శారద జైత్రయాత్రలో ఓ మైలురాయి 1974 లో వచ్చిన ఈ ఊర్వశి సినిమా . సినిమాకు షీరో శారదే . చాలా సున్నితమైన కధాంశం . మనిషి నల్లగా పుడతాడా లేక తెల్లగా పుడతాడా అనేది ఆ మనిషి చేతిలో ఉండదు . కానీ , నల్లగా పుట్టినదాని పర్యవసానాలు మాత్రం ఆ మనిషి భరించక తప్పదు . చాలా కుటుంబాల్లో చూస్తుంటాం . కుటుంబ పెద్దలు తమ పిల్లల్లో అందంగా ఉన్నవారిని బంధుమిత్రులకు ఎంతో గర్వంగా […]
స్టార్లతోనూ ఆలోచనాత్మక సినిమాలు… క్రాంతికుమార్ ప్రస్థానమే వేరు…
దర్శకత్వం వహించే సామర్ద్యం ఉన్న ఇద్దరు వ్యక్తులు అనుకోకుండా ఒక చోట కల్సి సినిమా తీయాలనుకున్నారు. వారే కథ తయారు చేసుకుని ఓ మంచి దర్శకుడి నేతృత్వంలో సినిమా తీసేశారు. ఆ తర్వాత కొంతకాలానికి వారే దర్శకులై అద్భుతమైన సినిమాలు తీశారు. ఆ ఇద్దరిలో ఒకరు వీరమాచినేని హనుమాన్ ప్రసాద్. మరొకరు క్రాంతికుమార్. క్రాంతికుమార్ పుట్టింది కృష్ణాజిల్లా గన్నవరంలో. చదువు గుడివాడ, విజయవాడ, ఏలూరు, నాగపూర్ లలో నడిచింది. గుడివాడలో విశ్వశాంతి విశ్వేశ్వరావుగారు నడిపిన జ్యోతి ట్యూటోరియల్స్ లో క్రాంతిగారు చదివినట్టు […]
జస్ట్ ఎ మినట్..! పచ్చిపాల అభిషేక్ హీరోగా పచ్చి పచ్చి కామెడీ…!!
దీన్ని అడల్ట్ కామెడీ అంటారా..? బూతు కామెడీ అంటారా..? జబర్దస్త్ తరహా అశ్లీల కామెడీ అంటారా..? డార్క్ కామెడీ అంటారా..? ఏమో, ఆ జానర్ పేరేమిటో తెలియదు గానీ… అశ్లీలం కురిపించే ఇంటిమేట్, వెగటు సీన్లు లేవు గానీ… డైలాగ్స్, కంటెంట్ మొత్తం అదే… ఇలాంటి సినిమాల్లో, ఇలాంటి కంటెంటు ఉన్నప్పుడు కాస్త డబుల్ మీనింగ్ అర్థమయ్యీ కానట్టుగా నర్మగర్భంగా డైలాగులు ఉంటాయి, కథాగమనం ఉంటుంది… కానీ పచ్చిపాల అభిషేకుడు హీరోగా నటించిన జస్ట్ ఎ మినట్ […]
కల్కి సినిమాపై మండిపాటు…! అసలు ఎవరు ఈ కల్కిధామ్ ప్రమోద్ కృష్ణ..!!
