నిజానికి పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు… కాకపోతే సెలబ్రిటీ ఫ్యామిలీ కాబట్టి నాగచైతన్య-సమంతల విడాకుల వ్యవహారం జనం నోళ్లలో నానుతోంది… అసలు సినిమా, టీవీ, మోడలింగ్ తదితర ప్రలోభాల, విలాసాల రంగుల రంగాల్లోనే కాదు… విడాకులు విపరీతంగా పెరిగిపోయాయి… కాకపోతే సెలబ్రిటీల విడాకుల మీద కాస్త ఎక్కువ చర్చ సాగుతూ ఉంటుంది… ఆమెతో చైతన్య బంధం తెగిపోయినట్టే… మ్యుచువల్ కాన్సెంట్‌తో డైవోర్స్‌కు అప్లయ్ చేసుకుని, ఓ దఫా కౌన్సిలింగ్ కూడా జరిగిందట… నాగార్జున కాస్త చక్కబెట్టే ప్రయత్నం […]
‘‘అపరిచితుడు’’గా సేతుపతి..! కానీ సినిమాయే మరీ ‘‘తుగ్లక్ దర్బార్’’ ఐపోయింది..!!
నో డౌట్… విజయ్ సేతుపతి మంచి నటుడు… కానీ ఎప్పుడు..? తనలోని నటుడిని ఆవిష్కరించే మంచి పాత్ర దొరికినప్పుడు..! తనలోని నటుడికి చాలెంజ్ విసిరే పాత్ర దొరికినప్పుడు..! మరి మిగతా సందర్భాల్లో..? జస్ట్, ఓ నటుడు, ఓ హీరో… అంతే… తుగ్లక్ దర్బార్ సినిమా చూస్తుంటే పాపం సేతుపతి అనిపిస్తే అది మన తప్పేమీ కాదు… తన తప్పే..! మొన్న ఏదో లాభం అని ఓ పిచ్చి సినిమా చూసినప్పుడూ సేతుపతి మీద జాలేసింది… ఎందుకిలాంటి పాత్రలు […]
నేను గానీ ఒక వీల గానీ వేశానంటే… ఏమీలేదు, రీసౌండ్ కాదు, అసలు సౌండే లేదు…
కొందరి అదృష్టానికి నిజంగా అభినందించొచ్చు… తొట్టెంపూడి గోపీచంద్ అలియాస్ గోపీచంద్ కూడా అదృష్టవంతుడే ఒకరకంగా… టి.కృష్ణ కొడుకుగా పుట్టడం తన అల్టిమేట్ అదృష్టం… రష్యాలో ఇంజనీరింగ్… (సీపీఐ బ్యాక్ గ్రౌండ్..?).. తరువాత తండ్రి వారసత్వం కొనసాగించడానికి సినీ రంగప్రవేశం… అప్పుడెప్పుడో ఇరవై ఏళ్ల క్రితం హీరోగా తొలిసినిమా… తరువాత నెగెటివ్ పాత్రలు కొన్ని… ఆ తరువాత కమర్షియల్ హీరో… గోపీచంద్ టి.కృష్ణ కాడు ఇప్పుడు, ఎప్పుడూ… జస్ట్, మనకున్న చాలామంది హీరోల్లో ఒకడు… అంతే… అసలు ఎన్నేళ్లయింది […]
అచ్చం ఓ పాత తెలుగు కుటుంబ గౌరవం సినిమా కథ… నాని మాత్రం ఇరగేశాడు…
నాని అంటే..? నటన..! అంతకుమించిన నిర్వచనమేమీ ఉండదు… అతిశయోక్తి కాదు, మనకున్న హీరోల్లో అన్నిరకాల ఉద్వేగాల్ని బలంగా ప్రదర్శించగల సత్తా ఉన్నవాడు… నేను నిజంగా మొండివాడినా, అలా కనిపిస్తున్నానా, ఏ బంధాలూ తెలియనివాడిలా ఉంటానా అంటూ హీరోయిన్ ఎదుట హీరో మథనపడే ఓ బరువైన సన్నివేశం ఒక్కటి చాలు, నాని ఏమిటో చెప్పడానికి… అలాంటివి చాలా ఉన్నయ్ టక్ జగదీష్ సినిమాలో… సరైన పాత్ర పడాలే గానీ నాని అంటే నానీ అంతే… చెలరేగిపోతాడు… ఈ సినిమాకు […]
లాభం లేదు..! సేతుపతికీ, జగపతికీ, శృతికీ… ఎవరికీ ఏ లాభమూ లేదు..!!
