ఫలక్‌నుమా సినిమా సమయంలో… నటుడు విష్వక్సేన్ ఏవో పిచ్చికూతలు కూసి వార్తల్లోకి ఎక్కినట్టు యాదికొస్తోంది… ఈ నాలుకకు కాస్త తీట ఎక్కువే అనిపించింది అప్పట్లో… కాస్త కూడా చాలా ఎక్కువ తీటే… అందుకే పాగల్ సినిమా గురించి పాగల్ మాటలు చాలా మాట్లాడాడు స్టేజీ మీద… థియేటర్లు ఫుల్లయిపోతాయనీ, అన్ని థియేటర్లలోనూ ఈ సినిమా వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తారనీ, మూసేసిన హాళ్లు అర్జెంటుగా తెరుచుకుంటాయనీ, హిట్ కాకపోతే పేరు మార్చేసుకుంటాను అని ఏవేవో కూతలు వినిపించాడు… […]
ఎప్పటికీ ఈయనే ఏకైక సూపర్ స్టార్..! ఈ బుడ్డిదీపాలకేం తెలుసు ఆయన..?!
…… By……. Jagannadh Goud…… చిత్తూరు వి నాగయ్య – “పాల్ ముని ఆఫ్ ఇండియా”…. తెలుగు సినీ నటులు, దర్శకులు అంతా తల క్రిందికి కాళ్ళు పైకి లేపి, వంద సంవత్సరాలు తపస్సు చేసినా చిత్తూరు నాగయ్య కాలి చెప్పు మందం కూడా పనికి రారు అని చెప్పటం నిజానికి నాగయ్య గారిని అవమానించటమే అవుతుంది… కారణం ఏ చెట్టూ లేని చోట ఆముదపు చెట్టే మహావృక్షం అన్నట్లుగా ఇక్కడ ఉన్నవి అన్నీ ఆముదపు చెట్లే; […]
ఒరే బామ్మర్ది..! 40 ఏళ్ల క్రితం తీస్తే ఈ కథ భలే హిట్ అయ్యేదోయ్..!!
శివప్పు మంజల్ పచ్చయ్… అంటే తమిళంలో ఎరుపు పసుపు ఆకుపచ్చ… ఇంగ్లిషు ట్రాఫిక్ భాషలో చెప్పాలంటే స్టాప్, లుక్, ప్రొసీడ్… ఈ సినిమా ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కథ కాబట్టి సింబాలిక్‌గా సినిమా పేరు కూడా బాగానే కుదిరింది… కానీ బిచ్చగాడు సినిమాను ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ చేయగలిగిన దర్శకుడు శశి ఈ సినిమా వంట మాత్రం మొత్తం చెడగొట్టాడు… తనేం తీస్తున్నాడో తనకే తెలియకుండా పోయింది… ఆ సినిమాయే ఇప్పుడు ‘ఒరేయ్ బామ్మర్ది’ పేరిట తెలుగులోకి […]
‘దిగు దిగు దిగు నాగా’ అన్నాడు కదా…. బాగా లోతుగా దింపేస్తున్నారు పాఠకులు…
సిగ్గూశరం లేని అనంత శ్రీరామ్ రాసిన ఆ వెకిలి, లేకి, వెగటు, బూతు, దరిద్రపు పాటకు ఎన్ని వ్యూస్ వచ్చాయో అని యూట్యూబ్ చూస్తే 34 లక్షల దాకా దాటిపోయింది… హబ్బో… మనవాళ్ల టేస్టుకు తిరుగులేదు, ఇదే కదా మన సినిమా మూర్ఖులకు అసలు బలం అనుకున్నాను… సర్లే, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆది నుంచీ ఇదే టైపు కదా… ఆమధ్య సిరివెన్నెల అనే మరో ఘన చరితార్థ దరిద్రుడు ‘‘ఓ పూజా హెగ్డే, నీ కాళ్లు […]
మిమి..! మన కొత్త ‘దర్శకుల’కు ఎందుకు చేతకావడం లేదు ఈ కథలు..?
