ఆస్కార్ అనేది ఓ పెద్ద అద్భుతమేమీ కాదనీ.., డబ్బులు పడేసి, మంచి లాబీయింగు చాకచక్యంగా చేసుకుంటే చాలు, పరమ నాసిరకం నాటునాటు పాటకు కూడా ఆస్కార్ అవార్డు వస్తుందనీ మనకు తెలిసిపోయింది… ఆస్కార్ చుట్టూ ఉన్న దేవతా వస్త్రాలు కిందకు జారిపోయాయి… ఆస్కార్ విలువ హఠాత్తుగా కూలిపోయింది… ఇప్పుడు మళ్లీ ఎందుకు అంటారా..? మన దేశం అధికారికంగా ఆస్కార్ ఎంట్రీల్ని పంపిస్తూ ఉంటుంది ప్రతి ఏటా… కానీ అదే పైరవీల దందా… జ్యూరీలో ఎవరెవరినో పెడతారు, ఒత్తిళ్లు, […]
చంద్రబాబు- పవన్ కల్యాణ్ నడుమ పుల్లలు పెట్టే వర్మ ప్రయత్నం…
వ్యూహం ట్రెయిలర్ రిలీజ్ చేశాడు ఆర్జీవీ… అటు చంద్రబాబు, పవన్ కల్యాణ్ పట్ల బద్ధ వ్యతిరేకి… ఇటు జగన్ పట్ల సానుకూలుడు… పైగా జగన్ బయోపిక్ తీసే చాన్స్ వచ్చింది… డబ్బులు కూడా సమకూరాయి… వైసీపీ వాళ్లు ఎలాగూ చూస్తారు… సో, వర్మ పంట పండింది అనుకున్నారు అందరూ… అదీ వ్యూహం పేరిట ఒకే పార్ట్ కాదు, మరో పార్ట్ కూడా ఉంటుందట… సరే, ఈ ట్రెయిలర్ విషయానికొద్దాం… పెద్ద ఇంప్రెసివ్‌గా లేదు… ఇది నిజానికి బయోపిక్ […]
ఓ గాడ్… ప్రేక్షకుల అటెన్షన్ కోసమే నయనతారను తీసుకున్నారా..?
ఈరోజు దాదాపు డజన్ సినిమాలు రిలీజయ్యాయి… శుక్రవారమే రిలీజ్ చేస్తారు ఎవరైనా… వీకెండ్స్ కలిసివస్తాయని..! వీటిలో ఒక్కటీ స్టార్ సినిమా లేదు… ఉన్నంతలో జయం రవి, నయనతార నటించిన గాడ్ అనే సినిమా ఒక్కటే కాస్త ప్రేక్షకుడి దృష్టిని ఆకర్షించేది… అందులోనూ నయనతార ఉంది కాబట్టి… ఎస్, అదే మనం చెప్పుకోవాలి ఇక్కడ, ఇప్పుడు… నయనతార సౌత్ ఇండస్ట్రీలోనే హయ్యెస్ట్ పెయిడ్, నంబర్ వన్ హీరోయిన్… వయస్సు మీద పడుతున్నా సరే డిమాండ్ తగ్గలేదు… అఫ్కోర్స్, మంచి […]
ఎన్టీయార్, దిలీప్కుమార్కన్నా శివాజీ గణేశనే ఆ పాత్ర అదరగొట్టాడు…
Bharadwaja Rangavajhala…. తంగపతకం …. ఇది కొడుకును చంపిన తండ్రి కథగా మాత్రమే చూడద్దు … ఓ ప్రభుత్వోద్యోగిలో ఉండాల్సిన నిబద్దతను బలంగా చెప్పిన కథగా చూడండి అని శివాజీగణేశన్ తరచు చెప్పేవారు. తమిళనాట సినిమా నాటకాన్ని మింగేయలేదు. సినిమా నటులు ఆ మాటకొస్తే సినిమాల్లో సూపరు స్టార్లుగా వెలుగుతున్న వారు సైతం స్టేజ్ మీదకు రావడానికి వెనుకాడేవారు కాదు. అక్కినేని గురించి ఆత్రేయ రాసిన వ్యాసంలో ఇదే విషయాన్ని గుచ్చి మరీ చెప్తారు. నాగేశ్వర్రావు నట సామ్రాట్ […]
అమ్మా సుచిత్రమ్మా… మా బతుకమ్మ చుట్టూ ఈ సినిమా స్టెప్పులేంటి తల్లీ…