మన ఆ నలుగురు శంకరాచార్యుల్లాగే… ఇంకొందరు ఉంటారు… దేశంలో నిజంగా ఏదైనా ఆధ్యాత్మిక సంబంధమైన ఇష్యూ వచ్చినప్పుడు గానీ, మతసంబంధమైన సమస్య వచ్చినప్పుడు గానీ అస్సలు కనిపించరు… వీళ్లేమైనా ఆధ్యాత్మిక భావనలు, మత వ్యాప్తికి, ధర్మ ప్రచారానికి ఉపయోగపడతారా అంటే అదీ ఉండదు… ఎవరి దందాల్లో వాళ్లు ఉంటారు… కొందరి పేర్లు అసలు ఎవరికీ తెలియవు… కానీ హఠాత్తుగా తెర మీదకు వస్తారు, యావత్ హిందూ సమాజం మనోభావాలు దెబ్బతిన్నాయంటూ తెరపైకి వస్తారు… అసలు మనోభావాలు అనే […]
అప్పటి సంచలనం… ఇప్పటి మీడియాకూ తెలియదేమో ఈ కథ…
సంచలనాల చిరునామా 1974 లో వచ్చిన ఈ తాతమ్మ కల సినిమా . తెలుగు సినిమా రంగంలో నిషేధానికి గురయిన మొదటి సినిమా కూడా ఇదేనేమో ! నారు పోసిన వాడే నీరు పోస్తాడు అనే నమ్మకం ఇప్పటికీ చాలామందికి ఉంటుంది . ఒకప్పుడు భగవంతుడు ఇచ్చే సంతానాన్ని నియంత్రణ చేయటానికి మనమెవరం అనే భావన ఎక్కువగా ఉండేది . ఆ బాటలోనే ఈ సినిమాలో కుటుంబ నియంత్రణకు , భూసంస్కరణలకు వ్యతిరేకంగా డైలాగులు ఉండటం పెద్ద […]
ఆహా… రసపురుష్ శ్రీరామచంద్ర..? థమన్ పంచ్ విసిరాడుగా…!!
నో డౌట్… తెలుగు ఇండియన్ ఐడల్ షోకు మెయిన్ ప్లస్ పాయింట్ థమన్… తనదే నిర్ణయాధికారం… స్పాంటేనియస్‌గా వేసే జోకులు, సెటైర్లే గాకుండా తను ఈ షోకు ఒక ఎనర్జీ… నిశితంగా ఒక పాట పాడటంలో మైనస్ ప్లస్ గమనించి, నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టేస్తాడు… కానీ అప్పుడప్పుడూ కాస్త గీత దాటతాడు… ఈసారి ఎపిసోడ్లో ఏవో యాడ్స్ గురించి ప్రస్తావన వస్తుంది… ప్రమోషన్ కోసం ఏవో కామెంట్స్… నేనయితే మేట్రిమోనీ చూస్తుంటా, ఎందుకంటే నేను సింగిల్ కదా […]
ఎహె.., ఏమిటలా మీద పడతావేమిటీ..? ఐశ్వర్యా రాజేష్ గట్స్ వేరు…!!
‘కామోద్దీపన’ లేకుండా ఆ పని చేస్తే ఆడవాళ్లకు ‘పెయిన్’ అని ఒక తమిళ సినిమాలో ఐశ్వర్యా రాజేష్ తన భర్తకు చెప్పినట్టు మరో నూరేళ్లకైనా తెలుగు సినీ నాయిక మాట్లాడుద్దా? (ఇక్కడ సైట్ రిస్ట్రిక్షన్స్ కారణంగా కామోద్దీపనకు ఇంగ్లీష్ పదాన్ని రాయలేకపోతున్నా…) ……………………… ‘ తమిళ పాప్యులర్, కమర్షియల్ ’ సినిమాల్లో కులం ప్రస్తావనల గురించి మన పాత్రికేయ మిత్రుడు జీఎస్ రామ్మోహన్ ఈరోజు ‘మహారాజా’ అనే తమిళ అనువాద తెలుగు సినిమా గురించి రాసిన సందర్భంలో […]
కలెక్షన్లు అంతగా లేవని రాస్తే… నిర్మాతల పరువు పోయిందేముంది..?
ఒక వార్త కనిపించింది… కల్కి 2898 ఏడీ అనే బ్లాక్ బస్టర్ సినిమా వసూళ్లకు సంబంధించి నిర్మాతలు కొందరు సినిమా విమర్శకులు లేదా సమీక్షకులకు లీగల్ నోటీసులు పంపించింది… 25 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది… 1000 కోట్ల వసూళ్లు దాటినట్టు నిర్మాతలే ప్రకటనలు చేస్తున్నారు సోషల్ మీడియాలో… అయితే అవి గ్రాస్ కావచ్చు, అందులో టాక్సులు ఎట్సెట్రా పోతే వచ్చేవి నెట్ కలెక్షన్లు… ఫ్యాన్స్ కొన్ని లెక్కలు ప్రచారంలోకి తీసుకొస్తారు, కొన్ని సైట్లు […]
రాజ్ తరుణ్..! మొరాయిస్తే పోలీసులు ఇంకాస్త గట్టిగా బిగిస్తారేమో చూసుకో..!
