2001 సంవత్సరం… కృష్ణవంశీ అప్పట్లో ఫుల్లు పాపులర్… మహేష్ బాబుతో సినిమా… మురారి… పాటలన్నీ అద్భుతంగా వచ్చినయ్… కామెడీ భలే కుదిరింది… బావామరదళ్ల సరసం కూడా చక్కగా గిలిగింతలు పెట్టేలా అమిరింది… కానీ ఏదో ఓ మూఢ నమ్మకం చుట్టూ సినిమా కథ… ఉంటే ఉండనివ్వండి, మన ప్రేక్షకులు ఏదైనా భరిస్తారు… కానీ సినిమా నిడివి… మూడు గంటలు… ఓ రెండు నిమిషాలు ఎక్కువే… అనేకచోట్ల ప్రేక్షకులకు నచ్చలేదు… కాస్త కట్ చేద్దామయ్యా అంటే దర్శకుడు ఒప్పుకోడు… […]
అదే ఆంటీకి రష్మికి నడుమ తేడా… ఓ ట్రోలర్‌కు జబర్దస్త్ జవాబు…
ఇద్దరూ బూతు షో జబర్దస్త్ యాంకర్లే మొన్నటివరకూ… అవకాశాల్ని బట్టి సినిమాల్లో బోల్డ్ కేరక్టర్లలో నటించినవాళ్లే… కానీ ఎంత తేడా..? అనసూయ అనసూయే… రష్మి రష్మియే… కొన్ని వేల మంది అనసూయ మీద డిజిటల్ దాడికి దిగితే ఒక్కరంటే ఒక్కరూ టీవీ ఇండస్ట్రీ నుంచి గానీ, సినిమా ఇండస్ట్రీ నుంచి గానీ తన సపోర్టుకు రాలేదు… అదీ తను సంపాదించుకున్న క్రెడిబులిటీ… పైగా ఎవరి జోలికీ వెళ్లని బ్రహ్మాజీ కూడా ఓ సూపర్ సెటైర్ వేసి పరువు […]
లాల్‌సింగ్‌చద్దా వింత క్షమాపణ… అమంగళం అంతా తొలగిపోవుగాక…
జైనుల ప్రార్థనల్లో తరచూ వినిపించేది మిచ్చామి దుఃఖడం… అంటే ఉజ్జాయింపుగా అర్థం… ‘‘అమంగళం అంతా తొలగిపోవుగాక…’’ అంటే చెడు, బాధాకరమైనవి వెళ్లిపోవుగాక అని..! మనో ప్రక్షాళన ఇది… భావి వైపు ఆశావాదపు చూపు… అమీర్‌ఖాన్ తీసిన లాల్‌సింగ్‌చద్దా అత్యంత ఘోరమైన డిజాస్టర్‌ను చవిచూసిన సంగతి తెలుసు కదా… ఇదుగో ఈ వాక్యంతో ఓ క్షమాపణ వీడియో అమీర్‌ఖాన్ ప్రొడక్షన్‌కు సంబంధించిన సోషల్ మీడియా వేదికల మీద ప్రత్యక్షమైంది… నిజంగానే ఓ విశేషమే… చాలామంది నమ్మడం లేదు… బహుశా […]
హీరో గాడు బాగానే ఉంటాడు… నిర్మాతల కోపమంతా చిన్న ఆర్టిస్టుల మీదే…
ఒక సమాచారం ఆసక్తికరంగా అనిపించింది… నిర్మాతల మండలి సభ్యులు ఇటీవల సమావేశమై నిర్మాణవ్యయం తగ్గింపు మీద చర్చించారట… ఆర్టిస్టులు ఉదయం 7 గంటలకే సెట్‌కు వచ్చేయాలని నిబంధన పెట్టబోతున్నారట… నిజానికి అదికాదు ఆకర్షించింది… నటులు సాయికుమార్, మురళీశర్మలను పిలిచి, నిర్మాతలకు కాస్త సహకరించాలని కోరారట… ఎందుకు..? ఎస్, ఈమధ్య మురళీశర్మ చాలా పాపులర్… విలన్ కమ్ కేరక్టర్ ఆర్టిస్టుగా రాణించే నటులు కొందరే ఉన్నారు… ప్రకాష్‌రాజ్ ఎట్సెట్రా విలన్లకు క్రేజ్ పడిపోయింది… మొనాటనీ దానికి కారణం… ప్లస్ […]
కటకటా… చూడబుల్ సినిమాల్లేక, చూసేవాడు లేక… థియేటర్ల మూత…
