Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్చ్… మన బంగారు తెలంగాణలో సక్రమ కొలువు పరీక్షలకూ దిక్కులేదాయె…

March 17, 2023 by M S R

tspsc

హాఫ్ పేజీ వార్త… ఓ కార్టూన్… ఏయే రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాలు లీకయ్యాయో పాత ఉదాహరణలు… యువతతో చెలగాటం అనే శీర్షిక….. నమస్తే తెలంగాణ కరపత్రంలో ప్రత్యేక కథనం చదివితే… ప్రశ్నపత్రాల లీక్‌కు మించిన షాక్ తగుల్తుంది… ఇంకేముంది..? చాలా ఇష్యూస్‌లాగే దీన్ని కూడా దబాయింపు ధోరణితో తొక్కేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తోందనే సందేహాన్ని కలిగించింది పొద్దున్నే… ఒకవైపు ప్రవీణ్ అనే గాడిద టీఎస్పీఎస్సీలో చేరి, అత్యంత సులభంగా ప్రశ్నపత్రాలను పెన్‌డ్రైవ్‌లోకి ఎక్కించుకుని, ఎంచక్కా అనేకమంది అమ్మాయిలను ట్రాప్ […]

రెండు మూడు దేశాలు విడిపోతే… అదీ ఓ ఖండం అనిపించుకుంటుందా..?!

March 16, 2023 by M S R

new continent

వార్త ఏమిటంటే..? భూగర్భంలోని ఒక టెక్టానిక్ ప్లేట్ రెండుగా విడిపోతోంది… దానిపై ఉన్న ఆఫ్రికా ఖండం కూడా రెండుగా చీలిపోతుంది… ఈ రెండు చీలికల నడుమ ఓ కొత్త సముద్రం ఏర్పడుతుంది… కానీ ఇవన్నీ జరగడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టొచ్చు….. ఇదీ వార్త… ఎవరో ఏదో రాస్తారు… ఇంకేం..? అందరూ దాన్నే పట్టుకుని పీకుతూ ఉంటారు… జరుగుతున్నది ఇదే… ఏ ఇంగ్లిష్ వాడు రాస్తే ఈనాడు అనువాదం చేసుకుందో, సొంత భాషలో రాసుకుందో, లేక తనే […]

పెద్ద బ్యాంకులు దివాలా తీస్తున్నయ్… బహుపరాక్, బహుపరాక్…

March 16, 2023 by M S R

another bank

పార్ధసారధి పోట్లూరి ………. బంగారం మరియు వెండి మీద పెట్టుబడులు పెట్టండి ! ప్రపంచంలో 8వ అతి పెద్ద బాంక్ ‘క్రెడిట్ సూయిస్సే’ [Credit Suisse]త్వరలో మూతపడనున్నది ! ఈ జోస్యం చెప్పింది మరెవరో కాదు రాబర్ట్ కియోసాకి [Robert kiyosaki ] అనే బాంకింగ్ నిపుణుడు! అయితే కియోసాకి అనే బాంకింగ్, స్టాక్ మార్కెట్ నిపుణుడి అతని జోస్యానికి మనం విలువ ఇవ్వాలా? కియోసాకి ప్రిడిక్షన్ కి చాలా విలువ ఉంది ఎందుకంటే 2008 లో […]

వర్మ ఒక్కడే బతికితే సరిపోతుందా..? వర్శిటీ వీసీ ఏం పాపం చేశాడు మరి…!!

March 16, 2023 by M S R

rgv

అసలు వర్మ తప్పేముంది..? అది ఎప్పుడో కుళ్లిపోయి దుర్గంధం వ్యాప్తిచేస్తున్న బుర్ర… మొత్తం తెలుగు సమాజానికి ఆ స్పష్టత ఉంది… కానీ తనకు పెద్ద పీట వేసి, పిలిచి, దండలేసి, కీలక ప్రసంగానికి ఆహ్వానించిన సదరు నాగార్జున యూనివర్శిటీ పెద్దలను అనాలి… ఐనా వాళ్లనూ అనాల్సిన పని లేదేమో… తమ బుర్రలు వర్మకన్నా దిగువ స్థాయిలోనేననీ, వాటికీ క్షయ వ్యాధి సోకినట్టేననీ వాళ్లే నిరూపించుకున్నారు… నిజానికి వర్మను ఎవరూ ఛీత్కరించి ఉమ్మేయనక్కర్లేదు… నాగార్జున యూనివర్శిటీ పెద్దలు ఏ […]

వీ6 వెలుగుపై నిషేధంతో బీఆర్ఎస్‌ పార్టీకి నిజంగా ఒరిగే ఫాయిదా ఏముంది..?!

