. మయసభ… సోనీ లివ్‌లో ఉన్న వెబ్ సీరీస్… పేరుకు ఇది కల్పితకథ అని ఓ పే-ద్ద డిస్క్లయిమర్ వేసి,… చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిల రాజకీయాల చరిత్రగా అందరికీ అర్థమయ్యేట్టు తీశాడు దర్శకుడు దేవ కట్ట… అందులో పాత్రలు ఏవి ఎవరివో ప్రేక్షుకులు ఇట్టే పోల్చుకుంటారు… ఎలాగూ కల్పితం అని డిస్క్లయిమర్ వేసేశాం కదాని క్రియేటివ్ ఫ్రీడం తీసుకుని ఏదో కులసమరంలా కథను, ఆ ఇద్దరి పాత్రలనూ రాసుకున్నాడు… సరే, ఏదో రాశాడు, ఏదో తీశాడు సరేగానీ… […]
సీఎం స్వయంగా ఓసారి టాలీవుడ్ యవ్వారాలపై దృష్టిపెట్టడం బెటర్..!!
. రేవంత్ రెడ్డి ఎంత ఉదారంగా ఉంటున్నా సరే… తెలుగు సినిమా పరిశ్రమ వ్యవహారాలకు సంబంధించి తను బాగా మిస్లీడ్ అవుతున్నాడనే భావన ప్రబలంగా వ్యాపిస్తోంది… 1) దిల్ రాజు… తను స్వతహాగా సినిమా వ్యాపారి… తనకు రాగద్వేషాలు ఉంటాయి… అవి ప్రభుత్వంపై రిఫ్లెక్ట్ అవుతాయి… అది ఓ ప్రజాప్రభుత్వానికి సరైనది కాదు… 2) కోమటిరెడ్డి… తను మంత్రే… తను పెద్దగా సినిమా పరిశ్రమ నుంచి ఆశించేది ఏమీ ఉండదు… కానీ తను కూడా మిస్లీడ్ అవుతున్నాడు… […]
రీఎంట్రీ సరే గానీ… కుర్ర వేషాలకు సూటయ్యే సీన్ లేదయ్యా నవీనూ..!
. నిన్న ఈటీవీ ప్లస్‌లో రాత్రి చాలా బాగుంది అనే సినిమా వస్తోంది… వడ్డే నవీన్, శ్రీకాంత్ నటించారు… మాళవిక హీరోయిన్… ఈవీవీ సినిమా… పెద్దగా కథ అంతగా ఆకట్టుకునేలా లేకపోయినా… సినిమాలో ఎల్బీ శ్రీరాం పోషించిన గంటస్తంభం వెంకటేశ్వరరావు అనే ఒక విలక్షణమైన పాత్ర హైలైట్… ఆ పాత్ర సంభాషణలు కూడా చాలా డిఫరెంట్..! వడ్డే నవీన్‌ను చూస్తుంటే అనిపించింది… మాంచి బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా సరే… అది ఎంట్రీ వరకే తప్ప నిలదొక్కుకోవడానికి పనికిరాదు కదా […]
చిరంజీవి పక్కకు… కందుల దుర్గేష్ తెరపైకి… ఫాఫం అన్నగారు..!!
