోతి మరీ ఇలా దిగజారిపోయిందేమిటి హఠాత్తుగా… రెండు స్టోరీలు చూశాక అనిపించింది ఇదే… చినజియ్యర్ మేనల్లుడు విష్ణు లీలలు అని ఆంధ్రజ్యోతిలో బొంబాట్ చేశారు ఒక స్టోరీ… ఏబీఎన్‌లో అదే స్టోరీ… తరువాత ఎవరో మహిళను హతమార్చిన పూజారినీ ఈ జియ్యర్ మేనల్లుడినీ కలిపేసి ‘స్వాముల’పై ఏబీఎన్‌లో ఓ డిబేట్… ఈ జియ్యర్ స్టోరీ పక్కా ప్లాంటెడ్ అనిపిస్తోంది… ఆంధ్రజ్యోతి పరిశోధన అని గొప్పగా రాసుకున్నారు గానీ మరీ నాసిరకం స్టోరీ… ఎవరో పనిగట్టుకుని, ఏదో మార్మిక […]
Sugar India… ప్రతి ఇద్దరిలో ఒకరికి హైబీపీ… ముగ్గురిలో ఒకరికి సుగర్ లక్షణాలు…
ఎవరో ఏదో సర్వే చేస్తారు… గుడ్డిగా మీడియా వాళ్లు రాసేస్తారు… కనీసం ఏజెన్సీ కాపీల్లో (న్యూస్ ఏజెన్సీలు అందరికీ పంపే కంటెంట్) ఏముందో, నిజానిజాలు ఏమిటో, తప్పులు ఏమిటో, మనవాళ్లకు ఏది అవసరమో కూడా ఆలోచించకుండా తెలుగు మీడియా గుడ్డిగా జనంలోకి తీసుకెళ్తుంది… దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ ఈరోజు పత్రికల్లో సుగర్ వ్యాధితీవ్రత మీద కథనం… నిజం… దేశంలో సుగర్, బీపీ, ఒబెసిటీ, హైకొలెస్ట్రాల్ వంటి వ్యాధుల తీవ్రత బాగా పెరుగుతోంది… ఎయిమ్స్, ఐసీఎంఆర్, మద్రాస్ కౌన్సిల్ […]
యాంటీ మోడీ కూటమి సాధ్యం కాదట… కలిసి మందగా ఎదుర్కుంటారట…
నిజంగానే మంచి ఆలోచన… ఓ బలమైన ప్రతిపక్షం అవతరిస్తే తప్ప అధికారపక్షం నేల మీదకు దిగిరాదు… 450 సీట్లలో బీజేపీకి పోటీగా ఎవరో ఒకరే బీజేపీయేతర అభ్యర్థి ఉండాలి, మిగతా ప్రతిపక్షాలన్నీ ఈ సూత్రానికి మద్దతునిచ్చి, మరో అభ్యర్థిని పోటీగా పెట్టకూడదు… స్థూలంగా చూస్తే సూపర్ ప్లాన్ ఇది… కానీ..? అప్పట్లో ఇందిరాగాంధీని నేలమీదకు దించిన జనతా ప్రయోగం గుర్తొచ్చింది… ఆ వెంటనే అది చీలికలు పేలికలుగా చినిగిపోయిన తీరూ గుర్తొచ్చింది… పగలబడి నవ్విన ఇందిర నవ్వు […]
ఆదిపురుష్ తిరుమల ముద్దుకూ అనసూయ బజారు ముద్దుకూ తేడా లేదా..?!