లాభం లేదు… విజయ్ సేతుపతి మంచి నటుడే కానీ ఈ పాత్ర మరీ అడ్డదిడ్డంగా ఉంది, తనకు పేరు రాదు, పైగా ఇలాంటి పాత్రలు కెరీర్‌కు స్పీడ్ బ్రేకర్లవుతాయి… సేతుపతికి ఆ సోయి లేదు, ఈ పాత్రతో లాభమూ లేదు… లాభం లేదు… దర్శకుడి మరణంతో సినిమా ఆగినట్టుంది, సేతుపతి సినిమా ఆగకుండా ఉండేందుకు డబ్బు సాయం చేసినట్టున్నాడు, నిర్మాతగా తన పేరు కూడా వేయించుకున్నాడు, నిర్మాతగా కూడా సేతుపతికి ఈ సినిమా లాభం లేదు… లాభం […]
బన్నీ స్టామినా..! అల వైకుంఠపురంలో మళ్లీ రేటింగ్స్ దున్నేసుకుంది…!!
తెలుగు టీవీల్లో బాహుబలి ప్రసారం చేసినంతగా మరే సినిమాను ప్రసారం చేయలేదేమో… ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ ఎన్నిసార్లు వేస్తున్నా సరే, టీఆర్పీలు వస్తూనే ఉన్నయ్, జనం చూస్తూనే ఉన్నారు… అలాగే ఖలేజా, అతడు సినిమాలు కూడా ఎన్నిసార్లు వేశారో ఆ టీవీ వాళ్లకే తెలియదు… ఐనా టీఆర్పీలు వస్తూనే ఉంటయ్… తెలుగు సినిమా చరిత్రలో అనేక రికార్డులపరంగా ‘అల వైకుంఠపురంలో’ సినిమా రెండో స్థానంలో నిలుస్తుంది బాహుబలి తరువాత… కలెక్షన్లు కొల్లగొట్టింది.., పాటల వీడియోలకు యూట్యూబ్ […]
దటీజ్ కంగన..! తనదీ జయలలిత టెంపర్మెంటే… ఆ పాత్ర అదరగొట్టింది…!!
తలైవి సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది… మహాభారతానికి మరోపేరు జయజీవితం… నిజమే, ఆమె జీవితంలో ఉన్న షేడ్స్ చెప్పాలంటే ఓ మహాభారతమే… అవన్నీ ఒక సినిమాలో చెప్పగలమా..? చెప్పగలగాలి… మహానటి సినిమా చూశాం కదా, సావిత్రి మరణం వరకూ ఆమె కథ ఉంటుంది… అమాయకత్వం, ఆత్మసౌందర్యం సహా ఆమె నిజతత్వం మొత్తం ఆవిష్కృతమైంది… ఆమె ఎలా విధివంచిత అయ్యిందో, చివరకు ఏమైందో చెప్పేస్తాడు కథకుడు… కానీ తలైవిలో కథకుడు విజయేంద్రప్రసాద్‌కు అది చేతకాలేదు… ఓ ప్రతిభ కలిగిన […]
కిక్కుమనని టాలీవుడ్… జగన్ మార్క్ షాక్… జుత్తు పట్టేసుకున్నాడు…
కులం కంపులో బతుకుతూనే, బయటికి మాత్రం కులం పేరు ఉచ్చరించడానికి మస్తు నాగరికతను నటించే ప్రపంచం మనది… ప్రత్యేకించి సినిమా ఇండస్ట్రీ… మరీ ప్రత్యేకించి తెలుగు ఇండస్ట్రీ… ఇది ఇప్పుడు ఎందుకు మళ్లీ చర్చల్లోకి వస్తున్నదీ అంటారా… ? జగన్ ప్రభుత్వం ఆన్లైన్ టికెట్ బుకింగ్ మీద అంకుశం ప్రయోగిస్తోంది కాబట్టి… తెలుగు సినిమా పెద్దలు కిక్కుమనడం లేదు కాబట్టి… తమ జోలికి ఎవరైనా వస్తే గాయిగత్తర చేసే సినిమా పెద్దతలకాయలు సైలెంట్… సో, కాస్త నిజంనిజంగానే […]
తెలుగు మాస్ సినిమా గీతాలకు ‘చక్రవర్తి’..! వందల సినిమాలకు స్వరసామ్రాట్..!!