. ఇంతకుముందు చెప్పుకున్నదే… తెలుగు నిర్మాతలు అంతే… వాళ్లు మారరు… వాళ్లు తెలంగాణలో బతుకుతున్నా, ఇక్కడి మానవ వనరులు, వనరులను దోచేస్తున్నా సరే… ఆ గుండెలు కొట్టుకునేది ఆంధ్రాలోనే… ఈ వ్యాఖ్య హార్ష్‌గా అనిపించినా అదే నిష్ఠురసత్యం… టాలీవుడ్ అడ్డా హైదరాబాద్ కదా… అక్కున చేర్చుకుని ఆదరించింది కదా… మనవాళ్లే అని ప్రేమించింది కదా… తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజుకు తీసుకుపోయింది ఇక్కడి నుంచే కదా… నువ్వు ఆంధ్రా, నేను తెలంగాణ […]
హరిశ్చంద్రుడు, చంద్రమతినీ లాక్కొచ్చినా సరే… ప్చ్… పండలేదు…
. Subramanyam Dogiparthi ……. ఇచ్చోటనె సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయె ! ఇచ్చోటనె భూములేలు రాజన్యుని అధికార ముద్రికలంతరించె !! గుర్రం జాషువా గారి కాటి సీను పద్యాలను నాటకంలో పాడీ పాడీ… ఈ సినిమాలో హీరో హీరోయినుతో సహా హరిశ్చంద్రుడు , చంద్రమతుల కష్టాలే పడతాడు . మనకు 1950s , 1960s లలో కష్టాల చుట్టూ సినిమాలు ఉండేవి . 1970s తర్వాత కధల్లో , మనుషుల్లో మార్పులు వచ్చాయి . […]
తెలుగు సినిమా జనం మారరు… వార్-2 ప్రిరిలీజ్ తీరూ అదే చెప్పింది…
. నిన్న ‘ముచ్చట’లో చెప్పుకున్నదే… ఎవరో సినిమా నిర్మాత, ఎవరో సినిమా హీరో తన లాభం కోసం, తన వినోద వ్యాపారం కోసం… తన సినిమా హైప్ కోసం ఓ మార్కెటింగ్ టెక్నిక్‌గా ప్రిరిలీజ్ ఫంక్షన్ పెడితే ప్రభుత్వం అంగీకరించాలా..? పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ డైవర్షన్లు, జనం అవస్థలు, ఫ్యాన్స్ వీరావేశాలు… తీరా వాళ్లకేమైనా కృతజ్ఞత ఉంటుందా..? జీరో… సొసైటీ పట్ల, ప్రభుత్వం పట్ల..! అదే జరిగింది… వాళ్లలో వాళ్లు పొగుడుకున్నారు… భుజకీర్తులు తొడుక్కున్నారు… చిన్న చిన్న […]
ఈ తరానికి తెలియకపోవచ్చు… ఈమె కోసమే థియేటర్లకు వెళ్లేవాళ్లు అప్పట్లో…
. మొన్న జ్యోతిలక్ష్మి వర్ధంతి… ఈ తరానికి ఆమె తెలియకపోవచ్చు… కానీ ఫిఫ్టీస్ నుంచి సెవన్టీస్ నడుమ ఉన్నవాళ్లందరికీ ఆమె ఓ ఐటమ్ బాంబ్… ఏవేవో సెర్చ్ చేస్తుంటే… మిత్రుడు Mani Bhushan అప్పుడెప్పుడో రాసిన ఓ పాత పోస్టు కనిపించింది… శృంగార కావ్యాలలొ రాసిన స్త్రీ సౌందర్యానికి, శరీర లావణ్యానికి సరైన కొలబద్దలా ఉండేది జ్యోతిలక్ష్మి. జ్యోతిలక్ష్మి ఆట, ఎల్లారీశ్వరి పాట, రాజబాబు కామెడీ ఒక జమానాలో తెలుగు సినిమాని ఊపేశాయి. అప్పట్లో హండ్రెడ్ డేస్ ఆడిన ప్రతి […]
ఎవరి సినిమాల్ని వాళ్లే చూసుకుంటున్నారు… ఒకటీఅరా మినహా…
. కింగ్డమ్ సినిమా వసూళ్లు ఇప్పటికి తెలుగులో 45.9 కోట్లు (10 రోజులు) … తమిళంలో కేవలం 3.7 కోట్లు సూ ఫ్రమ్ సో సినిమా వసూళ్లు కన్నడంలో 53.53 కోట్లు (16 రోజులు)… మలయాళంలో 2.55 కోట్లు (8 రోజులు), తెలుగులో మరీ 15 లక్షలు (ఒకరోజు) తలైవాన్ తలైవి సినిమా వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా 74.3 కోట్లు (16 రోజులు)… కానీ తెలుగు వెర్షన్ సార్ మేడమ్ వసూళ్లు 1.97 కోట్లు మాత్రమే… హరిహర వీరమల్లు […]
మాస్ మసాలా దట్టించి వదిలారు… దెబ్బకు బాలయ్య సూపర్ బ్లాక్ బస్టర్…
. Subramanyam Dogiparthi ……. బాలకృష్ణ, కోడి రామకృష్ణ, భార్గవ్ ఆర్ట్స్ గోపాలరెడ్డి కాంబినేషన్లో వచ్చిన సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఈ ముద్దుల క్రిష్ణయ్య . మ అనే అక్షరం వీళ్ళకు బాగా కలిసొచ్చింది . 28 సెంటర్లలో వంద రోజులు , మూడు సెంటర్లలో సంవత్సరం పాటు ఆడి డబ్బుల వర్షం కురిసింది . ఏముందంట ఈ సినిమాలో ? సగటు ప్రేక్షకుడి వినోదానికి ఏం కావాలో అవన్నీ ఉన్నాయి . గ్రామాలలో ఇప్పటికీ ఎంతో […]
ఏదో ప్రైవేటు సినిమా దందాకు… ప్రజలకెందుకు అవస్థలు నాయకా..?!
. సినిమాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డిని ఎవరో గానీ తప్పుదోవలో తీసుకుపోతున్నట్టుగా కనిపిస్తోంది… తన ధోరణి నుంచి యూటర్న్ తీసుకోవడం వెనుక ఎవరి ప్రభావం ఉందో గానీ… మామూలు జనానికి మాత్రం నచ్చని పంథాకు మళ్లింది ప్రభుత్వ విధానం… ఇక్కడ బతుకుతూ, ఇక్కడి నుంచే ప్రేక్షకులను దోచుకుంటూ… ఇక్కడి సీఎం పేరు తెలియనట్టు బహిరంగంగా, ఆఫ్టరాల్ తెలియాల్సిన అవసరమే లేదన్నట్టు నటించిన ఓ బన్నీని అరెస్టు చేయడం గానీ… సుద్దపూసలా నటిస్తూ ప్రభుత్వ భూమిని కబ్జా […]
మేల్ సావిత్రి..! అప్పటి హీరోయిన్ల కలల ప్రేమికుడు… చివరకు..!!
. ఐనా ఎవరికి గుర్తుంటాడులే… తన జయంతిని ఎందరు స్మరించుకుంటారులే… ఒక ఏఎన్నార్ అవుతాడు, ఒక ఎన్టీయార్ అవుతాడు అనిపించుకున్న ఓ అందాల నటుడి పుట్టినరోజు ఈరోజు… పేరు హరనాథ్… అసలు పేరు బుద్ధరాజు వెంకట అప్పల హరినాథ రాజు… నిజంగానే ఓ దశలో చాలా పాపులర్ హీరో తను… రూపం, నటనతో మెప్పించాడు… ఎన్టీయార్‌కే సొంతం అనుకునే శ్రీరాముడు, శ్రీకృష్ణుడి పాత్రల్లోనూ ఒప్పించాడు… అంతెందుకు..? ఎన్టీయార్ దర్శకత్వంలోనే వచ్చిన సీతారామకల్యాణం సినిమాలో రాముడు హరనాథే… తరువాత ఎన్టీయార్ […]
లాయర్ గారూ… నేను ఓ హత్య చేస్తాను… ఆ కేసు నుంచి మీరే కాపాడాలి…
. Subramanyam Dogiparthi …… ఆర్తుల పాలిట బ్రహ్మాస్త్రం ఈ సినిమాలో లాయర్ సాగర్ . బలహీనుల కోసం బలవంతులతో ఢీ కొట్టే పాత్ర కృష్ణది ఈ సినిమాలో . ఆ క్రమంలోనే ఒక బలవంతుడి అహాన్ని దెబ్బతీస్తాడు హీరో కృష్ణ . దెబ్బతిన్న పులి లాగా వేచి చూసి హీరో గారి బావని ఓ మర్డర్ కేసులో ఇరికించేస్తాడు ఆ విలనుడు . ఆ బావే తన పిచ్చి చెల్లెలిని చంపాడనే కచ్చతో రావు గోపాలరావు […]
అనువాద పాటలకు అర్థం…? సింపుల్..! ఏ అర్థమూ లేని పైత్యమే…!!