ఏదేని ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు… కరోనా వంటి వ్యాధులు ప్రబలినప్పుడు వ్యాపారసంస్థలు మూసేయడం సహజం… సినిమా కూడా వ్యాపారమే కాబట్టి థియేటర్లు కూడా మూసివేతకు గురవుతాయి… పైగా ఇదేమీ నిత్యావసరం కాదు… కానీ ప్రేక్షకులు రావడం లేదని బాగా పేరున్న పెద్ద థియేటర్లు కూడా మూసుకుంటున్నారంటే… అది ఖచ్చితంగా ఓ ప్రమాదసంకేతం… ప్రేక్షకులు థియేటర్ల వైపే రావడం లేదు దేనికి..? చాలా పెద్ద ప్రశ్న… ప్రస్తుతానికి థియేటర్ల వద్ద కూడా జవాబు లేదు… ఏడుపు తప్ప… తెలుగు […]
కోబ్రా… ఉల్టా విక్రమ్‌నే కాటేసింది… అరె, ఇదేం సినిమా తీసినవ్ర భయ్…
విక్రమ్… అసలు పేరు కెన్నెడీ జాన్ విక్టర్… క్రిస్టియన్ ఫాదర్, హిందూ మదర్… పుట్టిన ఊరు రామనాథపురం జిల్లా, పరమకుడి… ఆ ఊరు జాతీయ అవార్డు గ్రహీతల ఊరు… కమల్‌హాసన్, చారుహాసన్, సుహాసిని పుట్టిన ఊరు… వాళ్లే కాదు, విక్రమ్ కూడా జాతీయ అవార్డు గ్రహీతే… నటన అంటే పిచ్చి… ప్రయోగాలు అంటే పిచ్చి… సేమ్, కమల్‌హాసన్, రకరకాల వేషాల కోసం దేహాన్ని ఎన్నిరకాలుగానైనా హింసించుకోగలరు… ఆ కమల్‌హాసన్ దశావతారం చూశాం కదా… ఏకంగా పది పాత్రలు […]
హమ్మ మహేషా… ఇవీ వదలవా..? ప్రతి కదలికకూ కాసుల లెక్కేనా..?!
సూపర్ స్టార్ మహేష్ బాబు, బిడ్డ సితారతో పాటు ఓ టీవీ షోకు రావడం… అదీ ఓ తెలుగు చానెల్లో వచ్చే డాన్స్ షోకు…! సితార స్టెప్పులేయడం, మహేష్ బాబు మురిసిపోవడం.., ఓ ఇద్దరు డాన్సర్ల డాన్స్ చేసి, మీకు నా సినిమాల్లో చాన్స్ ఇస్తానని మహేష్ ఔదార్యం చూపించడం, వాళ్లు పరుగెత్తుకెళ్లి కాళ్ల మీద పడిపోవడం, ఈయన కౌగిలించుకోవడం… ఎక్కడో ఏదో తేడా కనిపిస్తోంది… మామూలుగా మహేష్ బాబు మాటల్లో గానీ, ప్రెస్ మీట్లలో గానీ […]
సైలెంటుగా భలే పేల్చావు బ్రహ్మాజీ అంకుల్ … ఆంటీకి సెటైరిక్ కౌంటర్…
కొద్దిరోజులుగా సదరు పొట్టి దుస్తులు, ఐటమ్ సాంగుల యాంకరిణి రచ్చ రచ్చ చేస్తోందిగా… నన్ను ఆంటీ అని పిలుస్తారురా, ఆఫ్టరాల్ నేను 37, అయితే ఆంటీని అయిపోయానా, ఇది ఏజ్ షేమింగ్ అని వీరంగం వేస్తోందిగా… ఇది నన్ను తిట్టినట్టే అంటూ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టుంది… తనను ట్రోల్ చేస్తున్న వాళ్ల మీద కనీసం దేశద్రోహం సెక్షన్లు పెట్టాలన్నంత కోపంతో ఊగిపోతోంది ఫాఫం… అంతేలే, ఆమె బాధ ఆమెకు జాతీయ సమస్య… అప్పుడెప్పుడో విజయ్ దేవరకొండ […]
మీరూ మీరూ ఒకటే… నడుమ మీడియా వాళ్లు హౌలాగాళ్లు అయిపోయారా..?