March 15, 2023 by M S R

v6 velugu

వెలుగు పత్రిక, వీ6 చానెల్ పై బీఆర్ఎస్ బ్యాన్ పెట్టింది… జరగాల్సినంత చర్చ జరగడం లేదు… ఎవరో కొందరు జర్నలిస్టులు ఆందోళన వెలిబుచ్చారు… పత్రిక స్వేచ్ఛ, భావప్రకటన అనే పదాలు చాలా విస్తృతమైనవి… బీఆర్ఎస్ అనే పార్టీ ఓ చిన్న దినపత్రిక, ఓ పాపులర్ చానెల్‌పై నిషేధం పెడితే ఆ రెండు పదాల చట్రంలో ఒకటీరెండు జర్నలిస్టు సంఘాలు ఆందోళన వ్యక్తీకరించడం విశేషమే… ఎందుకంటే… అది ఆ మీడియా హౌజు సమస్య… అదే పోరాడాలి… సాక్షిని మూసేయించాలని […]

తక్కువ తింటూ… చలికి వణుకుతూ… బ్రిటన్‌లో అదుపుతప్పిన ద్రవ్యోల్బణం…

March 14, 2023 by M S R

inflation

పార్ధసారధి పోట్లూరి ……….. బ్రిటన్ ద్రవ్యోల్బణం 17.1% శాతానికి చేరుకుంది ::  కాంటర్ రీసర్చ్ & ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ !  ఈ రీసర్చ్ [Kantar Research & Project Management ] అనేది బ్రిటన్ కేంద్రంగా సేవలు అందించే సంస్థ ! మానవ వనరులు మరియు వివిధ అంశాల మీద పరిశోధన చేసి సాక్ష్యాధారాలతో సహా తన రిపోర్ట్ ఇచ్చే సంస్థ ! ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలలో తన సేవలని అందిస్తుంది ! కంటర్ బ్రిటన్ దేశవ్యాప్తంగా […]

డీజే అంటేనే మరణమృదంగం… పెళ్లి వేడుకల్లో ఈ చావులేంట్రా నాయనా..?!

March 14, 2023 by M S R

dj

DJ Deaths: “శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః” సంగీతానికి ఏ ప్రాణి అయినా కరిగి, తలలూపాల్సిందే. కాలకూట విషాన్ని కోరల్లో దాచుకున్న పాములయినా…సంగీతానికి పడగ విప్పి నాట్యం చేయాల్సిందే. అలాంటిది సామాన్య మానవులు సంగీతం కోసం చెవులు కోసుకోకుండా ఎలా ఉంటారు? తప్పకుండా కోసుకుంటారు. అదే జరుగుతోంది లోకంలో. డి జె దెబ్బకు ఆగిన వరుడి గుండె బీహార్లో ఒక పెళ్లి పందిరి. రంగు రంగుల విద్యుద్దీపాలు. పూల అలంకరణతో పెళ్లి పందిరి కళకళలాడుతోంది. పెళ్లి కొడుకు […]

సిలికాన్ బ్యాంక్ వ్యాలీ ట్రెయిలర్ మాత్రమే… అసలు కథ ఇంకా ముందుంది…

March 14, 2023 by M S R

svb

ఆదానీ గ్రూపుకి అప్పులు ఇవ్వడానికి బాంకులు ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాయి. ఇన్వెస్టర్లు కూడా ఆదానీ గ్రూపు పట్ల విశ్వాసం చూపిస్తూ వస్తున్నారు ఇంకా ! ఆదానీ గ్రూపు షేర్ల ధరలు తగ్గడం గ్రూపు పని తీరు మీద ఆధారపడి జరగలేదు. హిండెన్బర్గ్ రిపోర్ట్ ఇచ్చింది నిజమే అనుకుని భయంతో అమ్ముకున్నారు చాలామంది…. కానీ ఆదానీ గ్రూపు దివాళా తీయలేదే ? అదే ఒక అమెరికన్ కమర్షియల్ బాంక్ దివాళా తీయడం, అందులోనూ కష్టాలలో ఉన్నాం, భారీ పెట్టుబడులు […]

ఆదానీ సరే.., సిలికాన్ వ్యాలీ బ్యాంకుపై హిండెన్‌బర్గ్ మౌనం దేనికి సంకేతం..?!