. తెలుగు సినిమా పాటల్లో సాహిత్యం, పైత్యం ఎట్సెట్రా మాట్లాడుకుంటున్నాం కదా తరచూ… ఆమధ్య వచ్చిన ధనుష్ సినిమాలో ఓ పాట గురించీ చెప్పుకుందాం… ఏదో సెర్చింగులో హఠాత్తుగా కనిపించింది… పాముల్లోనా విషముంది… పువ్వులోన విషముంది… పూలను తల్లో పెడతారే! పామును చూస్తే కొడతారే! …. హఠాత్తుగా చదివితే కవిత్వమో, పైత్యమో అర్థం గాక.., అరె, ఇది రాసింది ఎవడుర భయ్ అని ఆ మనిషి కోసం అర్జెంటుగా వెతకాలనిపిస్తదా లేదా..? పాముల్లోనా విషముంటది, పువ్వులోన విషముంది […]
పెద్ద హీరోలకు వందల కోట్లు… కార్మికుల కడుపు నింపడానికి ఏడుపులు..?!
. Prabhakar Jaini …. చిన్న సినిమా నిర్మాతలను బహిష్కరించాలి… అవును. ఒక చిన్న సినిమా నిర్మాతగా నేనే చెబుతున్నాను. ఎందుకంటే, అసలే కరోనా తర్వాత సినిమా నిర్మాణంలోని ప్రతీ పనికి రేట్లు విపరీతంగా పెరిగాయి. చిన్న సినిమా నిర్మాతకు సినిమారంగంలో మినిమం గౌరవం లేదు. ఏ ఆఫీసు గడప తొక్కినా, చీప్ గా చూస్తున్నారు. ఆఫీసులో ఉన్నా లేరని, ప్యూనులతో చెప్పిస్తారు. ఫోన్లు ఎత్తరు. ఎందుకంటే, చిన్న నిర్మాత, వాళ్ళు అడిగినన్ని డబ్బులు ఇవ్వ లేడు. […]
ఆ ఇద్దరూ అందాలను ఆరబోసిన మసాలా వంట.. సినిమా సూపర్ హిట్…
. Subramanyam Dogiparthi …… 26 కేంద్రాలలో వంద రోజులు ఆడిన సూపర్ హిట్ మాస్ మసాలా ఎంటర్టైనర్ 1986 జనవరిలో వచ్చిన ఈ కొండవీటి రాజా సినిమా . 1+ 2 సినిమా . వన్ చిరంజీవి , టు విజయశాంతి , రాధలు … కధ రొటీన్ దుష్టశిక్షణ , దేశరక్షణలతో పాటు ఫ్లేష్ బేక్లో హీరో గారి కుటుంబానికి విలన్ గారు చేసిన ద్రోహానికి ప్రతీకారం . ప్రస్తుత మన రెండు తెలుగు రాష్ట్రాలలో […]
*పోలీసుల ముక్కూచెవులు కోస్తూ… అమ్మవారికి రక్తార్పణం…*
. ( రమణ కొంటికర్ల ) ……… షోలే.. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఓ అసాధారణ విజయం.. తెర తెరమరుగయ్యేంతవరకూ చెప్పుకునే, నిల్చిపోయే పోయే బ్లాక్ బస్టర్. అలాంటి షోలే 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. రచయితలు సలీంఖాన్-జావేద్ అక్తర్ రచనా పటిమ, రమేష్ సిప్పి స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో తెరకెక్కిన షోలే 1975, ఆగస్ట్ 15న విడుదలై భారతదేశమంతా బాక్సాఫీస్ రికార్డులు బద్ధలు కొట్టింది. ముంబై మరాఠా మందిర్ లోనైతే వరుసగా ఏడేళ్లపాటు నడిచిన సినిమాగా […]
