పార్ధసారధి పోట్లూరి ……….. రష్యా ఎందుకు విఫలం అయ్యింది ఉక్రెయిన్ మీద దాడి విషయంలో ? రష్యన్ గూఢచార సంస్థ FSB ఉక్రెయిన్ నుండి ఎందుకు సమాచారం సేకరించలేకపోతున్నది ? అలాగే రష్యన్ మిలటరీ ఇంటెలిజెన్స్ ఉక్రెయిన్ విషయంలో ఎందుకు విఫలం అయ్యింది ? రష్యా తన FSB అపరేటర్స్ ని ఉక్రెయిన్ లో ఎంగేజ్ చేయడంలో విఫలం అవడం వలనే గత పది నెలలుగా ఉక్రెయిన్ మీద ఆధిపత్యం వహించలేకపోతున్నది అన్నది ఇటీవలే పలువురు నిపుణులు […]
ఇంట్రస్టింగ్ కరోనా స్టోరీ… గడగడా వణికించేది కాదు, ఊరటనిచ్చేది…
మీరు సున్నిత హృదయులా..? రాబోయే విపత్తులను తలుచుకుని బెంబేలెత్తిపోతుంటారా..? కొద్దిరోజులపాటు టీవీ9, ఏబీఎన్ వంటి పిచ్చి చానెళ్లను చూడటం మానేయండి… ఎంతసేపూ ఎంత మంది చస్తారు..? వేలా..? లక్షలా..? అదుగో ప్రళయం, ఇదుగో మహానాశనం వంటి మాటలే తప్ప పాజిటివ్ అనే పదమే తెలియని బుర్రలవి… చైనా పరిస్థితి ఇండియాలో తలెత్తితే ఎంతమందిని కరోనా కబళించవచ్చు అనే లెక్కలు, అంచనాల దాకా పోయాడు ఇండియాటుడే వాడు… సో, ఈ దిగువ వార్తను కాస్త జాగ్రత్తగా చదవండి… చైనాలో […]
హాస్టళ్లు టూరిస్ట్ హోమ్స్ ఏమీ కావు… ఇష్టారాజ్యంగా వచ్చిపోవడానికి…
చిన్న వార్తే… కానీ కేరళ సీపీఎం ప్రభుత్వాన్ని అభినందించాల్సిన వార్త… స్టోరీ ఏమిటంటే..? కొందరు మహిళా విద్యార్థినులు కోర్టుకెక్కారు… ‘‘కొజికోడ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఆంక్షలు పెడుతోంది… ఓ నోటీఫికేషన్ జారీ చేసింది… ఫిమేల్ స్టూడెంట్లు ఎవరూ తమ హాస్టళ్ల నుంచి రాత్రి 9.30 తరువాత బయట ఉండానికి వీల్లేదు అని… అవసరముంటే స్టడీ హాల్స్ వాడుకొండి, చదువుకొండి అంతేతప్ప ఇష్టమొచ్చినట్టు తిరగడానికి వీల్లేదు అని… ఇది అన్యాయం’’ అనేది వాళ్ల పిటిషన్… Kerala University for […]
జగన్‌పై చూపించే దురుసుతనం… కేసీయార్ పాలన మీద కిక్కుమనలేదేం…
రండి, రండి, వచ్చేయండి, పార్టీకి పునర్వైభవం తీసుకొద్దాం… అని చంద్రబాబు ఆవేశంగా తెలుగుదేశం కేడర్‌కు పిలుపునిచ్చాడు… నో డౌట్, ఖమ్మం మీటింగుకు జనం బాగానే వచ్చారు… అదేమిటో గానీ తెలంగాణలో మళ్లీ కాలు మోపాలని, రాజకీయం చేయాలని ఆశపడే ప్రతి ఆంధ్రా పార్టీకి ఖమ్మమే గుమ్మం… అటు వైఎస్పార్టీపి అక్కడే పార్టీ ఆఫీసు కట్టుకుంటోంది… తెలుగుదేశం అక్కడి నుంచే మళ్లీ ఆట స్టార్ట్ చేసింది… పాల్ కూడా త్వరలో పెద్ద మీటింగు పెడతాడు… జనసేనదే ఇంకా ఎటూ […]
అమ్మా రోజమ్మా… ఎటు వెళ్లినా ఈ జబర్దస్త్ తోకలు ఉండాల్సిందేనా..?