ఒక ముద్దు… అదేమీ రొమాన్స్‌తో ముడిపడింది కాదు… స్నేహపూర్వకంగా బైబై చెబుతూ, మర్యాదపూర్వకంగా హగ్ చేసుకుని, బుగ్గపై చిన్న అంటీఅంటకుండా స్పృశించిన ముద్దు… నిజానికి ఇందులో అశ్లీలం లేదు, కామకాంక్ష లేదు… అదే ఉంటే ఆ పవిత్ర ప్రదేశంలో, అంత బహిరంగంగా ఎందుకు చేస్తారు..? అంతగా ముద్దులు మురిపాలు కావల్సి వస్తే… ఆ సినీస్నేహితులకు ప్రదేశాలు కరువా..? ఎవరెన్ని విమర్శలు చేసినా సరే, ఆ ముద్దులో తప్పు లేదనేది ఒక వాదన… ఆదిపురుష్ వివాదాల్లో మరొకటి జతచేరింది… […]
హామీలు ఇచ్చి పడేశారు… ఇప్పుడు కోతలు, కత్తిరింపులు ఆలోచిస్తున్నారు…
కర్నాటక వోటర్లు కాంగ్రెస్ ఇచ్చిన ఉచిత హామీలను నమ్మి, వాటి మీద ఆశతో వోట్లేశారా..? లేక బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు, నాయకత్వ లోపాలతో విసిగిపోయి కాంగ్రెస్ వైపు మళ్లారా..? చిన్న తేడా ఉంటుంది… బీజేపీని ఓడించారా..? కాంగ్రెస్‌ను గెలిపించారా…? ఈ ప్రశ్నలకు జవాబులు కష్టం… ఉదాహరణకు… ఏపీ ఏర్పడిన కొత్తలో 2014 ఎన్నికల్లో రైతుల రుణమాఫీ వంటి చంద్రబాబు హామీలు ఏపీ రైతుల మీద ప్రభావం చూపించాయి, గెలిచాడు… 2019 ఎన్నికల ముందు పసుపు కుంకుమ వంటి […]
‘మోడీ గోకుడు’ ప్రహసనానికి కేసీయార్ విరామం… సరెండర్ అయినట్టేనా..?!
మోడీకి కేసీయార్ సరెండర్…. ఇదే కదా ఆంధ్రజ్యోతి మొన్నటి ఆదివారం ఆ పత్రిక ఓనర్ రాసిన పెద్ద ‘కొత్త పలుకు’ వ్యాసానికి శీర్షిక… అందులో ఏమని రాశాడో గుర్తుందా..? ‘‘మోడీకి కేసీయార్ సరెండరయ్యాడు… కేసీయార్ జగన్ ద్వారా పావులు కదిపితే… ఇటు అవినాష్ రెడ్డీ సేఫ్… అటు కవిత సేఫ్… బీజేపీ ఇక ఫుల్లుగా కేజ్రీవాల్ మీదే కాన్సంట్రేట్ చేస్తుంది… ఎందుకంటే తన ప్రాబల్యం ఉన్న రాష్ట్రాల్లో కేజ్రీవాల్ కొరకరాని కొయ్య అయిపోయాడు… అందుకే మోడీ కాన్సంట్రేషన్ […]
అత్యాచార సంస్కృతికి ఆజ్యం… తెలుగు సినిమా పాటల అగ్లీతనం…
మన సినెమా పాటల్లోనే బోలెడంత రేపిజం, బోలెడంత మంది అత్యాచారులు, లెక్కలేనన్ని అత్యాచారాలూ …ఇదిగిదిగో!!!.. ఓరోరి యోగి నన్ నలిపెయ్రోఓరోరి యోగి నన్ పిసికెయ్రోఓరోరి యోగి నన్ చిదిమెయ్రోఓరోరి యోగి నన్ కుదిపెయ్రో మరేం చేస్తాడు వాడు డెబ్బయ్యేళ్ళ ముసల్దనీ చూడకుండా నలిపి చిదిమి కుదిమేసిండు పూలదుకాణం దాటిపాలడిపో మీదుగాఅట్టట్టా దిగివస్తేఅక్కడెఅక్కడె మా ఇల్లు.. వాడిదేం తప్పు జడలో పూలు దుకాణం అనీపాలడిపో అంటే స్థన్యం అనీదిగివస్తే ఇంకేదో ఉంటదనీ తెలుసుకోవడానికి తొమ్మిదేళ్ళ అమ్మాయే అని కూడా […]
పోలవరంలో ఏమిటీ గైడ్ బండ్..? ఎందుకు ఇది..? ఆ రెండు వార్తల విశ్లేషణ…
Siva Racharla……… పోలవరం – గైడ్ బండ్…… ఈ రోజు పోలవరం మీద రెండు వార్తలు , 1. 12,911 కోట్ల రూపాయలు అదనంగా ఇస్తామని కేంద్ర ఆర్ధిక ప్రకటించింది. 2. గైడ్ బండ్ కుంగింది పోలవరం అంటే ఒక బ్రహ్మ పదార్ధం ప్రచారానికి విరుగుడుగా సోషల్ మీడియా ద్వారా బాగానే సబ్జెక్టు మీద ఆర్టికల్స్ పడ్డాయి. ఈ రోజు వరకు ఏ డిబేట్ లో చర్చకు రాని “గైడ్ బండ్” మీద వార్త రావటం జరిగింది. […]
ఇంతకీ చిరంజీవి ‘‘చికిత్స చేయించుకున్న’’ ఆ అనారోగ్య సమస్య ఏమిటో తెలుసా..?
తనకు కేన్సర్ అనీ, చికిత్స ద్వారా నయం చేయించుకున్నానని చిరంజీవి చెప్పినట్టుగా మెయిన్ స్ట్రీమ్ సైట్లు, యూట్యూబ్ చానెళ్లు రాసిపారేశాయి… టీవీలు కూడా కవర్ చేశాయి… నిజంగా చిరంజీవి అలాగే చెప్పి ఉన్నట్టయితే, ఈ కంటెంట్ రైటర్లు, ట్యూబర్లతోసహా అందరికీ అది పెద్ద వార్తే… దాంతో అందరూ రాసిపారేశారు… వాళ్లను తప్పుపట్టే పనిలేదు… కేన్సర్ అనే పదం చిరంజీవి నోటి వెంట వినగానే… ఆ పదం మీద, చిరంజీవి ఏం చెప్పాడనే విషయంపైన కొంత వర్క్ జరగాలి […]
ఉత్సవాల్లో నమస్తే హిందు… తెలుగు ప్రాంతీయ పత్రికలు వంద రెట్లు బెటర్..!!
రాహుల్ అనే ఓ సీనియర్ జర్నలిస్టు… కేసీయార్ తన ప్రెస్మీట్లలో రాహుల్‌ను పేరుపెట్టి పిలిచి మరీ ప్రస్తావించేవాడు… తను రిటైరయ్యాడు… కేసీయార్ ఉదారంగా ఏదో ఓ పదవి ఇస్తాడనే ప్రచారం నిన్న సోషల్ మీడియాలో బాగా సాగింది… ఉద్యోగి అన్న తరువాత రిటైర్ కావడం సహజం… దాని మీద ఈ చర్చ కూడా అనవసరం… కేసీయార్ తనకు పదవి ఇవ్వాలనుకుంటే ఎప్పుడో ఇచ్చేసేవాడు బహుశా… కానీ రాహుల్ మీద చర్చించిన సోషల్ మీడియా సదరు పత్రిక ఆఫీసును […]
ఆక్రందనలింకా ఆగనేలేదు… అప్పుడే పొలిటికల్ గద్దలు నోళ్లు విప్పినయ్…
క్షుద్ర రాజకీయాలు మళ్లీ ఆరంభమయ్యాయి… బాలాసోర్ రైల్వే ప్రమాదంలో మృతుల శవాలు ఇంకా బోగీల కిందే ఉండిపోయాయి… తీవ్రంగా గాయపడిన వాళ్ల ఆక్రందనలు కొనసాగుతూనే ఉన్నాయి… రాష్ట్ర, కేంద్ర విపత్తు దళాలు అవిశ్రాంతంగా సహాయకచర్యల్లో శ్రమిస్తూనే ఉన్నాయి… అప్పుడే టీఎంసీ మొదలు పెట్టింది… మమతా బెనర్జీకి ఏమూలో బుర్రలో కాస్త గుజ్జు ఉందనే డౌటుండేది… అదీ లేదని ఇప్పుడు స్పష్టమైంది… 300 మందికి పైగా (ఇంకా ఎక్కువే ఉంటారు) మరణించిన ఘోర ప్రమాదం ఇది… నాలుగు రాష్ట్రాల […]
ఈ కోట్ల ప్రజాధనానికి సార్థకత ఏమున్నట్టు..? పైగా అందులోనూ వివక్ష..!!