కెరీర్ పరుగు, అస్థిరమైన కొలువులు, ఒత్తిళ్లు, కాలుష్యంతో దిగజారుతున్న ఆరోగ్యాలు, స్టామినా… 30 ఏళ్లు దాటినా జరగని పెళ్లిళ్లు… 30 దాటితే నిలవని గర్భాలు… ఎన్నో సమస్యలు… సంతానహీనత ఎప్పుడూ ఉన్నదే కానీ గతంలో మహిళలు గంపెడు మందిని కనేవాళ్లు, పెంచేవాళ్లు… ఇప్పుడు అంత వీజీ కాదు… అమ్మో ఒకరు చాలు అనేలా… అసలు లేకపోతేనేం అనేవాళ్లు కూడా… చేదునిజం ఏమిటంటే..? ఈ పిండాన్ని మోయడం ఏమిటి..? సర్జరీ చేయించుకుని కనడం ఏమిటి..? పాలివ్వడం ఏమిటి..? జెనెటిక్ […]
ఆ థమన్‌కు ఎలాగూ లేదు సరే… అనంత శ్రీరామ్ కలానికి ఏమైంది..?!
నిజమే, ఓ మిత్రుడు చెప్పినట్టు…. సంగీత దర్శకుడు థమన్‌కు ఎలాగూ లేదు… కాపీ ట్యూన్లతో బతికేస్తుంటాడు… చివరకు కోట్ల మంది హిందూ భక్తులు పాడుకునే ‘దిగు దిగు దిగు నాగ’ పాటను ఓ ఐటం సాంగ్‌కు పల్లవిగా మార్చేశాడు… పర్లేదు, మన భక్తి పాటలే కదా… ఎవడు ఎలా ‘రంకు పట్టించినా’ అడిగేవాడెవడూ ఉండడు… పైగా ఈ పాటకు యూట్యూబ్‌లో 18 లక్షల వ్యూస్… ఒక్క పూటలో… హబ్బ, శ్రేయ ఘోషాల్ ఇరగదీసింది అంటూ వందల కామెంట్లు… […]
మంగ్లీని తిట్టిపోసిన నోళ్లు ఏమయ్యాయ్..? థమన్ నిర్వాకం కనిపించలేదా ఏం..?!
మరిచిపోయారా..? మొన్నమొన్ననే కదా, భక్తిపరురాలైన మంగ్లీ బోనాల పాట మీద రచ్చ రచ్చ చేశారు కదా… అమ్మవారిని మోతువరి అని తిడతావా అంటూ మీరే మంగ్లీని బోలెడంత తిట్టిపోస్తిరి… పాపం, ఆమె ఈ కృత్రిమ మనోభావాలకూ తలొంచి, పాట మార్చింది… వందల పాటలు రాసిన ఆ రచయితను అడిగి వేరే పదాలు పెట్టించి, రీఅప్లోడ్ చేయించింది… దాన్నీ వదల్లేదు… చివరకు పాటనే తీసేశారు… తెలంగాణతనాన్ని ఓన్ చేసుకున్న ఒక బంజారా గాయనిని డీమోరల్ చేసేదాకా ఊరుకోలేదు… సరే, […]
సత్యదేవ్ కంచరాన..! తిమ్మరుసుతో మరో మెట్టు పైకి..! గుడ్ గోయింగ్..!
సత్యదేవ్..! అప్పుడెప్పుడో పదేళ్ల క్రితం షార్ట్ ఫిలిమ్ మేకర్‌గా ప్లస్ చిన్నాచితకా వేషాలతో మొదలైంది ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రయాణం… ఇప్పుడు తనే హీరో… తనొక్కడే ఒక సినిమాను పూర్తిగా మోయగలడా అనే సందేహాలను పటాపంచలు చేస్తూ… ఎదుగుతూనే ఉన్నాడు… కరోనా రానీ, దాని తాత రానీ… వీలైతే థియేటర్, లేదంటే ఓటీటీ… మొత్తానికి రెండేళ్లుగా సత్యదేవ్ పరుగుకు మాత్రం తిరుగు లేదు…! చేతలు దక్కిన పెద్ద పెద్ద హీరోలతో పోలిస్తే నయమే కదా… తిమ్మరుసు సినిమాను […]
వయస్సు ఓ దశ దాటాక జీవితానికి ఏం కావాలి..? గానుగెద్దు బతుకు వదిలేది ఎలా..?!