……… By……. Bharadwaja Rangavajhala………. నిన్న చక్రవర్తి జయంతి. మాస్ సినిమా పాటకూ చాలా కాలం పెద్దదిక్కు ఆయన. జానపదం నీడల్లో నడిస్తేనే సినిమా పాటలు జనం హృదయాల్లోకి దూసుకెళ్లిపోతాయి అనే సూత్రం ఆయన నమ్ముకున్నారు… చక్రవర్తికి ఈ నమ్మకం కలిగించినది మాత్రం బుర్రకథ నాజర్. నాజర్ దగ్గర చేరడానికి కాస్త ముందు మహావాది వెంకటప్పయ్య గారి దగ్గర ఓకల్ నేర్చుకునే ప్రయత్నం చేశారు గురువుగారు. మహావాది క్రమశిక్షణ తట్టుకోలేక ఇటొచ్చేసారు… అది వేరు సంగతి… మహదేవన్ […]
డియర్ మేఘా… ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు… ఈ కథ ఇంతకీ ఎక్కడిదబ్బా…
ఓ హీరోయిన్… ఒక హీరో… ఇద్దరూ ఇంట్రావర్టులే… ఒకరి పట్ల ఒకరి ప్రేమను కూడా వ్యక్తీకరించుకోలేరు… సిగ్గరులు… కొన్నేళ్లకు బండి గాడిన పడుతుంది… ప్రేమించుకుంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే అనే సూత్రాన్ని, పెళ్లే ప్రేమకు అంతిమ గమ్యం అనే తత్వాన్ని సినిమాలు, సాహిత్యం మనకు ఏళ్లకేళ్లుగా బాగా ఎక్కించాయి కదా… ఆ ప్రేమతత్వం మేరకే పెళ్లిచేసుకోవాలని వాళ్లు కూడా అనుకుంటారు… ఈలోపు హీరోకు ప్రమాదం జరుగుతుంది, ఆమె హతాశురాలవుతుంది… ఇక రెండో కృష్ణుడు ఆమె జీవితంలోకి వస్తాడు, […]
పోసానీ… నువ్వు గొప్పోడివి బ్రదర్… కడుపులో సినీ కల్మషం లేనోడివి…
ఈరోజు ఏదో ఓ పాత తెలంగాణ ట్యూన్ జతకలిస్తే తప్ప అది సినిమా పాట కాదు, హిట్ కాదు… కాపీ కొట్టడంలో థమన్ గ్రేట్… ప్రాసపైత్యంలో రామజోగయ్య గ్రేట్… తెలంగాణతనాన్ని వాడుకోవడంలో తెలుగు నిర్మాతలు గ్రేట్… కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్య పాటను, పదాన్ని, వాయిద్యాన్ని, దాని గానాన్ని అదేదో సినిమాలో వాడుకున్నట్టుగా వార్తలు… నిజమే, వాడేసుకున్నారు… భీమ్లానాయక్ ఆ సినిమా పేరు… పాట ఎత్తుకోవడమే ఓ లోతైన గొంతుతో మొగులయ్య హృదయ గానం… ఇక ఆ తరువాత […]
#NootokkaJillalaAndagadu … నకల్ మార్నేకే లియే బీ అకల్ చాహియే…
Ondu Motteya Kathe…. ఇది ఓ కన్నడ సినిమా… 2017లో వచ్చింది లెండి… రాజ్ శెట్టి అనే కొత్త దర్శకుడు తనే నటించి, తనే దర్శకత్వం వహించిన సినిమా… మంచి అవార్డులు, ప్రశంసలు గట్రా అందుకుంది… దీన్ని మళయాళంలో Thamaasha పేరిట 2019లో రీమేక్ చేశారు… హిందీలో దీన్ని Ujda Chaman పేరిట అదే సంవత్సరంలో రీమేక్ చేశారు… సేమ్ లైన్లో అదే సంవత్సరం బాల అనే సినిమా హిందీలో వచ్చింది… కాపీ రైట్స్ గట్రా వివాదమూ నడిచింది… […]
ఇదోరకం మారుతీరావు కథ…! ఈ రేంజ్ డార్క్ క్లైమాక్స్‌తో ఏం ఫాయిదా..?!