హీరో మాస్ మహారాజ్… సినిమా మాస్ జాతర… పాటకు బూతాభిషేకం…
. “ఓలే ఓలే గుంట నీ అయ్యకాడ ఉంటా నీ అమ్మకాడ తింటా నీ వొళ్ళోకొచ్చి పంటా బుద్ధి లేదు జ్ఞానం లేదు సిగ్గు లేదు మంచి లేదు మర్యాద లేదు అంగీ లేదు లుంగీ లేదు పంచె లేదు తాడు లేదు బొంగరం లేదు నీ అమ్మని నీ అక్కని నీ తల్లిని నీ చెల్లిని… . పట్టుకుని కాళ్లు మొక్కి పోతా…” అన్న ఒకానొక పాటలో బూతు వినపడలేదా? కనపడలేదా? దానిమీద సిగ్గూ శరం లేదా […]
ఇక్కడ సుహాసిని- విజయశాంతి… అక్కడ జయప్రద – శ్రీదేవి…
. Subramanyam Dogiparthi ……… రొమాన్స్ , ఎమోషన్ , సెంటిమెంట్ , డ్రామా , సస్పెన్సుల కలబోత 1986 జనవరిలో వచ్చిన ఈ శ్రావణ సంధ్య సినిమా … 1+2 సినిమా . బాగుంటుంది . కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మాతృక తమిళంలో వచ్చిన పౌర్ణమి అలైగల్ సినిమా . తమిళంలో శివకుమార్ , అంబిక , రేవతిలు నటించారు . కధ కూడా బాగుంటుంది . ఓ పెద్ద లాయర్ గారు […]
బాలీవుడ్‌పై అండర్ వరల్డ్ తుపాకీ నీడ… ఓ దర్శకుడి స్టోరీ ఇది….
. ( రమణ కొంటికర్ల ) అండర్ వరల్డ్ బెదిరింపులకు.. అదర్ వరల్డ్ బాటపట్టాడు: ఓ బాలీవుడ్ దర్శకుడి రియల్ స్టోరీ ఇది! బాలీవుడ్ ఇండస్ట్రీపై అండర్ వరల్డ్ మాఫియా ప్రభావమెంతో అందరికీ తెలిసిందే. కథలుకథలుగా చెప్పుకున్నదే. సినిమాల రూపంలో రీళ్లకు రీళ్లు బయటకొచ్చి బాక్సాఫీసులను బద్దలుకొట్టిందే. ఏకంగా జైళ్లకు వెళ్లిన నేతల సంగతీ ఈ లోకం చూసిందే. అలా అండర్ వరల్డ్ బాధితుల వరుసలో ఓ బాలీవుడ్ దర్శకుడు కూడా ఉన్నారు. అయితే, ఆయన తనను […]
తెరపైకి మళ్లీ ‘దాసరి చిరంజీవి’… పెద్దన్న పాత్రలోకి రంగప్రవేశం..!!
. మూడో రోజు కొనసాగుతున్న సినీ కార్మికుల పంచాయితీ… కొలిక్కిరాని నిర్మాతలు, కార్మికుల పంచాయితీ… కొనసాగుతున్న సినీ కార్మికుల బంద్… వేతనాలు పెంచేవరకూ తగ్గేది లేదంటున్న కార్మికులు… కాసేపట్లో నిర్మాతల కీలక సమావేశం… వేతనాల పెంపుపైనే ప్రధాన చర్చ… నిర్మాతల నిర్ణయాలపై నెలకొన్న ఉత్కంఠ… ఫెడరేషన్ తీరు నిరసిస్తూ ప్రెస్‌మీట్ పెట్టే అవకాశం… అసలు ఫెడరేషన్ సభ్యత్వంలో పనేమీ లేదు, ఎవరికైనా చాన్సులు ఇస్తాం అంటోంది నిర్మాతల మండలి… తాడు లాగుతున్నారు ఇరువైపులా… సరే, ఏ సమ్మె అయినా […]
- 1
- 2
- 3
- …
- 115
- Next Page »