వాట్సపులోనో, ఫేస్బుకులోనో కనిపించింది ఓ రివ్యూ… రివ్యూయర్ పేరు కనిపించలేదు… ప్రవాస్ అనే ఓ మరాఠీ చిత్ర సమీక్ష అది… నిజమే, మనం ఈమధ్య తమిళ, మళయాళ సినిమాల్ని ఆహా ఓహో అనేస్తున్నాం… చప్పట్లు కొడుతున్నాం… మన తెలుగు వదిలేయండి, మిగతా భాషల్లో కూడా మంచి సినిమాలు వస్తున్నయ్… ఓటీటీల్లో కనిపిస్తున్నయ్… ప్రేక్షకుల సంఖ్య తక్కువగా ఉండే మరాఠీ, తుళు వంటి భాషాచిత్రాలు కూడా ఈమధ్య కొన్ని బాగుంటున్నయ్… వాటి బడ్జెట్ తక్కువ, చాలాచోట్ల రాజీపడుతూ ఉంటారు… […]
మగవంచిత..! ఒకప్పటి హాట్ హీరోయిన్… ఒకరిద్దరిని నమ్మి ‘మునిగిపోయింది…
జయంతి అనగానే మనకు బోల్డు మంది ముసలి హీరోలకు తల్లి పాత్రలు వరుసగా కనిపిస్తాయి కానీ… అసలు అరవై, డెబ్బయ్ దశకాల్లో కన్నడ, తెలుగు, తమిళ, మళయాళ, మరాఠీ, హిందీ సినిమాల్లో చాలామంది సీనియర్ నటుల పక్కన రెగ్యులర్ హీరోయిన్ వేషాలు వేసింది ఆమె… అసలు ఆమె నటించిన మిస్ లీలావతి అప్పట్లో ఓ సెన్సేషన్… అందులో ఆమె పోషించిన పాత్ర… కాస్త రెబల్ టైప్… ప్రిమారిటల్ శృంగారం, పెళ్లి అనేది ట్రాప్ వంటి భావాల్ని స్వేచ్ఛగా […]
ఇదేం గోసరా దేవుడా..? నితిన్‌కు నవ్వాలో ఏడవాలో తెలీడం లేదు..!!
సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా… నితిన్ హీరో జీవితం అలా కొనసాగుతూనే ఉంటుంది… డబ్బులున్నయ్, బలమైన సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉంది, ఏదో సినిమాలు తీసేస్తూనే ఉంటారు… అయితే డబ్బులకన్నా హీరో ఇమేజీని ఎప్పటికప్పుడు లెక్కవేసుకుంటే నితిన్ టాలీవుడ్ సెకండ్, థర్డ్ లేయర్స్‌లోనే ఉండిపోయాడు హీరోగా… అంతే తప్ప అగ్రహీరోల సరసకు రాలేకపోయాడు, ఇప్పుడప్పుడే వచ్చే సీనూ లేదు… కనీసం ఆ సెకండో, థర్డో కాపాడుకోవాలి కదా… అదే కష్టమైపోతోంది… ఫాఫం, ఆమధ్య రంగ్‌దే కొట్టేసింది… మహానటి […]
ఆ అసురన్ సినిమా ఫీల్‌ను అడ్డంగా నరికేశావ్… ఏం పని ఇది నారప్పా..?
సింపుల్ ప్రశ్న… మక్కీకిమక్కీ అంటే… ఓ జిరాక్సు కాపీలా… ఓ కట్ అండ్ పేస్ట్ ప్రక్రియలా… వేరే భాష సినిమాను రీమేక్ చేస్తే… అసలు ఆ రీమేక్ ఎందుకు..? డబ్బింగ్ బెటర్ కదా..! మనం ఎన్ని తమిళ సినిమాల తెలుగు డబ్బింగ్‌ను ఆస్వాదించలేదు గనుక..! పల్లెల్లో అగ్రవర్ణాల వివక్షపై, ఓ నిమ్నవర్ణుడి తిరుగుబాటుపై, ప్రతీకారంపై అద్భుతంగా ఎమోషన్స్ పలికించిన ఆ అసురన్ సినిమానే డబ్ చేస్తే సరిపోయేదిగా..! నిజానికి ఓటీటీయే కాబట్టి అదీ అక్కర్లేదు… చాలామంది అసురన్ […]
రియాలిటీలో బతికే ఓ నిఖార్సైన వ్యాపారి దగ్గుబాటి… తాజా మాటలూ చెప్పేదిదే…
చాలామంది సినిమావాళ్ల పిచ్చిమాటలకన్నా దగ్గుబాటి సురేష్ మాటలు కాస్త రియలిస్టిక్‌గా ఉంటయ్… నేల విడిచి సాము చేయడు తను… నిజాల్ని అంగీకరిస్తాడు… నారప్ప సినిమా విడుదల సందర్భంగా… తను చెప్పిన చాలా అంశాలు వాస్తవానికి దగ్గరగా, ఓ బిజినెస్‌మ్యాన్ మాట్లాడుతున్నట్టే ఉన్నయ్… ప్రత్యేకించి ఓటీటీలు, థియేటర్ల భవిష్యత్తు మీద కొన్ని ఇంట్రస్టింగు పాయింట్లు… ‘‘ఓటీటీల్ని ఆపలేం, మినీ థియేటర్లు వస్తయ్, పెద్ద కమ్యూనిటీల్లో థియేటర్లను చూస్తాం… ఏమో, హాస్పిటల్స్ కూడా థియేటర్లను ఓపెన్ చేస్తాయేమో… (పెద్ద మాల్స్‌కు […]
కుడి ఎడమగా కన్పించినా సరే… చూసేయండి, ఆ కుడీఎడమా ఒకటే…!!
