Muchata.com Telugu Latest News

Muchata.com Provided Telugu Latest News, Political News , Political News, Breaking News in Telugu LIVE ముచ్చట

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆలియా గంగూభాయ్…! ఆమె తప్పులేదు… కానీ ఆ కేసు తప్పలేదు…

December 25, 2020 by M S R

ఒక సినిమా… దానికి ఓ హీరోయిన్… అనగా లీడ్ రోల్… ఓ పాపులర్ నటిని మాట్లాడుకున్నారు… కథ నచ్చింది… నటించింది… ఆ నటనకు గాను డబ్బు తీసుకుంది… అయిపోయింది… అది చీదేసినా తనకు నష్టం లేదు… హిట్టయితే అదనంగా ఏమీ డబ్బివ్వరు… కానీ ఆ సినిమా కథకు, లాభనష్టాలకు, చిక్కులకు, హక్కులకు అన్నింటికీ సోల్ ప్రొప్రయిటర్ ఆ సినిమా నిర్మాత… కొన్ని అంశాల్లో దర్శకుడు… అంతే కదా… మరి ఆ సినిమాకు సంబంధించి ఏమైనా వివాదం తలెత్తితే… […]

అసలే కంగనా… ఆపై అరవింద్ స్వామి… ఎన్నికలవేళ తలైవి సినిమా…

December 24, 2020 by M S R

కొందరి బయోపిక్స్ ప్రాంతాలకతీతంగా ఆకర్షిస్తాయి. చర్చకు తెర లేపుతాయి. అలాంటి వారిలో పురిచ్చితలైవిగా తమిళనాడును శాసించిన జయలలిత ఒకరు. ఏ ఝాన్సీ లక్ష్మీనో, రుద్రమదేవి గురించో చరిత్ర కథలు మాత్రమే విన్నవారికి… ఆ సాహసం, ఆ తెగువ, ఆ మొండిధైర్యం, సవాళ్లను స్వీకరించి ముళ్లబాటల్లోంచి ప్రయాణించి… ఓ హీరోయిన్ గా, నటిగా… ఆ తర్వాత తమిళనాట ఆరుసార్లు ముఖ్యమంత్రిగా జయకేతనమెగురేసి కనిపించిన సజీవసాక్ష్యం జయలలిత. ఇప్పటికే mx player లో క్వీన్ పేరుతో రమ్యకృష్ణ ప్రధానపాత్రలో గౌతమ్ […]

ఈ వర్మ అనేవాడే సొసైటీకి ఓ పెద్ద వైరస్… దీనికి వేక్సిన్ లేదు…

December 24, 2020 by M S R

ఎస్.., వర్మ అనేవాడు ఓ పైత్యం… అందులో డౌటేమీ లేదు… తను అంగీకరిస్తాడు… రకరకాల వర్తమాన సంఘటనల్ని తనదైన రీతలో కెలుకుతాడు… తన బుర్రకు తగినట్టు ఓ సినిమా తీసిపారేస్తాడు… ఇప్పుడూ అంతే… ఆ పరువు హత్య ఆధారంగా ఓ సినిమా తీశాడు… కాకపోతే లీగల్ ఇబ్బందులు రాకుండా పేర్లు మార్చాడు… అందరికీ తెలుసు ఆ హత్య ఏమిటో, ఆ కథ ఏమిటో… కానీ వర్మ చూసిన కోణం కరెక్టేనా..? ఒక మాధవరావు… తండ్రి… ఒక నమ్రత… […]