ఆమధ్య మన వరంగల్ పిల్ల ఆనంది గురించి రాసిన ‘ముచ్చట’ స్టోరీ మళ్లీ అకస్మాత్తుగా గుర్తొచ్చింది… ఘర్ కీ ముర్గీ దాల్ బరాబర్ అన్నట్టుగా మన దర్శకులకు తెలుగు పిల్లలు హీరోయిన్లుగా పనికిరారు కదా… మన హీరోలతో రొమాన్స్ చేయడానికి ఏ కేరళ, ఏ తమిళనాడు పిల్లలో కావాలి… లేదంటే అడిగినట్టుగా అన్నీ చూపించేసే ముంబై పిల్లలు కావాలి… అకస్మాత్తుగా ఆనంది కనిపించింది… సుధీర్ బాబు సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాలో హీరోయిన్ ఆమె… వావ్, […]
రోజా భర్త సెల్వమణి గారూ… తమిళ ఇండస్ట్రీలో ఇదోరకం తాలిబనిజమా..?!
పూజా హెగ్డే… ప్రపంచంలో ఏ హీరోయిన్‌కూ దక్కని ఘనత ఆమెది… అందరూ ఏవేవో చూపించి పడేస్తారు… కానీ పూజా జస్ట్, అలా కాళ్లు చూపించి పడేస్తుంది… అంతే… అంతటి సిరివెన్నెల కలం కూడా గతులు దప్పి, శృతులు దప్పి, స్వరజతులు తప్పి… ఇంకా ఏమేమో తప్పి… సామజవరగమనా అని పాట అందుకుంది..! నీకాళ్లను పట్టుకుని వదలనన్నవే చూడే నా కళ్లు అని కూడా మొహమాటం లేకుండా మొత్తుకున్నాడు… అంతటి బన్నీ కూడా అడ్డంగా పడుకుని, వెనక్కి వెనక్కి […]
సో వాట్..? నేరుగా ఓటీటీల్లోనే సినిమా రిలీజ్ చేస్తే తప్పేమిటట..!!
……….. By…. Prasen Bellamkonda………… ” థియేటర్లన్నీ నలుగురి చేతుల్లోనే ఉన్నాయి. ఏ సినిమాకు థియేటర్లు ఇవ్వాలి వేటికి ఇవ్వవద్దు అనేది ఈ నలుగురి దయాదాక్షణ్యాల మీదే ఆధారపడి ఉండడం దురదృష్టం” చాలా రోజులుగా చిన్న సినిమాల హీరోలు నిర్మాతలు పడుతున్న ఈ బాధను పక్కన పెడదాం. “ఓటిటిలకు సినిమాలిస్తే ఎక్జిబిటర్ లుగా మేం రోడ్డున పడతాం. థియేటర్లకు పెద్ద సినిమాలనివ్వకుంటే వాళ్ళ సంగతి చూస్తాం” ఇప్పుడు ఎక్జిబిటర్ల వాదన లాంటి హెచ్చరిక… దీన్నీ పక్కన పెడదాం… […]
ఫాఫం మనో..! ఈ వెగటు పాత్రలేమిటి..? ఆ వెకిలి టీవీ షోకు జడ్జేమిటి..? ఏమైంది..!!
ఒక్కసారి వెనక్కి తిరిగి ఓసారి పరిశీలించండి… ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పలు సినిమాల్లో నటించాడు… డబ్బు కోసం కాదు, కీర్తి కోసం కూడా కాదు… సరదా కోసం… సన్నిహితుల మొహమాటం కోసం… తనలోని నటుడిని తృప్తిపరచడం కోసం… అంతే… అదేసమయంలో ఏమాత్రం వెకిలితనం లేని పాత్రల్నే ఎంచుకున్నాడు… కాస్త హ్యూమర్ టచ్ ఉన్న పాత్రలు… మిథునం సినిమాలోనైతే నో మేకప్, కాస్త పౌడర్ కూడా పూసి ఉండరు… తన స్థాయిని దిగజార్చుకోకుండా తన నటనాభిలాషను తీర్చుకున్నాడు… వెళ్లిపోయాడు… బాలుకు […]
ఏమి బాలరాజూ… సినిమా ఇలా తీసినావూ..?! ఏమీ ‘‘కనబడుట లేదు’’…!!