ఏదో పత్రికలో చదివాను… నటుడు రాజ్‌తరుణ్ (కావాలనే హీరో అనడం లేదు) పోలీసులకు తన న్యాయవాది ద్వారా ఓ వర్తమానం పంపించాడు అట… ‘నాకు కొత్త సినిమా షూటింగు ఉంది, ప్రచార కార్యక్రమాలు ఉన్నాయి, ప్రస్తుతానికి నేను అందుబాటులో లేను… విచారణకు హాజరు కాలేను, సారీ వీలున్నప్పుడు విచారణకు వస్తాను’ అనేది ఆ సమాచారం… తనకు ఈనెల 18న విచారణకు రావాలంటూ పోలీసులు తనకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలుసు కదా… విచారణకు వెళ్లకుండా ఈ […]
సీత మొగుడు… ఉన్నదే అన్నాడు… ఉలిక్కిపడితే తనదేం తప్పు ఫాఫం..!!
సీత… మనకు చాన్నాళ్లుగా తెలిసిన మంచి నటి… తన మొదటి భర్త పేరు పార్తీబన్… (1990 నుంచి 2001 వరకు తనతో ఉంది, తరువాత విడాకులు, తొమ్మిదేళ్ల తరువాత మరొకరితో పెళ్లి, ఆరేళ్లలోనే పెటాకులు…) సదరు పార్తీబన్ ఓ వ్యాఖ్య చేశాడు… తను యాక్టర్, డైరెక్టర్… కాకపోతే నోటి మీద అదుపు కాస్త తక్కువ… ప్రకాష్ రాజ్, కమలహాసన్, సిద్ధార్థ్, కస్తూరి, చిన్మయి, సుచిత్ర బాపతు… తమిళంలో ఈ కేరక్టర్ల జాబితా పెద్దదే… మొన్నామధ్య ఏదో కూశాడు… […]
Not Now… మన దేశంలో ఒకప్పుడు పెళ్లి అంటే లైఫ్ టైమ్ ఎఫయిర్…!!
మాదిరెడ్డి సులోచన నవల ప్రేమలు పెళ్ళిళ్ళు ఆధారంగా నిర్మించబడిన ఈ సినిమా 1974 జనవరిలో వచ్చింది . మన దేశంలో ఒకప్పుడు పెళ్లి అంటే లైఫ్ టైం ఎఫైర్ . టివిలు , ఫ్రిజ్‌లు , కార్లు మార్చేసినట్లు భార్యల్ని భర్తల్ని మార్చేసే రోజులు వచ్చాయి మన దేశంలో కూడా . రోజూ కీచులాడుకుంటూ , తన్నుకుంటూ గడిపేదాని కన్నా విడిపోవటమే బెటర్ అనే రోజులకు వచ్చాం . ఇదీ కరెక్టే . సర్దుకుపోయే ఓపిక ఉండాలి […]
సాయిపల్లవికి ఆరు అవార్డులు సరే… మరి ఇప్పటిదాకా ఎవరెవరికి ఎన్ని..?
మొన్నామధ్య హీరోయిన్ సాయిపల్లవిని అల్లు అరవింద్ ఏదో స్టూడియోలో సత్కరించాడని వార్త చదివాను, ఫోటో చూశాను… ఎక్కువసార్లు ఫిలిమ్ ఫేర్ అవార్డులు పొందినందుకు అభినందిస్తూ ఆ సత్కారం… గుడ్… అప్పుడప్పుడూ తండేల్ సినిమా వార్తల్లో తప్ప పెద్దగా తెలుగు సినిమా వార్తల్లో వినిపించడం లేదు ఆమె పేరు చాన్నాళ్లుగా… అత్యంత భారీ ఖర్చుతో తీయబడుతున్న హిందీ రామాయణం ప్రాజెక్టులో సీత పాత్ర, మరో హిందీ సినిమా చేస్తోంది కదా, తెలుగు సినిమా సర్కిళ్లలో తక్కువగా కనిపిస్తోంది ఆమె… […]
ది బర్త్ డే బాయ్… ఔట్ పుట్ బాగానే ఉంది బ్రో… ఆ ముసుగు తీసెయ్…
ది బర్త్ డే బాయ్… ఈ సినిమా కథేమిటీ, ఎలా ఉందీ అనే ప్రశ్నలకన్నా దర్శకుడి వ్యవహారశైలే విచిత్రంగా, సందేహాస్పదంగా, భిన్నంగా కనిపించింది… ప్రమోషన్ మీటింగుల్లో దర్శకుడు మాట్లాడుతూ మాస్క్ కట్టుకుని కనిపించాడు… తన మొహం చూపించడం లేదు… అదేమిటయ్యా అంటే… ‘‘2016లో నా లైఫ్ లో జరిగిందే ఈ ఘటన… దాని మీద 2020లో సినిమా చేయాలి అనుకున్నాను… ఈ నాలుగేళ్ల సమయంలో అమెరికాలో ఉండి… ఉద్యోగం చేస్తూ డబ్బులు సేవ్ చేసుకున్నాను… ఆ డబ్బు […]
ఓ అపరిచితురాలు..! సూపర్ స్టోరీ పాయింట్… పూర్ ప్రజెంటేషన్..!!
మంచి స్టోరీ లైన్ … సూపర్‌గా పర్ఫామ్ చేయగల నటీనటులు… ఇంకేముంది..? దర్శకుడు రెచ్చిపోవాలి కదా… ఫాఫం, ఎక్కడో తేడా కొట్టింది… గందరగోళానికి గురయ్యాడు… ఏ గంట సేపు సినిమాకు ప్రాణమో, ఆ చివరి గంట చేతులెత్తేశాడు… దెబ్బతినేశాడు… అప్పట్లో అపరిచితుడు అనే సినిమా బ్లాక్ బ్లస్టర్… విక్రమ్, ప్రకాష్‌రాజ్ నటనలో ఇరగదీశారు… ఇక విక్రమ్ లైఫ్ కెరీర్లో అలాంటి పాత్ర దొరకదు… శంకర్ దర్శకుడు… ప్రస్తుతం ఆయన పర్ఫామెన్స్, భారతీయుడు అట్టర్ ఫ్లాప్ కథ చూస్తే […]
అయోమయం జగన్నాథం… పుష్ప-2 పరిస్థితి మొత్తానికే గందరగోళం..!
పుష్ప సీక్వెల్ ఖచ్చితంగా కష్టాల్లో ఉంది… రకరకాల వార్తలు… దాన్ని తీవ్ర అయోమయంలో పడేస్తున్నాయి… వందల కోట్ల రూపాయల బిజినెస్ ప్రస్తుతం గందరగోళంలో చిక్కుకుంది… అది నిజం… ఎప్పుడో ఆగస్టులో అనుకున్నారు రిలీజ్ అని… అది కాస్తా డిసెంబరుకు వాయిదా… కారణం, ప్రస్తుతం జనసేన, పవన్ కల్యాణ్ బలగం బన్నీని వ్యతిరేకిస్తుందనీ, అందుకే వాయిదా వేస్తున్నారనీ వార్తలు… హంబగ్… ఒక్క ఆంధ్రాలో బిజినెస్ కోసం, పాన్ ఇండియా మూవీని వాయిదా వేసుకుంటారా..? పోనీ, నిజమే అనుకుందాం… డిసెంబరులో […]
నో గ్రాఫిక్స్… నో డూప్స్… స్కేటింగ్ చేస్తూ ఈ హిట్ జంట డ్యూయెట్…
స్కేటింగ్ నేపధ్యంలో తీయబడిన మొదటి తెలుగు సినిమా కావచ్చు 1974 లో వచ్చిన ఈ మంచి మనుషులు సినిమా . ఈ సినిమా కోసం శోభన్ బాబు , మంజుల స్కేటింగ్ నేర్చుకుని ఉంటారు . జగపతి బేనర్లో వి బి రాజేంద్రప్రసాద్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మ్యూజికల్ & విజ్యువల్ హిట్ . సినిమా సగంపైన సిమ్లా , మనాలీల్లో షూట్ చేయబడింది . సినిమా కూడా చాలా posh గా ఉంటుంది […]
సింగర్ కార్తీక్ కుర్చీలో మలయాళ పాపులర్ సింగర్ విజయ్ ఏసుదాస్..!