March 14, 2023 by M S R

svb

పార్ధసారధి పోట్లూరి ……… సిలికాన్ వాలీ బ్యాంక్ మూత పడ్డది ! SVB Financial Group ! Friday, March 10, 2023… అమెరికాలో పెద్ద బాంకుల జాబితా పరంగా చూస్తే 16 వ పెద్ద బాంక్ సిలికాన్ వాలీ బాంక్ ! SVB కి శాంతా క్లార [Santa Clara], కాలిఫోర్నియా లో హెడ్ ఆఫీస్ ఉంది ! ఇంత హఠాత్తుగా ఇంత పెద్ద బాంక్ ఎలా మూతపడింది ? హఠాత్తుగా అనే పదం ఎందుకు […]

కరోనా చావలేదు… ఓ విధ్వంసాన్ని మిగిల్చింది… గుండెపోట్లు ఆ ప్రతాపమే…

March 14, 2023 by M S R

covid

అనేక మంది చనిపోతే అది ఒక సంఖ్య, మన వారు ఏ ఒక్కరు చనిపోయినా అది విషాదం… సమాజంలో మనం చూసే పోకడ ఇది. తన దాకా రానప్పుడు ‘తాను’లు కొందరు, పెద్దమనుషుల వేషం వేసుకొని, ఆ విషయంలో తమకు తగిన అవగాహన – జ్ఞానం లేకున్నప్పటికీ ఉత్తుత్తి భరోసాలు ఇస్తూ పోతుంటారు. మరణాల గురించి గతంలో లేని ప్రచారం ఇప్పుడు వుంది తప్ప, నిజంగా గుండె జబ్బుల మరణాలు పెరగలేదు అనే భ్రమ వల్ల… తగిన […]

వీటినే ఎర్రగడ్డ వ్యాసాలు అంటారు… మోకాలికీ బట్టతలకూ ముడేసే కథనాలు…

March 12, 2023 by M S R

aj

గాంధీని చంపింది గాడ్సే… చంపించింది నెహ్రూ… గాంధీ ఎప్పటికైనా పటేల్ వైపు మొగ్గి, తన కుర్చీ పీకేసి, పటేల్‌ను ప్రధాని చేస్తాడేమోనని నెహ్రూ భయం, సందేహం… అందుకే ఆర్ఎస్ఎస్‌లో ఉన్న గాడ్సే పట్టాడు… చంపించాడు… నేరమంతా ఆర్ఎస్ఎస్ పైకి వెళ్లిపోయింది… ఇదీ జరిగిన నిజం……… జుత్తు పీక్కుంటున్నారా..? పిచ్చి లేచినట్టు అనిపిస్తోందా..? కళ్లెదుట ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి గేటు కనిపిస్తోందా..? ఏమో… ఆ కథ నిజం కాదు, కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసిన కొత్త పలుకు గనుక నమ్మితే… […]

రాఖీ కేజీఎఫ్ గుర్తుంది కదా… అలాంటి భారీ బంగారు గనులు కొత్తగా వెలుగులోకి…

March 12, 2023 by M S R

gold mine

కేజీఎఫ్ సినిమాలో రాఖీ పాత్ర గురించి మన దర్శకులు తన్నుకుంటున్నారు కదా… ఆ పంచాయితీ పక్కన పెడితే… ఆ సినిమాలో రాఖీ తవ్వే స్థాయిలో బంగారు గనులు అసలు ఇండియాలో ఎక్కడున్నాయనే ప్రశ్నను సహజంగానే చాలామంది లేవనెత్తారు… ఇప్పటిదాకా లేవు కానీ ఇప్పుడు కొత్తగా కనిపెట్టారు… నిజం… జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒడిశాలోని మూడు జిల్లాల్లో భారీ బంగారం నిక్షేపాలను కనిపెట్టింది… ఈ విషయాన్ని ఎవరో కాదు, సాక్షాత్తూ ఒడిశా స్టీల్ అండ్ మైన్స్ మంత్రి […]