ఇలా అడిగేవాడు ఒక్కడైనా అవసరం ఇండస్ట్రీలో..! ఆత్మవంచన, హిపోక్రసీ, అబద్దాలు, భజన, పాదసేవలు తప్ప ఇంకేమీ తెలియని సినీ పరిశ్రమలో తమ్మారెడ్డి భరధ్వాజలాగా పదునైన, సహేతుకమైన విమర్శ చేసేవాడు అవసరం… తాజాగా ఏదో ఇంటర్వ్యూలో కార్తికేయ హీరో నిఖిల్‌ను, దానికి అడ్డుపడబోయి అడ్డంగా బదనాం అయిపోయిన దిల్రాజును తమ్మారెడ్డి నిలబెట్టి కడిగేశాడు… నిఖిల్, దిల్‌రాజు డబుల్ స్టాండర్డ్స్‌ను ఏకిపడేశాడు… కార్తికేయ-2 సినిమా విడుదలకు దిల్‌రాజు రకరకాలుగా అడ్డుపడ్డాడనేది ఫిలిమ్ సర్కిళ్లలో బహిరంగ రహస్యం… అంతెందుకు ఇదే నిఖిల్ […]
70 ఏళ్ల క్రితమే ఓ సూపర్ పాన్ ఇండియా మూవీ… ఆ స్టార్ ఎవరో తెలుసా..?
సౌత్‌లో విజయవంతమైన సినిమాల్ని హిందీలోకి… హిందీ సక్సెస్ఫుల్ సినిమాల్ని సౌత్‌లోకి డబ్ చేసి విడుదల చేయడం ఎప్పటి నుంచో ఉన్నదే… కాకపోతే ఇప్పుడు అన్ని భాషల్లోనూ ఒకేసారి డబ్బింగ్ వెర్షన్లను రిలీజ్ చేసేసి, పాన్ ఇండియా ముద్ర వేసేసి, మార్కెటింగ్ చేసేస్తున్నారు… కానీ మన తెలుగు సినిమాయే… 70 ఏళ్ల క్రితమే ఓ జబర్దస్త్ పాన్ ఇండియా మూవీ వచ్చింది… సేమ్, ఒకేసారి దేశమంతా రిలీజ్ చేశారు… హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేసిన ఈ […]
పన్ను మోసం ప్లస్ చరిత్ర వక్రీకరణ… నిజమే, బాలయ్యే నైతిక బాధ్యుడు…
థాంక్ గాడ్… మా అల్లూరి కథే అనుకుని జగన్, మా కుమ్రం భీమ్ చరిత్రే అనుకుని కేసీయార్ ఆర్ఆర్ఆర్ సినిమాకు వినోదపన్ను రద్దు చేయలేదు… హమ్మయ్య… చిరంజీవితో కలిసి వెళ్లి, ఏదో అడగ్గానే జగన్ టికెట్ రేట్లను అమాంతం పెంచేశాడు, ఈ రేట్ల విషయంలో ఎలాగూ కేసీయార్ చేతికి ఎముకే లేదు… కానీ నిజంగానే రాజమౌళి అడిగి ఉంటే, ఈ హిస్టారిక్, సారీ, చరిత్రను పరమ నీచంగా వక్రీకరించిన సినిమాకు బహుశా వినోదపన్ను మినహాయింపు ఇచ్చేవాళ్లేమో… అందుకే […]
చేతులు మూతులు కాలాక… తత్వం బోధపడి ఆకులు పట్టుకుంటున్న విజయ్…
నో డౌట్… లైగర్ సినిమా అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్‌కు కారణాల్లో పూరీ దిక్కుమాలిన దర్శకత్వం ప్రధాన కారణమే… ముట్లుడిగిన కేరక్టర్ తను… ఇంకా తనను పట్టుకు వేలాడటం విజయ్ దేవరకొండ తప్పు… దేశమంతా ఎక్కడ ప్రమోషన్ మీట్ పెట్టినా సరే విజయ్ పట్ల యువతలో విపరీతమైన క్రేజ్ కనిపించింది… కాకపోతే విజయ్ యాటిట్యూడ్ వ్యాఖ్యలు కూడా సినిమాను దారుణంగా దెబ్బతీశాయి… అది తను అంగీకరించకపోయినా సరే, తను ఓసారి నేలమీదకు దిగిరావాలి అనే కోరిక ప్రేక్షకుల్లో కనిపించింది… […]
రివ్యూ కూడా 13 Lives ఆపరేషన్లాగే… చూడదగ్గ మూవీ, చదవదగ్గ రివ్యూ…