మా కులమేమీ శుద్ధపూస కాదు… సాయిపల్లవి ఇంట్రస్టింగ్ ఇంటర్వ్యూ

December 23, 2020 by M S R

మిర్యాలగూడకు చెందిన అమృత, ప్రణయ్, మారుతీరావుల కథపై రాంగోపాలవర్మ ఏదో సినిమా తీశాడు కదా… సరే, వర్మ రీసెంటు హిస్టరీ ద‌ృష్ట్యా ఆ సినిమా ఎలా తీశాడో, ఏమిటనేది పక్కన పెడితే… కులం కారణంగా జరిగే పరువు హత్యలపై నెట్‌ఫ్లిక్స్ కోసం తమిళ దర్శకుడు వెట్రిమారన్ ‘ఊర్ ఇరవు’ అనే ఓ ఫిలిమ్ తీసి, మంచి మార్కులు కొట్టేశాడు… పావ కథైగల్ పేరిట ఆ ఓటీటీలో విడుదలైన అంతాలజీ కథల్లో ఇదీ ఒకటి… అసలే ప్రకాష్ రాజ్, […]

మనమింకా ఆ డర్టీ కథల్లోనే పొర్లుతున్నాం… కానీ తమిళ సినిమా..?

December 19, 2020 by M S R

Gurram Seetaramulu………… నువ్వు పుట్టిన కులం నిషిద్దం అయినచోట , నువ్వు పెరిగిన ప్రాంతం పాప పంకిలం అయిన చోట, నువ్వెన్నుకున్న సహచరి అంతరం అయిన చోట. అసమ విలువల తూకంలో నీ లింగ బేధం అబేధ్యం అయిన చోట, గర్వం, గౌరవం, మదం, అహంకారం, అసహనం సర్వవ్యాప్తం అయిన చోట, పాపపు ( ప్రాయశ్చిత్త ) కథలకు చోటెక్కడ ? ఎక్కడ ఉన్నాయి ఈ మూలాలు ? ఒక కుటుంబం మానం, గౌరవం, మర్యాద, వీటిని […]

ఫాఫం నాని..! చివరకు ఇక్కడా ఫ్లాపేనా..? మరిక థియేటర్లలో దేనికి..?!

December 18, 2020 by M S R

సినిమా అన్నాక ప్లాపులుంటయ్, హిట్లుంటయ్…. కాకపోతే తెలుగు సినిమాకు ఆదాయాన్ని భారీగా తీసుకొచ్చే మార్గాలు పెరిగాక… రేంజ్ పెరిగింది… సినిమా ఎంత చెత్తగా ఉన్నా సరే, మరీ ఎక్కువ నష్టాలతో నిర్మాతలు ఏమీ తలపై తువ్వాలేమీ కప్పుకోవడం లేదు… ఒకేసారి ఇతర భాషల్లో రిలీజ్ చేయడం, శాటిలైట్ టీవీ హక్కులు, ఓటీటీ హక్కులు, ఓవర్‌సీస్ హక్కులు గట్రా చాలా రూట్లలో రెవిన్యూ వస్తోంది… కానీ కరోనా దెబ్బకు ఇండస్ట్రీ కకావికలం అయిపోయింది… థియేటర్లు దివాలా తీసే దుస్థితి… […]

అబ్బఛా… ఇంటి వద్దకు థియేటరట… చెప్పారులే సోది… రాశారులే బోడి…

December 18, 2020 by M S R

మీ ఇంటికే సరుకులు… మీ ఇంటికే కూరగాయలు… అని ప్రచారం సాగుతుంటే ఏమిటీ అర్థం..? హోం డెలివరీ చేస్తారు అనే కదా…! కానీ సినిమా వాళ్ల ప్రచారానికి అర్ధాలు వేరుంటాయి… అసలు కొన్నిసార్లు అర్థాలే ఉండవు… ఆ పైత్యానికి మనమే ఏదో ఒక అర్ధాన్ని ఊహించుకుని.., మన దిక్కుమాలిన మెయిన్ స్ట్రీమ్ ‘కవర్లు’ తీసుకుని రాసిన వార్త కదా అని గౌరవించి… మనలోమనమే నవ్వుకుని, వాళ్లను క్షమించేయాలన్నమాట… ఈ వార్త ఓసారి చదవండి… వీళ్లెవరో మనకు పెద్దగా […]