నిజంగా రోజాను చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది… నేను ఒక రాష్ట్రానికి మంత్రిని అనే సోయి ఏమీ కనిపించదు… వేదిక దొరికితే డాన్సు చేస్తుంది… మాట్లాడితే చాలు ఆ ఈటీవీ జబర్దస్త్ టీంను వెంటేసుకుని తిరుగుతుంది… తను ఇంకా జబర్దస్త్ జడ్జినే అనీ, జగన్ పేరుతో కాదు, జబర్దస్త్ ఫేమ్‌తో గెలిచాను అని నమ్ముతున్నట్టుంది బలంగా… జగన్ ప్రత్యర్థి రామోజీ… రామోజీ చానెల్ ఈటీవీ… ఈటీవీ ప్రోగ్రాం జబర్దస్త్… మరి ఆ షోను పదే పదే ఎందుకు ప్రమోట్ చేస్తుంది […]
కేసీయార్ సార్.., ఈయన సేవలు నిజంగా వైద్యారోగ్య శాఖకు అవసరమా..?!
హమ్మయ్య… అంతటి విధ్వంసకారి కరోనా నుంచి ఈ ప్రపంచం ఎలా రక్షింపబడిందా అని ఇన్నాళ్లూ సందేహం ఉండేది… ఇప్పుడు అలాంటి సందేహాలన్నీ తీర్చేశాడు కేసీయార్ అభిమాన వైద్యాధికారి శ్రీనివాసరావు… వేక్సిన్లు, మందులు, డాక్టర్ల వల్ల కాదట… కేవలం ఏసు క్రీస్తు కృపవల్లే కరోనా పారిపోయిందట… ష్, మరి చైనాను వణికిస్తూ, మళ్లీ ప్రపంచం మీద పడగ జాపుతున్న కొత్త వేరియంట్ మాటేమిటని అడక్కండి… సారు గారికి కోపమొస్తుంది… నిజానికి ఈయన ఫస్ట్ నుంచీ వివాదాస్పదుడే… అటు హరీష్‌రావు […]
ఒకేరోజు సాక్షి మూడు పత్రికలు… మరి జగన్ సార్ బర్త్‌డేనా… మజాకా…?!
ఏపీలో చిత్తూరు, విజయవాడ, గుంటూరు ఎడిషన్లలో సాక్షి పాఠకులకు మూడు పత్రికల్ని ఇచ్చింది… అరె, కన్ఫ్యూజ్ కావద్దు సుమీ… మూడు సాక్షి పత్రికలు, సేమ్ కాదు, వేర్వేరు పత్రికల్ని ఇచ్చింది… మొత్తం ఎన్ని పేజీలో తెలుసా..? 42 పేజీలు… టైమ్స్ వంటి పత్రికలు కొన్ని సందర్భాల్లో అన్ని పేజీలను ఇచ్చాయి, పెద్ద విశేషం ఏముంది అంటారా..? 42 పేజీలను ఒకే బంచ్‌గా కాదు, మూడు పత్రికలుగా ఇచ్చింది… ఒకటి 16 పేజీలు, మరొకటి 14 పేజీలు, ఇంకొకటి […]
మనిషి జీవితాన్నే చిన్నాభిన్నం చేస్తున్న స్మార్ట్ ఫోన్… షాకింగ్ సర్వే…
Kapilavai Ravinder…… ఫేస్బుక్ వాల్ నుంచి సేకరణ… బంధాలను బలితీస్తున్న స్మార్ట్ ఫోన్.. నిద్రలేచిన 15 నిమిషాల్లో 84శాతం మంది అదే చేస్తున్నారట..!! ఈరోజుల్లో భార్యభర్తల మధ్య గొడవలు జరగడానికి ప్రధాన కారణం.. టైమ్ ఇవ్వడం లేదు అనే ఉంటుంది.. ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటారు.. కానీ ఆఫ్‌డేస్‌లో అయినా ఒకరితో ఒకరు టైమ్ స్పెండ్ చేస్తారా అంటే ఎవరి ఫోన్ వారు వాడుతుంటారు. ఇది సవితి పోరు కంటే దారుణం.. బంధాలను సెల్‌ఫోన్ బద్నాం చేస్తుందని […]
నటుడు త్రిపురనేని సాయిచంద్ కాలినడక దీక్ష… ఆలోచన మంచిదే…
