టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి తెలంగాణలో పార్టీని గెలిపించుకుంటాడా..? తన చిరకాల కోరిక సీఎం పదవి సాధిస్తాడా..? ఈ దిశలో చాలా సమీకరణాలు అడ్డుపడతాయి కానీ కొడంగల్‌లో మళ్లీ గెలుస్తాడా..? తను సర్వే చేయించుకున్నాడు… ఎక్కడెక్కడ మైనస్ పాయింట్లున్నాయో లెక్కతీసి, సరిదిద్దుబాట్లు కూడా చేసుకున్నాడు గరిష్ట స్థాయిలో… పైగా ఇప్పుడు తను టీపీసీసీ అధ్యక్షుడు… ఎక్కడా కాంప్రమైజ్ కాడు… ఓడిపోతే మొదటికే మోసం వస్తుంది కాబట్టి తన సాధనసంపత్తి మొత్తం ప్రయోగించక తప్పదు… అదే సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా […]
పొన్నాల రాజీనామా లేఖలో చెప్పిన ప్రతి పాయింటూ కరెక్టే…
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేసినట్టే అని కలలుకంటున్న కాంగ్రెస్‌వాదుల్లో ఓ కలకలం… నిజంగానే కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిస్థితులపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఓ ఆందోళన ఉంది… పలు విమర్శలు వినవస్తున్నాయి… వాటికి బలం చేకూర్చేట్టు మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఎఐసీసీ స్థాయి నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్‌కు రాజీనామా చేశాడు… నిజంగానే ఓసారి ప్రజలు లుక్కేయాల్సిన పరిణామం… తను బీఆర్ఎస్లోకి వెళ్తాడా, తనతో ఏయే బీఆర్ఎస్ నేతలు సంప్రదింపుల్లో ఉన్నారనేది పక్కన పెడదాం కాసేపు… ఆల్రెడీ […]
ఆ ఆంధ్రోళ్లు తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలిపేస్తరట… గంగుల చెప్పిండు…
తొమ్మిదిన్నరేళ్లు తెలంగాణను పాలించింది తెలంగాణ రాష్ట్రసమతి… అఫ్కోర్స్, ఇప్పుడు భారత రాష్ట్ర సమితి… పేరు మారితేనేం, డీఎన్ఏ మారదు కదా… జాతీయ రాజకీయాల్లో గాయిగత్తర లేపుతానని లేచి, నాలుగడుగులు కూడా పరుగు తీయకముందే ఆయాసం ముంచుకొచ్చి, ఆ జాతీయ జెండాను, ఎజెండాను పక్కన పడేసి మళ్లీ ఆ తెలంగాణ జెండానే, అనగా పాత తెలంగాణ సెంటిమెంట్‌నే నమ్మకుంటన్న, పట్టుకుంటున్న అవస్థ… ఈరోజుకూ తాము సాధించిన ప్రగతిని చెప్పుకోలేక… దాన్నే చూపి వోట్లడగలేక… కాంగ్రెస్ సిక్స్ గ్యారంటీలు జనంలో […]
కడుపులో బిడ్డకూ ‘జీవించే హక్కు’…! కానీ ఎన్ని వారాల గర్భానికి..?!