ఓవర్ రియాక్షన్..! దిక్కుమాలిన వ్యాఖ్యలపై పనికిమాలిన పంచాయితీ…

December 15, 2020 by M S R

హమ్మయ్య… ఒక సెగ చల్లారింది… పనికిమాలిన, దిక్కుమాలిన పంచాయితీ అది… ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం… ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరో ఓ కోన్‌కిస్కా ఏదో ఇండస్ట్రీకి చెందిన ఓ దివంగత సెలబ్రిటీపై ఏదో మతిలేని వ్యాఖ్య చేస్తే… దాని ఇండస్ట్రీ అభిప్రాయంగా పరిగణించాలా..? సీరియస్‌గా ఖండించేసి, ఇష్యూ చేయాలా..? అసలు విషయం ఏమిటీ అంటారా..? సింపుల్‌గా, సూటిగా చెప్పుకోవాలంటే… విజయ్ రంగరాజు అనబడే ఓ తెలుగునటుడు కన్నడ దివంగత సూపర్ స్టార్ విష్ణువర్ధన్‌పై అనుచిత […]

బెల్‌బాటమ్… కన్నడ డిటెక్టివ్ నవల తెలుగులో చదువుతున్నట్టుగా…

December 15, 2020 by M S R

అసలు బెల్‌ బాటమ్ ప్యాంటు అంటే మజాకా..? ఎన్టీయార్ డ్రెస్సుల బెల్ బాటమ్ సైజు, అంటే పాదాల దగ్గర వెడల్పు… అదో విశేషం అప్పట్లో… అది రోడ్డును ఊడ్చీ ఊడ్చీ పోగులు బయటపడకుండా… జిప్పులు కింద ఫాల్‌లాగా కుట్టించేవాళ్లు… నిజం, అప్పట్లో ప్యాంట్లకూ జిప్ పాల్స్… హహహ… ఎయిటీస్‌లో లెండి… న్యారో ప్యాంటు వేసుకుంటే వాడిని అన్నాడీ కింద చూసేవాళ్లు… తెలుగులోకి అనువదింపబడిన ఓ కన్నడ డిటెక్టివ్ సినిమా ‘బెల్ బాటమ్’ పేరు చూడగానే గుర్తొచ్చేది ఆ […]

వెర్రి తలలు వేస్తున్న రాజమౌళి “ఊడూ ఇజం” 

December 14, 2020 by M S R

మానవ నాగరికత, పరిణామ క్రమంలో జంతుజాలానికి మనుషుల మధ్య  జరిగిన సంఘర్షణలో మనిషే విజేత. ఆ విజయం తిరిగి మనుషులు – మనుషుల మధ్య కొనసాగి, అది వివిధ తెగలలో హింసా పూరిత ఘర్షణగా మారి రూపాంతరం చెందుతూ వస్తూ ఉంది. ప్రాచీనకాలంలో అన్ని తెగలలో ప్రబలంగా ఉన్న “ఊడూ ఇజం” గురించి మనం చెప్పుకోవాల్సిన సందర్భం. ఆ ఊడూ ఇజం సృష్టించిన నరమేధం అంతా ఇంతా కాదు. ఇప్పటికీ కొన్ని తెగలలో ముఖ్యంగా ఆ ఆఫ్రికాలోని కొన్ని సమూహాలలో ఊడూ ఇజం సంఘర్షణ, హింస రూపంలో కనిపిస్తూనే ఉంది.  తెలుగు సినిమా దర్శక ప్రముఖుడు […]

‘‘మంచి ఫ్యామిలీ టైప్ సార్…’’ అపార్థం చేసుకోకండి… ఓ డర్టీ సినిమా గురించే…

December 13, 2020 by M S R

‘‘ఫ్యామిలీ టైప్ సార్’’ ‘‘కాలేజీ గర్ల్ సార్’’………… విటులను ఆకర్షించే ప్రయాసలో కామన్‌గా వినిపించే పదాలు ఇవి… తప్పుగా అనుకోకండి ఎం.ఎస్.రాజు భయ్యా… నువ్వు నీ తాజా అద్భుత చిత్రం ‘డర్టీ హరి’ గురించి ఇచ్చిన ఇంటర్వ్యూలలో ‘‘ఫ్యామిలీ చిత్రం’’ ‘‘పాన్ ఇండియా చిత్రం’’ అని చెబుతుంటే అదే గుర్తొస్తోంది… అసలు సినిమా పేరులోనే ఆ డర్టీనెస్ ఉంది… ఆ డర్టీ వాసన ట్రెయిలర్లలోనూ గుప్పుగుప్పుమంటోంది… ప్రచారం నిండా అదే డర్టీనెస్… సరే, నీ టేస్టు నీ […]