ప్రముఖ సీనియర్ నటుడు, త్రిపురనేని రామస్వామి వారసుడు సాయిచంద్ కాలినడక దీక్ష కొనసాగిస్తున్నారు. అయిదవ రోజైన సోమవారం నాడు సూళ్లూరుపేట, గూడూరు దాటి పొట్టి శ్రీరాములు స్వగ్రామం ప్రకాశం జిల్లా పడమటిపల్లె వైపు అడుగులు వేస్తున్నారు. తెలుగువారి కోసం పొట్టిశ్రీరాములు చేసిన ప్రాణత్యాగాన్ని ప్రభుత్వాలు కానీ పౌరసమాజం కానీ ఇంతవరకూ పట్టించుకోలేదన్న ఆవేదనతో ఈ నెల 15 తేదీన మైలాపూర్ లో బులుసు సాంబమూర్తి (పొట్టి శ్రీరాములు తుది శ్వాస విడిచిన చోటు) నివాసం నుంచి కాలినడక […]
ఓ ఫేమస్ గుడి… ఓ హైకోర్టు జడ్జి… సగటు భక్తుడిగా వెళ్లి నిర్ఘాంతపోయి…
పార్ధసారధి పోట్లూరి ….. సోమవారం, డిసెంబర్ 19, 2022, చెన్నై వడపళని దండాయుధపాణి గుడి ! చెన్నై హై కోర్టు న్యాయమూర్తికి అవమానం !చెన్నై హైకోర్ట్ న్యాయమూర్తి S.M. సుబ్రహ్మణియన్ [Justice S.M. Subramaniam of the Madras High Court] డిసెంబర్ 17, శనివారం రోజున చెన్నై లోని వడపళని మురుగన్ టెంపుల్ [సుబ్రహ్మణ్య స్వామి గుడి ] ని సందర్శించారు. సుబ్రహ్మణియన్ తన భార్య మరియు కూతురు తో కలిసి తన గుర్తింపు ఏమిటో […]
అఫ్ఘనిస్థాన్‌పై ఇండియా రాజనీతి, దౌత్యనీతి… చైనా, పాకిస్థాన్ బెంబేలు…
పార్ధసారధి పోట్లూరి …… మనకి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇదే భారత్ అత్యున్నత దౌత్య పరమయిన వ్యూహం ! పెద్దగా శ్రమ లేకుండా చైనా ,పాకిస్థాన్ లని ఆఫ్ఘనిస్తాన్ నుండి ఎలా దూరం పెట్టాలో భారత్ చేసి చూపిస్తున్నది! మూర్ఖులని రంజింపచేయడం చాలా కష్టమయిన పని! అందులోనూ మూర్ఖుడు మొండి వాడు అయితే వాడి నుండి దూరంగా ఉండమంటాడు చాణక్యుడు! నీ తెలివితేటలు, కండ బలం మూర్ఖుడు, మొండివాడి ముందు ఎలాంటి ప్రభావాన్ని చూపదు. అయితే వాడన్నా […]
ఏయ్ బండీ ఏమైంది..? పారిపోయావా..? మా రోహిత్ సవాల్‌కు భయపడ్డావా..?
అయ్యప్ప దీక్షలో ఉంటే దేన్నయినా తప్పించుకోవచ్చు అనేది ఓ భ్రమ… ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో కీలక వ్యక్తి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తనపై ఈడీ పంజా విసిరింది… కేసీయార్‌కు సిట్ ఉంటే, బీజీపీకి ఈడీ ఉంటుంది కదా… నేను విచారణకు రాను, నేను అయ్యప్ప దీక్షలో ఉన్నాను, కొన్నాళ్లయ్యాక వస్తాను వీలైతే అని ఈడీ టీంకు సమాచారం పంపించాడు… నవ్వుకున్న ఆ టీం తప్పనిసరిగా రావల్సిందే అని చెప్పింది… ఏం చేయగలదు ఈడీ టీం అనుకున్నాడేమో రోహిత్… […]
రేవంత్ రెడ్డి దారెటు..? సొంత పార్టీ ఏర్పాటే శరణ్యమా..? ఇప్పటికే లేటైందా..?