రివ్యూయర్ :: Prasen Bellamkonda………… జీవితం నీకు రెండో అవకాశం ఇవ్వదు అనే నిజాన్ని అబద్దం చెయ్యడానికి టైం లూప్ అనే ఊహాత్మాక శాస్త్రీయ సంభవాన్ని కేంద్రం చేసుకుని ఓ కధ అల్లుకుంటే అదే కుడి ఏడమైతే వెబ్ సిరీస్… ఆహా ఓటిటి కంటెంట్ మీద ఉన్న అపనమ్మకంతో నిర్లిప్తంగానే ‘కుడి ఏడమైతే ‘ చూడడం మొదలెడితే… అలా లాక్కెళ్లిపోయింది కన్ఫ్యూజింగ్లీ గ్రిప్పింగ్ గా… నిజంగా ఇది ఆహా తరహా వెబ్ సిరీస్ కాదు… నాకైతే నచ్చింది… […]
నారప్ప..! అనంతపురం యాసను నరికేశాడే… అంతా కృతకమైన భాష…!!
నారప్ప అనే సినిమా తీశారు కదా, త్వరలో ఓటీటీలోనే విడుదల చేయబోతున్నారు… అందులో వెంకటేష్ హీరో… అసురన్ అనే తమిళ సినిమాకు ఇది రీమేక్… ఇది అందరికీ తెలిసిందే కదా… ట్రెయిలర్ రిలీజ్ చేశారు మొన్న… రెండు రోజుల్లోనే కోటి వ్యూస్ ఉన్నయ్… సో, నిర్మాతలూ హేపీ… ట్రెయిలర్ చూస్తుంటే సీన్లు బాగానే చిత్రీకరించారనీ, అవసరమైన ఎమోషన్లు, సీన్ల నాణ్యత గురించి దర్శకుడు కాస్త తపించాడనీ తెలుస్తూనే ఉంది… ఎటొచ్చీ భాష విషయంలోనే అసంతృప్తి… మనస్సులు చివుక్కుమనిపించేలా […]
భేష్ నిమిషా..! ఈ టైక్వాండో బ్లాక్బెల్టర్ మళ్లీ ఇరగదీసేసింది..!!