బాలీవుడ్ యువరాణి…! అందరికీ ఆమే కావాలి… కిరాక్ గిరాకీ…

December 12, 2020 by M S R

బాలీవుడ్….. అదొక మెరుపుల కార్ఖానా… బోలెడు మంది వస్తుంటారు, పోతుంటారు… వెలిగిపోతుంటారు, మాడిపోతుంటారు… అదొక ప్రపంచం… స్థూలంగా చూస్తే అది అథోప్రపంచం… మాఫియా ప్రభావం, బంధుప్రీతి, అనేక వివక్షలు, శ్రమ దోపిడీ, ఆర్థిక దోపిడీ ఎట్సెట్రా అన్నీ… లైంగిక దోపిడీ సరేసరి… ఇక్కడ నెగ్గుకురావడం అంత వీజీ కాదు… మహేష్ భట్ అనబడే ఒకానొక అవలక్షణమూర్తి బిడ్డ అలియా భట్… ఇరవయ్యేళ్ల క్రితం బాలనటి… తరువాత 18, 19 ఏళ ప్రాయం నుంచే సినిమాలు… వేరే లోకం […]

పాపులర్ తారలనూ ఆకర్షిస్తున్న సినిమా… చిన్న పాత్రలకైనా సై…

December 11, 2020 by M S R

ఎనభయ్యేళ్లు దగ్గరపడిన బొడ్డు రాఘవేంద్రరావు పక్కన నటించడానికి తారలెవరూ ముందుకు రావడం లేదు… తను ఎందరో తారలకు లైఫ్ ఇచ్చినా సరే, తన లైఫ్‌లో మొదటిసారి నటిస్తుంటే ఎవరూ రెడీ అనడం లేదు… పాపం, తనికెళ్ల భరణి నానా తిప్పలూ పడుతున్నాడు… ఇవ్వాళారేపు పెళ్లికి అమ్మాయిలను మెప్పించడం ఎంత కష్టమో తెలుసు కదా… సేమ్, హీరోయిన్లను ఒక సినిమాకు ఒప్పించడం కూడా అంతే… పెద్ద పెద్ద హీరోలనే ఫోఫోవోయ్ అనేస్తున్నారు… ఈ సిట్యుయేషన్‌లో ఈ సినిమాకు మాత్రం […]

సిల్క్ అనసూయ..! ఆమె విసిరిన పిచ్చి ట్రాపులో చిక్కి మీడియా గిలగిల..!!

December 10, 2020 by M S R

నిజానికి యాంకర్ అనసూయ చేసిన తప్పేమీ లేదు… అడ్డంగా పిల్లిమొగ్గలు వేసి, చేతులు కాల్చుకుని, అరెరె అని నాలుక కర్చుకుని… హడావుడిగా ఖండనలు, వివరణలు రాసుకుని నిట్టూర్చింది మీడియాయే… సోషల్ మీడియా ట్రాపులో గానీ, ఆ ట్రాకులో గానీ పడొద్దు మెయన్ స్ట్రీమ్ మీడియా అని బలంగా చెప్పడానికి ఇదొక ఉదాహరణ… ఈమధ్య చాలా మంది సెలబ్రిటీలకు ఓ కొత్త జాఢ్యం పట్టుకుంది… ఉదాహరణకు సోషల్ మీడియాలో ఓ వేలు, వేలికి ఉంగరం కనిపించేలా ఓ పోస్టు […]