నాకు తెలిసిన ఒకామెకు ఏడు నెలలకే ప్రసవమైంది… ఆడపిల్ల పుట్టింది… అప్పట్లో వెంటిలేటర్లు, ఇంక్యుబేటర్లు ఏమీ లేవు… సహజప్రసవం… ఆ ఆడపిల్ల ఆరోగ్యంగా, చక్కగా పెరిగి త్వరలో అమ్మమ్మ కూడా కాబోతోంది… అంటే, 7 నెలలకే కడుపులో బిడ్డ ఈలోకంలోకి కేర్‌మని అడుగుపెట్టడానికి తగినంత ఎదుగుదలతో ఉంటుందన్నమాట… ఇక వార్తలోకి వెళ్దాం… మొన్న, నిన్న సుప్రీంకోర్టులో వాదనలు… చాలా ఆసక్తికరం… ఒకావిడ తన 26 వారాల గర్భాన్ని తీసేయించుకోవడానికి సుప్రీం కోర్టు అనుమతి అడుగుతోంది… డాక్టర్లేమో చేయడం […]
జూనియర్ ఎన్టీయార్ దగ్గరకు అమిత్ షా… ఆదుకోవాలని లోకేష్ కాళ్లావేళ్లా…
దేశ రాజకీయాలను శాసిస్తున్న అమిత్ షా స్వయంగా జూనియర్ ఎన్టీయార్ దగ్గరకు వచ్చాడు, తనున్న హోటల్‌కు పిలిపించుకుని కలిశాడు… అసలే చంద్రబాబు మీద మంట మీదున్న జూనియర్ ఏం చెప్పాడు, అమిత్ షా ఏం ఆఫర్ ఇచ్చాడు అనేది పక్కన పెడితే… సీన్ కట్ చేయండి… స్వయంగా లోకేష్ రకరకాల పైరవీలు చేసి, చివరకు పురంధేశ్వరి పైరవీ చేస్తే అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చాడు… కలిశాడు… ఏదో లోకేష్ చెప్పింది విన్నాడు… తనకన్నీ తెలుసు… మోడీ మీద […]
యూదుల దాడిలో భార్యాపిల్లలు హతం… ఓ కన్ను ఖతం… ఐతేనేం, తీవ్ర ప్రతీకారం…
Nancharaiah Merugumala…….. ‘ఒంటి కన్ను జాక్’ (హమాస్ నేత) దెయిఫ్ మొన్న 1200 ఇజ్రాయెలీల ప్రాణాలు తీసే ప్లాన్ వేస్తే… మరో ‘ఒన్ అయిడ్ జాక్’ శివరాసన్ 32 ఏళ్ల క్రితం రాజీవ్ గాంధీని దగ్గరుండి మరీ చంపించిన టైగర్ల వ్యూహకర్త! ఉగ్రవాద సంస్థల ‘మాస్టర్ మైండ్ల’కు ఒక కన్ను పోయినా మెదడు బాగానే పనిచేస్తుందట! ………………………. వారం రోజుల యూదుల మ్యూజిక్ ఫెస్టివల్ సుక్కోత్ ముగింపు దశకు చేరిన శనివారం ఇజ్రాయెల్ లోకి వేలాది రాకెట్లు […]
బిగ్‌బాస్ హౌజులోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే… వావ్… ఏం టాస్క్ గురూ…
Task-Bigg Boss: కర్ణాటకలో చిక్కబళ్లాపూర్ అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ కన్నడ బిగ్ బాస్ హౌస్‌లోకి ఒక పోటీదారుగా వెళ్లడం మీద అధికార- ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సామాజిక మాధ్యమాల్లో కూడా జనం రెండుగా చీలి దుమ్మెత్తిపోసుకుంటున్నారు. తప్పేముంది? ఎమ్మెల్యే అయినంతమాత్రాన ఆయనకూ ఏవో కలలు, కళలు ఉంటాయి కదా? వాటిని ప్రదర్శించుకునే వేదికలు వెతుక్కుంటే తప్పేముంది? అని ఆయన్ను సమర్థించేవారు అంటున్నారు. నియోజకవర్గం గతేమికాను? అసలే చిక్కబళ్లాపూర్ లో కరువు తాండవిస్తోంది. మంచి […]
అగ్రరాజ్యాల అసలు రాజకీయాల్లో పావులు ఇజ్రాయిల్, పాలస్తీనా…