రామోజీరావు, శైలజలపై సీఐడీ కేసులు… మార్గదర్శి చిట్స్‌పై జగన్ ‘దాడి’…

March 11, 2023 by M S R

margadarsi

రామోజీరావు డిపాజిట్ల సేకరణకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో అలాగే ఉంది… ఉండవల్లి నడిపిస్తున్న కేసులో ఏపీ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయ్యింది… రామోజీరావు మీద ప్రేమ ఎక్కువై కేసీయార్ తను ఇంప్లీడ్ గాకుండా సానుభూతి కనబరుస్తున్నాడు… అప్పట్లో హడావుడిగా ఆ కేసు క్లోజ్ అయిపోతుంది అనుకున్నారు గానీ ఉండవల్లి ఉడుం పట్టు పట్టడంతో ఆ కేసు సజీవంగా ఉండిపోయింది… ఇప్పుడు జగన్ ప్రభుత్వం (మార్గదర్శి డిపాజిట్లపై ఉరిమిన ఆ వైఎస్ కొడుకే కదా…) మార్గదర్శి చిట‌ఫండ్స్ మీద […]

మల్లన్న దేవుడికి 4500 ఎకరాల అడవి… నీ కొండలు నువ్వే కాపాడుకో…

March 11, 2023 by M S R

sslm

Chalasani Srinivas……….. ఇది చాలా ప్రాముఖ్యత గల వార్త శ్రీశైలం దేవస్థానానికి చెందిన 4500 ఎకరాల అటవీ ప్రాంతాన్ని తిరిగి దేవాలయానికి అందజేయడం. కానీ తెలంగాణలో కొన్నిపత్రికల్లో తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముఖ్యమైన నాలుగు పత్రికల్లో ఈ వార్త నాకు కనపడలేదు, బహుశా ఏ మూలన్నా ఇరికించారేమో తెలియదు. టీవీలు సాధారణంగా నేను చూడను గనుక వేశారో లేదో తెలియదు. సోషల్ మీడియాలో ఒక్కటంటే ఒక్క పోస్టూ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద […]

కేటీయార్ టీవీ చానెల్ పైపైకి… జగన్, బీజేపీ టీవీ చానెళ్లు నానాటికీ లోపలికి…

March 10, 2023 by M S R

barc

ఆల్‌రెడీ హైదరాబాద్ బార్క్ మార్కెట్‌లో ఎన్టీటీవీ ఫాఫం నాలుగో ప్లేసుకు పడిపోయింది… పేరుకు అది తెలుగు న్యూస్ చానెళ్లలో నంబర్ వన్… కానీ కీలకమైన ఫైనాన్షియల్ మార్కెట్ హైదరాబాద్‌లో మాత్రం దాని ప్రగతి ఇదీ…! ఇంకో విశేషం తెలుసా..? మేం టీవీ9 చానెల్‌నే కొట్టేశాం అంటున్నారు కదా… ఇప్పుడు ఆ ఎన్టీవీని ఫస్ట్ ప్లేసు నుంచి పడగొట్టేయడానికి టీవీ9 జస్ట్, ఒకే అడుగు దూరంలో ఉంది… అంటే రెండు చానెళ్ల నడుమ తేడా కేవలం ఒక జీఆర్పీ […]

రమ్యా రఘుపతీ..! నీ మొగుడు నాలుగో పెళ్లి చేసేసుకున్నాడట తెలుసా..?!

March 10, 2023 by M S R

naresh pavitra

ఒక పవిత్ర బంధం రెండు మనసులు మూడు ముళ్లు ఏడు అడుగులు మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు – మీ #PavitraNaresh ……… అని సీనియర్ యాక్టర్ నరేష్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు… ఓ వీడియో కనిపిస్తోంది… అందులో నరేష్, పవిత్ర పెళ్లి చేసుకుంటున్నట్టుగా ఉంది… ఓహ్, వీళ్లిద్దరూ పెళ్లి చేసేసుకున్నారా అనిపించేలా ఉంది… అయితే ఇది నిజమేనా..? నరేష్ ఆమెను పెళ్లిచేసుకోవడం నిజమేనా..? నరేష్‌కు ఇప్పటికి మూడు పెళ్లిళ్లయ్యాయి… మూడూ పెటాకులే… ఇప్పుడు పవిత్రను నాలుగో […]