నటిస్తూ నటిస్తూ… స్టేజీ మీదే కుప్పకూలి… నటనకే జీవితమంతా ధారబోత…

December 8, 2020 by M S R

Article By…..  Bharadwaja Rangavajhala…………….  సాక్షి రంగారావు…. కామెడీ విలన్ గా … కమేడియన్ గా… కారక్టర్ ఆర్టిస్ట్ గా … ఇలా పాత్ర ఏదైనా అద్భుతంగా ప్రజంట్ చేసిన నిజమైన నటుడు సాక్షి రంగారావు. నాకు ఆయన డైలాగ్ మాడ్యులేషన్ చాలా ఇష్టం … సుమారు 450 సినిమాల్లో విభిన్నమైన పాత్రలు ధరించిన సాక్షి రంగారావు విచిత్రంగా కన్యాశుల్కం రిహార్సల్స్ లో పాల్గొంటూ స్టేజ్ మీదే కుప్పకూలిపోయి కన్నుమూశారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తూ రంగస్థలం […]

హే ప్రభాస్… 500 కోట్ల ఆదిపురుషుడు వివాదాల్లోకి… సీతమ్మ కిడ్నాప్ సబబేనట…!!

December 6, 2020 by M S R

…… పాత హీరో కృష్ణంరాజు, తన నటవారసుడు ప్రభాస్ బీజేపీ మనుషులే కావచ్చుగాక… కానీ పేకాట పేకాటే… ప్రభాస్ మనవాడే కదా అని రైట్ వింగ్ తనను వెనకేసుకు రాకపోవచ్చు… ప్రభాస్ శ్రీరాముడిగా నటించనున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఆదిపురుష్ అప్పుడే వివాదాల్లోకి దిగిపోతోంది… హిందుత్వ అభిమానులు, రామభక్తులు ఈ సినిమాను వ్యతిరేకించే సూచనలు అప్పుడే కనిపిస్తున్నాయి… దానికి కారణాలూ ఉన్నయ్… బాహుబలిని మించిన నిర్మాణవ్యయం, దాదాపు 500 కోట్లతో ఈ సినిమా తీయనున్నారు… రాముడిగా […]

అసలే చిరు, ఆపై ఓ సూపర్ ట్యూన్… కానీ ఆ గుబులెందుకాయెనో…

December 4, 2020 by M S R

నిన్నా… మొన్నా… నలభయ్యేళ్ల క్రితం పాట… ‘మాఘమాస వేళలో…’ ఈ ట్యూన్, ఈ పాట విన్నతరువాత చాలాసేపు బుర్రలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది… ఆ బాణి అదీ… సినిమా పేరు తెలుసా..? జాతర… ధవళ సత్యం దర్శకత్వం… హీరో ఎవరో తెలుసా..? మన మెగా చిరంజీవి… అవును, తన కెరీర్ కొత్తలో చేసిన సినిమా… విగ్గులు, పెట్టుడు మీసాలు, ముసలి మొహాలు చూసి విసిగిన ప్రేక్షకులకు చిరంజీవి వంటి యంగ్ స్టార్ల ఒ:రిజినల్ జుత్తు, ఒరిజినల్ ఫైట్లు, […]

సినీ ప్రయోగాలకు తమిళ తంబి ఎవర్‌రెడీ… టేస్ట్, మెరిట్, ఇంట్రస్ట్….

December 4, 2020 by M S R

ఇంకా మనవాళ్ల నుంచి అంత టేస్టు, ఆ ప్రయోగాలు ఆశించలేం గానీ… తమిళ, మళయాళ నటీనటులు, దర్శకులు, వృత్తినిపుణులు… ఓటీటీ ప్లాట్‌ఫారాల ప్రోత్సాహంతో మంచి ప్రయోగాలు చేస్తున్నారు… థియేటర్ నుంచి సినిమా చాలా దూరం వచ్చేస్తోంది… ఇప్పుడు అరచేతిలోనే సినిమా చూపించాలి ప్రజలకు… అదీ కొత్తకొత్తగా చూపించాలి… అంటే స్మార్ట్ ఫోనే థియేటర్… షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సీరీస్ అలాంటివే… నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ఓటీటీలు అనేక ప్రయోగాలకు రెడీ అంటున్నాయ్, ఎంకరేజ్ చేస్తున్నయ్… అందుకే చేతులు కాల్చుకోనవసరం […]

ఎంత మెగా బామ్మర్ది అయితేనేం… టాలీవుడ్‌లో అన్నీ తనకే కావాలా…?