కనబడుట లేదు… అసలు ఇంట్రవెల్ దాటిపోయినా హీరో ఇంకా కనబడుట లేదు కనబడుట లేదు… కథను చెబుతూ పోయాడే తప్ప హీరో శోధించేదేమీ కనబడుట లేదు కనబడుట లేదు… థ్రిల్లర్ అన్నారు గానీ, సినిమాలో అసలు థ్రిల్లేమీ కనబడుట లేదు కనబడుట లేదు… కుర్చీ అంచున కూర్చోబెడతామన్నారు కానీ ఆ సీనేమీ కనబడుట లేదు కనబడుట లేదు… సునీల్ హీరోయా, సైడ్ హీరోయా, కేరక్టర్ ఆర్టిస్టా… క్లారిటీ కనబడుట లేదు కనబడుట లేదు… ప్రేక్షకుల బుర్రలకూ పదును […]
స్టార్ సాయిపల్లవి వీడియో…! ష్… జస్ట్ 20 వేల వ్యూస్ మాత్రమే…!!
సరదా ముచ్చటే ఇది…. అనుకోకుండా సాయిపల్లవి వీడియో ఒకటి కనిపించింది… జుత్తుకు ముడిచిన మల్లెపూలు, బొట్టు, మెడ నిండుగా పైట… వెనుక దేవుళ్ల పటాలు, ప్రతిమలు, దీపాలు… అది సినిమా బాపతు వీడియో కాదు, సత్యసాయి వాళ్లు ప్రచార సంస్థ రేడియో సాయి 20వ వార్షికోత్సవం సందర్భంగా నాలుగు మంచి మాటలు, భక్తి మాటలు చెప్పింది… యూట్యూబ్‌లో నిన్నే అప్లోడ్ చేశారు, ఈ స్టోరీ రాసే సమయానికి 24 వేల వ్యూస్ మాత్రమే…. నవ్వొచ్చింది… అంతటి సాయిపల్లవి […]
Bell Bottom…! తాలిబన్ వార్తలు కూడా అక్షయ్ సినిమాకు కలిసొచ్చినట్టే ఓరకంగా..!!
ఇప్పుడంతా తాలిబన్ల వార్తలే కదా… తాలిబన్లు అనగానే మనకు గుర్తొచ్చే చేదు అనుభవం అప్పట్లో 1999లో జరిగిన ఓ ఫ్లయిట్ హైజాక్… ఖాట్మండు నుంచి వచ్చే విమానాన్ని దారి మళ్లించి, కాందహార్‌కు తీసుకుపోయారు ఉగ్రవాదులు… వాళ్లకు రక్షణ ఇవ్వడమే కాదు, వాళ్లు విడిపించుకున్న ఉగ్రవాదులతో సహా క్షేమంగా దేశం దాటడానికి సహకరించింది అప్పటి తాలిబన్ ప్రభుత్వం… ఇప్పుడిది చెప్పడం దేనికీ అంటే… కొన్ని హఠాత్తుగా కొందరికి ఉపయోగపడతయ్… అలాంటి హైజాక్ ఇన్సిడెంటు మీద ఆధారపడి నిర్మించిన బెల్ […]
వెన్నువిరిగిన నాగలి..! అదే నారాయణమూర్తి మార్క్ సినిమా…!
నో డౌట్… ఈ దేశంలో అత్యంత బాధిత వృత్తి, జాతి… రైతులు, వ్యవసాయం… డొల్ల చేతలే తప్ప ఏ ప్రభుత్వానికీ సరిగ్గా పట్టని ఓ ప్రధాన రంగం… నో డౌట్… ఆర్. నారాయణ మూర్తి పేదల పక్షపాతి… రైతుపక్షపాతి… ఆ రకరకాల అవలక్షణాలు, ప్రలోభాల సినిమా ఇండస్ట్రీలో ఓ తులసి చెట్టు… మరి ఇన్ని చిన్న సినిమాల మీద రివ్యూలు వస్తయ్… ట్రెయిలర్ల మీద, పోస్టర్ల మీద, హీరోల ఫోజుల మీద, డ్రెస్సుల మీద, సినిమా పేర్ల […]
- « Previous Page
- 1
- …
- 105
- 106
- 107
- 108
- 109
- …
- 117
- Next Page »