బతుకమ్మను ఎవరూ ఉద్దరించనక్కర్లేదు… వందల ఏళ్ల పరాయి పాలనలోనూ తన అస్థిత్వాన్ని నిలబెట్టుకుంది… సగటు తెలంగాణ మహిళ ఆత్మ ఆ బతుకమ్మ… తెలంగాణ సాంస్కృతిక ప్రతీక ఈ పండుగ… కేసీయార్ ప్రభుత్వం వచ్చాక బతుకమ్మను అధికారిక ఉత్సవంగా ప్రకటించాక, బతుకమ్మ మీద ఏమాత్రం గౌరవం లేని వాళ్లు భ్రష్టుపట్టించారు… బాధపెట్టించారు… ఒక్క నిఖార్సయిన ఉదాహరణ చెప్పుకుందాం… అధికారిక ఉత్సవం కదా, ఏదో ఒకటి మమ అనిపించాలి… ఓ చోట అధికారులు అటూఇటూ చూశారు… దగ్గరలో ఓ కుండీ […]
జగమెరిగిన గాయని ఆమె… ఐతేనేం, ఒక్క పాట కూడా పాడించలేదు ఆయన…
పరవశాన్నిచ్చే పైరగాలి సైతం పరవశించే పాటల కంపోజిషన్.. త్రీ జనరేషన్స్ ను మెప్పించి.. 70కు పైగా సినిమాల్లో 500కు పైగా పాటలకు ట్యూన్స్ కట్టిన దిగ్గజ సంగీత దర్శకత్వం.. ఓపీ నయ్యర్. దశాబ్దాల కాలం పాటు హిందీ భారతీయ భాషలన్నింటిలో పాడి.. హిందీ సినిమాను శాసించిన గాత్రం లతా మంగేష్కర్. అయితే, వీరిద్దరూ సంగీతం విషయంలో ఎక్కడా ఒకరికొకరు తారసపడకపోవడం విశేషం. ఓపీ నయ్యర్ సంగీత దర్శకత్వం వహించిన ఏ సినిమాలోనూ… ఇండియన్ నైటింగెల్ గా పిల్చుకునే […]
అక్రమమో సక్రమమో గానీ… అది ప్రపంచ ప్రఖ్యాత కన్నీటి ప్రేమ కథ!
Taadi Prakash …….. ప్రపంచ ప్రఖ్యాత కన్నీటి ప్రేమ కథ! A complex symphony of love …. ఉదాత్తమైన అక్రమప్రేమ… ‘ది బ్రిడ్జెస్ ఆఫ్ మేడిసన్ కౌంటీ’ ఒక సూపర్ హిట్ హాలీవుడ్ సినిమా. ఒక అక్రమ ప్రేమకి సంబంధించిన ఈ కథని ప్రపంచం అంతా సంభ్రమాశ్చర్యాలతో చూసింది. సినిమా ముగిసిన తర్వాత ప్రేక్షకులు తేరుకోలేకపోయారు. థియేటర్ల లోంచి నిశ్శబ్దంగా నడిచి వెళిపోయారు. ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయిందీ సినిమా. ఒక స్త్రీ, ఒక పురుషుడి […]
ప్చ్… ఆ పాత స్వాతి కనిపించలేదు… ఈ పాత్ర నేటి స్వాతికి నప్పలేదు…
కలర్స్ స్వాతి… ఇప్పుడు స్వాతిరెడ్డి అని పిలుస్తున్నారు కదా… అలియాస్ స్వెత్లానా… ఆమె అసలు పేరు అదే… రష్యాలో పుట్టింది కదా, అక్కడి పేరే పెట్టారు… తరువాతే స్వాతి అయ్యింది… టీవీ యాంకరింగ్ గానీ, తొలుత నటించిన సినిమాల్లో గానీ యంగ్ లుక్‌తో సరదా మాటలతో గలగలా మాట్లాడుతూ కనిపిస్తుంటేనే కాస్త ముచ్చటగా ఉండేది… ఈ బక్క పిల్ల పెద్ద అందగత్తె కూడా ఏమీ కాదు కదా…! కానీ..? ఐదారేళ్ల క్రితం పెళ్లయ్యింది… విదేశం వెళ్లింది… సినిమాలకు […]
అబ్బవరం రంజన్… బోర్, బోరర్, బోరెస్ట్… తెలుగు టీవీ సీరియల్ బెటర్…
కిరణ్ అబ్బవరం… ఈ పేరు వినగానే ఓ మోస్తరు బడ్జెట్‌తో తీసే సినిమాలు గుర్తొస్తాయి… హిట్టయిందా, ఫ్లాపయిందా తనకు అక్కర్లేదు… అవకాశాలు వస్తూనే ఉన్నాయి… తను సినిమాలు చేస్తూనే ఉన్నాడు… ఓటీటీ, టీవీ, ఓవర్సీస్ రైట్స్, లోబడ్జెట్ పుణ్యమాని నిర్మాతల చేతులు కాలడం లేనట్టుంది… సో, మిడిల్ రేంజ్ సినిమాలకు తనే చాయిస్‌గా మారినట్టున్నాడు… కానీ ఇప్పటికీ పెద్ద హిట్టేమీ లేదు తన కెరీర్లో… తాజాగా రూల్స్ రంజన్ అనే సినిమా వచ్చింది… రంజన్ అంటే మనోరంజన్… […]
చిన్నా… ఓ విషసమస్యపై హీరో సిద్ధార్థ్ సిన్సియర్ ప్రయత్నం… భేష్…
సిద్ధార్థ్… లవ్వులు, పెళ్లిళ్లు, బ్రేకప్పులు, సహజీవనాలు ఎట్సెట్రా తన వ్యక్తిగత జీవితమే ఓ పెద్ద సినిమా కథ… సుడిగాలి సిద్ధార్థ్ అని పెద్ద వెబ్ సీరీసే తీయొచ్చు… అప్పుడప్పుడూ కొన్ని వివాదాస్పద రాజకీయ వ్యాఖ్యలూ చేస్తుంటాడు… చాన్నాళ్లుగా హిట్లు లేవు… ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరో… అలాంటి సిద్ధార్థ్ ఆమధ్య తన సినిమా ప్రమోషన్ కోసం బెంగుళూరు వెళ్తే కావేరీ ఆందోళనకారులు అడ్డుకున్నారు… ఫలితంగా అవమానంతో తిరిగి చెన్నై వెళ్లిపోయాడు… సో, ఎప్పుడూ ఏదో ఓ కారణంతో […]
నాని సినిమా అయితేనేం… పూర్ టీవీ వాచింగ్… బేబీ కూడా అంతే…
బేబీ… దసరా… ఈ రెండు సినిమాలు గత వారం టీవీల్లో ప్రసారం అయ్యాయి… బేబీలో ప్రధాన పాత్ర పోషించిన వైష్ణవికి ఆ సినిమా హిట్ బాగా కలిసొచ్చింది… ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది… అఫ్ కోర్స్, సినిమాలో బాగా చేసింది… ఇద్దర మగ ప్రధాన పాత్రధారులకన్నా వైష్ణవి పాత్ర బాగా ఎలివేటైంది… సరే, ఆ పాత్రను తిట్టేవాళ్లున్నారు, బాగుందన్నవాళ్లూ ఉన్నారు… ఈ సినిమాకు మంచి మౌత్ టాక్ లభించింది… పాజిటివ్ రివ్యూలు దక్కాయి… కమర్షియల్‌గా కూడా క్లిక్కయింది… ఐనా […]
కల్ట్ సూసైడ్… రొటీన్ చెత్తకన్నా భిన్నమైన కథ… పర్లేదు, ఓ లుక్కేయవచ్చు…
థియేటర్ల జోలికి ఎందుకు వెళ్లలేదో తెలియదు… కేవలం ఆహా ఓటీటీకే ఎందుకు పరిమితం చేశారో తెలియదు… కానీ సరైన నిర్ణయమే… ఓటీటీ అయితే అక్కడక్కడా స్కిప్ చేసుకుంటూ వెళ్లిపోవచ్చు… సినిమాలో బాగా ల్యాగ్… వేగంగా కథనం సాగదు… పలుచోట్ల ఎడిటింగ్ ఫెయిల్యూర్లు… ఐతేనేం… ఈ సినిమాను కొన్ని కోణాల్లో అభినందించవచ్చు… అనవసర అట్టహాసాలు, పటాటోపాలు… రొటీన్ తెలుగు సినిమా తాలూకు బిల్డప్పులు గట్రా లేవు… సౌండ్ బాక్సులు బద్దలయ్యే బీజీఎం, తెర నిండా నెత్తురు పూసే ఫైట్లు, […]
కథ చెప్పడంలో దమ్ము లేదోయ్ మశ్చీంద్రా… ఎన్ని వేషాలు వేస్తేనేం…
పోసాని సుధీర్ బాబు… తెలుగు హీరో… బలమైన సినీ కుటుంబ నేపథ్యం ఉన్నా సరే ఈరోజుకూ పాపం ఒక్క హిట్ లేదు… 13 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్… బోలెడు సినిమాలు… కానీ ఇదీ నా సినిమా అని చెప్పుకునేందుకు ఒక్క సినిమా లేదు… హీరో మహేశ్ బాబుకు బావ, దివంగత హీరో కృష్ణకు చిన్నల్లుడు… అప్పుడే వయస్సు కూడా 46 దాకా వచ్చేసింది… ఐనా తెలుగు హీరోలకు వయస్సుతో పనేమిటి..? 70 ఏళ్లొచ్చినా పిచ్చి గెంతులు, ఫైట్లు […]
సగటు సినిమా పైత్యాలు ఏవీ లేని… ఓ రియల్ బయోపిక్ 800…
ముందుగా ఓ ఒపీనియన్… అందరూ అంగీకరించకపోవచ్చు కూడా… ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లు తీసిన ఘనుడు… ఒక క్రికెటర్‌గా కన్నా సేవాభావం, క్రికెట్ పట్ల అంకితభావం, తన దేశం పట్ల ఉన్న నిబద్ధత కోణం తనను ఉన్నతంగా నిలబెడుతుంది… తనకు బాగా అడ్వాంటేజ్ ఏమిటంటే…? పుట్టుకతోనే తన చేతి నిర్మాణం కాస్త వంకర తిరిగి ఉంటుంది… అది తన బౌలింగుకు అనుకూలంగా మారి, మంచి స్పిన్ సాధ్యమయ్యేది… ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఎంతటి స్టారుడైనా సరే మురళీధరన్ బాల్ […]
నిజమే… ఈ సినిమా ఓ మ్యాడ్… మరో సెలబ్రిటీ పోరడి వెండితెర ఎంట్రీ…
మ్యాడ్ అంటే… వెర్రి, పిచ్చి… ఈ మ్యాడ్ పేరుతో ఓ సినిమా వచ్చింది… మస్తు బ్యాక్ గ్రౌండ్ ఉన్న మరో వ్యక్తి హీరోగా తెరప్రవేశం (ఆరంగేట్రం) చేసిన సినిమా ఇది… జూనియర్ ఎన్టీయార్ సొంత బావమరిది నార్నే నితిన్ హీరో… మస్తు డబ్బుంది, పైగా జూనియర్ బావమరిది… ఇదే తన అర్హత… అఫ్కోర్స్, మన తెలుగు తెరను ఏలేది ఇలాంటి తారాగణమే… బలమైన ధననేపథ్యం లేదంటే వారసత్వం… ఎలా చేశాడు..? ఏదో చేశాడంటే చేశాడు… కొత్త కదా… […]
అప్పటి చిరంజీవి మంచి సినిమా ‘శుభలేఖ’కు ఈ నాటకమే స్పూర్తి…
Sai Vamshi……… వరకట్నంపై వందేళ్ల కిందటి సమ్మెటపోటు… వరకట్నం సాంఘిక దురాచారం. ఎన్నాళ్లయింది దాని మీద ఒక గట్టి సినిమానో, నాటకమో వచ్చి? ‘వరవిక్రయం’ నేటికీ ఆ లోటు తీరుస్తూ ఉంది. పశ్చిమగోదావరి జిల్లావాసి కాళ్లకూరి నారాయణరావు గారు వందేళ్ల క్రితం రాసిన నాటకం ఇది. ఆయన గనుక ఇది రాయకపోయి ఉంటే తెలుగు నాటకరంగపు ముత్యాలదండలో ఒక మణిపూస ఉండకపోయేది కదా? ఎల్లకాలాలకూ తట్టుకొని నిలిచే ఈ నాటకాన్ని చేజార్చుకునేవాళ్లం గదా? ఎన్ని వేల నమస్సులు […]
ప్రత్యామ్నాయ సినిమా డిస్ట్రిబ్యూషన్ పద్ధతి… ఓ కొత్త ఆలోచన…
Bharadwaja Rangavajhala…… సినిమా తీద్దాం … రండి…. నాకు చిన్నప్పుడు చిత్రసంస్కార పత్రికలో చదివిన కాట్రగడ్డ నరసయ్యగారి ఆర్టికల్ పదే పదే గుర్తొస్తోంది. సినిమా తీయాలనే తపన చాలా మందికి ఉంటుంది. ఓ మంచి కథ కూడా వాళ్ల మనసుల్లో ఉంటుంది. కానీ తీయడానికి తగిన ఆర్ధిక వసతి ఉండదు. ఒక వేళ తీసినా దాన్ని విడుదల చేయడం అంత తేలికైన పని కాదు. ఈ విడుదలకు సంబంధించి నరసయ్యగారు ఓ చిట్కా చెప్పారు. నిజానికి ఆయన తెలుగు […]
ప్చ్… ఫాఫం భక్తకన్నప్ప… దివిలో బాపుకు తెలియనివ్వకండి ఈ వార్తలు…
మంచు ఫ్యామిలీ ప్రతిష్ఠాత్మకంగా 150 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న భక్తకన్నప్ప సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించబోతున్నాడనే వార్త పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు… అసలు భక్తకన్నప్ప సినిమాను మంచు కుటుంబం నిర్మిస్తుందనే వార్తతో కలిగిన విభ్రమ ముందు మరే ఇతర ఆశ్చర్యాలూ పెద్దవి కావు… ఎందుకంటే..? 1976లో కృష్ణంరాజు నటించి నిర్మించిన చిత్రం భక్త కన్నప్ప… తెలుగు భక్తి సినిమాల్లో ఇదీ ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది… కృష్ణంరాజును జనసామాన్యంలోకి బాగా తీసుకెళ్లింది కూడా […]
మరీ అంత పెదకాపు ఏమీ కాదు… ఈ విరాటకర్ణుడు జస్ట్, ఓ చినకాపు మాత్రమే…
అతడు సినిమాలో ఓచోట హీరోయిన్ ‘నేనూ వస్తా’ అంటుంది… దానికి హీరో ‘నేనే వస్తా’ అంటాడు… పైకి సరళంగా అనిపించినా కనెక్టవుతుంది… ఆ సన్నివేశంలో బాగా అమరిన మాటలు అవి… సీతారామయ్యగారి మనవరాలు సినిమాలో ఓచోట ఓ లేడీ పాత్రధారి ‘మనవరాలు అంటే మన వరాలు’ అని చెబుతుంది… ఒక బామ్మ ప్రేమ వ్యక్తీకరణ అది… సినిమాల్లో సంభాషణలు ఇలాగే ఉండాలి… కావాలని డైలాగులు రాస్తున్నట్టు గాకుండా… ఆయా సన్నివేశాల్ని ఎలివేట్ చేస్తూనే ఈజీగా కనెక్టయిపోవాలి, ప్రత్యేకించి […]
దంచుడే దంచుడు… తెర నిండా బీభత్సమే… అచ్చమైన బోయపాటి సినిమా…
బోయపాటి దర్శకత్వం అంటేనే… లాజిక్కులు వెతక్కూడదు… దంచుడే దంచుడు… నరుకుడే నరుకుడు… బీభత్సమైన హింస… గాల్లోకి తేలిపోతూ రౌడీలు… సూపర్ మ్యాన్‌లా హీరో ఫైటింగులు… కథా కాకరకాయా చూడొద్దు… భీకరమైన బీజీఎంతో హీరో నెత్తురు పారిస్తూ ఉంటాడు… థియేటర్ దడదడలాడిపోతూ ఉంటుంది… సీఎం లను సైతం తుక్కుతుక్కు కొట్టేసాడు హీరో… స్కంద కాదు, బోయపాటి బొంద… మొన్నమొన్నటి బాలయ్య అఖండ అయినా… రాపో, అనగా రామ్ పోతినేని నటించిన తాజా స్కంద అయినా అంతే… బోయపాటి మారడు… […]
- « Previous Page
- 1
- …
- 52
- 53
- 54
- 55
- 56
- …
- 126
- Next Page »