సింగర్ కార్తీక్… తెలుగు ప్రేక్షకులు, శ్రోతల్లో ఇంత భారీ ఫాలోయింగు ఉందా అనిపించింది తాజా ఇండియన్ ఐడల్ తెలుగు షో ప్రోమో వీడియో కింద కామెంట్స్ చూస్తుంటే… కార్తీక్ కోసమే షో చూస్తున్నాం, తన కోసమే మళ్లీ ఆహా ఓటీటీ సబ్స్క్రయిబ్ చేసుకున్నాం, తను లేకపోతే ఈ షో పెద్ద వేస్ట్, ఒరేయ్ కార్తీక్ ఎక్కడరా అని బోలెడు కామెంట్స్… 60, 70 శాతం కామెంట్స్ అన్నీ అవే… వోకే, తను చాలా తెలుగు పాటలు పాడాడు, […]
అల్లు అర్జున్‌కు నయనతార అవమానం… నాటి వీడియో మళ్లీ వైరల్…
అవార్డులు… వీటికి ఎంపికల విషయంలోనూ చాలా రాగద్వేషాలుంటాయి… వాణిజ్య అవసరాలుంటాయి… ప్రలోభాలు, పైరవీలు ఉంటాయి… కొన్ని సంస్థలు ఇచ్చే అవార్డులు ప్యూర్ దందాలు… స్కోచ్ అవార్డుల వంటివి… అంతెందుకు..? చివరకు ఆస్కార్ అవార్డులు కూడా లాబీయింగు ఆధారంగా ఇవ్వబడుతున్న ఉదాహరణలూ చెప్పుకున్నాం కదా… సరే, అవార్డు ఎవరికి ఇవ్వాలో ఆయా సంస్థలు నిర్దేశిస్తాయి… పేరుకు ఏవో జ్యూరీల నిర్ణయం అని చెబుతాయి… ఆ అవార్డులు ఎవరి చేతుల మీదుగా ఇవ్వాలో కూడా ఆయా సంస్థల ఇష్టం… అవార్డులు […]
ఇవీ ఫిలిమ్ ఫేర్ అవార్డులకు నామినేషన్లు… మీ వోట్లు ఎవరెవరికి..?
69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ – 2024కు పోటీ పడుతున్న చిత్రాల జాబితా విడుదలైంది… తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన ఏయే చిత్రాలు పోటీపడుతున్నాయన్న విషయంపై నామినేషన్స్ ప్రకటించారు… అయితే, వేడుకలను ఎక్కడ నిర్వహిస్తారు? ఎప్పుడు నిర్వహిస్తారు? ప్రదర్శనలు ఇచ్చే తారలు ఎవరు? అతిథులు ఎవరు అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది… వివిధ కేటగిరీల్లో పోటీపడుతున్న చిత్రాలు… ఉత్తమ చిత్రం బేబీ, బలగం, దసరా, హాయ్ నాన్న, మిస్‌శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి, సామజవరగమన, […]
ఓ నెగెటివ్ రోల్లో జయసుధ…! ఆమెకు ఓ ఐటమ్ సాంగ్ కూడా..!!
నోములు , వ్రతాలు అంటేనే ఆరోజుల్లో ఆడవారికి ఎంతో ప్రీతిపాత్రమైన విషయాలు . వాటికి తోడు పాతివ్రత్యం . వీటన్నింటికీ తోడు నాగరాజు సెంటిమెంట్ . తెలుగు మహిళలకు బ్రహ్మాండంగా నచ్చింది . వంద రోజులు ఆడించేసారు . ఎక్కడయినా ఒకటి రెండు చోట్ల సిల్వర్ జూబిలీ కూడా ఆడిందేమో ! భారతీయ సంస్కృతిలో పుట్టల్లోని పాములకు పాలు పోసి , ఆ పాములు ఊళ్ళల్లోకి , జనావాసాల్లోకి రాకుండా జాగ్రత్త పడేవారు . మా చిన్నప్పుడు […]
- « Previous Page
- 1
- …
- 27
- 28
- 29
- 30
- 31
- …
- 131
- Next Page »