రేవంత్‌పై తిరుగుబాటు… నిన్నటి నుంచీ తెలంగాణ రాజకీయాల్లో ఒకటే కలకలం… అసలు కాంగ్రెస్‌లో ఇవన్నీ జరగకపోతే ఆశ్చర్యం, జరిగితే పెద్ద వార్తేముంది..? పార్టీకి జాతీయ స్థాయిలో సమర్థ నాయకత్వం లేదు, అన్నింటికీ మించి క్రైసిస్ మేనేజర్లు లేరు… అదొక పెద్ద సమస్య… కాబట్టి ఇది ఇంకా ముదిరి నిజంగానే రేవంత్ పోస్టుకు ఎసరు పెట్టవచ్చు కూడా… అయితే పార్టీ సీనియర్ల బ్లాక్ మెయిలింగుకు రాహుల్ తలొగ్గుతాడా..? ఇదీ అసలు ప్రశ్న… వలసవాదులు వర్సెస్ ఒరిజినల్స్ అనే సూత్రీకరణ […]
ఎవరు శుద్ధపూసలు రాధాకృష్ణా..? ఏ పార్టీకి వ్యూహకర్తలు లేరు ఇప్పుడు..?!
సమర్థుడైన రాతగాడి లక్షణం ఏమిటంటే… సరళంగా రాయడం, అర్థమయ్యేట్టు రాయడం, ఒక అంశానికే పరిమితం కావడం, తప్పైనా ఒప్పైనా ఒక ధోరణికి స్టికాన్ అయి ఉండటం, అవసరమైన ఉదాహరణలు, ఆధారాలు, గణాంకాలు ఇవ్వడం… ప్రస్తుతం తెలుగులో ప్రభావవంతమైన రాతగాడిగా పేరున్న రాధాకృష్ణకు ఏమైందో, ఎవరైనా బినామీతో రాయించాడో గానీ… తన కొత్త పలుకు 36 అంశాలకు పాకి, పీకబడి… తనేం చెబుతున్నాడో తనకే సమజ్ కాని దురవస్థ… కానీ ఏమాటకామాట… కేసీయార్ ప్రభుత్వం కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ […]
చైనా సరుకు అంటేనే సబ్‌స్టాండర్డ్ కదా… అదే ఇప్పుడు భస్మాసురహస్తం…
ఒక జోక్… చైనా దగ్గర పుష్కలంగా అణ్వాయుధాలున్నయ్… త్వరలో 1500 అణ్వస్త్రాల్ని నిల్వ చేయనుందట… భారీ రీచ్ ఉండే మిస్సైళ్లు, అతి పెద్ద సైన్యం, భారీ ఆర్థికవనరులు, ప్రతిపక్షమే ఉండని సుస్థిర, నియంతృత్వ పాలన… క్షిపణి రక్షణ వ్యవస్థ, అత్యంతాధునిక ఫైటర్ విమానాలు, భారీ యుద్ధనౌకలు… ఐనాసరే, ఇండియా చైనాను చూసి భయపడదెందుకు..? వైర్లు చుట్టిన రాడ్లతో చైనా సైనికులను బాదిపారేస్తున్నది ఎలా..? గల్వాన్, తవాంగ్ సెక్టార్లలో ఢీ అంటే ఢీ అంటున్నదెందుకు..? చైనా ఆయుధాలంటే వణుకు […]
కేసీయార్ ఢిల్లీ పర్యటన… మనం చూసే కోణంలోనే తప్పుందేమో బహుశా…
బహుశా మనం ఒకే కోణం నుంచి ఆలోచిస్తున్నామేమో… కేసీయార్ ఢిల్లీ పర్యటనను ఎవరూ దేకలేదు, ఫ్లాప్ అనే చిత్రీకరణ కరెక్టు కాదేమో… కుమారస్వామి, అఖిలేష్ తప్ప ఇంకెవడూ రాలేదు, కేసీయార్‌ను అలుముకోలేదు అనే విశ్లేషణ కూడా సరికాదేమో… ఎందుకంటే… కుమారస్వామి, అఖిలేష్ కేసీయార్ ద్వారా డబ్బులు తిన్న ప్రాణాలు కాబట్టి కాస్త కృతజ్ఞతగా వచ్చారేమో… కానీ మిగతా పార్టీలకు ఆ అవసరం ఏముంది..? రాకేష్ టికాయత్ ఎలాగూ డబ్బులను బట్టి వ్యవహరించే కేరక్టరే… హైదరాబాద్‌లో తిట్టిపోయి, ఢిల్లీలో […]
ప్రయోగశాలే అమ్మకడుపు… పిండం నుంచి పండంటి బిడ్డ దాకా ‘నయా దందా’…
చిరంజీవి కోడలు, రాంచరణ్ భార్య ఉపాసన పెళ్లయిన చాలాకాలానికి తల్లి కాబోతోంది… గుడ్… అయితే ఆ వార్తలతోపాటు మరో చిన్న వార్త ఆకర్షించింది… ఆమె సరోగసీ ద్వారా బిడ్డను కనబోతోంది అని..! అంత పెద్ద అపోలో హాస్పిటల్స్‌కు యువరాణి, మెగా రాజ్యపు మహారాణి అందరు మహిళల్లాగే కడుపు మోయడం, పురుటి నొప్పులు పడటం ఏమిటసలు అన్నట్టుగా సాగింది ఆ వార్త… అది చట్టవిరుద్ధమేమీ కాదు… మొన్నమొన్ననే కదా నయనతార కవలల్ని కన్నది ఇలాగే… మనకు తెలియని కేసులు […]
వారణాసికి పోటెత్తుతున్న భక్తులు… ఒకే ఏడాదిలో 7.35 కోట్ల మంది రాక…
స్ట్రెయిట్‌గా ఓ విషయం… హిందువులు తమ జన్మలో ఒక్కసారైనా వెళ్లాలని భావించే వారణాసికి గతంలో సగటున 30 నుంచి 40 లక్షల మంది భక్తులు వచ్చేవాళ్లు… సరిగ్గా ఒక ఏడాదిలో ఈ సంఖ్య ఎంతకు పెరిగిందో తెలుసా..? 7.35 కోట్లకు పెరిగింది..! గతంలో 14 నుంచి 15 కోట్ల మేరకు మాత్రమే విరాళాలు వచ్చేవి… ఈ ఏడాది 100 కోట్లు దాటింది… ఎందుకింత తేడా..? కాశీ విశ్వనాథుడి గుడి ఏరియాను 2700 చదరపు అడుగుల నుంచి ఏకంగా […]
పారసిటమాల్ గోళీలకు కూడా కటకట… యాంటీబయాటిక్స్ మందులకూ కొరత…
పార్ధసారధి పోట్లూరి….. యూరోప్ దేశాలలో యాంటీ బయటిక్స్ మందుల కొరత ! యూరోపు దేశాలలో ముఖ్యమయిన మందులు అయిన అమోక్సిసిలిన్ [amoxicillin] మరియు పారాసిట్మాల్ లాంటి నిత్యావసర ఔషధాలకి కొరత ఏర్పడింది. బ్రిటన్ మరియు ఫ్రాన్స్ దేశాలలో ప్రధానంగా అన్ని మందుల షాపులలో ఆమోక్సిసిలిన్ తో పాటు పారాసీట్మాల్ మందులకి తీవ్ర కొరత ఏర్పడింది. అయితే ఈ కొరత మిగతా యూరోపు దేశాలలో కూడా తీవ్రంగానే ఉంది కానీ ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలలో మిగతా యూరోపు దేశాలకంటే […]
KCR శిబిరంలోకి రవిప్రకాష్..? BRS అవసరాల కోసం కొత్త జాతీయ చానెళ్లు..!!
మీడియా అంటే… అచ్చం రాజకీయాల తరహాలోనే..! ఎవరు ఎప్పుడు ఎవరితో అటాచ్ అయిపోతారో, ఎవరు విడిపోతారో ఎవరూ చెప్పలేరు… పక్కా డైనమిక్… ఈరోజు ఉన్న విధేయతలు, ప్రత్యర్థిత్వాలు రేప్పొద్దున ఉండకపోవచ్చు… కేసీయార్ అలా ఎంతమందిని కౌగిలించుకోలేదు..? అలా తాజాగా రవిప్రకాష్‌ను కూడా అలుముకున్నాడనేది తాజా వార్త… రవిప్రకాష్ అంటే టీవీ9.., టీవీ9 అంటే మైహోం రామేశ్వరరావు… విత్ మేఘా కృష్ణారెడ్డి… కొంతకాలంగా ఇద్దరూ కేసీయార్‌తో కటీఫ్ చెప్పుకుని, బీజేపీ ఫోల్డ్‌లో ఉన్నారని పొలిటికల్ సర్కిళ్లలో ప్రచారం… ఆఫ్టరాల్ […]
- « Previous Page
- 1
- …
- 77
- 78
- 79
- 80
- 81
- …
- 146
- Next Page »