యతో ధర్మః తతో జయః … తథాస్తు… తప్పదు, ధర్మమే జయించాలి…

March 10, 2023 by M S R

liquor scam

యతో ధర్మహ తతో జయహ… కవిత నోటి వెంట వచ్చిన సూక్తి ఇది… నిజమే, ఎప్పటికైనా ధర్మం జయిస్తుంది… జయించాలి కూడా… తథాస్తు, నీ కోరిక నిండుగా నెరవేరాలక్కా… అయితే ఇక్కడ డౌటేమిటంటే… ఏది ధర్మం, ఏది జయించాలి… నేను కవిత బినామీని అని పిళ్లై అంగీకరిస్తాడు, స్కామ్ నిజమే అంటాడు… ఐఫోన్లన్నీ అందుకే ఫర్నేస్ చేశామనీ చెబుతాడు, అదంతా ఓ స్కామ్ అని సీబీఐ, ఈడీ దర్యాప్తులో నిజాలు వెల్లడవుతున్నాయి… మరి ఆ దర్యాప్తు ధర్మమా […]

సత్తిబాబు 2 పుస్తెలూ కట్టేశాడు… ఆ ప్రాంత గిరిజనం తరలివచ్చి ఆశీర్వదించింది…

March 10, 2023 by M S R

bride

మూడు రోజులుగా ఈ వార్తను ఫాలో అవుతుంటే… ఈరోజు వార్తల్లోని చివరి వాక్యం ఇంట్రస్టింగుగా ఉంది కనెక్ట్ అయిపోయింది… ఆ వాక్యం ‘‘ఈ పెళ్లి కోసం చుట్టుపక్కల నుంచి గిరిజనం విశేషంగా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు..’’ ముందుగా ఈ వార్త ఏమిటో సంక్షిప్తంగా… భద్రాచలం ఏరియాలో చర్ల మండలం, ఎర్రబోరు గ్రామం… సత్తిబాబు (ఎస్టీ) ఇంటర్ చదువుతున్నప్పుడు స్వప్న అనే అమ్మాయిని ప్రేమించాడు… ఆ ప్రాంత గిరిజన సంప్రదాయంలో అమ్మాయిని పెళ్లికి ముందే ఉంచేసుకోవచ్చు… సారీ, […]

తెలుగు మీడియా వార్… పార్టీలు తన్నుకుంటే మైక్‌సెట్లు మౌనంగా ఉంటాయా..?!

March 9, 2023 by M S R

media war

ఆంధ్రజ్యోతి జగన్ మీద రోజూ ఏదో ఒకటి రాస్తుంది… జాతి ద్వేషం అనను గానీ, అది ఆ పచ్చ పార్టీ క్యాంపు ఎజెండా… సాక్షి నీలి పత్రిక, నీలి మీడియా అని ఓ ముద్దరేస్తుంది… (నిజానికి సాక్షికి పెద్దగా నీలితనం మీద ఇంట్రస్టు, టేస్టు ఉన్నట్టు కనిపించదు… కాస్తోకూస్తో ఆంధ్రజ్యోతి సైటులోనే ఓ పోకడ ఎక్కువ…) సాక్షి అనే పేరునే తన పత్రికలో పబ్లిష్ చేయదు… అదేదో నిషిద్ధాక్షరిలాగా… సాక్షి ఆంధ్రజ్యోతిని బూతు పత్రిక, యెల్లో మీడియా,  […]

చైనా నిఘా బెలూన్ కూల్చివేతకు అమెరికా అపసోపాలు… తైవాన్ కాన్‌ఫ్లిక్ట్-3

March 9, 2023 by M S R

china air ballon

పార్ధసారధి పోట్లూరి ………… చైనా –తైవాన్ వివాదం 03… ఉక్రెయిన్ విషయంలో రష్యా విఫలం అయితే అది ప్రత్యక్షంగా తైవాన్ మీద ప్రభావం చూపిస్తుంది ! చైనా తైవాన్ ని ఎట్టి పరిస్థితులలోనూ వదులుకోవడానికి ఇష్టపడదు ! చైనాకి మనుగడకి ఆధారమయిన గ్లోబల్ సప్లై చైన్ యొక్క ఆధిపత్యాన్ని తైవాన్, వియత్నాం, ఇండోనేషియా, మలేషియాలతో పాటు భారత్ కి వదులుకోవాల్సి వస్తుంది తైవాన్ తన అధీనంలో నుండి వెళ్లిపోతే ! ఈ రోజు కాకపోతే మరో రోజు […]

  • « Previous Page
  • 1
  • …
  • 79
  • 80
  • 81
  • 82
  • 83
  • …
  • 141
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions