Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘ఒకవేళ ఎవరి ప్రాణమైనా పోతే, నువ్వు బాధ్యత వహిస్తావా సమంతా..?’

July 7, 2024 by M S R

సమంత… తెలుగు మీడియా పెద్దగా దృష్టి పెట్టలేదు గానీ… ఓ తాజా వివాదంలో ఇరుక్కుని సోషల్ మీడియాలో, డాక్టర్ల సర్కిళ్ల నుంచి తిట్లు తింటోంది… తన చుట్టూ ఓ నెగెటివిటీని సృష్టించుకోవడం సమంతకు కొత్తేమీ కాదు కదా…

విషయం ఏమిటంటే..? రీసెంటుగా ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో ఓ పోస్టు పెట్టింది… తన మొహానికి నెబ్యులైజర్ తగిలించి ఉంది… (ఊపిరితిత్తుల్లోకి ఆవిరిన పీల్చుకునే పరికరం)… వైరల్ ఇన్‌ఫెక్షన్లు సోకినప్పుడు మందులకన్నా హైడ్రోజన్ పెరాక్సైడ్ పీల్చుకుంటే మేలు అని ఏదో రాసుకొచ్చింది…

నిజానికి సోషల్ మీడియాలో కనిపించే చాలా వైద్య సలహాలు ప్రమాదకరమైనవి… దాంతో చాలా దుష్ఫలితాలు వస్తున్నాయి… ఇక లక్షల సంఖ్యలో ఫాలోయర్స్ ఉండి, పిచ్చి అభిమానులు వెంటనే అనుసరించే సెలబ్రిటీలు అశాస్త్రీయమైన వైద్య సలహాల్ని ఇవ్వడం అస్సలు కరెక్టు కాదు సొసైటీకి..! ఎవరైనా ప్రొఫెషనల్ డాక్టర్లు సరైన జాగ్రత్తలు, సరైన ప్రమాదరహిత డోసులతో ఏమైనా సోషల్ మీడియాలో చెప్పడం వేరు…

Ads

ఇక్కడ సమంత చెప్పింది అశాస్త్రీయం అని ఎందుకు చెప్పుకోవాలీ అంటే… కరోనా పీరియడ్‌లోనే ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ పీల్చుకోవడం మీద పెద్ద రచ్చ సాగింది సోషల్ మీడియాలో… డిస్టిల్డ్ వాటర్ / సెలైన్ ప్లస్ హైడ్రోజన్ పెరాక్సైడ్ పీల్చుకోవడం ప్రమాదమని డాక్టర్లు హెచ్చరించారు… ఆశించిన మంచి జరగకపోగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పుకొచ్చారు…  (ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడు కొందరు రిలీఫ్ కోసం విక్స్ వేపోరబ్ వంటివి మరిగే నీళ్లలో వేసి, ఆ ఆవిరిని పీలుస్తుంటారు తెలుసు కదా, అవి కూడా వద్దంటారు కొందరు డాక్టర్లు…)

ఇప్పుడు సమంత మళ్లీ అదే చెబుతోంది… నిజంగానే హైడ్రోజన్ పెరాక్సైడ్ డోసు పెరిగితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి… ఇదే ప్రస్తావిస్తూ… లివర్ డాక్టర్‌గా సోషల్ మీడియాలో బాగా ప్రసిద్ధుడైన ఓ డాక్టర్ సమంతను ఓ పోస్టులో ఆడుకున్నాడు… ఇలా వైద్యం మీద తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వాళ్లను ఉపేక్షించొద్దు… సమంత వైద్యం కోణంలో ఓ నిరక్షరాస్యురాలు, ఐనా ఇలాంటి పోస్టులు పెడితే జైలులో పెట్టాలి అంటూ విరుచుకుపడ్డాడు…

బోలెడన్ని కామంట్లు, వ్యాఖ్యలు, విమర్శలు… సమర్థనలు నడుస్తూ ఉన్నాయి… సమంత కూడా సదరు డాక్టర్ పోస్టుకు ప్రతిగా తనూ మరో పోస్టు పెట్టి… ఆ డాక్టర్ చెప్పదలుచుకున్న ఉద్దేశాన్ని తప్పుపట్టడం లేదు గానీ, జైలులోకి తోసేయాలి వంటి పరుష పదజాలం సరిగ్గా లేదు అని సుదీర్ఘంగా ఏదో చెప్పుకొచ్చింది… నిజానికి వీలైనంతవరకూ సెలబ్రిటీలు ఇలాంటి వైద్యసలహాల జోలికి వెళ్లకపోవడమే బెటర్… కొన్నిసార్లు ఇలాంటి సలహాలు వికటించే ప్రమాదం ఉంది కాబట్టి..!

తాజాగా గుత్తా జ్వాల కూడా స్పందించి సమంతకు ఘాటుగా ఓ ట్వీట్ రాసింది… ఒకవేళ, ఒకవేళ ఈ వైద్యసలహా వల్ల ఎవరి ప్రాణాలైనా పోతే నువ్వు బాధ్యత వహిస్తావా సమంతా అని ప్రశ్నించింది… సీరియస్ క్వశ్చనే… ఇంకా సమంత స్పందించినట్టు లేదు… ఆల్రెడీ ఏదో రుగ్మతకు ఆమె చాన్నాళ్లుగా మెడికేషన్ తీసుకుంటోంది… ఆరోగ్యం ఇంకా చక్కబడినట్టు కూడా లేదు… దానికితోడు ఈ తలనొప్పులు, వివాదాలు అవసరమా ఆమెకు..! పైగా తనకు సంబంధం లేని అంశాల్లో..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కైసే కహూఁ కుచ్ కెహనా సకూఁ … మహేంద్రన్ సినిమాల తీరే వేరు !!
  • అయ్యా, నేతాజీ మునిమనవడు గారూ..! ప్రభాస్ గ్లింప్స్‌లో తప్పేం లేదు..!!
  • అసలు నీకు బుద్దుందా వాసూరావ్..? సాయిపల్లవిపై ఈ కూతలేంటి..?
  • నీటికి Expiry Date ఉందో లేదో మీకు తెలుసా..?
  • కొమ్మూరి యుగంధర్ – అప్పట్లో పాఠకుల్ని ఉర్రూతలూగించిన పేరు !!
  • రేవంత్ ప్రయత్నాలకు ఫడ్నవీస్ పాజిటివ్- ఇక కిషన్ రెడ్డి ఏం చేస్తాడో ..!?
  • మొద రాత్రి! ఇది కేయాస్ నేరేటివ్… అంటే గందరగోళమే కథ ముడిసరుకు!!
  • నల జిలుకర మొగ్గ – కాలంతోపాటు మారితేనే ఏ కళకైనా మనుగడ !!
  • వడివేలు వంద కోట్ల భవనం.. కుటుంబం కోసమా? సంపదకు భద్రతా?!
  • గజబ్ రాత్ ! కథ గజబ్… కథనమే గజిబిజి… అనేక మలుపుల చిక్కుముడి !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions