……. రివ్యూయర్ :: Prasen Bellamkonda……….. పొరుగువానికి సాయపడుమోయ్…. కావాలోయ్ ఆకలి శోకం లేని లోకం… ఉండునోయ్ ప్రతి మనసులోనూ మంచితనమ్ము దాంకుని …. లాంటి కొన్ని ప్రవచనాలు కమ్ హితోక్తులను ఇస్టోరీ చేసుకుని సినిమా తీయడం పెద్ద కష్టమేం కాదు… అలాని అంత వీజీ కూడా కాదు. చాలా హోమ్ వర్క్ చెయ్యాలి. కొంచెం స్పయిసింగ్ కొంచెం గార్నిషింగ్ కొంచెం అబ్రకదబ్రీంగ్ కూడా చెయ్యాలి. సోని లైవ్ లో స్ట్రీమ్ అవుతున్న ‘ఇట్లు అమ్మ’ దర్శకుడు […]
ఫాఫం గోపీచంద్… తన కెరీర్లో బలంగా దిగిన మరో తుప్పు బుల్లెట్ ఇది…
గుర్తుంది… మొన్నామధ్య సీటీమార్ అనే సినిమా విడుదలైనప్పుడే మనం ‘ముచ్చట’లో చెప్పుకున్నం… గోపీచంద్ అనబడే నటుడి పని ఇక అయిపోయినట్టే అని…! ఐనా అది రాస్తున్నప్పుడు ఎక్కడో ఏ మూలో ఇంకాస్త ఆశ ఉండేది, అలనాటి ఆదర్శ దర్శకుడు టి.కృష్ణ కొడుకు కదా, ఆ సోయి ఏమైనా గోపీచంద్‌లో ఉందేమో, బుర్రలో ఆ తెలివి ఎక్కడైనా పిసరంత దాగుందేమో, ఆ నెత్తుటి వాసన ఏమైనా ఏందేమో అని…! నో… లేదు, అలాంటి భ్రమలకు ఏమాత్రం ఆస్కారం ఇవ్వడం […]
ఇది కదా రివ్యూ అంటే..! కొండపొలం పోయిన ఓ గొల్లాయన చెప్పినట్టుగా…!!
దిక్కుమాలిన ఫార్మాట్లో సినిమా రివ్యూలు ఎవడైనా రాస్తడు… అవీ తెలుగు సినిమాల్లాగే రొటీన్ రొడ్డకొట్టుడు భాష, శైలిలోనే ఉంటయ్… కానీ నిజమైన సినిమా సమీక్షలు సోషల్ మీడియాలో కనిపిస్తయ్… మెచ్చినా, నచ్చినా, వ్యతిరేకించినా గుండె లోతుల్లో నుంచి రాయబడతయ్… ప్రత్యేకించి ఏదైనా సినిమా బాగా నచ్చినప్పుడు కొందరు జర్నలిస్టు మిత్రులు వ్యక్తీకరించే అభిప్రాయాలు అసలైన సమీక్షలు… అవి కనెక్టవుతయ్… మనం వాళ్ల అభిప్రాయాలతో అంగీకరిస్తామా లేదా అనేది వేరే సంగతి… కానీ సినిమాల సమీక్షలు అంటే ఇవి […]
మైనసులున్నయ్… కానీ మెచ్చుకోవాల్సిన బోలెడు ప్లస్సులూ ఉన్నయ్…
కావచ్చుగాక… కీరవాణి సంగీతం, పాటలు ఆకట్టుకోకపోవచ్చుగాక… ఒరిజినల్ నవలను సినిమాగా దృశ్యబద్దం చేసే క్రమంలో దర్శకుడు పలుచోట్ల సినిమాటిక్ లిబర్జీలు తీసుకోవచ్చుగాక… అవి అక్కడక్కడా లాజిక్ రహితంగా ఉండి, నవ్వు పుట్టించవచ్చుగాక… సినిమా కోసమే సృష్టించిన హీరోయిన్ పాత్ర అనేకచోట్ల హీరోను డామినేట్ చేసి ఉండవచ్చుగాక… హీరో పక్కన హీరోయిన్ కాస్త ముదురు అనిపించవచ్చుగాక… వారి లవ్ స్టోరీ అసలు కథకు అడ్డం పడుతూ ఉండవచ్చుగాక… క్లైమాక్స్ ఇట్టే తేలిపోవచ్చుగాక… మరీ సెకండాఫ్ కథ నత్తనడకన సాగుతూ […]
ఒక్కసారిగా సమంతకు పెద్ద రిలీఫ్… మీడియా గద్దలు వదిలేసినయ్…
సరిగ్గా నాలుగేళ్ల క్రితం… సమంత పెళ్లయ్యింది… బొచ్చెడు ఫోటోలు… అందులో ఒక్క ఫోటో బాగా కనెక్టయింది… ఆమె ఓ పాపులర్ సినిమా స్టార్, ఆమెకు ఈ ఫోటో షూట్లు, వీడియో షూట్లు పెద్ద సమస్యేముంది..? నటి, ఎలాగంటే అలా ఫోజులు పెట్టగలదు… కానీ పెళ్లి నటన కాదు, ఒరిజినల్, పర్సనల్, తన లైఫ్‌ను తిప్పేది, నిర్దేశించేది… ఏమనుకున్నదో ఏమో గానీ… ఒక్కసారిగా ఆమెలోని అసలైన అమ్మాయి బయటపడిపోయింది… కన్నీళ్లు పెట్టుకుంది… అవి కళ్ల నుంచి మాత్రమే రాలిన […]
డబ్బు బలిస్తే… మనిషిలో పిశాచి లేస్తే…. ఇలాంటి SQUID GAME పుట్టుకొస్తుంది…
“SQUID GAME”…….. మీరు ఆడే రేసుల్లో గుర్రాలుంటాయి ..మా డబ్బున్నవాళ్లు ఆడే రేసుల్లో మనుషులుంటారు.. డబ్బులేని పేదవాళ్లే మా రేసుల్లో గుర్రాలన్నమాట.. మీరు గుర్రాల మీద పందేలు ఎలా కాస్తారో మేము ఇక్కడ మనుషుల ప్రాణాల మీద పందెం కాస్తాం..ఇది స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ లో ఒక డైలాగ్.. దీనిలోనే ఈ వెబ్ సిరీస్ సారాంశం అంతా ఉంటుంది.. ధనం మూలం ఇదం జగత్… అన్నింటికీ మూలం ధనమే.. డబ్బు లేకపోతే రోజు గడుస్తుందా ? ఆఖరికి గాలి, […]
ఆ పంచగ్రహ కూటమి..! వాళ్లే సమంతను ‘‘దారి తప్పించారట…!!
ఒక సెలెబ్రిటీకి సంబంధించిన ఏదేని ఇష్యూ వచ్చినప్పుడు సహజంగానే మీడియా దృష్టి, సొసైటీ దృష్టి పడుతుంది… ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్లిష్టం, బహిరంగ చర్చ అమర్యాదకరం అని బయటికి ఎన్ని నీతులు చెప్పుకున్నా సరే, జనం తమకు తోచింది తాము చెప్పుకుంటూనే ఉంటారు… చర్చ సాగుతూనే ఉంటుంది… అలాంటిది ఓ పాపులర్ హీరోయిన్, ఓ పాపులర్ హీరో, ఓ స్టూడియో అధినేత కమ్ పాపులర్ హీరో కొడుకు, మరో అప్ కమింగ్ హీరో బ్రదర్, మరో వెటరన్ […]
హమ్మ వేణుస్వామీ… ఐదేళ్ల క్రితం చైసామ్ మీద ఏదేదో చెప్పావు…
ఆయన వేణుస్వామి… ఆయన అంతే… అసలు ఆ జంట పెళ్లి పీటలే ఎక్కలేదు… ప్రేమాయణం మీద గాసిప్స్ మాత్రమే వస్తున్నాయి… అప్పుడే పోస్ట్ మార్టం చేసి, అంటే అయిదేళ్ల క్రితమే… ఈ జంటకు పెళ్లవుతుంది, కానీ నిలవదు అని యూట్యబ్ వీడియోలో కుండబద్దలు కొట్టేశాడు… పాపం, చూడముచ్చటైన జంట అది, కాస్త శుభం పలకవయ్యా స్వామీ, పెళ్లికి ముందే పెటాకుల ముచ్చట చెబుతావేమిటి అంటే… అదంతే… వాళ్లకు కుదరదు, నా విద్య చెప్పింది అదే, నేను చెబుతున్నదీ […]
ఫాఫం రమ్యకృష్ణ… ఫాఫం ఐశ్యర్యా రాజేష్… కటకటా, ఇదేంటి కట్టా దేవదేవా..?!
సాయిధరమ్ తేజ హీరోగా నటించిన, కట్టా దేవ దర్శకత్వం వహించిన రిపబ్లిక్ సినిమా గురించి స్ట్రెయిట్‌గా చెప్పుకుందాం నాలుగు మాటలు… అంతకుమించి కూడా అవసరం లేదు… నో డౌట్… దర్శకుడికి సిస్టం మీద అసంతృప్తి ఉంది… ఇది మారాల్సిందే అనే కన్సర్న్ ఉంది… ఆవేశం ఉంది… సినిమా అనే దృశ్యమాధ్యమం ద్వారా సీరియస్ ఇష్యూస్ డిస్కస్ చేయాలనే సంకల్పం ఉంది… కొత్తగా ఏమైనా చెప్పాలనే తపన ఉంది… కానీ అది సరిపోదు, సినిమాకు అది మాత్రమే సరిపోదు… […]
పెద్దన్నకు తమ్ముడి చురకలు..! పీకే చదివిన వేల పుస్తకాల్లో ఇది లేదా..?!
మా సొంత డబ్బుతో దుకాణం పెట్టుకున్నాం… నడుమ ఈ సర్కారు ఏంది..? పన్నులు వేయడమేంది..? రేట్ల మీద నియంత్రణ ఏంది..? మా దుకాణాల జోలికి వస్తే మాడిపోతవ్ బిడ్డా……. అని ఎవరైనా ప్రభుత్వాన్ని బెదిరిస్తూ వాదిస్తే ఏమనిపిస్తుంది..? ‘ప్రభుత్వం విధులు-బాధ్యత-అధికారాలు’ అనే సబ్జెక్టు మీద కనీసం బేసిక్స్ తెలుసుకో బ్రదర్ అనాలనిపిస్తుంది… సినిమా అనేది కూడా ఓ వ్యాపారమే, జనాన్ని దోపిడీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది సోదరా అని ఓసారి గుర్తుచేయాల్సి ఉంటుంది… తన […]
సో వాట్..? సమంత చెప్పినట్టు బుద్ధుందా..? వాళ్లకేమవుతుంది అసలు ఈ వార్తలతో..?!
Nancharaiah Merugumala……………….. పుకార్లతో సినిమావాళ్లకు మేలేగాని కీడు ఇసుమంతైనా ఉండదు! ======================================== చాలా మంది తెలుగు జర్నలిస్టులకు అక్కినేని నాగచైతన్యకున్న ఆలోచన లేకపోయింది. గుండె ధైర్నం లేకపోయింది. ఈ మధ్య చైతూ, అతని భార్య సమంతా రూత్ ప్రభూ చెల్లుచీటీలు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో, ఇంకా ప్రధాన స్రవంతి మీడియాలో పుకార్లను వార్తలుగా రాసి ప్రసారం చేశారు. దాని వల్ల వారిద్దరికీ మంచి ప్రచారం దొరికింది. శుక్రవారం రిలీజైన చైతన్య సినిమాకు కూడా ప్రీరిలీజ్ పబ్లిసిటీకి ఈ […]
మురళీ భయ్… వర్మతో జాగ్రత్త… తనకేమీ తెలియదు, ఉత్త గాయిగత్తర తప్ప…
రాంగోపాలవర్మ అంటే వినోదం, వివాదం కాదు… వికృతం..! తన సినిమాలు అంతే, తన రాతలు అంతే, తన చేష్టలూ అంతే… చివరకు తను ఇచ్చే చిల్లర ఇంటర్వ్యూలను కూడా వల్గర్ పీసులుగా మార్చి, ఫిమేల్ ఇంటర్వ్యూయర్లను కూడా తన మార్క్ అశ్లీలంలోకి లాగి వినోదించే వికటుడు..!! నాలుగైదేళ్లుగా తను తీసే సినిమాలే తన ప్రజెంట్ స్టేటస్‌ను బయటపెడుతున్నయ్… పవన్ కల్యాణ్‌పై తను తీసిన ఓ షార్ట్ ఫిలిం వర్మ పైత్యానికి చక్కని ఉదాహరణ… ఇక మూడునాలుగు వికార […]
ఎద్దులతో ఓ జంట అనుబంధం…! తమిళ సినిమాకు కాదేదీ కథకనర్హం..!
ఎడ్లు పోయాయని స్థానిక పోలీసు స్టేషన్లో కేసు పెట్టేందుకు చేసే ప్రయత్నంతో సినిమా మొదలవుతుంది. పూచేరీ అనే ఊరులోని కున్నిముత్తు (మిథున్ మానిక్కం), వీరాయి (రమ్య పాండియన్) దంపతులు తప్పిపోయిన ఎడ్ల కోసం పడే తపన, వాటితో వీరి అనుబంధం, ఎడ్లు పోయేందుకు రాజకీయ కారణాలు, దీనిపై ఇతర పార్టీల రాజకీయ డ్రామాలు, మీడియా తీరు, అధికారుల అవినీతితో గ్రామాల్లో వెనుకబాటు ఇలా ఉంటాయి రామే… రావణే మూవీలో… నేటివిటి అంటేనే తమిళ సినిమా. దీంట్లో ఇంకా […]
ఫీల్‌గుడ్ పరిణయమే… కానీ ఎక్కడో చిన్న అసంతృప్తి… ఆ పాత స్వాతితో పోల్చితే…!!
…… Reviewer :: Prasen Bellamkonda……….. అప్పుడెప్పుడో 1984 లో శారద, సుహాసిని తల్లీ కూతుళ్లుగా నటించిన క్రాంతికుమార్ సినిమా స్వాతి గుర్తొచ్చింది ఆహాలో పరిణయం మూవీ చూస్తుంటే. కూతురే స్వయంగా తల్లి పెళ్లి చెయ్యడం అనే కథాంశం అప్పట్లో మహావిప్లవం కావచ్చు కాక ఇప్పుడది మామ్మూలేలే అనుకుని దర్శకుడు దానిచుట్టూ మరికొన్ని భావోద్వేగాలను కూడా అల్లుకున్నాడు. ఫీల్‌గుడ్ సినిమాలేవీ ఈ మధ్య రాలేదో లేక నేను మిస్సయ్యానో తెలీదుగానీ పరిణయం చూసాక నేను తెలుగులో […]
…. బహుశా ఈ అంశాలే లవ్ స్టోరీ మూవీకి మైనస్ కాబోతున్నాయేమో…!!
శేఖర్ కమ్ముల సినిమా అంటే..? అశ్లీలత ఉండదు, వెకిలి కామెడీ ట్రాకులుండవ్, అసభ్య సీన్లు, ఐటం సాంగ్స్ ఉండవ్, హీరోల స్వకుచమర్దనాలు ఉండవ్, ఇమేజీ బిల్డప్పులు, ఫార్ములా హీరోయిజాలు, వంశకీర్తనలుండవ్ వంటి ఏ చెత్తా ఉండదు… మంచి హైజినిక్ సినిమాలు, ఆర్గానిక్ సినిమాలు… కథలు కూడా లైటర్ వీన్లో సున్నితంగా నడుస్తూ సాగుతయ్… నేలవిడిచి సాము చేయడు, డబ్బు కోసం ‘వెకిలితనాన్ని’ తన సినిమాల్లోకి రానివ్వడు……… ఎస్, అదే తన బలం, ఓ కుటుంబం తమ పిల్లలతోపాటు […]
ఫాఫం పిటీ సేతుపతి..! చేజేతులా ఇమేజ్ చెడగొట్టుకునే ఓ వింత కేరక్టర్..!!
ఫాఫం, సేతుపతి…. నిన్నమొన్నటిదాకా తనపై కొంత సదభిప్రాయం ఉండేది… ఒక హీరోగా కాదు, ఒక విలన్‌గా కాదు… ఓ మంచి నటుడిగా…! ఇండస్ట్రీలో ఒకసారి మంచి పేరు వస్తే దాన్ని కాపాడుకోవడం కష్టం… ఒక మెట్టు ఎక్కడం గొప్పకాదు, ఆ మెట్టుకు మరి కొన్ని మెట్లు ఎక్కకపోయినా పర్లేదు… కానీ నిల్చున్న మెట్టు మాత్రం దిగొద్దు… దానికి చాలా జాగ్రత్తలు కావాలి… కానీ విజయ్ సేతుపతికి ఈ సోయి లేనట్టుంది… వచ్చిన పాపులారిటీని అర్జెంటుగా సొమ్ము చేసుకోవాలనే […]
గల్లీ రౌడీ..! జనం నవ్వలేదు- నవ్విపోయారు..! అంతా ‘కామెడీ అయిపోయింది’..!!
జనం నవ్వడం వేరు… జనం నవ్విపోవడం వేరు..!! మొదటిది జనాన్ని కామెడీతో నవ్వించడం… రెండోది జనం వెక్కిరిస్తూ నవ్వడం..!! జనాన్ని ఏడ్పించడం, రెచ్చగొట్టడం, ఇతరత్రా ఉద్వేగాలకు గురిచేయడం ఈజీ… కానీ నవ్వించడం కష్టం… నవ్వించే కసరత్తులో తేడా వస్తే జనం నవ్విపోతారు, ఆ ప్రయత్నం చేసినవాడు నవ్వులపాలవుతాడు… అంతా నవ్వులాటగా మారిపోతుంది…! మన సినిమా, టీవీ ఇండస్ట్రీలకే వద్దాం… నవ్వించే షోలు టీవీల్లో ఇప్పుడు బోలెడు… జబర్దస్త్ దగ్గర నుంచి మాటీవీ కామెడీ స్టార్స్ దాకా… అంతెందుకు, […]
తమన్నా… ఓ ఫీనిక్స్ పక్షి..! మాస్ట్రో నితిన్ సినిమా కాదు… తమన్నా సినిమా…!
ఇప్పుడు ఎలాగూ చాన్స్ ఉంది కదా, పది రూపాయలో, వంద రూపాయలో… ఎంతొస్తే అంత… దీన్ని థియేటర్లలో కూడా విడుదల చేయాల్సింది… ఓ డిస్ట్రిబ్యూషన్ సిండికేట్ మెంబర్ తన సొంత కొడుకు, తన సొంత సినిమాను కేవలం ఓటీటీలో విడుదల చేయడం ఏమిటి..? నెట్‌ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ అయితే ఇంకా బెటర్ రీచ్ అయి ఉండేది… ఆ హాట్ స్టార్ రీచ్ చాలా తక్కువ కదా… ఈ కామన్ సెన్స్ ఎందుకు లోపించింది..? కేవలం తమకు […]
నవ్వుకునే జోకుల దశ దాటేసి… ఇప్పుడు బాలీవుడ్ నంబర్ వన్ చాయిస్…
బాలీవుడ్ నంబర్ వన్ నటి ఎవరిప్పుడు..? కంగనా..? దీపిక పడుకోన్..? ప్రియాంక చోప్డా..? శ్రద్ధాకపూర్..? ఎవరు..? వాళ్లెవరూ కాదు..! నిస్సందేహంగా ఆలియా భట్..! రెమ్యునరేషన్ లెక్కలు కాసేపు వదిలేయండి… డిమాండ్, పాపులారిటీ, దర్శకులు ఎవర్ని ప్రిఫర్ చేస్తున్నారు కోణాల్లో చూస్తే… ఆలియా నంబర్ వన్ ఇప్పుడు..! ఇండియన్ కాదు, బ్రిటిష్ పౌరసత్వమున్న నటి… వయస్సు కూడా 28 దాటలేదు… ఆమె సినిమా వయస్సు మరీ తొమ్మిదేళ్లే… చేసింది పట్టుమని పదమూడు సినిమాలు మాత్రమే… అంతేకాదు, ఆలియాకు బుర్రలేదు […]
కరీనాను తప్పించి… కంగనాను ఒప్పించి…! మార్పు వెనుక అసలు కథేమిటి..?!
నిజానికి బాలీవుడ్‌కే కాదు… ఇది ఇండియన్ సినిమాకు సంబంధించి కాస్త ఇంట్రస్టింగ్ వార్తే..! కరీనాకపూర్‌ను తప్పించి, ఓ భారీ సినిమాలో సీత పాత్రకు కంగనా రనౌత్‌ను ఎంపిక చేయడం..! ఆ సినిమా పేరు… సీత- The Incarnation… పాపులర్ రచయిత విజయేంద్రప్రసాద్ రాసిన కథ… అదీ సీత కోణంలో కొత్తగా కథను చెప్పడం… అంతేకాదు, హిందీతోపాటు తమిళం, తెలుగు, మళయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయబోతున్నారు… నిజానికి చాలారోజులుగా సాగుతున్నది ప్రిప్రొడక్షన్ […]
- « Previous Page
- 1
- …
- 104
- 105
- 106
- 107
- 108
- …
- 117
- Next Page »