పార్ధసారధి పోట్లూరి ….. రష్యా, ఇరాన్, టర్కీ ,లేబనాన్, జోర్డాన్,సిరియా, ఇప్పటికే బయట పడ్డాయి తాము అమెరికా, ఇజ్రాయెల్, నాటో కి వ్యతిరేకం అని. ఇంతకీ రష్యా ఇజ్రాయెల్ విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంది? చాలా కారణాలు ఉన్నాయి! నాటో దేశాలలో చాలా వరకు ఉక్రేయిన్ కి ఆయుధాలు సరఫరా చేసి విసిగిపోయాయి! యుక్రెయిన్ కన్ఫ్లిక్ట్ ఇప్పట్లో ముగిసేలా లేదు. ఏదో ఒక చోట ఆగిపోవాలి. దానికోసం మెల్లగా ఆయుధ సరఫరాని తగ్గిస్తూ వస్తున్నాయి. కానీ అమెరికా నుండి వత్తిడి […]
ఫ్యామిలీ ప్యాక్ ప్లీజ్… కాంగ్రెస్‌లో ఈసారి మరీ అధికంగా ఈ గొడవ…
నా కొడుక్కి టికెట్టు ఇవ్వండి… నా అల్లుడికి టికెట్టు… నా బిడ్డకు టికెట్టు… ఇలా దాదాపు అన్ని పార్టీల్లోనూ కుటుంబ వారసత్వం ఉంది… ఎవరూ మినహాయింపు కాదు… మరీ ప్రత్యేకించి కుటుంబ పార్టీల్లో, ఏక వ్యక్తి కేంద్రిత పార్టీల్లో వాళ్ల ఇష్టాయిష్టాలను బట్టి ఈ వారసత్వాలు నడుస్తుంటాయి… చివరకు వామపక్షాల్లో సైతం ముఖ్య నాయకుల భార్యలు మహిళా విభాగాలకు, కొడుకులు యువజన విభాగాలకు నాయకత్వం వహిస్తూ ఉన్న ఉదాహరణలు చూశాం… అసలే ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్‌లో […]
ఇజ్రాయిల్ వార్, అఫ్గాన్ భూకంపం… ఇంకా తీవ్ర విపత్తులున్నాయట…
జ్యోతిష్యం.,. చాలామంది నమ్మరు, చాలామంది నమ్ముతారు… ఇది శాస్త్రమే అంటారు తెలిసినవాళ్లు… ఠాట్, ట్రాష్ అంటారు కొందరు… గణించే పద్ధతులు, చెప్పే జోస్యాల తీరు ఎలా ఉన్నా సరే, ప్రపంచమంతా జ్యోతిష్కం ఏదో ఓ రూపంలో మన జీవితాల్లో ప్రధానపాత్ర పోషిస్తూనే ఉంది… సరే, జ్యోతిష్కులందరినీ ఒకే గాటన కట్టేయలేం గానీ, కొందరి ప్రతిభ, జ్ఞానం, జోస్యాలు వివరించే పద్దతి చూస్తే అబ్బురం అనిపిస్తుంది… ఆ అబ్బురాల్లో ఒకడు అభిజ్ఞానంద… Abhigya Ananda… ఎవరితను..? ఓ సూపర్ […]
ఆ తిండిగింజలు పండిస్తే శిక్షిస్తాం… పంజాబ్ ప్రభుత్వ అసాధారణ నిషేధం…
ఒక రైతును నువ్వు ఫలానా పంటే పండించాలి అని నిర్బంధంతో నియంత్రించడం సాధ్యమేనా..? అదీ ఆహారపంటను… పైగా బాగా ఆదాయం తెచ్చి పెట్టే పంటను… అందులోనూ టెంపర్మెంట్ బలంగా ఉండే పంజాబ్ రైతును..! ఇటీవల పంజాబ్ వార్తల్లో ఆకర్షించింది… పూస44 రకం వరిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా నిషేధమే విధించింది… వచ్చే వ్యవసాయ సీజన్ నుంచి ఆ పంట వేస్తే శిక్షార్హులు రైతులు… అసలు ఈ కారణంతో రైతుల్ని శిక్షించడం సాధ్యమేనా..? సాధ్యమే కాదు, అవసరం […]
మొసాద్ ఘోర వైఫల్యం సరే… అసలు హమాస్ వెనుక ఉన్నది ఎవరు..?
పార్ధసారధి పోట్లూరి …. అక్టోబర్ 7 శనివారం ఉదయం 6.30… ఇజ్రాయెల్ లో రాత్రి షిఫ్టు ముగించుకొని సైనికులు నిద్రకు ఉపక్రమించే సమయం. రాత్రి షిఫ్ట్ సైనిక డ్యూటీ అయిపోయిన వాళ్ళ స్థానంలో పగలు విధుల్లోకి చేరే వాళ్ళు సిద్ధం అవబోతున్న సమయం! గాజా నుండి రాకెట్లు ఇజ్రాయిల్ మీదకి విరుచుకు పడడం మొదలయ్యింది! ఆకాశంలో రాకెట్లు కనపడగానే వెంటనే ఇజ్రాయెల్ లో సైరన్లు మోగడం మొదలయ్యింది! సాధారణ పౌరులు, అప్పుడే సైనిక పోస్ట్ లలో విధుల్లోకి […]
పెళ్లంటే..? ఇలా జరిగితేనే హిందూ పెళ్లి అనే నిర్వచనం ఉందా..?
సంప్రదాయ వివాహ తంతు జరిగితేనే ఆ పెళ్లి పరిగణనలోకి వస్తుందని అలహాబాద్ హైకోర్టు చేసిన వ్యాఖ్య, చెప్పిన తీర్పు ఆశ్చర్యం కలిగించింది… అఫ్కోర్స్, తను తీర్పు చెప్పిన కేసుకు ఈ వ్యాఖ్య వర్తిస్తుందేమో గానీ… ఒక జనరల్ కామెంట్‌గా మాత్రం భిన్నాభిప్రాయాలకు తావిస్తుంది… అప్పట్లో ఓ సినిమా వచ్చింది… కృష్ణంరాజు హీరో కావచ్చు… పెళ్లంటే పందిళ్ళు.. సందళ్ళు, తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ.. మూడే ముళ్ళు.. ఏడే అడుగులు.. అని ఓ పాట అందులో… సూపర్ హిట్ పాట… ఇవన్నీ ఉంటేనే […]
పాకిస్థాన్ డర్టీ బాంబు కథను ఖతం చేసిన ఇండియన్ ఏజెంట్లు..?!
పార్ధసారధి పోట్లూరి ….. ఎవరెన్ని అనుకోవచ్చు గాక! అంతిమంగా దేశ రక్షణే ముఖ్యం! ఇండియన్ మొస్సాద్ (రా) ఆపరేషన్స్ కి ఎదురే లేదు! మిగతా ప్రపంచం అలా చేష్టలుడిగి చూస్తూ ఉండాల్సిందే! అదేంటి? నేరుగా అలా RAW ఆపరేషన్స్ గురుంచి బహిరంగంగా ఎలా చెప్తారు అని మీరు అనుకోవచ్చు గాక! కానీ ఒక స్పై ఏజెన్సీ గురుంచి మరో దేశానికి చెందిన స్పై ఏజెన్సీకి తెలిసిపోతాయి. ఎవరు ఎక్కడ కిడ్నాప్ కాబడ్డారు? దాని వెనుక ఎవరు ఉన్నారు? ఇలాంటి విషయాలు […]
కేసీయార్ మార్క్ చాణక్యం… సామ దాన భేద దండోపాయాలన్నీ…
ఈటలను తన నియోజకవర్గంలోనే ఓడించి కక్ష తీర్చుకోవాలని కేసీయార్ భేదోపాయంలో వెళ్తున్నాడా..? లేక ఎదుటి పక్షంలోనూ తన వాళ్లు కొందరు ఉండాలనే భావనతో గట్టిగా ప్రయత్నిస్తున్నాడా..? ఏమో, అవసరం రావచ్చు కదా… ఈసారి కూడా గెలిచి, హ్యాట్రిక్ కొట్టడానికి ప్రతి నియోజకవర్గంలోనూ ఓ ప్రత్యేక వ్యూహాన్ని రచిస్తున్నాడా…? రకరకాల ప్రశ్నలు ఎందుకొస్తున్నాయ్..? కరీంనగర్ జిల్లాలోని రెండు నియోజకవర్గాలు… కెప్టెన్ లక్ష్మికాంతరావు ప్రభావం, పట్టు బలంగా ఉన్న స్థానాలు… ఆయన బీఆర్ఎస్, కేసీయార్‌కు సంబంధించి ఎంత ముఖ్యుడూ అంటే… […]
‘రాత్రి సుందరి’కి నల్లుల బాధ… పారిస్ నగరం నెత్తురు తోడేస్తున్నయ్…
Bed Bugs- Red Flag: పారిస్ ను ప్రపంచ ఫ్యాషన్ రాజధాని అంటారు. పారిస్ నగరాన్ని రాత్రి పూటే చూడాలంటారు. “రాత్రి సుందరి” అని పారిస్ ను వర్ణిస్తూ ఇంగ్లీషులో లెక్కలేనన్ని కవితలు. యూరోప్ పర్యటనలో భాగంగా నేను కూడా కళ్లు మూతలు పడుతున్నా… పారిస్ రాత్రి అందాలను కళ్లల్లో నింపుకున్నాను. సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకు పారిస్ ఈఫిల్ టవర్ మీద రంగు రంగుల బాణాసంచా కాల్చడం, ఆపై విద్యుత్ దీపాల జిలుగు వెలుగులు ఒక […]
చైనా పన్నిన నేవీ ట్రాపులో చైనాయే పడింది… అసలేం జరిగిందంటే…
పార్ధసారధి పోట్లూరి …. ఎవ్వరు తీసిన గోతిలో వాళ్లే పడాలి సామెత ప్రకారం! చైనాకి చెందిన అణు జలాంతర్గామి ప్రమాదానికి గురయి 55 మంది సైలర్స్ మరణించారు! **************** బ్రిటీష్ ఇంటెలిజెన్స్ ఈ సమాచారాన్ని బయట పెట్టినట్లుగా తెలుస్తుస్తున్నది! కానీ చైనా మాత్రం తన సబ్‌మెరైన్ కి ఎలాంటి ప్రమాదం జరగలేదని బుకాయిస్తున్నది! సాధారణంగా బ్రిటీష్ ఇంటెలిజెన్స్ చాలా అరుదుగా ఇలాంటి సమాచారాన్ని బయటపెడుతుంది. బ్రిటీష్ ఇంటెలిజెన్స్ బయటపెట్టిన సమాచారంలో పలు సాంకేతిక (టెక్నీకల్) అంశాలు ఉండడం వలన సమాచార విశ్వసనీయత […]
ప్రజలు ఎందుకు ఓన్ చేసుకోవడం లేదు..? కేసీయార్ తప్పులేమిటి..?
ముందుగా చెప్పినట్టుగా రాజకీయం చాలా విచిత్రాతివిచిత్రమైంది. రాజకీయమంటే యదార్థం, ఆ యదార్థాన్ని అనుభవించి, ఆస్వాదించి, ఔపోసన పట్టిన నాయకులకే రాజకీయం రసకందాయం అవుతుంది. పుట్టుక ప్రకృతి.. చావు విధి.. మధ్యలో జీవితం.. ఇది వేదాంతం! నాయకుడు పుడతాడు.. పోతాడు.. మధ్యలో నువ్వు లిఖించేదే చరిత్ర.. ఇది రాజకీయ సిద్ధాంతం!! మహామహానాయకులే కొన్ని వ్యూహాత్మక తప్పిదాలతో మట్టికరచిన సందర్భాలున్నాయి. చరిత్ర కాలగర్భంలో చెరచబడ్డ ఘటనలు సైతం ఉన్నాయి. మన దేశంలో కొందరు అరుదైన నాయకులు కొన్ని వ్యామోహాలను (వ్యసనాలు […]
అయ్యవార్లూ… నవమి పూట ‘విజయ దశమి’ జరుపుకోవాలా..? అదెలా..?
పండుగ ఎన్నడు..? ఈ ప్రశ్న దాదాపు ప్రతి పండుగకూ వస్తోంది… భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి… పండుగ తిథిని సరిగ్గా ఖరారు చేయడానికి ఓ కామన్ సూత్రం లేదు… పండితులుగా ప్రఖ్యాతి గాంచినవాళ్లు తలా ఓ సూత్రం చెప్పి సామాన్య ప్రజల్ని అయోమయంలోకి నెట్టేస్తున్నారు… తాజాగా దసరా ఎన్నడు అనే ప్రశ్న రాష్ట్రంలోని పండితుల నడుమ చర్చకు దారితీసింది… 23న జరుపుకోవాలని కొందరు, 24న శ్రేయస్కరం అని మరికొందరు… ఎందుకీ సందిగ్ధత..? ఎందుకీ ద్వైదీభావం..? ఇలాంటి సందిగ్ధతలు, ప్రశ్నలు, సందేహాలు […]
మోడీ సాబ్… ఆ రహస్యాలన్నీ ఇప్పుడే ఎందుకు కక్కేస్తున్నట్టు..?
మోడీ గారు… తమరు సత్యసంధులు… మరి ఇప్పుడు ఎందుకు చెబున్నారు మాస్టారూ… ఎన్డీఏలోకి చేర్చుకోవాలని కేసీయార్ బతిమిలాడాడా..? కేటీయార్‌ను సీఎంను చేస్తాను, ఆశీర్వదించండి అని ప్రాధేయపడ్డాడా..? అదీ జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో… తమరేమో… ఠాట్, ఇదేమైనా రాజరికమా..? యువరాజుకు పట్టాభిషేకం చేయడానికి అని తిరస్కరించారా..? అబ్బో… తమ పార్టీలో అసలు వారసత్వ ఉదాహరణలే లేనట్టు..!! సరే, నువ్వు అవినీతికి కఠోర వ్యతిరేకివి సరే… మరి కేసీయార్ అవినీతిని కక్కించడానికి నీకు తెలంగాణలో అధికారం ఇచ్చేదాకా ఎందుకు ఆగాలి..? […]
- « Previous Page
- 1
- …
- 73
- 74
- 75
- 76
- 77
- …
- 122
- Next Page »