December 3, 2020 by M S R

తన కుటుంబమే… బోలెడు మంది హీరోలు ఉండాలి… డిస్ట్రిబ్యూషన్ తన సిండికేటే… నిర్మాతల్లో పెద్ద మనిషి… డిజిటల్ దందాలో తనే… త్వరలో ఓ స్టూడియో… పైగా ఆహా అనే నవతరం ఓటీటీ… అంటే, తెలుగు సినిమాకు సంబంధించి అంతా తనే కావాలనే తాపత్రయం, ఆశ, ఆకాంక్ష, ప్రయత్నం… అప్పట్లో బావ పార్టీ పెడితే టికెట్ల అమ్మకం, సారీ, పంపిణీ దగ్గర్నుంచి ఆర్థిక వ్యవహారాలన్నీ తనవే… మంచిదే… ఈరోజుల్లో ఇవేమీ తప్పేమీ కావు… కానీ చివరకు ఏటీటీలో కూడా […]

ఇంతకీ మన తాత గారి కొత్త సినిమాలో… ఏ మాళవిక అట..?!

November 30, 2020 by M S R

తాత గారి వయస్సు 78 ఏళ్లు… సారు గారు హీరోయిన్ల బొడ్డును డస్ట్‌బిన్‌గా… బోలెడు పూలు, పళ్లు… చివరకు కొబ్బరి చిప్పలను కూడా పడేసి, చిత్రీకరించి, దాన్నే అద్భుత చిత్రీకరణగా చెత్తా భజన వార్తల్ని రాయించుకున్న సూడో సరస శృంగార ప్రియుడు… దాన్నే అభిరుచి అనాలని కూడా కుండ బద్ధలు కొట్టేస్తాడు తను… తన పేరు తెలుసు కదా… కే.రాఘవేంద్రరావు… తెలుగు ఇండస్ట్రీలో భయానికి చాటుమాటుగా… ఇతర భాషల ఇండస్ట్రీల్లో బాహాటంగానే పకపకా నవ్వుతూ తన టేస్టు […]

  • « Previous Page
  • 1
  • 2
  • 3
  • Next Page »

Search On Site

Advertisement

Latest Articles

  • కరోనా రావచ్చు పోవచ్చు… కానీ కరోనా ట్యూన్ మాత్రం చస్తే వదలదు…
  • ఓహ్ బేబీ రజినీ చాంది..! నెట్ ట్రోలర్స్‌కు దొరికింది తాజా ‘ఏజ్ బార్ బకరీ’..!
  • ఫేస్‌బుక్ వేదికగా ఈ కలెక్టర్‌కు వేలాది మంది విభిన్న వీడ్కోలు..!
  • 2021లో మహావిపత్తులు..? డోన్ట్ వర్రీ..! ఆ రాతలన్నీ చదివి నవ్వుకొండి..!
  • చదివితే సింగిల్ కాలమ్ వార్త… వార్తాంశంలోని స్పూర్తి అంతులేనంత…!
  • సుమ..! కేవలం సోలో షో..! కాదంటే ఫ్లాపే… ఇదీ తాజా ఉదాహరణ…!!
  • KCR వేస్ట్, వేస్టున్నర… సరే… కానీ అది తేల్చాల్సింది ఈ దరిద్రపు సర్వేనా..?!
  • కంగనా భలే ఎంపిక..! ఆమె ఆ క్వీన్ కేరక్టరే ఎందుకు తీస్తున్నదంటే..?
  • కరోనా అనువాద వాణిజ్య ప్రకటనల్లో హాస్యం బాగా పండును…!
  • ‘చిన్నమ్మ పథకం’… సమయానికి జగన్‌ను గోమాతలా ఆదుకుంది…!

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now