అదేమిటో గానీ… మన తెలుగువాళ్లకు సరైన అవకాశాలు రావడం లేదు మొర్రో అని మనం ఏడుస్తుంటాం… కానీ వర్తమాన సవాళ్లకు దీటుగా… హీరోలే పరమార్థంగా బతికే మన ఇండస్ట్రీలో తమను తాము ప్రూవ్ చేసుకుంటున్న కేరళ ప్రతిభను చూడాలి… వావ్… బ్లాకీస్, నో ప్రాబ్లం… మొహమంతా మొటిమలు, గుంతలు, నో ప్రాబ్లం… డీగ్లామరైజ్డ్ రోల్స్, నో ప్రాబ్లం… కొత్త చరిత్రలు లిఖిస్తున్నారు… హేట్సాఫ్… నిజానికి తెలుగు ఇండస్ట్రీ కూడా అంతే కదా… సినిమాలు అంటే తమిళ లేదా […]
జూనియర్, రాంచరణ్, ఆలియా జాన్తానై… రాజమౌళే హీరో… ఆ మేకింగ్ వీడియో…
ఆర్ఆర్ఆర్… బాహుబలి తరువాత రాజమౌళి తీస్తున్న మరో అత్యంత భారీ చిత్రం… జక్కన్న వంటి విశేషణాల్ని నేను తగిలించను… సినిమా ఇండస్ట్రీలో జక్కన్నతనం అదృష్టాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది… స్ప్రింగు తాడిచెట్లు వంటి జానపద కథ తరహా కంటెంటుును ప్రేక్షకులు బాహుబలిలో ఆమోదించలేదా..? వేల కోట్లు కురిపించలేదా..? కాకపోతే రాజమౌళిని ఎందుకు మెచ్చుకోవాలంటే… అందరు దర్శకుల్లాంటివాడు కాదు… సాహసి… తను కొన్ని సీన్లు కలకంటాడు… అవి అలాగే వచ్చేవరకూ కష్టపడతాడు… అఫ్ కోర్స్, గతంలో తన […]
అయ్యారే… హతవిధీ… ఈ దుర్భర చిత్రమును నేనేల వీక్షించబడవలె…
‘‘మీ అమ్మమీదొట్టు.. అయ్యమీదొట్టు.. అక్కమీదొట్టు.. చెల్లెమీదొట్టు….’’ పాట ఎలా ఉంది..? ఎవడ్రా రాసింది, ఎవడ్రా కూసింది అనాలనిపిస్తోందా..? పొరపాటున ఎదుట కనిపిస్తే కుమ్మేయాలని ఉందా..? అదే మీ అజ్ఞానం… ‘అమ్మో నీయమ్మ గొప్పదే, అందం పోగేసి కన్నదే’ అని చిరంజీవి అదేదో గ్రాఫిక్ సినిమాలో పాడితే ఆనందించారు కదా… మరి ఇదెందుకు నచ్చదు..? పోనీ… గుండిగెలాంటి గుండేదానా అని విక్రమ్ గొంతు చించుకుంటే ఎగిరి గంతేశారు కదా..! సినిమా పాటలకు అర్థాలేమిటి..? పరమార్థాలేమిటి… ఎవడో ట్యూన్ ఇస్తాడు, […]
సుమన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు… నిజమేనా..? కేంద్రం ఇచ్చిందా..?!
ఒక్కసారిగా విస్మయం ఆవరించింది… దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లేదా పురస్కారం నటుడు సుమన్‌కు ప్రకటించడం ఏమిటి..? కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ ప్రకటనా రాకముందే ఫాల్కే మనమడు చంద్రశేఖర్ అవార్డును అందజేయడం ఏమిటి..? తెలుగు మెయిన్ మీడియా సైట్లు కూడా చకచకా రాసేసుకుని, చంకలు గుద్దుకోవడం ఏమిటి..? ఐనా ఈ సంవత్సరం రజినీకాంత్‌కు కదా దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రకటించింది… మరి సుమన్ ఎలా వచ్చాడు మధ్యలోకి..? భారతీయ సినిమా పితామహుడిగా చెప్పుకునే దాదాసాహెబ్ ఫాల్కే […]
గ్రేట్ రవిబాబూ… ఇలా సినిమా తీయడం ఇంకెవరి వల్లా కాదు… నిజం…
ఎంత దరిద్రగొట్టు సినిమా అయినా సరే… ఎంత నేలబారు సినిమా అయినా సరే…… ఒక పాటో, ఒక మాటో, ఒక సీనో కాస్త బాగుంది అనిపిస్తుంది… ఎడిటింగో, నేపథ్యసంగీతమో, కెమెరాయో పర్లేదు అనిపిస్తుంది… ఫలానా సీన్లో కనిపించే ఆ పది మందిలో ఒకడి మొహంలో కాస్త ఎమోషన్స్ కనిపిస్తున్నాయి అనిపించవచ్చు… చివరకు టైటిల్స్ వేసే పద్ధతైనా వచ్చవచ్చు… అరె, శుభం అని వీడు భలే చమత్కారంగా వేశాడే అని కూడా అనిపించవచ్చు….. కానీ మచ్చుకు ఒక్కటంటే ఒక్కటీ […]
- « Previous Page
- 1
- …
- 106
- 107
- 108
- 109
- 110
- …
- 117
- Next Page »