ఒకే కథ… కానీ వేర్వేరు కథనతీరులు… అన్నట్టుగా… థర్టీన్ లైవ్స్ సినిమా మీద ఆల్రెడీ మనం ఓ రివ్యూ రాసుకున్నాం… అదే సినిమా… ఈ రివ్యూ కూడా చదవండి… ఈ రివ్యూ సాగిన తీరు వేరు… నిజానికి అనేకానేక సైట్లలో, మీడియాలో ఒకే తరహా మూస ఫార్మాట్లో రివ్యూలు వస్తుంటయ్… అసలు రివ్యూలకు టెంప్లేట్ ఏమిటి..? రివ్యూయర్ కూడా ఓ సగటు ప్రేక్షకుడిలా చూసి, ఫీలై రాయాలి, అప్పుడే అందులో లైఫ్… సరే, ఆ చర్చలోకి వెళ్లకుండా […]
Sherdil… గిరిజనంపై ప్రభుత్వాల నిర్లక్ష్యంపై క్రియేటివ్ సెటైర్…
నాన్న పులి కథ.. నేటికీ కటిక దారిద్య్రాన్ని అనుభవిస్తున్న మారుమూల అటవీ ప్రాంతాల పట్ల ప్రభుత్వాల దృక్కోణంపై ఓ సెటైర్ Sherdil: The Pilibhit Saga. ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో సుమారు 17 మంది పులుల బారిన పడి చనిపోయిన 2017 నాటి ఘటన… శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన Sherdil: The Pilibhit Saga కు మెయిన్ మోటో! వాస్తవానికి ఓ డాక్యుమెంటరీని పోలినట్టుగా సినిమా కథాగమనం కనిపించినా…అదే సమయంలో వాస్తవికతకు దర్పణం […]
ఓహ్.., ఆచార్య తన్నేసింది అందుకేనా..? సారు ఎంత సింపుల్‌గా తేల్చేశాడు..?!
అనవసరంగా చిరంజీవి బుర్ర బద్దలు కొట్టుకుంటూ… కొడుకు, తాను కలిసి ప్రతిష్ఠాత్మకంగా కొత్త కొత్త స్టెప్పులేస్తూ నటించినా సరే, ఆచార్య అంత ఘోరంగా డిజాస్టర్ కావడానికి కారణాలేమిటబ్బా అని కారణాల లోతుల్లోకి వెళ్లాల్సిన పనే లేదు… చాలా సింపుల్… తను అంతకుముందు టికెట్ రేట్ల తగ్గింపు కోరుతూ, జగన్ ఎదుట చేతులు జోడించి వేడుకుంటూ, ప్రాధేయపడుతూ, బాబ్బాబు ప్లీజ్ అన్నట్టుగా బతిమిలాడాడట కదా… అదుగో, అందుకే ప్రేక్షకదేవుళ్లు ఆచార్య సినిమాను ఛీఫో అన్నారట… అంతే, పెద్ద పెద్ద […]
హవ్వ లైగర్… తెలుగు సినిమాల్లోకెల్లా లోయెస్ట్… సిగ్గుపడే రికార్డు…
లైగర్ ఏ స్థాయి డిజాస్టరో చదువుతూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం… థియేటర్లకు వెళ్లి, గజ్జన వణికిపోతూ మధ్యలోనే పారిపోయి వస్తున్నవాళ్లూ ఉన్నారు… రిలీజుకు ముందు విజయ్, పూరీ తదితరుల ఎచ్చులు గుర్తుచేసుకుని, వాటిని కోట్ చేసి, మరీ మీమ్స్ వదులుతున్నారు నెటిజెన్స్… ప్రత్యేకించి ఆగ్ లగాదేంగే వంటి… విజయ్ మాటను ప్రేక్షకులు గౌరవించి, నిజంగానే కాలబెట్టారు… ఎంత అంటే..? తెలుగు సినిమాల్లోకెల్లా లోయెస్ట్ ర్యాంకు ఇచ్చి, సినిమా బాధ్యులందరూ సిగ్గుతో తలదించుకునేలా చేశారు… అదెలా […]
ఆంటీ అంటే జైలే… చెల్లీ, బిడ్డా పదాలు బెటర్… లేదా ఈ లెజెండ్ వదలదు…