ఒక ప్రభుత్వం పత్రికలకు తన గొప్పతనాన్ని తనే పొగుడుకుంటూ ఎందుకు యాడ్స్ ఇవ్వాలి..? దాంతో ప్రజలకు ఒరిగేదేమిటి..? వాటికి ప్రజాధనం ఎందుకు ఖర్చు చేయాలి..? ఇవన్నీ బేసిక్ ప్రశ్నలు… మన పాలకుల నుంచి సమాధానం ఆశించలేం కాబట్టి… ఆ ప్రశ్నలను పక్కన పెట్టేయండి… ఒకప్పుడు సీఎం ఇమేజీ కోసం దేశంలోని అనేక భాషల్లో, అనేక ప్రాంతాల్లో పత్రికలకు కూడా వందల కోట్ల తెలంగాణ ప్రజల సొమ్మును ఖర్చు చేసిన ఉదాహరణలు కూడా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర అవతరణ […]
కెనడాలో మాఫియా వార్… టాప్ ఎలెవన్ గ్యాంగ్స్టర్లలో 9 మంది పంజాబీలే…
షకీల్ బస్రా, అమర్‌ప్రీత్ సమ్రా, జగదీప్ చీమా, రవీందర్ సమ్రా, బరిందర్ ధలివాల్, గురుప్రీత్ ధలివాల్, సమరూప్ గిల్, సుఖదీప్ పన్సల్, సమదీష్ గిల్, ఆండీ పియెరె, రిచర్డ్ జోసెఫ్ విట్లాక్…. మొత్తం పదకొండు మంది… ఇందులో ఆండీ, రిచర్డ్ తప్ప మిగతా 9 మందివీ పంజాబ్ రూట్స్… అందరూ సిక్కులే… వీళ్లెవరో చెప్పలేదు కదూ… కెనడా బేస్‌గా మాఫియా వ్యవహారాల్ని ఓ రేంజులో నడిపిస్తున్న బడా గ్యాంగ్స్టర్స్… కెనడాలో ఉన్న సిక్కులు 8 లక్షలు… అంటే […]
TV9 vs NTV…. టీవీ9 మురిపాలు, సంబరాలకు పెద్ద బ్రేక్… ఓవరాక్షన్‌కు తెర…
రెండు తెలుగు న్యూస్ చానెళ్ల పోటీ రక్తికడుతోంది… ఇప్పుడు జనం టీవీ9 మూణ్నాళ్ల సంబురాలు చూసి నవ్వుకుంటున్నారు… ఆ సంబరాల్లో శుష్కత్వం చూస్తే ఒకింత జాలి కూడా కలుగుతోంది… విషయంలోకి వస్తే… తాజా బార్క్ రేటింగుల్లో ఎన్టీవీ టీవీ9 చానెల్‌కు కిందకుపడదోసి, తను నంబర్ వన్ స్థానంలోకి వచ్చి కూర్చుంది… అదేమిటి..? ఇంతకీ ఎవరు నంబర్ వన్..? అనేదేనా మీ ప్రశ్న… ఒకసారి ఈ ఆట జరిగిన క్రమాన్ని చూద్దాం… ఎన్నేళ్లుగానో టీవీ9 తెలుగు న్యూస్ చానెళ్లలో […]
- « Previous Page
- 1
- …
- 63
- 64
- 65
- 66
- 67
- …
- 149
- Next Page »