మరీ అనసూయ వంటి ఐటమ్ సాంగ్స్ చేసుకునే నటి వ్యాఖ్యలకు అంత ఇంపార్టెన్స్ ఏంటి సార్ అని విసుక్కున్నాడు ఓ మిత్రుడు… నిజమే, కానీ నిన్నంతా ఆమె వివాదమే ట్విట్టర్లో ట్రెండింగ్… బొచ్చెడు మీమ్స్ వెల్లువెత్తాయి… పైగా నవ్వు పుట్టించే తిక్క వాదన… దాదాపు ప్రతి మెయిన్ స్ట్రీమ్ మీడియా సైట్లలోనూ ఆమె బెదిరింపులకు ప్రయారిటీ స్పేస్… ఓసారి చెప్పుకోవాలి… మరి తెల్లారిలేస్తే టీవీల్లో కనిపించి పలకరించే మొహం కదా… ఐనా మనం ప్రముఖ మేధావులు, సైంటిస్టులు, […]
హీరోయిన్ను మారుద్దామని పంచాయితీ పెడితే… హీరోనే పీకిపారేశాడు…
దర్శకుడిగా వంశీని పాపులర్ చేసిన సినిమాల్లో శ్రీకనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్… ఇంత పెద్ద టైటిల్ వంశీ వంటి దర్శకులు మాత్రమే పెట్టగలరు… సినిమాకు ఇళయరాజా సంగీతం ఓ అస్సెట్… అప్పట్లో వంశీ సినిమా అనగానే రాజేంద్రప్రసాద్ హీరో అనేవాళ్లు కదా పాపం… దీనికి కూడా రాజేంద్రప్రసాద్ పేరే ఖాయం చేసుకున్నాడు వంశీ మొదట్లో… ఓవైపు ఇళయరాజాలో సంగీత చర్చలు దాదాపు పూర్తయ్యాక, రాజేంద్రప్రసాద్ హీరోగా, నిశాంతి హీరోయిన్గా అనుకుని, పబ్లిసిటీ ఆర్టిస్ట్ లంక భాస్కర్‌కు […]
ఆర్ఆర్ఆర్… పెదవి విరిచిన టీవీ ప్రేక్షకులు… పూర్ రేటింగ్స్…
అల వైకుంఠపురంలో సినిమా అనూహ్యంగా బంపర్ హిట్… థియేటర్లలోనే కాదు, టీవీల్లోనూ ఇప్పటికీ దానిదే రికార్డు రేటింగ్స్… 29.4… బహుశా ఇప్పట్లో దాన్ని బ్రేక్ చేసే సినిమా వస్తుందో రాదో డౌటే… దాంతో పోటిపడినా సరే సరిలేరు నీకెవ్వరు సినిమా 23.04 రేటింగ్స్ సాధించింది… వేల కోట్ల రికార్డుల్ని ఛేదించినా సరే, బాహుబలి-2 మూడో ప్లేసులో ఉంది తప్ప ఆ రెండు సినిమాలను రేటింగ్స్ కోణంలో దాటలేకపోయింది… ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… ఆర్ఆర్ఆర్ సినిమా జస్ట్, […]
ఫాఫం… హఠాత్తుగా సుడిగాలి సుధీర్‌పై పడ్డారేమిట్రా బాబూ…
కొన్ని డిజిటల్ ప్లాట్‌ఫారాల్లో సుడిగాలి సుధీర్ మీద హఠాత్తుగా ప్రారంభమైన కొన్ని నెగెటివ్ స్టోరీలు ఆశ్చర్యపరిచాయి… వాంటెడ్ పండుగాడ్ అని మొన్న మెరుపులా వచ్చిపోయిన ఓ సినిమా ఉంది కదా… దాని ఘోర, భీకర, భయానక, దారుణ, నీచ, నికృష్ట ఫలితానికి సుధీరే కారకుడట… దాంతో నిర్మాణంలో ఉన్న సుధీర్ ఇతర ప్రాజెక్టులపై దాని ప్రభావం పడుతోందట… ఒక సినిమా మధ్యలోనే ఆగిపోయిందట… పండుగాడ్ హిట్టయితే, అది చూపించుకుని, సుధీర్ పేరు చెప్పుకుని, మార్కెటింగ్ చేసుకుందామని అనుకున్న […]
- « Previous Page
- 1
- …
- 82
- 83
- 84
- 85
- 86
- …
- 117
- Next Page »